Assembly Constituency
-
స్థానిక పోరుపై కాంగ్రెస్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ప్రారంభించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి పి. విశ్వనాథన్ ఈ సమావేశాలకు స్వయంగా హాజరవుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.ఈ నెల 10న ఆదిలాబాద్, బోథ్, 11న ఆసిఫాబాద్, సిర్పూర్, 12న చెన్నూరు, బెల్లంపల్లి, 13న మంచిర్యాల, ఖానాపూర్, 14న నిర్మల్, ముథోల్‌లో సమావేశాలు జరగనున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ సభ్యులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, పీసీసీ ప్రతినిధులు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఈ సమావేశాలకు విధిగా హా జరు కావాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు టి. కుమార్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. కులగణన తీరుపై సమీక్ష ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించటంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కులగణన జరుగుతున్న తీరును కూడా సమీక్షిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైనందున దీని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో కులగణన విషయంలో పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో ఈ సమావేశాల్లో కులగణన అంశాన్ని కూడా చేర్చినట్టు తెలుస్తోంది. -
టీడీపీ కోసం మరో అభ్యర్థిని మార్చేసిన పవన్
సాక్షి, అన్నమయ్య: జనసేన శ్రేణుల అభిప్రాయాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు దిగింది. అదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారనే!. తాజాగా రైల్వే కోడూరు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మార్చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్‌ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్ రిలీజ్ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు సదరు నోట్ తెలిపింది. అయితే.. యనమల ఇంకా ప్రచారంలోకి దిగకముందే ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అదే సమయంలో.. ముక్కావారి పల్లె గ్రామసర్పంచ్‌గా ఉన్న అరవ శ్రీధర్.. మూడు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం. అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్#VoteForGlass pic.twitter.com/5zGc4kndba — JanaSena Party (@JanaSenaParty) April 4, 2024 అంతకు ముందు.. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్‌పై సర్వేల్లో సానుకూలత రాలేదని.. మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకుండా పోయిందంటూ అభ్యర్థి మార్పుపై జనసేన నేరుగా ప్రకటన చేసేయడం గమనార్హం. ఇప్పటికే ఆళ్లగడ్డ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. మన్యం పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచే వలస వచ్చిన నిమ్మక జయకృష్ణకే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడనుంది. -
కేటీఆర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్ నుంచి కిందిబజార్, గోల్‌బంగ్లా మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది. ప్రచారరథంపై కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వాహనం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్‌రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. నాకేమీ కాలేదు: కేటీఆర్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
13 నుంచి కేసీఆర్ మలివిడత ప్రజా ఆశీర్వాద సభలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మలివిడత ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ ఖరారైంది. తొలి విడతలో అక్టోబర్ 15 నుంచి ఈనెల 3 వరకు 30 నియోజకవర్గాల్లో ఇప్పటికే సభలను నిర్వహించారు. 5వ తేదీ నుంచి 8 వరకు మరో 11 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇవి పూర్తికాగానే 5 రోజుల విశ్రాంతి అనంతరం 13 నుంచి 28వ తేదీ వరకు 16 రోజుల పాటు నిర్విరామంగా సీఎం పర్యటన కొనసాగేలా మలి విడత షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో సీఎం పాల్గొంటారు. ఈనెల 25న హైదరాబాద్‌లో భారీ సభను నిర్వహించనున్నారు. రెండో విడత పర్యటనలో ఒక్కో రోజు 3–4 నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన 28న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ పర్యటన ముగియనుంది. దీంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తయ్యేలా షెడ్యూల్‌ను పార్టీ రూపొందించింది. -
అభివృద్ధికి నోచుకోని ఆసిఫాబాద్ లో గెలుపెవరిది ?
-
ఒంటరిగా 119 స్థానాల్లో వైఎస్సార్టీపీ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. గురువారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను పాలేరుతోపాటు మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అవసరమైతే తన తల్లి విజయలక్ష్మి, బ్రదర్ అనిల్ కూడా ఎన్నికల్లో నిలబడతారని తెలిపారు. వైఎస్సార్టీపీ తర ఫున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల సూచించారు. -
మఖ్తల్ పార్తీలో చిట్టెం ఎదురీత..
-
బీజేపీ ‘చలో గజ్వేల్’ భగ్నం
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరిగిన వనరుల విధ్వంసాన్ని ప్రజలకు చూపించడం కోసం బీజేపీ చేపట్టిన ‘చలో గజ్వేల్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరమణారెడ్డిని ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం నుంచి భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు వెంకటరమణారెడ్డి ఇంటికి తరలిరాగా, వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. దీంతో జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వెంకటరమణారెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ బిచ్కుంద పోలీస్‌స్టేషన్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళన చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కారులో హైదరాబాద్ నుంచి బిచ్కుంద పోలీసుస్టేషన్‌కు బయలుదేరగా పెద్దకొడప్గల్ మండలకేంద్రం శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడుచుకుంటూ పెద్దకొడప్ గల్‌కు చేరుకుని రెండుగంటలపాటు నిరీక్షించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. పోలీసులు సాయంత్రం వెంకట రమణా రెడ్డిని విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గజ్వేల్‌లో అక్రమాలు వెలుగులోకి వస్తాయని, సీఎం చెబుతున్న అభివృద్ధికి సంబంధించిన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. -
ముధోల్‌లో బీజేపీకి పట్టు.. బీఆర్ఎస్పై అసంతృప్తి?
ఈ ఎమ్మెల్యే మాకోద్దంటూ స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిదులు సైతం తిరగబడుతున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మార్చాలంటున్నారు. మార్చకపోతే మాదారి మేము చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా అధిష్టానం ఆయనకే మరోసారి బీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. దాంతో ముధోల్ గులాబీ దళంలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయట. మరి అధికార పార్టీలోని అసంతృప్తి సెగ కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందా? ముథోల్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందా? మాజీ మంత్రి వేణుగోపాల్ ఛారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దిగుతారా? ముధోల్ గడ్డ ఎన్నికల సమరంపై సాక్షి స్పెషల్ రిపోర్టు. నిర్మల్ జిల్లాలో ముథోల్ నియోజకవర్గం ఉంది. ఇది ఒకప్పడు కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోట గులాబీ సామ్రాజ్యంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ అధిక్యతతో గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయం సాధించారు. మళ్లీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తహతహలాడుతున్నారు. నియోజకవర్గంలో ముథోల్, బైంసా రూరల్, బైంసా పట్టణం, కుబీర్, కుంటాల, లోకేశ్వరం, బాసర మండలాలు ఉన్నాయి. వీటిలో 2,26,725 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో మున్నూరు కాపు, ముస్లిం, లంబడా, మరాఠ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల మద్దతుతో గడ్డేన్నగారి విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుండి గెలుపోందారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు. ముచ్చటగా మూడోసారి.. ముధోల్‌పై బీఆర్ఎస్ కన్ను! 2018లో జరిగిన ఎన్నికలలో 83,933 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ నుండి పోటీ చేసిన రమాదేవి 40,602 ఓట్లతో 22 శాతం ఓట్లు సాధించారు. రమాదేవిపై 43,331 మేజారీటీ రికార్డు స్థాయిలొ విజయం సాధించారు విఠల్ రెడ్డి. మళ్లీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని తహతహలాడుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించారు. అదే విధంగా ముథోల్, బైంసా అసుపత్రులలో బెడ్ల సంఖ్య పెంచి రోగులకు వైద్య సేవలు మేరుగుపరిచారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపుకు గురైనా గుండేగామ్ గ్రామస్తులకు పరిహరం మంజూరు చేయించారు. అదే విధంగా బాసర మాస్టర్ ప్లాన్ కోసం యాబై కోట్లు మంజూరు చేయించారు. అభివృద్ధి పథకాలతో పాటు విఠల్ రెడ్డి ప్రజల్లో సౌమ్యుడిగా మంచి పేరుంది. కానీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి చేసింది అణువంత మాత్రమే అనే విమర్శలు ఏదుర్కోంటున్నారు. ప్రాణహిత చేవేళ్ల 28వ ప్యాకేజీతో నియోజకవర్గంలో సాగునీటి కోసం అప్పట్లో కాల్వలు తవ్వారు. గత కాంగ్రెస్ హయంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కాల్వలు కనిపిస్తున్నాయి. 28 ప్యాకేజీ పనులు పురోగతి లేదు. రైతులకు సాగునీరు అందడం లేదు. అదేవిధంగా గుండేగామ్ ప్రజలకు పునరావాసం క్రింద నిధులు మంజూరైనా బాధితులకు పరిహరం అందలేదు. బీఆర్ఎస్పై అసంతృప్తి పైగా బాధితులు కోరిన విధంగా పరిహరం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే తీరుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాసర టేంపుల్ సిటీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నాయి. నిధుల మంజూరుతో అనువంత కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే బాసర ట్రిపుల్ ఐటి వివాదాల పుట్టగా మారింది. స్థానిక ఎమ్మెల్యేగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారని ఎమ్మెల్యే తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విఠల్‌రెడ్డి వైఫల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సమస్యలపై అట్టిముట్డనట్లుగా ఉండే ఎమ్మెల్యే తీరు ప్రజలకు నచ్చడం లేదట. దీనితో పాటు పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. ఎకంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తిరుగుబాటు సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ పదవులు, మార్కేట్, బాసర అమ్మవారి ఆలయం పదవులు భర్తి చేయని ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమదారి తాము చూసుకుంటామని పార్టీకి అల్టీమేటమ్ జారీ చేశారట. అయితే విఠల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ముథోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో బీజేపీ పట్టుందని నిరూపితమైంది. దీనికి తోడు బైంసా మున్సిపల్లో ఎంఐఎంకి పట్టుంది. ఎళ్లుగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని పాలన సాగిస్తోంది. ఎంఐఎం పాలనకు వ్యతిరేకంగా హిందూ సానుభూతి ఓటర్లు బీజేపీకి మద్దతు పలుకుతుండటం విశేషం. ఇక్కడ బీజేపీ కంటే హిందు వాహిని బలంగా ఉంది. ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థి రమాదేవి. గెలుపు ధీమాతో కమలం? అయితే బీజేపీకి నియోజకవర్గంలో ఊపు పెరిగింది. బండి సంజయ్ పాదయాత్ర నియోజకవర్గంలో పార్టీకి బలాన్ని పెంచింది. గెలుపు ఖాయమనే బావన పార్టీ నాయకులలో పెరిగింది. ఒకవైపు సంజయ్ పాదయాత్రకు తోడు కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రామరావు పటేల్, మోహన్ రావు పటేల్ పార్టీలో చేరారు. రమాదేవితో పాటు ఈ ఇద్దరు కూడ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారట. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినా ప్రజల్లోకి ముగ్గురు వెళ్లుతున్నారు. ప్రజల మద్దతు కూడ గడుతున్నారట ఎన్నికలలో పోటీ చేసి విఠల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారట ముగ్గురు. టిక్కెట్ కోసం సాగిస్తున్నా పోరు పార్టీని బలహీనం చేస్తోందట. ఏవరికి వారు పోటీ పడి ఈ ముగ్గురు నాయకులు పార్టీని బలహీనం చేస్తున్నారని కార్యకర్తలు దాల్చిన. ఈ ముగ్గురు కలిసి పార్టీ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థి కోసం పనిచేయకపోతే ఓటమి తప్పదని పార్టీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. రామారావు పటేల్ కాంగ్రెస్ వీడటంతో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకులే పోటీ దిక్కు అన్నట్టు చందంగా మారింది. బలమైన అభ్యర్థి కోసం పార్టీ పెద్దలు అన్వేషణ సాగిస్తున్నారు. వేణుగోపాల్ చారికి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందట. బీజేపీ టిక్కెట్ పంచాయితీ తనకు అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారట. బీజేపీ టిక్కెట్ పోరు, ఎంఐఎం మద్దతు అభిస్తే సంక్షేమ పథకాలతో విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు ఎమ్మెల్యే. బీజేపీ మాత్రం హిందూ ఓటు బ్యాంకు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, సర్కార్ వైఫల్యాలు విజయానికి చెరువచేస్తాయని అంచనా ఉంది. ఈసారి ఆరునూరైనా ముథోల్ గడ్డపై కమలం జెండా ఎగురడం ఖాయమంటున్నారట ఆ పార్టీ నాయకులు. మరి ఈమూడు పార్టీల్లో ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
మంచిర్యాల: పత్యర్థులపై వ్యూహాస్రాలు.. గెలుపు ధీమాతో పార్టీలు!
ఆ ఎమ్మెల్యే వైఫల్యాల రాజు.. ప్రగతిని పరుగులు పెట్టించలేదని సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావును మార్చాలంటున్నారు. మార్చకపోతే మునగడం ఖాయమంటున్నారు. అయినా అధిష్టానం మళ్లీ ఆయనకే టికెట్ కట్టబెట్టింది. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్న దివాకర్‌కు కేసీఆర్ ఏ ధీమాతో టికెట్ ఇచ్చారో అర్థం కాని విషయం అంటున్నారు. మరి మంచిర్యాలలో బీఅర్ఎస్ కోటలకు బీటలు పారుతుందా? కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమైందా?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గుండా గండమే కాంగ్రెస్‌కుకు గండంగామారిందా? సింగరేణి సమరంలో కమలం సత్తా చాటుతుందా? మంచిర్యాల ఎన్నికల యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. మంచిర్యాల నియోజకవర్గం అపారమైనా నల్లబంగారం నిల్వలు ఉన్నా ప్రాంతం. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాదినిస్తోంది. అలాంటి నియోజకవర్గంలో మంచిర్యాల, హజీపూర్, నస్పూర్, దండేపల్లి, లక్షిట్పెట మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,46,982 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో పేరుక సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. మిగితా కులాల్లో మున్నూరు, ఎస్సీ, యాదవ, గౌడ, పద్మశాలి, సింగరేణి ఓటర్లు ఉన్నారు. పేరుక సామాజిక, సింగరేణి కార్మికుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. అయితే గులాబి పార్టీకి మంచిర్యాల కంచుకోట. ఉద్యమకాలం నుండి ఇప్పటి వరకు కార్మికులు పార్టీకి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాకముందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అరవింద్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. తెలంగాణ అవతరణ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండుసార్లు బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే దివాకర్ రావు విజయం సాదించారు. 2018 ఎన్నికలలో దివాకర్ రావు 75,360 ఓట్లు సాదించి 45 శాతం ఓట్లు సాదించారు. ప్రేమ్ సాగర్ రావుపై 4,848 ఓట్ల తేడాతో ఓటమి నుండి ఓడ్డేకారు దివాకర్ రావు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 70,512 ఓట్లతో 42 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునాథ రావు 5018 ఓట్లతో మూడు శాతం ఓట్లు సాదించారు. డిపాజిట్ కోల్పోయారు. దివాకర్ రావు అంతకు ముందు రెండుసార్లు విజయం సాధించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రోడ్లు, త్రాగునీటి వసతి, జిల్లా కేంద్రంలో మెడికల్ కళశాల సాధించారు. అదే విధంగా నూతన కలెక్టర్ కార్యాలయం పనులు చేసేలా చోరవ చూపారు. జిల్లా అసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రగతిని పరుగులు పెట్టించలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నా పట్టణం. కానీ అభివృద్ధి లేదు. గోదావరి ప్రక్కన ఉన్నా వేసవి వచ్చిందంటే నీటి కోరతతో కొన్ని కాలనివాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించడం వల్ల వర్ష కాలంలో నీటిలో మునిగిపోయింది. పట్టణానికి దూరంగా నిర్మించడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గూడేం ఎత్తిపోతల పథకం నిర్వహణ అద్వానంగా మారింది. నీరందించే పైపులు పగిలిపోతున్నాయి. దాంతో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మర్మమత్తుల ఎమ్మెల్యే సకాలంలో స్పందించలేదని రైతులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏకంగా రోడ్లు వేయని ఎమ్మెల్యే మా గ్రామాలకు, కాలనిలకు రావద్దని లక్షిట్పెపెట్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ప్లేక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తమను ఓట్లు అడగవద్దంటున్నారు. ఇవన్ని ఒక ఎత్తయితే మంచిర్యాల ప్రాంతంలో సింగరేణి, సర్కార్ భూములు బీఅర్ఎస్ నాయకులు లూటీ చేశారనే అరోపణలు ఉన్నాయి. పైగా భూముల లూటీల దందాలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు సందిస్తుండటం విశేషం. రాబోయే ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు అయితే ప్రతికూల ఫలితం తప్పదని సర్వేలో తెలిందని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ మరోసారి ఆయనకే టికెట్ రావడంతో ముధోల్‌లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ప్రత్యర్థులు. గత అసెంబ్లీ ఎన్నికలలో దివాకర్ రావు కేవలం 4848 ఓట్లతో ప్రేమ్ సాగర్ రావును ఓడించారు. దాంతో ఈసారి ఎన్నికలలో ఎమ్మెల్యేపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేమ్ సాగర్‌రావు కసితో ఉన్నారు. ప్రజల్లో దివాకర్ రావుపై వ్యతిరేకత పెరగడం, రుణమాఫి, సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఇచ్చిన మీలు నేరవేర్చకపోవడం ఇలాంటి ఆంశాలు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు. పార్టీకి ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈసారి ఆరునూరైనా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రేమ్ సాగర్‌రావు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ కొందరు ప్రేమ్ సాగర్ కంటే ఆయన భార్య సురేఖ గెలిచే అభ్యర్థిగా అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నికలలో తానే పోటీచేస్తానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. అయితే బీఅర్ఎస్ మాత్రం ప్రేమ్ సాగర్ గెలిస్తె మంచిర్యాలలో రౌడి రాజ్యం వస్తుందని ప్రచారం చేస్తోంది. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా వ్యూహాలు రచిస్తోంది. గులాబీ పార్టీ గత ఎన్నికల మాదిరిగా మళ్లీ అదే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇక బీఅర్ఎస్ తనపై వేసిన రౌడి ముద్రను ప్రేమ్ సాగర్ రావు కొట్టిపారేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామంటున్నారు. ఇక నియోజకవర్గంలో కమలం పార్టీ పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రఘునాథ రావుకు 5వేల ఓట్లు మించలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది పార్టీ బలం. కానీ ఈసారి పార్టీ అభ్యర్థిని మార్చి సత్తా చాటుతామంటున్నారు కమలం పార్టీ నాయకులు. మూడు పార్టీలు మంచిర్యాలపై జెండాను ఎగురవేస్తామంటున్నారు. మరి ముధోల్‌లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. -
బీఆర్ఎస్ కంచుకోట బోథ్‌లో ఉత్కంఠ!
ఒకప్పుడు మావోయిస్టు కోట ఉన్న బోథ్ ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. కానీ ఎమ్మెల్యే తీరుతో బీఅర్ఎస్ కోట బద్దలవుతోంది. ఎమ్మెల్యేపై సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. ఇక అధిష్టానం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండ కొత్త అభ్యర్థి పేరు ప్రకటించింది. ఈసారి టికెట్‌ను అనిల్ జాదవ్‌కు కట్టబెట్టింది. దాంతో బోథ్ ఎన్నికలు వెడేక్కాయి. ఇక ముందు నుంచే అధిష్టానం అభ్యర్థి మార్పుపై సంకేతాలు ఇస్తూ రావడంతో బీఆర్ఎస్లో ఆశావాహులు సంఖ్య పెరిగిందట. టికెట్ అనిల్ జాదవ్‌కు ప్రకటించడంతో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంపి సోయం బాపురావు ఏ పార్టీ రంగంలో దిగుతారు? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుండి పోటి చేయడ ఖాయమైందా? లేదంటే కమలం నుండి పోటీ చేస్తారా? భోథ్‌లో ఎన్నికల వార్‌పై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో సుందరమైన జలపాతాలు ఉన్నా ప్రాంతం. ప్రధానంగా కుంటాల, పోచ్చేర, గాయత్రి, కనకాయి జలపాతాలు ఉన్న అద్భుతమైన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, భీమ్‌పూర్, తలమడుగు, బజరాత్నూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,0,1034 ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో గోండులు అత్యదికంగా ఉన్నారు. వీరే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలల్లో ప్రజల్లో దూసుకపోతుంది గులాబీ పార్టీ. కానీ, ఈ నియోజకవర్గంలోఎమ్మెల్యే వ్యవహర శైలి పార్టీ తలనోప్పిగా మారింది. అవినీతి అరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కేట్ ఇస్తే ఓటమి ఖాయమట. అలాంటి వారికి టిక్కెట్ ఇస్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేలలో తెలిందట. అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేయాలని ఉత్సహం చూపిస్తున్నారు. కానీ పార్టీ నిర్వహించిన సర్వేలలో ప్రజల్లో వ్యతిరేకత అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే నట. దీనికి తోడు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు మచ్చగా మారిందట. ప్రజలతో అనుబంధం లేదట. పార్టీనాయకులతో సఖ్యత లేదట. అభివృద్ధి పనుల నుండి సర్కార్ సంక్షేమ. పథకాలలో అడ్డగోలుగా అవినీతికి పాల్పపడ్డారని ఎమ్మెల్యేపై అరోపణలు ఉన్నాయట. దళితబంధులో ఎమ్మెల్యే అనుచరులు లూటీ దందా సాగించారని ప్రచారం ఉంది. అదేవిధంగా జలపాతాలు ఉన్నా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయలేదు. సాగునీరు అందించడానికి కుప్టి నిర్మించలేదు. నియోజకవర్గంలో డిగ్రీ కళశాల లేదు. ఎళ్లుగా కళశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రేవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక అనేక మారుమూల గూడాలకు రవాణా సౌకర్యం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయలేదు. పైగా ఈ అవినీతి ఆరోపణలే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు టిక్కెట్ ఎసరు తెచ్చిందని అంటున్నారు. ఓడిపోయే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వలేమని సీఎం కేసీఅర్ బాపురావుకు తేగేసి చెప్పారట. గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తరపున ఎంపీ సోయం బాపురావు పోటీ చేసి విజయం సాదించారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీకి సిద్దమవుతున్నారు. అయితే సోయం బీజేపీ నుండి పోటీ చేస్తారా? లేదంటే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. అదివాసీల మద్దతున్నా సోయం బాపురావు బలమైన అభ్యర్థి. మాజీ ఎంపి నగేష్పే గతంలో ఓడించారు సోయం.. కానీ మాజీ ఎంపి నగేష్ మళ్లీ ఎంపిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ కూడా దేశంలో పట్టుసాదించాలని భావిస్తున్నారు. దేశంలో బీఅర్ఎస్ కీలకపాత్ర పోషించాలంటే ఎంపీ సీట్లు కీలకం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగేష్‌ను ఎంపిగా పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతుందట. -
బెల్లంపల్లిలో ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత! బీజేపీకే ప్లస్సా?
లైంగిక వేధింపులు ఎమ్మెల్యే పరువుని నీళ్లలో ముంచాయి. భూముల కబ్జాలు అడ్డంతిరుగుతున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ఎసరు తెస్తున్నాయి. సోంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేకు ఏదురు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత మాజీ మంత్రి వినోద్‌కు అనుకూలంగా మారుతుందా? కాంగ్రెస్ విజయానికి దారులు ఏర్పాటు చేస్తుందా? కమలం పార్టీ సత్తచాటుతుందా? బెల్లంపల్లి ఎన్నికల పోరుపై సాక్షి స్పేషల్ రిపోర్ట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నియోజకవర్గంలో బెల్లంపల్లి మున్సిపాలీటీ నెన్నెల, బీమిని, కన్నేపల్లి, తాండూరు, వేమనపల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 112 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో 1,61,249 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో నేతకాని, మాల, మాదిగా, మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ కులాల ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని అచరించే ఓటర్లు, సింగరేణి ఓటర్లు ఉన్నారు. ఎస్సీలలో నేతకాని ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు : ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికలలో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నా వారికి పట్టాలు ఇప్పించారు. అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యాలు మారుమూల ప్రాంతాలకు కల్పించారు. కానీ ఎమ్మెల్యేగా పెద్దగా అభివృద్ధి పనులు చేయలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, మెడికల్ కళశాల, మంచిర్యాల జిల్లా కేంద్రంగా బెల్లంపల్లిని ఏర్పాటు చేయాలని ప్రజలు ఉద్యమించారు. కానీ వీటిని సాధించడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎమ్మెల్యే వివాదాల పుట్ట అకారణంగా టోల్ ప్లాజా సిబ్బందిపై, అరిజిన్ పాల కంపేని ప్రతినిధిపై లైంగిక వేధింపులు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు అందోళన కోనసాగిస్తోంది. అదేవిధంగా సర్కార్ భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వేంచర్లకు డిఎంఎఫ్ నిదులు కేటాయించడం ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాయని ప్రచారం ఉంది. వీటితో ప్రజల్లో ఎమ్మెల్యే పరువుపోయిందట. పార్టీ నిర్వహించిన సర్వేలలో ఎమ్మెల్యేపై తీవ్రమైన వ్యతిరేకత బయట పడుతుందట. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గంకు టిక్కెట్ ఇస్తే మునగడం ఖాయమని తెలిందట. సిట్టింకిలకే టికెట్ అని చెప్పిన అధిష్టానం దుర్గంకే ఈసారి టికెట్ కట్టబెట్టింది. ఎమ్మెల్యేపై వ్యతికత కాంగ్రెస్‌కు బలంగా మారనుందా? ఎమ్మెల్యేపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు బలంగా మారినట్టు కనిపిస్తోంది. ఈసారి ఎలాగైన గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్దమవుతున్న మాజీ మంత్రి వినోద్.. ఎమ్మెల్యే చిన్నయ్య, అవినీతి, లైంగిక వేధింపులు ప్రజల్లో తీసుకవెళ్లుతున్నారు. తనకు ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారట. ఎమ్మెల్యే వ్యతిరేకతపై ప్రజల్లో అనూహ్యమైన స్పందన లభిస్తోందట. స్పందన చూసి వినోద్ విజయం ఖాయమని భావిస్తున్నారట. కానీ కాంగ్రెస్‌లో విభేదాలు వినోద్‌కు తలనోప్పిగా మారయట. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తనవర్గానికి టిక్కెట్ దక్కేలా ఎత్తుగడలు వేస్తున్నారట. ఆ టిక్కెట్ విభేదాలు కాంగ్రెస్‌లో దాడులు చేసుకునే స్థాయికి చేరాయట. కాంగ్రెస్ కంటే బీజేపీకే మరింత ప్లస్? ఈ విభేదాలు ఎన్నికలలో ప్రభావితం చూపుతాయని వినోద్ అందోళ చెందుతున్నారట. కానీ ఎమ్మెల్యే వ్యతిరేకత తనను గెలిపిస్తుందని భావిస్తున్నారట. బీజేపీ ఇంచార్జ్ ఏమాజీ కూడా సర్కారు వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకత కాంగ్రెస్ కంటే బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారట. కానీ అనుకున్నంత బీజేపీకి ఊపు రావడం లేదని అందోళన చెందుతున్నారట. మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకత, సర్కార్ వైపల్యాలు కలిస్తే చాలు కమలం వికసిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారట. మూడు పార్టీలు తామే విజయం సాధిస్తామని అంచనాలు వేసుకుంటున్నాయట. మరి ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
కడియంకే టికెట్.. ఘన్‌పూర్‌లో ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు : సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్‌లో కడియాన్ని టికెట్ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం ప్రధాన పార్టీలోని అభ్యర్థులు : బీఆర్ఎస్ కడియం శ్రీహరి (కన్ఫాం) కాంగ్రెస్ (ఆశావాహులు) సింగపురం ఇందిరా దొమ్మాటి సాంబయ్య బొల్లెపల్లి కృష్ణ బీజేపీ (ఆశావాహులు) డాక్టర్ విజయరామారవు మాదాసు వెంకటేష్ బోజ్జపల్లి సుభాస్ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట) సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్) మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం) ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం) -
కాంగ్రెస్‌పైనే ఓటర్ల కన్ను? భూపాలపల్లిలో ఉత్కంఠ!
రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోదావరి పరివాహక ప్రాంతం అయినా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలుపుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గం ఆసక్తికర అంశాలు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతం సింగరేణి కార్మికులకు నిలయమైన నియోజకవర్గం. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పోడు భూములు. డబుల్ బెడ్రూం ఇవ్వకపోవడం ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ గండ్ర వెంకట రమణారెడ్డి(కన్ఫర్మ్) కాంగ్రెస్ గండ్ర సత్యనారాయణ (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) బీజేపీ చందుపట్ట కీర్తి రెడ్డి (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : భూపాలపల్లి నియోజకవర్గంలో దట్టమైన అటవీ ప్రాంతం, కాకతీయులు పాలించిన కోట గుళ్ల గణపేశ్వర ఆలయం, కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంల, పర్యాటక పాండవుల గుట్టలు, విద్యుత్ వెలుగుల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు,సింగరేణి బొగ్గు గనులు,గణపసముద్రం -
వర్ధన్నపేటలో అసమ్మతి సెగ!
వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య. సీసీ, బిటి రోడ్లు పూర్తీ స్ధాయిలో లేవు. తీవ్రంగా వేదిస్తున్న డ్రైనేజీ సమస్య. త్రాగు నీరు సమస్య. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. 8 మండలాల్లో రెండు మూడు చోట్ల మాత్రమే నిర్మించారు. ధరణి వల్ల భూ సమస్యలు. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ ఆరూరి రమేష్ కాంగ్రెస్ కేఆర్ నాగరాజు మాజీ ఐపిఎస్ అధికారి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బీజేపీ కొండేటి శ్రీధర్ మాజీ ఎమ్మల్యే (కొత్త వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోంది) నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. రాజకీయ అంశాలు : వర్ధన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉండగా మూడోసారి కూడా అధిష్టానం అతనికే టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : వర్దన్నపేట నియోజకవర్గం వరంగల్, హన్మకొండ జిల్లాల చుట్టు ఉంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు వర్దన్నపేట నియోజకవర్గం ఉంది. వర్ధన్నపేట నుంచి హసన్ పర్తి అటు నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు విస్తరించి ఉంది. నదులు : వర్ధన్నపేట ఆకేరు వాగు, కోనారెడ్డీ, పర్వతగిరి రిజర్వాయర్. పర్యాటకం : ఖిలా వరంగల్ కోట, ఐనవోలు, పర్వతగిరి అన్నారం షరీఫ్ దర్గా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా ఉన్న మామునూరు విమానాశ్రయం. 4th బెటాలియన్, రాష్ట్రంలోని ప్రధాన పోలిస్ ట్రైనింగ్ సెంటర్. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం, పర్వతగిరి. అన్నారం యాకుబ్ శావలి దర్గ -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ రాఘవేందర్, ఎస్ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్అరెస్టు చేశారు. ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
తుంగతుర్తి: పటిష్టంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదా?
తుంగతుర్తి నియోజవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మల్లు స్వరాజ్యం రెండు సార్లు విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం నియోజకవర్గంపై తన మార్కు చూపించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం కూడా తిరుమలగిరి మండలమే. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం కూడా నాగారమే. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి అత్యధికంగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1985, 1989, 1994లో దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 1999లో మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత మరోసారి 2004లో గెలిచారు. 2009లో ఇది ఎస్సీ రిజర్వుడు అయింది. రిజర్వుడుగా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో 2009 మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. 2014, 18లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరపున ఆయనకే టికెట్ దక్కింది. అభివృద్ది చేసినా.. ప్రతిపక్షాలకు చిక్కేలా బీఆర్ఎస్? తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పథాన నడిచిందనే వాదన ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్లే మూసీ, బిక్కేరు వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలివెళ్తోంది. ఇసుక కూడా ఎన్నికల ప్రధాన విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఇసుక లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన కిషోర్ ఆధిక్యం మూడు వేలు దాటలేదు అంటేనే పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కిషోరే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి వడ్డేపల్లి రవితో పాటు గతంలో పోటీ చేసి ఓడిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పాల్వాయి రజిని కూడా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా ఓటర్లు : నియోజకవర్గంలో ఒకప్పుడు సాగునీటి కొరత ఉండేది. కానీ వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటి కొరత తీరడంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు కూడా వస్తుండటంతో రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా అధికంగా ఉంటారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇక తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా ఉంది. మతం/కులాల వారిగా ఓటర్లు : ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. దాదాపు 45 నుంచి 50 వేల వరకు వారే ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. ఈ తర్వాత యాదవ, గౌడ, ముప్పై వేల చొప్పున ఎస్టీ లంబాడకు 18 వేలు ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ 18 నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో విశాలమైన రహదారులు ఉన్న నియోజకవర్గం ఇదే. ఇక్కడి నుంచి పలు జాతీయ రహదారులు వెళ్తుంటాయి. మూసీ, బిక్కేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం పణిగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. సూర్యదేవాలయంతో పాటు ప్రసిద్ధి గాంచిన రామ, శివాలయాలకు పెట్టిన పేరు. పణిగిరి క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి బౌద్దులు వస్తుంటారు. కానీ దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉంది. -
జహీరాబాద్: కాంగ్రెస్ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు. బీఆర్ఎస్కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట! 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది. గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం? మరోవైపు కంచుకోట కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్‌గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్‌గా ఉండటంపై మిగతా లీడర్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు: నిరుద్యోగ సమస్య యువతకు ఉపాధి NIMZ రైతుల సమస్య చెరుకు రైతుల సమస్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్. మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్: కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ: మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు.. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. మతం/కులం పరంగా ఓటర్లు? ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్‌లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. రాజకీయాకపరమైన అంశాలు : కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం. -
గజ్వేల్ నియోజకవర్గంలో ‘దళితబంధు’ కోసం రోడ్డెక్కిన దళితులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులు రోడెక్కారు. దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దళితులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిగుల్, నిర్మల్‌నగర్, బస్వాపూర్, అలిరాజ్‌పేట గ్రామాల దళితులు ఆందోళన చేశారు. జగదేవ్‌పూర్ –భువనగిరి ప్రధాన రహదారిపై గంటసేపు నిర్మల్ నగర్ దళితులు రాస్తారోకో చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర అటుఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ చంద్రమోహన్ దళితులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరవింపజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్‌కు వ్యతిరేకంగా దళితులు నిరసన చేపట్టారు. తిగుల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో దళితులు బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. బస్వాపూర్‌లోనూ దళితులు నిరసన తెలిపారు. అలిరాజ్‌పేటలో దళితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళితులు మాట్లాడుతూ దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు. -
విశాఖ నార్త్ లో పోటీకి టీడీపీలో ఎవరూ ముందుకు రాని స్థితి
-
తెరుచుకున్న జగిత్యాల స్ట్రాంగ్ రూమ్..!
-
చంద్రబాబు చేసింది కీడా? మేలా?.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం అది. అభ్యర్ధి ఎవరైనా సరే క్యాడర్ అంతా కలిసి గెలిపించుకునేవారు. కాని గత ఎన్నికల్లో పరిస్థితి తిరగబడింది. సైకిల్‌ను ముక్కలు చేసి మూలకు విసిరేశారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఆ ముక్కల్ని అతికించుకోవడానికి సైకిల్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. అధినేత అభ్యర్థిని ప్రకటించినా.. ఓ కమ్మ నేత టిక్కెట్ మాకే ఇవ్వాలంటూ పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చారట. జగ్గయ్యపేట తమ్ముళ్ల క్యాస్ట్ పాలిటిక్స్ మీరే చదవండి. కులం చుట్టూ రాజకీయం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటలా ఉండేది. టీడీపీ కేడర్ గతంలో కులం చూడకుండా అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పనిచేసేవారు. కాని నాలుగేళ్ళుగా అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయంటున్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేటకు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ తన భుజాన వేసుకుని నిర్వహిస్తున్నారు. అయితే ఏడాది క్రితం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన బొల్లా రామకృష్ణ జగ్గయ్యపేట పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యారట. అప్పట్నుంచి అక్కడి టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయిందట. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కీలకం కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని బొల్లా రామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన లోకేష్‌కు సన్నిహితుడు కావడం, ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో బొల్లా ఏడాది నుంచి సెపరేటుగా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఆ మధ్య చంద్రబాబు జగ్గయ్యపేట వచ్చినపుడు బొల్లా, శ్రీరాం రాజగోపాల్ వేరువేరుగా ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు పార్టీలో పెద్ద రచ్చ రాజేశాయట. జగ్గయ్యపేట సీటు తనదంటే తనదని ఇద్దరూ కొట్టుకుంటున్న సమయంలో.. శ్రీరాం రాజగోపాల్‌ను ఆశీర్వదించాలంటూ తన పర్యటనలో చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించేశారు. చంద్రబాబు ప్రకటనతో తన లైన్ క్లియర్ అయ్యిందని శ్రీరాం రాజగోపాల్ సంతోష పడుతున్నప్పటికీ అసలు ముసలం ఇక్కడ్నుంచే మొదలైందట. జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నెట్టెం రఘురామ్ ప్రస్తుతం టీడీపీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నను చంద్రబాబు ఒక్క మాటైనా అడగకుండానే శ్రీరాం రాజగోపాల్ ను జగ్గయ్యపేట అభ్యర్ధిగా ప్రకటించడంపై మూడు నెలలుగా నెట్టెం రగిలిపోతున్నాడట. మొన్నటి వరకూ శ్రీరాం రాజగోపాల్‌కు అండగా ఉన్న నెట్టెం ఇప్పుడు తన సామాజికవర్గానికి చెందిన బొల్లాకు మద్దతుగా నిలుస్తున్నారట. ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతకు టిక్కెట్టు ఇప్పించాలనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తమ ఆశల పై నీళ్లు చల్లడాన్ని తట్టుకోలేకపోతున్నారట . అధిష్టానం నిర్ణయం మార్చుకుంటే సరేసరి లేకపోతే యుద్ధమే అంటున్నారట. మరోవైపు శ్రీరాం రాజగోపాల్ ను ఒంటిరిని చేసి... బొల్లా రామకృష్ణతో నెట్టెం చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారట. పాతాళానికి ప్రతిష్ట కమ్మ సామాజికవర్గ నేతకు కాకుండా శ్రీరాం రాజగోపాల్ కు సీటు ఇస్తే ఒప్పుకునేదే లేదని..అతనికి సహకరించేదే లేదని నెట్టెం రఘురాం తేల్చేశారట. ఇదే సమయంలో బొల్లా రామకృష్ణ పార్టీలో ఉన్న ముఖ్యనేతలను, క్యాడర్ ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కుల బలంతో పాటు క్యాడర్ అండ కూడా ఉందని అధిష్టానం ముందు బలప్రదర్శన చేయాలనే ఆలోచనలో ఉన్నారట బొల్లా. ఐతే టీడీపీ పెట్టిన నాటి నుంచి నియోజకవర్గంలో లేని క్యాస్ట్ పాలిట్రిక్స్ ను ఇప్పుడు చూసి జగ్గయ్యపేట తమ్ముళ్లు తల బాదుకుంటున్నారట. ఓవైపు చంద్రబాబేమో గెలిచేది మనమే ... వచ్చేది మనమే అని డబ్బా కొడుతుంటే ... జగ్గయ్యపేట నేతలేమో ఇలా కులం పేరుతో కొట్టుకోవడం పట్ల పార్టీలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
పుంగనూరులో తారస్థాయికి చేరిన టీడీపీ ఆగడాలు
14 ఏళ్లు అధికార మదంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అవసరాలను అవకాశంగా చేసుకుని ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు. ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పడడంతో ఏమిచేయాలో దిక్కుతోచక వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాటను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారు. తమ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో పచ్చని పల్లెల్లో నిప్పురాజేసి రాక్షస క్రీడకు ఆజ్యం పోస్తున్నారు. అభిమానంతో ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. అడ్డుకున్న కార్యకర్తలు, ప్రజలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. హాకీ స్టిక్‌లు, రాళ్లతో దాడులు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పుంగనూరు నియోజకవర్గ ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోతోందన్న అక్కసుతో దాడులకు తెగబడుతున్నారు. ఏంచేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలు చించివేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. అడ్డుకుంటున్న కార్యకర్తలు, ప్రజలపై విక్షణారహితంగా దాడులు చేస్తూ రచ్చకీడుస్తున్నా రు. తర్వాత వాటన్నింటినీ ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపైకి నెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలమైన పత్రికలు, మీడియాలో అసత్య కథనాలు వళ్లిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దాడులు ఎందుకంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల్లో పుంగనూరు నియోజకవర్గం కూడా ఉంది. 14 ఏళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కింది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు తదితర వాటిని టీడీపీ కార్యకర్తకో, వారి కుటుంబ సభ్యులకో మంజూరు చేయడం రివాజుగా మారేది. లేదంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిప్పడం.. ఆపై మొండిచేయి చూపడం అటవాటుగా మారింది. ఆ పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే రోడ్లు, ఇతర పథకాలు మంజూరయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. 2019 సాధారణ ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతా సంక్షేమ పాలన మొదలైంది. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్ పాలనకు మెచ్చి పుంగనూరు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీకి జై కొడుతున్నారు. ఆయన అనేక మందికి తనవంతు సాయం చేస్తుండడంతో ఆ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు సైతం వైఎస్సార్సీపీ జెండా కిందకు వస్తున్నాయి. ప్రస్తుతం పల్లెబాట పేరుతో ఊరూరా తిరుగుతున్న మంత్రికి అనూహ్య స్పందన లభిస్తుండడంతో.. నియోజకవర్గంలో అక్కడక్కడా మిగిలిపోయిన టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటున్నారు. మరికొందరు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయి. రెచ్చిపోతున్న తమ్ముళ్లు మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట నేపథ్యంలో రొంపిచర్ల మండలంలోని బొమ్మయ్యగారిపల్లె, పెద్దగొట్టిగల్లు, బోడిపాటివారిపల్లెకు చెందిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబ డ్డారు. రెండు రోజుల క్రితం రొంపిచెర్ల క్రాస్‌లో వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలను చించివేశారు. అలాగే ఈనెల 1వ తేదీ రాత్రి చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లె పంచాయతీ, తెల్లనీళ్లపల్లిలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్‌రెడ్డి (చిట్టి), అతని అనుచరులు కలిసి ఎంపీటీసీ శ్రీరాములును చితకబాదారు. ఆ గ్రామంలో బ్యానర్లు కట్టకూడదని దౌర్జన్యానికి ఒడిగట్టారు. అదేవిధంగా ఈనెల 3న దిగువపల్లె పంచాయతీ భవానీనగర్‌లో భూ విషయమై టీడీపీ వర్గాలు రెండు ఘర్షణకు దిగాయి. దీన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా ద్వారా అతస్య కథనాలు రాయించడం కొసమెరుపు. బరితెగిస్తూ.. నియోజకవర్గంలో ‘చల్లా’యిస్తూ.. ఇటీవల టీడీపీ నియోజకవర్గ నేత చల్లా బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ‘ఇందేం ఖర్మ’ కార్యక్రమా న్ని చేపట్టారు. గత శుక్రవారం పీలేరు, కలికిరి నుంచి ర్యాలీగా సోమల మండలానికి చేరుకున్నా రు. పెద్ద ఉప్పరపల్లి మీదుగా సోమల దళితవాడకు చేరుకున్న టీడీపీ ర్యాలీని స్థానికులు అడ్డుకున్నారు. ‘టీడీపీ ప్రభుత్వంలో మాకేం చేశారు..’ అంటూ ఎదురుతిరిగారు. తమ గ్రామంపై ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు వికృతచేష్టలకు ఒడిగట్టారు. అడ్డు తప్పుకోకపోతే వాహనాలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే స్థానికులకు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహించలేని టీడీపీ శ్రేణులు స్థానికులపై హాకీ స్టిక్స్, రాళ్లతో దాడికి దిగారు. వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకుడు పీఎల్ఆర్ రాజారెడ్డిపై దాడిచేశారు. ఆయన కాలు, చేయిని విరగ్గొట్టి పంతం నెగ్గించుకున్నారు. చివరకు సోమల ఎస్ఐ లక్ష్మీకాంత్ పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. (క్లిక్ చేయండి: టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్) -
Macherla Constituency: టీడీపీకి దిక్కేది.. జూలకంటి జాడేది!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 55 ఏళ్లుగా ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతూ మధ్యలో టికెట్టు దక్కక విరామం తీసుకుంటూ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా, కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపు ఓటములను చవిచూడటమూ ఆ కుటుంబ పోటీదారులకు రివాజే. దాదాపు దశాబ్దం పాటు మౌనం వహించిన జూలకంటి పేరు తాజాగా పల్నాడులో వినిపిస్తోంది. వాడుకుని వదిలేయడంలో బాబు దిట్ట తన వ్యక్తిగతంతోపాటు పార్టీ అవసరాలకు సమయానుకూలంగా ఎవరినైనా వాడుకుని పక్కకు విసిరిపారేయడంలో అందెవేసిన నేతగా ప్రత్యేక గుర్తింపున్న చంద్రబాబునాయుడు తాజాగా జూలకంటిని వాడేసుకుంటూ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాలుపోస్తున్నారనే మాట పల్నాడులోని ప్రతినోటా వినిపిస్తున్నదే. రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న వారెవరైనా చర్చిస్తున్న తాజా అంశమిదే. అధికార, ప్రతిపక్షాలు ఏవైనా ప్రాంతాల అభివృద్ధిలో పోటీపడాలే తప్ప ప్రజల్లో అశాంతిని రేకెత్తించే కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడంలో ఔచిత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. పాలకపక్ష నాయకుల తప్పులుంటే ఎత్తిచూపడంలో తప్పులేదని, ప్రశాంతతతో పాటు వేగంగా ప్రగతిబాట పడుతున్న పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పడగవిప్పేలా చేస్తున్న వారెవరినీ క్షమించకూడదని పార్టీల రహితంగా ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత తీరును, జూలకంటి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తంమీద ఏడుసార్లు జూలకంటి కుటుంబం ఎన్నికల్లో తలపడగా 1972, 1983, 1999లలో విజయం సాధించడం పరిశీలనాంశం. n జూలకంటి నాగిరెడ్డి 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమి చెందారు. 1972లో అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1978లో రంగంలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. 1983లో గురజాల స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. నాగిరెడ్డి భార్య దుర్గాంబ 1999లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూలకంటి కుటుంబాన్ని ఓటర్లు ఆదరించలేదు. 2004 నుంచి ఓటమెరుగని పిన్నెల్లి కుటుంబీకులు మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి కుటుంబం తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. 1994 ఎన్నికల్లో మాత్రం పిన్నెల్లి సుందరరామిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2004లో లక్ష్మారెడ్డి గెలుపొందగా ఆయన వారసునిగా శాసనసభ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009, 2012 (బై ఎలక్షన్), 2014, 2019లలో వరుసగా విజయాలు సాధించారు. ఏడుగురి హత్యకేసుతోపాటు వివిధ కేసుల్లో చిక్కుకున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి (బ్రహ్మారెడ్డి) 2004, 2009 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డిల చేతుల్లో ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు టికెట్టు ఇవ్వకపోగా దూరంగా పెట్టడంతో బ్రహ్మారెడ్డి మౌనం దాల్చక తప్పలేదు. చివరికి నీవే శరణం అన్నట్టు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూమొక్కూ లేకుండా పోయిన దశలో చంద్రబాబునాయుడు కొన్ని నెలల కిందట జూలకంటిని రంగంలోకి దించారు. పరస్పర అవసరాల ప్రాతిపదికన రాజకీయ రచ్చకు ప్రాధాన్యమిస్తూ ఫ్యాక్షన్ కు ప్రాణం పోస్తున్నారనేది పరిశీలకుల విశ్లేషణ. అభివృద్ధి కోణంలో పల్నాడులో మరే ప్రాంతాలకు తీసిపోని రీతిలో వేగంగా అడుగులు పడుతున్నాయని ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పలుసార్లు బహిరంగంగా పిలుపునిచ్చినా టీడీపీ నుంచి కనీస స్పందన కరవైందని పాలకపక్ష ప్రజాప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హింసా రాజకీయాలకు ప్రాధాన్యమిస్తోందంటూ... గతంలో నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ బాంబులతో రాజకీయాలు నడిపారని, గురజాలలో అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఇప్పుడేమో మాచర్లలో ఫ్యాక్షన్ కు ఊతమిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తరహా రాజకీయాలకు చంద్రబాబు ఫుల్స్టాప్ పెడితే మంచిదని హితపు పలుకుతున్నారు. 2004 నుంచి గెలుపే లేని టీడీపీ టీడీపీ ఆవిర్భావం తర్వాత మాచర్ల నియోజకవర్గంలో మొత్తం పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కేవలం నాలుగు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మూడుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. 2012 నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పీఆర్కే జయకేతనం ఎగురవేస్తుండడం విశేషం. టీడీపీ నుంచి 1983లో కొర్రపాటి సుబ్బారావు, 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణప్రసాద్, 1994లో కుర్రి పున్నారెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ గెలిచారు. కాంగ్రెస్ నుంచి 1995లో నత్తువ కృష్ణమూర్తి, 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి, 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) గెలిచారు. వైఎస్సార్ సీపీ నుంచి 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పీఆర్కే విజయ పరంపర కొనసాగించారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. ఇదేం కర్మరా బాబు?) -
ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు?
