manohar reddy
-
హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు
-
‘అలా పోస్టు పెడితే తప్పా?.. ఇది టీడీపీ సైకోల ఆలోచనే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక చాలా మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఇదే సమయంలో సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారని చెప్పుకొచ్చారు.తాజాగా మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో దుష్ట సంప్రదాయం కొనసాగుతోంది. బాధితుల్ని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలను ఆలోచింపచేసేలా పోస్టులు పెడుతున్నా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని మస్క్ ప్రకటించారు. ఆ తర్వాత టెస్లా కంపెనీ ఏపీలో పెట్టుబడి పెట్టాలని లోకేష్ ట్వీట్ పెట్టారు. ఈ రెండిటినీ కలుపుతూ ఇంటూరి రవి కిరణ్ వ్యంగ్యంగా పోస్టు పెడితే కేసు పెట్టారు. సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారు.బుడమేరు వరద పరిహారంలో జరిగిన దోపిడీపై వ్యంగ్యంగా పోస్టు పెడితే మరో కేసు పెట్టారు. గాంధీజీ ఏం చెప్పారు? చంద్రబాబు మద్యం షాపుల పెంపు ద్వారా ఏం చెప్తున్నారో తెలుపుతూ ఒక జోక్ పోస్టు పెడితే దాన్ని కూడా తప్పు పట్టారు. కనకదుర్గమ్మ గుడి కవర్‌తో బయటి నుండి తెచ్చిన లడ్డూలు పెట్టి విక్రయించిన వైనంపై పోస్టు పెడితే కేసు పెట్టారు. డీజీపీ కోయ ప్రవీణ్ ఫక్తు పొలిటికల్ లీడర్ లాగా ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆయనకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావాలేగానీ పోలీసు డ్రెస్సులో రాజకీయాలు మాట్లాడవద్దు.వైఎస్ జగన్‌పై అత్యంత దారుణమైన భాషతో టీడీపీ వారు పోస్టులు పెట్టారు. వైఎస్ జగన్ తనపై తానే దాడి చేయించుకున్నట్టు టీడీపీ నేతలు మాట్లాడారు. వీళ్ల మనసులో ఎంత విషం ఉంటే ఇలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదు?. టీడీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. దీన్ని బట్టే టీడీపీ సైకో మెంటాల్టీని అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ మేలు చేస్తే జనం నోటి దగ్గర తిండిని తీసేశారంటూ పోస్టులు పెట్టారు. ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు రూ.73వేల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బును ఏం చేశారో ప్రజలకు తెలపాలి. కాకినాడ పోర్టును గురిపెట్టి లాక్కున్నట్టు నిస్సిగ్గుగా పోస్టు పెట్టారు. టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లోనే వైఎస్ జగన్‌పై దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారు. కేవలం వ్యంగ్యంగా పోస్టులు పెట్టిన ఇంటూరి రవికిరణ్‌పై 20పైనే కేసులు పెట్టారు. మరి దుర్మార్గంగా పోస్టులు పెట్టిన టీడీపీ వారిని ఏం చేయాలి?. పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టుని రాజమండ్రి పోలీసులు నగ్నంగా లాకప్‌లో పడేశారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కస్టడీలోనే పోలీసులు కొట్టారు. ఇలా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలోని మేధావులు, ప్రజాసంఘాల నేతలు ఆలోచించాలి. ఈ దారుణాలను గట్టిగా ప్రశ్నించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెడుతున్నాం’ అని చెప్పారు. -
ఆ తప్పులన్నీ బయటకొస్తాయి: వైఎస్సార్సీపీ లీగల్ సెల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు, అరెస్టులకు సంబంధించి దాఖలు చేసిన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి వెల్లడించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల సీసీ ఫుటేజ్‌ను (ఈనెల 4నుంచి 8వ తేదీ వరకు) స్థానిక మెజిస్ట్రేట్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. దీని వల్ల పోలీసుల తప్పులన్నీ బయటకు వస్తాయని చెప్పారు.తమను ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న లక్ష్యంతో, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తోందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం గుడ్డిగా కేసులు నమోదు చేయిస్తోందన్న ఆయన.. ఉదాహరణగా ఒక కేస్‌ను ప్రస్తావించారు. తుళ్లూరు మండలం బోరుపాలెనికి చెందిన శ్రీనుపై కేసు పెట్టిన పోలీసులు విచారణకు పిలిచారని, కానీ అతను ఏడాదిన్నర క్రితమే చనిపోయారని చెప్పారు.సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అని కనిపిస్తే చాలు కేసులు పెడుతున్నారని, విచారణకు హాజరు కావాలంటూ గుడ్డిగా నోటీసులు ఇస్తున్నారని, అలా మరో 15 వేల మందిని బజారుకీడ్చి వారి కుటుంబాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మనోహర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులన్నింటికీ ఎప్పటికైనా డీజీపీనే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.తమ హెబియస్ కార్పస్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసిందన్న వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు, ఆరోజు పోలీసులు చేసిన అన్ని తప్పులు బయటికి వస్తాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం డీజీపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఇదంతా పోలీసుల ద్వారా చేస్తోంది కాబట్టి, అవసరమైతే డీజీపీని సుప్రీంకోర్టుకు లాగుతామని హెచ్చరించారు. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాము పూర్తి అండగా ఉంటామని, కాపాడుకుంటామని మనోహర్‌రెడ్డి వివరించారు. -
ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా? మితిమీరుతున్న కూటమి అరాచకాలు
-
ప్రశ్నిస్తే నేరమా?.. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధారాణి అనే మహిళను నాలుగు రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చారని.. ఇప్పటికీ కోర్టులో హాజరు పరచలేదని ధ్వజమెత్తారు.దీనిపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. పిటిషన్ వేసినందుకు ఆమెపై మరో నాలుగు తప్పుడు కేసులు పెడతామని ఆమెని బెదిరిస్తున్నారు. రాయచోటికి చెందిన హన్మంతరెడ్డిని కూడా అలాగే తీసుకెళ్లారు. మేము పిటిషన్ వేశాక అతన్ని మదనపల్లెలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో ఏకంగా ఎస్పీనే బదిలీ చేశారు. ఎస్పీల స్థానంలో నాన్ కేడర్ ఎస్పీలను వేస్తామని ఐపీఎస్‌లను కూడా బెదిరిస్తున్నారు. ‘కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లను బాధితులకు ఇవ్వటం లేదు ఇలా చేయటం ద్వారా ఏం చెప్పదలచుకున్నారు?’’ అంటూ మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, ప్రశ్నిస్తే కేసులు పెట్టటం సరికాదని.. కాలం ఒకేలాగ ఎప్పుడూ ఉండదన్నారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టటం ఏంటి?. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారు. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. వారికి అన్నివిధాలా అండగా నిలబడుతున్నాం. పోలీసులు చేయ్యి చేసుకుంటే ఆ వివరాలు ఇవ్వాలని మా కార్యకర్తలను కోరుతున్నాం. సదరు పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం. టీడీపీ అధికార ట్విట్టర్లోనే మాపై దారుణంగా పోస్టులు పెడితే డీజీపీ ఏం చేస్తున్నారు?ఇదీ చదివండి: వేధించకుంటే వేటే!..వైఎస్ జగన్‌ని దారుణంగా దూషిస్తుంటే డీజీపికి కనపడటం లేదా?. మరోసారి ఆ వివరాలన్నీ మేము డీజీపికి ఇవ్వబోతున్నాం. దీనిపై ఆయన కచ్చితంగా కేసులు పెట్టించాలి. లేకపోతే సదరు పోలీసులపై కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
పచ్చ ముసుగులో పోలీసుల దారుణాలు మనోహర్ రెడ్డి ఫైర్
-
టీడీపీ కుట్రలు.. పోలీసు అధికారులకు బెదిరింపులు: మనోహర్‌రెడ్డి
సాక్షి, గుంటూరు: నిరాశా నిస్పృహలతో టీడీపీ నేతలు రాష్ట్రవాప్తంగా పలుచోట్ల హింసకు, దౌర్జన్యాలకు దిగుతున్నారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో హింసకు,దౌర్జన్యాలకు తావులేకుండా ఓటర్ల ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్దితి ఉండాలని అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాపట్లలో నందిగం సురేష్, ఎన్నికల ఏజంట్లు ప్రయాణిస్తున్న కారును టీడీపీ కార్యకర్తల ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు.ఏబీ వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజీ ఆర్పీ ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుని రానుంది టీడీపీ ప్రభుత్వం అని.. అనుకూలంగా వ్యవహరించాలంటూ జిల్లాల్లోని పోలీసు అధికారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల సంఘం తక్షణం విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేసే సందర్భంలో ఆయన భార్య కూడా పోలీంగ్ బూత్‌లోకి రావడం నిబంధనలకు విరుధ్దం అని, అలా ఆమెను పోలింగ్ సిబ్బంది ఎలా అనుమతిస్తారని మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
'పార్టీ మారితే నన్ను ఉరి తీయండి' : బుయ్యని మనోహర్‌రెడ్డి
సాక్షి, వికారాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, గెలిచిన తరువాత పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని, లేకుంటే ఆంజనేయస్వామి ఆలయం ముందు ఉరి తీయాలని డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నేత బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అంతారం, చెంగోల్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. బీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా చెంగోల్ గ్రామ ఎంపీటీసీ రత్నమాల, రాము యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, వీ శ్రీను, రాందాస్, గోపాల్‌రెడ్డి, అశోక్, ప్రవీణ్‌గౌడ్, రాంచంద్రారెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. టికెట్ ప్రకటించడం లాంఛనమే.. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడం లాంఛనమేనని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్ జాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చంద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శోభారణి, పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ మధులతతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న తాండూరు నుంచి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీడికే శివకుమార్ హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలీం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
స్కిల్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్
-
TS Election 2023: బీఆర్ఎస్లో వన్ మేన్ షో ! మరో పార్టీ నో..!
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త బుయ్యని మనోహర్‌రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక మర్మమేమిటనేది రాజకీయ వర్గాల్లో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. బీఆర్ఎస్లో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వర్గంలో కీలక నేతగా ఉండటంతోపాటు మంత్రి కేటీఆర్‌తో సాన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటి నేత పార్టీ వీడేందుకు సిద్ధమైతే బీఆర్ఎస్లో ఏ ఒక్క నేత ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే బుయ్యని మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఢిల్లీలో లేదా గాంధీభవన్‌లో పార్టీ కండువా వేసుకోవాలి. కాని చిన్నపాటి కార్యకర్తలా తాండూరులో చేరడం వెనుక కాంగ్రెస్‌లో ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోనే వ్యాపారవేత్తగా ఖ్యాతిగాంచిన బుయ్యని మనోహర్‌రెడ్డి నాటకీయ పరిణామాల నడుమ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ హోదాలో కొనసాగుతున్నారు. మనోహర్‌రెడ్డి పరిగిలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మరోవైపు తన సొంత నియోజవకర్గంలో పర్యటించాలని అధికార పార్టీ నేతలు ఆంక్షలు విధించారంటూ ఆందోళనకు గురయ్యారు. బీఆర్ఎస్లో వన్‌మెన్ షో కొనసాగుతుందంటూ ఇక పార్టీలో కొనసాగడం కష్టమంటూ ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరిన మనోహర్‌రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన పరిగిలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి టికెట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో రామ్మోహన్‌రెడ్డి చొరవతో తాండూరు అసెంబ్లీ స్థానాన్ని మనోహర్‌రెడ్డికి కేటాయిస్తే ఇటు పరిగి నియోజకవర్గంలోని మనోహర్‌రెడ్డి అనుచరగణమంతా కాంగ్రెస్‌కి మద్దతు పలకడంతో పార్టీ గెలుపు అవకాశాలు అధికమయ్యాయంటూ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో దశాబ్దానికి పైగా బుయ్యని సోదరులు రైస్ మిల్లుతో పాటు ఆర్బీఎల్ పరిశ్రమ ద్వారా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం సర్వే.. కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తవుతుంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి.. తాండూరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థిగా వస్తారంటు ఇప్పటికే నియోజవకర్గంలోని మారుమూల గ్రామ ప్రజల వరకు వెళ్లింది. నెల రోజుల క్రితమే నియోజవకర్గంలో వాల్‌పోస్టర్లను అంటించారు. కేఎల్ఆర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ సభ్యులు, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి రమేశ్ మహరాజ్ సైతం మద్దతు పలికారు. అయితే మనోహర్‌రెడ్డి తాండూరు పట్టణంలో పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాండూరు అసెంబ్లీకి చేతి గుర్తు ఎవరిని వరిస్తోందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. టికెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. తాండూరు అసెంబ్లీకి కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ఢిల్లీ స్థాయిలో లాభియింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై భారం వేశారు. దీంతో మనోహర్‌రెడ్డికి టికెట్ ఇప్పించే బాధ్యత రేవంత్‌రెడ్డి భుజస్కంధాలపై వేసుకొన్నారు. తన నియోజకవర్గం ఆనుకొని ఉన్న తాండూరు సీటు విషయంలో రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. -
చంద్రబాబుపై మరిన్ని కేసులు బయటపడ్డాయి..
-
పెద్దపల్లి నియోజకవర్గం పాలకవర్గం ఎవరు?
పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సిటింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది విజయ రమణారావును 8466 ఓట్లు తేడాతో ఓడిరచారు. విజయ రమణారావు 2009లో టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టిడిపి, బిజెపి అభ్యర్ధిగా, తదుపరి 2018లో ఆయన కాంగ్రెస్ ఐలో చేరి ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మనోహర్ రెడ్డికి 82765 ఓట్లు సాదించగా, కాంగ్రెస్‌కు 74299 ఓట్లు మాత్రమే వచ్చాయి.మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బిజెపి పక్షాన పోటీచేసి కేవలం ఐదువేల ఓట్లు మాత్రమే పొందారు. దాసరి మనోహర్ రెడ్డి మరోసారి గెలవడం ద్వారా పట్టు నిలబెట్టుకున్నారు. 2014లో డి.మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి , ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాదరావుపై 62677 ఓట్ల భారీ ఆదిక్యతతో గెలుపొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం ఎంత తీవ్రంగా వీచిందో ఈ మెజార్టీ తెలియచేస్తుంది. ఎన్నికల తర్వాత బానూ ప్రసాద్ కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. పెద్దపల్లి శాసనసభ నియోజక వర్గంలో ఇంతవరకు మనోహర్ రెడ్డితో సహా పదిసార్లు రెడ్లు గెలిచారు. ఇద్దరు వెలమ, ఒక బిసి, ఇద్దరు ఎస్సి వర్గ నేతలు గెలుపొందారు. ముకుందరెడ్డి పెద్దపల్లి నుంచి మూడుసార్లు గెలిచారు. రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా, 2004లో టిఆర్ఎస్ తరుఫున విజయం సాధించారు. ఆ తరువాత టిఆర్ఎస్లో అసమ్మతివర్గంలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చిన కేసులో శానససభ్యత్వానికి అనర్హునిగా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి ప్రకటించారు. అయితే స్పీకరు తీర్పు రావడానికి ఒక రోజు ముందే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. తదుపరి కాంగ్రెస్ ఐలో చేరి 2009లో పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో టిడిపి, టిఆర్ఎస్లు పొత్తు కుదిరినప్పటికీ, ఒక దశలో పొత్తు ఉంటుందో, ఉండదోనన్న అనుమానంతో టిడిపి తన అభ్యర్దులు పలువురికి టిఆర్ఎస్కు కేటాయించిన సీట్లలో పోటీకి సిద్దం చేసింది. అలాంటి చోట్లలో ఒకట్కెన పెద్దపల్లిలో టిడిపి పక్షాన బిఫారం ఇచ్చేయడంతో నామినేషన్ వేసిన విజయరమణరావు ఆ పార్టీ అభ్యర్ధిగానే రంగంలో ఉండి2009లో గెలిచారు. 1983లో సంజయ్ విచార్ మంచ్ తరపున టిడిపి గుర్తుపై పోటీచేసి గెలిచిన గోనె ప్రకాశరావు, కొద్దినెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1962లో పెద్దపల్లిలో గెలిచిన బుట్టిరాజారాం 1952లో జగిత్యాల, 57లో సుల్తానా బాద్‌లో, 1967లో నుస్తులాపూర్లోను మొత్తం నాలుగుసార్లు గెలిచారు. 1967లో ఇండిపెండెంటుగా గెలిచిన జె.మల్లారెడ్డి, 1972లో కాంగ్రెస్ తరుపున గెలిచారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
30 వేలమందికి టోకెన్లు ఇచ్చి కేవలం 2 వేలు మందికి సరుకులు ఇచ్చారు
-
టీడీపీ నేతల ఉన్మాదంతోనే అమాయకుల బలి: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రచార యావకు 11 మంది అమాయకులు బలైపోయారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘చంద్రన్న కానుక ఇస్తామంటూ పేదలను తరలించారు. 30 వేల టోకెన్లు ఇచ్చి కేవలం 2 వేల మందికే ఇచ్చారు. నిర్దేశించిన స్థలంలో కాకుండా ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాన్ని చంపేశారు. జనం వచ్చినట్టు పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి డ్రోన్ షూటింగ్ చేశారు’’ అని మండిపడ్డారు. ‘‘టీడీపీ నేతల ఉన్మాదం వలన అమాయకులు చనిపోయారు. అందుకే జీవో నెంబర్ వన్ ను ప్రభుత్వం తెచ్చింది. ఇదేమీ చీకటి జీవో కాదు. చట్టం ప్రకారం తెచ్చిందే. సభలు రోడ్ల మీద పెట్టవద్దని మాత్రమే ఆ జీవోలో ఉంది. ర్యాలీలు చేసుకోవద్దని లేదు. కానీ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వం పని. కానీ దాన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలకైనా ఇదే జీవో వర్తిస్తుంది. చంద్రబాబు చేసిన రక్తపు మరకలను తొలగించటానికే దీన్ని తెచ్చాం’’ అని మనోహర్‌రెడ్డి అన్నారు. చదవండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే! -
పరిగి టీఆర్ఎస్ లో గ్రూపులాట
-
పార్టీ శ్రేణులకు ఓ ప్రేరణ ‘ప్రజా సంగ్రామయాత్ర’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్ 36 రోజుల పాటు నిర్వహించిన తొలివిడత ‘ప్రజాసంగ్రామయాత్ర’పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఓ ప్రేరణగా నిలుస్తుందని పాదయాత్ర ప్రముఖ్, ఇన్చార్జి డా.గంగిడి మనోహర్‌రెడ్డి చెప్పారు. తొలివిడత అనుభవం, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక రెండో, మూడో విడత యాత్రను కూడా సునాయాసంగా పూర్తిచేయగలమనే నమ్మకం కలిగిందన్నారు. భవిష్యత్‌లో బీజేపీ వివిధ రాష్ట్రాల్లో చేపట్టే పాదయాత్రలకు ఇదొక ‘రోల్ మోడల్’గా నిలిచిపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తొలివిడత పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇందులో పూర్తిస్థాయిలో నిమగ్నమై, ఏర్పాట్లు మొదలుకుని, యాత్ర నిర్వహణలో మమేకమైన మనోహర్‌రెడ్డి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. ఊహించిన దాని కంటే బాగా... ‘‘ఈ పాదయాత్ర ఊహించిన దానికంటే కూడా బాగా జరిగింది. ఇంత పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొంటారని అనుకోలేదు. హైదరాబాద్ వరకే స్పందన ఉంటుంది ఆ తర్వాత ఉండదనుకున్నాం. కానీ, వివిధ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ మంచి స్పందన వ్యక్తమైంది. మరో రెండున్నరేళ్ల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలుండగా ఇప్పుడు పాదయాత్ర చేపట్టడం సరైనదికాదేమోనని చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఐతే పాదయాత్రకు కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక ఇప్పుడు చేయడమే మంచిదైందని భావిస్తున్నాం. ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలను గట్టిగా వ్యతిరేకించే సరైన పార్టీ, నాయకుడు వచ్చారనే భావన ప్రజల్లో కలిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కొనసాగించాం భారీవర్షాలు, ఆ వెంటే ఎండలు ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ యాత్రను ప్రారంభించాం. పార్టీ జాతీయ నాయకత్వం, ముఖ్యనేతలు ఏ పాదయాత్రలోనూ ఈ స్థాయిలో భాగస్వాములు కాలేదు. పాదయాత్రలో పాల్గొనేందుకే తాను నిర్మల్‌కు వచ్చానంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షా ప్రకటించడం కేడర్‌లో, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. సమస్యల తీవ్రత తెలిసొచ్చింది ప్రజాసంగ్రామయాత్ర ద్వారా టీఆర్ఎస్పై, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న ప్రజా వ్యతిరేకత, ఆగ్రహం బయటపడింది. రాష్ట్రంలో నిరుద్యోగసమస్య తీవ్రత తెలిసొచ్చింది. ఉన్నత చదువులు చదివినా, తగిన విద్యార్హతలు ఉన్నా ఉద్యోగాలు రాకపోవడం, గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటికీ నెరవేరకపోవడంపై యువతలో తీవ్రస్థాయిలో కోపోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతన్న తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైన తీరును పాదయాత్రలో దగ్గర నుంచి చూడగలిగాం. రుణమాఫీ కాకపోవడం, పేదలకు డబుల్ బెడ్రూంలు అందకపోవడం, కరోనా సమయంలో అన్నీ అమ్ముకుని చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందనే ఆవేదన వివిధ వర్గాల్లో వెల్లడైంది. టీఆర్ఎస్ విమర్శలే యాత్ర విజయానికి కొలమానం బీజేపీ ఎక్కడుందని గతంలో ప్రశ్నించిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు పాదయాత్ర సాగిన 36 రోజులూ మాపై విమర్శలు సంధించారు. దీనిని బట్టి మా యాత్ర ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే విజయవంతమైందని భావిస్తున్నాం. -
టీఆర్ఎస్కే పట్టం కట్టండి
పెద్దపల్లిరూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పుట్టిందని, అలాంటి ఇంటి పార్టీతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకుందామని పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళహారతులు, పూలమాలలతో ఘనంగా స్వాగతించారు. ప్రతి ఓటరును నేరుగా కలిసి కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మరో అవకాశమిచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. విపక్ష పార్టీలకు అధికారం దక్కించుకోవాలన్న ఆలోచన తప్ప అభివృద్ధిపై ఎలాంటి ధ్యాస లేదన్నారు. సీట్ల కేటాయింపుకే ఇన్ని రోజులు తీసుకున్న పార్టీలకు అవకాశమిస్తే సీఎం ఎవరో తేల్చుకోవడానికే కుస్తీలు పడతారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు మరిన్ని తోడవుతాయన్నారు. రైతాంగ సంక్షేమానికి, మహిళాభ్యున్నతికి ఆయన వేసిన బాటలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఆయన వెంట నాయకులు రాజేందర్‌యాదవ్, ఇనుగాల తిరుపతిరెడ్డి, రాజు, సతీష్, కొమురయ్య, మల్లేశం తదితరులున్నారు. ఎస్సి సెల్ నాయకుల ప్రచారం: ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరుతూ మండల ఎస్సీ సెల్ నాయకులు శుక్రవారం మండలంలోని రచ్చపల్లి, కానంపల్లి, రామయ్యపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీల్లోని మహిళలు, ఓటర్లను కలుస్తూ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు వేయాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రజలు సానుకులంగా ఉన్నారని మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దునాల వెంకటేశం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడపాక శ్రీనివాస్, జుంజుపల్లి రమేశ్, రెడపాక పోచయ్య, రాజయ్య, కనుమండ రమేశ్, కాసీపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం చేశారని తీగలకు టికెట్ ఇచ్చారు?
హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఒక్కమారుగా బహిర్గతమయ్యాయి. తీగల కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించటంపై నిరసనలు వ్యక్తం చేస్తూ కొత్త మనోహర్ రెడ్డి అనుచరులు మంగళవారం కొత్తపేట చౌరస్తా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం యూత్ అధ్యక్షుడు చిక్కుళ్ళ శివప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి తీగలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో కొత్తపేట నుంచి దిల్సుఖ్నగర్ వరకు ట్రాఫిక్ జామ్ కాగా పోలీస్‌లు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనంతరం చిక్కుళ్ళ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఏం చేశారని, తీగలకు తిరిగి టికెట్ ఇవ్వటం దారుణమన్నారు. తమ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతారని ఛాలెంజ్ చేశారు. కొత్త మనోహర్ రెడ్డిని ఇండిపెండెంట్‌గా గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు. తీగల కృష్ణారెడ్డి ఆర్కెపురం లో తన కోడల్ని కార్పొరేటర్‌గా గెలిపించుకోలేకపోయారని, ఇటువంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించా రు. కార్యక్రమంలో మేకల రవీందర్ రెడ్డి, పాశం ప్రవీణ్ రెడ్డి, వేద భవాని, లలిత, లక్ష్మి, భాస్కర్, నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగారూ.. మా విన్నపం వినుడు
కరీంనగర్ అగ్రికల్చర్: జెడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు క్షేత్రస్థాయిలో రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతం చేయాలని మంత్రికి విన్నవించారు. వ్యవసాయ అనుబంధ శాఖ లో ఖాళీలను భర్తీ చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోరారు. ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తున్న 70 శాతం సబ్సిడీతో ఇస్తున్న పాలీహౌస్ను జిల్లాలోనూ వర్తింపజేయాలని కరీంనగర్ జెడ్పీటీసీ ఎడ్ల శ్రీను విజ్ఞప్తి చేశారు. సోలార్ పంపుసెట్లను ఉచితంగా అందజేయాలని ఆయన కోరగా ప్రభుత్వం పరిశీలిస్తోందని, 2015-16 నుంచి పాలీహౌస్ పథకాన్ని అన్ని జిల్లాల్లో వర్తింపజేస్తామని మంత్రి సమాధనం ఇచ్చారు. మానకొండూర్ జెడ్పీటీసీ సుగుణాకర్.. పంటల బీమా రైతులకు ధీమానివ్వడం లేదని, ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలకు చేరడం లేదని తెలిపారు. మంత్రి స్పందిస్తూ.. పంటల బీమా లోపభూయిష్టంగా ఉందని, త్వరలో రైతు యూనిట్ పంటల బీమా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యాంత్రీకరణలో రూ.30 వేలు దాటిన పరికరాలకు పూర్తిస్థాయిలో డీడీ చెల్లించినప్పుడే పరికరాలు మంజూరు ఇబ్బం దికరమని, నిబంధనలు సడలించాలని బోయినిపల్లి జెడ్పీటీసీ లచ్చిరెడ్డి కోరారు. రూ.లక్ష విలువ చేసే పరికరాల వరకు సబ్సిడీ మినహాయించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. వరి, పత్తికి బదులుగా ప్రత్నామ్నాయంగా సోయాబీన్, కూరగాయల సాగును ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలని ధర్మారం జెడ్పీటీసీ నార బుచ్చయ్య, రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కోరారు. మత్స్యకార్మిక సహకార సంఘాల్లో దళారులు మత్య్సకారుల పొట్టగొడుతున్నారంటూ ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ ఆగయ్య అన్నారు. జిల్లాను పూర్తిగా కరువు మండలంగా ప్రకటించాలని కో-ఆప్షన్ మెంబర్ జమీలొద్దీన్ విన్నవించారు. ప్రజాప్రతినిధులకు విశ్రాంతి భవనం.. నిత్యం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల కోసం కరీంనగర్లో విశ్రాంతి భవనం నిర్మించాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ కోరారు. అందుకోసం జిల్లా కేంద్రంలో 15 గుంటల స్థలం కేటాయిస్తే తన ఫండ్ నుంచి రూ.కోటి నిధులు కేటాయిస్తానన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ జిల్లా కేంద్రంలో 20 గుంటల స్థలం మంజూరుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్డులు.. పింఛన్లు వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సమావేశం లో ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందలేదంటూ సభ్యులు లేవనెత్తారు. ప్రతీ మండలంలో రెండు వందల మందిని ఆసరాకు అర్హులుగా పెంచాలని సభ్యులు కోరారు. మంత్రి ఈటెల రాజేందర్ ఆహారభద్రత కార్డులు, విద్యార్థులకు సన్నబియ్యం భోజనపథకం అమలుపై అవగాహన కల్పించారు. డెయిరీ సామర్థ్యం పెంచాలి కరీంనగర్ డెయిరీ ప్రతిరోజు లక్ష లీటర్ల పాల ను ఉత్పత్తి చేస్తోందని, ఆ పాలు ఇక్కడే సరిపోతాయని, మరో లక్ష లీటర్ల సామర్థ్యం పెంపునకు ప్రోత్సహించాలని ఎంపీ వినోద్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయంతో పాటు పశుసంపద అభివృద్ధికి కృషిచేయాలన్నారు. ప్రస్తుతం కూరగాయలు పండించే గ్రామాలకే పాలీహౌస్‌లు వర్తింపజేయాలని తెలిపారు. జెడ్పీ హాలు ఆధునికీకరణకు సహకరిస్తానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పుట్టమధు, బొడిగె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్, పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల శ్రీరాం పేరుతో బెదిరింపులు
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై దాడి అనంతపురం రూరల్ : పరిటాల శ్రీరాం పేరుతో మనోహర్ రెడ్డి అనే వ్యక్తి తన ఇంటిపై దాడి చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. వారి నుంచి ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును కలిసేందుకు వెళ్లాడు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. గురువారం సాయంత్రం 7.30 గంటలకు నగరంలోని తపోవనంలో ఉన్న రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్దకు మనోహర్ నాయుడు 25 మందితో వచ్చాడు. వెంకటాంపల్లి రమేష్‌కు ఇవ్వాల్సిన రూ.7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. భయూందోళనకు గురైన బాధితుడు వారి నుంచి తప్పించుకుని సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. ఎస్పీ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో డీఎస్పీని కలసి తన సమస్యను వివరించాడు. రమేష్ అనే వ్యక్తికి తాను రూ.3 లక్షలు మాత్రమే అప్పు ఉన్నానని, గతంలో తానిచ్చిన ఖాళీ చెక్కు ఆధారంగా రూ.7 లక్షలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కోర్టులోనూ వాదనలు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెలలో తీర్పు వస్తున్న తరుణంలో తన నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు ఇలా దౌర్జన్యం చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలన్నారు. -
టీఆర్ఎస్లో చేరిన భానుప్రసాదరావు
పెద్దపల్లి : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పై పోటీచేసి ఓటమి చెందిన భానుప్రసాద్‌రావు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గులాబీ గూటికి వెళ్లారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సైతం హాజరయ్యారు. భానుప్రసాదరావు అనుచరులుగా ఉన్న ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను సైతం టీఆర్ఎస్లోకి తీసుకువె ళ్లేందు కు సన్నద్ధం అవుతున్నారు భానుప్రసాద్ వెంట సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దపల్లి టీఆర్ఎస్లో నేతల సందడి పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్లో నేతలకు కొదవలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేవతీరా వు, ఇద్దరు, ముగ్గురు రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లిన పొలిట్‌బ్యూరో సభ్యుడు సి.సత్యనారాయణరెడ్డి మళ్లీ గులాబీగూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు అక్కడ పెద్దగా గుర్తింపు లభించకపోవడంతో తిరిగి సొంతపార్టీలో చేరితేనే మేలని భావిస్తున్నారు. ఆయన అనుచరుల్లో కొందరు తనతోపాటే కాంగ్రెస్‌లోకి వెళ్లగా... మరికొందరు ఇప్పటికీ టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. ‘గీట్ల’ తనయుడి సమాలోచనలు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు రాజేందర్‌రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో చర్చలు సాగిస్తున్నారు. రెం డు వారాలుగా ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోం ది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ము కుందరెడ్డి అనుచరవర్గం మనోహర్‌రెడ్డి శిబిరానికి వెళ్లింది. భానుప్రసాదరావు ముందే చేరడంతో సీఎస్సార్, గీట్ల రాజేందర్‌రెడ్డి తమ ప్రయత్నాలు రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది. -
హోండా సర్వీసింగ్ పాయింట్ దగ్ధం
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రం లోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న విఘ్నేశ్వర హోండా షోరూమ్ సర్వీసింగ్ పాయింట్ ఆది వారం దగ్ధమైంది. సాయంత్రం 3 గంటల సమయంలో షోరూమ్ వెనుకభాగంలో ఉన్న సర్వీసింగ్ పాయింట్లో దట్టమైన పోగలు రావడంతో వెనుకభాగంలో ఉన్న ఇళ్లలోని ప్రజలు గమనించి షోరూమ్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హూటాహుటిన చేరుకొని మం టలను ఆర్పేశారు. అప్పటికే లక్షల్లో ఆస్తినష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదు. అయితే ఈ ఘటనపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ 40 లక్షల స్పేర్‌పార్ట్స్ అగ్నికి ఆహుతి సర్వీసింగ్ పాయింట్లో ఉన్న రూ 40 లక్షల విలువైన స్పేర్‌పార్ట్స్ అగ్గికి ఆహుతయ్యాయి. సర్వీసింగ్ పాయింట్లోనే స్పేర్‌పార్ట్స్ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారికి ముందుభాగంలో షోరూమ్ ఉంది. ఘటన సమయంలో షోరూమ్ సిబ్బంది పూజలో ఉన్నారు. కాలిపోయిన 20 బైక్‌లు సర్వీసింగ్ కోసం ఇచ్చిన సుమారు 20 బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. వీటి విలువ సుమారు రూ 6 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కార్తీకపౌర్ణమితో పాటు ఆదివారం సెలవు కావడంతో వర్కర్లు సర్వీసింగ్ పాయింట్లోకి రాలేదని షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. దట్టమైన పొగలు వ్యాపించగానే సర్వీసింగ్ పాయింట్ ముందుభాగంలో ఉన్న మరో 20 కొత్త బైక్‌లను పక్కకు పెట్టారు. ఘటనపై పలు అనుమానాలు.. సర్వీసింగ్ పాయింట్లో అగ్ని ప్రమాదం జర గడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్తీకపౌర్ణమి సందర్భంగా దేవుడి దగ్గర ఉన్న దీపం ప్రమాదవశాత్తు ఆయిల్‌కు అంటుకొని, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉలిక్కిపడిన పరిసరాల ప్రజలు సర్వీసింగ్ పాయింట్ దగ్ధమై మంటలు ఎగిసి పడుతుండడంతో పరిసరాల ప్రజలు ఒక్కసారి గా ఉలిక్కిపడ్డారు. అగ్నికీలలు ఎటువైపు వ్యాపిస్తాయేనని భయాందోళనకు గురయ్యారు. సమీపంలోనే ఉన్న పాఠశాల నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నల్లగొండతో పాటు నకిరేకల్, మిర్యాలగూడ నుంచి అగ్నిమాపక శకటాలు తెప్పించారు. రెండు గంటలలోపు మం టలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఆర్డీఓ పరిశీలన ఘటన స్థలాన్ని నల్లగొండ ఆర్డీఓ జహీర్, సీఐ మనోహర్‌రెడ్డి పరిశీలించారు. మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.