Khanapur constituency
-
బీఆర్ఎస్కు రేఖా నాయక్ రాజీనామా.. కేటీఆర్‌పై షాకింగ్ కామెంట్స్
సాక్షి, నిర్మల్: ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అలాగే, కేసీఆర్ మాట తప్పారు.. కేటీఆర్ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేఖా నాయక్ శుక్రవారం ఖానాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఒక మహిళకు అన్యాయం జరిగింది. నన్ను మోసం చేశారు. ప్రజలను మోసం చేస్తున్నారు. కేటీఆర్ స్నేహితుడని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేనేం తప్పు చేశానో చెప్పాలి. నేను భూములు కబ్జా చేశానా?.. అది నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఏం లూటీలు చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై ఫైర్.. ఇదే సమయంలో కేటీఆర్.. తన స్నేహితుడు జాన్సన్ కోసం అభివృద్ధి పనులను ఆపేశారు. సీఎం కేసీఆర్ ఖానాపూర్ సదర్ మట్ నిర్మిస్తామన్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ, ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పారు. నా నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మల్, బోథ్‌కు తరలించారు. నా నిధులు ఆపినందుకు నేను పోరాటానికి వెళ్తున్నాను. ఖానాపూర్‌ను అభివృద్ధి చేయలేదని కేటీఆర్ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ను ఓడించడమే టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో పోటీలోనే ఉంటాను. నేను ప్రజలకు చేసిన మంచిని వారికి చెబుతాను. అన్యాయంగా మా అల్లుడిని బదిలీ చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాను. పాదయాత్రకు నేను రెడీ అవుతున్నాను. గ్రామ గ్రామాన పాదయాత్రతో ప్రజలను కలుస్తాను. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తాను. బీఆర్ఎస్ను ఓడించడమే నా లక్ష్యం. జాన్సన్ ఎస్టీ కాదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఏడుస్తున్నా.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపిస్తా.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల.. -
ఖానాపూర్‌లో విచిత్ర పరిస్థితి, ఎవరికి వారే యమునా తీరే!
అది ఒకప్పుడు గోండు రాజుల రాజ్యం. ఆ రాజ్యంలో పాలన సాగించారు. కోటలను నిర్మించారు. మళ్లీ ఆ రాజ్యం కోసమే గోండులు ఎన్నికల యుద్దానికి సై అంటున్నారు. లంబడాలతో పోరుకు సిద్దమవుతున్నారు. అదివాసీ, లంబడాల మధ్య పోరులో విజయం ఏవరిని వరిస్తుందా? ఖానాపూర్ అదివాసీల వశం అవుతుందా? ఖానాపూర్‌లో గోండు రాజులు వర్సేస్ లంబడాల మధ్య ఎన్నికల యుద్దంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా గోండు రాజులు పాలనా సాగించారు. తెలంగాణ నుండి మహరాష్ట్ర వరకు రాజ్యాన్ని విస్తరించారు. ఉట్నూరు కేంద్రంగా పాలన సాగించిన చరిత్ర ఉన్నా నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది. ఎస్టీ రిజర్వుడ్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంధ్రవేల్లి, ఖానాపూర్, కడెం,పెంబి, దస్తురాబాద్, జన్నారం మండలాలున్నాయి. ఇక్కడ 2,05,753 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో అదివాసీ, లంబడా, బిసీ, ఎస్సీ ,మైనారిటీ సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రేఖానాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఈ సారి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కి అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. ఈ క్రమంలో రేఖానాయక్ అసంతృప్తితో పార్టీ మారతానని ప్రకటించడం ఇక్కడి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. 2018 ఎన్నికలలో 67,138 ఓట్లతో 44శాతం ఓట్లు సాధించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ 46,428 ఓట్లతో 15% ఓట్లు సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై రేఖానాయక్ 20,710 ఓట్లతో విజయం సాధించారు. రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖనాయక్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో సాగునీరు సదర్ మఠ్ బ్యారేజి నిర్మాణం పనులు చేపట్టారు. ఇంకా పనులు కోనసాగుతున్నాయి. అదేవిధంగా ఉట్నూరులో ఆసుపత్రిని ముప్పై పడకల నుండి వందల పడకలకు పెంచేలా చర్యలు చేపట్టారు. అదే విధంగా కోన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మేరుగుపరిచారు. కడెం మండలం గంగాపూర్ వాసులు కడెం వాగును దాటడానికి వంతేన పనులు ప్రారంభించారు. అయితే రెండు సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలుపోందిన చేసిన అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. సదర్ మఠ్ ప్రాజెక్ట్ ఖానాపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించడంలో స్థానికంగా నాగర్జున సాగర్ రైతులు భావిస్తున్నారు. ఇది గోదావరిపై అప్పటి నిజామ్ సర్కారు ఖానాపూర్ మండలంలొని మ్యాడమ్పల్లిలో నిర్మించారు. ఆనకట్ట ద్వారా నీటిని నిల్వ చేసి కాల్వ ద్వారా ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరిందిస్తున్నారు. అలాంటి సదర్ మఠ్‌ను అదే ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా ఆనకట్ట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే పనుల ప్రారంభం కోసం ఖానాపూర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పోన్కల్ ప్రాంతంలో సదర్ మఠ్ నిర్మిస్తున్నారు. చివరి దశకు పనులు చేరుకున్నాయి. ఇక్కడి నుండి జగిత్యాల మల్లాపూర్ మండలంలో పంటపోలాలకు సాగునీటిని అందించనున్నారు. పైనా ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టు ఖానాపూర్, కడేం మండలాల ఆయకట్టు ఏడారిగా మారుతుందని రైతులు అందోళన చెందుతుమ్నారు. ఎగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం వల్ల పాత సదర్ మఠ్ ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఆయకట్టు క్రింద ఒకప్పుడు రెండు పంటలు పండేవి. కానీ, ఇప్పడు ఒక్కోసారి పంటలు కూడా పండటం లేదు. గోదావరి నీళ్లు మళ్లీంచడంపై రైతులు మండిపడుతున్నారు. కొత్త సదర్ మఠ్ నుండి పాత సదర్ మఠ్ ఆయకట్ట అయినా ఖానాపూర్, కడెం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కాల్వను ఏర్పాటు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు. సదర్ మఠ్ తరలిపోవడానికి ఎమ్మెల్యే రేఖ నాయక్ కారణమని ఆమెపై మండిపడుతున్నారు. సదర్ మఠ్ తరలిపోయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో చాలా అదివాసీ గూడాలున్నాయి. గూడాలకు రోడ్లు లేవు. అదేవిధంగా త్రాగునీరు కూడా లేదు. ఈ ప్రాంతాలలో రోగం వస్తే అదివాసీలకు దేవుడే దిక్కు అన్నట్టుగా మారింది. అంతేకాదు అదివాసీలు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. కానీ అందరికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే వైఫల్యంపై అదివాసీలు అసంతృప్తితో ఉన్నారు. సమస్యలన్ని ఒక ఎత్తయితే నియోజకవర్గంలో అర్ఎస్ టాక్స్ సంచలనంగా మారిందట. దీనిని స్థానికులు రేఖనాయక్ సర్వీస్ టాక్స్ పిలుస్తారని ప్రజల్లో ప్రచారం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధి ముందుకు జరగాలన్నా ఆర్ఎస్ టాక్స్ ఎమ్మెల్యే వసూలు చేస్తారని ప్రచారం ఉంది. దళితబంధుకు యూనిట్ రెండు లక్షలు ముట్టజెప్పితే తప్ప పథకం మంజూరు కావడం లేదట.రేఖనాయక్‌కు ఆర్ఎస్ టాక్స్ చెల్లిస్తేనే ఫథకాలు దక్కుతాయట. లేదంటే అంతే సంగతులట. ఇవన్ని అనుచరుల ద్వారా ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు రేఖనాయక్ విమర్శలు సందిస్తున్నాయట. సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి పథకాలైనా రోడ్లు, చెక్ డ్యామ్‌లు, భవనాలు, పనులేవైనా వదలడం లేదట. లేదంటే పనులు అడుగు ముందుకు కదలవని ప్రచారం ఉంది. అభివృద్ధి సంక్షేమ, పథకాలతో అప్రతిష్టను మూటగట్టుకున్నా ఎమ్మెల్యేకు పార్టీలో అసంతృప్తి తలనోప్పిగా మారిందట. ప్రజల్లో రేఖనాయక్‌కు వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుండి మాజీ ఎంపి రమేష్ రాథోడ్, హరినాయక్, పెంబి జడ్పీటీసీ జానుబాయి టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి ఎడ్మా బోజ్జు, ఉట్నూరు జడ్పీటీసీ చారులత పోటీపడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపి రమేష్ రాథోడ్ గ్రామాల్లో ప్రజలను కలుస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల నుండి మంచి స్పందన లబిస్తోంది. కానీ రమేష్ రాథోడ్ లంబడా సామాజిక వర్గానికి చెందిన వారు. రమేష్ రాథోడ్‌పై అదివాసీ సామాజికవర్గం వ్యతిరేకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో అదివాసీలు ఓట్లు వేయలేదు. దీనికి తోడు రమేష్ రాథోకు మైనారీటీ ఓట్ల భయం ఉంది. గతంలో అండగా ఉన్న మైనారీటీలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్లు వేస్తారా లేదా అనేది భయం పట్టిపీడిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు ఎడ్మాబోజ్జు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తానే అభ్యర్థినని రాబోయే ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అదివాసీ అభ్యర్థిగా తనకు అనుకూలంగా మారుతుందని ఎడ్మాబోజ్జు అంచనా వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అదివాసీలంత అండగా నిలబడితే తన విజయం ఖాయమని భావిస్తున్నారు బోజ్జు. బొజ్జుకు వ్యతిరేకంగా టిక్కెట్ దక్కించుకోవాలని ఉట్నూరు జడ్పీటీసీ చారులత భావిస్తున్నారు. కానీ గత జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ జడ్పీటీసీగా ఎన్నికై బీఆర్ఎస్ ఓటు వేశారు. అయితే అమ్ముడుపోయే అభ్యర్థిగా చారులతకు ముద్ర ఉండటంతో ఆమెకు టిక్కెట్ దక్కదని బోజ్జు కోట్టిపారేస్తున్నారు. ఫైనల్‌గా ఎవరికి వారే తమకు విజయం దక్కుతుందంటూ, తమదే సీటు అంటున్నారు. బీజేపీ రమేష్ రాథోడ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అదే విధంగా 2019 ఎన్నికలలో ఓటమి సానుభూతి ఉందని ఈసారి గెలిచి తీరుతామంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుడు అదివాసీ అస్త్రంతో తనదే విజయమంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు బోజ్జు మరి ఈ ముగ్గురిలో ప్రజలు ఏవరిని గెలిపిస్తారో చూడాలి. -
మున్సిపాలిటీగా ఖానాపూర్
సాక్షి, ఖానాపూర్ : ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ (తిమ్మాపూర్)ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 28 మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తుండగా.. ఆ జాబితాలో ఖానాపూర్ కూడా ఉంది. సంబంధిత అధికారులు జిల్లా నుంచి ఖానాపూర్ (తిమ్మాపూర్) మున్సిపాలిటీ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపారు. 15వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలను చేయనున్న నేపథ్యంలో ఖానాపూర్‌లో ఇప్పటికే 20వేల పైచిలుకు జనాభా ఉండడంతో ఖానాపూర్ మున్సిపాలిటీగా మారడం ఖాయమైంది. మొదట్లో నగర పంచాయతీ ఏర్పాటవుతుందన్న క్రమంలో ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడమే తరువాయిగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేగం కానున్న అభివృద్ధి.. మేజర్ గ్రామపంచాయతీల కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో ఖానాపూర్ ప్రజల చిరకాల కోరిక సెంటర్ లైటింగ్, రోడ్డు వెడల్పుతో పాటు ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు మెరుగుపడి ఖానాపూర్ మరింత అభివృద్ధికి నోచుకోనుంది. ఇదివరకే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో పాటు పంచాయతీ ఎన్నికలకు ముందే మున్సిపాలిటీలా ఏర్పాటు ప్రక్రియ ఉపందుకోవడంతో ఇదివరకు వార్డు మెంబర్, సర్పంచ్‌గా బరిలోకి దిగుతామన్న నేతలు, ప్రస్తుతం కౌన్సిలర్‌గా పోటీ చేస్తామనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీలో ఉన్న 20వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సమీపంలోని ఇతర గ్రామాలను విలీనం చేస్తే వాటి సంఖ్య రెట్టింపు కానుంది. సామాన్యుల్లో ఒకింత ఆందోళన.. మున్సిపాలిటీ కావడంతో పేదలు ఇక్కడ భూమి కొనలేని పరిస్థితులు ఏర్పడనుండడంతో పాటు పన్నుల భారం కూడా పెరుగుతుందనే ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. మున్సిపాలిటీ అయ్యాక భూముల ధరలు మరింత పెరిగి సామాన్యులకు సొంతింటి కల నెరవేరదేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ ఏర్పాటు నేపథ్యంలో ఇక్కడి భూములకు ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కొద్ది నెలలుగా ఈ విషయం తెరమీదికి రావడంతో ఖానాపూర్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఖానాపూర్ మరింత అభివృద్ధి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. 15వేల జనాభా దాటిన మేజర్పంచాయతీలను మున్సిపాలిటీ చేస్తుండడం హర్షనీయం. ఖానాపూర్‌ను మున్సిపాలిటీ చేస్తున్నందుకు సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఖానాపూర్ మరింత అభివృద్ధి చెందనుంది. – రేఖానాయక్, ఎమ్మెల్యే -
‘దేశం’ కోటకు బీటలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలో దేశం కోటకు బీటలు పడ్డాయి. సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రితీశ్ రాథోడ్, ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ ఓటమి పాలు అవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. టీడీపీ నుంచి 1999లో రాథోడ్ రమేశ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గాన్ని పార్టీకి కంచు కోటలా మార్చాడు. 2004లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రాథోడ్ రమేశ్ ఓటమి పాలైనా మరుసటి ఏడాదిలో ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా జెడ్పీ పీఠం సాధించడం, అటు తర్వాత ఎంపీగా గెలుపొందడం, ఆయన సతీమణి రెండుసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. కంచు కోట బద్దలు పంచాయితీ, ప్రాదేశిక ఎన్నికలకు ముందు ఖానాపూర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉండెది. తర్వాత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. పంచాయ ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని మూడు మేజర్ గ్రామ పంచాయతీలు ఉండగా రెండింట్లో టీడీపీ సర్పంచులు, ఒక పంచాయతీలో టీఆర్ఎస్ సర్పంచ్ అధికారంలో ఉండేవారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఒక మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఖానాపూర్, ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, పొన్కల్ పంచాయతీని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకుంది. ప్రాదేశిక ఎన్నికలకు ముందు టీడీపీ మూడు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో బలంగా ఉండేది. అయితే మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో సైతం టీడీపీ అనుకున్న ఎంపీటీసీ స్థానాలు కూడా సాధించలేకపోయింది. నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 22 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలువగా ఐదు జెడ్పీటీసీ స్థానాలుండగా ఒక్క దానినీ దక్కించుకోలేక చతకిలపడింది. దీంతో టీడీపీ ప్రభావం తగ్గుతూ టీఆర్ఎస్ బలంగా పుంజుకుంది. ప్రస్తుతం జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో నియోజకవర్గంలో ఐదింటికి ఐదు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ సాధించనుంది. అదీ కాక సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రితీశ్ రాథోడ్, ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ ఓటమి చెందడంతో కంచుకోటకు బీటలు వారినట్లు అయ్యింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పార్టీ తన బలాన్ని పెంచుకుందని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ తీవ్రతతో.. 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఎంపీగా ఉన్న రాథోడ్ రమేశ్, టీడీపీ శ్రేణులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన లేకపోయారనే అపవాదును మూటకట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ నియోజకవర్గంలో క్రమక్రమంగా బలం పుంజుకోవడంతో పంచాయతీ, ప్రాదేశిక, సాధారణ ఎన్నికల్లో టీడీపీ అనుకున్న విజయం సాధించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తాడని పార్టీకి పునర్వైభవం వ స్తుందని శ్రేణులు అనుకున్నప్పటికీ ఆశలు గల్లంతు అవ్వడంతో పార్టీ కంచు కోటకు బీటలు వారినట్లు అయ్యింది.