Legal Cell
-
కూటమి ‘కుట్ర’ రాజకీయాలు: మనోహర్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిందని చేస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ (YSRCP Legal Cell) సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడపలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నానా అల్లరి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం జరగకుండా గొడవ చేశారని.. గాలివీడు(Galividu)లో కూడా ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించారని మనోహర్‌రెడ్డి(Manohar Reddy) నిప్పులు చెరిగారు.‘‘జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కారప్పొడి, పెప్పర్ స్ప్రేతో 100 మందికి పైగా దాడి చేసేందుకు యత్నించారు. సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశారని కట్టుకథ అల్లారు. నిత్యం ప్రజల్లో ఉండే సుదర్శన్ రెడ్డికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న సుదర్శన్ రెడ్డిని తీవ్రవాది మాదిరి ఈడ్చుకుంటూ పోవడం దారుణం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ కక్ష, రాజకీయ దురుద్ధేశంతో చేసినవే’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘గాలివీడులో వైఎస్సార్సీపీలో చురుగ్గా ఉండే నాయకులపై కేసులు బనాయించాలని కుట్ర చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. బాధితుల పక్షాన నిలబడకుండా రాజకీయ దురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించారు. బలవంతంగా వైఎస్సార్సీపీ వారి ఆస్తులు లాక్కుంటున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ప్రభుత్వంపై ఎవరు నిరసన తెలిపినా.. వారి పై కేసులు పెడుతున్నారు. అధికారంలోకి రాకముందు 34 వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారని పవన్ చెప్పారు. ఈ రోజు ఆ 34 వేల మంది ఎక్కడున్నారో పవన్ సమాధానం చెప్పాలి’’ అని మనోహర్‌రెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన‘‘కాకినాడలో దళిత డాక్టర్‌పై జనసేన ఎమ్మెల్యే బూతులు తిడుతూ దాడి చేస్తే పవన్ ప్రశ్నించలేదు. పరామర్శించలేదు. యలమంచిలి ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే పవన్ ప్రశ్నించలేదు.. పరామర్శించలేదు. ముచ్చుమర్రిలో మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ స్పందించలేదు. పిఠాపురంలో టీడీపీ నేత బాలికపై లైంగికదాడి చేస్తే ఆ కుటుంబాన్ని పవన్ ప్రశ్నించలేదు. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేత వీఆర్వో పై బీర్ బాటిల్ తో దాడి చేస్తే స్పందించలేదు.. ఖండించలేదు. కేవలం రాజకీయదురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించాడు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు.‘‘మూడు పార్టీలు ఏకమైతేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్ సింగిల్‌గా పోటీ చేస్తే 40 శాతం ఓట్లు వచ్చాయని పవన్ గుర్తుంచుకోవాలి. ఆరు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రేగింది. మరో ఆరు నెలల తర్వాత గన్మెన్లు లేకుండా కూటమి నేతలు ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. గాలివీడు ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. పోలీసులు కూటమి నేతలు మాటలు వినడం మానుకోవాలి. గాలివీడు ఘటనను న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘అలా పోస్టు పెడితే తప్పా?.. ఇది టీడీపీ సైకోల ఆలోచనే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక చాలా మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఇదే సమయంలో సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారని చెప్పుకొచ్చారు.తాజాగా మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో దుష్ట సంప్రదాయం కొనసాగుతోంది. బాధితుల్ని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలను ఆలోచింపచేసేలా పోస్టులు పెడుతున్నా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని మస్క్ ప్రకటించారు. ఆ తర్వాత టెస్లా కంపెనీ ఏపీలో పెట్టుబడి పెట్టాలని లోకేష్ ట్వీట్ పెట్టారు. ఈ రెండిటినీ కలుపుతూ ఇంటూరి రవి కిరణ్ వ్యంగ్యంగా పోస్టు పెడితే కేసు పెట్టారు. సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారు.బుడమేరు వరద పరిహారంలో జరిగిన దోపిడీపై వ్యంగ్యంగా పోస్టు పెడితే మరో కేసు పెట్టారు. గాంధీజీ ఏం చెప్పారు? చంద్రబాబు మద్యం షాపుల పెంపు ద్వారా ఏం చెప్తున్నారో తెలుపుతూ ఒక జోక్ పోస్టు పెడితే దాన్ని కూడా తప్పు పట్టారు. కనకదుర్గమ్మ గుడి కవర్‌తో బయటి నుండి తెచ్చిన లడ్డూలు పెట్టి విక్రయించిన వైనంపై పోస్టు పెడితే కేసు పెట్టారు. డీజీపీ కోయ ప్రవీణ్ ఫక్తు పొలిటికల్ లీడర్ లాగా ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆయనకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావాలేగానీ పోలీసు డ్రెస్సులో రాజకీయాలు మాట్లాడవద్దు.వైఎస్ జగన్‌పై అత్యంత దారుణమైన భాషతో టీడీపీ వారు పోస్టులు పెట్టారు. వైఎస్ జగన్ తనపై తానే దాడి చేయించుకున్నట్టు టీడీపీ నేతలు మాట్లాడారు. వీళ్ల మనసులో ఎంత విషం ఉంటే ఇలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదు?. టీడీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. దీన్ని బట్టే టీడీపీ సైకో మెంటాల్టీని అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ మేలు చేస్తే జనం నోటి దగ్గర తిండిని తీసేశారంటూ పోస్టులు పెట్టారు. ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు రూ.73వేల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బును ఏం చేశారో ప్రజలకు తెలపాలి. కాకినాడ పోర్టును గురిపెట్టి లాక్కున్నట్టు నిస్సిగ్గుగా పోస్టు పెట్టారు. టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లోనే వైఎస్ జగన్‌పై దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారు. కేవలం వ్యంగ్యంగా పోస్టులు పెట్టిన ఇంటూరి రవికిరణ్‌పై 20పైనే కేసులు పెట్టారు. మరి దుర్మార్గంగా పోస్టులు పెట్టిన టీడీపీ వారిని ఏం చేయాలి?. పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టుని రాజమండ్రి పోలీసులు నగ్నంగా లాకప్‌లో పడేశారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కస్టడీలోనే పోలీసులు కొట్టారు. ఇలా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలోని మేధావులు, ప్రజాసంఘాల నేతలు ఆలోచించాలి. ఈ దారుణాలను గట్టిగా ప్రశ్నించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెడుతున్నాం’ అని చెప్పారు. -
వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల కీలక వ్యాఖ్యలు
తాడేపల్లి, గుంటూరు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన వేళ.. ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది. ఏ సోషల్ మీడియా కార్యకర్తకు ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్న వారిపై న్యాయపోరాటం చేద్దాం. ఈ విషయంలో జిల్లా, నియోజకవర్గాల నాయకత్వం వెంటనే స్పందించాలి. పోలీసులు ఎవర్నైనా అరెస్టు చేస్తే న్యాయ సహాయం అందించాలి. ఇందుకోసం ఎక్కడికక్కడ పార్టీ తరఫున సమన్వయ కమిటీలు ఏర్పాటు కావాలి’’ నేతలకు దిశానిర్దేశం చేశారాయన.సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై ప్రయివేటు కేసులు వేస్తామని ఈ సమావేశంలో సజ్జల అన్నారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తే పార్టీ లీగల్ టీం వెంటనే పీఎస్ లకు వెళ్లాలి. కావాల్సిన న్యాయ సహాయం అందించాలి. సీనియర్ అడ్వకేట్స్ తో కేంద్ర కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటలూ అందుబాటులో ఉండేలా కొందరు లాయర్లను ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవటంలో ఎక్కడా వెనక్కు తగ్గాల్సిన పనిలేదు. వైయస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారు’’ అని సజ్జల చెప్పారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా, లీగల్ సెల్ ముఖ్య నేతలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
టీడీపీ వాళ్లే చేసి దొంగ కేసులు పెడుతున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొద్భలంతోనే దాడుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం వైయస్సార్సీపీ లీగల్‌సెల్ విభాగంతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయం ధర్మం అందరికీ ఒకటే అని ఆరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మనం చెప్పాం. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుందో చూడండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. రెడ్ బుక్‌లో పేర్లు పెట్టుకున్నారు. మంచికోసం కాకుండా.. ఎవరిని తొక్కాలి, ఎవరిపైకేసులు పెట్టాలి, ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలని అందులో రాసుకున్నారు. అరాచకాలు చేస్తున్నారు, విధ్వంసాలు చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిల్లో రెడ్‌బుక్‌ల పేరిట విధ్వంసాలు చేస్తున్నారు. .. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. గోబెల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు మనదగ్గర లేవు. పెద్దిరెడ్డి మీద ఎలాంటి దారుణాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కార్యాలయంలో పేపర్లు కాలిపోతే… నేరుగా పెద్దిరెడ్డికి లింకు పెడుతున్నారు. ఒక కార్యాలయంలో పేపర్లు కాలిపోతే.. వాటికి సంబంధించిన పేపర్లు ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్, హెచ్‌డీఓ కార్యాలయాల్లో ఉంటాయి. డిజిటల్ రూపంలో అన్ని పత్రాలు ఉంటాయి. టీడీపీ వాళ్లే చేసి.. దొంగకేసులు పెట్టే ప్రయత్నంచేస్తున్నారు. .. లా అండ్ ఆర్డర్‌మీద ఎవరికీ బాధ్యత లేకుండా పోయింది. ఎదుటి వాడు మనవాడు కాదనుకుంటే.. ఏదైనా చేయొచ్చని సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి వాటికి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు అభయం హస్తం ఇస్తున్నారు. నేరం చేయాలంటే భయపడాలంటూ చంద్రబాబు నిన్న అన్నారు. కానీ తాడిపత్రిలో పోటీచేసిన పెద్దారెడ్డిని అడుగుపెట్టనీయకుండా టీడీపీ మూకలన్నీ దాడులు చేశారు. మురళి అనే కార్యకర్తమీద దాడులు చేశారు.. ఆ ఇంటిని తగలబెట్టారు. .. ఓవైపు చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు.. మరోవైపు దాడులు చేస్తున్నారు. పద్ధతి ప్రకారం భయాందోళనలు ప్రజల్లో సృష్టిస్తున్నారు. తన మీడియాను వాడుకుని తిరిగి రివర్స్ కథనాలు రాయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర కీలకం. కోర్టులు న్యాయం చేయాలన్నా.. చొరవ అనేది ముఖ్యం. కేసులు పెట్టిన దగ్గరనుంచి వాదనలు వినిపించి బాధితుల తరఫున నిలవాల్సింది మీరే. లేకపోతే.. మన వాళ్లకు న్యాయం దక్కదు. .. న్యాయవాదులుగా మీరు నిర్వహించే పాత్ర చాలా కీలకం. అందరం ఒక్కతాటిపైకి వద్దాం. అందరం కలిసి గట్టిగా యుద్ధం చేయాలి. అప్పుడే అన్యాయాల్ని ఎదుర్కోగలం. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ప్రతి నియోజకవర్గంలోనూ దారుణాలు, అరాచకాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో లీగల్సెల్స్ బలంగా ఉండాలి. ఏ ప్రభుత్వం చేయని విధంగా వైయస్సార్సీపీ న్యాయవాదులకు మేలు చేసింది. మనం మాత్రమే రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం. కొత్తగా వృత్తిలోకి వచ్చే న్యాయవాదులకు మూడేళ్లపాటు ప్రతి ఆరునెలలకోసారి రూ.30 వేలు చొప్పున ఇచ్చాం. న్యాయవాదులకు తోడుగా ఉంటే.. పేదవాళ్లకు అండగా ఉంటారని మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. లీగల్‌సెల్‌ను మరింత విస్తృతపరచాలి. అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలి. వైయస్సార్ కాంగ్రెస్ యంగ్ పార్టీ. కాబట్టి కొన్ని కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ముందుకు సాగాలి అని వైఎస్ జగన్ సూచించారు. -
బాసురీ స్వరాజ్.. డాటరాఫ్ సుష్మ
బాసురీ స్వరాజ్. సక్సస్ఫుల్ సుప్రీంకోర్టు లాయర్. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు. తల్లితో కలిసున్న ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటారు. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బాసురి బీజేపీ లీగల్ సెల్ కన్వినర్‌గా న్యాయవాద వృత్తిలోనూ రాజకీయాలను కొనసాగించారు. ఈసారి న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగి ఎన్నికల అరంగేట్రమూ చేస్తున్నారు... వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా ఆ తాను ముక్కేనని ఇటీవల విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. బాçసురీకి టికెటివ్వడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. కానీ తన తల్లి ప్రజాప్రతినిధిగా చేసినంత మాత్రాన తనవి వారసత్వ రాజకీయాలు కావంటారు బాసురీ. ‘‘రావడమే సీఎం, పీఎం వంటి ఉన్నత పదవులతోనో పార్టీ అధినేతగానో రాజకీయాల్లో అడుగు పెడితే వారసత్వ రాజకీయం అవుతుంది. కానీ నాలా కార్యకర్త నుంచి మొదలైతే కాదు’’ అంటూ తిప్పికొడుతున్నారు. ‘‘నా రాజకీయ ప్రస్థానం పార్టీ కార్యకర్తగానే మొదలైంది. న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టే ముందే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీ నాకో అవకాశమిచి్చంది. ఇప్పుడూ అందరిలాగే కష్టపడుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ సిటింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీని పక్కనపెట్టి మరీ బాసురీకి అవకాశమిచి్చంది బీజేపీ. దీనిపై మీనాక్షి బాగా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను బాసురీ కొట్టిపడేశారు. ఆమె ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయన్నారు. హై ప్రొఫైల్ కేసులతో... బాసురీ 1984 జనవరి 3న జని్మంచారు. లండన్‌లోని వారి్వక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ చదివారు. బీపీపీ లా స్కూల్లో న్యాయశా్రస్తాన్ని అభ్యసించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని సెంట్ కేథరీన్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2007 నుంచి ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో–కన్వినర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హరియాణా అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గానూ నియమితులయ్యారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్ హై ప్రొఫైల్ వాళ్లే కావడంతో న్యాయవాద రంగంలో అతికొద్ది కాలంలోనే కీర్తి సంపాదించారు. మీడియా ముందు అంతగా కనిపించని బాసురీ.. ఐపీఎల్ వివాదంలో లలిత్ మోడీ న్యాయవాద బృందంలో ఒకరిగా తొలిసారి వార్తల్లోకెక్కారు. గతేడాది ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారామె. తల్లికి స్వయంగా అంత్యక్రియలు... సుష్మా స్వరాజ్ 2019లో కన్నమూశారు. ఆమె అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి బాసురీ అప్పట్లో వార్తల్లోకెక్కారు. మహిళలను చైతన్యవంతులను చేసే దిశగా ఆమె ప్రసంగాలు చేస్తుంటారు. ఆ క్రమంలో 2021లో తనకు దక్కిన ‘తేజస్విని’ అవార్డును తల్లికి అంకితమిచ్చారు. ప్రతి విషయంలోనూ గురువుగా మారి తనకు అమూల్యమైన జీవిత విలువలను నేరి్పందంటూ తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పవన్ కల్యాణ్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
సాక్షి, కృష్ణా: వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బుధవారం పలువురు వాలంటీర్లతో కలిసి వైఎస్సార్సీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు విజయవాడ సీపీలో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ను పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. సాక్షితో న్యాయవాదులు.. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో మరింత ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్ మాటలతో సభ్యసమాజంలో అలజడి రేగుతోంది. కానీ, ఆ మాటల్ని వాలంటీర్లు పట్టించుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అసలు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి పవన్ కల్యాణ్‌కు ఏ నిఘా సంస్థ చెప్పిందో వెల్లడించాలి. వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఇదీ చదవండి: పవన్‌ను చీల్చిచెండాడిన పోసాని -
30 వేలమందికి టోకెన్లు ఇచ్చి కేవలం 2 వేలు మందికి సరుకులు ఇచ్చారు
-
టీడీపీ నేతల ఉన్మాదంతోనే అమాయకుల బలి: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రచార యావకు 11 మంది అమాయకులు బలైపోయారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘చంద్రన్న కానుక ఇస్తామంటూ పేదలను తరలించారు. 30 వేల టోకెన్లు ఇచ్చి కేవలం 2 వేల మందికే ఇచ్చారు. నిర్దేశించిన స్థలంలో కాకుండా ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాన్ని చంపేశారు. జనం వచ్చినట్టు పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి డ్రోన్ షూటింగ్ చేశారు’’ అని మండిపడ్డారు. ‘‘టీడీపీ నేతల ఉన్మాదం వలన అమాయకులు చనిపోయారు. అందుకే జీవో నెంబర్ వన్ ను ప్రభుత్వం తెచ్చింది. ఇదేమీ చీకటి జీవో కాదు. చట్టం ప్రకారం తెచ్చిందే. సభలు రోడ్ల మీద పెట్టవద్దని మాత్రమే ఆ జీవోలో ఉంది. ర్యాలీలు చేసుకోవద్దని లేదు. కానీ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వం పని. కానీ దాన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలకైనా ఇదే జీవో వర్తిస్తుంది. చంద్రబాబు చేసిన రక్తపు మరకలను తొలగించటానికే దీన్ని తెచ్చాం’’ అని మనోహర్‌రెడ్డి అన్నారు. చదవండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే! -
టీడీపీ, జనసేనలపై లాయర్ల ఆగ్రహావేశాలు
సాక్షి నెట్వర్క్: హెకోర్టులో న్యాయమూర్తుల బదిలీలపై విమర్శలు చేస్తూ వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం గర్హనీయమని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు ఆక్షేపించారు. ఇద్దరు జడ్జీల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దీనికి రాజకీయం ఆపాదించడంపై వారు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ శనివారం అనేక జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న దుష్టచతుష్టయం కుతంత్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ వినతిపత్రాలు ఇచ్చారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి టీడీపీ, జనసేన పార్టీల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరులోనూ న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ, జనసేన తీరును నిరసిస్తూ కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇక గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన న్యాయవాదులు ‘రాజ్యాంగ పరిరక్షణకు దుష్టశక్తుల ఆట కట్టిద్దాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ జిల్లా, నగర కమిటీ ప్రతినిధులు విజయవాడలోనూ నిరసన ప్రదర్శన నిర్వహించి కోర్టులకు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వమని చెప్పడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. మరోవైపు.. కోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలపై కూడా విమర్శలు చేస్తూ వాటిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం తగదంటూ శ్రీకాకుళంలోనూ న్యాయవాదులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్‌కు వినతిపత్రం అందించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చివరకు న్యాయవ్యవస్థలో బదిలీలను కూడా తన స్వార్థానికి వాడుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పలువురు లాయర్లు విమర్శించారు. -
బీజేపీలోకి కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌లో ‘ఆపరేషన్ కమలం’ ప్రభావం కనిపిస్తోంది. తాజాగా టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డి సైతం పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, తమ కష్టాన్ని పార్టీ నేతలు గుర్తించడం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు దామోదర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు దామోదర్‌రెడ్డి. కాగా, పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మరో ప్రకటనలో వెల్లడించారు. ఇదీ చదవండి: కేసీఆర్ కూతుర్ని కాబట్టే నన్ను టార్గెట్ చేశారు -
Women Commission: మహిళల కోసం ‘లీగల్ సెల్’
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ సెల్‌ను సోమవారం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని రేఖా శర్మ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ కమిషన్ కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు చట్టపరమైన సహాయం కోసం ఈ సెల్ వన్–స్టాప్ సెంటర్‌గా పనిచేస్తుందని సునీతాలక్ష్మారెడ్డి వివరించారు. అలాగే మహిళలకు సహాయంగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు. ఇదీ చదవండి: Tamilisai Soundararajan: మహిళలకు అనుక్షణం అండగా ఉంటాం -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ♦పి.మురళీమోహన్(అరకు) ♦ఆర్.చిరంజీవి(శ్రీకాకుళం) ♦కె.నిరంజనరావు(విజయనగరం) ♦కె.కృష్ణ(విశాఖపట్నం) ♦జె.ఆనంద్(అనకాపల్లి) ♦పి.శ్రీనివాస్(కాకినాడ) ♦కె.త్రినాథరావు(అమలాపురం) ♦ఎస్ఎంఎస్ హుస్సేన్(రాజమండ్రి) ♦వి.డేవిడ్‌రాజు(నరసాపురం) ♦డీవీ రామాంజనేయులు(ఏలూరు) ♦కేఎం ప్రసాద్(మచిలీపట్నం) ♦సీహెచ్ విష్ణువర్ధన్‌రావు(విజయవాడ) ♦వి.రాజశేఖర్‌రెడ్డి(గుంటూరు) ♦కె.కోటేశ్వరరావు(నర్సరావుపేట్) ♦ఎ.శ్రీనివాస్‌రావు(బాపట్ల) ♦వై.వెంకటేశ్వర్లు(ఒంగోలు) ♦కె.రామసుబ్బయ్య(నంద్యాల) ♦పి.సువర్ణరెడ్డి(కర్నూల్) ♦జి.ఉమాపతిరావు(అనంతపురం) ♦ఎ.కృష్ణమూర్తి(హిందూపురం) ♦జీవీ రాఘవరెడ్డి(కడప) ♦వై.మురళీధర్‌రెడ్డి(నెల్లూరు) ♦దొరబాబు అలియాస్ ముని బాలసుబ్రమణ్యం(తిరుపతి) ♦ఏబీ సుదర్శన్‌రెడ్డి(రాజంపేట్) ♦జి.సూర్యప్రతాప్‌రెడ్డి(చిత్తూరు) -
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఆ లేఖ కేంద్ర హోంశాఖకు, ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక ప్రక్రియ పూర్తైనట్లు అధికారిక ప్రకటన విడుదల అవుతుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. కాగా ‘‘జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి 2020 అక్టోబర్ 6న అందిన ఆరోపణల లేఖపై విచారణ జరిపి తిరస్కరించడమైనది. ఇది పూర్తిగా అంతర్గత విచారణ అయినందున ఆ వివరాలు బహిర్గతం చేయడం సాధ్యం కాదు’’అని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పేర్కొంది. తెలుగువారిలో రెండో వ్యక్తి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ రమణ ఆ పదవి పొందిన తెలుగు వారిలో రెండో వ్యక్తి. అంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావు (జూన్ 30, 1966– ఏప్రిల్ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ సుబ్బారావు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ సుబ్బారావు సీజేఐగా ఉన్న సమయంలోనే రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజయం పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే. పొన్నవరం నుంచి.. కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆగస్టు 27, 1957న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జూన్ 27, 2000 నుంచి సెప్టెంబరు 1, 2013 వరకు కొనసాగిన జస్టిస్ రమణ కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబరు 2, 2013 నుంచి ఫిబ్రవరి 16, 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 17, 2014న పదోన్నతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉన్నారు. -
లాయర్ దంపతుల హత్య బాధాకరం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లాయర్ వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధాకరమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం మంత్రి మాట్లాడుతూ.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తమ పార్టీ చెందినవాడేనని తెలిసి తక్షణమే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారని, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామని హామీనిచ్చారు. వామన్‌రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది తెలంగాణ న్యాయవాదులేనని ప్రశంసించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్‌గా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. హైకోర్టు విభజన కోసం సీఎం కేసీఆర్ దాదాపు 10 సార్లు ప్రధాని మోదీని కలిశారని, విభజన జరిగాకే తెలంగాణకు తగిన న్యాయం జరిగిందన్నారు. ఆరున్నరేళ్లలో వ్యవసాయమే అబ్బురపడేలా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ పథకాలను ప్రధాని మోదీ కాపీ కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలు సంతోషంగా ఉండాలనే పెన్షన్లతో సహా ఎన్నో సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ విద్యపై కొందరు అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని,సంక్షేమ గురుకులాల్లో ఈ పథకం ఇప్పటికే నడుస్తోందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌పై కొందరు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలంతో మాట్లాడటం బాధ కలిగిస్తోందన్నారు. కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ లేవని పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్డీయే.. నో డేటా అవైలబుల్’ -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీలు రద్దు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీలను రద్దు చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న అన్ని లీగల్ సెల్ కమిటీలను రద్దు చేసింది. వారి స్థానంలో కొత్త కమిటీలను నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తాజా నియమాకాల ప్రకారం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్. మనోహర్‌రెడ్డి నియమితులైయ్యారు. ఆయనతో పాటు మరో నలుగురు (పి.వెంకట్ రెడ్డి, జి.వాసుదేవరెడ్డి, టి.శంభుప్రసాద్, కే.రవికుమార్) సభ్యులకు రాష్ట్ర కమిటీలో చోటుకల్పించారు. (పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది మొదలవలస చిరంజీవిని హతమార్చేందుకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం విశాఖలో అరెస్ట్ చేశారు. ఓ రౌడీషీటర్, జర్నలిస్టు సహా ఆరుగురిని అరెస్ట్ చేసి మూడు కత్తులు, రూ.70 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం మీడియాకి ఈ వివరాలను వెల్లడించారు. ఏం జరిగిందంటే...? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన న్యాయవాదులు చిరంజీవి, అమ్మినాయుడు మధ్య రాజకీయ వైరుధ్యాలున్నాయి. కాగా అమ్మినాయుడు 2014లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యాడు. మరోవైపు విశాఖలో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న కిల్లి ప్రకాష్, చిరంజీవికి మధ్య భూ వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మినాయుడు, కిల్లిప్రకాష్ కలసి చిరంజీవిని హతమార్చేందుకు రౌడీషీటర్ కన్నబాబుతో రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకుని రూ.4 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. అయితే చిరంజీవిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా విశాఖ చినముషిడివాడలోని ఒక ఇంట్లో సమావేశమైన ఈ గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కిల్లి ప్రకాష్, రాజన కన్నబాబు, గంటా రామరాజు, ఆసనాల ఏసుదాస్, బోనెల పరమేష్, పసిగడ అనిల్‌కుమార్ ఉన్నారు. ప్రధాన నిందితుడు కొత్తకోట అమ్మినాయుడుతో పాటు మదన్, సువ్వారి తేజేశ్వరరావు పరారీలో ఉన్నారు. దాడుల్లో డీసీపీ–2 ఉదయభాస్కర్ బిల్లా, ఏడీసీపీ (క్రైం) సురేష్‌బాబు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినా«థ్, ఏసీపీ(క్రైం) శ్రావణ్‌కుమార్, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
‘హైకోర్టుపై చంద్రబాబు తప్పుడు ప్రచారం’
సాక్షి, విజయవాడ : గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు న్యాయవాదులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యుడు కోటమరాజు వెంకటశర్మ విమర్శించారు. విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం బడ్జెట్లో వంద కోట్లు కేటాయించారని తెలిపారు. హైకోర్టు న్యాయవాదుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు కార్యచరణ రూపొందిచారన్నారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు సైతం గౌరవభృతి సదుపాయం కల్పించారని గుర్తుచేశారు. హైకోర్టు కర్నూలుకు తరలిపోతుందంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన కుట్రలను వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఖండిస్తుందని అన్నారు. న్యాయవాదుల మధ్య విభేదాలు సృష్టించి టీడీపీ నేతలు పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. -
వైఎస్సార్సీపీ హైకోర్టు లీగల్ సెల్ కమిటీ ఇదే!
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అధ్యక్షుడిగా హైకోర్టు లీగల్ సెల్ కమిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నియమించారు. మొత్తం 97మందితో ఏర్పాటు చేసిన హైకోర్టు లీగల్ సెల్ కమిటీలో ఏడుగురిని జనరల్ సెక్రటరీలుగా నియమించారు. మరో 18మందిని సెక్రటరీలుగా, 16మందిని జాయింట్ సెక్రటరీలుగా, కే శ్రీనివాసులురెడ్డిని కోశాధికారిగా నియమితులయ్యారు. కమిటీలో 25మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉండగా.. 26 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపింది. కమిటీలోని సభ్యుల వివరాలివి.. 1 పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రెసిడెంట్ 2 బి.సోమశేఖర్, జనరల్ సెక్రటరీ 3 ఎ.వెంకట్రామయ్య, జనరల్ సెక్రటరీ 4 వి. అనిత , జనరల్ సెక్రటరీ 5 ఎన్ రాజా రాజేశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ 6 పి.సి. రెడ్డి, జనరల్ సెక్రటరీ 7 వి.సురేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ 8 పొనక. జనార్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ 9 కె. భీమా రావు, సెక్రెటరీ 10 జి. శ్రీనివాసుల రెడ్డి,కార్యదర్శి 11 మాచిరెడ్డి. జయరాంరెడ్డి, కార్యదర్శి 12 కె.వెంకట సుబ్బయ్య, కార్యదర్శి 13 ఎమ్, రాధారాణి, కార్యదర్శి 14 అపర్ణ లక్ష్మీ, కార్యదర్శి 15 సయ్యద్ అజాంతుల్లా, కార్యదర్శి 16 కె.నర్సిరెడ్డి, కార్యదర్శి 17 కె. రాంబాబు, కార్యదర్శి 18 జి. విజయ్ కుమార్, కార్యదర్శి 19 జి.ఎల్. నరసింహ రెడ్డి, కార్యదర్శి 20 కర్రి మురళీకృష్ణ, కార్యదర్శి 21 ఎం.కె. రాజ్ కుమార్, కార్యదర్శి 22 సయ్యద్ ఖాదర్ మస్తాన్, కార్యదర్శి 23 ఆర్. మహీందర్ రెడ్డి, కార్యదర్శి 24 జి. రామమోహన్ రెడ్డి, కార్యదర్శి 25 ఎస్. హరినాథ్ రెడ్డి, కార్యదర్శి 26 పి.వి. రంగారెడ్డి, సెక్రటరీ 27 బలాదూర్ నబీ రసూల్, కార్యదర్శి 28. ఎమ్. హేమలత, జాయింట్ సెక్రటరీ 29 జి.శేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ 30 ఎస్.విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ 31 సి.హెచ్. హృదయ్ రాజ్, జాయింట్ సెక్రటరీ 32 పి. వెంకటరావు, జాయింట్ సెక్రటరీ 33 జి.రాజాబాబు జాయింట్ సెక్రటరీ 34 పి. యుగంధర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ 35. ఎమ్. బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ 36 ఎన్. వెంకటేశ్వరరెడ్డి, జాయింట్ సెక్రటరీ 37 జి. రమణారావు, జాయింట్ సెక్రటరీ 38 సప్తగిరి, జాయింట్ సెక్రటరీ 39 ఎస్.శివకుమారి, జాయింట్ సెక్రటరీ 40 డి. శేషశయన, జాయింట్ సెక్రటరీ 41 ఎన్. శ్రీహరి, జాయింట్ సెక్రటరీ 42 సాయివిష్ణు, జాయింట్ సెక్రటరీ 43 నైదాన. శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ 44 కె.శ్రీనివాసులు రెడ్డి, కోశాధికారి 45. బి. హరిప్రసాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 46 టి.ఎస్.ఎన్. సుధాకర్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 47 వై. దుర్గారావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 48 వై.శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 49 బొల్లు. కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 50 పి.జయశేఖర్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 51 బి.వి. ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 52 వై.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 53 శివ కల్పనారెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 54 మృత్యుంజయశాస్త్రి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 55 భీమన్న, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 56 వై. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 57 జి. రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 58 జి. శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 59 జి.అప్పిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 60 ఎటుకూరి కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 61 జి. నాగభూషణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 62 శ్రావణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 63 ఆదర్శ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 64 ఎమ్. వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 65 డి. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్, సభ్యుడు 66 ఎమ్. జ్ఞానేశ్వర్ రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 67 సత్తిరాజు స్వామి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 68 ప్రసాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 69 సందు సతీష్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 70 కె. శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు 71 కె. జానకిరామి రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 72 డి. కోదండరామి రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 73 సి. శివరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 74 ఎస్. నాగేశ్వరరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులు 75 ఐ. కోటిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 76 సి. నాగేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులు 77 ఎమ్. మనోహర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 78 వై. నాగిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 79 ఎమ్. విద్య సాగర్, ప్రత్యేక ఆహ్వానితులు 80 ఎమ్. మహేశ్వర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడలు 81 జి.ఎల్. నాగేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులు 82 కె. మోహన్ రామిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 83 వి.ఆర్. రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 84 ఎన్. రంగారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 85 ఎస్. దుష్యంత్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 86 సి. ప్రకాశ్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 87 డి. పాండురంగారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 88 జి.తిమ్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 89 ఎస్.రాజేశ్వరరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 90 జె.శ్రీకాంత్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 91 ఎ. జయశంకర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 92 కల్వ సురేష్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 93 పెంగూరి వేణుగోపాల్, ప్రత్యేక ఆహ్వానితులు 94 కె. ధనుంజయ్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 95 మాధవరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 96 గంగాధర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు 97 సి. రామసుబ్బారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు -
విజయవాడలో నవరత్నాలు అవగాహన సదస్సు
-
నైతిక విలువలు పాటించని సీఎం : పొన్నవొలు
సాక్షి, అనంతపురం : ఏపీలో పోలీసు వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం లీగల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. న్యాయపోరాటంతో టీడీపీ నేతలకు బుద్ది చేపుతామని అన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ఆయనపై ఎలాంటి కేసులు లేవని.. చంద్రబాబు నాయుడు నైతిక విలువలు పాటించట్లేదని ఆయన విమర్శించారు. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దని, రాజ్యాంగపరంగా వచ్చిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ స్వచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని మెట్పల్లి జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ తెలిపారు. మెట్పల్లి అర్బన్‌కాలనీలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. కులమతాలకు అతీతంగా అందరు సమైక్యం గా ఉండాలని, తద్వారా సమస్యల పరి ష్కారం సులువు అవుతుందని పేర్కొన్నారు. అర్హుందరికీ ఉచిత న్యాయ సహాయం కోర్టుల్లో తప్పకుండా అందుతుందన్నారు. మండల లీగల్ సెల్ ఎళ్లవేళలా తోడుంటుందన్నారు. అధికారులు ప్రజలకు అవసరమైన సమస్యలు పరిష్కరించకుంటే కేసు వేయొచ్చన్నారు. ఈ సందర్భంగా స్థానికులు స్థానిక సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. ఎలాంటి విషయంలోనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని న్యాయమూర్తి సూచించారు. చట్టాలను చేతిలోకి తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అప్పులుఇస్తే తప్పకుండా పత్రాలు రాయించుకోవాలని సూచించారు. సదస్సులో వెంకట్రావుపేట సర్పంచ్, న్యాయవాది కొమిరెడ్డి లింగరెడ్డి, మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం శంకర్‌రెడ్డి, ఏజీపీ ఎల్లాల మధుసూదన్‌రెడ్డి, ఎస్సై శంకర్రావు, ఆర్ఐ కృష్ణ, న్యాయవాదులు కోటగిరి వెంకటస్వామి, మగ్గిడి వెంకటనర్సయ్య,ఓగులపు శేఖర్, తెడ్డు ఆనంద్, సురక్ష పాల్గొన్నారు. -
‘సాక్ష్యం’ సురక్షితం!
సాక్షి, హైదరాబాద్: నేరం చేసిన వారికి శిక్షపడాలి.. ఇది న్యాయసూత్రం. కానీ చాలా మంది నేరస్తులకు తగిన శిక్షలు పడటం లేదు. ఆయా కేసుల్లో సరైన ఆధారాలు సేకరించలేకపోవడంతోపాటు ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు కూడా. నేరస్తులు ఏమైనా చేస్తారోనన్న భయం, వారి బెదిరింపులు వంటివాటితో సాక్షులు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో సాక్షుల రక్షణ కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు నల్సార్ యూనివర్సిటీ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా ‘విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’పేరిట దీనికి రూపకల్పన చేస్తున్నాయి. సాక్షులకు భద్రత కల్పించడం, అవసరమైతే ఇతర ప్రాంతాలకు తరలించడం, బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం, భద్రతకు, తగిన ఏర్పాట్ల కోసం నిధులు కేటాయించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. సాక్ష్యం చెప్పడం హక్కుగా, సాక్షిని కాపాడుకోవడం, గౌరవం కల్పించడం బాధ్యతగా, వారు దర్యాప్తుకు సహకరించేలా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని ఈ చట్టం ముసాయిదాలో పేర్కొన్నారు. మూడురకాలుగా గుర్తిస్తారు తీవ్రమైన నేరాల్లో సాక్షులకు భద్రత, వారికి అందజేయాల్సిన సహాయ సహకారాలను మూడు కేటగిరీలుగా పర్యవేక్షించాల్సి ఉంటుందని ‘ప్రొటెక్షన్ స్కీమ్’లో పేర్కొన్నారు. కేటగిరీ–ఏ కింద ఏదైనా కేసులో సాక్ష్యం చెబుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబంలో జీవితాంతం ప్రమాదం ఉన్నవారు ఉంటారు. కేటగిరీ–బీలో కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో హాని ఉండే సాక్షులను చేరుస్తారు. కేటగిరీ–సీ కింద పోలీసుల దర్యాప్తు దశలో ఉన్నప్పుడే బెదిరింపులు రావడం, హాని కలిగించడం, సమాజంలో తిరగనీయకుండా చేయడం వంటివి ఎదుర్కొన్న సాక్షులను చేరుస్తారు. సాక్షులకు ఈ కేటగిరీలను బట్టి భద్రత కల్పిస్తారు. నిధుల కోసం ప్రత్యేక ఫండ్ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో కొన్ని నిధులను కేటాయించడం, స్వచ్చంద సంస్థల నుంచి నిధులు సేకరించడం, కోర్టుల్లో డిపాజిట్ రూపంలో వచ్చే నిధి నుంచి కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమచేయడం వంటివి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ ఏడాది నుంచే అమలు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం రూపొందిస్తున్న ఈ చట్టాన్ని ఈ ఏడాదే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ ముసాయిదాలో పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని అంశాలను జత చేయడం లేదా అనవసరమైన వాటిని తొలగించడం పూర్తి చేసి.. తుదిరూపు దిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చేపట్టనున్న భద్రతా చర్యలివీ.. - కేసు దర్యాప్తు లేదా కోర్టు విచారణ సమయంలో నిందితులకు, సాక్షులు నేరుగా (ఫేస్ టు ఫేస్) కనిపించకుండా ఏర్పాట్లు చేయడం. - సాక్షులతోపాటు నేరస్తుల మెయిల్స్, ఫోన్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం. - సాక్షికి సంబంధించిన ఫోన్ నంబర్లు మార్చడంతోపాటు సంబంధిత టెలికం సంస్థకు తీవ్రత వివరించి నంబర్‌ను అన్‌లిస్ట్ చేయడం. - సాక్షి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ డోర్స్, అలారం, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయడం. - వారి గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు మరో పేరుతో బయట తిరిగేలా ఏర్పాట్లు. - సాక్షుల నివాసం పరిసరాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ చేపట్టి భద్రత కల్పించడం. - అవసరమైతే సాక్షులను వారి దూరపు బంధువుల ఇంటికి లేదా మరో రక్షణ గృహానికి తాత్కాలికంగా తరలించడం. - కోర్టులో వాంగ్మూలం లేదా విచారణ ఉన్న సమయంలో పోలీసు భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో చేర్చడం. - సాక్షులను కోర్టు వరకు తీసుకువచ్చి, తిరిగి సురక్షిత ప్రదేశానికి తరలించడం ప్రమాదకరమని భావిస్తే... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేలా ఏర్పాట్లు. - ఇన్‌కెమెరా ట్రయల్స్‌కు సిఫారసు చేయడం. - తీవ్రత ఎక్కువ కల్గిన నేరాలపై రోజువారీగా త్వరితగతిన దర్యాప్తు, విచారణ చేపట్టడం. - సాక్షుల జీవన ప్రమాణాలకు ఇబ్బంది కలిగినప్పుడు వారికి ఆర్థిక సహాయం లేదా మరో వృత్తిలో నిలదొక్కుకునేలా నిధులను ఇప్పించడం. - ‘విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’ను అక్రమ మార్గానికిగానీ, ఎలాంటి హానీ లేకున్నా భద్రత కోసం దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే.. వారికోసం చేసిన ఖర్చును తిరిగి వసూలు చేస్తారు. లీగల్ సెల్ అథారిటీ నేతృత్వంలో.. ఏదైనా కేసులో సాక్ష్యం చెబితే తనకు ప్రమాదకరమని భావించిన వ్యక్తులు జిల్లాస్థాయిల్లోని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీలను, రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ లీగల్ సెల్ అథారిటీలను సంప్రదించి.. రక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అథారిటీలు ఈ దరఖాస్తులను పోలీస్ కమిషనర్లు/జిల్లా ఎస్పీలకు సిఫార్సు చేస్తాయి. సంబంధిత కేసుల్లో బెదిరింపులు, సాక్షులకు హాని కలిగించే అంశాలపై నివేదిక తెప్పించుకుని.. పోలీసు–లీగల్ సెల్ సంయుక్తంగా చర్యలు చేపడతాయి. సాక్షులకు భద్రత కల్పించేలా అథారిటీలు మానిటరింగ్ చేస్తాయి. ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేందుకు విట్నెస్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
ఎంపీ కవితపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం!
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, నిజమాబాద్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చాక కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత్ లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ లీగల్ సెల్ అడ్వొకేట్ కన్వీనర్ కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. కరుణాసాగర్ ఫిర్యాదును పరిశీలించిన ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
త్వరలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ విస్తృతం
ఒంగోలు, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ లీగల్ సెల్‌ను త్వరలో విస్తృత పరచనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు న్యాయవాదులతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్, టీడీపీలు రాజకీయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతల కుట్రలను ఎండగట్టేందుకు న్యాయవాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కమిటీకి సంబంధించిన అంశాలపై న్యాయవాదులతో చర్చించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని కాంగ్రెస్ పార్టీ.. రాష్ర్ట విభజన అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. ప్రజల అభీష్టానికి అండగా నిలవాల్సింది పోయి కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉత్సాహం, ఆసక్తి ఉన్న న్యాయవాదులతో కలిసి త్వరలోనే జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామని నాగేశ్వరరావు చెప్పారు. లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగిరెడ్డి మాట్లాడుతూ హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై టీ న్యాయవాదుల దాడి అమానుషమన్నారు. అసెంబ్లీలో సమైక్యవాదం వినిపిస్తున్న గాదె వెంకటరెడ్డి చొక్కాను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర న్యాయవాదులు 180 రోజుల నుంచి కోర్టుకు హాజరు కాకుండా ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర న్యాయవాదుల శాంతియుత నిరసన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి చెప్పారు. సమావేశానికి హాజరైన న్యాయవాదులను వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఎంవీవీఎస్ వేణుగోపాల్ పరిచయం చేశారు. సమావేశంలో న్యాయవాదులు చావలి రమేశ్, వి.కోటేశ్వరరావు, నక్కల వీరాంజనేయులు, కుంచాల వెంకటేశ్వర్లు, రవిశంకర్, వి.గ్రేస్‌కుమారి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఈ.సురేంద్రబాబు, ఎన్.ఈశ్వరరావు, టి.బాలాజీ, ఎస్.రఘునాథరెడ్డి, డి.రామారావు, ఎం.రామకృష్ణారావు, జీవీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.