Bellampally district
-
బెల్లంపల్లిలో ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత! బీజేపీకే ప్లస్సా?
లైంగిక వేధింపులు ఎమ్మెల్యే పరువుని నీళ్లలో ముంచాయి. భూముల కబ్జాలు అడ్డంతిరుగుతున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ఎసరు తెస్తున్నాయి. సోంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేకు ఏదురు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత మాజీ మంత్రి వినోద్‌కు అనుకూలంగా మారుతుందా? కాంగ్రెస్ విజయానికి దారులు ఏర్పాటు చేస్తుందా? కమలం పార్టీ సత్తచాటుతుందా? బెల్లంపల్లి ఎన్నికల పోరుపై సాక్షి స్పేషల్ రిపోర్ట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నియోజకవర్గంలో బెల్లంపల్లి మున్సిపాలీటీ నెన్నెల, బీమిని, కన్నేపల్లి, తాండూరు, వేమనపల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 112 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో 1,61,249 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో నేతకాని, మాల, మాదిగా, మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ కులాల ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని అచరించే ఓటర్లు, సింగరేణి ఓటర్లు ఉన్నారు. ఎస్సీలలో నేతకాని ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు : ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నా వారికి పట్టాలు ఇప్పించారు. అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యాలు మారుమూల ప్రాంతాలకు కల్పించారు. కానీ ఎమ్మెల్యేగా పెద్దగా అభివృద్ధి పనులు చేయలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, మెడికల్ కళశాల, మంచిర్యాల జిల్లా కేంద్రంగా బెల్లంపల్లిని ఏర్పాటు చేయాలని ప్రజలు ఉద్యమించారు. కానీ వీటిని సాధించడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎమ్మెల్యే వివాదాల పుట్ట అకారణంగా టోల్ ప్లాజా సిబ్బందిపై, అరిజిన్ పాల కంపేని ప్రతినిధిపై లైంగిక వేధింపులు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు అందోళన కోనసాగిస్తోంది. అదేవిధంగా సర్కార్ భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వేంచర్లకు డిఎంఎఫ్ నిదులు కేటాయించడం ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాయని ప్రచారం ఉంది. వీటితో ప్రజల్లో ఎమ్మెల్యే పరువుపోయిందట. పార్టీ నిర్వహించిన సర్వేలలో ఎమ్మెల్యేపై తీవ్రమైన వ్యతిరేకత బయట పడుతుందట. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గంకు టిక్కెట్ ఇస్తే మునగడం ఖాయమని తెలిందట. సిట్టింకిలకే టికెట్ అని చెప్పిన అధిష్టానం దుర్గంకే ఈసారి టికెట్ కట్టబెట్టింది. ఎమ్మెల్యేపై వ్యతికత కాంగ్రెస్‌కు బలంగా మారనుందా? ఎమ్మెల్యేపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు బలంగా మారినట్టు కనిపిస్తోంది. ఈసారి ఎలాగైన గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్దమవుతున్న మాజీ మంత్రి వినోద్.. ఎమ్మెల్యే చిన్నయ్య, అవినీతి, లైంగిక వేధింపులు ప్రజల్లో తీసుకవెళ్లుతున్నారు. తనకు ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారట. ఎమ్మెల్యే వ్యతిరేకతపై ప్రజల్లో అనూహ్యమైన స్పందన లభిస్తోందట. స్పందన చూసి వినోద్ విజయం ఖాయమని భావిస్తున్నారట. కానీ కాంగ్రెస్‌లో విభేదాలు వినోద్‌కు తలనోప్పిగా మారయట. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తనవర్గానికి టిక్కెట్ దక్కేలా ఎత్తుగడలు వేస్తున్నారట. ఆ టిక్కెట్ విభేదాలు కాంగ్రెస్‌లో దాడులు చేసుకునే స్థాయికి చేరాయట. కాంగ్రెస్ కంటే బీజేపీకే మరింత ప్లస్? ఈ విభేదాలు ఎన్నికలలో ప్రభావితం చూపుతాయని వినోద్ అందోళ చెందుతున్నారట. కానీ ఎమ్మెల్యే వ్యతిరేకత తనను గెలిపిస్తుందని భావిస్తున్నారట. బీజేపీ ఇంచార్జ్ ఏమాజీ కూడా సర్కారు వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకత కాంగ్రెస్ కంటే బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారట. కానీ అనుకున్నంత బీజేపీకి ఊపు రావడం లేదని అందోళన చెందుతున్నారట. మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకత, సర్కార్ వైపల్యాలు కలిస్తే చాలు కమలం వికసిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారట. మూడు పార్టీలు తామే విజయం సాధిస్తామని అంచనాలు వేసుకుంటున్నాయట. మరి ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
బెల్లంపల్లి జిల్లా కోసం న్యాయ పోరాటం
జిల్లా సాధన కమిటీ నాయకులు బెల్లంపల్లి : బెల్లంపల్లి జిల్లా కోసం న్యాయ పోరాటం చేస్తామని బెల్లంపల్లి జిల్లా సాధన కమిటీ నాయకులు తెలిపారు. బుధవారం పట్టణ సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్ (సీపీఐ), పాటి సుభద్ర (టీడీపీ), ఎండీ అఫ్జల్ (కాంగ్రెస్), బి.కేశవరెడ్డి (బీజేపీ) మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ప్రజాభిప్రాయ సేకరణతో ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తూనే మరోపక్క అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముందుగా ప్రకటించిన ప్రాంతాల్లో జిల్లా కార్యాలయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కొత్తగా ప్రకటించిన పలు జిల్లాలపై ప్రజల్లో తీవ్ర అసంతప్తి ఉందన్నారు. తూర్పు ప్రాంతంలో కేంద్రంగా ఉన్న బెల్లంపల్లిని విస్మరించి మంచిర్యాలను జిల్లాగా ప్రకటించడం సరికాదన్నారు. బెల్లంపల్లి జిల్లా సాధన కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంలకు,రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ ప్రత్యేక అధికారికి, జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేసిన స్పందించలేదన్నారు. బెల్లంపల్లి జిల్లా ఏర్పాటు కోసం మరోమారు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ నెల 9న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే కోర్టులో జిల్లా సాధన కమిటీ తరఫున బెల్లంపల్లి జిల్లా కోసం రిట్ ఫిటిషన్ను దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని సూచించారు. బెల్లంపల్లి జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతున్నా ఎమ్మెల్యే తాము దాఖలు చేయబోయే రిట్ పిటిషన్లో సంతకం పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సాధన కమిటీ నాయకులు చిప్ప నర్సయ్య, ఎం.చంద్రయ్య,జి.జయరాం, కె.గోవర్థన్, డి.సత్యనారాయణ, మంతెన మల్లేశ్, బి.లక్ష్మీనారాయణ, జి.చంద్రమాణిక్యం, కంకటి శ్రీనివాస్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వద్దంటూ విద్యార్థుల రాస్తారోకో ఆదిలాబాద్ రిమ్స్ : నిర్మల్ జిల్లా ఏర్పాటను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో పెద్ద ఎత్తున విద్యార్థులు, ఆదిలాబాద్ సంరక్షణ సమితి నాయకులు రాస్తారోకో, మానవహారం చేపట్టారు. నిర్మల్ జిల్లా వద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆదిలాబాద్ ప్రజలు ఎంతో ఉద్యమించారని, రాష్ట్రం ఏర్పడితే జిల్లా అభివద్ధి చెందుతుందని అనుకున్నారన్నారు. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రస్తుతం ఆదిలాబాద్‌కు అన్యాయం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్‌ను మూడు ముక్కలు చేసి నిర్మల్‌ను విడదీయడం వల్ల విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రజలు నష్టపోతుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, వెంటనే నిర్మల్ జిల్లాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ సంరక్షణ సమితి నాయకులు ఈర్ల సత్యనారాయణ, జగదీశ్అగర్వాల్, ప్రమోద్ఖత్రి, బీజేపీ నాయకులు విజయ్‌సింగ్ షేకావత్, విజయ్‌కుమార్, జోగురవి, ప్రవీణ్, టీడీపీ నాయకులు అన్నపూర్ణ, రఫిక్, విద్యార్థులు పాల్గొన్నారు. బెల్లంపల్లి జిల్లా, న్యాయ పోరాటం, జిల్లా సాధన కమిటీ , Bellampally district, legal fit, district achevement committee