సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రచార యావకు 11 మంది అమాయకులు బలైపోయారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘చంద్రన్న కానుక ఇస్తామంటూ పేదలను తరలించారు. 30 వేల టోకెన్లు ఇచ్చి కేవలం 2 వేల మందికే ఇచ్చారు. నిర్దేశించిన స్థలంలో కాకుండా ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాన్ని చంపేశారు. జనం వచ్చినట్టు పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి డ్రోన్ షూటింగ్ చేశారు’’ అని మండిపడ్డారు.
‘‘టీడీపీ నేతల ఉన్మాదం వలన అమాయకులు చనిపోయారు. అందుకే జీవో నెంబర్ వన్ ను ప్రభుత్వం తెచ్చింది. ఇదేమీ చీకటి జీవో కాదు. చట్టం ప్రకారం తెచ్చిందే. సభలు రోడ్ల మీద పెట్టవద్దని మాత్రమే ఆ జీవోలో ఉంది. ర్యాలీలు చేసుకోవద్దని లేదు. కానీ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వం పని. కానీ దాన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలకైనా ఇదే జీవో వర్తిస్తుంది. చంద్రబాబు చేసిన రక్తపు మరకలను తొలగించటానికే దీన్ని తెచ్చాం’’ అని మనోహర్‌రెడ్డి అన్నారు.
చదవండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే!
Comments
Please login to add a commentAdd a comment