Karimnagar Common Districts
-
ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
సాక్షి, కరీంనగర్: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు– నిబంధనల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.' సెక్షన్ 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోను చేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా, రెండూ అమలుచేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించనివారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 134(అ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ.500 జరిమానా. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశచూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష, అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 49వీ: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే పోలింగ్ ఆఫీసర్‌కు సదరు ఓటరు 49–వీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అధికారం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. ఇవి కూడా చదవండి: కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ -
ఎల్లలు దాటిన రాజకీయ చైతన్యం! ఎన్నారై వాయిస్..
సాక్షి, కరీంనగర్: 'ఏ దేశమేగినా ఎక్కడున్నా ఓటే తమ అభిమతమని చాటుతున్నారీ యువత. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగమే తమ నినాదమని ధీమాగా చెబుతున్నారు. బాల్య వయసులో పాఠ్యాంశంలోని అంశాలు, యువ వయసులో జిల్లా, రాష్ట్ర, జాతీయ రాజకీయాలను గమనిస్తున్న సదరు యువత ఓటెత్తుతామని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో ఉపాధి పొందుతున్నారు. ఏళ్లుగా అక్కడే స్థిరపడగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలొచ్చాయంటే స్వదేశీబాట పడుతున్నారు. జిల్లా నుంచి వేల సంఖ్యలో అమెరికా, స్విట్జర్లాండ్, లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, రష్యా తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. సదరు దేశాల్లో ఓటు ప్రాధాన్యమెక్కు వ. ఓటేయకుంటే శిక్షలున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల క్రమంలో వందల మంది కరీంనగర్‌కు చేరుకోగా.. ఓటేసేందుకు మేమొచ్చాం.. మీరు ఓటేసేందుకు వస్తారుగా అంటూ సహచర స్నేహితులను చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా వారి వాయిస్ వినిపించారు.' రాజకీయాలంటే ఆసక్తి! అమెరికాలోని పెన్సుల్‌వెనియా ప్రాంతంలో స్థిరపడిన ఉనుకొండ రాజీవ్‌కుమార్‌ది నగరంలోని విద్యానగర్. సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నాడు. కంపెనీ అమెరికాలో అవకాశం కల్పించగా.. తన ప్రతిభతో అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నికలొచ్చాయంటే రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటాడు. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల నేర చరిత్ర తదితర వివరాలను ఆరా తీస్తూనే ప్రచార సరళిని పరిశీలిస్తుంటాడు. తీరా పోలింగ్ సమయానికి భారత్ రావడం.. ఓటేయడం ప్రతీసారి చేస్తుంటానని, ఇటీవలే మన దేశానికి వచ్చానని చెబుతున్నారు రాజీవ్. -
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
కరీంనగర్‌కు రూ.9వేల కోట్లు తెచ్చా! : బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: ‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.9వేల కోట్లు తెచ్చిన. మీ ఆశీర్వాదంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం పోరాడిన. 74 కేసులు పెట్టిండ్రు. మరి కమలాకర్ ఏం సాధించిండు? ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నయి. బీసీ స్టడీసర్కిల్ శిక్షణా తరగతులు, విద్యార్థుల్లేక వెక్కరిస్తోంది. తీగల వంతెన వాహనాలు వెళ్లడానికి పనికి రాకుండా వీక్లీడాన్స్ క్లబ్‌లా తయారైంది. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ను ప్రశ్నించారు. కరీంనగర్‌లోని అశోక్‌నగర్, గోపాల్‌పూర్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ మంత్రిగా ఉంటూ ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేని వ్యక్తికి ఓట్లేలా వేస్తారని ప్రశ్నించారు. కేంద్రం 2.4 లక్షల ఇళ్లు మంజూరు చేసినా కేసీఆర్, గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకు ఒక్కఇల్లు కట్టివ్వకుండా ఆ నిధులు దారి మళ్లించారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులది భూ కబ్జాల చరిత్ర అన్నారు. వాళ్లపై ఉన్న కేసులన్నీ కబ్జాలు, ఫోర్జరీలు, అక్రమ సంపాదన, ఐటీ కేసులే అని, ఎన్నికలైపోగానే వాళ్లద్దరూ ఒక్కటై రాజీ చేసుకుంటారని అన్నారు. అశోక్‌నగర్‌లో గుడిని కూల్చేసేందుకు గంగుల కమలాకర్ సిద్ధమైతే అడ్డుకుంది తానేనని అన్నారు. అనంతరం జ్యోతినగర్, చైతన్యపురి, విద్యానగర్‌కు చెందిన సుమారు 500మంది యువత బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బండి వెంటే కురుమ సంఘం.. బండి సంజయ్ కుమార్‌కు గోపాల్పూర్ ప్రజలు నీరాజనం పట్టారు. ఊరంతా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్వారితో కలిసి దాదాపు అరగంటకుపైగా ముచ్చటించారు. కురుమ సంఘం కమ్యూనిటీ హాల్‌ను సందర్శించారు. బండి సంజయ్ వెంటే ఉంటామని కురుమ సంఘంవాళ్లు హామీ ఇచ్చారు. 27న లక్ష మందితో మోదీ సభ ఈనెల 27న కరీంనగర్‌లోని ఎస్సారార్ మైదానంలో జరిగే బహిరంగసభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్న నేపథ్యంలో విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రధానంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా హాజరుకావాలని పిలు పునిచ్చారు. శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులు, శక్తికేంద్ర ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. మోదీసభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి లక్షమంది తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సుమారు 50వేల మంది కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అవకా శం ఉందన్నారు. సభకు హాజరయ్యే ప్రజల కు నీళ్లు, ఇతర సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంవద్దని, ఆ బాధ్యత సంబంధిత మండల నాయకులపైనే ఉందని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్చార్జి మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
'నారీ.. ప్రాధాన్యమేది?' ఓట్లున్నా.. సీట్లు లేవు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి చెప్పే మాటలు బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చే సరికి ఎవరూ పాటించడం లేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా.. అవకాశాలు లేక మహిళలు అట్టడుగునే ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే.. మొత్తం ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఆ మేరకు రాజకీయంగా మాత్రం వారికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వలేదు. శాసనకర్తలు మహిళలు ఉంటే ఆ వర్గానికి మరింత న్యాయం జరుగుతుందనేది అందరూ ఏకీభవించాల్సిన వాస్తవం. మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్న ప్రస్తుత ఆధునిక యుగంలో రాజకీయాల్లో మాత్రం వారికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదనే చెప్పవచ్చు. ఇందుకు ప్రస్తుత శాసనసభ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రధానపార్టీల నుంచి 36 మంది బరిలో నిలిస్తే అందులో మహిళలు కేవలం ఐదుగురు మాత్రమే ఉండడం ఆయా పార్టీల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలకు అసలే ప్రాధాన్యం దక్కకపోగా, బీజేపీ నుంచి రామగుండం, సిరిసిల్ల, చొప్పదండి, జగిత్యాల సీట్లు అతివలకు కేటాయించారు. పెద్దపల్లి నుంచి బీఎస్పీ మహిళను బరిలో నిలపింది. బీజేపీ నాలుగు స్థానాలు కేటాయించి అగ్రస్థానంలో నిలిచింది. మహిళలు సైతం స్వతంత్రంగానైనా బరిలో నిలిచే సాహసం చేయకపోవడం సమాజంలో మహిళలంటే వివక్ష దూరం కాలేదన్న వాదనకు తెరలేపుతోంది. అన్ని జిల్లాల్లో ఎక్కువే.. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములు మహిళలే శాసించనున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. రాజకీయ పార్టీలు మహిళల జనాభా, ఓటర్లకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు కల్పించడం లేదన్న అసంతృప్తి ఉంది. 50 శాతం రిజర్వేషన్ల పుణ్యమాని స్థానిక సంస్థల్లో సగానికిపైగా ప్రజాప్రతినిధులు మహిళలకు అవకాశం దక్కుతోంది. కానీ.. అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం మహిళలకు ప్రాధాన్యం దక్కడం లేదు. రాజకీయ పార్టీలు.. వారికి పోటీ చేసేందుకు ఇస్తున్న సీట్లు, అందులో వారు గెలిచే స్థానాలు.. పురుషులతో పోల్చితే చాలా తక్కువగా ఉంటున్నాయనే విమర్శ ఉంది. దేశంలో ఇలా.. 1998–2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 21,161 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. వారిలో మహిళల సంఖ్య 1,584 మాత్రమే. ఏపీ, తెలంగాణ సహా దేశంలో 19 రాష్ట్రాల్లో మహిళా శాసనసభ్యులు 10 శాతానికి మించి లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అందులో బరిలో నిలిచిన మహిళల సంఖ్య 140 మాత్రమే. కానీ.. అందులో గెలిచిన మహిళల సంఖ్య కేవలం ఆరుమాత్రమే. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో... 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్, మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, మహేశ్వరం నుంచి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, ఇల్లందు నుంచి బానోతు హరిప్రియ ఎన్నికయ్యారు. ఈ లెక్కన 119 నియోజకవర్గాల్లో ఎన్నికైన మహిళా శాసనసభ్యుల సంఖ్య కేవలం ఐదు శాతం మాత్రమే. 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది. అది చట్టంగా మార్చితే మహిళలకు ఆ మేరకు సీట్లు కేటాయించడం తప్పనిసరి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2027 తర్వాతే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు వస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చట్టం అమల్లోకి వస్తే 12 నియోజకవర్గాలకు గాను ప్రతీ పార్టీ సుమారు నాలుగేసి స్థానాలు విధిగా కేటాయించాల్సి ఉంటుంది. -
ఎమ్మెల్సీ కోసం ‘పాడి’ కాంగ్రెస్‌కు ద్రోహం చేశారు: రేవంత్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట/వనస్థలిపురం/ముషిరాబాద్/దిల్సుఖ్నగర్: ‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెల్లని నోటు. దానిని జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు దారులను ఓడించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వవద్దని శపథం చేశానని, కాంగ్రెస్‌ను మోసం చేసిన మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని, దొరలపాలన పోవాలంటే ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో బలిదానాలతో తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్ బంగారు తెలంగాణగా మారుస్తాడనుకుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. విద్యార్థుల బలిదానాలు ఆపాలనే సంకల్పంతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ మాత్రం నిరుద్యోగులు, ఉద్యోగులను వంచిస్తూ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట, రేణికుంటలో, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన కాంగ్రెస్ ప్రజావిజయభేరి సభల్లో, హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ముషీరాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో రేవంత్ ప్రసంగించారు. ఈటలది నయవంచన.. ఏడుసార్లు హుజూరాబాద్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజలను నయవంచనకు గురి చేశారని రేవంత్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం నయాపైసా తీసుకురాలేని అసమర్థ నాయకుడని దుయ్యబట్టారు. దొంగ ఏడ్పులు ఏడ్చే ఈటల ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడేమో హుజూరాబాద్ ప్రజలను విడిచి గజ్వేల్‌లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ హుజూరాబాద్‌లో కోవర్టులు (పరోక్షంగా పాడి కౌశిక్) పోటీ చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాడి కౌశిక్ ఎమ్మెల్సీ పదవి, కమీషన్ల కోసం కాంగ్రెస్‌కు ద్రోహం చేశారన్నారు. పిల్లి తన పిల్లల రక్షణ కోసం ఇల్లిల్లూ మార్చినట్లు.. కేసీఆర్ తాను, తన కుటుంబ సభ్యులకు పదవుల కోసం నియోజకవర్గాలు మారుస్తున్నారని ఎద్దేవాచేశారు. ఉద్యమ సమయంలో సిద్దిపేటలో ఉన్న కేసీఆర్ తర్వాత కరీంనగర్, మహబూబ్‌నగర్, గజ్వేల్‌కు చేరారని, ఇప్పుడు కామారెడ్డికి పారిపోయారన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాను కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామన్నారు. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తా రాష్ట్రంలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు కాబోతుందని, కేసీఆర్ రిటైర్ అవుతారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయనకు కూడా పింఛన్ ఇస్తామని, చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని చెప్పారు. కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండటానికి కచ్చితంగా ఇల్లు కట్టిస్తానన్నారు. కేసీఆర్ దోచుకున్న రూ.లక్ష కోట్లు కక్కిస్తానని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ అయిందని, ప్రజలకు బొందల తెలంగాణగా మారిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర పెద్ద జీతగానిలాగా ఉన్నాడని విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు దుబ్బాక అభివృద్ధికి ఏమైనా కృషి చేశారా అని ప్రశ్నించారు. 2018లో ఎల్బీనగర్లో మీరు సుదీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, బీఆర్ఎస్కు అమ్ముడుపోయారని దునుమాడారు. ఎల్బీనగర్లో మధుయాష్కీగౌడ్‌ను 30 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌లో పేదలకు ఏ కష్టం వచ్చినా అంజన్‌కుమార్‌యాదవ్ అందుబాటులో ఉంటారని, వరుణ దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అంజన్‌ను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రణవ్ (హుజూరాబాద్), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), చెరుకు శ్రీనివాస్ రెడ్డి (దుబ్బాక), మధుయాష్కీగౌడ్ (ఎల్బీనగర్) తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా భూములపై బుల్డోజర్లు దించుతా..
కరీంనగర్ టౌన్/ కరీంనగర్ రూరల్: ‘ప్రభుత్వ స్థలాలేమైనా మీ అయ్య జాగీరనుకున్నరా? నేనెవ్వరికీ భయపడ. బరాబర్ చెబుతున్నా. బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన స్థలాల్లో బుల్డోజర్లు దించుతా.. వాటిని స్వాదీనపర్చుకుని ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించి పంచుతా’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ ప్రకటించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, తనను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కరీంనగర్ మండలంలోని తాహెర్‌కొండాపూర్, బహుదూర్‌ఖాన్‌పేట, నగునూరు గ్రామాలతోపాటు కరీంనగర్ 17, 38, 39వ డివిజన్లలో సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులు ఆయనకు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి నగునూరు, విద్యానగర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టించింది. తెలంగాణకు 2.40 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. వాటిని కట్టిస్తే మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ, కేసీఆర్ ఇంతవరకూ ఒక్క ఇల్లు కూడా పేదలకు పంచలేదు. ఆ నిధులు దారి మళ్లించిండు. నగునూరులోని దుర్గామాత గుడి సమీపంలో 669 సర్వే నంబర్లో 26 ఎకరాలను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు. ఆ భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తే బాగుండేది కదా.. నేను గెలిచాక కబ్జాకోరులపై బుల్డోజర్లు దించుతా.. ఆ భూములన్నీ పేదలకు పంచుతా’అని పేర్కొన్నారు. ‘కరీంనగర్లో పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల చరిత్రను పరిశీలించండి.. ఎవరు ప్రజల కోసం పోరా డుతున్నారో, ఎవరు భూకబ్జాలకు పాల్పడుతున్నా రో బేరీజు వేయండి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలిద్దరూ భూకబ్జాదారులే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చే స్తున్నాయి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓట్లేస్తే అవన్నీ డ్రైనేజీలో వేసినట్లే.. దయచేసి కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని కోరుతున్నా.. నన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కలిసి కుట్ర చేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. నిరూపిస్తే ఉరేసుకుంటా.. లేకపోతే మీరు ఏ శిక్షకైనా సిద్ధమా?’అంటూ సవాల్ విసిరారు. బియ్యం గోల్మాల్ నిరూపించేందుకు సిద్ధం! మంత్రి గంగుల కమలాకర్ బియ్యం టెండర్లలో రూ.1,300 కోట్ల గోల్మాల్ చేశారని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సవాల్ చేశారు. ఆయన తప్పు చేయకుంటే దేవుని గుడిలో ప్రమాణం చేయాలన్నారు. వడగండ్ల వానతో పంటలు నష్టపోతే ఎకరానికి రూ.10 వేలిస్తానన్న కేసీఆర్ ఇక్కడ ఇవ్వకుండా పంజాబ్ రైతులకు ఇచ్చా రని బండి మండిపడ్డారు. తనకు సంబంధించిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లను కమలాకర్ తీసుకొస్తే ప్రజలకు రాసిస్తానని, ఆయన అక్రమ ఆస్తులను ప్రజలకు పంచే దమ్ముందా అని ప్రశ్నించారు. -
ప్రజల కోసం పోరాడుతున్నాం.. మద్దతివ్వండి
కరీంనగర్ టౌన్: నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని రెండుసార్లు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. బుధవారం కరీంనగర్‌లోని రేకుర్తి, మంకమ్మతోటలో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 2,40,000 ఇళ్లు ఇస్తే కేసీఆర్ ఒక్కఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మాత్రం 100 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ప్రశ్నించిన పాపానికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేశారని, పేపర్ లీకేజీలపై తాను కొట్లాడితే... తన ఇంటిపై వందల మంది పోలీసులతో దాడి చేయించి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్!
సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు, ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో, ఇద్దరు నేతలకు నిరసన సెగ తగిలింది. వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలంలో ఏఆర్పీ క్యాంపులో షకీల్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఎందుకు గ్రామంలోకి వచ్చారని షకీల్‌ను నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక, షకీల్‌కు నిరసన సెగపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడిని కవిత తీవ్రంగా ఖండించారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. 60 లక్షల మంది గులాబీ సైన్యం ముందు మీరెంత?. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజాక్షేత్రంలో దాడులను ధీటుగా ఎదుర్కొంటారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. ఎల్లారెడిలో బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్‌కు సైతం నిరసన సెగ తగింది. లక్ష్మాపూర్‌లో సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా గడిచిన ఐదేళ్లలో సమస్యలు పట్టించుకోలేదని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఊరి మీదుగా వెళ్తూ కనీసం ఒక్కసారి కూడా ఆగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
వీడియో డిలీట్ చెయ్‌రా ఫస్ట్..! నువ్వేడున్నావ్..? చౌరస్తా కాడికి రా..
సాక్షి, కరీంనగర్: నువ్వు వీడియో డిలీట్ చెయ్‌రా ఫస్ట్.. ఏడున్నవ్ నువ్వు.. చౌరస్తా కాడికి రా.. అంటూ ఓ అధికార పార్టీ నేత తమ్ముడు ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి దశరథంకు బెదిరింపు కాల్ చేయడం శుక్రవారం సిరిసిల్లలో వైరలయ్యింది. బాధితుడు విలేకరులతో తన గోడు వెలిబు చ్చాడు. సిరిసిల్ల పట్టణంలో గురువారం రాత్రి 9.30 గంటలకు పట్టణానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత తమ్ముడు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడు. పర్మిట్ లేని ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లడాన్ని తాను ఫోన్లో వీడియో తీయగా.. శుక్రవారం ఉదయం తనకు ఫోన్ చేసి వీడియో నువ్వు ఎందుకు తీసినవ్.. వీడియో డిలీట్ చేయ్ అంటూ పరుష పదజాలంతో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. సిరిసిల్ల మానేరు నుంచి ఎలాంటి వేబిల్లులు లేకుండానే రాత్రివేళలో ఇసుకను తరలించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని, బూతు పురాణం అందుకున్న అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ఆధారాలతో జిల్లా ఎస్పీ, డీఎస్పీ, టౌన్ సీఐలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఫోన్లో ఇరువురి సంభాషణ.. అధికార పార్టీకి చెందిన వ్యక్తి బెదిరింపులు.. తిట్లు.. 150 ట్రాక్టర్లు నడుస్తున్నయ్.. కేటీఆర్ పేరెందుకు తీస్తున్నవ్ అంటూ సాగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరలవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. -
హుస్నాబాద్: బీఆర్ఎస్కు అవే మైనస్సా?
2014 నుండి హుస్నాబాద్ నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుండి వోడితల సతీష్ కుమార్ గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రెడ్డి, రావు, కాపు, ముదిరాజ్, గిరిజన సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. కులాల వారిగా ఓటర్ల శాతం ► బిసి: 60% ► ఎస్సీ: 15% ► ఎస్టీ: 10% ► ఇతరులు: 15% పార్టీల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ లేరు కాంగ్రెస్‌లో కూడా ఆశావాహులు లేరు బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు సీపీఐ కూడా పోటీకి ఆసక్తి చూపుతుంది ఆశావహులు బీఆర్ఎస్ నుంచి వోడితల సతీష్ కుమార్ కాంగ్రెస్ నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బీజేపీ నుండి ఇద్దరు (బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు) సీపీఐ నుండి చాడ వెంకటరెడ్డి పోటీకి సిద్దమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు.. గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించలేకపోవటం IOC భవనంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా హుస్నాబాద్‌లో మినీ స్టేడియం, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయలేకపోవడం గ్రామాల పరిధిలో పూర్తి చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవటం.. అధికార పార్టీ అభ్యర్థి, అనుకూలతలు గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చటం వోడితల సతీష్ కుమార్.. సౌమ్యుడు, మృదుస్వభావ వ్యక్తిత్వం కలిగిన వారవటం. ప్రతికూలతలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంలో సమయపాలన పాటించడనే విమర్శ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అనుకూలతలు గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రారంభించకపోవటం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం.. ప్రతికూలతలు.. అధికారిక పార్టీని గ్రామ స్థాయిలో ఎదురుకొలేకపోవటం. -
రామగుండం: ఇక్కడి తీర్పు విలక్షణం.. ఈసారి కార్మికుల కన్ను ఎవరిపై?
రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. కార్మికులు ఎవరిని పాపం అంటే వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇక్కడ కార్మిక నాడి ఎవరికీ అంతుపట్టదు. 2004 వరకు మేడారం నియోజకవర్గం 2009లో రామగుండం నియోజకవర్గంగా మారింది. ► 2009లో జనరల్ సీట్‌గా మారిన రామగుండం నియోజకవర్గంలో 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కార్మికులు గెలిపించుకున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన సత్యనారాయణ.. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన సత్యనారాయణ 2014లో టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. ► 2018 ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా కోరుకంటి చందర్ సత్యనారాయణపై వెయ్యి ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. రామగుండం ముఖచిత్రం రామగుండం నియోజకవర్గంలో గతంలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు రామగుండం మండలం ఉండేది. కొత్తజిల్లాల విభజన తర్వాత రామగుండం కార్పోరేషన్‌తో పాటు అంతర్గాం మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి . ► రామగుండం కార్పోరేషన్లో 50 డివిజన్లు, పాలకుర్తి అంతార్గం రామగుండం లో 2018 ఆగస్టు వరకు లక్ష 61 వేల 850 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుషులు 83,458, స్తీలు 78,368 కాగా గత ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల పైచిలుకు ఉంటే అందులో 60 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం లక్ష 61 వేల 850 మంది మాత్రమే ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పద్మశాలి గౌడ కాపు పెరిక ముదిరాజ్ చాకలి కులస్తులు ఉన్నారు.ఇందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే బలంగా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో ఓట్ల శాతం తక్కువగా నమోదవుతున్నాయి. ఎమ్మెల్యే బలం బలహీనతలు ప్రజల్లో ఉద్యమకారునిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాలు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేలు ఇరకాటంలోకి నెట్టు తున్నాయి. ఇసుక దందా బూడిద దందా తో పాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జనంలో ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉంది. పార్టీలో మొదటి నుండి పని చేసిన ఉద్యమకారులను ద్వితీయ శ్రేణి నాయకులను తొక్క పెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి, మిర్యాల రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేల తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ రావడం వల్ల సప్తగిరి కాలనీ, న్యూ మారేడుపల్లి ప్రధాన సమస్యగా మారాయి. నీటిలో ఇండ్లు మునిగిన గాని ఇప్పటివరకి సమస్య సమస్యగానే ఉంది.పనులు ఎక్కడ వేసిన గొంగలి లా ఉన్నాయి. బీఆర్.ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు వ్యతిరేక వర్గీయులు పోరాటాలు ఈసారి ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం. ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండవచ్చు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు! బీఆర్ఎస్ కోరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాగూర్ మక్కాన్‌సింగ్ జనక్ ప్రసాద్ ( ఐ.ఎన్.టి.యు. సి.) బీజెపి సోమరపు సత్యనారాయణ (మాజీ ఆర్టీసీ చైర్మన్) కౌశిక్ హరి కాసిపేట లింగయ్య (మాజీ ఎమ్మెల్యే) భౌగోళిక పరిస్థితులు: రామగుండం నియోజకవర్గంలో రాముని గుండాలు ఇక్కడ ప్రత్యేకం జనగామ శివారులో 500 సంవత్సారాల క్రితం ఉన్నా త్రిలింగ రాజరాజేశ్వర స్వామి మూడు లింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకం. -
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్‌గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
పెద్దపల్లి: గెలుపు, ఓటములు శాసించేది వారే.. మరి టికెట్ దక్కెనా?
