బెల్లంపల్లిలో ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత! బీజేపీకే ప్లస్సా? | Adilabad: Who Will Be Next Incumbent In Bellampalli Constituency | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లిలో ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత! బీజేపీకే ప్లస్సా?

Published Fri, Aug 25 2023 1:15 PM | Last Updated on Tue, Aug 29 2023 12:18 PM

Adilabad: Who Will Be Next Incumbent In Bellampalli Constituency - Sakshi

లైంగిక వేధింపులు ఎమ్మెల్యే పరువుని నీళ్లలో ముంచాయి. భూముల కబ్జాలు అడ్డంతిరుగుతున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ఎసరు తెస్తున్నాయి. సోంత పార్టీ నాయకులే  ఎమ్మెల్యేకు ఏదురు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత మాజీ మంత్రి వినోద్‌కు అనుకూలంగా మారుతుందా? కాంగ్రెస్ విజయానికి దారులు ఏర్పాటు చేస్తుందా? కమలం పార్టీ సత్తచాటుతుందా? బెల్లంపల్లి ఎన్నికల పోరుపై  సాక్షి స్పేషల్ రిపోర్ట్    

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నియోజకవర్గంలో బెల్లంపల్లి మున్సిపాలీటీ నెన్నెల, బీమిని, కన్నేపల్లి, తాండూరు, వేమనపల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 112 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో 1,61,249 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో నేతకాని, మాల, మాదిగా,   మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ కులాల ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని అచరించే ఓటర్లు, సింగరేణి ఓటర్లు ఉన్నారు. ఎస్సీలలో నేతకాని ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.

ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు :

ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నా వారికి పట్టాలు ఇప్పించారు. అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యాలు మారుమూల ప్రాంతాలకు   కల్పించారు. కానీ ఎమ్మెల్యేగా పెద్దగా అభివృద్ధి పనులు చేయలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, మెడికల్ కళశాల, మంచిర్యాల జిల్లా కేంద్రంగా బెల్లంపల్లిని ఏర్పాటు చేయాలని ప్రజలు ఉద్యమించారు. కానీ వీటిని సాధించడంలో  విఫలమయ్యారు. దీనికి తోడు ఎమ్మెల్యే వివాదాల పుట్ట అకారణంగా టోల్ ప్లాజా సిబ్బందిపై,  అరిజిన్  పాల కంపేని ప్రతినిధిపై లైంగిక వేధింపులు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి.

ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు అందోళన  కోనసాగిస్తోంది. అదేవిధంగా సర్కార్  భూముల  కబ్జాలు, రియల్  ఎస్టేట్ వేంచర్లకు డిఎంఎఫ్‌ నిదులు కేటాయించడం ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాయని ప్రచారం ఉంది. వీటితో ప్రజల్లో ఎమ్మెల్యే పరువుపోయిందట. పార్టీ నిర్వహించిన సర్వేలలో ఎమ్మెల్యేపై తీవ్రమైన వ్యతిరేకత బయట పడుతుందట. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గంకు టిక్కెట్ ఇస్తే మునగడం ఖాయమని తెలిందట. సిట్టింకిలకే టికెట్‌ అని చెప్పిన అధిష్టానం దుర్గంకే ఈసారి టికెట్‌ కట్టబెట్టింది. 

ఎమ్మెల్యేపై వ్యతికత కాం‍గ్రెస్‌కు బలంగా మారనుందా?

ఎమ్మెల్యేపై వ్యతిరేకత కాం‍గ్రెస్‌కు బలంగా మారినట్టు కనిపిస్తోంది. ఈసారి ఎలాగైన గెలిచేందుకు కాంగ్రెస్‌ అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. బీఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్దమవుతున్న మాజీ మంత్రి వినోద్.. ఎమ్మెల్యే చిన్నయ్య, అవినీతి, లైంగిక వేధింపులు ప్రజల్లో తీసుకవెళ్లుతున్నారు. తనకు ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారట. ఎమ్మెల్యే వ్యతిరేకతపై ప్రజల్లో అనూహ్యమైన స్పందన లభిస్తోందట. స్పందన చూసి వినోద్ విజయం ఖాయమని భావిస్తున్నారట. కానీ కాంగ్రెస్‌లో విభేదాలు వినోద్‌కు తలనోప్పిగా మారయట. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తనవర్గానికి టిక్కెట్ దక్కేలా ఎత్తుగడలు వేస్తున్నారట. ఆ టిక్కెట్  విభేదాలు కాంగ్రెస్‌లో దాడులు చేసుకునే స్థాయికి చేరాయట.

కాంగ్రెస్‌ కంటే బీజేపీకే మరింత ప్లస్‌?

ఈ విభేదాలు ఎన్నికలలో ప్రభావితం చూపుతాయని వినోద్ అందోళ చెందుతున్నారట. కానీ ఎమ్మెల్యే వ్యతిరేకత తనను  గెలిపిస్తుందని భావిస్తున్నారట. బీజేపీ ఇంచార్జ్ ఏమాజీ కూడా సర్కారు వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకత కాంగ్రెస్ కంటే బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారట. కానీ అనుకున్నంత బీజేపీకి ఊపు రావడం లేదని అందోళన చెందుతున్నారట. మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకత, సర్కార్ వైపల్యాలు కలిస్తే చాలు కమలం వికసిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారట. మూడు  పార్టీలు  తామే  విజయం సాధిస్తామని అంచనాలు వేసుకుంటున్నాయట. మరి ఏవరు విజయం సాదిస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement