రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై దాడి
అనంతపురం రూరల్ : పరిటాల శ్రీరాం పేరుతో మనోహర్ రెడ్డి అనే వ్యక్తి తన ఇంటిపై దాడి చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. వారి నుంచి ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును కలిసేందుకు వెళ్లాడు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. గురువారం సాయంత్రం 7.30 గంటలకు నగరంలోని తపోవనంలో ఉన్న రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్దకు మనోహర్ నాయుడు 25 మందితో వచ్చాడు. వెంకటాంపల్లి రమేష్‌కు ఇవ్వాల్సిన రూ.7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. భయూందోళనకు గురైన బాధితుడు వారి నుంచి తప్పించుకుని సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. ఎస్పీ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో డీఎస్పీని కలసి తన సమస్యను వివరించాడు. రమేష్ అనే వ్యక్తికి తాను రూ.3 లక్షలు మాత్రమే అప్పు ఉన్నానని, గతంలో తానిచ్చిన ఖాళీ చెక్కు ఆధారంగా రూ.7 లక్షలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కోర్టులోనూ వాదనలు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెలలో తీర్పు వస్తున్న తరుణంలో తన నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు ఇలా దౌర్జన్యం చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలన్నారు.
పరిటాల శ్రీరాం పేరుతో బెదిరింపులు
Published Fri, Dec 26 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement