పోడు భూములకు పట్టాలిచ్చారు. జల్ జంగల్ జమీన్‌పై హక్కులిచ్చారు. అయినా ఎమ్మెల్యే అత్రం సక్కుపై అదివాసీల్లో అసంతృప్తి అగ్గిరాజేస్తోంది. ఎమ్మెల్యే అత్రం సక్కుపై అదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాంతో అధిష్టానం జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి టికెట్‌ను ప్రకటిచింది. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌కు ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుంతుందని కాంగ్రెస్, బీజేపీలు భావించాయి. కానీ కోవ లక్ష్మికి టికెట్ దక్కడంతో ప్రతిపక్షాల అంచనాలు తారుమారు అయ్యాయి. అయినా అక్కడ అధికార పార్టీకి ఉన్న వ్యతిరేత తమకు కలిసివస్తుందనే ఆశభావంతో ప్రతిపక్షాలు ఉన్నాయి.
కోమురంభీం జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం అదివాసీ పోరాట యోధుడు కోమురంభీం పుట్టిన పోరుగడ్డ ఇది. ఇక్కడి నుండి జల్, జంగల్, జమీన్ యుద్దం సాగించారు. నిజాంపై జోడేఘాట్‌లో సాగించిన పోరాటంలో కోమురం భీం అసువులు బాశారు. ఇంతటి చరిత్ర కలిగిన నియోజకవర్గంలో అసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, కెరమేరి, నార్నూర్, గాదేగూడ జైనూర్, కేరమేరి, లింగపూర్, సిర్పూర్ యు, రెబ్బేన మండలాలు ఉన్నాయి. వీటిలో 2,06,709మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అదివాసీలు, లంబడాలు, బీసీలు, ఎస్సీ ఓటర్లు ఉన్నారు. అదివాసీల ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి.
ఎమ్మెల్యేగా అత్రం సక్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 171 ఓట్లతో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సక్కు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అత్రం సక్కు కాంగ్రెస్ పార్టీని వీడీ బీఆర్‌ఎస్‌లో చేరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా అసిఫాబాద్‌లో మేడికల్ కళశాల ఏర్పాటు చేయించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో రోడ్డు రవాణా సౌకర్యం కల్పించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా పోడు పట్టాలు సర్కారు పంపిణీ చేసింది..
కానీ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయడంలో విఫలం ఆయ్యారని అపవాదును ఎదుర్కోంటున్నారు. అనేక గూడాలలో తాగునీటి సమస్య ఉంది. అదేవిధంగా రోడ్లులేవు, వాగులపై వంతేనలు లేవు. లక్మాపూర్, కరంజీవాడ, గుండి వాగులపై వంతేనలు లేవు. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కోమురం భీం ప్రాజెక్టు నిదులు సాధించలేకపోయారు. అసంపూర్తిగా ఉంది. దీనితో సాగునీరు అందడంలేదు. ఇలాంటి వైఫల్యాలతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందట. గూడాల్లో అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయట. బీఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేలలో బీఅర్ఎస్‌కు వ్యతిరేకత బయట పడిందట.
టిక్కెట్ ఇస్తే ఓటమి ఖాయమని తెలిందట. దాంతో అదిష్టానం కోవ లక్ష్మికి టికెట్ కట్టబెట్టింది. దాంతో అసిఫాబాద్‌లో ఎన్నికలు వేడెక్కాయి. అప్పటి వరకు ఎమ్మెల్యేకు ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని భావించిన కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూసిన కాంగ్రెస్, బీజేపీకి కోవ లక్ష్మితో గట్టి పోటీ తప్పెలా లేదని అంటున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సరస్వతి, గణేష్ రాథోడ్ సక్కు వైఫల్యాలపై ప్రజల్లోకి వెళుతున్నారు. వైఫల్యాల ఎమ్మెల్యేను ఓడించాలని కోరుతున్నారట. అదే విధంగా బీజేపీ నాయకుడు కోట్నాక విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీకి మద్దతు కూడగడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment