TS Assembly Voter Equations
-
‘తమ్మీ మీ ఊళ్లో గాలి ఎటు వీస్తుంది? ఓటర్లు ఏమనుకుంటున్నరు?
‘తమ్మీ మీ ఊళ్లో గాలి ఎటు వీస్తుంది? ఓటర్లు ఏమనుకుంటున్నరు? మనమీద ఎవైరైనా నారాజ్‌గా ఉన్నార? ఉంటే చెప్పు. వాళ్లను మనవైపు తిప్పుకోవాలంటే ఏంచేయాలో చెప్పు. వారికి ఏం కావాలో తెలుసుకుని చెప్తే అన్నీసెట్ చేద్దాం. వాళ్ల కుల, యువజన సంఘం లీడర్లును పట్టుకుని నా దగ్గరికి తీస్కురా. వారితో సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించు. దేనికీ తగ్గొద్దు. కచ్ఛితంగా మనం గెలవాలె’ అని ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలతో ఎర వేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 నుంచి 1,000మంది వరకు ఓటర్లు ఉంటారు. 800మంది ఉంటే అందులో 350మందిని తమవైపు తిప్పుకుంటే గెలుపొందవచ్చు. ఇప్పటికే నియమించిన బూత్ కమిటీలను యాక్టివ్ చేసిన నేత.. వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు ఎందరు? తమ పార్టీ ఎవరు? పక్క పార్టీ వారికి ఓట్లు వేసేవారు ఎవరు? తటస్థ ఓటర్లు ఎవరు? అనే వివరాలు సేకరిస్తున్నారు. అందులోంచి ఎంపిక చేసుకున్న 350మందికి పోలింగ్ ముందు రోజు నోటు చేరేలా పకడ్బదీ ప్రణాళిక రచిస్తున్నారు. 60మంది ఓటర్లకు ఓ ఇన్చార్జిని నియమించి, రోజూ వారిని కలిసి తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించేలా ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేసే బూత్‌స్థాయి నాయకులకు ధావత్ కింద రూ.5వేలు ముట్టజెబుతున్నారు. సాక్షి, పెద్దపల్లి: ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటా ప్రచారాలు, భారీ బహిరంగ సభలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. నిన్నామొన్నటి దాకా చేరికలకు ప్రాధాన్యం ఇచ్చిన నేతలు.. ప్రచారానికి మూడు రోజుల గడువే ఉండడంతో పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలు తీస్తూ గుంపగుత్తగా ఓట్లు రాబట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు అ నుచరులతో కలిసి వ్యూహాలు అమలు చేస్తున్నారు. వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే బూత్‌స్థాయిలో మద్యం ఏరులై పారుతోంది. కుల, యువజన సంఘాలు, ఆర్ఎంపీలు, లారీ అసోసియేషన్లు, ఆటో డ్రైవర్లు, పింఛన్‌దారులు, కార్మికులు.. ఇలా ప్రతీ సంఘాన్ని ప్రసన్నం చేసుకునేలా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా వర్గాలతో ఆత్మీ య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోరుకున్న వారికి ప్రత్యేక పార్టీలు ఇస్తూ పోలింగ్ నాటికి అంతా చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సభలు, ర్యాలీలు, ప్రచారం ఎలా కొనసాగినా.. ప్రచార సమయం ముగిసిన తర్వాత పోల్ మెనేజ్మెంట్ ఎన్నికల్లో విజయానికి కీలకం. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో కొందరు నేతలు ప్రచారం ఎలా నిర్వహించినా.. పోల్ మేనేజ్మెంట్ పక్కాగా అమలుచేసి విజయం సాధించారు. మరికొందరు ప్రచా రం హోరెత్తించి పోల్ మేనేజ్మెంట్లో విఫలమై ఓడిన సందర్భాలు ఉన్నాయి. గత అనుభవాలతో అన్నిపార్టీల నేతలు ఓటరుకు తాయిలాలు నేరుగా అందించటంతోపాటు, పోలింగ్‌కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించే దాకా పక్కా ప్రణాళికతో అప్రమత్తంగా ఉంటున్నారు. ఇవన్నీ సాఫీగా సాగేలా కమిటీలు నియమించి, నమ్మకమైన నేతలు, బంధువులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
ఓటేయకుంటే జరిమానా, లైసెన్స్ రద్దు!
కరీంనగర్ అర్బన్: మన దేశంలో కొన్నిచోట్ల 60 శాతం ఓటింగ్ జరిగితే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే దీన్ని హక్కుగా చూడకుండా బాధ్యతగా తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలన్న డిమాండ్ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. వేయకుంటే కొన్ని దేశాలు జరిమానా విధిస్తుండగా, మరికొన్ని ప్రభుత్వ సాయాన్ని, సదుపాయాలను నిలిపివేస్తున్నాయి. ఇంకొన్ని దేశాల్లోనైతే అలాంటి వారికి ఏకంగా ఓటుహక్కును తొలగించేస్తున్నారు. ఎందుకు ఓటు వేయలేకపోయారో సరైన కారణం చూపితే గానీ మళ్లీ ఆ హక్కును కల్పించరు. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన దేశాల్లో బెల్జియం, అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బొలీవియా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, టర్కీ, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ తదితరాలు ఉన్నాయి. బెల్జియం : 10 వేల యూరోల వరకు జరిమానా ఈ దేశంలో ఓటరు జాబితాలో పేరు ఉండి, వరుసగా నాలుగుసార్లు ఓటెయ్యకపోతే.. పదేళ్ల వరకు ఓటుహక్కు తొలిగిస్తారు. మొదటిసారి ఓటు వేయకపోతే 2 వేల నుంచి 4 వేల యూరోల వరకు, రెండోసారి 10 వేల యూరోల వరకు జరిమానా విధిస్తారు. పైగా సర్కారు ఉద్యోగావకాశాలు, పథకాలు, సదుపాయాల్లో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఎన్నికలు జరిగిన వారం రోజుల్లో సంబంధిత ఓటర్లపై చర్యలు తీసుకుంటారు. అమెరికా : ఎన్నికల రోజు సెలవు ఉండదు ఇక్కడ ఓటు వేయడంపై ఎలాంటి ఆంక్షలూ లేవు. అయినా ఇక్కడ 85 శాతం వరకు ఓటింగ్ నమోదవుతుంది. పోలింగ్ రోజు సెలవు ఉండదు. ఉద్యోగులు, ప్రజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఓటు విలువ పట్ల అమెరికన్లలో చైతన్యం ఎక్కువ. బొలీవియా : గుర్తింపు కార్డు ఉంటేనే సౌకర్యాలు ఈ దేశంలో ఓటు వేసినవారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది ఉన్నవారికే ప్రభుత్వ సౌకర్యాలను కల్పిస్తారు. రేషన్, విద్యుత్, తాగునీటి వసతి పొందాలంటే ఈ కార్డును సంబంధిత అధికారులకు చూపించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయకపోతే.. వేతనాలు సరిగా అందవు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా : వారం రోజుల్లో విచారణ ఇక్కడ అర్హులైన ప్రతిఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఎన్నికల రోజున వీరంతా తప్పకుండా ఓటు వేయాలి. వేయకుంటే జరిమానా విధిస్తారు. ఎన్నికలు జరిగిన వారంలోగా విచారణ చేపట్టి, అపరాధ రుసుము ఎంతన్నది నిర్ణయిస్తారు. ఇక్కడ 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఎన్నికలకు చాలా ముందు నుంచే ఓటుహక్కు వినియోగంపై ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రీస్ : డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దు ఇక్కడ ఓటు వేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దవుతాయి. లేదంటే వాటి మంజూరును నిలిపివేస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను అధికారులకు ఆధారాలతో చూపించాల్సి ఉంటుంది. వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే మళ్లీ ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సౌకర్యాలపై ఆంక్షలు విధిస్తారు. సింగపూర్ : పేరు తొలగిస్తారు అభివృద్ధికి మారుపేరుగా నిలిచే సింగపూర్‌లో ఓటు వేయడం తప్పనిసరి. వేయనివారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణానికి ఆధారాలను అధికారులకు చూపిస్తే పునరుద్ధరిస్తారు. ఎక్కువ మంది ప్రజలు కోరుకునే ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే సింగపూర్ అభివృద్ధిలో ముందుందన్న వాదనలున్నాయి. ఇక్కడా తప్పనిసరి చేయాలి.. ఎన్నికలు ప్రగతికి బాటలు వేస్తాయి. మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడతాయి. అందుకే అయిదేళ్లకోసారి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో అర్హులైన అనేక మంది వివిధ కారణాలతో తమ ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు. వందశాతం లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతీ ఓటరు ఓటు వేసేలా ప్రచారం, ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన దగ్గర కూడా ఓటు వేయడం తప్పనిసరి చేయాలి. ఇతర దేశాల తరహా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. -
‘ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్.. వచ్చి మన పార్టీకే ఓటు వేయాలే’
కరీంనగర్‌రూరల్: ‘అన్నా.. మంచిగున్నవానే.. ఈ ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్.. గుర్తుంది కదా..? జరంత తప్పకుండా అందరూ రావాలే. వదినను కూడా తీసుకుని రండ్రి. అందరూ మనపార్టీకే ఓటు వేయాలే. మనోళ్లను గెలిపించుకోవాలే. ఎంత పనిఉన్నా కొంచెం పక్కనపెట్టుకుని ముందే రావాలే. రానూపోను ఖర్చులు మేమే భరిస్తాం. అవసరమైతే ముందుగాలనే పేమెంట్ కొడతాం.. ఇంతకీ.. నీది ఫోన్‌పేనా..? గూగుల్ పేనా..? అన్నా..’ అంటూ.. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లను సంప్రదిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూ ర్ నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం స్థిరపడిన వారిని సంప్రదిస్తూ.. ‘ఓట్ల’గాలం వేస్తున్నారు. ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ.. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. ఒక్కో సందర్భంలో ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు.. ఓడిన ఉద్ధండులూ ఉన్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతీ ఓటరును అభ్యర్థులు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం పొద్దున నిద్ర లేవగానే అందరి ‘టచ్’లోకి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు కొద్దిరోజులుగా కష్టపడుతున్నారు. వలస ఓటర్లు, కుల సమీకరణ, మహిళలు, పురుషులు, సంఘాలు.. స్నేహబంధాలు.. బంధుత్వాలు.. ఇలా ప్రతీ ఒక్కరిని పలుకరించి తమ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను ఏదోఒక సమయంలో నేరుగా కలుస్తూ.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని ఫోన్లో సంప్రదిస్తున్నారు. కార్యకర్తల ద్వారా ‘టచ్’లోకి.. జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలసవెళ్లినవారు వేలల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలైన చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌లో ఈ వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి వరంగల్, హైదరాబాద్, భీవండి, సూరత్ లాంటి పొరుగు ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లినవారు, బెంగళూరు, పుణే, చెన్నైలాంటి సిటీల్లో ప్రయివేటు ఉద్యోగులుగా స్థిరపడిన వారు అనేకం. ఎన్నికల సందర్భంగా వారు స్వ స్థలానికి వచ్చి ఓటు వేస్తారో.. వేయరో అన్న భయం నేతల్లో నెలకొంది. ఈ క్రమంలో తమ కార్యకర్తల ద్వారా వారికి టచ్‌లోకి వెళ్తున్నారు. అన్నా.. అక్కా అంటూ.. గ్రామాల్లో ఉన్నవారి నుంచి ఫోన్ నంబర్లు తీసుకుని, ఫోన్‌చేసి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అన్నా.. అక్కా అంటూ సంబోధిస్తూ.. ఓటేసేందుకు తప్పకుండా ఊరికి రావాలని కోరుతున్నారు. ఎన్నిపనులు ఉన్నా.. ఒక్కరోజు టైం ఇవ్వాలని కోరుతున్నారు. అవసరమైతే దారిఖర్చులు ఇస్తామని చెబుతున్నారు. నమ్మకం లేకుంటే.. ముందస్తుగానే పంపిస్తామని.. మీది ఫోన్‌పేనా..? గూగుల్ పేనా? అంటూ అడుగుతూ.. ఆన్లైన్ పేమెంట్లు చేసేస్తున్నారు. తమ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాల ని కోరుతున్నారు. ఇలా వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న జిల్లాలోని వివిధ పార్టీల కార్యకర్తలు తమ అభ్యర్థులకు ఓటు బ్యాంకు పెంచే పనిలో నిమగ్నమవడం కనిపిస్తోంది. -
పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు
కరీంనగర్/పెగడపల్లి: ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజికవర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతో పాటు వారి అనుచరులు పడరాని పాట్లు పడతున్నారు. కూడికలు.. తీసివేతలు అన్ని సామాజికవర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఓటర్లలో ఏఏ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలుపోటములు నిర్దారించే పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. సామాజికవర్గాల వారీగా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ టీం తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు కలిగి ఉన్న సామాజికవర్గాన్ని గుర్తించి వారి మద్దతును తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో 40 నుంచి 45శాతం ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటే విజయం తథ్యమనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటికే పలు రాజకీయపక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థంగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కులపెద్దలతో మంతనాలు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సాయంతో మంతనాలు చేస్తున్నారు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని అప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హమీలిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కొన్ని సామాజికవర్గాల అభ్యర్థులు గెలుపోటములను శాసిస్తున్నాయి. అలాంటి సామాజికవర్గాన్ని గ్రామాల వారీగా గుర్తించేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళిక రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల శాతానికి అనుగుణంగా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు అభ్యర్థులు అంకెల గారడీతో కుస్తీ పడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుతుండడంతో రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది. సమయం లేక అభ్యర్థుల అవస్థలు అసలే మాఘి పొద్దు. పొద్దంతా తక్కువగా సమయం ఉంటుంది. రాత్రంతా చలి. అందులో ప్రచారానికి సమయం ఉండటం లేదు. సహజంగా ఎన్నికలప్పుడు తప్ప నాయకులు ఎప్పుడు గ్రామాలకు రాలేదంటారు. కానీ ఎన్నికల వేళ కూడా అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడిగే సమయం లేదు. దీంతో ప్రధాన గ్రామాలపై దృష్టి సారించిన నేతలు పగలు ప్రచారం చేస్తూ రాత్రి వేళ మంతనాలు చేస్తున్నారు. కార్యకర్తలపైనే ఆధారం ప్రచారానికి సమయం లేకపోవడం, పైగా గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలపైనే ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అవసరమున్న గ్రామాలకు మాత్రమే వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని చక్కదిద్దే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వలసలు, చేరికలు తదితర వాటిపై నేతలు దృష్టి సారించారు. చివరి రోజుల్లో ర్యాలీ ఏర్పాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయా మండలాల్లో అత్యధిక ఓటర్లున్నా గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచారం ఒక వంతుగా చూస్తే అభ్యర్థులకు సవాలుగా మారినట్లే. -
ఓట్ల గురించి జాతిపిత.. రాజ్యాంగ నిర్మాతతో మాట్లాడితే..
సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు సాంచాలు నడుపుతూ బట్ట నేస్తున్నారు. వీధికుక్కలు చలికి ముడుచుకు పడుకున్నాయి. ఒక్కసారిగా చరచరమంటూ గర్జించిన మేఘానికి దిక్కులు దద్ధరిల్లడంతో జాతిపిత మహాత్మాగాంధీ ఉలిక్కిపడి లేచారు. గాంధీచౌక్‌లో నలుదిక్కులూ తేరిపార చూశారు. ఎవరూ కనిపించకపోవడంతో కొంచెం ముందుకెళ్లినా.. బాపూజీ కర్ర పట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వైపు కదిలారు. మెడనిండా పూలదండలతో చేతిలో రాజ్యాంగ పుస్తకంతో ఆదమరిచి నిద్రపోతున్న అంబేడ్కర్‌ను పిలిచారు. చిన్నపాటి పిలుపునకే దిగ్గున లేచిన అంబేడ్కర్.. ఇంత రాత్రి వేళ వచ్చిన గాంధీజీతో మాట కలిపారు. వాళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది. ♦ గాంధీజీ : ఏం లేదు నాయనా. పొద్దాంత మైకుల మోత. డప్పుసప్పుళ్లు.. నినాదాలతో నే నుండే గాంధీచౌక్ దద్దరిల్లుతోంది. వాళ్ల లొల్లి వశపడడం లేదు. ఎప్పటిలాగే పడుకున్న కానీ పొద్దాంత జరుగుతున్న లొల్లి గుర్తుకొచ్చి నిద్రపట్టలేదు. ఉరుములతో మెల్కువ వచ్చి.. ఇటు వైపు వచ్చిన. నీకేం ఇబ్బంది లేదు కదా. ♦ అంబేడ్కర్ : అయ్యో అదేం మాట బాపు. నాకేం ఇబ్బంది లేదు. కానీ నా పరిస్థితి కూడా అంతే. మీరు ఇప్పటి దాకా చెప్పిన పాట్లన్నీ నాకూ తప్ప డం లేదు. కామారెడ్డి–కరీంనగర్ వైపు వెళ్లే వాహనాల రద్దీతో మరిన్ని కష్టాలు పడుతున్న. నా కంటే మీరే నయం. ♦ గాంధీజీ : అవునా.. నాయన. శాంతియుత మార్గంలో నేను సాధించి పెట్టిన స్వాతంత్య్రం.. నువ్వు ప్రసాదించిన రాజ్యాంగం చూస్తే.. నా మనసు కలికలి అవుతుంది. నేటితరం నేతలు.. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం పరిధిలోనే తెలంగాణ సాధించామని, నీ గురించి ఎవరూ యాది చేయరేం. ఎవరికీ వారే తెలంగాణ తె చ్చింది మేమే అంటే.. మేమే.. అంటూ అందరూ వాళ్ల డబ్బానే కొట్టుకుంటున్నారు. రాజ్యాంగం రాసిన నీ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ♦ అంబేడ్కర్: అవును బాపు.. వాళ్లు యాదిచేస్తే ఎంత చేయకుంటే ఎంత. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు మేలు అని చెప్పినం. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాబద్ధంగా వచ్చింది. అయినా గిప్పుడు గా ముచ్చట్లు ఎందుకు బాపు. ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్. ♦ గాంధీజీ : అవునవును. మొన్న ఓ నాయకుడు నామినేషన్ వేసేందుకు ఎంత మందితో ఊరేగింపు తీశారో తెలుసా? డబ్బులిచ్చి మరీ జనాన్ని పోగుచేసి నామినేషన్ వేశారు. ప్రజాసేవ ఇప్పుడు ఎంతో ఖరీదైపోయిందో చూశావా.. ప్రజలకు సేవ చేసేందుకు ఇంత ఆరాటమా?! ♦ అంబేడ్కర్ : అంతెందుకు మహాత్మా. ఎన్నికల ప్రచారానికి జనానికి డబ్బులిచ్చి సమీకరించడం, ఊరేగింపులు తీయడ.. పూలదండలతో నిన్ను, నన్ను ముంచెత్తడం నచ్చడం లేదు. చూసే జనానికి నచ్చడం లేదు. నేటి తరం నేతలు నామినేషన్ టైమ్‌లోనే డామినేషన్ చూపించడం.. గెలిచిన తరువాత జనానికి కనిపించకుండా పోవడం పరిపాటే కదా. ♦ గాంధీజీ: అయ్యో అసలు సంగతి నీకు తెలియదు. ఎన్నికల సమయంలో చాటుమాటుగా మద్యం పంపిణీ చేస్తూ కులమతాలను రెచ్చగొడుతూ ఓట్లు పొందుతున్నారు. మహిళా సంఘాలకు నేరుగా డబ్బులివ్వడం, ఓట్లు మాకే వేయమని ప్రలోభాలకు గురిచేయడం మామూలైపోయింది. ♦ అంబేడ్కర్ : అవి కూడా నాకు తెలుసు మహాత్మా. అన్నీ తెలిసి ఈ కుళ్లును చూడలేక.. మీరు కళ్లు మూసుకున్నారు. నేను చూస్తూ కుమిలిపోతున్నాను. మీరు బోధించిన శాంతిమార్గాన్ని ఇప్పుడేలా మర్చారో చూశారా..? ♦ గాంధీజీ : నాయనా.. భీమ్రావు.. ఇవన్నీ నాకు తెలియనివి కావు. మీరు దేశవిదేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రూపొందించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి హారతి పట్టారు. సచ్చీలురకే పట్టం కట్టేలా రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనల్ని రూపొందించారు. ఇంత చేస్తే ఏం లాభం. మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మనం ఎవరిని ఉద్ధరించేందుకు వాటిని రూపొందించామో వారిలో చైతన్యం వచ్చేంత వరకు ఎవరూ ఏమి చేయలేరు. ♦ అంబేడ్కర్: అది కాదు మహాత్మా..! ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ పదవిలోకి రాగానే ఆ సొమ్మును వడ్డీతో సహా వందరేట్లు సంపాదించడం.. ఇదంతా ప్రజాసేవ కోసమే అంటే ఎవరైనా నమ్ముతారా..! పార్టీ టిక్కెట్ రాకుంటే వెంటనే మరో పార్టీలోకి దూకడం పరిపాటిగా మారింది. ♦ గాంధీజీ : నాయన నువ్వు, నేను ఎంత బాధపడినా లాభం లేదు. ప్రజల్లోనే మార్పు రావాలి. చైతన్యం రావాలి. ఎవరూ మంచివారు.. ఎవరు స్వార్థపరులో గుర్తించే సోయి రావాలి. డబ్బుల కోసమో.. కులపోడు అనో ఓటు వేస్తే ఐదేళ్లు బానిసలుగా బతకాల్సిందే. ఎవరి మాటలు వినకుండా.. ఓటును అమ్ముకోకుండా.. నిబద్ధతతో మంచివారికి పట్టం కట్టే రోజులు రావాలి. అప్పుడే సుపరిపాలన సాధ్యం. ♦ అంబేడ్కర్ : నిజమే.. మనం ఎన్ని చెబితే ఏమిటి.. ఎన్నికల తీరు చూస్తే సామాన్యులు.. నిస్వార్థపరులు పోటీ చేయగలరా..? పోటీచేసినా తట్టుకోగలరా? నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలు దాటొద్దు. కానీ డబ్బులు నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నారో చూశారా బాపూ! అందరూ ప్రజాసేవ చేస్తామంటూ ఓట్లు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తున్నారు. మందు పోస్తున్నారు. వాస్తవాలు ఏమిటో అందరికీ తెలిసినా ఓట్లు అమ్ముకుంటూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఓటర్లు మారితేనే మంచి పాలకులు వస్తారు.. వారి బతుకులు మారుతాయి. సరే కాని ఇగ తెల్లారిపోయింది. అదిగో.. వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి బస్సు రానే వచ్చింది. అటు మున్సిపల్ సిబ్బంది చీపుర్లతో వస్తున్నారు... ఇక నేను వెళ్తాను.. అంటూ... గాంధీజీ పెద్ద పెద్ద అడుగులేస్తూ వడివడిగా గాంధీచౌక్‌లోని దిమ్మైపెకి చేరిపోయారు. అంబేడ్కర్ సైతం కళ్లద్దాలను సర్దుకుని ఎప్పటిలాగే రాజ్యాంగాన్ని పట్టుకుని నిలబడ్డారు. ► అంతలోనే తెల్లారిపోయింది. యథావిధిగా సిరిసిల్ల జనసందడిగా మారింది. మైకుల ప్రచార మోత మళ్లీ మొదలైంది. నినాదాల జోరు తగ్గలేదు. ఆర్భాటపు ప్రచారాలు మరింత పెరిగాయి. ఇదంతా చూస్తున్న మహాత్మాగాంధీ, అంబేడ్కర్లు ఎప్పటిలాగే మనసులోని బాధను అర్ధరాత్రి వేళ ఒకరినొకరు కలుసుకుని చెప్పుకుంటూ గుండెల్లో భారాన్ని దించుకుంటున్నారు. -
చూపుడు వేలుపై...చుక్కాని
ముహమ్మద్ ఫసియొద్దీన్ : రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో యువ ఓటర్లు నిర్ణయాత్మకంగా మారబోతున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించబోతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే యువ ఓటర్ల నాడి పట్టి వారి మనస్సులను గెలుచుకోకతప్పని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సర్కారీ కొలువుల భర్తీ, నిరుద్యోగ సమస్యలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలుగా మారబోతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ప్రత్యేక హామీలు ఇవ్వక తప్పని స్థితి. యువతే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే, నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఓటేయబోతున్న వారిలో ఏకంగా 50.44 శాతం మంది 18–39 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నవ యువ ఓటర్లు, యువ ఓటర్లు, ఇప్పుడిప్పుడే మధ్య వయస్సులోకి అడుగిడుతున్న ఓటర్లుండడం గమనార్హం. ఓటర్లలో సగభాగం యువతే శాసనసభ సాధారణ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 4న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389కు పెరగగా, అందులో 1,59,98,116 (50.44%) మంది 19–39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లే ఉన్నారు. అందులోనూ 91,46,484 (28.84%) మంది మధ్య వయస్సులో అడుగుపెట్టిన 30–39 ఏళ్ల ఓటర్లే కావడం గమనార్హం. తొలిసారిగా ఓటు పొందిన 18–19 ఏళ్ల నవ యువ ఓటర్లు 8,11,640 (2.56%) ఉండగా, 20–29 ఏళ్ల నిడివి గల ఓటర్లు గణనీయంగా 60,39,992 (19.04%) మంది ఉన్నారు. గతంతో పోలిస్తే 5% తగ్గిన యువ ఓటర్లు... 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18–39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 55.4 శాతం ఉండగా, తాజా జరగనున్న ఎన్నికల్లో 50.44 శాతం ఉన్నారు. అప్పట్లో 20–29 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 24.84శాతం ఉండగా, ఇప్పుడు 19.04 శాతానికి తగ్గడమే ఇందుకు కారణం. స్థూలంగా చూస్తే గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి యువ ఓటర్లు 5శాతం తగ్గినా .. ఫలితాల్లో మాత్రం నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థితిలోనే ఉండడం గమనార్హం. 2018లో 50–59 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 12.73 శాతం ఉండగా, ఇప్పుడు 14.24 శాతానికి పెరిగారు. నాటితో పోల్చితే ఇప్పటి ఓటర్ల జాబితాలో మిగిలిన ఏజ్ గ్రూపుల ఓటర్ల శాతాల్లో స్వల్ప తేడాలే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 60 ఏళ్లుకు పైబడిన ఓటర్లు 45,96,051 (14.5శాతం) మంది ఉండగా, 40–50 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 20.83 శాతం ఉన్నారు. -
TS Election 2023: బీఆర్ఎస్కు ‘డబుల్ బెడ్రూం’ బెడద!
నిజామాబాద్: గతంలో డిచ్పల్లి పేరిట ఉండగా ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మారింది. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన మండవ వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా, ఒకసారి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో మండవ వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఆకుల లలిత విజయం సాధించి 10 నెలల పాటు ఎమ్మెల్యేగా పని చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఆర్ఎస్ఎస్, హిందూత్వ ప్రభావం బాగానే ఉంటుంది. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21, 22 ప్యాకేజీ, మంచిప్ప ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఆ హామీ నెరవేరలేదు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఆ గ్రామంతో పాటు బైరాపూర్, అమ్రాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలోని 8 తండాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. డిచ్పల్లి మండలం బీబీపూర్ తండ వద్ద మాత్రమే 50 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు. మిగిలిన మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల జాడే లేదు. రైతులు ధరణి సమస్యలపై ఆగ్రహంగా ఉన్నారు. గల్ఫ్ కార్మికులు సుమారు 33వేల మంది వరకు ఉంటారు. వారి కుటుంబ సభ్యులను లెక్కేస్తే 90వేల వరకు ఉంటారు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఏర్పాటు లో జాప్యం, గల్ఫ్ కార్మికులతో పాటు సమస్యలు ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్, నిరుద్యోగ భృతి తదితర హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా బీఆర్ఎస్ నేతల అసమ్మతి, కాంగ్రెస్, బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు: బీఆర్ఎస్: ► సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ : ► మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి ► అరికెల నర్సారెడ్డి ► నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్‌రెడ్డి బీజేపీ: ► మాజీ జెడ్పీటీసీ దినేష్‌కుమార్ వృత్తిపరంగా ఓటర్లు: రైతులు ఎక్కువగా ఉంటారు.. లంబాడా గిరిజనులు కూడా ఎక్కువగానే ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు: ► బీసీ ఓటర్లు : మున్నూరుకాపులు 40 వేలు ► యాదవులు/గొల్లకుర్మలు 15వేలు ► పద్మశాలీలు 19వేలు, ముదిరాజ్‌లు 20వేలు ► ఎస్సీలు : 28 వేలు, ఎస్టీలు 22వేలు ► క్రిస్టియన్లు : 10వేలు ► ముస్లీం మైనార్టీలు :15 వేలు భౌగోళిక పరిస్థితులు.. జిల్లాలోనే ప్రసద్ధి చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయం, రామడుగు ప్రాజెక్టు, తెలంగాణ యూనివర్సిటీ, సారంగపూర్ హనుమాన్ ఆలయం, ఇందల్వాయి రామాలయం, సిరికొండ లొంక రామేశ్వరాలయం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గం చుట్టూ సరిహద్దులుగా 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సిరికొండ, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి, రూరల్ మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. రాజకీయపరమైన అంశాలు.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కన్ఫాం అయ్యింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కుమారుడు ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ అధిష్టానం మాత్రం బాజిరెడ్డికే మరోసారి టికెట్ కట్టబెట్టింది. ఇక కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఈసారి ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తన మేనల్లుడు, ప్రముఖ సినీహీరో నితిన్ అండతో ఏఎంసీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరికి తోడు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సహకారంతో పార్టీ టికెట్ కోసం యత్నిస్తున్నారు. -
హాట్రిక్‌పై పువ్వాడ కన్ను.. ఖమ్మంలో రసవత్తర పోటీ!
ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హట్‌టాపిక్‌గా మారనుంది. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి పార్టీలు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా. 2004లో సిపిఏం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా ఆ తర్వాత టీఆర్ఏస్‌లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశం : ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరోవైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీసెంటర్ కాల్వడ్డు వంటి ప్రాంతాలను వర్షపు నీరు ముంచేత్తుతుంది. కాలనీలు చెరువులను తలపించే పరిస్థితిలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతు వస్తున్నారు...ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు కోరుతున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్లేదు. దీంతో 3 టౌన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సరైన లబ్ధిదారులకు అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి.. స్థానికంగా కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి.. అంతేకాదు కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న టాక్ సైతం లోకల్ గా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు వచ్చే ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదు అన్న ప్రచారం సైతం ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చుపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్‌తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్‌తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్‌కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22కోట్ల రూపాయలతో లకారం ట్యాంక్ బండ్, 8కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు..తీగల వంతెన పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 21కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, 25కోట్ల రూపాయలతో ఐటీ హబ్, 110 కోట్ల రూపాయలతో గొల్లపాడు ఛానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు. నూతన కార్పొరేషన్ భవనాన్ని ర్మించారు. దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం మూడు లక్షల పదకొండు వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సమాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఏక్కువగా ఉంటాయి. సిపిఏం, సిపిఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గం లో బలంగా ఉన్నాయి..అయితే వచ్చే ఎన్నికల్లో బీఅరెఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలో ఏవరితో పోత్తు పెట్టుకుంటారన్నది ఇంకా క్లారిటీ లేదు..వీరు ఏటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి కొంత కమ్యూనిస్ట్ ల ఓట్లు ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.. ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఖమ్మం సీటుపై కీలక నేతలు గురిపెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన పోటీ నెలకోనే అవకాశం ఉంది. ఇప్పిటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మంత్రి పువ్వాడ అజయ్‌కే మరోసారి టికెట్ కట్టబెట్టింది. దాంతో ఆయన హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు. ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన డికొనడానికి కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడకు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు పొంగులేటి. పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నారు. ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటిపై ఒత్తిడి తెస్తున్నారట. అటు జావిద్ కూడా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద టికెట్ ఆశిస్తున్నారు. వృత్తిపరంగా ఓటర్లు : పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఏక్కువగా ఉంటారు. రఘనాథపాలెం మండలంలో రైతులు ఏక్కువగా ఉంటారు. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతు ఉంటారు.కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి. మతం/కులం పరంగా ఓటర్లు : యాదవులు 45 వేల ఓట్లు, కమ్మ 48వేల ఓట్లు, మైనార్టీ ఓట్లు 30వేలు ఉంటాయి. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు విరివే. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది.ఖమ్మం నగరంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు.ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు.పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్,చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది.ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది. -
నిర్మల్ ఎన్నికల ‘వరద’లో ఎదురీదేవరు?
ఆ పట్టణం వేనిస్ను మరిపిస్తోంది. వర్షకాలం వస్తే చాలు కాలనిలు చెరువులు అవుతున్నాయి. రోడ్లు కాల్వలు అవుతాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పడవల్లో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. పోని ఇదంతా పర్యాటక ప్రాంతమా అంటే అదీ కాదు. పోనీ ప్రగతి అంటే కాదు. అభివృద్ధి అసలు కాదు. మరి దశాబ్ద కాలంగా మంత్రి సాధించిన వందల కోట్ల అభివృద్ధి పనులు వరద పాలు కావడానికి కారణాలేంటి? ఆ వరదలు మంత్రిని ఎన్నికలలో ముంచుతాయా? వరదనీటిలో కమలం వికసిస్తుందా? వరదనీరు తెలంగాణ యోధుడు శ్రీహరి రావు విజయతీరాలకు చేర్చుతుందా? నిర్మల్ ఎన్నికల వరదలో ఎదురీదేవరు? ఏటిలో కోట్టుపోయేదేవరు? నిర్మల్ ఎన్నికల వరద యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. వంద ఏళ్ల చరిత్ర, ఘనకీర్తి కలిగిన నిర్మల్ నిర్మల్ నియోజకవర్గానికి వందల చరిత్ర ఉంది. ఏంతో ఘనకీర్తి ఉంది. పాలన చిహ్నలు ఉన్నాయి. కోటలు ఉన్నాయి. కరువు పాతరేసిన చెరువులు ఉన్నాయి. కాలే కడుపులకు కడుపునిండా అన్నం పెట్టిన ధాన్యాగారం.. నియోజకవర్గంలో మామడ, లక్ష్మణ చాందా, సోన్ నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్ జి మండలంలో కోన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నూతన ఓటరు జాబితా ప్రకారం 2,33,248 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మున్నూర్ కాపు, ముస్లిం, ముదిరాజ్, పద్మశాలి, గంగపుత్రుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ నియోజకవర్గం నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రయ్యారు ఇంద్రకరణ్. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో 79,985 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించి. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. 9,271 ఓట్ల మెజారిటీతో మంత్రి విజయం సాధించారు. క్యాబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు. రెండోసారి మంత్రిగా అభివృద్ధిలో నిర్మల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చారు. నిర్మల్ పట్టణం సుందరీకరణ చేశారు. కాలనిలకు రోడ్లు నిర్మించారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం, మెడికల్ కళాశాల వంటివి సాధించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు రోడ్డు రవాణా కల్పించారు. అదే విధంగా నిర్మల్ ఆసుపత్రిని వంద పడకల అసుపత్రిగా మార్చారు. ఈ ప్రగతితో నిర్మల్ రూపురేఖలు మార్చారని పేరుంది. వీటితో పాటు అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దశ తిగిన దిశ మారని నిర్మల్ అభివృద్ధితో నిర్మల్ దశ మారిన దిశ మారలేదు. వందల ఎళ్లుగా నీళ్లను అందించే చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఆ కబ్జాలతో చెరువులు కనిపించకుండా పోతున్నాయి. వర్షకాలంలో చెరువులలో వెళ్లాల్సిన వరదనీరు రోడ్లపైకి వస్తోంది. కాల్వలను మరిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలలో ఇండ్ల పైకప్పులను ముంచుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పడవల్లో ప్రజలు భయటకు వస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ మున్సిపల్లో నాలగో తరగతి ఉద్యోగులనియమాకం వివాదస్పందంగా మారింది. ఉద్యోగాలన్ని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ బంధువులకు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధుల బంధువులకు దక్కాయి. అక్రమంగా ఉద్యోగాల నియమాకాలపై తీవ్రమైన దుమారం రేగింది. సంతలో సరుకులా మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ప్రజలు పార్టీల అధ్వర్యంలో ఉద్యమించారు. ఈ అక్రమం ఉద్యోగాల నియమాకాలపై అర్డిఓ చేత విచారణ జరిపించారు. ఆవిచారణలో ఉద్యోగాలు అక్రమంగా నియమాకాలు చేశారని తెలింది. ఆ ఉద్యోగాలు రద్దు చేయాలని అర్డీఓ సిఫార్స్ చేశారు. మంత్రి కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఇది మంత్రికి మచ్చగా మారింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం వివాదంగా మారుతోంది. చెరువులో ఎస్ఎటీఎల్ లేవల్ నిర్మాణం ఒక వివాదమైతే. దీనికి తోడు మంత్రి, బంధువులకు భూములు ఉన్నచోట కలెక్టరెట్ నిర్మాణం చేశారని ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయి. ఉద్యోగాల మచ్చ తోలగక ముందే పట్టణంలో మాస్టర్ ప్లాన్ మంత్రికి దడపుట్టిస్తోంది. తమ భూములు కోల్లగోట్టేందుకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపోందించారని రైతులు అందోళన కోనసాగిస్తున్నారు. భూములకు నష్టం కలిగించమని మంత్రి భరోసా ఇచ్చిన ఇంకా ప్రజలు నమ్మడం లేదట. అవినీతికి అడ్డాగా మంత్రి..! వీటితో పాటు డీ1 పట్టాలు మంత్రి బంధువులు అక్రమంగా పోందారని కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే దళితుల సంక్షేమం అమలు చేస్తున్నా ఈ దళితబంధు పథకం మంత్రికి అడ్డంగా తిరిగింది. నర్సాపూర్ జిలో దళిత బంధు గురించి మంత్రిని ప్రశ్నించిన మహిళపై కేసు నమోదైంది. అది దళిత వర్గాలపై వ్యతిరేకతను పెంచింది. నియోజకవర్గంలో సాగునీరు అందించే ప్రాణహిత, చేవేళ్ల 27 ప్యాకేజీ పనులు అంగులం కదలడం లేదు. అభివృద్ధి పనులు పురోగతి లేకున్నా పార్టీలో అసంతృప్తి మంత్రికి తలనోప్పిగా మారిందట. గత అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ భర్త సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ కీలక నాయకుడు శ్రీహరి మంత్రి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మంత్రి తీరుతో విసిగిపోయిన శ్రీహరి మంత్రిపై తిరుగుబాటు చేశారు. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా మంత్రి సన్నిహితుడు సారంగపూర్ జడ్పీటీసీ మంత్రితో విబేధాల కారణంగా పార్టీ వీడారు. కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి గెలుపు కోసం పనిచేసిన శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండుసార్లు అత్యల్ప ఓట్లతో ఓటమి పాలైనా ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వ్యూహలు రచిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. మంత్రి వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలలో ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రిపై వ్యతిరేకత.. కాంగ్రెస్, బీజేపీలకు ప్లస్? అదేవిధంగా అవినీతి మంత్రిని ఓడించాలని ప్రజలను కోరుతున్నారు. వరదలకు మంత్రి కబ్జాలే కారణమని ఆరోపిస్తున్నారట. ఈ సందర్భంగా ఎలేటి మహేశ్వర్‌రెడ్డి ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ ఓటర్ల మద్దతు కూడ గడుతున్నారు. ఎలేటికి ప్రజల్లో మద్దతు లభిస్తున్న ఎన్నికల వరకు మద్దతు ఉపయోగించుకోవడం లేదని పేరుంది. ఈసారి చివరి వరకు పట్టు నిలుపుకోని విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రచారం ఉంది. చుట్టం చూపులా హైదారాబాద్ నుండి వచ్చి పోతున్నారని భావన. ఈ భావన తోలగించుకోకుంటే ప్రతికూలంగా మారుతుందని కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేయడంలో వెనుకబడ్డారని సోంత పార్టీలో ఉంది. మంత్రిపై వ్యతిరేకత ఉన్నా అనుకూలంగా మలుచుకోకపోతే గత రెండు ఎన్నికల ఫలితాలే పునరావుతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా మంత్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికలలో గెలిచి తీరాలనే కసితో ప్రజల్లోకి వెళ్లుతున్నారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు 2009, 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీహరి రావు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో శ్రీహరి రావుకు భారీగా ఓట్లు లభించాయి. విజయ అంచుల వరకు హరి కేవలం ఎనిమిది వేల ఓట్లతో శ్రీహరి రావు ఇంద్రకరణ్‌రెడ్డిపై ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలలో శ్రీహరి రావు మంత్రి బీఅర్ఎస్లో చేరడంతో టికెట్ దక్కలేదట. కానీ బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడంతో బీఆర్ఎస్లో ఉన్న శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి మంత్రికి వ్యతిరేకంగా తనకు మద్దతు కూడగడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. 2014 ఎన్నికలలో ఓటమికి ఈ ఎన్నికలలో కసి తీర్చుకోవాలని భావిస్తున్నారట. మంత్రిపై ఉన్న వ్యతిరేకత తనకు గెలుపు ఖాయమని భావిస్తున్నారట శ్రీహరి. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ప్రజలు పట్టం కడుతారో చూడాలి. -
ముధోల్‌లో బీజేపీకి పట్టు.. బీఆర్ఎస్పై అసంతృప్తి?
ఈ ఎమ్మెల్యే మాకోద్దంటూ స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిదులు సైతం తిరగబడుతున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మార్చాలంటున్నారు. మార్చకపోతే మాదారి మేము చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా అధిష్టానం ఆయనకే మరోసారి బీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. దాంతో ముధోల్ గులాబీ దళంలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయట. మరి అధికార పార్టీలోని అసంతృప్తి సెగ కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందా? ముథోల్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందా? మాజీ మంత్రి వేణుగోపాల్ ఛారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దిగుతారా? ముధోల్ గడ్డ ఎన్నికల సమరంపై సాక్షి స్పెషల్ రిపోర్టు. నిర్మల్ జిల్లాలో ముథోల్ నియోజకవర్గం ఉంది. ఇది ఒకప్పడు కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోట గులాబీ సామ్రాజ్యంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ అధిక్యతతో గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయం సాధించారు. మళ్లీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తహతహలాడుతున్నారు. నియోజకవర్గంలో ముథోల్, బైంసా రూరల్, బైంసా పట్టణం, కుబీర్, కుంటాల, లోకేశ్వరం, బాసర మండలాలు ఉన్నాయి. వీటిలో 2,26,725 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో మున్నూరు కాపు, ముస్లిం, లంబడా, మరాఠ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల మద్దతుతో గడ్డేన్నగారి విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుండి గెలుపోందారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు. ముచ్చటగా మూడోసారి.. ముధోల్‌పై బీఆర్ఎస్ కన్ను! 2018లో జరిగిన ఎన్నికలలో 83,933 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ నుండి పోటీ చేసిన రమాదేవి 40,602 ఓట్లతో 22 శాతం ఓట్లు సాధించారు. రమాదేవిపై 43,331 మేజారీటీ రికార్డు స్థాయిలొ విజయం సాధించారు విఠల్ రెడ్డి. మళ్లీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని తహతహలాడుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించారు. అదే విధంగా ముథోల్, బైంసా అసుపత్రులలో బెడ్ల సంఖ్య పెంచి రోగులకు వైద్య సేవలు మేరుగుపరిచారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపుకు గురైనా గుండేగామ్ గ్రామస్తులకు పరిహరం మంజూరు చేయించారు. అదే విధంగా బాసర మాస్టర్ ప్లాన్ కోసం యాబై కోట్లు మంజూరు చేయించారు. అభివృద్ధి పథకాలతో పాటు విఠల్ రెడ్డి ప్రజల్లో సౌమ్యుడిగా మంచి పేరుంది. కానీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి చేసింది అణువంత మాత్రమే అనే విమర్శలు ఏదుర్కోంటున్నారు. ప్రాణహిత చేవేళ్ల 28వ ప్యాకేజీతో నియోజకవర్గంలో సాగునీటి కోసం అప్పట్లో కాల్వలు తవ్వారు. గత కాంగ్రెస్ హయంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కాల్వలు కనిపిస్తున్నాయి. 28 ప్యాకేజీ పనులు పురోగతి లేదు. రైతులకు సాగునీరు అందడం లేదు. అదేవిధంగా గుండేగామ్ ప్రజలకు పునరావాసం క్రింద నిధులు మంజూరైనా బాధితులకు పరిహరం అందలేదు. బీఆర్ఎస్పై అసంతృప్తి పైగా బాధితులు కోరిన విధంగా పరిహరం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే తీరుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాసర టేంపుల్ సిటీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నాయి. నిధుల మంజూరుతో అనువంత కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే బాసర ట్రిపుల్ ఐటి వివాదాల పుట్టగా మారింది. స్థానిక ఎమ్మెల్యేగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారని ఎమ్మెల్యే తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విఠల్‌రెడ్డి వైఫల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సమస్యలపై అట్టిముట్డనట్లుగా ఉండే ఎమ్మెల్యే తీరు ప్రజలకు నచ్చడం లేదట. దీనితో పాటు పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. ఎకంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తిరుగుబాటు సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ పదవులు, మార్కేట్, బాసర అమ్మవారి ఆలయం పదవులు భర్తి చేయని ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమదారి తాము చూసుకుంటామని పార్టీకి అల్టీమేటమ్ జారీ చేశారట. అయితే విఠల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ముథోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో బీజేపీ పట్టుందని నిరూపితమైంది. దీనికి తోడు బైంసా మున్సిపల్లో ఎంఐఎంకి పట్టుంది. ఎళ్లుగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని పాలన సాగిస్తోంది. ఎంఐఎం పాలనకు వ్యతిరేకంగా హిందూ సానుభూతి ఓటర్లు బీజేపీకి మద్దతు పలుకుతుండటం విశేషం. ఇక్కడ బీజేపీ కంటే హిందు వాహిని బలంగా ఉంది. ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థి రమాదేవి. గెలుపు ధీమాతో కమలం? అయితే బీజేపీకి నియోజకవర్గంలో ఊపు పెరిగింది. బండి సంజయ్ పాదయాత్ర నియోజకవర్గంలో పార్టీకి బలాన్ని పెంచింది. గెలుపు ఖాయమనే బావన పార్టీ నాయకులలో పెరిగింది. ఒకవైపు సంజయ్ పాదయాత్రకు తోడు కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రామరావు పటేల్, మోహన్ రావు పటేల్ పార్టీలో చేరారు. రమాదేవితో పాటు ఈ ఇద్దరు కూడ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారట. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినా ప్రజల్లోకి ముగ్గురు వెళ్లుతున్నారు. ప్రజల మద్దతు కూడ గడుతున్నారట ఎన్నికలలో పోటీ చేసి విఠల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారట ముగ్గురు. టిక్కెట్ కోసం సాగిస్తున్నా పోరు పార్టీని బలహీనం చేస్తోందట. ఏవరికి వారు పోటీ పడి ఈ ముగ్గురు నాయకులు పార్టీని బలహీనం చేస్తున్నారని కార్యకర్తలు దాల్చిన. ఈ ముగ్గురు కలిసి పార్టీ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థి కోసం పనిచేయకపోతే ఓటమి తప్పదని పార్టీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. రామారావు పటేల్ కాంగ్రెస్ వీడటంతో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకులే పోటీ దిక్కు అన్నట్టు చందంగా మారింది. బలమైన అభ్యర్థి కోసం పార్టీ పెద్దలు అన్వేషణ సాగిస్తున్నారు. వేణుగోపాల్ చారికి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందట. బీజేపీ టిక్కెట్ పంచాయితీ తనకు అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారట. బీజేపీ టిక్కెట్ పోరు, ఎంఐఎం మద్దతు అభిస్తే సంక్షేమ పథకాలతో విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు ఎమ్మెల్యే. బీజేపీ మాత్రం హిందూ ఓటు బ్యాంకు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, సర్కార్ వైఫల్యాలు విజయానికి చెరువచేస్తాయని అంచనా ఉంది. ఈసారి ఆరునూరైనా ముథోల్ గడ్డపై కమలం జెండా ఎగురడం ఖాయమంటున్నారట ఆ పార్టీ నాయకులు. మరి ఈమూడు పార్టీల్లో ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
మంచిర్యాల: పత్యర్థులపై వ్యూహాస్రాలు.. గెలుపు ధీమాతో పార్టీలు!
ఆ ఎమ్మెల్యే వైఫల్యాల రాజు.. ప్రగతిని పరుగులు పెట్టించలేదని సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావును మార్చాలంటున్నారు. మార్చకపోతే మునగడం ఖాయమంటున్నారు. అయినా అధిష్టానం మళ్లీ ఆయనకే టికెట్ కట్టబెట్టింది. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్న దివాకర్‌కు కేసీఆర్ ఏ ధీమాతో టికెట్ ఇచ్చారో అర్థం కాని విషయం అంటున్నారు. మరి మంచిర్యాలలో బీఅర్ఎస్ కోటలకు బీటలు పారుతుందా? కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమైందా?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గుండా గండమే కాంగ్రెస్‌కుకు గండంగామారిందా? సింగరేణి సమరంలో కమలం సత్తా చాటుతుందా? మంచిర్యాల ఎన్నికల యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. మంచిర్యాల నియోజకవర్గం అపారమైనా నల్లబంగారం నిల్వలు ఉన్నా ప్రాంతం. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాదినిస్తోంది. అలాంటి నియోజకవర్గంలో మంచిర్యాల, హజీపూర్, నస్పూర్, దండేపల్లి, లక్షిట్పెట మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,46,982 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో పేరుక సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. మిగితా కులాల్లో మున్నూరు, ఎస్సీ, యాదవ, గౌడ, పద్మశాలి, సింగరేణి ఓటర్లు ఉన్నారు. పేరుక సామాజిక, సింగరేణి కార్మికుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. అయితే గులాబి పార్టీకి మంచిర్యాల కంచుకోట. ఉద్యమకాలం నుండి ఇప్పటి వరకు కార్మికులు పార్టీకి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాకముందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అరవింద్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. తెలంగాణ అవతరణ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండుసార్లు బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే దివాకర్ రావు విజయం సాదించారు. 2018 ఎన్నికలలో దివాకర్ రావు 75,360 ఓట్లు సాదించి 45 శాతం ఓట్లు సాదించారు. ప్రేమ్ సాగర్ రావుపై 4,848 ఓట్ల తేడాతో ఓటమి నుండి ఓడ్డేకారు దివాకర్ రావు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 70,512 ఓట్లతో 42 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునాథ రావు 5018 ఓట్లతో మూడు శాతం ఓట్లు సాదించారు. డిపాజిట్ కోల్పోయారు. దివాకర్ రావు అంతకు ముందు రెండుసార్లు విజయం సాధించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రోడ్లు, త్రాగునీటి వసతి, జిల్లా కేంద్రంలో మెడికల్ కళశాల సాధించారు. అదే విధంగా నూతన కలెక్టర్ కార్యాలయం పనులు చేసేలా చోరవ చూపారు. జిల్లా అసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రగతిని పరుగులు పెట్టించలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నా పట్టణం. కానీ అభివృద్ధి లేదు. గోదావరి ప్రక్కన ఉన్నా వేసవి వచ్చిందంటే నీటి కోరతతో కొన్ని కాలనివాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించడం వల్ల వర్ష కాలంలో నీటిలో మునిగిపోయింది. పట్టణానికి దూరంగా నిర్మించడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గూడేం ఎత్తిపోతల పథకం నిర్వహణ అద్వానంగా మారింది. నీరందించే పైపులు పగిలిపోతున్నాయి. దాంతో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మర్మమత్తుల ఎమ్మెల్యే సకాలంలో స్పందించలేదని రైతులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏకంగా రోడ్లు వేయని ఎమ్మెల్యే మా గ్రామాలకు, కాలనిలకు రావద్దని లక్షిట్పెపెట్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ప్లేక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తమను ఓట్లు అడగవద్దంటున్నారు. ఇవన్ని ఒక ఎత్తయితే మంచిర్యాల ప్రాంతంలో సింగరేణి, సర్కార్ భూములు బీఅర్ఎస్ నాయకులు లూటీ చేశారనే అరోపణలు ఉన్నాయి. పైగా భూముల లూటీల దందాలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు సందిస్తుండటం విశేషం. రాబోయే ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు అయితే ప్రతికూల ఫలితం తప్పదని సర్వేలో తెలిందని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ మరోసారి ఆయనకే టికెట్ రావడంతో ముధోల్‌లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ప్రత్యర్థులు. గత అసెంబ్లీ ఎన్నికలలో దివాకర్ రావు కేవలం 4848 ఓట్లతో ప్రేమ్ సాగర్ రావును ఓడించారు. దాంతో ఈసారి ఎన్నికలలో ఎమ్మెల్యేపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేమ్ సాగర్‌రావు కసితో ఉన్నారు. ప్రజల్లో దివాకర్ రావుపై వ్యతిరేకత పెరగడం, రుణమాఫి, సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఇచ్చిన మీలు నేరవేర్చకపోవడం ఇలాంటి ఆంశాలు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు. పార్టీకి ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈసారి ఆరునూరైనా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రేమ్ సాగర్‌రావు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ కొందరు ప్రేమ్ సాగర్ కంటే ఆయన భార్య సురేఖ గెలిచే అభ్యర్థిగా అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నికలలో తానే పోటీచేస్తానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. అయితే బీఅర్ఎస్ మాత్రం ప్రేమ్ సాగర్ గెలిస్తె మంచిర్యాలలో రౌడి రాజ్యం వస్తుందని ప్రచారం చేస్తోంది. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా వ్యూహాలు రచిస్తోంది. గులాబీ పార్టీ గత ఎన్నికల మాదిరిగా మళ్లీ అదే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇక బీఅర్ఎస్ తనపై వేసిన రౌడి ముద్రను ప్రేమ్ సాగర్ రావు కొట్టిపారేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామంటున్నారు. ఇక నియోజకవర్గంలో కమలం పార్టీ పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రఘునాథ రావుకు 5వేల ఓట్లు మించలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది పార్టీ బలం. కానీ ఈసారి పార్టీ అభ్యర్థిని మార్చి సత్తా చాటుతామంటున్నారు కమలం పార్టీ నాయకులు. మూడు పార్టీలు మంచిర్యాలపై జెండాను ఎగురవేస్తామంటున్నారు. మరి ముధోల్‌లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. -
ఖానాపూర్‌లో విచిత్ర పరిస్థితి, ఎవరికి వారే యమునా తీరే!
అది ఒకప్పుడు గోండు రాజుల రాజ్యం. ఆ రాజ్యంలో పాలన సాగించారు. కోటలను నిర్మించారు. మళ్లీ ఆ రాజ్యం కోసమే గోండులు ఎన్నికల యుద్దానికి సై అంటున్నారు. లంబడాలతో పోరుకు సిద్దమవుతున్నారు. అదివాసీ, లంబడాల మధ్య పోరులో విజయం ఏవరిని వరిస్తుందా? ఖానాపూర్ అదివాసీల వశం అవుతుందా? ఖానాపూర్‌లో గోండు రాజులు వర్సేస్ లంబడాల మధ్య ఎన్నికల యుద్దంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా గోండు రాజులు పాలనా సాగించారు. తెలంగాణ నుండి మహరాష్ట్ర వరకు రాజ్యాన్ని విస్తరించారు. ఉట్నూరు కేంద్రంగా పాలన సాగించిన చరిత్ర ఉన్నా నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది. ఎస్టీ రిజర్వుడ్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంధ్రవేల్లి, ఖానాపూర్, కడెం,పెంబి, దస్తురాబాద్, జన్నారం మండలాలున్నాయి. ఇక్కడ 2,05,753 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో అదివాసీ, లంబడా, బిసీ, ఎస్సీ ,మైనారిటీ సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రేఖానాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఈ సారి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కి అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. ఈ క్రమంలో రేఖానాయక్ అసంతృప్తితో పార్టీ మారతానని ప్రకటించడం ఇక్కడి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. 2018 ఎన్నికలలో 67,138 ఓట్లతో 44శాతం ఓట్లు సాధించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ 46,428 ఓట్లతో 15% ఓట్లు సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై రేఖానాయక్ 20,710 ఓట్లతో విజయం సాధించారు. రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖనాయక్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో సాగునీరు సదర్ మఠ్ బ్యారేజి నిర్మాణం పనులు చేపట్టారు. ఇంకా పనులు కోనసాగుతున్నాయి. అదేవిధంగా ఉట్నూరులో ఆసుపత్రిని ముప్పై పడకల నుండి వందల పడకలకు పెంచేలా చర్యలు చేపట్టారు. అదే విధంగా కోన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మేరుగుపరిచారు. కడెం మండలం గంగాపూర్ వాసులు కడెం వాగును దాటడానికి వంతేన పనులు ప్రారంభించారు. అయితే రెండు సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలుపోందిన చేసిన అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. సదర్ మఠ్ ప్రాజెక్ట్ ఖానాపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించడంలో స్థానికంగా నాగర్జున సాగర్ రైతులు భావిస్తున్నారు. ఇది గోదావరిపై అప్పటి నిజామ్ సర్కారు ఖానాపూర్ మండలంలొని మ్యాడమ్పల్లిలో నిర్మించారు. ఆనకట్ట ద్వారా నీటిని నిల్వ చేసి కాల్వ ద్వారా ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరిందిస్తున్నారు. అలాంటి సదర్ మఠ్‌ను అదే ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా ఆనకట్ట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే పనుల ప్రారంభం కోసం ఖానాపూర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పోన్కల్ ప్రాంతంలో సదర్ మఠ్ నిర్మిస్తున్నారు. చివరి దశకు పనులు చేరుకున్నాయి. ఇక్కడి నుండి జగిత్యాల మల్లాపూర్ మండలంలో పంటపోలాలకు సాగునీటిని అందించనున్నారు. పైనా ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టు ఖానాపూర్, కడేం మండలాల ఆయకట్టు ఏడారిగా మారుతుందని రైతులు అందోళన చెందుతుమ్నారు. ఎగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఆయకట్టు క్రింద ఒకప్పుడు రెండు పంటలు పండేవి. కానీ, ఇప్పడు ఒక్కోసారి పంటలు కూడా పండటం లేదు. గోదావరి నీళ్లు మళ్లీంచడంపై రైతులు మండిపడుతున్నారు. కొత్త సదర్ మఠ్ నుండి పాత సదర్ మఠ్ ఆయకట్ట అయినా ఖానాపూర్, కడెం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కాల్వను ఏర్పాటు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు. సదర్ మఠ్ తరలిపోవడానికి ఎమ్మెల్యే రేఖ నాయక్ కారణమని ఆమెపై మండిపడుతున్నారు. సదర్ మఠ్ తరలిపోయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో చాలా అదివాసీ గూడాలున్నాయి. గూడాలకు రోడ్లు లేవు. అదేవిధంగా త్రాగునీరు కూడా లేదు. ఈ ప్రాంతాలలో రోగం వస్తే అదివాసీలకు దేవుడే దిక్కు అన్నట్టుగా మారింది. అంతేకాదు అదివాసీలు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. కానీ అందరికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే వైఫల్యంపై అదివాసీలు అసంతృప్తితో ఉన్నారు. సమస్యలన్ని ఒక ఎత్తయితే నియోజకవర్గంలో అర్ఎస్ టాక్స్ సంచలనంగా మారిందట. దీనిని స్థానికులు రేఖనాయక్ సర్వీస్ టాక్స్ పిలుస్తారని ప్రజల్లో ప్రచారం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధి ముందుకు జరగాలన్నా ఆర్ఎస్ టాక్స్ ఎమ్మెల్యే వసూలు చేస్తారని ప్రచారం ఉంది. దళితబంధుకు యూనిట్ రెండు లక్షలు ముట్టజెప్పితే తప్ప పథకం మంజూరు కావడం లేదట.రేఖనాయక్‌కు ఆర్ఎస్ టాక్స్ చెల్లిస్తేనే ఫథకాలు దక్కుతాయట. లేదంటే అంతే సంగతులట. ఇవన్ని అనుచరుల ద్వారా ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు రేఖనాయక్ విమర్శలు సందిస్తున్నాయట. సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి పథకాలైనా రోడ్లు, చెక్ డ్యామ్‌లు, భవనాలు, పనులేవైనా వదలడం లేదట. లేదంటే పనులు అడుగు ముందుకు కదలవని ప్రచారం ఉంది. అభివృద్ధి సంక్షేమ, పథకాలతో అప్రతిష్టను మూటగట్టుకున్నా ఎమ్మెల్యేకు పార్టీలో అసంతృప్తి తలనోప్పిగా మారిందట. ప్రజల్లో రేఖనాయక్‌కు వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుండి మాజీ ఎంపి రమేష్ రాథోడ్, హరినాయక్, పెంబి జడ్పీటీసీ జానుబాయి టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి ఎడ్మా బోజ్జు, ఉట్నూరు జడ్పీటీసీ చారులత పోటీపడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపి రమేష్ రాథోడ్ గ్రామాల్లో ప్రజలను కలుస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల నుండి మంచి స్పందన లబిస్తోంది. కానీ రమేష్ రాథోడ్ లంబడా సామాజిక వర్గానికి చెందిన వారు. రమేష్ రాథోడ్‌పై అదివాసీ సామాజికవర్గం వ్యతిరేకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో అదివాసీలు ఓట్లు వేయలేదు. దీనికి తోడు రమేష్ రాథోకు మైనారీటీ ఓట్ల భయం ఉంది. గతంలో అండగా ఉన్న మైనారీటీలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్లు వేస్తారా లేదా అనేది భయం పట్టిపీడిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు ఎడ్మాబోజ్జు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తానే అభ్యర్థినని రాబోయే ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అదివాసీ అభ్యర్థిగా తనకు అనుకూలంగా మారుతుందని ఎడ్మాబోజ్జు అంచనా వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అదివాసీలంత అండగా నిలబడితే తన విజయం ఖాయమని భావిస్తున్నారు బోజ్జు. బొజ్జుకు వ్యతిరేకంగా టిక్కెట్ దక్కించుకోవాలని ఉట్నూరు జడ్పీటీసీ చారులత భావిస్తున్నారు. కానీ గత జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ జడ్పీటీసీగా ఎన్నికై బీఆర్ఎస్ ఓటు వేశారు. అయితే అమ్ముడుపోయే అభ్యర్థిగా చారులతకు ముద్ర ఉండటంతో ఆమెకు టిక్కెట్ దక్కదని బోజ్జు కోట్టిపారేస్తున్నారు. ఫైనల్‌గా ఎవరికి వారే తమకు విజయం దక్కుతుందంటూ, తమదే సీటు అంటున్నారు. బీజేపీ రమేష్ రాథోడ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అదే విధంగా 2019 ఎన్నికలలో ఓటమి సానుభూతి ఉందని ఈసారి గెలిచి తీరుతామంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుడు అదివాసీ అస్త్రంతో తనదే విజయమంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు బోజ్జు మరి ఈ ముగ్గురిలో ప్రజలు ఏవరిని గెలిపిస్తారో చూడాలి. -
బీఆర్ఎస్ కంచుకోట బోథ్‌లో ఉత్కంఠ!
ఒకప్పుడు మావోయిస్టు కోట ఉన్న బోథ్ ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. కానీ ఎమ్మెల్యే తీరుతో బీఅర్ఎస్ కోట బద్దలవుతోంది. ఎమ్మెల్యేపై సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. ఇక అధిష్టానం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండ కొత్త అభ్యర్థి పేరు ప్రకటించింది. ఈసారి టికెట్‌ను అనిల్ జాదవ్‌కు కట్టబెట్టింది. దాంతో బోథ్ ఎన్నికలు వెడేక్కాయి. ఇక ముందు నుంచే అధిష్టానం అభ్యర్థి మార్పుపై సంకేతాలు ఇస్తూ రావడంతో బీఆర్ఎస్లో ఆశావాహులు సంఖ్య పెరిగిందట. టికెట్ అనిల్ జాదవ్‌కు ప్రకటించడంతో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంపి సోయం బాపురావు ఏ పార్టీ రంగంలో దిగుతారు? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుండి పోటి చేయడ ఖాయమైందా? లేదంటే కమలం నుండి పోటీ చేస్తారా? భోథ్‌లో ఎన్నికల వార్‌పై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో సుందరమైన జలపాతాలు ఉన్నా ప్రాంతం. ప్రధానంగా కుంటాల, పోచ్చేర, గాయత్రి, కనకాయి జలపాతాలు ఉన్న అద్భుతమైన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, భీమ్‌పూర్, తలమడుగు, బజరాత్నూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,0,1034 ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో గోండులు అత్యదికంగా ఉన్నారు. వీరే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలల్లో ప్రజల్లో దూసుకపోతుంది గులాబీ పార్టీ. కానీ, ఈ నియోజకవర్గంలోఎమ్మెల్యే వ్యవహర శైలి పార్టీ తలనోప్పిగా మారింది. అవినీతి అరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కేట్ ఇస్తే ఓటమి ఖాయమట. అలాంటి వారికి టిక్కెట్ ఇస్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేలలో తెలిందట. అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేయాలని ఉత్సహం చూపిస్తున్నారు. కానీ పార్టీ నిర్వహించిన సర్వేలలో ప్రజల్లో వ్యతిరేకత అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే నట. దీనికి తోడు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు మచ్చగా మారిందట. ప్రజలతో అనుబంధం లేదట. పార్టీనాయకులతో సఖ్యత లేదట. అభివృద్ధి పనుల నుండి సర్కార్ సంక్షేమ. పథకాలలో అడ్డగోలుగా అవినీతికి పాల్పపడ్డారని ఎమ్మెల్యేపై అరోపణలు ఉన్నాయట. దళితబంధులో ఎమ్మెల్యే అనుచరులు లూటీ దందా సాగించారని ప్రచారం ఉంది. అదేవిధంగా జలపాతాలు ఉన్నా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయలేదు. సాగునీరు అందించడానికి కుప్టి నిర్మించలేదు. నియోజకవర్గంలో డిగ్రీ కళశాల లేదు. ఎళ్లుగా కళశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రేవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక అనేక మారుమూల గూడాలకు రవాణా సౌకర్యం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయలేదు. పైగా ఈ అవినీతి ఆరోపణలే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు టిక్కెట్ ఎసరు తెచ్చిందని అంటున్నారు. ఓడిపోయే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వలేమని సీఎం కేసీఅర్ బాపురావుకు తేగేసి చెప్పారట. గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తరపున ఎంపీ సోయం బాపురావు పోటీ చేసి విజయం సాదించారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీకి సిద్దమవుతున్నారు. అయితే సోయం బీజేపీ నుండి పోటీ చేస్తారా? లేదంటే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. అదివాసీల మద్దతున్నా సోయం బాపురావు బలమైన అభ్యర్థి. మాజీ ఎంపి నగేష్పే గతంలో ఓడించారు సోయం.. కానీ మాజీ ఎంపి నగేష్ మళ్లీ ఎంపిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ కూడా దేశంలో పట్టుసాదించాలని భావిస్తున్నారు. దేశంలో బీఅర్ఎస్ కీలకపాత్ర పోషించాలంటే ఎంపీ సీట్లు కీలకం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగేష్‌ను ఎంపిగా పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతుందట. -
బెల్లంపల్లిలో ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత! బీజేపీకే ప్లస్సా?
లైంగిక వేధింపులు ఎమ్మెల్యే పరువుని నీళ్లలో ముంచాయి. భూముల కబ్జాలు అడ్డంతిరుగుతున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ఎసరు తెస్తున్నాయి. సోంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేకు ఏదురు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత మాజీ మంత్రి వినోద్‌కు అనుకూలంగా మారుతుందా? కాంగ్రెస్ విజయానికి దారులు ఏర్పాటు చేస్తుందా? కమలం పార్టీ సత్తచాటుతుందా? బెల్లంపల్లి ఎన్నికల పోరుపై సాక్షి స్పేషల్ రిపోర్ట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నియోజకవర్గంలో బెల్లంపల్లి మున్సిపాలీటీ నెన్నెల, బీమిని, కన్నేపల్లి, తాండూరు, వేమనపల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 112 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో 1,61,249 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో నేతకాని, మాల, మాదిగా, మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ కులాల ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని అచరించే ఓటర్లు, సింగరేణి ఓటర్లు ఉన్నారు. ఎస్సీలలో నేతకాని ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు : ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నా వారికి పట్టాలు ఇప్పించారు. అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యాలు మారుమూల ప్రాంతాలకు కల్పించారు. కానీ ఎమ్మెల్యేగా పెద్దగా అభివృద్ధి పనులు చేయలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, మెడికల్ కళశాల, మంచిర్యాల జిల్లా కేంద్రంగా బెల్లంపల్లిని ఏర్పాటు చేయాలని ప్రజలు ఉద్యమించారు. కానీ వీటిని సాధించడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎమ్మెల్యే వివాదాల పుట్ట అకారణంగా టోల్ ప్లాజా సిబ్బందిపై, అరిజిన్ పాల కంపేని ప్రతినిధిపై లైంగిక వేధింపులు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు అందోళన కోనసాగిస్తోంది. అదేవిధంగా సర్కార్ భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వేంచర్లకు డిఎంఎఫ్ నిదులు కేటాయించడం ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాయని ప్రచారం ఉంది. వీటితో ప్రజల్లో ఎమ్మెల్యే పరువుపోయిందట. పార్టీ నిర్వహించిన సర్వేలలో ఎమ్మెల్యేపై తీవ్రమైన వ్యతిరేకత బయట పడుతుందట. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గంకు టిక్కెట్ ఇస్తే మునగడం ఖాయమని తెలిందట. సిట్టింకిలకే టికెట్ అని చెప్పిన అధిష్టానం దుర్గంకే ఈసారి టికెట్ కట్టబెట్టింది. ఎమ్మెల్యేపై వ్యతికత కాంగ్రెస్‌కు బలంగా మారనుందా? ఎమ్మెల్యేపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు బలంగా మారినట్టు కనిపిస్తోంది. ఈసారి ఎలాగైన గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్దమవుతున్న మాజీ మంత్రి వినోద్.. ఎమ్మెల్యే చిన్నయ్య, అవినీతి, లైంగిక వేధింపులు ప్రజల్లో తీసుకవెళ్లుతున్నారు. తనకు ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారట. ఎమ్మెల్యే వ్యతిరేకతపై ప్రజల్లో అనూహ్యమైన స్పందన లభిస్తోందట. స్పందన చూసి వినోద్ విజయం ఖాయమని భావిస్తున్నారట. కానీ కాంగ్రెస్‌లో విభేదాలు వినోద్‌కు తలనోప్పిగా మారయట. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తనవర్గానికి టిక్కెట్ దక్కేలా ఎత్తుగడలు వేస్తున్నారట. ఆ టిక్కెట్ విభేదాలు కాంగ్రెస్‌లో దాడులు చేసుకునే స్థాయికి చేరాయట. కాంగ్రెస్ కంటే బీజేపీకే మరింత ప్లస్? ఈ విభేదాలు ఎన్నికలలో ప్రభావితం చూపుతాయని వినోద్ అందోళ చెందుతున్నారట. కానీ ఎమ్మెల్యే వ్యతిరేకత తనను గెలిపిస్తుందని భావిస్తున్నారట. బీజేపీ ఇంచార్జ్ ఏమాజీ కూడా సర్కారు వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకత కాంగ్రెస్ కంటే బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారట. కానీ అనుకున్నంత బీజేపీకి ఊపు రావడం లేదని అందోళన చెందుతున్నారట. మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకత, సర్కార్ వైపల్యాలు కలిస్తే చాలు కమలం వికసిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారట. మూడు పార్టీలు తామే విజయం సాధిస్తామని అంచనాలు వేసుకుంటున్నాయట. మరి ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
అసిఫాబాద్‌లో వేడెక్కిన రాజకీయం!
పోడు భూములకు పట్టాలిచ్చారు. జల్ జంగల్ జమీన్‌పై హక్కులిచ్చారు. అయినా ఎమ్మెల్యే అత్రం సక్కుపై అదివాసీల్లో అసంతృప్తి అగ్గిరాజేస్తోంది. ఎమ్మెల్యే అత్రం సక్కుపై అదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాంతో అధిష్టానం జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి టికెట్‌ను ప్రకటిచింది. అప్పటి వరకు బీఆర్ఎస్కు ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుంతుందని కాంగ్రెస్, బీజేపీలు భావించాయి. కానీ కోవ లక్ష్మికి టికెట్ దక్కడంతో ప్రతిపక్షాల అంచనాలు తారుమారు అయ్యాయి. అయినా అక్కడ అధికార పార్టీకి ఉన్న వ్యతిరేత తమకు కలిసివస్తుందనే ఆశభావంతో ప్రతిపక్షాలు ఉన్నాయి. కోమురంభీం జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం అదివాసీ పోరాట యోధుడు కోమురంభీం పుట్టిన పోరుగడ్డ ఇది. ఇక్కడి నుండి జల్, జంగల్, జమీన్ యుద్దం సాగించారు. నిజాంపై జోడేఘాట్‌లో సాగించిన పోరాటంలో కోమురం భీం అసువులు బాశారు. ఇంతటి చరిత్ర కలిగిన నియోజకవర్గంలో అసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, కెరమేరి, నార్నూర్, గాదేగూడ జైనూర్, కేరమేరి, లింగపూర్, సిర్పూర్ యు, రెబ్బేన మండలాలు ఉన్నాయి. వీటిలో 2,06,709మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అదివాసీలు, లంబడాలు, బీసీలు, ఎస్సీ ఓటర్లు ఉన్నారు. అదివాసీల ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఎమ్మెల్యేగా అత్రం సక్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 171 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సక్కు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అత్రం సక్కు కాంగ్రెస్ పార్టీని వీడీ బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా అసిఫాబాద్‌లో మేడికల్ కళశాల ఏర్పాటు చేయించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో రోడ్డు రవాణా సౌకర్యం కల్పించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా పోడు పట్టాలు సర్కారు పంపిణీ చేసింది.. కానీ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయడంలో విఫలం ఆయ్యారని అపవాదును ఎదుర్కోంటున్నారు. అనేక గూడాలలో తాగునీటి సమస్య ఉంది. అదేవిధంగా రోడ్లులేవు, వాగులపై వంతేనలు లేవు. లక్మాపూర్, కరంజీవాడ, గుండి వాగులపై వంతేనలు లేవు. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కోమురం భీం ప్రాజెక్టు నిదులు సాధించలేకపోయారు. అసంపూర్తిగా ఉంది. దీనితో సాగునీరు అందడంలేదు. ఇలాంటి వైఫల్యాలతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందట. గూడాల్లో అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయట. బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలలో బీఅర్ఎస్కు వ్యతిరేకత బయట పడిందట. టిక్కెట్ ఇస్తే ఓటమి ఖాయమని తెలిందట. దాంతో అదిష్టానం కోవ లక్ష్మికి టికెట్ కట్టబెట్టింది. దాంతో అసిఫాబాద్‌లో ఎన్నికలు వేడెక్కాయి. అప్పటి వరకు ఎమ్మెల్యేకు ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని భావించిన కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూసిన కాంగ్రెస్, బీజేపీకి కోవ లక్ష్మితో గట్టి పోటీ తప్పెలా లేదని అంటున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సరస్వతి, గణేష్ రాథోడ్ సక్కు వైఫల్యాలపై ప్రజల్లోకి వెళుతున్నారు. వైఫల్యాల ఎమ్మెల్యేను ఓడించాలని కోరుతున్నారట. అదే విధంగా బీజేపీ నాయకుడు కోట్నాక విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీకి మద్దతు కూడగడుతున్నారు. -
నర్సంపేటలో బీఆర్ఎస్పై డబుల్ బెడ్రూం ఎఫెక్ట్?
2018 ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సుదర్శనరెడ్డి.. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాధవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించగా, 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : నిరుద్యోగ సమస్య. రోడ్లు. డ్రైనేజీ. డ్రింకింగ్ వాటర్. సరియైన గృహవసతులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు (డబుల్ బెడ్ రూమ్). భూ సమస్యలు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వరంగల్ జిల్లాకు ఎడ్యుకేషన్ హబ్‌గా మారిన నర్సంపేట. త్వరలో రాబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాల. ఇప్పటికే ఉన్న రెండు ఇంజనీరింగ్, బీఈడి కళాశాలలు. త్వరలో ప్రారంభం కానున్న 350 పడకల జిల్లా ఆస్పత్రి. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్‌రెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డి (ఆశావాహులు) బీజేపీ రేవూరి ప్రకాశ్‌రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు భౌగోళిక పరిస్థితులు.. పాఖాల అభయారణ్యం. పర్యాటక కేంద్రంగా పాఖాల సరస్సు. -
యుద్ధాన్ని తలపించేలా ఆదిలాబాద్ ఎన్నికలు
ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఈసారి జరగబోయే ఎన్నిక యుద్దాన్ని తలపిస్తోంది. ఇక్కడ పాగా వేసేందుకు కారు పార్టీ, కమలం, కాంగ్రెస్ కత్తులు దూసుకుంటున్నాయి. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఐదోసారి ఎమ్మెల్యేగా జోగు రామన్న విజయం సాధించకుండా పావులు కదుపుతున్నారు. ఆదిలాబాద్ ఎన్నికల యుద్ధంలో గెలిచే బాద్ షా ఎవరు. తెల్ల బంగారం కోటలో ఎన్నికల విజయభేరి మోగించేది ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఓ వైపు అపారమైన మాంగనీస్ సిరులు, మరోవైపు సిమెంట్ నిల్వలున్నాయి. ఇంకోవైపు తెల్ల బంగారం పంటకు ఆసియాలోనే ప్రసిద్ది చెందింది. నియోజకవర్గంలో ఆదిలాబాద్, జైనథ్, బేల, మావల. ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మండలాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం రెండు లక్షల ఇరవై ఐదు వేల ముప్పై నాలుగు ఓటర్లు ఉన్నారు.. వీరిలో ప్రధానంగా మున్నూరు, ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారే ఈ అభ్యర్థుల రాతను మార్చనున్నారు. మంత్రి పదవిపై రామన్న కన్ను! ప్రస్తుతం ఎమ్మెల్యేగా జోగురామన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీపాయిగూడ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సర్పంచ్గాగా జైనథ్ ఎంపిపిగా, జడ్పీటీసీగా, ఆదిలాబాద్ నియోజకవర్గం నుండినాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎమ్మెల్యే జోగురామన్న రికార్టును సృష్టించారు. 2009, 2012, 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు.. ప్రధానంగా 2014ఎన్నికలలో 14,711 ఓట్ల మెజారీటీతో, 2018లో 26,606 ఓట్ల మెజారిటీతో జోగురామన్న బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై విజయం సాదించారు. మళ్లీ అదేవిధంగా 5వ సారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని గ్రామాలను చుట్టేస్తున్నారు ఎమ్మెల్యే రామన్న. బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే... మొదటి సారి సీఏం కేసీఆర్ ప్రభుత్వంలో రామన్న మంత్రిగా పనిచేశారు. రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. రెండోసారి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కానీ ముచ్చటగా మూడోసారి ఎర్పడబోయే ప్రభుత్వంలో మంత్రి కావాలని కలలుకంటున్నారు. అందులో భాగంగా ఈసారి 2023లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజిక ఓటర్లు మెజారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. అదే సామాజిక వర్గానికి చెందిన రామన్నకు సోంత సామాజికవర్గం అండగా నిలుస్తున్నారు. గంపగుత్తగా ఓట్లు వేస్తున్నారు. దాంతో విజయ యాత్రను కొనసాగిస్తున్నారు. మున్నూర్ కాపు ఓట్ల తర్వాత. ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు రాబోయే ఎన్నో తనకు దన్నుగా నిలుస్తాయాని రామన్న అంచనాలు వేసుకుంటున్నారట. దీనికి తోడు సర్కారు నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలతో నియోజకవర్గం రూపురేఖలు మార్చారు రామన్న. ఆదిలాబాద్ పట్టణం సుందరీకరణ, అదివాసీ గూడాల రోడ్ల సౌకర్యం కల్పించారు. అదే విధంగా చెనాక, కోరాట బ్యారేజి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రేపు మాపో రైతులకు అందించే అవకాశం ఉంది. వీటితో మైనారీటీ, బీసీ, ఎస్టీ డిగ్రీ కళశాలలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ఆర్వోబీకి నిధులు మంజూరు చేయించారు. పనులు కూడ సాగతున్నాయి. ఇలాంటి పథకాలతో ఐదోసారి గెలుపును ఎవరు అపలేరని భావిస్తున్నారట రామన్న. రామన్నపై జైనథ్, బేల మండలాల ప్రభావం! నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పథకాలు పూర్తి కాలేదు. చెనాక కోరాట పనులు చివరి దశకు చెరుకున్నాయి. ఎత్తి పోతల పథకంకు నీరు అందించాలంటే ప్రధాన కాల్వ పూర్తయినా... డిస్ట్రిబ్యూషన్ కాల్వలు పూర్తి కాలేదు. దాంతో ఎప్పుడు నీరు అందిస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల తర్నామ్ అంతరాష్ట్ర రహదారిపై బ్రిడ్జి బీటలు వారింది. ప్రమాదకరమైన స్థితికి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. రవాణ సౌకర్యాలు నిలిపి వేయడంతో జైనథ్, బేల మండలాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం నిదులు మంజూరు చేయించారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. ఇది రామన్నకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా బీఅర్ఎస్ నాయకులు కబ్జాలు చేయడం రామన్నకు చెడ్డపెరు తెచ్చిందట. రామన్నపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందనే ప్రచారం ఉంది. రిమ్స్ సూపర్ స్పేషాలీటీ డాక్టర్ నియమాకాలు చేయలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సిమెంట్ పరిశ్రమ ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరిశ్రమ మూతపడి ఏళ్లు అయ్యింది. ఈ పరిశ్రమను తెరిపిస్తామని రామన్న ఎన్నికల హమీ ఇచ్చారు. అయితే పరిశ్రమను పున: ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాయితీలు ఇస్తామని అప్పటి పరిశ్రమల మంత్రికి లేఖలు అందించారు. కానీ ప్రారంభించడానికి కేంద్రం సిద్దంగా లేదు. రాష్ట్ర జనన ప్రభుత్వం పరిశ్రమ పున:ప్రారంభానికి రాయితీలు ఇస్తామని ప్రకటించినా లేఖలు రాసిన కేంద్రం పట్టించుకోవడం లేదట. ఈ పరిశ్రమను పున:ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకరావడానికి రామన్న అధ్వర్యంలో ఉద్యమం నిర్వహించారు. అందులో బాగంగా ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారులు దిగ్భందం చేశారు. కేంద్రం స్పందించ లేదు. అదేవిధంగా ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అడుగు కదలడం లేదు. నిర్మాణం కోసం భూములు ఉన్నా కేంద్రమే పట్టించుకోవడం లేదని రామన్న బీజేపీ నాయకులపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు. కారుపై కమలం ఎత్తుగడలు: నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాదించిన రామన్న కోటను బద్దలు చేయాలని కమలం పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే రామన్నపై బిజెపి అభ్యర్థిగా పాయల్ శంకర్ మూడు సార్లు ఓటమి పాలయ్యారు. ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని పాయల్ భావిస్తున్నారు. కాని పాయల్ శంకర్‌కు టిక్కెట్ ఇవ్వోద్దని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వాలని పార్టీని పట్టుబడుతున్నారట. ఈ ఇద్దరు బీజేపీ నాయకులు టిక్కెట్ కోసం పోరు సమరాన్ని మరిపిస్తోంది. ప్రత్యర్థి నాయకుల్లా అదిపత్య దండయాత్రలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారట. సుహసిని రెడ్డి కాలనీలలో పర్యటనలు చేస్తే. పాయల్ శంకర్ సర్కార్ వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. దాంతో నియోజకవర్గంలో పార్టీ రెండు ముక్కలుగా చీలింది. మెజారిటీ పార్టీ నాయకులు పాయల్ వైపు ఉంటే. మరికొంత మంది సుహసిని వైపు ఉన్నారు. వీరిద్దరు రామన్నపై పోరాటం కంటే ఒకరిపై ఒకరు యుద్దానికి ప్రాథాన్యత ఇస్తున్నారట. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు సర్కార్ వైఫల్యాలపై పోరాటానికి పిలుపునిస్తే కలిసి పనిచేయడం లేదు. ఇద్దరు తలోదారిలో వెళ్లుతున్నారు. పార్టీని, కార్యకర్తలను అయోమంలో గురి చేస్తున్నారట. పైగా పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థులను ప్రకటించకున్నా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారట. ఒకరిని మించి మరోకరు ప్రజల వద్దకి ప్రచారం చేస్తున్నారట. పార్టీ క్యాడర్ మేజారీటీ పాయల్ శంకర్ ఓట్లు జనన ఉందట. క్యాడర్ తోపాటు బీసీ కమీషన్ జాతీయ చైర్మన్ హన్స్‌రాజ్ గంగరాం, బీబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతుతో పార్టీ టిక్కెట్ మళ్లీ తనకే దక్కుతుందని భావిస్తున్నారట పాయల్. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మద్దతు సుహసినరెడ్డికి ఉందట. కిషన్‌రెడ్డి మద్దతుతో మాజీ జిల్లా పరిషత్ సుహసిరెడ్డి టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్నారట. బిజెపీ వర్గపోరు ఎన్నికలలో ఎమ్మెల్యే రామన్నకు అనుకూలుంగా మారుతుందని ప్రచారం ఉంది. కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితి! ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా ఉంది. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత 19శాతంతో 32 వేలకు పైగా ఓట్లు సాదించారు. ఆ తర్వాత పార్టీ పరిస్థితి దిగజారుతోంది. బలమైనా నాయకత్వం లేక పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. వచ్చే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గండ్ర సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. కానీ సుజాత, సంజీవ్‌రెడ్డి, సాజిద్‌ఖాన్ త్రయం.. కంది శ్రీనివాస్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. పారాచ్యూట్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వవద్దని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. టిక్కెట్ ఇచ్చిన కలిసి పని చేయంటున్నారు. కానీ ఏల్లిగాడు, మల్లిగాని గ్రూపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కౌన్సిలర్‌గా గెలువలేని నాయకులతో అయ్యేది లేదు, పోయేది లేదని కోట్టిపారేస్తున్నారట కంది. ఇక తానే అభ్యర్థి అని కంది ప్రచారం చేసుకుంటున్నారట.ప్రజల్లోకి వెళ్లుతున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ వర్గాల కుంపట్లు రామన్నకు అనుకూలంగా మారుతుందని ప్రచారం ఉంది. బీజేపీలో పాయల్‌కు టిక్కెట్ దక్కితే సుహసిని పనిచేయరట. అదేవిధంగా సుహసినికి టిక్కెట్ దక్కితే పాయల్ పార్టీ కోసం పని చేయరని ప్రచారం ఉంది. మరి కలహల కుంపట్లను దాటి రామన్నను చిత్తు చేస్తానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయట. రామన్న మాత్రం ఆరు నూరైనా విజయం తనదేనని విస్తున్నారట.. మరి ఆదిలాబాద్ గడ్డపై ఏవరు పాగా వేస్తారో చూడాలి. -
కడియంకే టికెట్.. ఘన్‌పూర్‌లో ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు : సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్‌లో కడియాన్ని టికెట్ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం ప్రధాన పార్టీలోని అభ్యర్థులు : బీఆర్ఎస్ కడియం శ్రీహరి (కన్ఫాం) కాంగ్రెస్ (ఆశావాహులు) సింగపురం ఇందిరా దొమ్మాటి సాంబయ్య బొల్లెపల్లి కృష్ణ బీజేపీ (ఆశావాహులు) డాక్టర్ విజయరామారవు మాదాసు వెంకటేష్ బోజ్జపల్లి సుభాస్ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట) సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్) మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం) ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం) -
రసవత్తరంగా ములుగు రాజకీయం!
నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న మహిళ దళ నేత ములుగు ఎమ్మెల్యే( సీతక్క)కావడం గనార్హం. తిరుగులేని నాయకురాలుగా నాడు టీడీపీ నేడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్న వ్యక్తి సీతక్క. మావోయిస్టు కుటుంబం నేపథ్యం ఉన్న జడ్పీ చైర్ పర్సన్ బడా నాగజ్యతికి బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కంది. దాంతో ములుగు రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ పోటీ హోరాహోరీగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క, బడా నాగజ్యోతీలు నువ్వా-నేనా అన్నట్టుగా బరిలోకి దిగనున్నారు. దాంతో ములుగు రాజకీయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పోడు భూముల అంశం, తలాపునే గోదావరి ఉన్నా త్రాగు సాగు నీటి సమస్య ఎదుర్కోవడం. ఆదివాసి గిరిజన గూడాలకు ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం. గోదారి పరివాహక ముంపు ప్రాంతానికి కరకట్ట నిర్మాణం చేయకపోవడం. ఏటూరునాగారం డివిజన్ కేంద్రం, మల్లంపల్లి మండలం చేయాలనే డిమాండ్. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : మారుమూల ఏజన్సీ ఆటవీ ప్రాంతం. నక్సల్స్ ప్రభావితం గల నియోజకవర్గం, పర్యాటక ప్రాంతం. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం ప్రధాన పార్టీల అభ్యర్థులు: కాంగ్రెస్ సీతక్క (సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ బడే నాగజ్యోతి (కన్ఫాం) బీజేపీ తాటి కృష్ణ (ఆశావాహులు) భూక్య జవహార్ లాల్ రాజు నాయక్ (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు : వ్యవసాయంపై ఆదారపడ్డ ఆదివాసిగిరిజన ఓటర్లు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్టీ లంబాడా ఓటర్లు 34400 ఎస్టీ కోయ నాయకపోడు ఎరుకల గుత్తి కోయ 48250 ఓసి బిసి కలిపి మొత్తం ఓటర్లు 125525 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజన్సీ ప్రాంత.. గోదావరి నది తీరంలో ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ఏరియా, తెలంగాణ రాష్ట్రంలోనే 80 శాతం అడవులు ఉన్న నియోజకవర్గం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు కొలువైన ప్రాంతం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వైష్ణవాలయం , పర్యాటక కేంద్రాలు లక్నవరం సరస్సు .రామప్ప సరస్సు రామప్ప దేవాలయం. -
కాంగ్రెస్‌పైనే ఓటర్ల కన్ను? భూపాలపల్లిలో ఉత్కంఠ!
రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోదావరి పరివాహక ప్రాంతం అయినా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలుపుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గం ఆసక్తికర అంశాలు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతం సింగరేణి కార్మికులకు నిలయమైన నియోజకవర్గం. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పోడు భూములు. డబుల్ బెడ్రూం ఇవ్వకపోవడం ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ గండ్ర వెంకట రమణారెడ్డి(కన్ఫర్మ్) కాంగ్రెస్ గండ్ర సత్యనారాయణ (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) బీజేపీ చందుపట్ట కీర్తి రెడ్డి (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : భూపాలపల్లి నియోజకవర్గంలో దట్టమైన అటవీ ప్రాంతం, కాకతీయులు పాలించిన కోట గుళ్ల గణపేశ్వర ఆలయం, కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంల, పర్యాటక పాండవుల గుట్టలు, విద్యుత్ వెలుగుల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు,సింగరేణి బొగ్గు గనులు,గణపసముద్రం -
వర్ధన్నపేటలో అసమ్మతి సెగ!
వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య. సీసీ, బిటి రోడ్లు పూర్తీ స్ధాయిలో లేవు. తీవ్రంగా వేదిస్తున్న డ్రైనేజీ సమస్య. త్రాగు నీరు సమస్య. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. 8 మండలాల్లో రెండు మూడు చోట్ల మాత్రమే నిర్మించారు. ధరణి వల్ల భూ సమస్యలు. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ ఆరూరి రమేష్ కాంగ్రెస్ కేఆర్ నాగరాజు మాజీ ఐపిఎస్ అధికారి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బీజేపీ కొండేటి శ్రీధర్ మాజీ ఎమ్మల్యే (కొత్త వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోంది) నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. రాజకీయ అంశాలు : వర్ధన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉండగా మూడోసారి కూడా అధిష్టానం అతనికే టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : వర్దన్నపేట నియోజకవర్గం వరంగల్, హన్మకొండ జిల్లాల చుట్టు ఉంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు వర్దన్నపేట నియోజకవర్గం ఉంది. వర్ధన్నపేట నుంచి హసన్ పర్తి అటు నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు విస్తరించి ఉంది. నదులు : వర్ధన్నపేట ఆకేరు వాగు, కోనారెడ్డీ, పర్వతగిరి రిజర్వాయర్. పర్యాటకం : ఖిలా వరంగల్ కోట, ఐనవోలు, పర్వతగిరి అన్నారం షరీఫ్ దర్గా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా ఉన్న మామునూరు విమానాశ్రయం. 4th బెటాలియన్, రాష్ట్రంలోని ప్రధాన పోలిస్ ట్రైనింగ్ సెంటర్. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం, పర్వతగిరి. అన్నారం యాకుబ్ శావలి దర్గ -
వరంగల్ పశ్చిమ: అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు!
జిల్లాల పునఃర్విభజనతో ఏర్పడిన హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బిన్నరాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులే పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో అదృష్ట్యాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నగరంలోని హన్మకొండ కాజీపేట ప్రాంతాలను కలుపుకుని ఉంది. కాకతీయుల నాటి చెరువులు కుంటలు కబ్జాకు గురికావడంతో వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు ముంచెత్తడం.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, స్మార్ట్ సిటిగా పేరొందినప్పటికి మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, నిలువనీడలేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు అందకపోవడం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ అమలుకు నోచుకోకపోవడం వంటి అనేక సమస్యలు నగర ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. విద్యావంతులు మేధావులు, రాజకీయ నేతలకు నిలయంగా ఉన్న హన్మకొండ రాజకీయం ప్రత్యేకతను చాటుకుంటుంది. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నేతలైనా, అధికారులైనా వారి నివాసాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రమైన హన్మకొండలోనే ఉన్నాయి. కానీ సమస్యలకు పుట్టినిల్లుగా అనేక సమస్యలతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ దాస్యం వినయ్ భాస్కర్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ నాయిని రాజేందర్‌రెడ్డి జంగా రాఘవరెడ్డి బీజేపీ రావు పద్మ ఏనుగుల రాకేష్ ధర్మారావు వృత్తిపరంగా ఓటర్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నగర ప్రాంతం కావడంతో ఉద్యోగులు వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. శివారు కాలనీల్లోరైతులు ఉన్నప్పటికి వారిప్రభావం పెద్దగా ఉండదు. మతం/కులం పరంగా ఓటర్లు హిందువులు ఎక్కువగా ఉంటారు. బిసి జనాబా ఎక్కువగా ఉంది. 30 వేల మంది రెడ్డి ఓటర్లు ఉంటారు. ఎన్నికల్లో రెడ్డి ఓట్లు కీలకంగా మారుతాయి. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : గ్రేటర్ వరంగల్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గం అధికార పార్టీ బిఆర్ఎస్కు కలిసొచ్చే స్థానంగా చెప్పుకోవాలి. పశ్చిమ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పశ్చిమలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. 2009 నుంచి టీఆర్ఎస్కు పశ్చిమలో వినయ్ భాస్కర్ తప్ప మరో వ్యక్తి లేడనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్‌కు టికెట్ దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ చీప్ విప్‌గా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పదవులకు తోడు కాంగ్రెస్, బిజేపిలోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్‌కు అనుకూలంగా మారుతున్నాయి. హంగు ఆర్బాటం లేకుండా అందరితో కలివిడిగా ఉండే వినయ్ భాస్కర్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ప్రత్యర్థి పార్టీలోని గ్రూప్ రాజకీయాలు ఆయనకు కొండంత అండగా నిలువనున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు వినయ్ భాస్కర్‌కి అంత ఈజీగా ఉండవన్న చర్చ ప్రజల్లో సాగుతుంది. అభివృద్ది సంక్షేమం విషయంలో నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు నగరంలో జరిగినప్పటికి ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అభివృద్ది సంక్షేమ ఫలాలు కొందరికే పరిమితం కావడంతో వినయ్ భాస్కర్‌కు మైనస్గాగా మారుతుంది. బాల సముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పూర్తై రెండేళ్ళు కావస్తున్న ఇంకా లబ్దిదారులకు అప్పగించకపోవడతో గృహ ప్రవేశం కాక ముందే ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. లబ్దిదారులకు అప్పగించకపోవడానికి ప్రధాన కారణం నిర్మించిన ఇళ్ళు 596 అయితే లబ్దిదారులు ఐదు వేలకుపైగా ఉండడంతో లబ్దిపొందేవారికంటే ఇళ్ళ కెటాయింపు జరిగితే శత్రువులుగా మారే వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో లబ్దిదారుల ఎంపికలో ఆలస్యం అవుతుంది. 31వ డివిజన్ శాయంపేటలో మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం.. అప్పగింతలో ఆలస్యం అవడంతో కమ్యూనిష్టులతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కమ్యూనిష్టులు ఏకంగా నగర శివారులోని ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారు. నగరంలో నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కెటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కాజీపేట కోచ్ ప్యాక్టరీ హామీ నెరవేరకపోవడం, కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు, పోతన కళాక్షేత్రం పనులు, చారిత్రాత్మకమైన వేయి స్థంబాల గుడి కళ్యాణమండపం పనులు మూడు అడుగులు మందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉండడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆశిస్సులతో భద్రకాళి బండ్ పనులు పూర్తై ప్రజల వినియోగంలోకి రాగ ఆలయ మాడవీదుల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అర్హులైన వారందరికి అందితే ఇక వినయ్ భాస్కర్ విజయానికి తిరుగేఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంటుంది. బీఆర్ఎస్ సిట్టింగ్‌ల ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు టికెట్ వరించడంతో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలోని గ్రూప్ రాజకీయాలు అంతర్గత విబేధాలతో పోటీపడే వారు ఎక్కువ మంది ఉండడంతో వారిలోని పోటీ తత్వం గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీల కొంపముంచే అవకాశాలున్నాయని ఓరుగల్లు ప్రజలు భావిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నవారు చివరిక్షణంలో టిక్కెట్ దక్కకుంటే పార్టీ మారే అవకాశాలు సైతం లేకపోలేదని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్, బిజేపి లోని అనైక్యత బిఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశాలు మెండుకా ఉన్నాయి. అదే జరిగితే వరంగల్ పశ్చిమలో కారుజోరు బ్రేక్లులు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కొండలు అడవులులేవు ఆలయాలు మాత్రం కాకతీయులు నిర్మించిన వేయిస్థంభాల గుడి, భద్రకాళి అమ్మవారు ఆలయం ఉంది. పర్యాటకులను ఆకర్శించేలా వేయిస్థంభాల గుడి ఉంది. భద్రకాళి బండ్ ఏర్పాటు చేశారు. -
వరంగల్ తూర్పు: త్రిముఖ పోటీ! కానీ బీఆర్ఎస్కు ఆయనే మైనస్సా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఓరుగల్లు జిల్లా రాజకీయంగా ఉద్యమాల పరంగా వ్యాపార వాణిజ్య పరంగా వరంగల్ జిల్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో వరంగల్ తూర్పు కేంద్ర బిందువుగా మారుతూ వస్తుంది. 2023 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధన్యతను సంతరించుకున్నాయి. ప్రతిసారి వరంగల్ తూర్పులో త్రిముఖపోటీ ఉన్నట్టుగానే ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతోంది. అయితే ఇక్కడ ఓ వాదన ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పిస్తేనే బీఆర్ఎస్కు ఫలితం దక్కుతుందని ఆపార్టీ నాయకులే భావిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పద్మశాలి, మైనారిటీ దళితులు ఎవరికి మద్దతు ఇస్తారో ఆ అభ్యర్థి గెలుపు ఖాయం. తూర్పు నియోజకవర్గం జనరల్ స్థానం. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఉన్న ఆజంజాహి మిల్లు పోయింది. ఇక ఎక్కువగా దినసరి కూలీలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటే కచ్చితంగా అది అమలు అయ్యి తీరుతుంది. రాష్ట్రంలో కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్య ఉందన్న నమ్మకంతో పాటు మణిపూర్ ఘటనలు దళితులను మైనారిటీ ముస్లింలను కొంత కలవరపెడుతుంది. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా చూపెడుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు : వరంగల్ తూర్పు నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ ఢంక మోగించారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు వన్‌సైడ్‌గా పడుతాయని ఓ ప్రచారం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచినప్పటికీ వరంగల్ నియోజకవర్గం మారలేదు. దీంతో ప్రజల్లో పార్టీ పట్ల కొంత అసహనం ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హేమా హేమీ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి లాంటి వారు టికెట్ కోసం ప్రయత్నం చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ నుండి కొండ సురేఖ తోపాటు డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజెపి నుండి రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పాటు ఘంటా రవికుమార్ పోటీకి సిద్దమయ్యారు. వృత్తిపరంగా ఓటర్లు.. ఈ నియోజకవర్గంలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు భౌగోళిక పరిస్థితులు.. నగరంతో పాటు శివారు కాలనీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరు ఉన్న ఖిల్లావరంగల్ కోట ఉంది. ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల, 1100కోట్లతో 24అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నదులు అడవులు కొండలు లేవు.. కానీ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల మద్య భద్రకాళి అమ్మవారు ఆలయంతోపాటు చెరువు ఉంటుంది. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ప్రధానంగా డ్రైనేజ్ మంచినీటి సమస్యలు నగర ప్రజలను వేధిస్తున్నాయి. వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు వచ్చి నగరంతోపాటు పలుకాలనీలు జలమయం అవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ మేయర్ గా ఎమ్మెల్యేగా వరంగల్ నగరంతో పాటు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. కానీ చెప్పేవి మాత్రం కొండంతలు.నరేందర్ శాసనసభ్యులు గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. -
పరకాల: ఆసక్తిగా పరకాల పోరు!
పరకాల అంటే ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాల కీలక భూమిక పోషించింది. మరో జలియన్ వాలా బాగ్గా పెరొందింది. దీంతో పరకాలలో అమరధామం నిర్మించారు. నియోజకవర్గానికి తలమానికంగా సంగెం మండలం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. రాజకీయపరమైన అంశాలు : పరకాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన చల్లా దర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి, 2015లో బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖపై గెలుపొందారు. కొండా సురేఖ సైతం ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొండ సురేఖ రాజీనామా చేయగా ఉత్పన్నమైన ఉపఎన్నికలో సురేఖ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సురేఖ వరంగల్ తూర్పుతో పాటు పరకాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నాగూర్ల వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నప్పటికి ఇటీవల కేటిఆర్ పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనకే టిక్కెట్ కన్ఫాం చేసింది అధిష్టానం. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ నిరుద్యోగం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు ధరణి పోర్టల్ ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ చల్లా ధర్మారెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ కొండ సురేఖ (ఆశావాహులు) ఇనుగాల వెంకట్రామిరెడ్డి (ఆశావాహులు) బీజేపీ పార్టీ పెసరు విజయచందర్ రెడ్డి (ఆశావాహులు) గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు మేజారిటీ ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కులం పరంగా చూస్తే బిసిలు 141369 మంది ఓటర్లు, ఎస్సీలు 47854 మంది ఓటర్లు, ఎస్టీలు 10308 మంది ఓటర్లు, ముస్లీంమైనార్టీ ఓటర్లు 8279 మంది ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది. చలివాగు ఉంది చంద్రగిరిగుట్టలు చెన్నకేశవ స్వామి జాతర కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర -
ఈసారి పాలకుర్తిలో వాడివేడి పోటీ.. అధికార పార్టీపై హాస్తం వ్యూహాలు..!
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ బారీ కసరత్తే చేస్తుంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశిస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం ఉంటుంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. రాజకీయపరమైన అంశాలు పాలకుర్తి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దయాకర్ రావు కలిసి వచ్చే అంశం నియోజకవర్గ ప్రజలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు కుట్టు మిషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం. మహిళలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ మిల్స్ ఏర్పాటు చేయడం. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుండి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి , నియోజకవర్గ లోకల్‌గా కలిసి వచ్చే అంశం. ఆమె గతంలో నిరుపేదలకు చేసిన సేవలు కూడా ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ఆమెతో కలిసి వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే నెమరు కొమ్ముల సుధాకర్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో తనతో ఉన్న కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. పాలకుర్తిలో బిజెపి ప్రభావం పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. గతంలో రెండు సార్లు పెద్దగాని సోమయ్య పోటీ చేశాడు కానీ ఇప్పటివరకు మళ్లీ ఏ వ్యక్తికైనా బిజెపి నుండి అభ్యర్థిగా నిర్ణయించలేదు.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పాలకుర్తి నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ అంశం, ఈ ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం ప్రభావితం చూపే అవకాశం ఉంది. నాలుగో సారి ఎన్నికల బరిలో మంత్రి దయాకర్ రావు ప్రజల నుంచి సహజంగా వచ్చే వ్యతిరేకత. మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బీజేపీ పార్టీ పెద్దగాని సోమయ్య వృత్తిపరంగా ఓటర్లు: రైతులు. వ్యాపారులు. మతం/కులాల వారిగా ఓటర్లు: హిందుఓటర్లు అందులో రెడ్డి సామాజికవర్గం ఓట్లు ప్రభావం చూపుతాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: పాలకుర్తి నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించి ఉంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అడవులు లేవు పర్యాటక కేంద్రంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ టెంపుల్, వల్మిడి సీతారామచంద్ర స్వామి టెంపుల్, బొమ్మెర పోతన స్మారక మందిరం. -
Mahabubabad: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఈసారి ఉత్కంఠ!
అధికార పార్టీలో అసమ్మతి... వర్గ విభేదాలు... స్వార్థ రాజకీయాలు... మండల గ్రామస్థాయిలో అసంతృప్తుల విభేదాలు.. కీలకమైన నేతలు ఉండడంతో పార్టీకి తలవొంపులు తెచ్చే విధంగా ప్రవర్తించడం...గత పది సంవత్సరాల పాలనలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలకమైన అంశాలు: స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులలో ఎంపిటిసిలు , సర్పంచుల అసంతృప్తి...దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై నిరాశ... డబల్ బెడ్ రూమ్...రైతు రుణమాఫీ.. ధరణి పోర్టల్ , పోడు భూముల పట్టాల పంపిణీలో గిరిజనేతరుల అసంతృప్తి ... గ్రామాలు , పట్టణాల అభివృద్ధి పై ప్రజల భిన్న అభిప్రాయాలు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభివృద్ది చెందుతుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా ఈ సంవత్సరం నుంచి తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను సైతం మంజూరు చేసింది. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఉంది 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అభ్యర్థులు : బీఆర్ఎస్ బానోత్ శంకర్ నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ : (ఆశవాహులు) బలరాం నాయక్ (మాజీ మంత్రి) మాజీ మంత్రి(TPCC నేత) డాక్టర్ మురళి నాయక్, నూనావత్ రాధా బీజేపీ : (ఆశవాహులు) యాప సీతయ్య జాటోత్ హుస్సేన్ నాయక్ వృత్తిపరంగా ఓటర్లు రైతులు కూలీలు ఎక్కువగా ఉంటారు. మతం కులం ఓటర్లు: ఎస్టి 95000 BC:76000 SC:32000 మైనార్టీ :16 ఓసి :14 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: మానుకోటగా పేరొందిన నియోజకవర్గంలో దట్టమైన అడవులు కొండలు గుట్టలు ఉన్నాయి.. ఆలయాలు అనంతరం టెంపుల్.. పర్యటక ప్రాంతం.. గూడూరు మండలం లోని గూడూరు జలపాతం -
డోర్నకల్: ఎమ్మెల్యేకు వ్యతిరేకత.. పుంజుకుంటున్న కాంగ్రెస్
2009 నియోజకవర్గాల పునఃర్విభజన వరకు జనరల్ స్థానంగా ఉన్న డోర్నకల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుడుగా మారింది. జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్, ప్రస్తుతం ఎస్టీ రిజర్వుస్థానంలో ఎదురీదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైన మంత్రి సత్యవతి రాథోడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి అధిష్టానం రెడ్యానాయక్‌కే టికెట్‌ను ఖరారు చేసింది. దాంతో పార్టీ కీలక నేతల్లో అసమ్మతి నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు: గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజక వర్గం ఇది. ముఖ్యంగా విద్యా, వైద్యం,స్థానిక సమస్యలు..డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బందు పతకాలను పరిమితంగా అమలు చేయడం. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన మంత్రిగా పనిచేసినప్పటికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిన నిలదీసే పరిస్తితి ఏర్పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ రెడ్యా నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ పార్టీ : జాటోత్ రామ చoద్రునాయక్ (ఆశావాహులు) మలోత్ నెహ్రూ నాయక్ (ఆశావాహులు) ననావత్ భూపాల్ నాయక్(ఆశావాహులు) బిజేపి పార్టీ : లక్ష్మణ్ నాయక్ (ఆశావాహులు) రాజకీయ అంశాలు : ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో టిఆర్ఎస్ పాగా వేసి తన బలం పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏలిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ప్రభావం డోర్నకల్ నియోజకవర్గంలో చూపే పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం ప్రక్కన డోర్నకల్ పై పొంగులేటి ప్రభావం కనిపించే పరిస్థితి ఉంది. వృత్తిపరంగా ఓటర్లు : గిరిజనులు రైతులు ఎక్కువగా ఉంటారు మతం/కులం వారిగా ఓటర్లు : ఎస్టీ ఓటర్లు 92616 మంది బిసి ఓటర్లు 76 వేల మంది ఎస్సీ ఓటర్లు 29401 మంది ముస్లీం మైనార్టీ ఓటర్లు 6464 మంది నియోజకవర్గంలో బౌగోళిక పరిస్థితులు : వాగులు : పాలేరు, ఆకేరు, మున్నేరు ఆలయాలు : కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరద్రస్వామి, నందికొండ గ్రామo శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ, నర్సింహులపేట వెంకటేశ్వర స్వామి ఆలయాలు, మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి, డోర్నకల్ పురాతన శ్రీరాముల వారి ఆలయం(పెరుమండ్ల సంకిసా), చిన్నగూడూరు మండల కేంద్రం దాశరథీ స్వగ్రామం. -
నల్గొండ: రాజకీయ ముఖచిత్రం.. పూర్తి వివరాలు
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిగా విడగొట్టబడ్డాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాగా ఉన్న సమయంలో జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండేవి. ఇందులో రెండు ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగతా 9 నియోజకవర్గాలు జనరల్‌కు కేటాయించబడ్డాయి. ఎస్సీలకు కేటాయించబడిన నియోజకవర్గాలు: నకిరేకల్( నల్లగొండ జిల్లా), తుంగతుర్తి( సూర్యాపేట జిల్లా) ఎస్టీలకు కేటాయించబడిన నియోజకవర్గం: దేవరకొండ( నల్లగొండ జిల్లా) ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా సూర్యాపేటలో నాలుగు నియోజకవర్గాలు, యాదాద్రిలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల వివరాలు నల్లగొండ మిర్యాలగూడ నాగార్జునా సాగర్ నకిరేకల్(ఎస్సీ) మునుగోడు దేవరకొండ(ఎస్టీ) సూర్యాపేట జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వివరాలు సూర్యాపేట కోదాడ తుంగతుర్తి(ఎస్సీ) హుజూర్ నగర్ యాదాద్రి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు భువనగిరి ఆలేరు ► మొత్తం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. మరో 6 నియోజకవర్గాల్లో మాత్రం పురుష ఓటర్లు మహిళల కంటే ఎక్కువగా ఉన్నారు. ► నల్లగొండ, సూర్యాపేట, హూజూర్ నగర్, కోదాడ, నాగార్జునా సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు. ► దేవరకొండ, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 26,87,818 మంది. ఈ సంఖ్య గతేడాది కంటే 11,399 మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు. వయస్సుల వారిగా ఓటర్ల సంఖ్య: 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్లు నల్లగొండ: 17562 సూర్యాపేట: 9734 యాదాద్రి: 23750 20 నుంచి 29 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న ఓటర్ల సంఖ్య నల్లగొండ: 254468 సూర్యాపేట: 157652 యాదాద్రి: 116685 -
తుంగతుర్తి: పటిష్టంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదా?
తుంగతుర్తి నియోజవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మల్లు స్వరాజ్యం రెండు సార్లు విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం నియోజకవర్గంపై తన మార్కు చూపించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం కూడా తిరుమలగిరి మండలమే. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం కూడా నాగారమే. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి అత్యధికంగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1985, 1989, 1994లో దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 1999లో మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత మరోసారి 2004లో గెలిచారు. 2009లో ఇది ఎస్సీ రిజర్వుడు అయింది. రిజర్వుడుగా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో 2009 మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. 2014, 18లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరపున ఆయనకే టికెట్ దక్కింది. అభివృద్ది చేసినా.. ప్రతిపక్షాలకు చిక్కేలా బీఆర్ఎస్? తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పథాన నడిచిందనే వాదన ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్లే మూసీ, బిక్కేరు వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలివెళ్తోంది. ఇసుక కూడా ఎన్నికల ప్రధాన విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఇసుక లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన కిషోర్ ఆధిక్యం మూడు వేలు దాటలేదు అంటేనే పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కిషోరే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి వడ్డేపల్లి రవితో పాటు గతంలో పోటీ చేసి ఓడిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పాల్వాయి రజిని కూడా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా ఓటర్లు : నియోజకవర్గంలో ఒకప్పుడు సాగునీటి కొరత ఉండేది. కానీ వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటి కొరత తీరడంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు కూడా వస్తుండటంతో రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా అధికంగా ఉంటారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇక తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా ఉంది. మతం/కులాల వారిగా ఓటర్లు : ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. దాదాపు 45 నుంచి 50 వేల వరకు వారే ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. ఈ తర్వాత యాదవ, గౌడ, ముప్పై వేల చొప్పున ఎస్టీ లంబాడకు 18 వేలు ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ 18 నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో విశాలమైన రహదారులు ఉన్న నియోజకవర్గం ఇదే. ఇక్కడి నుంచి పలు జాతీయ రహదారులు వెళ్తుంటాయి. మూసీ, బిక్కేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం పణిగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. సూర్యదేవాలయంతో పాటు ప్రసిద్ధి గాంచిన రామ, శివాలయాలకు పెట్టిన పేరు. పణిగిరి క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి బౌద్దులు వస్తుంటారు. కానీ దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉంది. -
కాంగ్రెస్, టీడీపీకి బీఆర్ఎస్ బ్రేక్.. కోదాడలో ఉత్కంఠ పోరు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్ అయిన కోదాడలో ఏపీ రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో టిల్లర్ల ఓటు బ్యాంక్ ప్రభావం ఉన్న నియోజకవర్గం ఇది. ఏపీ, తెలంగాణకు ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాలు కలిసిన వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ తెలంగాణవాదం తక్కువే. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచారు. కానీ ఫస్ట్‌టైం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు... కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలకు బీఆర్ఎస్ బ్రేక్: నిజానికి కోదాడ నియోజకవర్గం మొదట కాంగ్రెస్‌కు.. తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా సైకిల్ దిగి కారెక్కారు. దాంతో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లింది. దాంతో మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు : ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నట్లు కనిపించినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకే మరోసారి టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్తమ్ పద్మావతీ పోటీ చేయనున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో రెండు పదవులు అంశం తెరపైకి వస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి నూకల పద్మారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ నియోజవర్గం నుంచి వెళ్తున్నా మోతే లాంటి ప్రాంతాలకు చివరి భూములకు నీరు అందడం లేదని అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఇక కోదాడలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురికావడం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ కబ్జాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్తు టాక్ నడుస్తోంది. మరోవైపు దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం కూడా పెను దుమారాన్ని లేపింది. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ ప్రధానంగా రైతులు, వ్యాపారంపైనే అధికంగా ఆధారపడి ఉంటారు. రైసు మిల్లులు కూడా అధికంగా ఉంటాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో సెటిలర్స్ కూడా ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నిర్ణాయాత్మక పాత్రను పోషిస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి 32427 ఓట్లు, రెడ్డి 24365, గౌడ 22673 , లంబాడా19988, యాదవ్ కులస్తులు -16473, మల 11673, కమ్మ 11628, ముదిరాజ్ 9961, పెరిక 9384, ముస్లీం 8 వేలు భౌగోళిక పరిస్థితులు.. ఆలయాలు : కోదాడ మండలం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా నిత్యం భక్తులు వస్తుంటారు. అనంతగిరి మండలం గొండ్రియల రామాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మునగాల మండలం రేపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బరకత్ గూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం. నదులు : ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. -
మరోసారి బరిలో సైదిరెడ్డి.. హుజూర్‌నగర్‌లో ఉత్కంఠత!
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2007లో ఏర్పడింది. 2009, 2014, 18లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణిని బరిలో దించారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె ఓటమిపాలైంది. ఈసారి జరిగే పోరు మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనుంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం అయిన నేపథ్యంలో గెలిచేందుకు ధన ప్రవాహం కొనసాగించే అవకాశం ఉంది. దీనికి తోడు అభివృద్ధి, ప్రతిపక్షాలు చేస్తున్న భూ ఆక్రమణలు కూడా భూమిక పోషించనున్నాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు: ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి రేసులో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ రైతులతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు అధికంగా ఉంటారు. రాష్ట్రంలోనే అత్యధిక సిమెంట్ పరిశ్రమలు ఉన్న నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ ఒకటి. ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో వేలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు. కులం పరంగా ఓటర్లు : ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లే అధికంగా ఉంటారు. ఆ తర్వాత ఎస్టీ లంబాడీ వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి 27712 మంది, లంబాడీ 26039, గౌడ 16838, యాదవ16530, మున్నురుకాపు 13173, ముదిరాజ్ 13228, కమ్మ 11071 మంది ఉంటారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు: ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ పయనిస్తుంది. సాగర్ ఆయకట్టు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉంటుంది. దీనికి తోడు అత్యధిక సిమెంట్ పరిశ్రమలకు అడ్డగా ఉంది. మరోవైపు కృష్ణపట్టే ప్రాంతం ఉంటుంది. ఇక రంగురాళ్లు ఎక్కువగా లభిస్తాయన్న ప్రచారం సైతం ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. చారిత్రక మఠంపల్లి స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్న ప్రాంతం. మేళ్ల చెరువులో ఉన్న శివాలయానికి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు వస్తారు. నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దులో ఉంది. ఇక్కడి నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. -
సూర్యాపేటలో ఆ సెంటిమెంట్! బీఆర్ఎస్కు హ్యాట్రిక్ సాధ్యమేనా?
ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ. నాలుగుసార్లు టీడీపీ, చెరో రెండు సార్లు సీపీఐఎం, బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐఎం అభ్యర్థి ఉప్పల మల్సూర్ ఎన్నికయ్యారు. 2004 వరకు ఎస్సీ రిజర్వుడుగా ఉన్న సూర్యాపేట 2009లో జనరల్‌గా మారింది. 2009లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నేత కూడా మూడోసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1962, 67లో ఉప్పల మల్సూర్ రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఆకారపు సుదర్శన్ కూడా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న జగదీష్ రెడ్డి కూడా 2018 గెలుపుతో రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి గత చరిత్రను ఆయన తిరగరాసి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతారా లేక గతమే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇక్కడ ప్రధానంగా అభివృద్ధే ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ ఏర్పాటు, జిల్లాకు నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ పనులు, సమీకృత మార్కెట్ నిర్మాణంతో పాటు సద్దల చెరువును ట్యాంక్ బండ్‌గా మార్చడంతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కొందరు కింది స్థాయి బీఆర్ఎస్ నేతల తీరు కూడా రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మూసీ కాలువల ఆధునికీకరణ చేయాల్సి ఉంది. దీనికి తోడు సద్దల చెరువు పొంగితే దిగువన ఉన్న కాలనీ వాసులు ముంపుకు గురవుతున్నారు. ఈ సమస్యకు శాశ్యత పరిష్కారం చూపించాల్సి ఉంది. ఉండ్రుగొండను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు : ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ కేబినేట్లో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయనకు పోటీగా బీఆర్ఎస్ నుంచి మరో నేత కనిపించడం లేదు. అయితే కొందరు నేతల్లో మాత్రం అంతర్గతంగా అసంతృప్తిని వెలుబుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అని చెప్పుకునే ఓ నేత మంత్రికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైరి పార్టీకి చెందిన కీలక నేతతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య, వెంకటేశ్వరరావు కుమారుడు వరుణ్ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులాల పరంగా ఓటర్లు: ► నియోవజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ► సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైశ్యతో పాటు రెడ్డి సామాజికవర్గపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ► ఆత్మకూరు ఎస్ మండలంలో రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు నిర్ణాయాత్మక శక్తిగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : ఇక్కడ ప్రధాన నది మూసీ. సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల గుండా మూసీ నది ప్రవహిస్తోంది. ఇక ఎస్సారెస్పీ కాలువ ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందుతుంది. పర్యాటకం : చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో జరిగే లింగమంతుల జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్దది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి గుట్టపై నెలకొని ఉన్న లింగమంతుల స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఈ జాతర మూడు రోజల పాటు సాగుతుంది. ఇక ఆరువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఉండ్రుగొండ గుట్టలు కూడా సూర్యాపేటకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆలయాలు : ఇక్కడ స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఇక వందల ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి దేవాలయంతో పాటు అంతే ప్రాచుర్యం పొందిన శివాలయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. -
పటాన్చెరు: అన్ని పార్టీల్లో వర్గపోరు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో పటాన్ చెరు ఒకటి. వైవిధ్యమైన ప్రాంతంగా దీనికి పేరు ఉంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రాంతంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. మరోవైపు ఈసారి ఎలాగైన సీటు దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పటాన్చేరులోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నువ్వా-నేనా అన్నట్టు సొంత పార్టీ అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టికెటు తనకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. మూడు పార్టీల్లోనూ వర్గపోరు! మూడు పార్టీల్లో వర్గ పోరు నడుస్తోంది. ఈసారి పటాన్చేరు ఎన్నికలు వాడివేడిగా కొనసాగేలా ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్లో సైతం వర్గపోరు గట్టిగానే నడిచింది. కానీ అధిష్టానంలో తన మాట ప్రకారం ఈసారి సిట్టింగ్‌లకే టికెట్ కెటాయించింది. దాంతో పటాన్‌చేరులో అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మరోసారి మహిపాల్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్‌లో కూడా ఇద్దరు పోటీపడుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే అంటూ పోటీ పడుతూ మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దాంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిని సంతరించుకుంది. బీజేపీ నుంచి నందీశ్వర్, గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీల్లో నెలకొన్ని వర్గపోరు అధిష్టానాలకు తలనొప్పిగా మారేలా ఉంది. టికెట్ల వ్యవహారంతో అసమ్మతి నెలకొనే అవకాశం ఉందని భయపడుతున్నారు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండడం వివిధ మతాల సాంప్రదాయాలు సంస్కృతులు నిలయం. రాజకీయానికి అంశాలు : పారిశ్రామిక వాడ కాబట్టి ఒక గ్రామ వార్డు సభ్యులు కావాలంటే అన్ని లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రాజకీయం చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం ఈ విషయంలోనె కొంతమంది రాజకీయ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం.హైదరాబాద్ పట్టణానికి కూత వేటు దూరం కాబట్టి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల సంస్కృతులు సాంప్రదాయాలు, కూడుకోని ఉంటాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ : కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ (పిసిసి వైస్ ప్రెసిడెంట్) బిజెపి: మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ పారిశ్రామికవేత్త అంజిరెడ్డి. -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్‌లో స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్‌తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్‌కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
జహీరాబాద్: కాంగ్రెస్ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు. బీఆర్ఎస్కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట! 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది. గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం? మరోవైపు కంచుకోట కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్‌గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్‌గా ఉండటంపై మిగతా లీడర్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు: నిరుద్యోగ సమస్య యువతకు ఉపాధి NIMZ రైతుల సమస్య చెరుకు రైతుల సమస్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్. మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్: కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ: మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు.. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. మతం/కులం పరంగా ఓటర్లు? ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్‌లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. రాజకీయాకపరమైన అంశాలు : కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం. -
అందోల్‌లో వేడెక్కుతున్న రాజకీయం.. వ్యూహాలు ఫలించేనా?
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించడం జరిగింది. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆభ్యర్థిగా జర్నలిస్ట్ నాయకుడు మలిదశ ఉద్యమకారుడు చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అదే పార్టీ ప్రభుత్వం చేపడుతోంది. వేడెక్కుతున్న రాజకీయం.. అధికార పార్టీలో పోటీలు! రోజు రోజుకు అందోల్‌లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటి సిఎం దామోదర్ రాజనర్సింహ పేరు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి బాబూమోహన్ బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమలంలో కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక అధికార పార్టీలో ఈసారి సిట్టింగ్‌లకే టికెటు దక్కడంతో మరోసారి అందోల్ నుంచి క్రాంతి కిరణ్ పోటీకి సై అంటున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య గ్రామీణ రోడ్ల సమస్య రైతులు పండించిన పంటలకు మద్దత్తు ధర లేకపోవడం పీజీ కళాశాలలో మౌళిక వసతుల లేమి మున్సిపల్‌కు సొంత భవనం లేకపోవడం రాజకీయ పార్టీల ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు: బీఆర్ఎస్ చంటి క్రాంతి కిరణ్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ బీజేపీ మాజీ మంత్రి పల్లి బాబుమోహన్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య టికెట్ రేసులో ఉన్నారు. వృత్తి పరంగా ఓటర్లు: నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు రైతాంగంపైనే ఆధారపడి ఉన్నారు. కొంత శాతం మంది వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జోగిపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు: మంజీరా అత్యంత కీలకమైనది. మంజీరా నదిపై సింగూరు జలాశయం 30 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ప్రాజెక్టు జంట నగరాల దాహార్తి తిరుస్తూ సంగారెడ్డి మెదక్ జిల్లాల రైతులకు సాగునీటి అవసరాలు తిరుస్తుంది. ఒక్క అందోలు నియోజకవర్గంలో ఎడమ కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సింగూరు పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఆలయాలు: ఉత్తర తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన అందోలు మండలంలోని కిచ్చన్నపల్లిలో దేవాలయం కలదు. అల్లాదుర్గం మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం అదే విధంగా అక్కడే బేతాళ స్వామి ఆలయం అత్యంత ప్రతిష్ట గాంచినవి. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు అందోలు నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా మొదటి సారి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి జోగిపేటకు చెందిన బసవ మామయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించగా టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రాజకీయానికి సంబంధించి ఇతర అంశాలు : 1957 లో మొదటిసారిగా ఏర్పడిన అందోలు నియోజకవర్గం మొదటి రెండు పర్యయాలు జనరల్ స్థానంగా ఉండి 1967 లో ఎస్సి రీజర్వు స్థానంగా ఏర్పడింది. 1957 లో జోగిపేటకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బసవ మనయ్య కాంగ్రెస్ అభ్యర్ధి రూక్ ఎండి.రూక్ మోద్దీన్ పై విజయం సాధించడం జరిగింది. 1962 లో లక్షిదేవి గారు కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి బసవ మణయ్య పై విజయం సాధించారు. 1967 లో ఎస్సి రిజర్వుడ్ గా ఏర్పడిన తరువాత సిరారపు రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరప్ప పై విజయం సాధించారు. 1972 లో రాజనర్సింహ కాంగ్రెస్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి లక్మన్ కుమార్ పై విజయం సాధించారు. 1978 లో మరో మారు రాజనర్సింహ ఎమ్మెల్యేగా విజయం సాధించారు 1983 లో టిడిపి తరుపున ఆల్ దేకర్ లక్మన్ జి ఈశ్వరి భాయ్ పై విజయం సాధించడం జరిగింది 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ పై గెలుపొందడం జరిగింది. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరువున దామోదర రాజనర్సింహ పోటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాల రాజయ్య పై విజయం సాదించారు. 1994 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై గెలుపొందారు. 1998 లో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మాల్యాల రాజయ్య సిద్ధిపేట ఎంపీగా గెలుపొందడంతో జరిగిన బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా సినీ యాక్టర్ బాబుమోహాన్ గెలుపొందారు. 1999 లో జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై మరోమారు గెలుపొందడం జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తెలుగుదేశం అభ్యర్థి బాబుమోహన్ పై రెండు సార్లు వరుసగా విజయం సాధించి ప్రాథమిక ఉన్న విద్యాశాఖలతో ఉప ముఖ్యమంత్రి గా కావడం జరిగింది. -
అభివృద్ధిలో ఆదర్శంగా నారాయణఖేడ్.. బీఆర్ఎస్కే అధికార పగ్గాలా?
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలానికి చెందిన గ్రామం ఇది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018 ఆగస్టు 2న నారాయణఖేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిది ఏళ్లలోనే ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తుంది. వేలకోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతుండడంతో అన్ని వర్గాల ప్రజలకు వసతులు సమకూరుతున్నాయి. నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశాలు : అత్యధికంగా గిరిజన తాండాలు కలిగిన ఖేడ్ నియోజకవర్గం కాబట్టి ఉపాధి కోసం వలసలు పరిశ్రమలు ఇతర ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కారణంగా నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది. ఉపాధి కల్పన నైపుణ్య విద్య సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడం మౌలిక వసతుల్లో భాగంగా గ్రామాల అభివృద్ధి సరిఅయిన రవాణా సౌకర్యం లేకపోవడం కంగ్టీ, నాగలిగిద్ద సిర్గాపూర్, మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ మహా రెడ్డి భూపాల్ రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే ) కాంగ్రెస్ సురేష్ కుమార్ షెత్కర్ పట్లోల సంజీవరెడ్డి ( Ex MPP పిసిసి ఉపాధ్యక్షులు ) బీజేపీ మహా రెడ్డి విజయపాల్ రెడ్డి జన్వాడ సంగప్ప ( అధికార ప్రతినిధి ) వృత్తిపరంగా ఓటర్లు మత్స్యకారులు 16 % పంచకర్మలు 5% కుమ్మరి 2% మంగలి 2% చాకలి 3 % యాదవులు 10 % SC లు 12 % ST లు 16 % మైనార్టీలు 12% ఇతరులు 22 % నియోజకవర్గంలో ఆసక్తికర అంశాలు : ► వార్ కార్ సాంప్రదాయం, కన్నడ తెలుగు మరాఠీ ఉర్దూ తదితర భాషల ప్రయోగం. ► రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు : షట్కార్, మహారెడ్డి, పట్లోళ్ల కుటుంబాల రాజకీయ వారసత్వం. భౌగోళిక పరిస్థితులు : నదులు : కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మంజీరా నది, నల్ల వాగు మధ్యతర ప్రాజెక్టు అడవులు: కడపల్ అటవీ ప్రాంతం ఆలయాలు : కొండాపూర్, పంచగామా, కోర్పోల్, అంతర్గాం, దామరగిద్ద రామాలయం పర్యాటకం : నారాయణఖేడ్, కంగ్టీ,పెద్ద శంకరంపేట్, నిజాంపేట్, మంజీరా నది తీర ప్రాంతం -
దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్ఎస్లో హైటెన్షన్
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు: బీజేపీ పార్టీ: మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత మెదక్ ఎంపీ) కాంగ్రెస్ పార్టీ: చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు కత్తి కార్తీక డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు: దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.. నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు. నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు. ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు -
గజ్వేల్: ఆ సెంటిమెంట్‌దే ఎప్పుడూ విజయం!
గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రాధినేతగా నిలబెట్టింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ. వివిధ మతస్థులు జాతుల సంగమంతో ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. రాజకీయ పార్టీలకు ఆ సెంటిమెంటే: కేసీఆర్ ఇలాకాగా అభివర్ణించే ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది స్థానికేతరులకు అచొచ్చిన నియోకవర్గం. 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం సుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు అంతా స్థానికేతరులే. అలాగే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే అధికారంలోకి రావడం మరో విశేషం. గత 13 ఎన్నికలు పరిశిలీస్తే అదే జరిగింది. దాంతో ఈ సెంటిమెంట్‌ను రాజకీయవర్గాలు అన్ని కూడా బలంగా నమ్ముతున్నాయి. ఇక 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ ముత్యాలరావు, ఆర్.నరసింహారెడ్డి కూడా స్థానికేతరులే. ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1989, 2004లలో డాక్టర్ జె గీతారెడ్డి, 1994లో డాక్టర్ జి విజయరామారావు, 1999లో సంజీవరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా స్థానికేతరులే కావడం విశేషం. 2009లో జనరల్.. సీటు కొట్టేసిన కేసీఆర్! 2009లో జరిగిన ఎన్నికల్లో తూంకుంట నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గానికి కేసీఆర్ కూడా స్థానికేతరులే కావడం విశేషం. వాస్తవానికి 2008లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పాగా వేశారు. ఇక్కడ ఫాంహౌజ్ ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ తన ఇలాకాగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు భూ సేకరణ (జలశాలయాల నిర్మాణంకోసం,కంపెనీల ఏర్పాటు కోసం) సామాన్యుల సమస్యలు పరిష్కారం లేకపోవడం రోడ్లు,పెద్ద భవనాలు తప్ప సామాన్యులకు లబ్ది చేకూరలేదనే అపవాదు రాజకీయ పార్టీల వారిగా పోటీ : బీఆరెస్ పార్టీ కేసీఆర్(బీఆరెస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి) కాంగ్రెస్ పార్టీ తుంకుంట నర్సారెడ్డి(జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) మాదాడి జశ్వంత్ రెడ్డి(టీపీసీసీ మెంబర్,సీనియర్ నాయకుడు రంగారెడ్డి తనయుడు) బండారు శ్రీకాంత్ రావు(టీపీసీసీ ప్రధాన కార్యదర్శి) -
సిద్దిపేట: తిరుగులేని తన్నీరు హరీష్‌రావు
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేట ఒకటి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్దిపేట అసెంబ్లీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR), మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరు సార్లు వరుసగా విజయాలు సాధించిన ఘనత ఇక్కడ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిద్ధిపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80వేల ఓట్ల మెజార్టీతో హరీష్ రావు గెలిచారు. కులాల వారిగా ఓటర్లు శాతం ► ఎస్సీలు : 38.23 % ► ఎస్టీలు : 9.14 % ► బీసీలు : 41.94 % ► ఇతరులు : 10.69 % అభ్యర్థుల బలాలు, బలహీనతలు: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కి చెందిన తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 1,17,091 ఓట్లు రాగా, గౌడ్‌కు 36,280 ఓట్లు వచ్చాయి. హరీశ్‌రావు సిద్దిపేటలో ప్రజాభిమానం కలిగిన నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు కృషిచేశారనే పేరు ఉంది. సిద్దిపేట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సిద్దిపేట విమానాశ్రయం, సిద్దిపేట పారిశ్రామిక పార్కుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగానూ, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. -
ఈసారి రసవత్తవరంగా మెదక్ ఎన్నికలు
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 7 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014, 2018 ఎన్నికలలో ఇక్కడి నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు. ధీమాగా బీఆర్ఎస్ నేతలు.. టికెట్ కోసం ఎదురుచూపులు! తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్కు మెదక్ కంచుకోటగా మారింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అనేది బీఆర్ఎస్ నేతల ధీమా. ఈ క్రమంలోనే సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పద్మ దేవేందర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు. విజయశాంతి, బట్టి జగపతి వంటి హేమాహేమీలను సైతం ఆమె ఓడించారు. మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలాకాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తుందని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ ఓకే చేయడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్‌లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈసారి ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రాజకీయ పార్టీల వారీగా టికెట్లు కోసం పోటీపడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ పద్మాదేవేందర్ రెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పట్లోళ శశిధర్ రెడ్డి(మాజీ ఎమ్మెల్యే) కంఠ తిరుపతిరెడ్డి(మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు) మ్యాడo బాలకృష్ణ(టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ) సుప్రభాత్ రావ్(టిపిసిసి సభ్యులు). బిజెపి తాళ్లపల్లి రాజశేఖర్(న్యాయవాది బిజెపి నాయకులు) గడ్డం శ్రీనివాస్(బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు) నందా రెడ్డి(బిజెపి నాయకులు మెదక్ ) చోళ రాంచరణ్ యాదవ్(బిజెపి నాయకులు మెదక్) నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: గత కొన్ని రోజులుగా రామాయంపేట ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.. అన్ని ప్రాంతాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం జరగలేదు. అన్ని ప్రాంతాలలో అన్ని మండలాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేసి నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్. నిజాంపేట, నార్సింగీ నూతన మండల కేంద్రముల లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. బస్టాండ్ కూడా లేని పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదని ఈ ప్రాంత యువత భావిస్తున్నారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేటలో ఇంటర్నల్ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నూతన రోడ్లు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. రామయంపేట మున్సిపాలిటీలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థుల అభ్యర్థన. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బస్టాండ్, మరియు డిగ్రీ కళాశాల నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. ధరణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఒకరి భూమి మరొకరిపై పడిందని అట్టి సమస్యలు ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని ధరణి సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మహిళల ఓట్లే కీలకంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళల రుణాలు మంజూరు చేయాలని మహిళలు కోరుతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం వల్ల ఏం తినలేక పోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ఇంటి ఖర్చులు వ్యయం పెరిగి ఇబ్బందుల పాలవుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడీ కార్మికులకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని కొన్ని కంపెనీల వారు పిఎఫ్ సౌకర్యం కల్పించేలా కృషి చేయడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు అత్యంత ప్రభావితం చేసే రాజకీయ అంశాలు : మెదక్‌లో మెడికల్ కాలేజ్నిని మంజూరు చేపిస్థామని ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నిజాం షూగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తామని 9 సంవత్సరాలు అవుతున్న దానిని ఓపెన్ చేయించకపోవడం ముఖ్యంగా మెదక్‌కు రింగ్ రోడ్ లేదు.. 9 సంవత్సరాల పాలనలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి భౌగోళిక పరిస్థితులు: పర్యాటకం: కాకతీయులు పరిపాలించిన మెదక్ కిల ఉంది ఇక్కడే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ(CSI) చర్చి. నదులు: మంజీరా నది, వనదుర్గ ప్రాజెక్టు, పసుపులేరు వాగు. పోచారం అభయారణ్యం కొంత భాగం మెదక్ నియోజకవర్గంలో ఉంది. చిన్న శంకరంపేట రామయంపేట హవేలీ ఘనపూర్ మండలాలు అడవులు విస్తరించి ఉన్నాయి. ఆలయాలు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ csi చర్చి అత్యంత పర్యాటక ప్రాంతాలు.. -
హుస్నాబాద్: బీఆర్ఎస్కు అవే మైనస్సా?
2014 నుండి హుస్నాబాద్ నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుండి వోడితల సతీష్ కుమార్ గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రెడ్డి, రావు, కాపు, ముదిరాజ్, గిరిజన సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. కులాల వారిగా ఓటర్ల శాతం ► బిసి: 60% ► ఎస్సీ: 15% ► ఎస్టీ: 10% ► ఇతరులు: 15% పార్టీల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ లేరు కాంగ్రెస్‌లో కూడా ఆశావాహులు లేరు బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు సీపీఐ కూడా పోటీకి ఆసక్తి చూపుతుంది ఆశావహులు బీఆర్ఎస్ నుంచి వోడితల సతీష్ కుమార్ కాంగ్రెస్ నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బీజేపీ నుండి ఇద్దరు (బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు) సీపీఐ నుండి చాడ వెంకటరెడ్డి పోటీకి సిద్దమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు.. గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించలేకపోవటం IOC భవనంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా హుస్నాబాద్‌లో మినీ స్టేడియం, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయలేకపోవడం గ్రామాల పరిధిలో పూర్తి చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవటం.. అధికార పార్టీ అభ్యర్థి, అనుకూలతలు గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చటం వోడితల సతీష్ కుమార్.. సౌమ్యుడు, మృదుస్వభావ వ్యక్తిత్వం కలిగిన వారవటం. ప్రతికూలతలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంలో సమయపాలన పాటించడనే విమర్శ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అనుకూలతలు గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రారంభించకపోవటం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం.. ప్రతికూలతలు.. అధికారిక పార్టీని గ్రామ స్థాయిలో ఎదురుకొలేకపోవటం. -
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్‌గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
పెద్దపల్లి: గెలుపు, ఓటములు శాసించేది వారే.. మరి టికెట్ దక్కెనా?
ఈ నియోజకవుర్గంలో పెద్దపల్లి అతిపెద్ద మండలంగా నిలుస్తుంది. పెద్దపల్లి గెలుపోవటములను శాసించేది కూడా ఇదే మండలం. ఈ మండల కేంద్రంలో అత్యధికంగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఉంటాయి. ముస్లిం మైనారిటీలు ఏ పార్టీకైతే ఓటు వేస్తారో ఆ పార్టీ విజయం సులభం అవుతుంది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలను ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగాయి. కాంగ్రెస్ 6, టిడిపి 4, బీఆర్ఎస్ 2, బీజెపి 1, పీడీఎఫ్ 1, స్వతంత్య్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేది బీసీ ఓటర్లు. కానీ చాలా కాలం నుండి ఈ నియోజకవర్గ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని అన్ని పార్టీల ఆశావాహుల నుండి ఒత్తిడి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీసీలకు టికెట్ కేటాయించాలని ఆయా పార్టీల అధిష్టానాలకు ఒత్తిళ్లు వస్తున్నాయి. ► బీసీలు : 70% ► ఎస్సీలు: 14% ► ఇతరులు: 16% ఇక్కడ ఎప్పుడు హోరాహోరీ పోటే..! 1983 ఎన్నికలు: ఈ ఎన్నికలలో సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీచేసిన గోనె ప్రకాష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డిపై విజయం సాధించారు. 1984లో గోనె ప్రకాష్ రావు రాజీనామా చేయుటతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. 1984 ఉప ఎన్నికలు: 1983లో విజయం సాధించిన గోనె ప్రకాష్ రావు (సంజయ్ విచార్ మంచ్) రాజీనామా చేయుటంతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల రమణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2009 ఎన్నికలు: 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ రమణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ముకుందరెడ్డిపై 23,483 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున గీట్ల ముకుందరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి వేముల పద్మావతి, లోక్‌సత్తా పార్టి తరఫున శ్రీనివాసరావు పోటీచేశారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన భానుప్రసాదరావుపై 62677 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున దాసరి మనోహర్ రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు చేశారు. తెరాసకు చెందిన దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు పై 8,466 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యేగా.. దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. రాజకీయ నాయకుడ. ఈయన ట్రినిటీ విద్యాసంస్థల అధినేతగానూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కాసులపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఎంఏ, బీఈడి వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత పలు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. అతని తండ్రి పేరు రామ్ రెడ్డి. దాసరి ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. మనోహర్ రెడ్డి ఎమ్.ఎ, బి.ఎడ్ డిగ్రీని కలిగి ఉన్నారు. వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ,సామాజిక సేవలో అతని ఆసక్తి రాజకీయాల్లోకి తన ప్రవేశానికి దారితీసింది. తెలంగాణ తరపున శాసనసభకు పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి. 2009-11 కాలంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరపున పోటీచేసి విజయం సాధించారు. దాసరి మనోహర్‌రెడ్డికి ఉన్న ప్రతికూల అంశాల కలగా మిగిలిన పెద్దపల్లి బస్సు డిపో ఎస్సారెస్పి ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందకపోవడం. పెద్దపల్లి, సుల్తానాబాద్ రాజీవ్ రహదారి నుండి పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారుల సమస్య. పేదలకు అందని ద్రాక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు. మానేరు వాగు పై ఏర్పడ్డ ఇసుక రీచుల నుండి భారీగా ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు. నియోజకవర్గం లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని తానై వ్యవహారిస్తారని, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల నిరుత్సాహం. చెరువుల పూడికతీత పేరిట స్థానిక ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకుంటున్నారని ఆరోపణలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను పక్కన పెట్టి వలస నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ నాయకుల అసంతృప్తి. పెద్దపల్లి నియోజకవర్గం లోని రైస్ మిల్లుల నుండి విలువడే కాలుష్య నివారణ కు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు. రైస్ మిల్లు వద్ద ముడుపులు తీసుకుని తరుగు పేయుట కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టిన పట్టించుకోలేదని అపవాదు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సానుకూల అంశాలు: పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం పెద్దపల్లి పట్టణ సుందరీకరణ లో భాగంగా రోడ్ల విస్తరణ. పెద్దపాలి పట్టణ ప్రజలకు త్రాగు నీటి సమస్య తీర్చడం. సుల్తానాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి లో మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీపడే ప్రధాన పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పార్టీ... అధికార బిఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దాసరి మనోహర్ రెడ్డికే మరోసారి అధిష్టానం టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ.... తెలుగుదేశం పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్న ఓదెల జడ్పిటిసి సభ్యుడు గంట రాములు, పెద్దపల్లి మాజీ జెడ్పిటిసి గతంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఈర్ల కొమురయ్య, తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సైతం కాంగ్రెస్ లో చేరి పార్టీ నుండి పోటీలో నిలిచే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ.... బిజెపి పార్టీ నుండి తెలుగుదేశం అలయన్స్‌లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ స్థాయి నాయకులతో మంచి సంబంధాలు కలిగిన దుగ్యాల ప్రదీప్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే బిజెపిలో చేరిన గొట్టముక్కుల సురేష్ రెడ్డి లు బిజెపి నుండి టికెట్ రేసులో ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ... ఇటీవల బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరిన దాసరి ఉష ఇప్పటికే గ్రామస్థాయిలో పర్యటిస్తూ బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భౌగోళిక పరిస్థితులు: ► పెద్దపల్లి నియోజకవర్గం సరిహద్దుల నుండి మానేరు నది ప్రవహిస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తుంది. ఇటీవల కాలంలో మానేరు నదిలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో స్థానిక రైతులు అధికార పార్టీపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ► పెద్దపల్లి నియోజకవర్గానికి మరో వైపు రామగిరి పర్వతాలు మంచి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ► సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. ► నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన సబితం జలపాతం (వాటర్ ఫాల్స్) పర్యాటకులను ఆకర్షిస్తుంది. -
Sircilla: కేటీఆర్‌ను ఢీ కొట్టుడు కష్టమే!
సిరిసిల్ల నియోజక వర్గంలో ప్రధానముగా పద్మశాలి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు కులస్థులు ఎక్కువ. మిగతా బీసీ కులాలు కూడా నియోజకవర్గములో అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా షెడ్యూల్ కాస్ట్ (17శాతం) వారు కూడా నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. పార్టీల వారిగా పోటీ చేసే అభ్యర్థులు! బీఆర్ఎస్ కేటీఆర్ బీజెపి కటకం మృత్యుంజయం లగిశెట్టి శ్రీనివాస్ ఆవునూరి రమాకాంత్ రావు రెడ్డెబోయిన. గోపి మోర. శ్రీనివాస్ కాంగ్రెస్: కేకే మహేందర్ రెడ్డి చీటి ఉమేష్ రావు సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గౌడ్. కేటీఆర్ మంత్రి అయిన తర్వాత సిరిసిల్లకు జరిగిన అభివృద్ధి పనులు సిరిసిల్ల చేనేత కార్మికుల కొరకు బతుకమ్మ చీరలు ఆర్ వి ఎం క్లాత్ సిరిసిల్లలోనే ఉత్పత్తి నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు, ఐటిఐ కాలేజ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆపరాల్ పార్కు నిర్మాణం జరుగుతుంది వర్కర్ టు ఓనర్ స్కీం షేడ్స్ నిర్మాణంలో ఉన్నవి అగ్రికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ కలెక్టర్ చౌరస్తా నుండి వెంకటాపూర్ వరకు 11 కిలోమీటర్ల ఫోర్ లైన్ బైపాస్ డబుల్ రోడ్డు ప్రారంభం సిద్ధంగా ఉంది. సివిల్ హాస్పిటల్ లో డయాలసిస్‌సెంటర్ మరియు సిటీ స్కాన్ ఆక్సిజన్ ప్లాంట్, అదనంగా మరో వంద పడకల ఆసుపత్రి గంభరావుపేట మండలంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రారంభం రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సిరిసిల్ల నేత కార్మికుల కొరకు ఉచిత ప్రమాద బీమా మంత్రి కేటీఆర్ సొంత డబ్బులతో ప్రీమియం అధునాతన వ్యవసాయ మార్కెట్‌తో పాటు డిపిఓ భవనం నిర్మాణం పూర్తి. మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో ఉంది. ఇక్కడ ఆధునిక మరమగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, పరిశోధన సంస్థ నిర్మాణంలో ఉంది.మధ్యమానేరు బ్యాక్ వాటర్ . తో సిరిసిల్ల పట్టణానికి పర్యాటక శోభ.... సిరిసిల్ల నియోజకవర్గ సమస్యలు : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి యారన్ డిపో లేకపోవడం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి వస్త్రాన్ని ఎగుమతి చేసేందుకు సరైన మార్కెట్ వసతి లేకపోవడం. చిన్న కుటీర మరమగ్గాల పరిశ్రమకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఉచిత విధ్యుత్ సరఫరా లేదు. బతుకమ్మ చీరల వలన సంవత్సరములో కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే పని, మిగతా నెలలు సరైన పనిలేకపోవడం. నియోజక వర్గములో 9వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగడం. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో ఉన్నత చదువుల కోసం డిగ్ర కళాశాలలు లేకపోవడం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో 30 పడకల ఆసుపత్రి లేకపోవడం వలన ఇబ్బందులు. బీడీ కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ నిర్మిస్తామన్న ఆసుపత్రి ఇప్పటివరకు లేకపోవడం. -
వేములవాడ: బీఆర్ఎస్పై ‘రాజన్న’ ప్రభావం..!
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేములవాడ 2009లో ఏర్పడింది. 2009లో మహాకూటమిలో భాగంగా వేములవాడ నుండి టిడిపి పార్టీ నుండి చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్‌పై 1821 ఓట్లతో గెలుపొందారు. 2009 సంవత్సరంలో తెలంగాణ ఇచ్చినట్లుగానే ఇచ్చి వెనక్కి తీసుకున్న నెపంతో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన రమేశ్ బాబు టీ(బీ)ఆర్ఎస్ పార్టీ నుండి 2010లో ఉప ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై గెలిచారు... .. 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేయగా బిజెపి నుండి బరిలో ఉన్న ఆది శ్రీనివాస పై 5 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందారు. వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొమ్మ వెంకటేశ్వర్లు 14 వేల వరకు ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 28 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వేములవాడ నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి టిఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే ఉంది. ఇప్పటివరకు ప్రధాన ప్రత్యర్థిగా ఆది శ్రీనివాస్ మాత్రమే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దేని నుండి పోటీ చేసిన ప్రత్యర్థిగా కనిపిస్తున్నాడు అది. చెన్నమనేని రమేశ్ బాబు తండ్రి రాజేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిజెపికి దాదాపు 20 వేల పైగా ఈ నియోజకవర్గం నుండి వచ్చింది. వేములవాడ నియోజకవర్గంలో ముఖ్యంగా కోనరావుపేట మండలం ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది. బిజెపి నాయకుడు చిన్నమనేని విద్యాసాగర్ రావు అలాగే లక్ష్మి నరసింహ రావు రమేష్ బాబు మండలం కోనరావుపేట కావడంతో ఆసక్తి నెలకొంది. అత్యంత ప్రభావితం చేసే గ్రామంగా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామం ఉంది. కనీసం అత్తగారి గ్రామాన్ని కూడా పట్టించుకోని కేసీఆర్: ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. దాంతోపాటు మండలంలో ప్రధానంగా ఎనిమిది ముంపు గ్రామాలు ఉండగా..వాటికి ఇవ్వవలసిన ఆర్.ఆర్. ప్యాకేజీ ఇవ్వకపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారు గ్రామమైన కొదురుపాక గ్రామాన్ని కూడా పట్టించుకోలేదనే వాదన ఉంది. ఈ గ్రామం కూడా ముంపు గ్రామాల్లో ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంతేకాదు ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం BRS పార్టీకి మైనస్‌గా అనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుండి గతం నుండి పోటీ చేసిన ఆది శ్రీనివాస్ ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తోనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజన్న అభివృద్ధి ఏది? వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అలాగే చెలిమెడ లక్ష్మీనరసింహారావు మనోహర్ రెడ్డి ఎన్నారై గోలి మోహన్ టికెట్ ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ అభివృద్ధి చేయకపోవడం బి ఆర్ ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పుకోవచ్చు, అలాగే కేటీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటున్న గోలి మోహన్ టికెట్ ఆశిస్తుండగా సీనియర్ నేతగా మనోహర్ రెడ్డి టికెట్ రేసు లో ఉన్నాడు, ఒకవేళ టిఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని అభ్యర్థి ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి పార్టీలో త్రిముఖ పోటీ? బిజెపి పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారిలో భాజాప సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు అలాగే ప్రతాపరామకృష్ణుడు సీనియర్ నేత తుల ఉమా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ రావుకు టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి చేయని అభివృద్ధిని క్యాష్ చేసుకొని ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో నిలిచి గెలుపు బాటలో ఉండాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలం ఆది శ్రీనివాస మాత్రమే బరిలో ఉంటున్నాడు. రెబల్ బెడద్ కూడా లేకపోవడంతో, కాంగ్రెస్ టికెట్ ఆది శ్రీనివాసకి కన్ఫాం చేస్తున్నట్టు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు: వేములావాడ నియోజకవర్గం లో ప్రధాన ఆలయం రాజన్న ఆలయంగా చెప్పవచ్చు,నాంపల్లి పర్యాటక కేంద్రంగా ఉంది గతంలో బీజేపి ఎంపీ గా ఉన్నప్పుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు నాంపల్లిని పర్యాటక కేంద్రంగా చేసారు. అధికార పార్టీపై ‘రాజన్న’ ప్రభావం ముఖ్యంగా రాజన్న ఆలయానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ 100 కోట్లు అభివృద్ధికి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, గ్రామాల ప్రజలను పట్టించుకోకపోవడం వారికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పవచ్చు. -
ధర్మపురి: అధికారిక పార్టీకి అవే మైనస్? వారి తీర్పే కీలకం
ధర్మపురి మున్సిపాలిటీతో పాటు, గొల్లపల్లి మండల ఓటర్ల తీర్పు కీలకం కాబోతున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కమార్‌పై 441 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే మంత్రి కొప్పుల గెలుపుపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని తన ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరుగుతోంది. ఈసారి జరుగనున్న ఎన్నికల్లో బీఅర్ఏస్ పార్టీ నుండి ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే అవకాశం ఉంది. త్రిముఖ పోటీ: కాంగ్రెస్ పార్టీ నుండి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. అలాగే గజ్జెల స్వామి, మద్దెల రవీందర్‌లు కూడా కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తూ.. నియోజకవర్గంలో వ్యక్తిగతంగా తమ అనుచరులతో కలసి పర్యటిస్తున్నారు. బిజేపి నుండి గతంలో కన్నం అంజన్న పోటీ చేశారు. ఐతే గత కొద్దికాలంగా అయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ధర్మపురి నుండి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నరగా వివేక్ నియోజకవర్గంలో అడపాదడపా పర్యటిస్తున్న.. ధర్మపురి నుండి పోటీపై ఇప్పటికీ క్యాడర్‌కు ఏలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ధర్మపురి నుండి వివేక్ పోటీచేస్తే మాత్రం ఎన్నికల్లో మూడు ప్రముఖ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత: వివేక్ కాకుండా బిజేపి నుండి కన్నం అంజన్న లేదా.. మరో కొత్త అభ్యర్థి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ద్విముఖ పోటీ ఉంటుంది. ధర్మపురి మున్సిపాలిటీలో మంచినీటి సమస్య, కరెంట్ కోతలతో పాటు, లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించకపోవడంతో అధికార పార్టీ పని తీరుపై ధర్మపురి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తుండగా.. ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు, కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ భూసేకరణతో వెల్గటూర్,పెగడపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు మంత్రి కొప్పులకు తలనొప్పిగా మారాయి. గడిచిన నాలుగున్నర ఏళ్ళలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు మరోసారి పట్టం కడతారని కొప్పుల ఈశ్వర్ ధీమాతో ఉన్నారు. ఓడిపోయిన గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజల మధ్య వుండడంతో పాటు, ప్రజల్లో సానుభూతి లక్ష్మణ్ కుమార్‌కు కలసి వచ్చే అంశం. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: ధర్మపురి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు, పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యవసాయరంగంతో పాటు, జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. -
కోరుట్ల: కీలక హామీలను మరిచిన అధికార పార్టీ..!
కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికలకు ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం నిజాం చక్కెర కర్మాగారం. తెలంగాణ వచ్చిన తర్వాత చక్కర ఫ్యాక్టరీ మూసి వేయడం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఫ్యాక్టరీ తెరిపిస్తారని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికి తెరవకపోవడం కీలక అంశం. గల్ఫ్ కార్మికుల సమస్య తెలంగాణ వచ్చాకా ఎన్.ఆర్.ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పినా తీసుకురాకపోటం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. పసుపు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపేల ఉంది. సామాజిక వర్గాలవారిగా ఓటర్ల సంఖ్య: పద్మాశాలి :67890 మున్నూర్ కాపులు: 35670 గౌడ్స్: 23560 ముదిరాజులు: 10230 కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా.. బిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అతని కొడుకు కల్వకుంట్ల సంజయ్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు జువ్వాడి నరసింహారావు, అలాగే మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్, వీరితోపాటు కల్వకుంట్ల సుజిత్ రావు టికెట్ ఆశిస్తున్నాడు. బిజెపి నుండి సీనియర్ నాయకుడు సురభి భూమరావు తనయుడు సూరభి నవీన్, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకట్ టికెట్ ఆశిస్తున్నారు. బిఆర్ఎస్ ఉంచి పోటీ చేసేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి పోటిలేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట సంజయ్‌కి టికెట్ ఇచ్చింది అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో జువ్వాడి నర్షింగరావు టికెట్ ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్ పోటిపడుతున్నాడు. మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో కొమిరెడ్డి రాములు క్యాడర్ ఉండటం వాళ్ల బలంగా చెప్పుకోవచ్చు, ఒకవేళ కొమిరెడ్డి కరంకు టికెట్ రాకపోతే బిఎస్పి పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో నాయకుడు సుజిత్ రావుకు క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేకపోవటం బలహీనతగా చెప్పుకోవచ్చు. ఇక బీజేపి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడిపోయిన జేఎన్ వెంకట, సురబి నవీన్ టికెట్ ఆశిస్తున్నారు. నవీన్ ముఖ్యంగా యువకులతో ముందుకు వెళ్తూ టికెట్ రేస్‌లో ఉండగా జేఎన్ వెంకట్ అంతగా ప్రభావం చూపకపోవచ్చు. గతంలో బుగ్గారం నియోజకవర్గంలో ఉన్న మల్లాపూర్ మండలంలోని ఏడు గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని నాలుగు, కోరుట్ల మండలంలోని ఐదు గ్రామాలు ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నాయి. బుగ్గారం నియోజకవర్గం ఉన్నప్పుడు రత్నాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఆంశం కాస్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలించవచ్చు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి: ► మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాలుగు మండలాల్లో అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేపించారు. అలాగే పెన్షన్స్, రోడ్ల, వంతెనలు నిర్మాణాలు చేపట్టారు. రెండు మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, అలాగే వార్డులలో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ► కోరుట్ల నియోజకవర్గంలో ఆసక్తికరమైన అంశాలు అంటే ప్రతి గ్రామంలో 89% గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. ► కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గెలుపోవటములను పద్మశాలి కులస్థులు ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గంలో పద్మశాలి, గౌడ, ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది ► కోరుట్ల,మెట్ పల్లి పట్టణాల్లో అధికశాతం ముస్లీంలు ప్రభావితం చెయ్యవచ్చు నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఐదు ఎకరాల మర్రిచెట్టు పర్యాటక కేంద్రంగా ఉంది. కోరుట్ల మండలం నాగులపేట శివారులో సైఫాన్. కోరుట్ల పట్టణంలో రెండవ శిరిడిగా పేరుగాంచిన సాయిబాబా ఆలయం ఉంది. -
జగిత్యాల: పథకాలు అమలైనా.. ఫలితం మాత్రం సున్నా..
BRS పార్టీ నుండి 2014లో మాకునూరి సంజయ్ కుమార్ ఓటమి అనంతరం, 2019లో సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిసి కులాలు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావితం పార్టీల పరిస్థితి: బి.ఆర్.ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా రెబల్స్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఐదుగురు ఆశిస్తున్నారు. ఆశావహులు బీఆర్ఎస్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తాటిపర్తి జీవనరెడ్డి ( ప్రస్తుత ఎమ్మెల్సీ ) ఆశావహులు తాటిపర్తి విజయలక్ష్మి తాటిపర్తి రాము బీజేపీ: బోగ శ్రావణి (రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు) శైలేందర్ రెడ్డి మధుసూదన్ తిరుపతి రెడ్డి BRS అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్లస్‌లు: జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణా. సీఎం రిలీఫ్ పండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు అందించడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కెటిఆర్ వద్ద మంచి పేరు ఉండటం. మైనస్‌లు: బీర్పూర్ మండలంలో రోళ్లవాగు నిర్మాణం పూర్తి అయిన ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. కులవసంఘ భవనాలు నిర్మాణం జరిగినా.. దళిత బంధుకు అందించడం పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గంపై చిన్న చుపు చూడడం మండల, గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం. -
చొప్పదండి: అధికార పార్టీకి రెబల్స్ బెడద..
BRS పార్టీ నుండి 2014 లో బొడిగె శోభ , 2019 లో సుంకే రవిశంకర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మాదిగ, మాల, బిసి కులాలు నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసేలా ఉన్నాయి. పైగా బీఆర్ఎస్కు ఈసారి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ లేరు. బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి BSP నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఆశావాహులు BRS .. సుంకె రవిశంకర్ CONGRESS 1)మేడిపల్లి సత్యం(చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి) BJP 1) బొడిగ శోభ(మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి) 2) సుద్దాల దేవయ్య(మాజీమంత్రి) BRS ప్రతికూల అంశాలు: బోయినిపల్లి,రామడుగు,గంగాధర మండలాల్లో లో ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. రైతుల ధర్నాలు చేసిన పట్టించుకోకపోవడం ,సమస్యలు ఉన్నా చోటికి వెల్లకపోవడం. కొండగట్టు అభివృద్ధి పనులు ప్రారంభించక పోవటం. కులవసంఘ భవనాలకు,దళిత బంధు కు కమీషన్లు తీసుకోవడం. స్వంత ఊరిలో కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకోవడం,గంగాధర, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేయడం. పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గం పై అక్రమ కేసులు పెట్టడం. మండల,గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం. తమకు విలువ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేపై అధిష్ఠానంకు రెడ్డి, రావు నాయకుల ఫిర్యాదు. అనుకూలతలు గాయత్రీ పంపు హౌజ్ నిర్మాణం, చొప్పదండి మున్సిపాలిటీ కావడం, స్మార్ట్ సిటీ పనులు చేపట్టడం. సీఎం రిలీఫ్ పండ్,కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కేటీఆర్ వద్ద మంచిపేరు ఉండటం. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మైనస్‌లు: కొండగట్టు ఆలయ అభివృద్ధికి హామీలు తప్ప, పనులు ప్రారంభించక పోవటం. ముంఫు గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవటం,అవసరం ఉన్న మండలాల్లో రహదారులపై బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవటం. పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం. ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు. -
మానకొండూరు: రసమయికి గట్టి పోటీనే!
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇచ్చే అంశంలో వెనుకడుగు, అలాగే 100 పడకల హాస్పిటల్ రాకపోవడం మైనస్ లుగా చెప్పవచ్చు. ► ఎస్సీలు 23శాతం ► బీసీలు 65 శాతం ► ఎస్టీలు 1 శాతం ► ఇతరులు 11 శాతం ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి: రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ నుండి: కవ్వంపెల్లి సత్యనారాయణ బీజేపీ పార్టీ నుండి: గడ్డం నాగరాజు దరువు ఎల్లన్న సొల్లు అజయ్ వర్మ కుమ్మరి శంకర్ బీఎస్పీ పార్టీ నుండి: నిషాణీ రామచంద్రం మాతంగి అశోక్ వీరందరూ బరిలో ఉండేందుకు సన్నద్ధం అవుతుండగా ప్రధాన పోటీలు మాత్రం రసమయి బాలకిషన్ (బిఆర్ఎస్), కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్), ఆరపెల్లి మోహన్ (బిఆర్ఎస్), ఓరుగంటి ఆనంద్ (బిఆర్ఎస్)గడ్డం నాగరాజు (బీజేపీ)దరువు ఎల్లన్న (బీజేపీ)ల మధ్య గట్టి పోటీ ఉంటదని తెలుస్తుంది. ఆయా పార్టీల నుండి ఇచ్చే టికెట్‌పై ఆధారపడి ఉంటుంది. -
హుజురాబాద్: ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
గత ఉపఎన్నికల్లో స్థానికత, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపాయి. ఇదే ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇచ్చిన హామీలను కొన్ని అమలుపర్చినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, పెన్షన్లు అర్హులందరికీ అందినప్పటికీ కమ్యూనిటీ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు నియోజకవర్గంలో ఉంటుంది. బీజేపీ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లేదా ఈటల జమున పోటీ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మండలాల వారిగా ఓటర్లు హుజురాబాద్- 61,673 జమ్మికుంట- 59,020 కమలాపూర్- 51,282 వీణవంక- 40,099 ఇల్లందకుంట- 24,799 ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 306 కేంద్రాలు ఉన్నాయి సమస్యత్మక ప్రాంతాలు. 107 సంఖ్యగా అధికారులు గత ఉప ఎన్నికల్లో గుర్తించారు. 6వృత్తులపరంగా. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి రైతులు రైతుబంధు సానుకూలంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని నిరాశతో ఉన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకమనే చెప్పవచ్చు వ్యాపారస్తులు వారి అవసరాల కోసం అధికార పార్టీని వాడుకుంటున్నప్పటికీ ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. కులాలపరంగా ఓటర్లు ఓసీలు- 23 వేలు కాపు- 31 వేల పై చిలుకు గొల్ల కురుమ- 29 వేలు ముదిరాజ్- 30 వేలు ఎస్సీలు- 47 వేలు ఎస్టిలు- 6,500 వేలు మైనార్టీ- 12,300 వేలు ► నియోజకవర్గంలో మానేరు వాగు ,ఇల్లందకుంట దేవాలయం ముఖ్యమైన ప్రదేశాలు -
కరీంనగర్: ఈసారి సర్వత్రా ఆసక్తి
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. రాజకీయ చైతన్యానికి కేరాఫ్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సరికొత్త అందాలను సంతరించుకుని సుందరంగా రూపుదిద్దుకుంటున్న నగరం.. ఇప్పుడీ నియోజకవర్గంలో గెలుపు గుర్రమెవ్వరనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం.. కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో స్త్రీ, పురుష, ఇతరుల నిష్పత్తి ఏవిధంగా ఉంది? ఏ ఏ సామాజికవర్గాలది పైచేయి ఇప్పుడు చూద్దాం. ► 40 వేల ఓట్లు మున్నూరు కాపులు ► 38 వేల ఓట్లు ముస్లిం మైనారిటీలు ► 22 వేల ఓట్లు పద్మ శాలీలు ► 29 వేల ఓట్లు ఎస్సీలు ► 14 వేల ఓట్లు ముదిరాజ్ ► 9 వేల ఓట్లు గౌడ ► 8 వేల క్రిస్టియన్ ఓట్లు 1957లో కరీంనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి జువ్వాడి చొక్కారావు గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ అధిష్టానంలో నిలిచింది. ఇక నాలుగు సార్లు టీడీపీ, 2 సార్లు గులాబీ పార్టీలు ఇక్కడ సత్తా చాటాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావు అదే తరహాలో మూడుసార్లు మంత్రిగా గెలిచి మంత్రి పదవి చెపట్టారు. ఎమ్మెస్సార్, ముద్దసాని దామోదర్ రెడ్డి సరసన ప్రస్తుత మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ .. కానీ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తప్పలేదు 2009, 2014, 2018 లో వరుసగా గెలిచి... హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ రికార్డ్ సాధించారు. 2009లో 68738 ఓట్లు, 2014 లో 77209 ఓట్లు సాధించి గెలుపొందారు. 2018లో మాత్రం గంగుల, బండి సంజయ్‌ల మధ్య పోరు రసవత్తరంగానే సాగింది. గంగులకు 80, 983 ఓట్లు రాగా... బండి సంజయ్‌కి 66, 009 ఓట్లు, పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై కేవలం 14 వేల 974 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ టికెట్ బరిలో ఉండగా.. 4వ సారి సమరానికి సై అంటున్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా గంగుల కమలాకర్‌ను ఎంపీగా పోటీ చేయించాలన్న ఓ చర్చ దాదాపు ఊహాగానమేనని వినిపిస్తోంది. గంగులతో పాటు, అధికారపార్టీ బలాలు ఆర్థికంగా బలమైన నేత... మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్ల సంఖ్య 21 ఇందులో అధికార పార్టీ కార్పొరేటర్లు 19 గంగుల ప్రధాన బలం ప్రత్యమ్నాయా ప్రతిపక్షాలు లేకపోవటం నిత్యం ప్రజలతో మమేకం బలమైన క్యాడర్ బలహీనతలు నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే కోటరీ. ప్రజలు ఆయనని నేరుగా కలిసే అవకాశం లేకపోవటం. తన సామాజిక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారన్న అపవాదు. రూరల్, అర్బన్ నేతల కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు. మునిసిపల్ కార్పొరేషన్ లో కమీషన్ల కక్కుర్తిపై ఆరోపణలు. బొమ్మకల్, కొత్తపల్లితో వంటి మేజర్ ప్రాంతాల్లోని కీలక నేతలతో ఈమధ్య సయోధ్య చెడటం. కులుపుకోవాలని చూసినా నివురుగప్పిన నిప్పులాగే కొనసాగుతున్న సంబంధాలు. ఎంఐఎం నేతలు పూర్తిగా వ్యతిరేకమవ్వటం. చేసిన పనులు కరీంనగర్ సిటీలో 14 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి. ఐటీ టవర్ నిర్మాణం. 234 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. 600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు. మెడికల్ కళాశాల మంజూరు. టీటీడీ దేవాలయం. కరీంనగర్ చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయించి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఏటా కరీంనగర్ మున్సిపాలిటీకి 100 కోట్ల నిధులు వచ్చేలా మూడేళ్ల నుంచి మంజూరు చేయించుకోవడం... స్మార్ట్ సిటీ, ఐలాండ్ లతో సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం వంటివి ప్లస్. చేయని పనులు 24 గంటల నీటి సరఫరా విలీన గ్రామాల సమస్య డంప్ యార్డ్ ప్రధాన సమస్య ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేకపోవడం నగరంలో పార్కింగ్ సమస్య నూతనంగా గొప్పగా చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్స్ కుంగిపోవడం రక్షణ వాల్స్ కు బీటలు రావడం అధ్వానంగా అంతర్గత రోడ్ల పరిస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కానీ దుస్థితి డబుల్ బెడ్ రూమ్ హామీ నెరవేర్చలేకపోవటం ప్రత్యర్థులు... బీజేపీ నుండి బండి సంజయ్, ఆయన రాజకీయ గురువు పొల్సాని సుగుణాకర్ రావు ఉన్నారు. బండి సంజయ్ కుమార్, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో 14 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ వరకు ఎదిగారు. బీజేపీ మూల సిద్ధాంతాల నుండి వచ్చిన ఏబీవీపీ, RSS విద్యార్థి స్థాయిలోనే పనిచేస్తున్నారు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తూ 80% ఉన్న హిందువుల కోసం తమ పోరాటం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. 2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి. కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 52455 ఓట్లు సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై 66009 ఓట్లు సాధించి 14,000 పైగా ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నారు బండి. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో 14 వేల ఓట్ల ఓటమి చవిచూసిన తర్వాత సానుభూతి పవనాలు బలంగా వీచాయి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య విజయం సాధించారు. అగ్ర నాయకుల దృష్టిలో పడ్డ బండి సంజయ్‌ని ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి పార్టీ పగ్గాలాయన చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఆయన మూడు విడుతలగా జరిపినటువంటి మహా సంగ్రామ పాదయాత్ర బిజెపికి కొత్త ఊపును తెచ్చిపెట్టింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచి తన మార్కు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ మునుగోడు ఓడిపోవడంతో సీనియర్లతో వచ్చిన వర్గ విభేదాలు పదవీకాలం ముగియడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని మరో కీలక పదవైన జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావడంతో నూతనోత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌కు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ వంటివారు టికెట్ ఆశిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ : పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్ రెబెల్ గా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆ తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన పొన్నం ప్రభాకర్ కెరీర్లోనే అత్యుత్తమ స్థాయి గ్రాఫ్ అందుకున్నాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నాడు. మరోసారి ఆయన బరిలో ఉంటారా? ఉండరా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వట్లేదు? మేనేని రోహిత్ రావు : కరుడు గట్టిన కాంగ్రెస్ వాది... మాజీ మంత్రి ఎమ్మెస్సార్...మనవడు రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు... కరీంనగర్ కార్పొరేషన్ లోని పారిశుద్యం, 1000 కోట్ల కుంభకోణం, స్థానిక సమస్యలతో పాటుగా రైతాంగ సమస్యలు ధాన్యం కొనుగోలు అంశాలపై మంత్రిని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్ సభతో పాటుగా కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభకి పూర్తిస్థాయిలో అన్ని తానై నిర్వహించాడు.... వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కృషి చేస్తున్నారు. కొత్త జైపాల్ రెడ్డి... ట్రేండింగ్ లో ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయింది. బీజేపీ లో వెళ్తారన్న టాక్ వినిపించినా ఎందుకో ఆగిపోయింది. గంగులకు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ మైనారిటీ వర్గాలు సపోర్ట్ చేస్తూ చెబుతున్నాయి. 1996 లో తెలుగుదేశం రాజకీయ అరంగేట్రం చేసిన జైపాల్ రెడ్డి 1999 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత కు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఉన్నారు. 2005, 2013 లో సింగిల్ విండో చైర్మన్ గా గెలిచిన జైపాల్ రెడ్డి...2010 లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. 2013లో పొలిటికల్ గాడ్ ఫాదర్ నాగం జనార్దన్ రెడ్డి తో సహా రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. 2018 లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ చొప్పదండి అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలుపుకు కృషిచేశారు. జైపాలన్న మిత్ర మండలి పేరుతో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారు. గోల్డెన్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి అంబటి జోజిరెడ్డి బరిలో ఉంటామని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన అంబటి. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా పార్టీకి సేవలందించారు. ఏఐఫ్ బి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. -
వనపర్తి: కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు, కానీ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతివారు అందరు ఆయా పార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. దూసుకుపోతున్న మంత్రి.. వణుకుతున్న ప్రతిపక్షాలు ప్రస్తుతం మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తనదైన పనితనంతో దూసుకుపోతున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనను తట్టుకోలేని పరిస్ధితి నెలకొంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా అయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2018లో నిరంజన్‌రెడ్డి విజయం సాధించారు. వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలో ఉండి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, వైద్య, విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. సాగునీరు తీసుకురావటంలో ఆయన చేసిన కృషికి ఇక్కడ జనం ఆయనను నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పిలుస్తారు. కేవలం ఓకే నియోజకవర్గం మాత్రమే పరిధి ఉన్న వనపర్తిని ప్రత్యేక జిల్లా చేయించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధనా కేంద్రం, ఫిషరీ కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను వనపర్తికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టణంలోని రహదారుల విస్తరణ చేయిస్తున్నారు. రైతుల ఆందోళన.. అధికార పార్టీకి మైనస్! కానీ పనులు నత్తనడకన సాగటంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తన పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. కానీ మిగిలిన ప్రాంతంలో పనులు జరగని కారణంగా నీటిని మాత్రం తరలించలేకపోవటంతో మైనస్‌గా మారింది. ఏళ్ల క్రితం తాము భూములు, ఇళ్లు కోల్పోయినా ఇంకా పునరావాసం దక్కలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటికోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని ఏదుల రిజర్వాయర్ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫి, డబుల్బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత మైనస్ కానుంది. స్వంత పార్టీకి చెందిన పలువురు నేతలు, అనుచరులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడి మంత్రిపై తిరుగుబాటు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూ సమస్యల్లో తనవారికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ప్రచారం సాగుతుంది. అనుచరులు మంత్రి పేరు చెప్పి సెటిల్మెంట్లకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేతలు పార్టీని వీడటం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉండటం మంత్రికి కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టు.. మొదటినుంచి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్దే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్‌రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్‌రెడ్డి విభేదించిన ఎంపీపీలు మోగారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే మోగారెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తూ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయనకు పోటీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. అయితే చిన్నారెడ్డికి సీటు ఇస్తే తాము పనిచేసే పరిస్ధితి లేదని పలువురు నేతలు బాహాటంగానే అధిష్టానానికి తేల్చిచెప్పారు. సో ఇక్కడి సీటు కేటాయింపు పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీదపడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోనేత నాగం తిరుపతి రెడ్డి పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ చిన్నారెడ్డి మాత్రం తానే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారటా... దాంతో పార్టీలో నెలకొన్న గ్రూపు తగదాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి బలమైన నాయకుడు లేడు. తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి ఈసారి వనపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు బీజేపీ గాలం వేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మాజీ నాయకుడు అశ్వథామరెడ్డి సైతం బీజేపీ సీటు ఆశిస్తున్నారు.ఇక్కడ టీడీపీ కూడ గతంలో బలంగా ఉండేది.ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.ఆయన పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడ లేవు.కాని ఆయన ఎవరికైనా మద్దతు తెలిపితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.మరి వచ్చే ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నదులు: కృష్ణానది ప్రవహిస్తుంది ఆలయాలు: శ్రీరంగపురం రంగనాయక స్వామి ఆలయం పర్యాటకం: సంస్దానం పాలన సాగించిన వనపర్తి రాజా గారి బంగ్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. రాజుల పాలనలోనే ఇక్కడ సస్తసముద్రాలు ఏర్పాటు చేసి జనాలకు తాగునీరు, రైతులకు సాగునీటి కోసం చర్యలు చేపట్టారు. -
నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?
నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది! అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు. డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా? ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్ మార్క్ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది. -
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
మక్తల్: ప్రతీసారి భిన్న ప్రజాతీర్పు.. ఈసారి మాత్రం ఉత్కంఠే!
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో ప్రతిసారి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఆ సెగ్మెంట్లో అన్ని పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నువ్వా..నేనా అన్నట్టు సాగే అవకాశం ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పాత టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆరోపణ ఉంది. నియోజకవర్గం కేంద్రంలోని మున్సిపాలిటీని సైతం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ చిట్టెం సోదరి డీకే అరుణ ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయి. చిట్టెం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కటి కూడ నిర్మాణం చేయలేదు. సంగంబండ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. నేరేడుగాం,ఉజ్జెల్లి,సంగంబండ పునరావాస గ్రామాల పరిస్దితి గురించి ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణ ఎమ్మెల్యే అండదండలతోనే చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.150 పడకల ఆస్పత్రి, హామీ ఇంకా నేరవేరలేదు ఇటీవల మంజూరీ వచ్చినా పనులు ప్రారంభించలేదనే మైనస్ ఉంది.రాజకీయాల్లో తన భార్య జోక్యం కొంత ఇబ్బందిగా మారవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం ఆసక్తి కనబరుస్తున్నారు. వర్కటం జగన్నాథం కరోనా సమయంలో అనేక సేవకార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య,పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్లు,పదవ తరగతి విద్యార్దులకు స్టడీమెటీరియల్ ఇప్పించారు.మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి సైతం బీఆర్ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనకే సీటువస్తుందనే ధీమాలు ఉన్నారు.అయితే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యే చిట్టెంకు ఊరటనిస్తుంది.ఇక్కడ సీటు విషయంలో పోటీ నెలకొనటం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. బీజేపీకి ఇక్కడ మొదట నుంచి మంచి క్యాడర్ ఉంది.మున్సిపల్ చైర్మన్ పీఠం కూడ ఆ పార్టీకే దక్కింది. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు ఎమ్మెల్యే వ్యవహారశైలి తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. డీకే అరుణ ప్రభావం కూడ ఇక్కడ ఉండే అవకాశం ఉండటంతో మరింత ప్లస్ కానుంది.అయితే ఇక్కడ కూడ మొదటి నుంచి పార్టీలో ఉండి రెండు సార్లు పోటీ చేసిన కొండయ్యకు,కొత్తగా పార్టీలో చేరిన జలంధర్‌రెడ్డికి మద్య పొసగటం లేదు.ప్రజాసంగ్రామయాత్రలో కూడ పోటాపోటీగా తమ బలప్రదర్శన చేశారు. జలంధర్‌రెడ్డి గత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి రెండవ స్దానంలో నిలిచిచారు. ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన తర్వాత జలంధర్‌రెడ్డి నియోజవర్గానికి చుట్టపుచూపుగా మారారు. సీటు విషయంలో కొండయ్య,జలంధర్‌రెడ్డి మద్య ఏకాభిప్రాయం కుదిరితే పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే అధికార బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందిగానే ఉంది. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాక పార్టీకి సరైన నాయకత్వమే కరువయ్యింది. ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం ఇక్కడి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నింపింది. మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు గౌడ్, ఎన్నారై పోలీస్ చంద్రశేఖర్రెడ్డిలు సీటు కోసం ఆశిస్తున్నారు. వీరారెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అది దేవరకద్ర నియోజకవర్గంగా పునర్విభజనలో మారింది. కానీ ఆత్మకూరు, నర్వ, అమరచింత మండలాలు ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఉండటంతో పాటు, రాహుల్ జోడో యాత్రలో కీలకంగా పనిచేయటం తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. బీసీ గౌడ్ సామాజికవర్గానికి చెందిన నాగరాజు గౌడ్ గతంలో ఎన్ఎస్యూఐలో పనిచేశాడు. రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న ఇతను రాహుల్ల్గాం గాంధీ జోడోయాత్రలో హుషారుగా పనిచేసి పార్టీ నేతల దృష్టిని ఆకర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సీటు రాకుంటే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి కూడ కాంగ్రేస్ లో చేరుతారనే ప్రచారం జోరుగాసాగుతుంది.కాంగ్రేస్ అభ్యర్ది అవుతారని ఆయన వర్గీయులు అంటున్నారు.2018లో మక్తల్‌లో టీడీపీ నుంచిపోటీ చేసిన సీతమ్మ భర్త దయాకర్‌రెడ్డి మూడోస్దానంలో నిలువగా 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భరోసాపెట్టుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఆత్మకూర్ అమరచింత మండలాలు వనపర్తి జిల్లాలో, మదనాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు దేవరకద్ర నియోజకవర్గములో, ధన్వాడ మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు నారాయణపేట నియోజకవర్గములో అనుసంధానమై ఉన్నాయి.ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. నదులు: కృష్ణా, భీమా నదులు వర్షాకాలంలో పుష్కలంగా ప్రవహిస్తాయి రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది,చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఆలయాలు: కృష్ణానది తీరాన దత్తపీఠ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ముడుమాల నిలువు రాళ్లు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.కృష్ణాలో మొట్టమొదట రైల్వేస్టేషన్ ఉంది. -
పాలమూరుపై బీజేపీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఫోకస్
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. త్రిముఖపోటీ జరుగనుంది. అధికార బీఆర్ఎస్ దీటుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి. చేసిన అభివృద్ది.. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది. పాత సీటును నిలుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తుంటే.. బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే ముస్లీం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం ఓట్లు ఫలితం కూడా ప్రభావితం చేసే స్దాయిలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగుల ఓట్లు కూడ ఎక్కువగ ఉన్నాయి. దీంతో ఫలితంపై అన్ని అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు. రెండవసారి గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఆయన మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆరోపణలు.. బీఆర్ఎస్కు అదే మైనస్! బైపాస్ రహదారి పర్యాటకం మయూరి పార్క్, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, పట్టణంలో కూడళ్ల అభివృద్ది, సుందరీకరణ ఆయనకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అన్ని నియోజవర్గాల కంటే ముందు వరుసలో ఉన్నా నిర్మాణం జరిగిన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయటంలో జాప్యం జరగటం.. అందులో అవినీతి ఆరోపణలు రావటం కొంత ఇబ్బందిగా మారింది. పరిస్ధితి తనకు తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిద్దుబాటు చర్యలు దిగారు. అక్రమార్కులపై కేసులు కూడ నమోదయ్యాయి. ఎన్నికల అఫ్రిడవిటిల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరచుగా జరిగే కొన్ని ఘటనలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఓ కార్యక్రమ ర్యాలీలో బహిరంగంగా గాలిలో కాల్పులు జరపటంతో విమర్శలు ఎదుర్కొన్నారు. హత్య కుట్ర కేసు వ్యవహారం కూడ ఆయనకు కొంత మైనస్‌గా మారింది. అనారోగ్యం బారిన పడిన వారి బాగుకోసం నిత్యం అందుబాటులో ఉండి వారికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి భారీగా నిధులు ఇప్పించి మెప్పుపొందారు. జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ది కోసం విశేష కృషి చేశారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందేలా వసతులు కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బలవంతంగా ఇతర పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారని, లేకుంటే కక్షసాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులు భూ ఆక్రమణలకు దిగుతున్నారనే అపవాదు కూడ ఉంది. తన అనుచరులకు పెద్దపీట వేసి ఉద్యమకాలంలో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో ఆయనను తట్టుకుని నిలిచే నేతలు ఇటు కాంగ్రెస్, బీజేపీలో స్దానికంగా లేకపోవటం కలిసి వచ్చే అంశం. రంగంలోకి బీకే అరుణ.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదు అయితే బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉంటే కొంత ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతుంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. చాలా మంది మంత్రి పదవులు సైతం పొందారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగా మారింది. పోటీకి బలమైన అభ్యర్ది లేడనే అభిప్రాయం ఉంది. ఉన్నదాంట్లో ఎవరంతకు వాళ్లు తమకు సీటుకావాలనే అశతో ఉన్నారు. పార్టీ బలోపేతంపై పెద్దగా శ్రద్ద కనబరిచిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీని వీడటం కూడ తలనొప్పిగా మారింది. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఆ సామాజికవర్గాల ఓట్లను తమవైపు మలుపుకునే దిశగా ఎలాంటి కార్యాచరణ చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినా గెలిచినా అభ్యర్ది ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియని అయోమయం నెలకొంది. దీంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు విశ్వసించటం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని పేద ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఒబేదుల్లా కోత్వాల్, సంజీవ్ ముదిరాజ్‌లు సీటు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీటుగా నిలిచే అభ్యర్దిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది. జోడో యాత్ర, కార్ణాటక గెలుపు కాంగ్రెస్ కలిసి వస్తుందా? రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం.. కర్ణాటకలో పార్టీ గెలుపు కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో ఆ పార్టీలొ కొత్తజోష్ నెలకొంది. 2012 ఉపఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ పాలమూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి నుంచి ఈ సారి కషాయం జెండా ఎగురవేయాలని యోచిస్తున్నారు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరీలో దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో డీకే అరుణకు.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు వచ్చిన ఓట్లకంటే అధికంగా రావటంతో పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. జితేందర్‌రెడ్డి కూడ బీజేపీలో ఉండటం, బండి సంజయ్ కుమార్‌కు ప్రజాసంగ్రామయాత్ర ఈ జిల్లాలో విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపింది. ఈసారి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఎన్పీ వెంకటేష్‌తో పాటు మరో రెండు మూడు పేర్లు పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు కూడ నష్టం కలిగించే అవకాశం ఉంది. పాత, కొత్త నేతలకు పొసగటం లేదు. పాతవాళ్లు గ్రూపుగా ఏర్పడి కొత్తవారిని ఎదగనీయటం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. మోదీ ప్రభావంతో ఈసారి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో ఎవరికి వారు తమ అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నూతనంగా ఐటీ కారిడార్ ఏర్పాటైనా ఇంకా అందులోకి కంపెనీలు రాలేదు. అడవులు: అప్పన్నపల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి ఆలయాలు--పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం పర్యాటకం: మయూరీ నర్సరీ,కోయిల్‌సాగర్ ప్రాజెక్టు -
కొల్లాపూర్‌లో ఎవరికి వారే యమునా తీరే!
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఇచ్చినా ఆపార్టీల్లోని ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్ధితి నెలకొంది. అధిష్టానాలు కూడా గ్రూపు రాజకీయాలను చక్కదిద్దటంలో విఫలమవుతున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లో ఎవరికివారు యమునా తీరే అనే రీతిలో వ్యవహారం నడుస్తోంది. నేతల మధ్య వార్.. పార్టీ వీడిన జూపల్లి కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు 5 సార్లు గెలిచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో జూపల్లి కాంగ్రెస్ అభ్యర్ది హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తర్వాత రాజకీయ పరిణామాలతో హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. పార్టీలో హర్షవర్దన్‌రెడ్డి బలపడటం... రోజురోజుకు జూపల్లికి ప్రాధాన్యత తగ్గటం మొదలయ్యింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో దింపి సత్తా చాటారు. ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరిగింది తప్పా ఎక్కడ సమసిపోలేదు. అధిష్టానం కూడా ఇద్దరిని సమన్వయం చేసేందుకు పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీపై ఘాటైన విమర్శలు చేయటంతో జూపల్లిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకుని ఢిల్లీలో బుధవారం మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైను క్లియర్ అయ్యింది. హర్షవర్ధన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సోమశిల-సిద్దేశ్వరం వంతెన, రెవెన్యూ డివిజన్ సాధించానని దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిన నెరవేరటంతో పాటు ఈప్రాంతం అభివృద్ది చెందేందుకు దోహదపడుతుందని అంటున్నారు. అయితే జీఓ 98 ప్రకారం శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చటంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై ఆ వర్గాల అసంతృప్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరగకపోవటం, మాదాసి కురువలను ఎస్సీలుగా, వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానంటూ ఇచ్చిన హమీలు నెరవేరకపోవటంతో ఆయా వర్గాలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారనే ఆరోణలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేకు మైనస్‌గా మారనుంది. ఇప్పటికే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు ఫాంహౌజ్ ఎపిసోడ్ సంకటంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరటంతో గతంలో కొల్లాపూర్‌లో మూడు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన, సీఆర్ జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన రంగినేని అభిలాష్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరాఉ. ఈయన కూడ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడ అంతర్గత విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలను వీరిద్దరు వేరువేరుగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. సొంతగూటికి జూపల్లి.. మొదలైన వర్గపోరు ఇంతలోనే జూపల్లి సొంతగూడికి చేరటంతో వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ది ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే సీటు గ్యారెంటీతోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. జూపల్లి పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్టు చెబుతున్న జగదీశ్వర్‌రావు మాత్రం సీటు తనకే కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అప్పుడే వర్గపోరు మొదలైనట్టు కనిపిస్తోంది. ఎలాగైనా తాను ఈసారి బరిలో ఉండాలనుకుంటున్న జగదీశ్వర్‌రావుకు సీటు రాకుంటే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీటు విషయంలో గందరగోళం రేగితే బీఆర్ఎస్కు మేలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్‌రావు నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి మంజూరు చేసిందని తాను దీనికోసం ప్రయత్నించానని గతంలో హర్షవర్దన్‌రెడ్డి జూపల్లిలకు అవకాశం ఇచ్చారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అంటున్నారు. ఆయన నియోజవర్గంలో పాదయాత్ర నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటం పెద్ద మైనస్‌గా ఉంది. అయితే సుధాకర్‌రావు మాత్రం పార్టీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు కొల్లాపూర్ సంస్ధానాల పాలన సాగిన ప్రాంతం,ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం.మామిడి తోటలకు ప్రసిద్ది చెందిన ప్రాంతం.ఇక్కడి నుంచి మామిడిపడ్లను అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగితం పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా నల్లమలలో పుష్కలంగా వెదురు లభ్యమవుతుంది. నదులు: కృష్ణానది,దీని ఆదారంగా భగీరధ నీటిని పాలమూరు,రంగారెడ్డి జిల్లాలకు సరఫరా అవుతుంది అడవులు: నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.ఈ నియోజవర్గంలోని చిన్నంబావి,వీపనగండ్ల,పాన్గల్లు మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో ఉన్నాయి.మిగిలినవి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్నాయి. ఆలయాలు: ఈ నియోజవర్గంలో ప్రసిద్దిన అనేక ఆలయాలు ఉన్నాయి సింగోటం శ్రీలక్ష్మి నర్సింహ స్వామి ఆలయం ,కొల్లాపూర్ మాదవస్వామి ఆలయం ,జెటప్రోలు. వేణుగోపాలస్వామి ఆలయాలు,సోమశిలలో సోమేశ్వరాలయం,ద్వాదశలింగల ధామంగా పసిద్ది చెందింది. పర్యాటకం: సోమశిల కృష్ణానది, కే ఎల్ ఐ ప్రాజెక్ట్.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు. -
కొడంగల్: ఈసారి రేవంత్‌రెడ్డికి కలిసొచ్చే అంశం అదే!
కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు క్రమంగా వేడెక్కుతున్నాయి. అభివృద్దిపై ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జోరందుకున్నాయి. ఇద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈసారి ఇక్కడ పోటీ రసవత్తరంగా జరుగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం రెండు జిల్లాలో పరిధిలోకి వెళ్లింది. కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉండగా మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్‌పై పడింది. రేవంత్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేశారు. అధికార బీఆర్ఎస్తో నిత్యం కొట్లాడి పనుల విషయంలో రాజీలేకుండా పోరాడారు. అందుకే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను టార్గెట్ చేసి ఓడించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్ది పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపించారు. ఓడిపోయినా రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తన సోదురుడు, అవసరమైనప్పుడు ఆయనే వచ్చి నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాడనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన గెలుపు ఈసారి ఖాయమనే ధీమాను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో కూడా ఆయనపై ప్రస్తుతం మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. బీఆర్ఎస్ వర్గపోరు.. రేవంత్‌కు ప్లస్ కానుందా? ఇంకోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు సైతం ఈసారి రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. తనకు రాజకీయంగా మొదటి నుంచి వైరం ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్‌రెడ్డిని కలిసేందుకు నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొడంగల్‌లో కాంగ్రేస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్‌రెడ్డికి 2014లో కాంగ్రేస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే టీఆర్ఎస్లో చేరి చేరి పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. 2018లో టీఆర్ఎస్ ఆయనకు మొండిచెయ్యి చూపింది అయినా పార్టీ అభ్యర్ది విజయం కోసం పనిచేశారు. నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. డీసీసీబీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవటంతో సింగల్ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తనకు ఎలాగో వయసు మీదపడింది కాబట్టి తన వారసుల రాజకీయ భవితవ్యంపై భరోసా కావాలని అడిగిన ఆయన ఇటీవలే ఢిల్లీలో పార్టీ నేతలను కలిసి వచ్చారు. గుర్నాథ్రెడ్డి పార్టీలో కలవటం కూడ కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది తప్పా తర్వాత ఏం జరగలేదని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తాను గతంలో చేసిన అభివృద్ది గెలిపిస్తాయని రేవంత్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం కావటంతో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నియోజకవర్గంపై ఉండనుంది. అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి చాలా మంది ముఖ్యనేతలను పట్టించుకోవటం లేదని, వారంతా ఆయనకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో మంజూరైన పనులు కొంతమేర పూర్తి చేయించారు తప్పా కొత్తగా తెచ్చిన పథకాలు ఏమీ లేవు. దారుణంగా బీజేపీ పరిస్థితి.. ఈసారి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్సే? ఇప్పటికీ బొంరాస్ పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు లేక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడ నిరుపేదలకు అందివ్వలేదు. కోస్గి 50 పడకల ఆస్పత్రి ఇంకా పూర్తి కాలేదు. ఇసుక అక్రమ రవాణ, మైనింగ్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం సాగుతుంది. ఇక్కడి రైతులకు సాగునీరందించే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని మండిపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాలను నమ్ముకుని ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారు. పార్టీలో గ్రూపురాజకీయలు, అంతర్గత కుమ్ములాటలు సైతం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయనే ప్రచారం కొనసాగుతుంది. మొత్తంగా ఈసారి బీఆర్ఎస్కు ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్ధితులే కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ పరిస్ధితి అయితే మరి దారుణంగా ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన నాగూరావు నామాజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇక్కడ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టేవారు కరువయ్యారు. ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపే పరిస్ధితి లేదు. దీంతో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గానే సాగనుంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: జిల్లా పునర్విభజనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం కొన్ని మండలాలు నారాయణపేట,మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉండటంతో ఎన్నికలపై ప్రభావం చూపిస్తారు. ప్రదానంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి సాగునీటి వసతులు లేవు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాని సాగునీరు అందిస్తామన్న బీఆర్ఎస్ హామీ నెరవేరలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు తమ ప్రభావం చూపనున్నారు. ఆలయాలు: రెండవ తిరుపతిగా ప్రసిది చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. -
కల్వకుర్తి: బీఆర్ఎస్కు మైనస్! కాంగ్రెస్ కంటే బీజేపీనే బలంగా..
నాగర్ కర్నూల్ జిల్లాలో చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం కల్వకుర్తి. ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పునిస్తారు. టీడీపీ వ్యవస్దాపకుడు ఎన్టీఆర్‌ను సైతం ఓడించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్దితులు హాట్‌టాపిక్‌గా సాగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీ అనివార్యం కానుంది. నియోజకవర్గం పేరు: కల్వకుర్తి మండలాల సంఖ్య: 6 (కల్వకుర్తి , వెల్దండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్) మొత్తం గ్రామపంచాయతీలు: 164 మున్సిపాలిటీలు: కల్వకుర్తి, ఆమనగల్లు ప్రభావితం చూపే పంచాయితీ: మాడ్గుల మొత్తం ఓటర్లు: 2,17,042 పురుషులు: 1,10,975; మహిళలు: 1,06,061 2014లో కాంగ్రెస్ అభ్యర్ది వంశీ చందర్‌రెడ్డి కేవలం 78 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ 3447 ఓట్ల మెజార్టీలో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్దాయిలో ఉన్నాయి. గ్రూపు రాజకీయాలతో ఇక్కడ కూడా పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు.ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది జైపాల్‌యాదవ్ మూడో స్దానం నిలిచారు. కసిరెడ్డికి స్దానికసంస్దల తరపున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంతో ఆయన గెలిచారు. 2018 ఎన్నికల్లో కసిరెడ్డి బీఆర్ఎస్ తరపున సీటు ఆశించారు. ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు కానీ పార్టీ మరోసారి జైపాల్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దికి కసిరెడ్డి సహకరించలేదు. అయినా జైపాల్ యాదవ్ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి సమావేశాల్లో ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు నడిచింది. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిన పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి కసిరెడ్డి రెండవసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇద్దరి మధ్య అదే గ్యాప్ కొనసాగుతుంది. తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా కసిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు కావాల్సిన కసరత్తు చేస్తూనే ఉన్నారట. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడా తలనొప్పిగా మారనుంది. ఎవరికి సీటు ఇచ్చినా ఇంకోకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. పార్టీలోని చిత్తరంజన్‌దాస్, ఉప్పల వెంకటేష్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్లు కూడా జైపాల్ యాదవ్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించటమే కాక ఆయనకు సీటు ఇస్తే సహకరించమని ఇటీవల కసిరెడ్డి నేతృత్వంలో ఓ ఫాంహౌజ్‌లో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారట. ఇక జైపాల్ యాదవ్ ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో తన మార్క్ పని ఏది చేయలేదని..డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కల్వకుర్తిలో జరిగినా పంపిణీ చేయటంలో జాప్యం చేస్తుండటం మైనస్‌గా మారింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడ తీవ్ర జాప్యం వల్ల తనకోసం పనిచేసిన వారికి మేలు చేయలేక పోయారనే అపవాదు ఉంది. అదే జైపాల్ యాదవ్ ధీమా ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఈసారి కూడా తనకే సీటు వస్తుందనే ధీమాలో ఉన్నారు జైపాల్ యాదవ్. ఈ నియోజకవర్గం గుండా రెండు జాతీయరహదారులు హైదరాబాద్-శ్రీశైలం,జడ్చర్ల, కోదాడ ఉండగా కొత్తగా కొట్రనుంచి నంద్యాల వరకు మరో జాతీయరహదారి మంజూరయ్యింది. నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎక్కడ ట్రామా కేర్ సెంటర్ లేదు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి వందపడకలు చేస్తామన్న హమీ నేటికీ నెరవేరకపోవటంతో జనాలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టక తప్పటం లేదు. జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తనయుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కూడ సీటు ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీ, రెడ్డి సామాజికవర్గాల మధ్య అధిపత్యపోరు కూడా జరుగుతోంది. కేవలం ప్రభుత్వ పథకాలపైనే భరోసా పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్దితి ఇక్కడి బీఆర్ఎస్ నేతల వంతవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున వంశీచందర్ రెడ్డి 2014లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో ఆయన మూడోస్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు సైతం చేయటం లేదట. ఆయన రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారని సొంత పార్టీనేతలు గుసగుసలాడుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడ తమ దారితాము చూసుకుంటున్నారు. ఐక్యతా ఫౌండేషన్ పేరుతో ఎన్ఆర్ఐ రాఘవేందర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడే లేడా.. ఆయన కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సీటు వస్తే కాంగ్రెస్ నుంచి లేకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలనే అలోచనలో ఉన్నాడట. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. సీటు కూడ కావాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది. పార్టీ నేతలతో సంప్రదింపులు కూడ జరిగాయట. కానీ సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆతని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ నడిపించే నాయకుడే కరువయ్యాడు. పారిశ్రామిక వేత్త జూపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన 2014లో వంశీచందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలువటంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్న వంశీచందర్‌రెడ్డి ఈసారి కల్వకుర్తి నుంచి పోటీ చేసే అవకాశంలేదనే ప్రచారం సాగుతుంది. అయితే ఆయన సూచించిన వ్యక్తికే సీటు ఇచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు. అందుకే ఆయన వ్యూహత్మకంగా జూపల్లి భాస్కర్‌రావును ప్రోత్సహిస్తున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, రుణమాఫి, డబుల్ బెడ్రూం రూం ఇళ్ల నిర్మాణం వంటి అశలు తమకు కలిసివస్తాయని భావిస్తుంది. బీజేపీకి బలంగా మారిన అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు ఇక బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాలో ఆ పార్టీ అభ్యర్ది తల్లోజు ఆచారి ఓటమి చెందారు. తర్వాత ఆయన జాతీయ బీసీ కమీషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. మరోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఇక్కడ గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇక్కడ బీజేపీ పాత నేతలు, కార్యకర్తలు కొత్తవారిని పార్టీలోకి రానివ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆచారి నియోజకవర్గంలో ఆశించిన స్దాయిలో అందుబాటులో ఉండటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉండటంతో కొంత బీజేపీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత.. టీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..మోదీ చరిష్మా ఈ సారి తప్పకుండా బీజేపీని గెలిపిస్తోందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్ పోరు రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు నాగర్‌కర్నూల్ అటూ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. హైదరాబాద్ -శ్రీశైలం,కోదాడ-జడ్చర్ల,కొట్ర-నంద్యాల మధ్య మూడు జాతీయ రహదారులు గల నియోజకవర్గంగా ఉంది. దుందుభీ నదీ ప్రవాహం ఉంటుంది. ఆలయాలు: రెండవ భద్రాదీగా పేరున్న సీతారామచంద్రస్వామి ఆలయం సిర్సనగండ్లలో ఉంది. కడ్తల్లో మైసిగండి ఆలయం ఉంది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవటం, నిర్వాసితులకు సరైన పరిహారం అందకపోవటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై ఉండే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి పరిశ్రమల స్దాపన చేయకపోవటంతో ఆ వర్గం ఓట్లు కూడ బీఆర్ఎస్కు మైనస్ కానుంది. -
జడ్చర్ల: ఆశావాహులు అడ్డగోలు.. అయోమయం వీడితేనే..!
నియోజకవర్గం: జడ్చర్ల మండలాల సంఖ్య: 6 (జడ్చర్ల, మిడ్జిల్, ఊరుకొండ, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట) మొత్తం పంచాయితీలు: 187 మొత్తం ఓటర్లు: 202404 ఓట్లు పురుషులు: 102076; మహిళలు: 100326 ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాజకీయ మూలస్థంభంగా వున్న జడ్చర్ల నియోజక వర్గంలో ప్రధాన పార్టీలలో పోటీ చేయాలనే ఆశావాహుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తిని రేపుతుంది. నేతల వ్యవహారంతో అయా పార్టీలో వున్న కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యం కానుంది. పారిశ్రామికంగా దినదినాభివృద్ది చెందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఇటు 44 అటు 167 జాతీయ రహదారులు జడ్చర్ల మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014, 2018 ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. సిట్టింగులకే సీట్లంటూ కేసీఆర్ చేసిన ప్రకటనతో మరోసారి ఆయనే పోటీకి రెడీ అయ్యారు. రీసెంట్గా అభ్యుర్థుల ప్రకటించిన అధిష్టానం మరోసారి జడ్చర్ల టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకే కెటాయించింది. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మొదటి నుంచి లక్ష్మారెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2008లో ఆయన సూచన మేరకు మొదటి వ్యక్తిగా తన పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలిచారు. పార్టీల్లో కుమ్ములాటలు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం నుంచి అన్ని నియోజకవర్గాలకు వచ్చిన ప్రకారం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశారు తప్పా తనకంటూ ప్రత్యేక గుర్తింపు నిచ్చే పని ఏ ఒక్కటి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారికి సరైన ప్రాధాన్యత లేదనే అసంతృప్తి చాలా మందిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా ఎన్నికల నాటికి లక్ష్మారెడ్డికి హ్యండ్ ఇస్తారనే చర్చ సాగుతుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తగిన న్యాయం చేయలేదనే అపవాదు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగటమే కాగా ఇళ్ల పరిహారంలో అక్రమాలు జరిగాయే ఆరోపణలు ఉన్నా న్యాయం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు భూకబ్జాలు, అవినీతి కార్యకలాపాల్లో తలదూర్చుతున్నా ఎమ్మెల్యే వారిని కట్టడి చేయటంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడ మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న కుమ్ములాటలు కలిసొస్తాయని ఆశగా ఉన్నారు. ఈసారి జడ్చర్ల నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తరచు పర్యటించటం బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉండటం చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహత్మకంగానే జీవన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు సీటు విషయంలో పోటీ పడితే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది. మూడు ముక్కలాట కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. మొదటి నుంచి ఇక్కడ మల్లురవి ఇంచార్జీగా ఉన్నారు. ఆయన కేవలం 2008లో జరిగిన ఉపఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేయటం ఓడిపోవటం పరిపాటిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లురవి మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. జడ్చర్లలో ప్రస్తుతం జనుంపల్లి అనురుద్రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ముసలం మొదలయ్యింది. మొదటి నుంచి ఆయన రాకను అడ్డుకుంటూ వచ్చారు. ఆయనకు నేరచరిత్ర ఉందని పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. తనకు సన్నిహితుడైన అనిరుద్‌రెడ్డికి సీటు విషయంలో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి అడ్డుపడ్డారనే ప్రచారం సాగుతుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు బీసీ ఓట్లు అధికంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో తీసుకుంటే కలిసివస్తుందని భావించి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎడమొహం..పెడమొహంగా ఉన్నారు. అనిరుధ్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో పోటీ చేయటం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీటు నిరాకరిస్తే వేరే పార్టో లేక ఇండిపెండెంటుగానైనా బరిలో దిగుతారనే ప్రచారం సాగుతుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేయటంలో అనిరుధ్‌రెడ్డి కీలకంగా పనిచేసి పార్టీ డిల్లీ అధినేతలతో శభాష్ అనిపిచ్చుకున్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, పాదయాత్ర నిర్వహిస్తూ అనిరుధ్‌రెడ్డి జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డికి కాకుండా కోమటిరెడ్డి వెంకట్ట్రెరెడ్డి వర్గీయుడిగా ముద్రపడటం ఆయనకు మైనస్‌గా మారింది. ఎర్రశేఖర్ ప్రస్తుతం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పాత నేతలు, తన వర్గీయులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటం ఎర్ర శేఖర్‌కు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. గతంలో ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడకుండా కార్యకర్తలను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఆయనపై ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. అయోమయంలో కార్యకర్తలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితంగా ఉన్న బాలత్రిపురసుందరీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ పట్టు సాదిస్తుండగా ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో మూడు, నాలుగు గ్రూపులు బీజేపీ పార్టీలో ఉండగా ప్రస్తుత రాజకీయ అస్పష్టతతో ఎపుడు ఎవరు ఏ గ్రూప్‌లో చేరతారో తెలియకుండా పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఎస్పీ నుంచి బాలవర్థన్ గౌడ్ పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మొత్తంగా జడ్చర్ల నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రసవత్తరంగా మారనున్న గద్వాల ఎన్నికలు.. గెలుపు ఎవరిది?
నియోజకవర్గం: గద్వాల మండలాల సంఖ్య: 5 (గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి ) మొత్తం పంచాయితీలు: 130 పెద్ద మండలం: గద్వాల మొత్తం ఓటర్లు: 91875 పురుషులు: 45321; మహిళలు: 46544 ప్రతిసారి ఎన్నికలు గద్వాలలో హోరాహోరీగా సాగుతాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడ వీరిద్దరు మరోసారి తలబడనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బలమైన బీసీ అభ్యర్దిని బరిలో దింపటానికి సిద్దమవుతుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యం కానుంది. కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి కూడా బీఆర్ఎస్ వచ్చేనా? సంస్ధానాల పాలన.. జాతీయస్దాయి గుర్తింపు గల చేనేత కార్మికులు.. కృష్ణా తుంగభద్రా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే గద్వాల రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల కూడ ఒకటి. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే కుటుంబ సభ్యులే అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. వీరిద్దరు వరుసకు అత్తా-అల్లుళ్లు. గడచిన మూడు ఎన్నికల్లో వీరిద్దరు తలబడితే రెండుసార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా అరుణకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా సాధనకు ఆమె అప్పట్లో గట్టిపోరాటం చేశారు. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆమె వెంటనే స్పందిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌పై సైతం విధానపరమైన విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానంలో తనదైన ముద్రవేసుకుంది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసింది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు దాదాపు 30 వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు ఒకవేళ పార్టీపరంగా బీజేపీకి వ్యతిరేకంగా పడితే కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. అయితే కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆపార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే అరుణ వర్గీయులు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ సీటు సిట్టింగ్‌లకే ఈసారి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. కానీ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, గ్రూపు తగదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. ఆయన అనుచరులే వ్యతిరేకంగా చాపకింది నీరులా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్దాయికి చేరటంతో ఇటీవలే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గాంధీ భవన్లో గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈసారి గద్వాల నుంచి బలహీన వర్గాల అభ్యర్దిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమెకు సీటు ఖాయమైందని స్పష్టమవుతుంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలు పెద్దగా ప్రభావితం చేసే వాళ్లు కాకపోవటంతో ఈమెకు మార్గం సుగమమయ్యింది. ఈ నియోజవర్గంలో వాల్మీకి బోయలు, కురువల ఓట్లు అధికంగా ఉండటంతో కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే గద్వాల నియోజకవర్గంపై ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని ఈపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అన్నితానై వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వారే అరోపిస్తున్నారు. తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, బండ్ల రాజశేఖర్‌రెడ్డితో కూడా పొసగటం లేదట. అందుకే బక్కచంద్రన్నగా పిలిచే చంద్రశేఖర్‌రెడ్డి కూడా జడ్పీచైర్ పర్సన్ సరితతో పాటుగా కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు. అయితే ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలే తమపార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండంగా ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రేస్ పార్టీ నేతలు సైతం ఈసారి తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు.మొత్తంగా నడిగడ్డ రాజకీయాలు ఎన్నికలకు నాలుగు నెలల ముందే రంజుగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు కృష్ణా, అటు తుంగభద్రా నదుల మధ్య ఉండటంతో ఈ ప్రాంతాన్ని నడిగడ్డగా పిలుస్తారు. గద్వాల కేంద్రంగా సంస్దానాల పాలన సాగింది నదులు: కృష్ణానది ,జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు ఆలయాలు: మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మిచేడు జమ్మలమ్మ ఆలయం, పర్యాటకం: జూరాల పర్యాటక కేంద్రంగా డ్యాంలో నీటి నిల్వను, గేట్ల ద్వారా పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు. అదేవిధంగా గద్వాల కోటను చూసేందుకు, గద్వాల పట్టు చీరలను కొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. తిరుమల వెంకన్నకు ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఇక్కడి నుంచి స్వామివారికి జోడుపంచెలు తీసుకెళ్తారు. ఇది వందల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం -
దేవరకద్ర ఎమ్మెల్యేకు సొంత పార్టే సమస్య కానుందా?
మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పున: వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇందులో 5 మండలాలు ఉన్నాయి. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో వనపర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. వర్గపోరు కలిసివచ్చినా.. ప్రభుత్వ వ్యతిరేకతే సమస్య మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఆయన అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. ప్రతిసారి ఆయనకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు కలిసి వస్తుంది. ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీలో ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. ఇదే తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యే ఉన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు పేరుంది. నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను చాలా వరకు నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేశారు. ఎమ్మెల్యేపై కంటే మండల నేతల వ్యవహారంపైనే ఓటర్లు గుర్రుగా ఉన్నారు. పెద్దవాగు, ఊకచెట్టువాగు పై దాదాపు 18 చెక్ డ్యాంల నిర్మాణం చేయించారు. ఎన్నో ఏళ్లుగా వర్నె-ముత్యాలంపల్లి మధ్య వాగులో వంతెన లేక జనాలు వర్షాకాలం అనేక కష్టాలు పడేవారు. ఆ వంతెన మంజూరు చేయించి పనులు చేపట్టడంతో నాలుగైదు గ్రామాల ప్రజల సమస్య తీరుతుంది. కానీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఈసారి ఆయనకు ఇబ్బందిగా మారనుంది. శంకర సముద్రం రిజర్వాయర్ పనులు పూర్తి అయినా పునరావాసం కొలిక్కిరాకపోవడంతో ఆయకట్టుకు నీరందించటం లేదు. దీంతో పెద్దమందడి, అడ్డాకుల మండలాల ప్రజలు సాగునీటి ఇబ్బందులు పడుతున్నారు. మండలస్దాయిలో పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివేన రిజర్వాయర్ నీటిరాక ఆలస్యం కావటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దేవరకద్రకు వందపడకల ఆస్పత్రి మంజూరు కాకపోవటం ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018లో డోకూర్ పవన్ కుమార్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. అవే అప్పట్లో పవన్ కుమార్ ఓటమికి కారణమైంది. ఆ సెగ్మెంట్లో న్యాయవాది మధుసూదన్ రెడ్డి( జీఎంఆర్), ప్రదీప్ గౌడ్ వర్గాలు ఉన్నాయి. సీటుకోసం ఎవరంతకు వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సీటు రాని పక్షంలో ఒకరికొకరు ఏ మేరకు సహకరిస్తారో చెప్పలేని విచిత్ర పరిస్దితి ఉంది. దీన్ని అధికార టీఆర్ఎస్ అభ్యర్ది అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. అవకాశం వస్తే సీతా దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరి దేవరకద్ర సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డోకూరు పవన్ కుమార్ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికీ చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అదే జరిగితే అభ్యర్ది విషయంలో ఇక్కడ నలుగురు నేతల మధ్య పోటీ తీవ్రం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. పార్టీ గెలిస్తే సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డి నేతల మధ్య సమన్వయం చేసేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపుపై కాంగ్రెస్ మాత్రం ధీమాగా ఉంది. సొంత పార్టీలోనే ముగ్గురు నేతల పోటీ ఇక బీజేపీలో చేరిన డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కుమార్‌రెడ్డికి ఈసారి సానుభూతి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇదే సమయంలో స్వంత పార్టీలో పోటీకోసం మరో ముగ్గురు నేతలు ఎగ్గని నర్సింహులు, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణలు సీటు ఆశిస్తుండటం కొంత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇంకోవైపు గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటున్న డీఎస్పీ కిషన్ ఈసారి దేవరకద్ర నుంచి తప్పకుండా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకోసం వివిధ పార్టీలతో ఆయన టచ్‌లో ఉంటూ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్నారు. భూత్పూర్ నుంచి కొత్తకోట మండలం వరకు NH 44 జాతీయ రహదారి, దేవరకద్ర మీదుగా167 జాతీయ రహదారి కలదు.కొత్తకోటలో చేనేత కార్మికులు,బీడీ కార్మికులు ఉన్నారు పరిశ్రమలు: కొత్తకోట మండలం అప్పరాల దగ్గర కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ కలదు.మూసాపేట మండలంలో ఓ గ్లాస్ పరిశ్రమ ఉంది అడవులు- దేవరకద్ర మండలంలో అడవి అజిలాపురం, బసవయ్య పల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి. ఆలయాలు- చిన్నచింతకుంట మండలంలో పేదల తిరుపతిగా పిలిచే శ్రీ కురుమూర్తి స్వామిఆలయం,అడ్డాకుల మండలం కందూరులో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కాశీ తర్వాత కల్పవృక్షాలు ఇక్కడ ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. పర్యాటకం: 1), కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.2), సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే మొదటిదిగా మరియు ప్రపంచంలో రెండవది ఇక్కడ ప్రత్యేకత మానవ ప్రమేయం లేకుండా వాటర్ వచ్చినప్పుడు గాలి పీడనం (సైఫన్ సిస్టమ్) ద్వారా నీరు బయటికి వస్తుంది. సుదీర్ఘమైన పొడవులో ఊకచెట్టు వాగు ఉంది. -
అలంపూర్: అధికార పార్టీలోనే గ్రూపు రాజకీయాలు.. గెలుపు సాధ్యమేనా?
5వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు కలవరపెడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరటంతో అక్కడి రాజకీయ ముఖచిత్రం మారుతుంది. ఇక్కడ బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకోవటంతో బహుముఖపోటీ అనివార్యం కానుంది. నియోజకవర్గం: అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్) మండలాల సంఖ్య: 7 (అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, రాజోలి, వడ్డేపల్లి, ఐజ, ఇటిక్యాల ) పెద్ద మండలం: ఐజ మున్సిపాలిటీలు: అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మొత్తం పంచాయతీలు: 125 అత్యంత ప్రభావితం చూపే పంచాయితీ: ఐజ మొత్తం ఓటర్ల సంఖ్య: 222463 పురుషులు: 111024 ; మహిళలు: 111439 సతమతమవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. అలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం వర్గపోరుతో సతమతమవుతున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనపై సొంతపార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్తే అడ్డుకున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. 2009 ఎన్నికల్లో అబ్రహాం కాంగ్రేస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోవటంతో టీడీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ అబ్రహం రెండవ స్దానంలో నిలవగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మంద జగన్నాథం తనయుడు మందా శ్రీనాథ్ మూడవ స్దానానికే పరిమితమయ్యారు. తర్వాత అబ్రహం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచే 2018లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన మాజీఎంపీ,ఢిల్లీలో ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్ మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గాలో రెండు వర్గాలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు విడిపోయారు. గెలిచిన కొన్నాళ్లు ఎమ్మెల్యే అబ్రహాం బాగానే ఉన్నా తర్వాత పార్టీ నేతలు,కార్తకర్తలతో పొసగలేదు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తమను పట్టించుకోవటం లేదని పలు సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. కొన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలకు వెళ్తే అడ్డుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే బలమైన ఆరోపణ అయనపై ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమీషన్లు వసూలు చేస్తున్నారని స్వంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వందపడకల ఆస్పత్రి అలంపూర్‌లో కాకుండా చౌరస్తాలో ఏర్పాటు చేయటంతో అక్కడి నేతలు సైతం ఆయనపై గుర్రుగా ఉన్నారు. అయితే అబ్రహాం ఈసారి తన తనయుడు అజయ్ కుమార్‌కు సీటు ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తండ్రికంటే నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇది కూడ పార్టీలోని ఇతర నేతలకు రుచించటం లేదు. ఇక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నీటిమూటలే అయ్యాయని ఆరోపిస్తున్నారు. స్దానికులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలోని వల్లూరు,మల్లంకుంట రిజర్వాయర్ పనులు చేపట్టలేదు. నియోజకవర్గంలో ఒక్కరికి కూడ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకురాలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయనపై ఈసారి జనాలు గుర్రుగా ఉన్నారు. ఆయన అనుచరుడు యువజన నాయకుడు ఆర్.కిశోర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మంద జగన్నాథం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.. ఇవి తనకు చివరి ఎన్నికలనే ఉద్దేశ్యంతో ఉన్నారట అందుకే ఆయన తన ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు ప్రచారం సాగుతుంది. అధికార పార్టీ కొంపముంచేట్టుగా గ్రూపు రాజకీయాలు ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతతో పాటు గ్రూపు రాజకీయాలు కొంపముంచే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇటీవలే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈయనకు ఎమ్మెల్యే అబ్రహంకు మద్య చాలా గ్యాప్ ఉంది. చల్లా పార్టీలో చేరిన తర్వాత అలంపూర్ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లా ఆశీస్సులు ఉన్నవారికే సీటు వస్తుందని...వారే గెలుస్తారనే నమ్మకం ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని పార్టీల్లోని తన అనుచరులు, ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు చల్లా చుట్టు తిరుగుతున్నారు. మరి ఆయన ఎవరికి మద్దతు తెలుపుతాడోననే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే అబ్రహంకు మాత్రం సీటురాకుండా అడ్డుకుంటారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అలా 2014లో అలంపూర్ నుంచి కాంగ్రేస్ అభ్యర్ది సంపత్ మార్ గెలిచారు. 2018లో ఓడిపోయారు.ఆ నియోజకవర్గంలో ఆయనకు పోటీగా సీటుకోసం ప్రయత్నం చేసే నాయకుడు లేకపోవటంతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న నేపధ్యంలో ఆయనకు సీటు విషయంలో ఇబ్బంది లేదు. ఇప్పటికే సంపత్‌కుమార్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎమ్మెల్యే వైఖరిపై విమర్శలు చేస్తూ జనాలను ఆకర్శించే ప్రయత్నంచేస్తున్నారు. కాని చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రేస్ పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరటం సంపత్‌కుమార్‌కు పెద్దదెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో చల్లా అనుచరులు కూడ ఆయన వెంటే వెళ్లటం సంపత్‌కుమార్‌కు సంకటంగా మారనుంది. టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు,ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని సంపత్వర్గీయులు భావిస్తున్నారు. అయితే సంపత్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి చుట్టపుచూపుగానే వచ్చిపోతారనే విమర్శకూడ ఉంది. నియోజకవర్గంలో కాంగ్రేస్ పార్టీని జనాలు నమ్మె పరిస్దితి లేదనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. బీజేపి ఇలా.. అలంపూర్ సెగ్మెంట్ జనరల్ సీటుగా ఉన్నప్పుడు బీజేపీకి మంచి పట్టుండేది.ఇక్కడి నుంచి మూడు సార్లు బీజేపీ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.ఎస్సీ రిజర్వేషన్ మారిన తర్వాత బలమైన నాయకత్వం లేకపోవటంలో పార్టీ చతికిల పడింది.ఇక్కడి నుంచి ఇద్దరు అభ్యర్దులు సీటుకోసం ప్రయత్నిస్తున్నారు.నాగర్‌కర్నూల్‌లో 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీని పోటీ చేసి ఓడిపోయిన బంగారు శృతి,ఎస్పీ మోర్చ రాష్ట్రనాయకుడు బంగి లక్ష్మణ్ కూడ పార్టీ సీటు కోసం యోచిస్తున్నారు.బంగి లక్ష్మణ్ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు.వీరంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేస్తున్న దాఖలాలు లేవు.మరి రానున్న రోజుల్లో బీజేపీ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: అలంపూర్ నియోజకవర్గ కృష్ణా, తుంగభద్రా రెండు నదుల మధ్యలో ఉండి నడిగడ్డ ప్రాంతంగా పిలవబడుతుంది. ఇటు ఏపీ,అటు కర్ణాటక సరిహద్దులు కలిగిన నియోజకవరం కావటంతో అక్కడి రాజకీయ పరిస్దితుల ప్రభావం ఇక్కడ కూడ ఉండే అవకాశం ఉంటుంది.44 జాతీయ రహదారికి ఇరువైపుల విస్తరించి ఉంది.నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే జీవనోపాధిగా జీవిస్తున్నారు.పత్తి,మిర్చి,పప్పుశెనగను వాణిజ్య పంటగా రైతులు సాగుచేస్తారు.ఆర్డీఎస్ ద్వారా ఇక్కడ పంటపొలాలకు సాగునీరు అందాలి. -
అచ్చంపేట: త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిది?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా అచ్చంపేటలో ఈసారీ త్రిముఖపోటీ అనివార్యం కానుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందుకెళ్తుండగా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతతో పాటు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం తమకు కలిసి వస్తుందని కాంగ్రేస్ భావిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది గువ్వల బాల్‌రాజు విజయం సాధించారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణను ఓడించారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న గువ్వల బాల్‌రాజు మూడోసారి అచ్చంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాని ఆయన వ్యవహారశైలిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్పా కొత్తగా తన మార్కు పనులు ఏమీ చేయలేదనే ప్రచారం ఉంది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రధానంగా ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య తీరలేదు. అక్కడ వేలాది మంది రైతులకు చెందిన పోడు భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు. దీనికి తోడు ఆయనపై పోడు రైతులు గుర్రుగా ఉన్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. పలు మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి కొందరు నేతలు కూడ ఎమ్మెల్యే వైఖరితోనే దూరమవుతున్నారని సొంతపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్నిఆయనకు చెప్పే ధైర్యం చేయటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. భూ వివాదాల్లో కూడా తలదూర్చుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకునియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదు. ఇళ్లస్దలాలు ఇవ్వలేదు. మాదిగా సామాజిక వర్గానికి చెందటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ఫాంహౌజ్ ఎపిసోడ్లో గువ్వల బాల్‌రాజ్ కూడ ఉండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ చక్కర్లు కొట్టడం గువ్వలకు ఇబ్బందిగా మారింది. రంగంలోకి ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్? అయితే బాల్‌రాజ్ పక్కన పెడితే నాగర్ కర్నూల్ ఎంపీ రాములుకు సీటు ఇవ్వొచ్చని ఒకవేళ ఆయన వయస్సు మీదపడిందని భావిస్తే ఆయన కుమారుడు భరత్ ప్రసాద్‌ను రంగంలోకి దించే అవకాశం ఉంది. భరత్ ప్రసాద్‌కు నాగర్ కర్నూల్ జడ్పి చైర్మన్‌కి బరిలో నిలిచి చేజాయిరిపోయింది. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా తన తండ్రి రాములుకు నియోజకవర్గంలో ఉన్న మంచిపేరు కలిసివస్తుందని భావిస్తున్నారు. పార్టీ సీటు ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా బరీలో దిగాలనే ఆలోచనలో భరత్ ప్రసాద్ ఉన్నట్టు సమాచారం. దీంతో అధికార బీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఓడిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి పోటీకి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు,ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్‌రెడ్డి కూడ ప్రత్యేక దృష్టి సారించారు.ఈసీటు తప్పకుండా గెలవాలనే యోచనలో ఉన్నారు.ఎమ్మెల్యే గువ్వలబాల్రాజ్ భూకబ్జాలు,ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని మండిపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే వంశీకృష్ణ భార్య,అమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనురాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందనే అభిప్రాయం పార్టీ నేతలు,కార్యకర్తల్లో ఉంది.అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగసామాజిక వర్గ ఓట్లు మైనస్‌గా మారే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆ ఇద్దరిలో ఎవరూ? బీజేపీ కూడ ఈసారి గెలుపుపే ద్యేయంగా పనిచేయాలని యోచిస్తోంది. బలమైన అభ్యర్దిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్ మాదిగ, శ్రీకాంత్ భీమా పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు ఎవరు, వారు చర్యలు ప్రారంభించింది.మిగితా బీఎస్పీ,వైఎస్ఆర్టీపీ పార్టీల అభ్యర్దులు పోటీకి ఆసక్తి చూపుతున్నా వారి ప్రభావం నామమాత్రమే కానుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పరిశ్రమలు లేవు అడవి విస్తీర్ణం బాగా ఉంటుంది. నియోజకవర్గంలోనే నల్లమలలో దట్టమైన అడవులు ఉన్నాయి. చిరుతలు పెద్దపులులు ఇతర వన్యప్రాణులకు నిలయం నల్లమల్ల. ఉమామహేశ్వర క్షేత్రం, నిరంజన్ షావాలి దర్గా, మద్దిమడుగు, లొద్ది మల్లయ్య, తెలంగాణ అమర్నాథ్గా పలిచే సలేశ్వరం, మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ప్రసిద్ధిగాంచినవి.అనేక కిలోమీటర్ల పరిధిలో దుందుభినది విస్తరించి ఉంది. ఎస్ఎల్బీసీ నక్కలగండి సాగునీటి ప్రాజెక్టులు పనులు నడుస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ పేరుతో పర్యాటకులను ప్రత్యేకమైన వాహనంలో అడవిలో పర్యటింప చేస్తున్నారు. కే ఎల్ ఐ కాలువ విస్తీర్ణం నియోజకవర్గం లో అధికంగా ఉంది రైతులకు కొంతమేర లబ్ధి జరుగుతుంది. -
అధికారంలోకి వస్తే కులాలవారీగా జనగణన
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే కులాలవారీగా జనగణన చేపడుతామని, ఇందుకు ఏఐసీసీ అధినాయకత్వం కూడా హామీ ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మతంరావు అన్నారు. బుధవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ.. కేంద్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బీసీల అభ్యున్నతిని పట్టించుకోకపోవడమే కాకుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలను నిర్లక్ష్యం చేస్తూ సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడమే తెలంగాణ ప్రభుత్వ ధరణి పోర్టల్ ఉద్దేశమన్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా బీసీ సదస్సుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గైర్హాజరవడం సరికాదని పేర్కొన్నారు. పార్టీలో సమస్యలను హైకమాండ్ పరిష్కరిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులకు హైకమాండ్ చోటు కల్పించిందనన్నారు. ఈ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న ప్రభాకర్ సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికై న పొన్నం తిరిగి పార్టీ కోసం పని చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి అంజన్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు. -
బీజేపీ నినాదం.. బీసీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని వివిధ స్థాయిలలో ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరిపినట్టు, ఈ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. గత శుక్రవారం కోర్ కమిటీ భేటీ, శనివారం మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, గత మూడేళ్ల కాలంలో పార్టీలో చేరిన ముఖ్య నేతల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీల్లో బీసీ నినాదాన్ని తెరపైకి తేవడంతో పాటు బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు సమాచారం. ఈ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, పార్టీ ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఒకవేళ బీఆర్ఎస్, కాంగ్రెస్సుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా అగ్రవర్ణాల వారే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ.. బీసీ వాదంతో, ముఖ్యంగా బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థిని కూడా ముందే ప్రకటిస్తే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని పలువురు సూచించినట్లు తెలిసింది. కుల సంఘాల వారీగా సమావేశాలు ఎన్నికల సందర్భంగా బీసీ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను కదిలించగల, బీసీ సామాజికవర్గాల్లో పట్టున్న బలమైన నేతను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలనే సూచనలు పెద్దెత్తున వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టేలా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని జాతీయ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించినట్టు సమాచారం. అన్ని సామాజికవర్గాల మద్దతు కూడగట్టేలా వివిధ కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే అంశాన్ని, రాష్ట్రంలో కూడా ప్రజలు అధికారంలోకి తెస్తే.. ‘డబుల్ ఇంజన్ సర్కార్’తో కలిగే ప్రయోజనాలను.. ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఈ వ్యూహాలకు తుదిరూపం ఇవ్వడంలో భాగంగా వచ్చేనెల తొలి 15 రోజుల్లో జిల్లాల వారీగా ఆయా రంగాల నిపుణులు, సామాజికవేత్తలు, కుల సంఘాల ప్రముఖులను సంప్రదించాలని, బీజేపీ బీసీ ఎజెండాను వారి ముందుంచి సహకరించాల్సిందిగా కోరనున్నట్టు పార్టీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఊపునిచ్చేలా పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 100 రోజుల ప్రణాళికపై ముమ్మర కసరత్తు వచ్చే వందరోజుల కాలానికి చేపట్టే కార్యాచరణపై కసరత్తు నిమిత్తం పార్టీ నేతలు విజయశాంతి, చాడ సురేష్‌రెడ్డి, డా.జి.మనోహర్‌రెడ్డిలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, ముఖ్యమైన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోవడం, తదితర అంశాలతో ఈ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెలలో చేరికలపై స్పష్టత... బీసీ వాదం, ఇతరత్రా రూపాల్లో జోరందుకునేలా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వచ్చే నెలలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి చేరికలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల వివిధ స్థాయి నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ సందర్భంగా.. ముందుగానే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం లేదా ఆ స్థానంలో పని చేసుకోవాల్సిందిగా సంబంధిత నేతకు సంకేతాలివ్వడం మంచిదనే సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చేరికలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చాక అభ్యర్థుల ప్రకటన కసరత్తు చేపట్టి, త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో వీటిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి, గెలిచే అవకాశాలున్న నేతలు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ఎవరైనా విజయావకాశాలున్న నేత బీజేపీలోకి వస్తారా? వారిని చేర్చుకునేందుకు ఏం చేయాలన్న దానిపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
Telangana:బీసీ దారిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్‌పై మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్లోని బీసీ మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసిన విమర్శలు.. బీసీల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిదాడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ బీసీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. భేటీపై కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం అందడంతో పరిమిత సంఖ్యలోనే బీసీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25న విస్తృత స్థాయిలో బీసీ నేతల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగడదాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీసీ మంత్రులు, ఇతర నేతల పట్ల చేసిన వ్యాఖ్యలు, బీసీ నేత దాసోజు శ్రవణ్‌కు వచ్చిన బెదిరింపులు తదితర అంశాలు తలసాని ఆధ్వర్యంలోని భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. బీసీ సభల పేరిట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, సూర్యాపేటలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు చేస్తున్న సన్నాహాలపైనా నేతలు చర్చించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన పథకాలు, చేకూరిన లబ్ధి తదితరాలను విశ్లేషించారు. ఆత్మ గౌరవ భవనాలు మొదలుకుని అన్ని బీసీ కులాల కోసం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను ఎండగట్టాలని.. లేకుంటే కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కార్యాచరణపై ఈ నెల 25న విస్తృత భేటీ బీసీల ఆత్మగౌరవాన్ని చాటడంతోపాటు బీసీల కోసం బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు, పథకాలను వివరించేందుకు ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బీసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం మొదలుకుని పార్లమెంట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో పరేడ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లో మరోమారు విస్తృత స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, 93బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించనున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే.. – మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, గంగుల హెచ్చరిక – త్వరలో బీసీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా కించపర్చే ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు సరికాదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తలసాని కార్యాలయంలో బీసీ నేతల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో బీసీల్లో కొట్లాట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలు ఆత్మగౌరవాన్ని వదులుకోబోరన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందంటున్న కాంగ్రెస్ ఎంత మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలను కదిలించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.