అది ఒకప్పుడు గోండు రాజుల రాజ్యం. ఆ రాజ్యంలో పాలన సాగించారు. కోటలను నిర్మించారు. మళ్లీ ఆ రాజ్యం కోసమే గోండులు ఎన్నికల యుద్దానికి సై అంటున్నారు. లంబడాలతో పోరుకు సిద్దమవుతున్నారు. అదివాసీ, లంబడాల మధ్య పోరులో విజయం ఏవరిని వరిస్తుందా? ఖానాపూర్ అదివాసీల వశం అవుతుందా? ఖానాపూర్లో గోండు రాజులు వర్సేస్ లంబడాల మధ్య ఎన్నికల యుద్దంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా గోండు రాజులు పాలనా సాగించారు. తెలంగాణ నుండి మహరాష్ట్ర వరకు రాజ్యాన్ని విస్తరించారు. ఉట్నూరు కేంద్రంగా పాలన సాగించిన చరిత్ర ఉన్నా నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది. ఎస్టీ రిజర్వుడ్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంధ్రవేల్లి, ఖానాపూర్, కడెం,పెంబి, దస్తురాబాద్, జన్నారం మండలాలున్నాయి. ఇక్కడ 2,05,753 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో అదివాసీ, లంబడా, బిసీ, ఎస్సీ ,మైనారిటీ సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రేఖానాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఈ సారి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కి అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. ఈ క్రమంలో రేఖానాయక్ అసంతృప్తితో పార్టీ మారతానని ప్రకటించడం ఇక్కడి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది.
ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. 2018 ఎన్నికలలో 67,138 ఓట్లతో 44శాతం ఓట్లు సాధించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ 46,428 ఓట్లతో 15% ఓట్లు సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై రేఖానాయక్ 20,710 ఓట్లతో విజయం సాధించారు. రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖనాయక్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో సాగునీరు సదర్ మఠ్ బ్యారేజి నిర్మాణం పనులు చేపట్టారు. ఇంకా పనులు కోనసాగుతున్నాయి. అదేవిధంగా ఉట్నూరులో ఆసుపత్రిని ముప్పై పడకల నుండి వందల పడకలకు పెంచేలా చర్యలు చేపట్టారు. అదే విధంగా కోన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మేరుగుపరిచారు.
కడెం మండలం గంగాపూర్ వాసులు కడెం వాగును దాటడానికి వంతేన పనులు ప్రారంభించారు. అయితే రెండు సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలుపోందిన చేసిన అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. సదర్ మఠ్ ప్రాజెక్ట్ ఖానాపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించడంలో స్థానికంగా నాగర్జున సాగర్ రైతులు భావిస్తున్నారు. ఇది గోదావరిపై అప్పటి నిజామ్ సర్కారు ఖానాపూర్ మండలంలొని మ్యాడమ్‌పల్లిలో నిర్మించారు. ఆనకట్ట ద్వారా నీటిని నిల్వ చేసి కాల్వ ద్వారా ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరిందిస్తున్నారు. అలాంటి సదర్ మఠ్‌ను అదే ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా ఆనకట్ట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే పనుల ప్రారంభం కోసం ఖానాపూర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పోన్కల్ ప్రాంతంలో సదర్ మఠ్ నిర్మిస్తున్నారు. చివరి దశకు పనులు చేరుకున్నాయి. ఇక్కడి నుండి జగిత్యాల మల్లాపూర్ మండలంలో పంటపోలాలకు సాగునీటిని అందించనున్నారు. పైనా ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టు ఖానాపూర్, కడేం మండలాల ఆయకట్టు ఏడారిగా మారుతుందని రైతులు అందోళన చెందుతుమ్నారు. ఎగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఆయకట్టు క్రింద ఒకప్పుడు రెండు పంటలు పండేవి. కానీ, ఇప్పడు ఒక్కోసారి పంటలు కూడా పండటం లేదు. గోదావరి నీళ్లు మళ్లీంచడంపై రైతులు మండిపడుతున్నారు. కొత్త సదర్ మఠ్ నుండి పాత సదర్ మఠ్ ఆయకట్ట అయినా ఖానాపూర్, కడెం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కాల్వను ఏర్పాటు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు.
సదర్ మఠ్ తరలిపోవడానికి ఎమ్మెల్యే రేఖ నాయక్ కారణమని ఆమెపై మండిపడుతున్నారు. సదర్ మఠ్ తరలిపోయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో చాలా అదివాసీ గూడాలున్నాయి. గూడాలకు రోడ్లు లేవు. అదేవిధంగా త్రాగునీరు కూడా లేదు. ఈ ప్రాంతాలలో రోగం వస్తే అదివాసీలకు దేవుడే దిక్కు అన్నట్టుగా మారింది. అంతేకాదు అదివాసీలు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. కానీ అందరికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే వైఫల్యంపై అదివాసీలు అసంతృప్తితో ఉన్నారు. సమస్యలన్ని ఒక ఎత్తయితే నియోజకవర్గంలో అర్ఎస్ టాక్స్ సంచలనంగా మారిందట.
దీనిని స్థానికులు రేఖనాయక్ సర్వీస్ టాక్స్ పిలుస్తారని ప్రజల్లో ప్రచారం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధి ముందుకు జరగాలన్నా ఆర్ఎస్ టాక్స్ ఎమ్మెల్యే వసూలు చేస్తారని ప్రచారం ఉంది. దళితబంధుకు యూనిట్ రెండు లక్షలు ముట్టజెప్పితే తప్ప పథకం మంజూరు కావడం లేదట.రేఖనాయక్‌కు ఆర్‌ఎస్ టాక్స్ చెల్లిస్తేనే ఫథకాలు దక్కుతాయట. లేదంటే అంతే సంగతులట. ఇవన్ని అనుచరుల ద్వారా ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు రేఖనాయక్ విమర్శలు సందిస్తున్నాయట. సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి పథకాలైనా రోడ్లు, చెక్ డ్యామ్‌లు, భవనాలు, పనులేవైనా వదలడం లేదట. లేదంటే పనులు అడుగు ముందుకు కదలవని ప్రచారం ఉంది. అభివృద్ధి సంక్షేమ, పథకాలతో అప్రతిష్టను మూటగట్టుకున్నా ఎమ్మెల్యేకు పార్టీలో అసంతృప్తి తలనోప్పిగా మారిందట.
ప్రజల్లో రేఖనాయక్‌కు వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుండి మాజీ ఎంపి రమేష్ రాథోడ్, హరినాయక్, పెంబి జడ్పీటీసీ జానుబాయి టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి ఎడ్మా బోజ్జు, ఉట్నూరు జడ్పీటీసీ చారులత పోటీపడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపి రమేష్ రాథోడ్ గ్రామాల్లో ప్రజలను కలుస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల నుండి మంచి స్పందన లబిస్తోంది. కానీ రమేష్ రాథోడ్ లంబడా సామాజిక వర్గానికి చెందిన వారు. రమేష్ రాథోడ్‌పై అదివాసీ సామాజికవర్గం వ్యతిరేకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో అదివాసీలు ఓట్లు వేయలేదు. దీనికి తోడు రమేష్ రాథోకు మైనారీటీ ఓట్ల భయం ఉంది.
గతంలో అండగా ఉన్న మైనారీటీలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్లు వేస్తారా లేదా అనేది భయం పట్టిపీడిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు ఎడ్మాబోజ్జు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తానే అభ్యర్థినని రాబోయే ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అదివాసీ అభ్యర్థిగా తనకు అనుకూలంగా మారుతుందని ఎడ్మాబోజ్జు అంచనా వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అదివాసీలంత అండగా నిలబడితే తన విజయం ఖాయమని భావిస్తున్నారు బోజ్జు. బొజ్జుకు వ్యతిరేకంగా టిక్కెట్ దక్కించుకోవాలని ఉట్నూరు జడ్పీటీసీ చారులత భావిస్తున్నారు. కానీ గత జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ జడ్పీటీసీగా ఎన్నికై బీఆర్‌ఎస్ ఓటు వేశారు. అయితే అమ్ముడుపోయే అభ్యర్థిగా చారులతకు ముద్ర ఉండటంతో ఆమెకు టిక్కెట్ దక్కదని బోజ్జు కోట్టిపారేస్తున్నారు. ఫైనల్‌గా ఎవరికి వారే తమకు విజయం దక్కుతుందంటూ, తమదే సీటు అంటున్నారు. బీజేపీ రమేష్ రాథోడ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అదే విధంగా 2019 ఎన్నికలలో ఓటమి సానుభూతి ఉందని ఈసారి గెలిచి తీరుతామంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుడు అదివాసీ అస్త్రంతో తనదే విజయమంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు బోజ్జు మరి ఈ ముగ్గురిలో ప్రజలు ఏవరిని గెలిపిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment