Khanapur Assembly Constituency
-
ఖానాపూర్‌లో నువ్వా-నేనా-ఆయనా?
హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నిర్మల్ జిల్లాలో ఉంది ఖానాపూర్ నియోజకవర్గం. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమెల్యేను కాదని.. కేటీఆర్ సన్నిహితుడు, ఫారిన్ రిటర్నీ అయినా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి వెడ్మ బొజ్జు, బీజేపీ నుంచి ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,06,985.. మహిళా ఓటర్లు 1,10,667.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 13 మంది.. సర్వీస్ ఎలక్టోర్లు 416.. మొత్తంగా 2,18,081 ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్‌లో 2018 ఎన్నికల్లో 80.87 శాతం పోలింగ్ రికార్డ్ కాగా.. ఈసారి మాత్రం 77.46 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో.. ‘అభివృద్ధి’తో పాటు మారిన రాజకీయ సమీకరణాలు ఇక్కడి ఓటర్లపై ప్రభావం చూపించి.. అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపించేలా ఉన్నాయి. -
ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్
సాక్షి, నిర్మల్: యాభై ఏళ్ల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఖానాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటేసే ముందు పార్టీల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని ప్రజానీకాన్ని అభ్యర్థించారాయన. ‘‘తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొంటున్నాం. ..ఆడబిడ్డలకు కల్యాణ కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్‌లు ఇస్తున్నాం. గిరిజనుల, ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పని చేశాం. దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తుందట. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది?.కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. ఈసారి గెలిచాక.. పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తాం. రైతుబంధు రూ.16 వేలకు పెంచుకుందాం అని అన్నారాయన. జగిత్యాలలో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏంటో ప్రజలకు తెలుసు. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి?. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. యువకులను జైల్లో పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది?. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ చీకటి రోజులే కదా. ఏపీ పాలకుల కంటే కాంగ్రెస్ నేతలే తెలంగాణను ఎక్కువ ముంచారు. ఎవరు నిజమైన సిపాయిలో గుర్తించాలి’’ అని కేసీఆర్ జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేయలేదు. రైతు బంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్.. కేసీఆర్. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా?. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట. ధరణిని ఆపేస్తే.. రైతు బంధు ఎట్లా వస్తది?. ఓటు వేసే ముందు పార్టీ చరిత్ర, అభ్యర్థుల గుణగణాలు చూడాలి అని అన్నారాయన. -
ఆడవాళ్లను పట్టించుకోరే! 20 ఏళ్లలో తొలిసారి ఇలాంటి పరిస్థితి!
నిర్మల్: అతివలు రాజకీయ రంగాన్ని శాసిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ ఉన్నారు. జనాభాలో, ఓటరు జాబితాలో రాష్ట్రంలోనే జిల్లా మహిళలు సత్తా చాటుతున్నారు. పురుషుల కంటే ఎక్కువ నిష్పత్తిలో ఉన్నారు. కానీ.. రాజకీయాల్లో మాత్రం అంతంత మా త్రంగానే అడుగుపెడుతున్నారు. సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల దగ్గరే ఆగిపోతున్నారు. గ తంలో ఒకరిద్దరు మాత్రమే ఎమ్మెల్యే దాకా చేరుకోగలిగారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పోటీలో కూ డా మహిళలు ఉంటున్నట్లు కనిపించడం లేదు. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,050 మంది ఉన్న మహిళలు ఓటు వేసే వరకే పరిమితమవుతున్నారు. స్త్రీ ఆధిపత్యమున్నా.. అతివల రాజ్యమే అయినా జిల్లాలో ఖానాపూర్ ని యోజకవర్గం మినహాయిస్తే నిర్మల్, ముధోల్ ని యోజకవర్గాల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే కాలేదు. ఒకరిద్దరు మినహా కనీసం ఎన్నికల బరిలో నిల్చోవడం లేదు. 1952లో ఎన్నికలు ప్రారంభం కాగా, 71 ఏళ్లలో మహిళలు రాజకీయంగా ముందడుగు వేయకపోవడం వెలితిగానే కనిపిస్తోంది. గత దశాబ్దపు కాలం నుంచి అక్కడక్క డ ఒక్కరో ఇద్దరో బయటకు వస్తున్నారు. 20 ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండేలా లేదు. పార్టీలూ పట్టించుకోవు.. చాలామంది మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆసక్తిగా ఉన్నా పార్టీలు వారికి అవకాశాలు ఇవ్వడం లేదు. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌కు బీఆర్ఎస్ మూడోసారి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ముధోల్ బీజేపీ టికెట్ కోసం ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రమాదేవి ప్రయత్నాలు చేసినప్పటికీ దక్కలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్లో చేరారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని సైతం ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒకచోట టికెట్ ఇవ్వాలని కోరినా పార్టీ పట్టించుకోలేదు. ఇలా చాలామంది మహిళా నేతలకు పార్టీలు ఈసారి నిరాశే మిగిల్చాయి. మహిళల ఖిల్లాగా ఉన్న జిల్లాలో ఈసారి కనీసం మహిళ అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో.. మహిళాబిల్లు అమలయ్యే దిశగా అడుగులు పడుతున్నవేళ అతివలు మాత్రం జిల్లా రాజకీయాల్లో ముందడుగు వేయడం లేదన్న వాదన ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం ఇద్దరే ఎమ్మెల్యేలు కాగా, ఈ ఇరవై ఏళ్లల్లో కేవలం ఐదుగురు మాత్రమే బరిలో నిలిచారు. ► 2008–09లో ఖానాపూర్ నుంచి రాథోడ్ సుమన్‌బాయి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 2009–14 ఖానాపూర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై న రాథోడ్ సుమన్‌బాయి. ► 2014–18 ఖానాపూర్‌లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన అజ్మీరా రేఖానాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ► 2018–23 వరుసగా రెండోసారి బీఆర్ఎస్ నుంచి రేఖానాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ► 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ బీజేపీ అభ్యర్థిగా పడకంటి రమాదేవి పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి, కేంద్రమాజీ మంత్రి వేణుగోపాలచారిని మూడోస్థానానికి నెట్టి, ఆమె రెండోస్థానంలో నిలిచారు. ► 2018 ఎన్నికల్లోనూ రమాదేవి ముధోల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ రెండోస్థానంలో నిలిచారు. ► 2018 అసెంబ్లీ బరిలో ముధోల్‌లో బీఎస్పీ నుంచి రాథోడ్ సురేఖ పోటీ చేసి ఓడిపోయారు. ► 2018 ఎన్నికల్లో నిర్మల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ సువర్ణరెడ్డి బరిలో నిలిచి ఓడిపోయారు. ► 2018 ఎన్నికల్లో నిర్మల్ నుంచి బీఎల్ఎఫ్(బహుజన లెఫ్ట్ ఫ్రంట్) అభ్యర్థిగా అలివేలుమంగ పోటీ చేసి ఓడిపోయారు. -
నడిరోడ్డుపై నిలబెట్టి కొడతా: రేఖా నాయక్
సాక్షి, నిర్మల్ : ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. తన పార్టీ తరుపున ఆ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు సాలిడ్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో రేఖా నాయక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. తాను గెలిచాక చేస్తానని జాన్సన్ ప్రచారం చేస్తుండడంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు గనుక ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై కొట్టేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారామె. తానింక బీఆర్ఎస్లోనే ఉన్నానని రేఖా నాయక్.. రెబల్‌గా అయినా పోటీ చేసి తీరతానని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటివరకు రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారని.. చేసిన సేవలు నచ్చితే మూడోసారి రెబల్‌గా కూడా తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారామె. ‘‘రాథోడ్ రమేష్ నాపై దాడి కోసం వస్తే.. ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం అభ్యర్థి అయిన జాన్సన్ నాయక్ విషయంలో ఏ హోదాతో సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు ప్రొటోకాల్ పాటిస్తున్నారు. ఆయన కేవలం అభ్యర్థి మాత్రమే కదా’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారామె. జాన్సన్ నాయక్‌కు ఏం తెల్వదు. కేవలం కేటీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ అనే టికెట్ ఇచ్చారు. ఈ విషయంలో కేటీఆర్‌ను కలిసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ఖానాపూర్ విషయంలో తనకు టికెట్ ఇవ్వనప్పుడు.. స్థానికులకు ఎవరికైనా టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా జాన్సన్‌కు ఇవ్వడం అభ్యంతరకరంగా ఉంది. నేను అభివృద్ధి చేయలేదని ప్రచారం చేస్తే ఊరుకోను.నేను ఏమి అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసు. అసెంబ్లీలో కేటీఆర్ సమక్షంలోనే.. డిగ్రీ కాలేజ్.. రెవెన్యూ డివిజన్ అడిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారామె. ఈ క్రమంలోనే.. అబద్దాలు ప్రచారంచేస్తే జాన్సన్ నాయక్‌ను నడిరోడ్డు పై నిలబెట్టి కొట్టడానికి వెనకాడబోనని హెచ్చరించారామె. న్నారు. జాన్సన్‌ను ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నాడని.. ప్రశ్నించినవాళ్లపై దాడులు చేస్తున్నాడని రేఖా నాయక్ ఆరోపించారు. తనకు సెక్యూరిటీని తగ్గించేశారని.. తన అనుచరులనూ బైండోవర్లు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పుడేం కాలేదు బిడ్డా.. ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమంటూ జాన్సన్ నాయక్‌కు ఉద్దేశించి రేఖా నాయక్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. -
భయపడేది లేదు: ఎమ్మెల్యే రేఖా నాయక్
‘‘కాంగ్రెస్‌లో చేరతా.. బీఆర్ఎస్ను ఓడిస్తా.. ప్రతీకారం తీర్చుకుంటా’’.. టికెట్ దక్కకపోవడంపై ఖానాపూర్(నిర్మల్) ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ సెన్సేషన్ రియాక్షన్ ఇది. అంత స్వరం పెంచినా.. బుజ్జగింపులకు బీఆర్ఎస్ అధిష్టానం దిగింది. అయినా ఆమె చల్లారలేదు. దీంతో ‘ప్రతీకార చర్యలకు’ దిగిందనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. మొదట కూతురు భర్త.. ఇప్పుడు తన భర్తనే టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందించారు కూడా. సొంత ఎమ్మెల్యే రేఖనాయక్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది!. అత్తమీద కోపం అల్లుడి మీద ప్రదర్శించింది. మహబూబ్ బాద్ ఎస్పీగా పని చేస్తున్నా శరత్ చంద్రపవార్‌ను.. ఉన్నపళంగా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. రేఖా నాయక్ దూకుడు తగ్గించేందుకు మరో అడుగు ముందుకేసింది. రేఖా నాయక్ కుటుంబ అక్రమాలను తవ్వే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె భర్త. శ్యామ్ నాయక్‌పై ఉన్న కేసును ఏసీబీ ద్వారా తిరగదోడేందుకు సిద్దమవుతోందని సమాచారం. తద్వారా రేఖానాయక్‌కు చెక్ పెట్టడంతో పాటు ఆసిఫాబాద్‌లో ఆమె భర్త పోటీ చేయకుండా ఉండేందుకు ఎత్తుగడ వేస్తోందనే ప్రచారం నడుస్తోంది. బహిరంగంగా దూకుడు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్‌కు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఆ టిక్కెట్‌ను ఆమె రాజకీయ ప్రత్యర్ధిగా భావించే జాన్సన్ నాయక్‌కు కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో.. ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని బావించిన రేఖనాయక్ ఆశలు అవిరయ్యాయి. టిక్కెట్ దక్కలేదనే ప్రస్ట్రేషన్‌లో రేఖానాయక్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై అగ్రహం వెల్లగక్కింది. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. పార్టీ బుజ్జగింపులు చేసిన దారిలేదు. పైగా పార్టీ తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలకు నచ్చలేదట!. పైగా ఖానాపూర్‌తో పాటు ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించి తీరతామని ప్రకటనలు చేయడం మరింత మండిపోయేలా చేసింది. అందుకే ఆమెను దారికి తేవడానికి ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. భార్యభర్తలపై.. రేఖా నాయక్ భర్త ఇప్పటికే శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేసిన శ్యామ్.. ఈ మధ్యే వీఆర్ఎస్ తీసుకున్నారు. అయితే.. భోరజ్ చెక్‌పోస్ట్ వద్ద ఎంవీఐగా పని చేసే సమయంలో ఆయనపై ఏసీబీ ఓ కేసు నమోదు చేసింది. ఆ కేసును ఇప్పుడు బయటకు తీయించాలనే ప్రయత్నాల్లో ఉంది. అలాగే.. రేఖా నాయక్ సైతం ఎమ్మెల్యేగా పలు అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రధానంగా మిషన్ భగీరథ, దళిత బందు, వివిద పథకాల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ ద్వారా ఆమె దూకుడుకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తోందట. అయితే ఇదంతా బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా చేయిస్తున్న ప్రచారమని.. బెదిరింపుల ద్వారా రేఖా నాయక్, ఆమె భర్తను లొంగదీసుకునే ప్రయత్నమనే ఆమె అనుచరులు మండిపడుతున్నారు. కుట్ర అంతా.. అవినీతి, అక్రమ ఆరోపణలను రేఖ, శ్యామ్‌లు సైతం కోట్టిపారేస్తున్నారు. ‘‘సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదు. ఎలాంటి అక్రమాలకు పాల్పపడలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’’ అని ఆమె చెబుతున్నారు. అదేవిధంగా శ్యామ్ నాయక్ సైతం తాను వీఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఏసీబీ క్లియరెన్స్ ఇచ్చిందని, కేసు కొట్టిపారేసిన తర్వాతనే వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్న ఆయన.. కేసుతో అయ్యేది లేదంటున్నారు. ‘‘ప్రజల్లో మాకు పెరుగుతున్న అదరణ చూసి బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోంది’’ అని మండిపడుతున్నారు ఈ భార్యభర్తలు. ఏది ఏమైనా.. సర్కార్ బెదిరింపులకు ఆ భార్యాభర్తలు తలొగ్గుతారా? లేదంటే ఈ వేధింపులు వాళ్లపై సింపథీ క్రియేట్ చేస్తాయా?.. చూడాలి. -
ఖానాపూర్‌లో విచిత్ర పరిస్థితి, ఎవరికి వారే యమునా తీరే!
అది ఒకప్పుడు గోండు రాజుల రాజ్యం. ఆ రాజ్యంలో పాలన సాగించారు. కోటలను నిర్మించారు. మళ్లీ ఆ రాజ్యం కోసమే గోండులు ఎన్నికల యుద్దానికి సై అంటున్నారు. లంబడాలతో పోరుకు సిద్దమవుతున్నారు. అదివాసీ, లంబడాల మధ్య పోరులో విజయం ఏవరిని వరిస్తుందా? ఖానాపూర్ అదివాసీల వశం అవుతుందా? ఖానాపూర్‌లో గోండు రాజులు వర్సేస్ లంబడాల మధ్య ఎన్నికల యుద్దంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా గోండు రాజులు పాలనా సాగించారు. తెలంగాణ నుండి మహరాష్ట్ర వరకు రాజ్యాన్ని విస్తరించారు. ఉట్నూరు కేంద్రంగా పాలన సాగించిన చరిత్ర ఉన్నా నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది. ఎస్టీ రిజర్వుడ్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంధ్రవేల్లి, ఖానాపూర్, కడెం,పెంబి, దస్తురాబాద్, జన్నారం మండలాలున్నాయి. ఇక్కడ 2,05,753 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో అదివాసీ, లంబడా, బిసీ, ఎస్సీ ,మైనారిటీ సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రేఖానాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఈ సారి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కి అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. ఈ క్రమంలో రేఖానాయక్ అసంతృప్తితో పార్టీ మారతానని ప్రకటించడం ఇక్కడి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. 2018 ఎన్నికలలో 67,138 ఓట్లతో 44శాతం ఓట్లు సాధించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ 46,428 ఓట్లతో 15% ఓట్లు సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై రేఖానాయక్ 20,710 ఓట్లతో విజయం సాధించారు. రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖనాయక్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో సాగునీరు సదర్ మఠ్ బ్యారేజి నిర్మాణం పనులు చేపట్టారు. ఇంకా పనులు కోనసాగుతున్నాయి. అదేవిధంగా ఉట్నూరులో ఆసుపత్రిని ముప్పై పడకల నుండి వందల పడకలకు పెంచేలా చర్యలు చేపట్టారు. అదే విధంగా కోన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మేరుగుపరిచారు. కడెం మండలం గంగాపూర్ వాసులు కడెం వాగును దాటడానికి వంతేన పనులు ప్రారంభించారు. అయితే రెండు సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలుపోందిన చేసిన అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. సదర్ మఠ్ ప్రాజెక్ట్ ఖానాపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించడంలో స్థానికంగా నాగర్జున సాగర్ రైతులు భావిస్తున్నారు. ఇది గోదావరిపై అప్పటి నిజామ్ సర్కారు ఖానాపూర్ మండలంలొని మ్యాడమ్పల్లిలో నిర్మించారు. ఆనకట్ట ద్వారా నీటిని నిల్వ చేసి కాల్వ ద్వారా ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరిందిస్తున్నారు. అలాంటి సదర్ మఠ్‌ను అదే ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా ఆనకట్ట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే పనుల ప్రారంభం కోసం ఖానాపూర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పోన్కల్ ప్రాంతంలో సదర్ మఠ్ నిర్మిస్తున్నారు. చివరి దశకు పనులు చేరుకున్నాయి. ఇక్కడి నుండి జగిత్యాల మల్లాపూర్ మండలంలో పంటపోలాలకు సాగునీటిని అందించనున్నారు. పైనా ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టు ఖానాపూర్, కడేం మండలాల ఆయకట్టు ఏడారిగా మారుతుందని రైతులు అందోళన చెందుతుమ్నారు. ఎగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఆయకట్టు క్రింద ఒకప్పుడు రెండు పంటలు పండేవి. కానీ, ఇప్పడు ఒక్కోసారి పంటలు కూడా పండటం లేదు. గోదావరి నీళ్లు మళ్లీంచడంపై రైతులు మండిపడుతున్నారు. కొత్త సదర్ మఠ్ నుండి పాత సదర్ మఠ్ ఆయకట్ట అయినా ఖానాపూర్, కడెం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కాల్వను ఏర్పాటు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు. సదర్ మఠ్ తరలిపోవడానికి ఎమ్మెల్యే రేఖ నాయక్ కారణమని ఆమెపై మండిపడుతున్నారు. సదర్ మఠ్ తరలిపోయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో చాలా అదివాసీ గూడాలున్నాయి. గూడాలకు రోడ్లు లేవు. అదేవిధంగా త్రాగునీరు కూడా లేదు. ఈ ప్రాంతాలలో రోగం వస్తే అదివాసీలకు దేవుడే దిక్కు అన్నట్టుగా మారింది. అంతేకాదు అదివాసీలు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. కానీ అందరికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే వైఫల్యంపై అదివాసీలు అసంతృప్తితో ఉన్నారు. సమస్యలన్ని ఒక ఎత్తయితే నియోజకవర్గంలో అర్ఎస్ టాక్స్ సంచలనంగా మారిందట. దీనిని స్థానికులు రేఖనాయక్ సర్వీస్ టాక్స్ పిలుస్తారని ప్రజల్లో ప్రచారం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధి ముందుకు జరగాలన్నా ఆర్ఎస్ టాక్స్ ఎమ్మెల్యే వసూలు చేస్తారని ప్రచారం ఉంది. దళితబంధుకు యూనిట్ రెండు లక్షలు ముట్టజెప్పితే తప్ప పథకం మంజూరు కావడం లేదట.రేఖనాయక్‌కు ఆర్ఎస్ టాక్స్ చెల్లిస్తేనే ఫథకాలు దక్కుతాయట. లేదంటే అంతే సంగతులట. ఇవన్ని అనుచరుల ద్వారా ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు రేఖనాయక్ విమర్శలు సందిస్తున్నాయట. సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి పథకాలైనా రోడ్లు, చెక్ డ్యామ్‌లు, భవనాలు, పనులేవైనా వదలడం లేదట. లేదంటే పనులు అడుగు ముందుకు కదలవని ప్రచారం ఉంది. అభివృద్ధి సంక్షేమ, పథకాలతో అప్రతిష్టను మూటగట్టుకున్నా ఎమ్మెల్యేకు పార్టీలో అసంతృప్తి తలనోప్పిగా మారిందట. ప్రజల్లో రేఖనాయక్‌కు వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుండి మాజీ ఎంపి రమేష్ రాథోడ్, హరినాయక్, పెంబి జడ్పీటీసీ జానుబాయి టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి ఎడ్మా బోజ్జు, ఉట్నూరు జడ్పీటీసీ చారులత పోటీపడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపి రమేష్ రాథోడ్ గ్రామాల్లో ప్రజలను కలుస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల నుండి మంచి స్పందన లబిస్తోంది. కానీ రమేష్ రాథోడ్ లంబడా సామాజిక వర్గానికి చెందిన వారు. రమేష్ రాథోడ్‌పై అదివాసీ సామాజికవర్గం వ్యతిరేకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో అదివాసీలు ఓట్లు వేయలేదు. దీనికి తోడు రమేష్ రాథోకు మైనారీటీ ఓట్ల భయం ఉంది. గతంలో అండగా ఉన్న మైనారీటీలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్లు వేస్తారా లేదా అనేది భయం పట్టిపీడిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు ఎడ్మాబోజ్జు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తానే అభ్యర్థినని రాబోయే ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అదివాసీ అభ్యర్థిగా తనకు అనుకూలంగా మారుతుందని ఎడ్మాబోజ్జు అంచనా వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అదివాసీలంత అండగా నిలబడితే తన విజయం ఖాయమని భావిస్తున్నారు బోజ్జు. బొజ్జుకు వ్యతిరేకంగా టిక్కెట్ దక్కించుకోవాలని ఉట్నూరు జడ్పీటీసీ చారులత భావిస్తున్నారు. కానీ గత జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ జడ్పీటీసీగా ఎన్నికై బీఆర్ఎస్ ఓటు వేశారు. అయితే అమ్ముడుపోయే అభ్యర్థిగా చారులతకు ముద్ర ఉండటంతో ఆమెకు టిక్కెట్ దక్కదని బోజ్జు కోట్టిపారేస్తున్నారు. ఫైనల్‌గా ఎవరికి వారే తమకు విజయం దక్కుతుందంటూ, తమదే సీటు అంటున్నారు. బీజేపీ రమేష్ రాథోడ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అదే విధంగా 2019 ఎన్నికలలో ఓటమి సానుభూతి ఉందని ఈసారి గెలిచి తీరుతామంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుడు అదివాసీ అస్త్రంతో తనదే విజయమంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు బోజ్జు మరి ఈ ముగ్గురిలో ప్రజలు ఏవరిని గెలిపిస్తారో చూడాలి.