పెద్దపల్లి నియోజకవర్గం
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సిటింగ్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది విజయ రమణారావును 8466 ఓట్లు తేడాతో ఓడిరచారు. విజయ రమణారావు 2009లో టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టిడిపి, బిజెపి అభ్యర్ధిగా, తదుపరి 2018లో ఆయన కాంగ్రెస్ ఐలో చేరి ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మనోహర్ రెడ్డికి 82765 ఓట్లు సాదించగా, కాంగ్రెస్‌కు 74299 ఓట్లు మాత్రమే వచ్చాయి.మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బిజెపి పక్షాన పోటీచేసి కేవలం ఐదువేల ఓట్లు మాత్రమే పొందారు. దాసరి మనోహర్ రెడ్డి మరోసారి గెలవడం ద్వారా పట్టు నిలబెట్టుకున్నారు. 2014లో డి.మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి , ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాదరావుపై 62677 ఓట్ల భారీ ఆదిక్యతతో గెలుపొందారు.
2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం ఎంత తీవ్రంగా వీచిందో ఈ మెజార్టీ తెలియచేస్తుంది. ఎన్నికల తర్వాత బానూ ప్రసాద్ కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. పెద్దపల్లి శాసనసభ నియోజక వర్గంలో ఇంతవరకు మనోహర్ రెడ్డితో సహా పదిసార్లు రెడ్లు గెలిచారు. ఇద్దరు వెలమ, ఒక బిసి, ఇద్దరు ఎస్సి వర్గ నేతలు గెలుపొందారు. ముకుందరెడ్డి పెద్దపల్లి నుంచి మూడుసార్లు గెలిచారు. రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా, 2004లో టిఆర్‌ఎస్ తరుఫున విజయం సాధించారు. ఆ తరువాత టిఆర్‌ఎస్‌లో అసమ్మతివర్గంలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చిన కేసులో శానససభ్యత్వానికి అనర్హునిగా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి ప్రకటించారు.
అయితే స్పీకరు తీర్పు రావడానికి ఒక రోజు ముందే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. తదుపరి కాంగ్రెస్ ఐలో చేరి 2009లో పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో టిడిపి, టిఆర్‌ఎస్‌లు పొత్తు కుదిరినప్పటికీ, ఒక దశలో పొత్తు ఉంటుందో, ఉండదోనన్న అనుమానంతో టిడిపి తన అభ్యర్దులు పలువురికి టిఆర్‌ఎస్‌కు కేటాయించిన సీట్లలో పోటీకి సిద్దం చేసింది. అలాంటి చోట్లలో ఒకట్కెన పెద్దపల్లిలో టిడిపి పక్షాన బిఫారం ఇచ్చేయడంతో నామినేషన్ వేసిన విజయరమణరావు ఆ పార్టీ అభ్యర్ధిగానే రంగంలో ఉండి2009లో గెలిచారు. 1983లో సంజయ్ విచార్ మంచ్ తరపున టిడిపి గుర్తుపై పోటీచేసి గెలిచిన గోనె ప్రకాశరావు, కొద్దినెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1962లో పెద్దపల్లిలో గెలిచిన బుట్టిరాజారాం 1952లో జగిత్యాల, 57లో సుల్తానా బాద్‌లో, 1967లో నుస్తులాపూర్‌లోను మొత్తం నాలుగుసార్లు గెలిచారు. 1967లో ఇండిపెండెంటుగా గెలిచిన జె.మల్లారెడ్డి, 1972లో కాంగ్రెస్ తరుపున గెలిచారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment