![Chennur MLA Balka Suman Sensational Comments - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/26/Balka-Suman.jpg.webp?itok=9_6U4u8N)
సాక్షి, మంచిర్యాల: చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బహిరంగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేననని, తనని పంపింది తానేనని బీఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశించి తెలిపారు.
చెన్నూర్‌లో ప్రజాశీర్వాద. ర్యాలీలో సుమన్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్‌లో మనవాళ్లు ఉన్నారు. వాళ్లను కాంగ్రెస్‌లోకి పంపించింది నేనే. ఆ కాంగ్రెస్ నాయకులు కూడా.. ఎన్నికల తర్వాత మన పార్టీలోకి వస్తారు. గతంలో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ వెంకటేశ్ మన పార్టీలోకే వచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూడ బీఆర్‌ఎస్‌కే వస్తారు..
..ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రచారం కోసం వస్తే సహకరించండి. వాళ్ల ప్రచారాన్ని అడ్డుకోవొద్దు అని కార్యకర్తలను ఉద్దేశించి సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో తన బినామీలు ఉన్నారన్న బాల్క సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment