Choppadandi Assembly Constituency
-
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో బీఆర్ఎస్ నేతల లోపాయికారి ఒప్పందం..?
-
‘ఎమ్మెల్యే టికెట్టు నాదే.. ఆ దుర్మార్గుల్ని నమ్మొద్దు’
సాక్షి, కరీంనగర్: అసంతృప్త నేతలపై బహిరంగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరపున మళ్ళీ చొప్పదండి ఎమ్మెల్యే టిక్కెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారాయన. గంగాధర మండలం బూర్గుపల్లిలో బీసీబంధు చెక్కు పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్.. అసంతృప్తవాదులు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. చొప్పదండి నుంచి మరోసారి ఎమ్మెల్యే టికెట్ నాదే. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ పదే పదే చెబుతున్నారు. చాలా స్పష్టంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి వాళ్ల వాళ్ల స్థానాల నుంచే పోటీ అని చెబుతున్నారు. కానీ, కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరూ వాటిని నమ్మొద్దంటూ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో.. మరోసారి తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. గత కొద్దిరోజులుగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్వయంగా ఆయన తిరుగుబాటు నేతలపై మండిపడటం, టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. -
చొప్పదండి: అధికార పార్టీకి రెబల్స్ బెడద..
BRS పార్టీ నుండి 2014 లో బొడిగె శోభ , 2019 లో సుంకే రవిశంకర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మాదిగ, మాల, బిసి కులాలు నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసేలా ఉన్నాయి. పైగా బీఆర్ఎస్కు ఈసారి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ లేరు. బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి BSP నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఆశావాహులు BRS .. సుంకె రవిశంకర్ CONGRESS 1)మేడిపల్లి సత్యం(చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి) BJP 1) బొడిగ శోభ(మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి) 2) సుద్దాల దేవయ్య(మాజీమంత్రి) BRS ప్రతికూల అంశాలు: బోయినిపల్లి,రామడుగు,గంగాధర మండలాల్లో లో ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. రైతుల ధర్నాలు చేసిన పట్టించుకోకపోవడం ,సమస్యలు ఉన్నా చోటికి వెల్లకపోవడం. కొండగట్టు అభివృద్ధి పనులు ప్రారంభించక పోవటం. కులవసంఘ భవనాలకు,దళిత బంధు కు కమీషన్లు తీసుకోవడం. స్వంత ఊరిలో కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకోవడం,గంగాధర, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేయడం. పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గం పై అక్రమ కేసులు పెట్టడం. మండల,గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం. తమకు విలువ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేపై అధిష్ఠానంకు రెడ్డి, రావు నాయకుల ఫిర్యాదు. అనుకూలతలు గాయత్రీ పంపు హౌజ్ నిర్మాణం, చొప్పదండి మున్సిపాలిటీ కావడం, స్మార్ట్ సిటీ పనులు చేపట్టడం. సీఎం రిలీఫ్ పండ్,కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కేటీఆర్ వద్ద మంచిపేరు ఉండటం. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మైనస్లు: కొండగట్టు ఆలయ అభివృద్ధికి హామీలు తప్ప, పనులు ప్రారంభించక పోవటం. ముంఫు గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవటం,అవసరం ఉన్న మండలాల్లో రహదారులపై బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవటం. పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్లను అర్హులకు అందిచక పోవటం. ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు. -
చొప్పదండి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గం చొప్పదండి రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది సాంకే రవిశంకర్ 42127ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మేడిపల్లి సత్యంపై గెలిచారు. ఇక్కడ 2014లో టిఆర్ఎస్ పక్షాన ఎన్నికైన బొడిగె శోభకు టిక్కెట్ ఇవ్వకుండా కొత్తగా రవిశంకర్ కు కేటాయించారు.దీనికి నిరసనగా శోభ బిజెపిలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఆమెకు 15600 ఓట్లు మాత్రమే వచ్చాయి.కాగా గెలిచిన రవిశంకర్ కు 91090 ఓట్లు రాగా, మేడిపల్లి సత్యం కు 48963 ఓట్లు వచ్చాయి. చొప్పదండి రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య 2009లో టిడిపి పక్షాన గెలిచారు. అంతకుముందు రెండుసార్లు నేరెళ్ల నుంచి టిడిపి తరపునే గెలిచారు. 2014లో దేవయ్య టిడిపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ ఐలో చేరినా ఫలితం దక్కలేదు. టిఆర్ఎస్ తరపున తొలిసారి పోటీచేసిన మహిళ అభ్యర్ధి బొడిగె శోభ చేతిలో దేవయ్య 54981 ఓట్ల తేడాతో ఓడిపోయారు.2014లో చొప్పదండిలో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధి మేడిపల్లి సత్యం 13104 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి మరోసారి ఓటమి చెందారు. చొప్పదండి రిజర్వు అయ్యేవరకు జరిగిన ఎన్నికలలో ఐదుసార్లు రెడ్లు,ఒకసారి వెలమ, రెండుసార్లు బిసిలు ఒకసారి ఇతరులు గెలుపొందారు.1983 నుంచి 2009 వరకు చొప్పదండిలో ఒక్క 1999లో మాత్రమే కాంగ్రెస్ ఐ గెలిచింది. చొప్పదండి నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి మూడుసార్లు, టిడిపి ఆరుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన న్యాలకొండ రామ్కిషన్రావు కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్లో సభ్యునిగా కూడా ఉన్నారు. దేవయ్య కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసారు. 1957లో చొప్పదండిలో పిడిఎఫ్ పక్షాన గెలిచిన చెన్నమనేని రాజేశ్వరరావు ఆ తరువాత సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ అభ్యర్ధిగా, ఒకసారి టిడిపి తరుఫునగెలిచారు. చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..