ఈ నియోజకవుర్గంలో పెద్దపల్లి అతిపెద్ద మండలంగా నిలుస్తుంది. పెద్దపల్లి గెలుపోవటములను శాసించేది కూడా ఇదే మండలం. ఈ మండల కేంద్రంలో అత్యధికంగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఉంటాయి. ముస్లిం మైనారిటీలు ఏ పార్టీకైతే ఓటు వేస్తారో ఆ పార్టీ విజయం సులభం అవుతుంది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలను ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగాయి. కాంగ్రెస్ 6, టిడిపి 4, బీఆర్ఎస్ 2, బీజెపి 1, పీడీఎఫ్ 1, స్వతంత్య్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేది బీసీ ఓటర్లు. కానీ చాలా కాలం నుండి ఈ నియోజకవర్గ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని అన్ని పార్టీల ఆశావాహుల నుండి ఒత్తిడి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీసీలకు టికెట్ కేటాయించాలని ఆయా పార్టీల అధిష్టానాలకు ఒత్తిళ్లు వస్తున్నాయి. ► బీసీలు : 70% ► ఎస్సీలు: 14% ► ఇతరులు: 16% ఇక్కడ ఎప్పుడు హోరాహోరీ పోటే..! 1983 ఎన్నికలు: ఈ ఎన్నికలలో సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీచేసిన గోనె ప్రకాష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డిపై విజయం సాధించారు. 1984లో గోనె ప్రకాష్ రావు రాజీనామా చేయుటతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. 1984 ఉప ఎన్నికలు: 1983లో విజయం సాధించిన గోనె ప్రకాష్ రావు (సంజయ్ విచార్ మంచ్) రాజీనామా చేయుటంతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల రమణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2009 ఎన్నికలు: 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ రమణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ముకుందరెడ్డిపై 23,483 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున గీట్ల ముకుందరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి వేముల పద్మావతి, లోక్‌సత్తా పార్టి తరఫున శ్రీనివాసరావు పోటీచేశారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన భానుప్రసాదరావుపై 62677 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున దాసరి మనోహర్ రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు చేశారు. తెరాసకు చెందిన దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు పై 8,466 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యేగా.. దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. రాజకీయ నాయకుడ. ఈయన ట్రినిటీ విద్యాసంస్థల అధినేతగానూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కాసులపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఎంఏ, బీఈడి వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత పలు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. అతని తండ్రి పేరు రామ్ రెడ్డి. దాసరి ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. మనోహర్ రెడ్డి ఎమ్.ఎ, బి.ఎడ్ డిగ్రీని కలిగి ఉన్నారు. వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ,సామాజిక సేవలో అతని ఆసక్తి రాజకీయాల్లోకి తన ప్రవేశానికి దారితీసింది. తెలంగాణ తరపున శాసనసభకు పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి. 2009-11 కాలంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరపున పోటీచేసి విజయం సాధించారు. దాసరి మనోహర్‌రెడ్డికి ఉన్న ప్రతికూల అంశాల కలగా మిగిలిన పెద్దపల్లి బస్సు డిపో ఎస్సారెస్పి ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందకపోవడం. పెద్దపల్లి, సుల్తానాబాద్ రాజీవ్ రహదారి నుండి పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారుల సమస్య. పేదలకు అందని ద్రాక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు. మానేరు వాగు పై ఏర్పడ్డ ఇసుక రీచుల నుండి భారీగా ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు. నియోజకవర్గం లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని తానై వ్యవహారిస్తారని, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల నిరుత్సాహం. చెరువుల పూడికతీత పేరిట స్థానిక ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకుంటున్నారని ఆరోపణలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను పక్కన పెట్టి వలస నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ నాయకుల అసంతృప్తి. పెద్దపల్లి నియోజకవర్గం లోని రైస్ మిల్లుల నుండి విలువడే కాలుష్య నివారణ కు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు. రైస్ మిల్లు వద్ద ముడుపులు తీసుకుని తరుగు పేయుట కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టిన పట్టించుకోలేదని అపవాదు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సానుకూల అంశాలు: పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం పెద్దపల్లి పట్టణ సుందరీకరణ లో భాగంగా రోడ్ల విస్తరణ. పెద్దపాలి పట్టణ ప్రజలకు త్రాగు నీటి సమస్య తీర్చడం. సుల్తానాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి లో మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీపడే ప్రధాన పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పార్టీ... అధికార బిఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దాసరి మనోహర్ రెడ్డికే మరోసారి అధిష్టానం టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ.... తెలుగుదేశం పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్న ఓదెల జడ్పిటిసి సభ్యుడు గంట రాములు, పెద్దపల్లి మాజీ జెడ్పిటిసి గతంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఈర్ల కొమురయ్య, తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సైతం కాంగ్రెస్ లో చేరి పార్టీ నుండి పోటీలో నిలిచే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ.... బిజెపి పార్టీ నుండి తెలుగుదేశం అలయన్స్‌లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ స్థాయి నాయకులతో మంచి సంబంధాలు కలిగిన దుగ్యాల ప్రదీప్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే బిజెపిలో చేరిన గొట్టముక్కుల సురేష్ రెడ్డి లు బిజెపి నుండి టికెట్ రేసులో ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ... ఇటీవల బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరిన దాసరి ఉష ఇప్పటికే గ్రామస్థాయిలో పర్యటిస్తూ బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భౌగోళిక పరిస్థితులు: ► పెద్దపల్లి నియోజకవర్గం సరిహద్దుల నుండి మానేరు నది ప్రవహిస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తుంది. ఇటీవల కాలంలో మానేరు నదిలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో స్థానిక రైతులు అధికార పార్టీపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ► పెద్దపల్లి నియోజకవర్గానికి మరో వైపు రామగిరి పర్వతాలు మంచి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ► సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. ► నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన సబితం జలపాతం (వాటర్ ఫాల్స్) పర్యాటకులను ఆకర్షిస్తుంది. -
Sircilla: కేటీఆర్‌ను ఢీ కొట్టుడు కష్టమే!
సిరిసిల్ల నియోజక వర్గంలో ప్రధానముగా పద్మశాలి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు కులస్థులు ఎక్కువ. మిగతా బీసీ కులాలు కూడా నియోజకవర్గములో అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా షెడ్యూల్ కాస్ట్ (17శాతం) వారు కూడా నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. పార్టీల వారిగా పోటీ చేసే అభ్యర్థులు! బీఆర్ఎస్ కేటీఆర్ బీజెపి కటకం మృత్యుంజయం లగిశెట్టి శ్రీనివాస్ ఆవునూరి రమాకాంత్ రావు రెడ్డెబోయిన. గోపి మోర. శ్రీనివాస్ కాంగ్రెస్: కేకే మహేందర్ రెడ్డి చీటి ఉమేష్ రావు సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గౌడ్. కేటీఆర్ మంత్రి అయిన తర్వాత సిరిసిల్లకు జరిగిన అభివృద్ధి పనులు సిరిసిల్ల చేనేత కార్మికుల కొరకు బతుకమ్మ చీరలు ఆర్ వి ఎం క్లాత్ సిరిసిల్లలోనే ఉత్పత్తి నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు, ఐటిఐ కాలేజ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆపరాల్ పార్కు నిర్మాణం జరుగుతుంది వర్కర్ టు ఓనర్ స్కీం షేడ్స్ నిర్మాణంలో ఉన్నవి అగ్రికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ కలెక్టర్ చౌరస్తా నుండి వెంకటాపూర్ వరకు 11 కిలోమీటర్ల ఫోర్ లైన్ బైపాస్ డబుల్ రోడ్డు ప్రారంభం సిద్ధంగా ఉంది. సివిల్ హాస్పిటల్ లో డయాలసిస్‌సెంటర్ మరియు సిటీ స్కాన్ ఆక్సిజన్ ప్లాంట్, అదనంగా మరో వంద పడకల ఆసుపత్రి గంభరావుపేట మండలంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రారంభం రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సిరిసిల్ల నేత కార్మికుల కొరకు ఉచిత ప్రమాద బీమా మంత్రి కేటీఆర్ సొంత డబ్బులతో ప్రీమియం అధునాతన వ్యవసాయ మార్కెట్‌తో పాటు డిపిఓ భవనం నిర్మాణం పూర్తి. మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో ఉంది. ఇక్కడ ఆధునిక మరమగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, పరిశోధన సంస్థ నిర్మాణంలో ఉంది.మధ్యమానేరు బ్యాక్ వాటర్ . తో సిరిసిల్ల పట్టణానికి పర్యాటక శోభ.... సిరిసిల్ల నియోజకవర్గ సమస్యలు : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి యారన్ డిపో లేకపోవడం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి వస్త్రాన్ని ఎగుమతి చేసేందుకు సరైన మార్కెట్ వసతి లేకపోవడం. చిన్న కుటీర మరమగ్గాల పరిశ్రమకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఉచిత విధ్యుత్ సరఫరా లేదు. బతుకమ్మ చీరల వలన సంవత్సరములో కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే పని, మిగతా నెలలు సరైన పనిలేకపోవడం. నియోజక వర్గములో 9వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగడం. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో ఉన్నత చదువుల కోసం డిగ్ర కళాశాలలు లేకపోవడం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో 30 పడకల ఆసుపత్రి లేకపోవడం వలన ఇబ్బందులు. బీడీ కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ నిర్మిస్తామన్న ఆసుపత్రి ఇప్పటివరకు లేకపోవడం. -
వేములవాడ: బీఆర్ఎస్పై ‘రాజన్న’ ప్రభావం..!
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేములవాడ 2009లో ఏర్పడింది. 2009లో మహాకూటమిలో భాగంగా వేములవాడ నుండి టిడిపి పార్టీ నుండి చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్‌పై 1821 ఓట్లతో గెలుపొందారు. 2009 సంవత్సరంలో తెలంగాణ ఇచ్చినట్లుగానే ఇచ్చి వెనక్కి తీసుకున్న నెపంతో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన రమేశ్ బాబు టీ(బీ)ఆర్ఎస్ పార్టీ నుండి 2010లో ఉప ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై గెలిచారు... .. 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేయగా బిజెపి నుండి బరిలో ఉన్న ఆది శ్రీనివాస పై 5 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందారు. వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొమ్మ వెంకటేశ్వర్లు 14 వేల వరకు ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 28 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వేములవాడ నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి టిఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే ఉంది. ఇప్పటివరకు ప్రధాన ప్రత్యర్థిగా ఆది శ్రీనివాస్ మాత్రమే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దేని నుండి పోటీ చేసిన ప్రత్యర్థిగా కనిపిస్తున్నాడు అది. చెన్నమనేని రమేశ్ బాబు తండ్రి రాజేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిజెపికి దాదాపు 20 వేల పైగా ఈ నియోజకవర్గం నుండి వచ్చింది. వేములవాడ నియోజకవర్గంలో ముఖ్యంగా కోనరావుపేట మండలం ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది. బిజెపి నాయకుడు చిన్నమనేని విద్యాసాగర్ రావు అలాగే లక్ష్మి నరసింహ రావు రమేష్ బాబు మండలం కోనరావుపేట కావడంతో ఆసక్తి నెలకొంది. అత్యంత ప్రభావితం చేసే గ్రామంగా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామం ఉంది. కనీసం అత్తగారి గ్రామాన్ని కూడా పట్టించుకోని కేసీఆర్: ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. దాంతోపాటు మండలంలో ప్రధానంగా ఎనిమిది ముంపు గ్రామాలు ఉండగా..వాటికి ఇవ్వవలసిన ఆర్.ఆర్. ప్యాకేజీ ఇవ్వకపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారు గ్రామమైన కొదురుపాక గ్రామాన్ని కూడా పట్టించుకోలేదనే వాదన ఉంది. ఈ గ్రామం కూడా ముంపు గ్రామాల్లో ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంతేకాదు ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం BRS పార్టీకి మైనస్‌గా అనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుండి గతం నుండి పోటీ చేసిన ఆది శ్రీనివాస్ ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తోనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజన్న అభివృద్ధి ఏది? వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అలాగే చెలిమెడ లక్ష్మీనరసింహారావు మనోహర్ రెడ్డి ఎన్నారై గోలి మోహన్ టికెట్ ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ అభివృద్ధి చేయకపోవడం బి ఆర్ ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పుకోవచ్చు, అలాగే కేటీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటున్న గోలి మోహన్ టికెట్ ఆశిస్తుండగా సీనియర్ నేతగా మనోహర్ రెడ్డి టికెట్ రేసు లో ఉన్నాడు, ఒకవేళ టిఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని అభ్యర్థి ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి పార్టీలో త్రిముఖ పోటీ? బిజెపి పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారిలో భాజాప సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు అలాగే ప్రతాపరామకృష్ణుడు సీనియర్ నేత తుల ఉమా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ రావుకు టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి చేయని అభివృద్ధిని క్యాష్ చేసుకొని ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో నిలిచి గెలుపు బాటలో ఉండాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలం ఆది శ్రీనివాస మాత్రమే బరిలో ఉంటున్నాడు. రెబల్ బెడద్ కూడా లేకపోవడంతో, కాంగ్రెస్ టికెట్ ఆది శ్రీనివాసకి కన్ఫాం చేస్తున్నట్టు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు: వేములావాడ నియోజకవర్గం లో ప్రధాన ఆలయం రాజన్న ఆలయంగా చెప్పవచ్చు,నాంపల్లి పర్యాటక కేంద్రంగా ఉంది గతంలో బీజేపి ఎంపీ గా ఉన్నప్పుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు నాంపల్లిని పర్యాటక కేంద్రంగా చేసారు. అధికార పార్టీపై ‘రాజన్న’ ప్రభావం ముఖ్యంగా రాజన్న ఆలయానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ 100 కోట్లు అభివృద్ధికి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, గ్రామాల ప్రజలను పట్టించుకోకపోవడం వారికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పవచ్చు. -
ధర్మపురి: అధికారిక పార్టీకి అవే మైనస్? వారి తీర్పే కీలకం
ధర్మపురి మున్సిపాలిటీతో పాటు, గొల్లపల్లి మండల ఓటర్ల తీర్పు కీలకం కాబోతున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కమార్‌పై 441 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే మంత్రి కొప్పుల గెలుపుపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని తన ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరుగుతోంది. ఈసారి జరుగనున్న ఎన్నికల్లో బీఅర్ఏస్ పార్టీ నుండి ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే అవకాశం ఉంది. త్రిముఖ పోటీ: కాంగ్రెస్ పార్టీ నుండి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. అలాగే గజ్జెల స్వామి, మద్దెల రవీందర్‌లు కూడా కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తూ.. నియోజకవర్గంలో వ్యక్తిగతంగా తమ అనుచరులతో కలసి పర్యటిస్తున్నారు. బిజేపి నుండి గతంలో కన్నం అంజన్న పోటీ చేశారు. ఐతే గత కొద్దికాలంగా అయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ధర్మపురి నుండి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నరగా వివేక్ నియోజకవర్గంలో అడపాదడపా పర్యటిస్తున్న.. ధర్మపురి నుండి పోటీపై ఇప్పటికీ క్యాడర్‌కు ఏలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ధర్మపురి నుండి వివేక్ పోటీచేస్తే మాత్రం ఎన్నికల్లో మూడు ప్రముఖ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత: వివేక్ కాకుండా బిజేపి నుండి కన్నం అంజన్న లేదా.. మరో కొత్త అభ్యర్థి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ద్విముఖ పోటీ ఉంటుంది. ధర్మపురి మున్సిపాలిటీలో మంచినీటి సమస్య, కరెంట్ కోతలతో పాటు, లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించకపోవడంతో అధికార పార్టీ పని తీరుపై ధర్మపురి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తుండగా.. ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు, కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ భూసేకరణతో వెల్గటూర్,పెగడపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు మంత్రి కొప్పులకు తలనొప్పిగా మారాయి. గడిచిన నాలుగున్నర ఏళ్ళలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు మరోసారి పట్టం కడతారని కొప్పుల ఈశ్వర్ ధీమాతో ఉన్నారు. ఓడిపోయిన గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజల మధ్య వుండడంతో పాటు, ప్రజల్లో సానుభూతి లక్ష్మణ్ కుమార్‌కు కలసి వచ్చే అంశం. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: ధర్మపురి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు, పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యవసాయరంగంతో పాటు, జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. -
కోరుట్ల: కీలక హామీలను మరిచిన అధికార పార్టీ..!
కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికలకు ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం నిజాం చక్కెర కర్మాగారం. తెలంగాణ వచ్చిన తర్వాత చక్కర ఫ్యాక్టరీ మూసి వేయడం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఫ్యాక్టరీ తెరిపిస్తారని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికి తెరవకపోవడం కీలక అంశం. గల్ఫ్ కార్మికుల సమస్య తెలంగాణ వచ్చాకా ఎన్.ఆర్.ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పినా తీసుకురాకపోటం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. పసుపు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపేల ఉంది. సామాజిక వర్గాలవారిగా ఓటర్ల సంఖ్య: పద్మాశాలి :67890 మున్నూర్ కాపులు: 35670 గౌడ్స్: 23560 ముదిరాజులు: 10230 కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా.. బిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అతని కొడుకు కల్వకుంట్ల సంజయ్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు జువ్వాడి నరసింహారావు, అలాగే మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్, వీరితోపాటు కల్వకుంట్ల సుజిత్ రావు టికెట్ ఆశిస్తున్నాడు. బిజెపి నుండి సీనియర్ నాయకుడు సురభి భూమరావు తనయుడు సూరభి నవీన్, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకట్ టికెట్ ఆశిస్తున్నారు. బిఆర్ఎస్ ఉంచి పోటీ చేసేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి పోటిలేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట సంజయ్‌కి టికెట్ ఇచ్చింది అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో జువ్వాడి నర్షింగరావు టికెట్ ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్ పోటిపడుతున్నాడు. మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో కొమిరెడ్డి రాములు క్యాడర్ ఉండటం వాళ్ల బలంగా చెప్పుకోవచ్చు, ఒకవేళ కొమిరెడ్డి కరంకు టికెట్ రాకపోతే బిఎస్పి పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో నాయకుడు సుజిత్ రావుకు క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేకపోవటం బలహీనతగా చెప్పుకోవచ్చు. ఇక బీజేపి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడిపోయిన జేఎన్ వెంకట, సురబి నవీన్ టికెట్ ఆశిస్తున్నారు. నవీన్ ముఖ్యంగా యువకులతో ముందుకు వెళ్తూ టికెట్ రేస్‌లో ఉండగా జేఎన్ వెంకట్ అంతగా ప్రభావం చూపకపోవచ్చు. గతంలో బుగ్గారం నియోజకవర్గంలో ఉన్న మల్లాపూర్ మండలంలోని ఏడు గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని నాలుగు, కోరుట్ల మండలంలోని ఐదు గ్రామాలు ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నాయి. బుగ్గారం నియోజకవర్గం ఉన్నప్పుడు రత్నాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఆంశం కాస్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలించవచ్చు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి: ► మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాలుగు మండలాల్లో అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేపించారు. అలాగే పెన్షన్స్, రోడ్ల, వంతెనలు నిర్మాణాలు చేపట్టారు. రెండు మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, అలాగే వార్డులలో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ► కోరుట్ల నియోజకవర్గంలో ఆసక్తికరమైన అంశాలు అంటే ప్రతి గ్రామంలో 89% గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. ► కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గెలుపోవటములను పద్మశాలి కులస్థులు ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గంలో పద్మశాలి, గౌడ, ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది ► కోరుట్ల,మెట్ పల్లి పట్టణాల్లో అధికశాతం ముస్లీంలు ప్రభావితం చెయ్యవచ్చు నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఐదు ఎకరాల మర్రిచెట్టు పర్యాటక కేంద్రంగా ఉంది. కోరుట్ల మండలం నాగులపేట శివారులో సైఫాన్. కోరుట్ల పట్టణంలో రెండవ శిరిడిగా పేరుగాంచిన సాయిబాబా ఆలయం ఉంది. -
జగిత్యాల: పథకాలు అమలైనా.. ఫలితం మాత్రం సున్నా..
BRS పార్టీ నుండి 2014లో మాకునూరి సంజయ్ కుమార్ ఓటమి అనంతరం, 2019లో సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిసి కులాలు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావితం పార్టీల పరిస్థితి: బి.ఆర్.ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా రెబల్స్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఐదుగురు ఆశిస్తున్నారు. ఆశావహులు బీఆర్ఎస్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తాటిపర్తి జీవనరెడ్డి ( ప్రస్తుత ఎమ్మెల్సీ ) ఆశావహులు తాటిపర్తి విజయలక్ష్మి తాటిపర్తి రాము బీజేపీ: బోగ శ్రావణి (రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు) శైలేందర్ రెడ్డి మధుసూదన్ తిరుపతి రెడ్డి BRS అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్లస్‌లు: జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణా. సీఎం రిలీఫ్ పండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు అందించడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కెటిఆర్ వద్ద మంచి పేరు ఉండటం. మైనస్‌లు: బీర్పూర్ మండలంలో రోళ్లవాగు నిర్మాణం పూర్తి అయిన ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. కులవసంఘ భవనాలు నిర్మాణం జరిగినా.. దళిత బంధుకు అందించడం పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గంపై చిన్న చుపు చూడడం మండల, గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం. -
చొప్పదండి: అధికార పార్టీకి రెబల్స్ బెడద..
BRS పార్టీ నుండి 2014 లో బొడిగె శోభ , 2019 లో సుంకే రవిశంకర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మాదిగ, మాల, బిసి కులాలు నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసేలా ఉన్నాయి. పైగా బీఆర్ఎస్కు ఈసారి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ లేరు. బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి BSP నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఆశావాహులు BRS .. సుంకె రవిశంకర్ CONGRESS 1)మేడిపల్లి సత్యం(చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి) BJP 1) బొడిగ శోభ(మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి) 2) సుద్దాల దేవయ్య(మాజీమంత్రి) BRS ప్రతికూల అంశాలు: బోయినిపల్లి,రామడుగు,గంగాధర మండలాల్లో లో ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. రైతుల ధర్నాలు చేసిన పట్టించుకోకపోవడం ,సమస్యలు ఉన్నా చోటికి వెల్లకపోవడం. కొండగట్టు అభివృద్ధి పనులు ప్రారంభించక పోవటం. కులవసంఘ భవనాలకు,దళిత బంధు కు కమీషన్లు తీసుకోవడం. స్వంత ఊరిలో కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకోవడం,గంగాధర, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేయడం. పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గం పై అక్రమ కేసులు పెట్టడం. మండల,గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం. తమకు విలువ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేపై అధిష్ఠానంకు రెడ్డి, రావు నాయకుల ఫిర్యాదు. అనుకూలతలు గాయత్రీ పంపు హౌజ్ నిర్మాణం, చొప్పదండి మున్సిపాలిటీ కావడం, స్మార్ట్ సిటీ పనులు చేపట్టడం. సీఎం రిలీఫ్ పండ్,కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కేటీఆర్ వద్ద మంచిపేరు ఉండటం. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మైనస్‌లు: కొండగట్టు ఆలయ అభివృద్ధికి హామీలు తప్ప, పనులు ప్రారంభించక పోవటం. ముంఫు గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవటం,అవసరం ఉన్న మండలాల్లో రహదారులపై బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవటం. పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం. ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు. -
మానకొండూరు: రసమయికి గట్టి పోటీనే!
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇచ్చే అంశంలో వెనుకడుగు, అలాగే 100 పడకల హాస్పిటల్ రాకపోవడం మైనస్ లుగా చెప్పవచ్చు. ► ఎస్సీలు 23శాతం ► బీసీలు 65 శాతం ► ఎస్టీలు 1 శాతం ► ఇతరులు 11 శాతం ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి: రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ నుండి: కవ్వంపెల్లి సత్యనారాయణ బీజేపీ పార్టీ నుండి: గడ్డం నాగరాజు దరువు ఎల్లన్న సొల్లు అజయ్ వర్మ కుమ్మరి శంకర్ బీఎస్పీ పార్టీ నుండి: నిషాణీ రామచంద్రం మాతంగి అశోక్ వీరందరూ బరిలో ఉండేందుకు సన్నద్ధం అవుతుండగా ప్రధాన పోటీలు మాత్రం రసమయి బాలకిషన్ (బిఆర్ఎస్), కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్), ఆరపెల్లి మోహన్ (బిఆర్ఎస్), ఓరుగంటి ఆనంద్ (బిఆర్ఎస్)గడ్డం నాగరాజు (బీజేపీ)దరువు ఎల్లన్న (బీజేపీ)ల మధ్య గట్టి పోటీ ఉంటదని తెలుస్తుంది. ఆయా పార్టీల నుండి ఇచ్చే టికెట్‌పై ఆధారపడి ఉంటుంది. -
హుజురాబాద్: ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
గత ఉపఎన్నికల్లో స్థానికత, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపాయి. ఇదే ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇచ్చిన హామీలను కొన్ని అమలుపర్చినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, పెన్షన్లు అర్హులందరికీ అందినప్పటికీ కమ్యూనిటీ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు నియోజకవర్గంలో ఉంటుంది. బీజేపీ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లేదా ఈటల జమున పోటీ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మండలాల వారిగా ఓటర్లు హుజురాబాద్- 61,673 జమ్మికుంట- 59,020 కమలాపూర్- 51,282 వీణవంక- 40,099 ఇల్లందకుంట- 24,799 ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 306 కేంద్రాలు ఉన్నాయి సమస్యత్మక ప్రాంతాలు. 107 సంఖ్యగా అధికారులు గత ఉప ఎన్నికల్లో గుర్తించారు. 6వృత్తులపరంగా. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి రైతులు రైతుబంధు సానుకూలంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని నిరాశతో ఉన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకమనే చెప్పవచ్చు వ్యాపారస్తులు వారి అవసరాల కోసం అధికార పార్టీని వాడుకుంటున్నప్పటికీ ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. కులాలపరంగా ఓటర్లు ఓసీలు- 23 వేలు కాపు- 31 వేల పై చిలుకు గొల్ల కురుమ- 29 వేలు ముదిరాజ్- 30 వేలు ఎస్సీలు- 47 వేలు ఎస్టిలు- 6,500 వేలు మైనార్టీ- 12,300 వేలు ► నియోజకవర్గంలో మానేరు వాగు ,ఇల్లందకుంట దేవాలయం ముఖ్యమైన ప్రదేశాలు -
కరీంనగర్: ఈసారి సర్వత్రా ఆసక్తి
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. రాజకీయ చైతన్యానికి కేరాఫ్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సరికొత్త అందాలను సంతరించుకుని సుందరంగా రూపుదిద్దుకుంటున్న నగరం.. ఇప్పుడీ నియోజకవర్గంలో గెలుపు గుర్రమెవ్వరనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం.. కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో స్త్రీ, పురుష, ఇతరుల నిష్పత్తి ఏవిధంగా ఉంది? ఏ ఏ సామాజికవర్గాలది పైచేయి ఇప్పుడు చూద్దాం. ► 40 వేల ఓట్లు మున్నూరు కాపులు ► 38 వేల ఓట్లు ముస్లిం మైనారిటీలు ► 22 వేల ఓట్లు పద్మ శాలీలు ► 29 వేల ఓట్లు ఎస్సీలు ► 14 వేల ఓట్లు ముదిరాజ్ ► 9 వేల ఓట్లు గౌడ ► 8 వేల క్రిస్టియన్ ఓట్లు 1957లో కరీంనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి జువ్వాడి చొక్కారావు గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ అధిష్టానంలో నిలిచింది. ఇక నాలుగు సార్లు టీడీపీ, 2 సార్లు గులాబీ పార్టీలు ఇక్కడ సత్తా చాటాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావు అదే తరహాలో మూడుసార్లు మంత్రిగా గెలిచి మంత్రి పదవి చెపట్టారు. ఎమ్మెస్సార్, ముద్దసాని దామోదర్ రెడ్డి సరసన ప్రస్తుత మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ .. కానీ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తప్పలేదు 2009, 2014, 2018 లో వరుసగా గెలిచి... హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ రికార్డ్ సాధించారు. 2009లో 68738 ఓట్లు, 2014 లో 77209 ఓట్లు సాధించి గెలుపొందారు. 2018లో మాత్రం గంగుల, బండి సంజయ్‌ల మధ్య పోరు రసవత్తరంగానే సాగింది. గంగులకు 80, 983 ఓట్లు రాగా... బండి సంజయ్‌కి 66, 009 ఓట్లు, పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై కేవలం 14 వేల 974 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ టికెట్ బరిలో ఉండగా.. 4వ సారి సమరానికి సై అంటున్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా గంగుల కమలాకర్‌ను ఎంపీగా పోటీ చేయించాలన్న ఓ చర్చ దాదాపు ఊహాగానమేనని వినిపిస్తోంది. గంగులతో పాటు, అధికారపార్టీ బలాలు ఆర్థికంగా బలమైన నేత... మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్ల సంఖ్య 21 ఇందులో అధికార పార్టీ కార్పొరేటర్లు 19 గంగుల ప్రధాన బలం ప్రత్యమ్నాయా ప్రతిపక్షాలు లేకపోవటం నిత్యం ప్రజలతో మమేకం బలమైన క్యాడర్ బలహీనతలు నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే కోటరీ. ప్రజలు ఆయనని నేరుగా కలిసే అవకాశం లేకపోవటం. తన సామాజిక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారన్న అపవాదు. రూరల్, అర్బన్ నేతల కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు. మునిసిపల్ కార్పొరేషన్ లో కమీషన్ల కక్కుర్తిపై ఆరోపణలు. బొమ్మకల్, కొత్తపల్లితో వంటి మేజర్ ప్రాంతాల్లోని కీలక నేతలతో ఈమధ్య సయోధ్య చెడటం. కులుపుకోవాలని చూసినా నివురుగప్పిన నిప్పులాగే కొనసాగుతున్న సంబంధాలు. ఎంఐఎం నేతలు పూర్తిగా వ్యతిరేకమవ్వటం. చేసిన పనులు కరీంనగర్ సిటీలో 14 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి. ఐటీ టవర్ నిర్మాణం. 234 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. 600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు. మెడికల్ కళాశాల మంజూరు. టీటీడీ దేవాలయం. కరీంనగర్ చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయించి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఏటా కరీంనగర్ మున్సిపాలిటీకి 100 కోట్ల నిధులు వచ్చేలా మూడేళ్ల నుంచి మంజూరు చేయించుకోవడం... స్మార్ట్ సిటీ, ఐలాండ్ లతో సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం వంటివి ప్లస్. చేయని పనులు 24 గంటల నీటి సరఫరా విలీన గ్రామాల సమస్య డంప్ యార్డ్ ప్రధాన సమస్య ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేకపోవడం నగరంలో పార్కింగ్ సమస్య నూతనంగా గొప్పగా చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్స్ కుంగిపోవడం రక్షణ వాల్స్ కు బీటలు రావడం అధ్వానంగా అంతర్గత రోడ్ల పరిస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కానీ దుస్థితి డబుల్ బెడ్ రూమ్ హామీ నెరవేర్చలేకపోవటం ప్రత్యర్థులు... బీజేపీ నుండి బండి సంజయ్, ఆయన రాజకీయ గురువు పొల్సాని సుగుణాకర్ రావు ఉన్నారు. బండి సంజయ్ కుమార్, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో 14 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ వరకు ఎదిగారు. బీజేపీ మూల సిద్ధాంతాల నుండి వచ్చిన ఏబీవీపీ, RSS విద్యార్థి స్థాయిలోనే పనిచేస్తున్నారు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తూ 80% ఉన్న హిందువుల కోసం తమ పోరాటం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. 2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి. కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 52455 ఓట్లు సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై 66009 ఓట్లు సాధించి 14,000 పైగా ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నారు బండి. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో 14 వేల ఓట్ల ఓటమి చవిచూసిన తర్వాత సానుభూతి పవనాలు బలంగా వీచాయి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య విజయం సాధించారు. అగ్ర నాయకుల దృష్టిలో పడ్డ బండి సంజయ్‌ని ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి పార్టీ పగ్గాలాయన చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఆయన మూడు విడుతలగా జరిపినటువంటి మహా సంగ్రామ పాదయాత్ర బిజెపికి కొత్త ఊపును తెచ్చిపెట్టింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచి తన మార్కు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ మునుగోడు ఓడిపోవడంతో సీనియర్లతో వచ్చిన వర్గ విభేదాలు పదవీకాలం ముగియడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని మరో కీలక పదవైన జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావడంతో నూతనోత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌కు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ వంటివారు టికెట్ ఆశిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ : పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్ రెబెల్ గా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆ తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన పొన్నం ప్రభాకర్ కెరీర్లోనే అత్యుత్తమ స్థాయి గ్రాఫ్ అందుకున్నాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నాడు. మరోసారి ఆయన బరిలో ఉంటారా? ఉండరా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వట్లేదు? మేనేని రోహిత్ రావు : కరుడు గట్టిన కాంగ్రెస్ వాది... మాజీ మంత్రి ఎమ్మెస్సార్...మనవడు రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు... కరీంనగర్ కార్పొరేషన్ లోని పారిశుద్యం, 1000 కోట్ల కుంభకోణం, స్థానిక సమస్యలతో పాటుగా రైతాంగ సమస్యలు ధాన్యం కొనుగోలు అంశాలపై మంత్రిని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్ సభతో పాటుగా కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభకి పూర్తిస్థాయిలో అన్ని తానై నిర్వహించాడు.... వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కృషి చేస్తున్నారు. కొత్త జైపాల్ రెడ్డి... ట్రేండింగ్ లో ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయింది. బీజేపీ లో వెళ్తారన్న టాక్ వినిపించినా ఎందుకో ఆగిపోయింది. గంగులకు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ మైనారిటీ వర్గాలు సపోర్ట్ చేస్తూ చెబుతున్నాయి. 1996 లో తెలుగుదేశం రాజకీయ అరంగేట్రం చేసిన జైపాల్ రెడ్డి 1999 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత కు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఉన్నారు. 2005, 2013 లో సింగిల్ విండో చైర్మన్ గా గెలిచిన జైపాల్ రెడ్డి...2010 లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. 2013లో పొలిటికల్ గాడ్ ఫాదర్ నాగం జనార్దన్ రెడ్డి తో సహా రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. 2018 లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ చొప్పదండి అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలుపుకు కృషిచేశారు. జైపాలన్న మిత్ర మండలి పేరుతో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారు. గోల్డెన్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి అంబటి జోజిరెడ్డి బరిలో ఉంటామని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన అంబటి. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా పార్టీకి సేవలందించారు. ఏఐఫ్ బి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. -
కరీంనగర్ హుజూరాబాద్ మండలం రాజకీయ చరిత్ర
హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాజకీయంలో పెద్ద పరిణామమే సంభవించింది. టిఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఆయనపై కొన్ని భూ కబ్జా కేసుల విచారణ జరగడం, తదనంతర పరిణామాలలో ఈటెల ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం జరిగాయి. అ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఈటెల 23,855 ఓట్ల ఆదిక్యంతో గెలుపొంది సంచలన విజయం సాధించారు. ఈటెల రాజేందర్‌ను ఓడిరచడానికి టీఆర్ఎస్ గానీ, ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఈటెలకు 107022 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 83,167 ఓట్లే వచ్చాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థికి నర్సింగరావుకు 3,014 ఓట్లు మాత్రమే తెచ్చుకొని డిపాజిట్ కొల్పోవడం జరిగింది. 2018 టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఈటెల రాజేందర్‌కు 104840 రాగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు అధిక ఓట్లు రావడం విశేషం. నోటాకు 2847 ఓట్లు పడ్డాయి. కాగా అప్పట్లో బిజేపీ డిపాజిట్ కొల్పోయింది. కానీ 2021లో ఈ ఉప ఎన్నిక సమయానికి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లోకి మారాడు. దీనివల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది కానీ టీఆర్ఎస్ మాత్రం గెలవలేకపోయింది. ఈటెల బిజేపిలోకి వెళ్లడం అంతకుముందు అక్కడ బలమే లేని బిజేపి గెలిచి సంచలనంగా మారింది. ఈటెల హుజూరాబాద్‌లో ఐదుసార్లు, అంతకుముందు కమలాపూర్‌లో రెండుసార్లు గెలిచారు. కొంతకాలం క్రితం టిఆర్ఎస్కు సొంతదార్లు ఎవరూ అంటూ వ్యాఖ్యానించి ఈటెల వివాదంలో పడ్డారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవిని కోల్పోయి, పార్టీని వీడవలసి వచ్చింది. ఈటెల రాజేందర్ బిసి వర్గానికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన 3 ఉప ఎన్నికలతో సహా ఏడు ఎన్నికలలో గెలిచిన కొద్ది మంది నేతలలో ఒకరుగా నమోదు అయ్యారు. 2008 ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌లో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు. కాని ఆ తర్వాత మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆయన అంతకుముందు ఆరేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు గెలిచి రికార్డులకెక్కారు. కమలాపూర్ నుంచి 2004, 2008 ఉప ఎన్నిక, హుజూరాబాద్‌లో 2009, 2010 ఉప ఎన్నికలో ఆయన విజయం సాదించారు. హుజూరాబాద్‌లో తదుపరి 2014, 2018, 2021 ఉప ఎన్నికలలో కూడా ఆయన గెలుపొందారు. రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన రాజీనామా చేసి విజయం సాదించారు. టిఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్ , ఈటెల రాజేందర్లు మాత్రమే ఇలా ఆరేళ్లలో నాలుగుసార్లు గెలిచిన ఘనత పొందారు. ఈ నియోజకవర్గంలో ఈటెల 2014లో కాంగ్రెస్ సమీప ప్రత్యర్ధి కె.సుదర్శనరెడ్డిని 57037 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా పోటీచేసిన ముద్దసాని కశ్యప్ రెడ్డికి 15642 ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాలుగుసార్లు రెడ్లు, రెండుసార్లు వెలమ, నాలుగుసార్లు బిసి నేతలు, మూడుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. మొదట ఈటెల రాజేందర్ కమలాపూర్‌లో 2004లోను, ఆ తరువాత 2008లో రాజీనామా చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 16 మందిలో ఒకరిగా ఉన్న ఈయన ఉప ఎన్నికలో పోటీ చేసి తిరిగి గెలుపొందారు. ఆ ఉప ఎన్నికలలో అప్పటి టిఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా ఉన్న డాక్టర్ విజయరామారావు ఓటమి పాలవడంతో ఆ పక్ష నేతగా రాజేందర్ ఎంపికయ్యారు. రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో మళ్ళీ శాసనసభకు రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికలో టిడిపి నేత ముద్దసాని దామోదరరెడ్డిపై ఘన విజయం సాధించారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో ఒక స్థానం కాంగ్రెస్, మరోస్థానం సోషలిస్టు పార్టీ గెలుచుకున్నాయి. 1957లో రెండూ ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. 1983 నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ ఐ గెలుపొందలేదు. 1957లో ఇండిపెండెంటుగా గెలిచిన పి.నర్సింగరావు 1967లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 1957, 62లలో గెలిచిన గడిపల్లి రాములు 1967లో మేడారం నుంచి గెలిచారు. 1978లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన దుగ్గారాల వెంకట్రావు 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచారు. 1994, 99లలో టిడిపి అభ్యర్ధిగా గెలుపొందిన ఏనుగుల పెద్దిరెడ్డి 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా హుస్నాబాద్‌లో పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ ఒకసారి గెలిచిన ఒడితెల రాజేశ్వరరావు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కమలాపూర్ నుంచి 2004 సాధారణ ఎన్నికలలోను, 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా రాజీనామా చేసి రెండోసారి గెలుపొందారు. అయితే 2009లో హుస్నాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లక్ష్మీకాంతరావు కొంతకాలం వై.ఎస్. క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గం మానకొండూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో ప్రముఖ గాయకుడు, తెలంగాణ సాంస్కతిక సంస్థ చైర్మన్ రసమయి బాలకిషన్ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పై 31509 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రసమయికి 88997 ఓట్లు వస్తే, మోహన్‌కు 57488 ఓట్లు వచ్చాయి. కాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోహన్ కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి టిక్కెట్‌పై పోటీచేసిన ఎమ్. ప్రబాకర్కు 13600 ఓట్లు దక్కాయి. 2014లో కూడా బాలకిషన్, మోహన్ల మద్యే పోటీ జరిగింది. 2009లో గెలిచి శాసనసభలో విప్‌గా పనిచేసిన ఆరేపల్లి మోహన్‌ను 2014లో రసమయి 46922 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణకు 23627 ఓట్లు వచ్చాయి. నేరెళ్ల (2009లో రద్దు) నేరెళ్ల నియోజకవర్గం 2009లో రద్దయిపోయింది. 2004 వరకు ఉన్న ఈ నియోజకవర్గంలో గొట్టె భూపతి రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలిస్తే, పాటి రాజం కాంగ్రెస్ఐ అభ్యర్ధిగా మూడుసార్లు గెలిచారు. 1994,1999లో ఇక్కడ నుంచి గెలిచిన సుద్దాల దేవయ్య 2009లో చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పాటి రాజం గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్లలో పనిచేసారు. సుద్దాల దేవయ్య చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2004లో ఎన్నికైన కాశీపేట లింగయ్య టిఆర్ఎస్ అసమ్మతి నేతగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్కుమద్దతు ఇచ్చి విఫ్ ఉల్లంఘన అభియోగానికి గురై శాసనసభ్యత్వానికి అనర్హులవడం రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. అయితే తీర్పు రావడానికి ఒక రోజు ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. పాస్‌పోర్టు కుంభకోణానికి సంబంధించి కూడా లింగయ్య అరెస్టు అయ్యారు. నేరెళ్లలో పదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు టిడిపి రెండు సార్లు, టీఆర్ఎస్ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు. మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..