చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గం
చొప్పదండి రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ది సాంకే రవిశంకర్ 42127ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మేడిపల్లి సత్యంపై గెలిచారు. ఇక్కడ 2014లో టిఆర్‌ఎస్ పక్షాన ఎన్నికైన బొడిగె శోభకు టిక్కెట్ ఇవ్వకుండా కొత్తగా రవిశంకర్ కు కేటాయించారు.దీనికి నిరసనగా శోభ బిజెపిలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఆమెకు 15600 ఓట్లు మాత్రమే వచ్చాయి.కాగా గెలిచిన రవిశంకర్ కు 91090 ఓట్లు రాగా, మేడిపల్లి సత్యం కు 48963 ఓట్లు వచ్చాయి.
చొప్పదండి రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య 2009లో టిడిపి పక్షాన గెలిచారు. అంతకుముందు రెండుసార్లు నేరెళ్ల నుంచి టిడిపి తరపునే గెలిచారు. 2014లో దేవయ్య టిడిపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ ఐలో చేరినా ఫలితం దక్కలేదు. టిఆర్‌ఎస్ తరపున తొలిసారి పోటీచేసిన మహిళ అభ్యర్ధి బొడిగె శోభ చేతిలో దేవయ్య 54981 ఓట్ల తేడాతో ఓడిపోయారు.2014లో చొప్పదండిలో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధి మేడిపల్లి సత్యం 13104 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి మరోసారి ఓటమి చెందారు.
చొప్పదండి రిజర్వు అయ్యేవరకు జరిగిన ఎన్నికలలో ఐదుసార్లు రెడ్లు,ఒకసారి వెలమ, రెండుసార్లు బిసిలు ఒకసారి ఇతరులు గెలుపొందారు.1983 నుంచి 2009 వరకు చొప్పదండిలో ఒక్క 1999లో మాత్రమే కాంగ్రెస్ ఐ గెలిచింది. చొప్పదండి నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి మూడుసార్లు, టిడిపి ఆరుసార్లు, టిఆర్‌ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన న్యాలకొండ రామ్‌కిషన్‌రావు కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్‌లో సభ్యునిగా కూడా ఉన్నారు. దేవయ్య కూడా చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసారు. 1957లో చొప్పదండిలో పిడిఎఫ్ పక్షాన గెలిచిన చెన్నమనేని రాజేశ్వరరావు ఆ తరువాత సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ అభ్యర్ధిగా, ఒకసారి టిడిపి తరుఫునగెలిచారు.
చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment