కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికలకు ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం నిజాం చక్కెర కర్మాగారం. తెలంగాణ వచ్చిన తర్వాత చక్కర ఫ్యాక్టరీ మూసి వేయడం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఫ్యాక్టరీ తెరిపిస్తారని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికి తెరవకపోవడం కీలక అంశం. గల్ఫ్ కార్మికుల సమస్య తెలంగాణ వచ్చాకా ఎన్.ఆర్.ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పినా తీసుకురాకపోటం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. పసుపు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపేల ఉంది.
సామాజిక వర్గాలవారిగా ఓటర్ల సంఖ్య:
- పద్మాశాలి :67890
- మున్నూర్ కాపులు: 35670
- గౌడ్స్: 23560
- ముదిరాజులు: 10230
కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా.. బిఆర్‌ఎస్, బిజెపి ,కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అతని కొడుకు కల్వకుంట్ల సంజయ్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు జువ్వాడి నరసింహారావు, అలాగే మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్, వీరితోపాటు కల్వకుంట్ల సుజిత్ రావు టికెట్ ఆశిస్తున్నాడు. బిజెపి నుండి సీనియర్ నాయకుడు సురభి భూమరావు తనయుడు సూరభి నవీన్, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకట్ టికెట్ ఆశిస్తున్నారు.
బిఆర్‌ఎస్ ఉంచి పోటీ చేసేది ఎవరు?
బీఆర్‌ఎస్ పార్టీకి పోటిలేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట సంజయ్‌కి టికెట్ ఇచ్చింది అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో జువ్వాడి నర్షింగరావు టికెట్ ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్ పోటిపడుతున్నాడు. మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో కొమిరెడ్డి రాములు క్యాడర్ ఉండటం వాళ్ల బలంగా చెప్పుకోవచ్చు, ఒకవేళ కొమిరెడ్డి కరంకు టికెట్ రాకపోతే బిఎస్‌పి పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో నాయకుడు సుజిత్ రావుకు క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేకపోవటం బలహీనతగా చెప్పుకోవచ్చు.
ఇక బీజేపి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడిపోయిన జేఎన్ వెంకట, సురబి నవీన్ టికెట్ ఆశిస్తున్నారు. నవీన్ ముఖ్యంగా యువకులతో ముందుకు వెళ్తూ టికెట్ రేస్లో ఉండగా జేఎన్ వెంకట్ అంతగా ప్రభావం చూపకపోవచ్చు. గతంలో బుగ్గారం నియోజకవర్గంలో ఉన్న మల్లాపూర్ మండలంలోని ఏడు గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని నాలుగు, కోరుట్ల మండలంలోని ఐదు గ్రామాలు ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నాయి. బుగ్గారం నియోజకవర్గం ఉన్నప్పుడు రత్నాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఆంశం కాస్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలించవచ్చు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి:
► మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాలుగు మండలాల్లో అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేపించారు. అలాగే పెన్షన్స్, రోడ్ల, వంతెనలు నిర్మాణాలు చేపట్టారు. రెండు మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, అలాగే వార్డులలో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు.
► కోరుట్ల నియోజకవర్గంలో ఆసక్తికరమైన అంశాలు అంటే ప్రతి గ్రామంలో 89% గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు.
► కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గెలుపోవటములను పద్మశాలి కులస్థులు ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గంలో పద్మశాలి, గౌడ, ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది
► కోరుట్ల,మెట్ పల్లి పట్టణాల్లో అధికశాతం ముస్లీంలు ప్రభావితం చెయ్యవచ్చు
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు:
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఐదు ఎకరాల మర్రిచెట్టు పర్యాటక కేంద్రంగా ఉంది. కోరుట్ల మండలం నాగులపేట శివారులో సైఫాన్. కోరుట్ల పట్టణంలో రెండవ శిరిడిగా పేరుగాంచిన సాయిబాబా ఆలయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment