ఒకప్పుడు మావోయిస్టు కోట ఉన్న బోథ్ ఇప్పుడు బీఆర్‌ఎస్ కంచుకోటగా మారింది. కానీ ఎమ్మెల్యే తీరుతో బీఅర్ఎస్ కోట బద్దలవుతోంది. ఎమ్మెల్యేపై సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. ఇక అధిష్టానం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండ కొత్త అభ్యర్థి పేరు ప్రకటించింది. ఈసారి టికెట్‌ను అనిల్ జాదవ్‌కు కట్టబెట్టింది. దాంతో బోథ్ ఎన్నికలు వెడేక్కాయి. ఇక ముందు నుంచే అధిష్టానం అభ్యర్థి మార్పుపై సంకేతాలు ఇస్తూ రావడంతో బీఆర్‌ఎస్‌లో ఆశావాహులు సంఖ్య పెరిగిందట. టికెట్ అనిల్ జాదవ్‌కు ప్రకటించడంతో బీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంపి సోయం బాపురావు ఏ పార్టీ రంగంలో దిగుతారు? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుండి పోటి చేయడ ఖాయమైందా? లేదంటే కమలం నుండి పోటీ చేస్తారా? భోథ్‌లో ఎన్నికల వార్‌పై సాక్షి స్పెషల్ రిపోర్ట్.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో సుందరమైన జలపాతాలు ఉన్నా ప్రాంతం. ప్రధానంగా కుంటాల, పోచ్చేర, గాయత్రి, కనకాయి జలపాతాలు ఉన్న అద్భుతమైన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, భీమ్‌పూర్, తలమడుగు, బజరాత్నూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,0,1034 ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో గోండులు అత్యదికంగా ఉన్నారు. వీరే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలల్లో ప్రజల్లో దూసుకపోతుంది గులాబీ పార్టీ. కానీ, ఈ నియోజకవర్గంలోఎమ్మెల్యే వ్యవహర శైలి పార్టీ తలనోప్పిగా మారింది. అవినీతి అరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కేట్ ఇస్తే ఓటమి ఖాయమట. అలాంటి వారికి టిక్కెట్ ఇస్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేలలో తెలిందట. అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేయాలని ఉత్సహం చూపిస్తున్నారు.
కానీ పార్టీ నిర్వహించిన సర్వేలలో ప్రజల్లో వ్యతిరేకత అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే నట. దీనికి తోడు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు మచ్చగా మారిందట. ప్రజలతో అనుబంధం లేదట. పార్టీనాయకులతో సఖ్యత లేదట. అభివృద్ధి పనుల నుండి సర్కార్ సంక్షేమ. పథకాలలో అడ్డగోలుగా అవినీతికి పాల్పపడ్డారని ఎమ్మెల్యేపై అరోపణలు ఉన్నాయట. దళితబంధులో ఎమ్మెల్యే అనుచరులు లూటీ దందా సాగించారని ప్రచారం ఉంది. అదేవిధంగా జలపాతాలు ఉన్నా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయలేదు.
సాగునీరు అందించడానికి కుప్టి నిర్మించలేదు. నియోజకవర్గంలో డిగ్రీ కళశాల లేదు. ఎళ్లుగా కళశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రేవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక అనేక మారుమూల గూడాలకు రవాణా సౌకర్యం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయలేదు. పైగా ఈ అవినీతి ఆరోపణలే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు టిక్కెట్ ఎసరు తెచ్చిందని అంటున్నారు. ఓడిపోయే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వలేమని సీఎం కేసీఅర్ బాపురావుకు తేగేసి చెప్పారట.
గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తరపున ఎంపీ సోయం బాపురావు పోటీ చేసి విజయం సాదించారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీకి సిద్దమవుతున్నారు. అయితే సోయం బీజేపీ నుండి పోటీ చేస్తారా? లేదంటే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. అదివాసీల మద్దతున్నా సోయం బాపురావు బలమైన అభ్యర్థి. మాజీ ఎంపి నగేష్పే గతంలో ఓడించారు సోయం.. కానీ మాజీ ఎంపి నగేష్ మళ్లీ ఎంపిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ కూడా దేశంలో పట్టుసాదించాలని భావిస్తున్నారు. దేశంలో బీఅర్ఎస్ కీలకపాత్ర పోషించాలంటే ఎంపీ సీట్లు కీలకం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగేష్‌ను ఎంపిగా పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతుందట.
Comments
Please login to add a commentAdd a comment