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గులాబీ కోటలో గ్రూపులు బయల్దేరుతున్నాయి. టిక్కెట్లు ఆశించేవారు గళం విప్పుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడంలేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాలవారీగా విడిపోతున్నారు. గ్రేటర్‌లోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూపుల గురించి చూద్దాం. గులాబీ ముళ్లు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. (చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత) రాజకీయాల మధ్య కులం ఉప్పల్ లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్ గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావిడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట. ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో... కార్పొరేటర్, మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్ గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్ళుగా భరిస్తున్నానని ఇంక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్తా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది. (చదవండి: ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?) సిట్టింగ్ హామీ ఏమవుతుంది? కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. సిటింగ్‌లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిటింగ్‌లను కాదని వేరేవారికి టిక్కెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఏమో తనకూ బీసీ కోటాలో ఛాన్స్ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి.. బండారి లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారని.. బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తప్పని ఎన్నిక.. మునుగోడులో తొలి ఉపపోరు.. మొదటిసారి గెలిచిందెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి తొలిసారిగా ఉపఎన్నిక జరుగనుంది. తాజామాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 2018 వరకు ఈ నియోజకవర్గానికి 12 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, ఒకసారి (2014లో) టీఆర్ఎస్ గెలిచాయి. 1967కు ముందు మునుగోడు నియోజకవర్గంలోని కొంతభాగం చిన్నకొండూరు, మిగిలిన ప్రాంతం నల్లగొండ నియోజకవర్గంలో ఉండేవి. మునుగోడు ప్రాంతం చిన్నకొండూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 1965లో ఒకసారి ఉపఎన్నిక జరిగింది. చిన్నకొండూరు నుంచి 1962 సాధారణ ఎన్నికల్లో సీసీఐ అభ్యర్థి కొండవీటి గురునాథరెడ్డి విజయం సాధించగా, ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీనేత, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టులో కేసు వేశారు. ఆ ఎన్నికను రద్దు చేస్తూ కోర్టు మూడేళ్ల తర్వాత తీర్పు చెప్పింది. దీంతో 1965లో చిన్నకొండూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ గెలుపొందారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్ మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థులే ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967, 1972, 1978, 1983, 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఇక సీపీఐ అభ్యర్థులు ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 1985, 1989లో, 1994లో ఉజ్జిని నారాయణరావు, 2004లో పల్లా వెంకట్‌రెడ్డి, 2009లో ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ అభ్యర్థులుగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభాకర్‌రెడ్డిపై 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2 కోట్లు
సాక్షి, అమరావతి: శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.రెండు కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ.350 కోట్లను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సాధారణ పద్దు కింద రూ.154.78 లక్షలు, ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.34.16 లక్షలు, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.11.06 లక్షల చొప్పున మొత్తం రూ.రెండు కోట్లను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు 25 శాతం నిధులను అంటే రూ.50 లక్షలను గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పనులకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏదైనా నియోజకవర్గంలో తాగునీటి సరఫరా పనులు అవసరం లేని పక్షంలో జిల్లా ఇన్చార్జి మంత్రిని సంప్రదించి ఇతర ప్రాధాన్యత పనులకు కలెక్టర్లు పరిపాలన అనుమతులు ఇవ్వాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామాల్లో చేపట్టే పనులను ముందుగా సంబంధిత ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రితో సంప్రదించి వారి అనుమతితోనే చేపట్టాలని, అందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏదైనా పని చేపట్టడానికి ప్రభుత్వంతో సంప్రదించాల్సి వస్తే జిల్లా ఇన్చార్జి మంత్రితో చర్చించి పరిపాలన అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న పనులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేలు వినియోగించాలని పేర్కొన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో నూరు శాతం నిధుల పనులకు ఎస్సీ ఉప ప్రణాళిక కింద, ఎస్టీ నియోజకవర్గాల్లో నూరు శాతం నిధుల పనులకు ఎస్టీ ఉప ప్రణాళిక కింద మంజూరు చేయాలని, ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 17.08 శాతం నిధులను, ఎస్టీ ఉప ప్రణాళిక కింద 5.33 శాతం నిధులను వ్యయం చేయాలని పేర్కొన్నారు. సీఎం అభివృద్ధి నిధి కింద అనుమతించే పనుల జాబితా ∙గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు కల్పించడంలో భాగంగా చేపట్టే నిర్మాణ పనులు. ∙సాగునీటి ట్యాంకుల నిర్మాణం. ∙ట్యాంకులు, చెరువుల్లో మేటలను తొలగించడం. ∙భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టే నిర్మాణాలు. ∙మురుగు కాల్వల నిర్మాణం. ∙అవసరమైన కల్వర్టులు, వంతెనల నిర్మాణం. ∙గ్రామీణ, పట్టణ ప్రాంతాల అనుసంధాన రోడ్ల నిర్మాణం. ∙ఫుట్‌పాత్‌ల నిర్మాణం. ∙ప్రభుత్వ స్కూళ్లలో తాగు నీరు, మరుగుదొడ్ల నిర్మాణం. ∙స్మశాన వాటికలకు ప్రహరీ గోడల నిర్మాణం. ∙కమ్యూనిటీ హాల్స్. ∙గ్రామ పంచాయతీ భవనాలు, రీడింగ్ రూమ్స్, ప్రజలకు ఉపయోగకరమైన ఇతర భవనాలు. ∙పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు లాంటి ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రహరీ గోడలు. ∙ఇప్పటికే ఉన్న ఆయకట్టులో బోదెలు లాంటి పంట కాల్వల అభివృద్ధి. ∙వ్యవసాయ ఉత్పత్తులు భద్రపర్చుకోవడానికి నిల్వ కేంద్రాలు. ∙ప్రజా, పశు వైద్య రక్షణకు సంబంధించిన వ్యయం. ∙చారిత్రక, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ. ∙రోడ్లు నిర్మాణ సమయంలో విద్యుత్ లైన్ల తరలింపు. -
ఇరవై ఏళ్లుగా అక్కడ మహిళలనే గెలిపించారు!
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మహిళకే ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000లో ఏర్పడగా తొలి ఎన్నికలు 2002 ఫిబ్రవరి 14న జరిగాయి. తొలి ఎన్నికల నుంచి గడిచిన 2017 ఎన్నికల వరకూ నాలుగు సార్లు పౌఢి గఢ్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మహిళనే గెలిపించారు. నియోజకవర్గంలో సుమారు 90 వేల ఓట్లు ఉండగా వీరిలో సుమారు 40 వేల పైచిలుకు మహిళా ఓటర్లు. 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయ భరద్వాజ్ గెలుపొందారు. తొలిసారి గెలిచినపుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైన విజయ భరద్వాజ్ 2007లో మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2017లో యమకేశ్వర్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి భూషణ్ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి రేణు బిస్త్‌పై 8,982 ఓట్ల తేడాతో రీతూ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరో ఆరుగురు పురుష అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. 2022లో బీజేపీ తమ అభ్యర్థిగా రేణు బిస్త్‌ను ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉండడంతో 60 శాతంలోపే ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత అసెంబ్లీలో రీతూ ఖండూరితోపాటు మరో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం గమనార్హం. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
118 నియోజకవర్గాల్లోనూ ‘దళితబంధు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబమే యూనిట్‌గా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి నెలాఖరు కల్లా నూరుశాతం యూనిట్లు గ్రౌండింగ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వాసాలమర్రి గ్రామంతోపాటు హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ పథకాన్ని నూరు శాతం అమలు చేశామన్నారు. దళితబంధుపై శనివారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.స్థానిక ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఆమోదింపచేయాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుకూ ఏ విధమైన బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10 లక్షలను ఈ పథకం కింద ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని, ఒక్కో లబ్ధిదారుకు మంజూరైన రూ.10 లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణనిధి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1,200 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశామని చెప్పారు. విడతలవారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా నూరు శాతం అమలు చేస్తున్నామని, విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కార్పొరేషన్ ఎం.డి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మరో 4 మండలాల్లో దళితబంధు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు పథకాన్ని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని నూరుశాతం అమలు చేశారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో దళితబంధు అమలు నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ముందు ఎంపిక... ఆ తర్వాత అవగాహన...: దళితబంధు పథకం అమలు చేసే గ్రామాల్లో ముందుగా సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్) లెక్కల ఆధారంగా దళిత కుటుంబాల గణన చేపడతారు. అనంతరం జాబితాను రూపొందించి లబ్ధిదారులను ఖరారు చేస్తారు. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా కుటుంబంలో మహిళకు ప్రాధాన్యత ఇస్తారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై వారికి అవగాహన కల్పిస్తారు. అవసరమైతే స్వల్పకాలిక శిక్షణ తరగతులు సైతం నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నగదుతో ఎలాంటి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చనేదానిపై లబ్ధిదారులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఈ పథకం అమలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సైతం అధికారులు తయారుచేశారు. ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై లబ్ధిదారులు అంచనాకు వచ్చిన తర్వాత నగదును విడుదల చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
గురుకుల సీట్లలో సగం స్థానికులకే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్ల విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏడాది గురుకుల పాఠశాలల ఐదో తరగతి అడ్మిషన్లలో స్థానిక అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యార్థులకు సగం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగులు సీట్లను జిల్లాస్థాయిలోని విద్యార్థులతో భర్తీచేస్తారు. ఇంకా మిగిలితే రాష్ట్రస్థాయిలోని విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 13న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఆర్ఈఐఎస్) సొసైటీలు ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్) నిర్వహిస్తున్నాయి. అనంతరం విద్యార్థులను కేటగిరీలవారీగా విభజించి ఆయా గురుకులాల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్ మాత్రం సొంతంగా ప్రవేశపరీక్ష, అడ్మిషన్లు చేపడుతోంది. ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 50 శాతం సీట్లు నియోజకవర్గంలోని వారికే కేటాయిస్తారు. సీట్లు మిగిలితే జిల్లాను యూనిట్‌గా, ఇంకా మిగిలితే రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. పైరవీలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకు ఒకసారి సమీక్ష.. రాష్ట్రంలోని ప్రతి గురుకుల విద్యాసంస్థ మూడు నెలలకోసారి తప్పకుండా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి విద్యాసంస్థల పనితీరు, ఇతర సమస్యల్ని చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమావేశానికి నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సొసైటీలతోపాటు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
గెలిచినా.. ఓడినా..పోటీ ఒక్కసారే!
సాక్షి, అమరావతి : గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 1994 నుంచి ఇక్కడ ప్రధాన పార్టీల తరఫున ఒక సారి పోటీ చేసిన అభ్యర్థులు ఆ తరువాత అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవడంలేదు. ఓడిన అభ్యర్థులే కాదు.. గెలిచిన అభ్యర్థులదీ అదే పరిస్థితి. 1994 సంవత్సరంలో చల్లా వెంకటకృష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్.జయరాంబాబుపై గెలిచారు. 1999 ఎన్నికల్లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు. ఆ సంవత్సరం టీడీపీ అభ్యర్థి శనక్కాయల అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి కె.ఈశ్వరవెంకటభారతిపై గెలిచారు. అప్పటి ప్రభుత్వంలో శనక్కాయల అరుణ మంత్రిగా పనిచేశారు. మరుసటి ఎన్నికకు ఈ ఇద్దరూ దూరమయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తాడిశెట్టి వెంకట్రావు టీడీపీ అభ్యర్థి టి.వెంకటేశ్వరరావుపై గెలిచారు. 2009లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చుక్కపల్లి రమేష్‌పై గెలిచారు. ఆ తరువాత 2014లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసినా మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. 2014లో మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై గెలిచారు. ప్రస్తుతం మోదుగుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గుంటూరు పశ్చిమం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చంద్రగిరి ఏసురత్నం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మద్దాళి గిరి పోటీచేస్తున్నారు. -
యాది మరిస్తిరా?
చినకొండూరు నియోజకవర్గం నుంచే కొండా లక్ష్మణ్‌బాపూజీ చట్టసభల్లోకి ప్రవేశించారు. అయితే, ఈ నియోజకవర్గం ఇప్పుడెక్కడుందా అని డౌటొచ్చిందా? మునుగోడు నియోజకవర్గం పేరు 1967కు ముందు చినకొండూరు. ప్రస్తుత కొడంగల్ నియోజకవర్గం 1952లో ద్విసభ్య నియోజకవర్గం. 1962లో మద్దూరుగా పేరు మార్చుకుని ఎస్సీ రిజర్వుడు అయింది. 2009లో కొండగల్గా పేరు మార్చుకుంది. కార్వాన్ది వేరే కథ. 1952 తొలి ఎన్నికల నాటికి కార్వాన్ నియోజకవర్గంగానే ఉంది. 1967లో సీతారాంబాగ్గా మారింది. మళ్లీ 2009లో కార్వాన్‌గా తన పూర్వ నామాన్ని సుస్థిరం చేసుకుంది. ధర్మసాగర్, వేంసూరు, సీతారాంబాగ్, ఆసిఫ్‌నగర్, దొమ్మాట, పెద మునగాల, చినకొండూరు, మేడారం, ఆత్మకూరు, అమరచింత... ఈ పేర్లన్నీ ఎక్కడో విన్నట్టుందా?! గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా..? గుర్తొచ్చాయా...? గుర్తుకొస్తే సరి.. లేదంటే చదవండి.. ఇవన్నీ మన పాత అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు. 1952 నుంచి 2009 వరకు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఇవన్నీ పేరు మారి కొత్త పేర్లు పెట్టుకున్నాయి. కొన్నిచోట్ల పేర్లే కాదు... రిజర్వేషన్లు కూడా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడల్లా ఒక స్థానంలో ఉన్న మండలాలు మరో చోటుకు మారడం సహజమే కానీ, పేరు మారడం తక్కువే. అప్పటివరకు ఉన్న నియోజకవర్గం పేరు కనుమరుగైపోవడం చాలా రోజులు అక్కడి ప్రజలకు జీర్ణమయ్యేది కూడా కాదు. పేరు మారిందంటే చాలు.. పాత పేరు కలిగిన మండల కేంద్రమో లేదా గ్రామమో అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందనే భయం ఉండేది. కొత్త నియోజకవర్గంగా ఏర్పడ్డ చోట అభివృద్ధి జరుగుతుందనే ఆశ పుట్టేది. ఇందులో వాస్తవమెంత ఉన్నా... పేరు మార్చుకున్న నియోజకవర్గాల గురించి తెలుసుకుందాం. ఆ పాత నియోజకవర్గాల ‘కథా కమామిషు..’ ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం 1972కు ముందు పాల్వంచ పేరుతో ఉండేది. ఇప్పటికీ కొత్తగూడెం–పాల్వంచ.. హైదరాబాద్ – సికింద్రాబాద్‌లా కలిసే ఉంటాయి. ♦ 2009 తర్వాత ఎస్సీ కోటాలో ఏర్పడిన సత్తుపల్లి నియోజకవర్గం అంతకుముందు జనరల్ నియోజకవర్గమే. అప్పుడు వేంసూరు పేరుతో ఉండేది. ♦ ఎస్టీ రిజర్వుడుగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గానిది గతంలోనూ అదే పేరు. కానీ అప్పుడు జనరల్ సీటు ♦ వరంగల్ (తూర్పు) 2009కు ముందు వరంగల్ పేరుతోనే నియోజకవర్గంగా ఉండేది. ♦ వరంగల్ (పశ్చిమ) నియోజకవర్గం 1972కు ముందు హసన్‌పర్తి పేరుతో ఉండేది. అంతకు ముందు దానిపేరు ధర్మసాగర్. ♦ పరకాల నియోజకవర్గానిది ఆది నుంచీ అదే పేరు. 1972కు ముందు జనరల్ స్థానం. ఆపై ఎస్సీ రిజర్వుడు అయింది. మళ్లీ 2009లో జనరల్‌గా మారింది. ♦ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం 1972కు ముందు జనరల్ స్థానమే. ఆ తర్వాత ఎస్సీకి మారిన ఈ స్థానం 2009 పునర్విభజనలోనూ ఎస్సీ రిజర్వుడు స్థానంగానే ఉండిపోయింది. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు.. రిజర్వేషన్లు మారడం అలవాటుగా మార్చుకుంది. ఇది 72కు ముందు జనరల్ స్థానం. ఆ తర్వాత ఎస్సీ రిజర్వుడు అయింది. మళ్లీ 2009లో జనరల్‌కు మారింది. ♦ తుంగతుర్తి పేరు 1967కు ముందు నాగారం. ఇది ప్రస్తుత ఆపద్ధర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి స్వగ్రామం. ♦ మిర్యాలగూడ నియోజకవర్గం 1957కు ముందు పెదమునగాలగా ఉండేది. ♦ నాగార్జునసాగర్ స్థానం 1962కు ముందు పెద్దవూర పేరుతో ఉండేది. ఆ తర్వాత చలకుర్తి అయింది. 2009లో నాగార్జునసాగర్‌గా మారింది. ♦ మక్తల్.. 1952లో ద్విసభ్య నియోజకవర్గం. మక్తల్, ఆత్మకూరు పేరుతో ఈ నియోజకవర్గం కొనసాగింది. ♦ దేవరకద్ర.. 1962కు ముందు ఆత్మకూరు..2009 వరకు అమరచింత.. 2009లో దేవరకద్ర అయింది. ♦ 2009కు ముందు ఆసిఫ్‌నగర్ పేరు నాంపల్లి. ♦ అంబర్‌పేట నియోజకవర్గం 1972 వరకు గగన్‌మహల్ పేరుతో ఉండేది. 72 తర్వాత హిమాయత్‌నగర్ అయింది. 2009లో అంబర్‌పేటగా మారింది. ♦ దుబ్బాక నియోజకవర్గం తొలిపేరు రాజగోపాల్‌పేట. తర్వాత దొమ్మాట అయింది. 2009లో దొమ్మాట రద్దయి దుబ్బాక నియోజకవర్గం ఏర్పడింది. ♦ పఠాన్‌చెరు నియోజకవర్గం 2009 వరకు రామాయంపేటగా ఉండేది. ♦ హుస్నాబాద్ స్థానం 1962 నుంచి కమలాపురంగా ఉండేది. 2009లో రద్దయి హుస్నాబాద్ ఏర్పడింది. ♦ మానకొండూరు.. 2009 వరకు నేరెళ్లగా కొనసాగింది. ♦ రామగుండం నియోజకవర్గం పేర్లు, రిజర్వేషన్లు మార్చుకోవడం పరిపాటి. 1962 వరకు మేడారం పేరుతో జనరల్ సీటు. ఆ తర్వాత అదే పేరుతో ఎస్సీ రిజర్వుడు అయింది. మళ్లీ 2009లో రామగుండంగా పేరు మార్చుకుని జనరల్ కోటాలోకి మారింది. ♦ ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం 2009 వరకు ఇందుర్తి (జనరల్)గా ఉండేది. ♦ బుగ్గారం. 2009లో రద్దయి కోరుట్లగా మారింది. ♦ నిజామాబాద్ (రూరల్) పాతపేరు డిచ్పల్లి. 2009లో కొత్త పేరు వచ్చింది. ♦ నిజామాబాద్ (అర్బన్) మొదటి నుంచీ నిజామాబాదే.. 2009లో అర్బన్ నియోజకవర్గమయింది. ♦ జుక్కల్ (ఎస్సీ) పేరు అదే కానీ... 2009కు ముందు జనరల్ కోటాలో ఉండేది. ♦ ప్రస్తుత మంచిర్యాల 2009కు ముందు లక్సెట్టిపేట. - మేకల కల్యాణ్ చక్రవర్తి -
పబ్లిక్ మేనిఫెస్టో రాజేంద్ర నగర్ నియోజకవర్గం
-
పబ్లిక్ మేనిఫెస్టో జనం సాక్షిగా- సికింద్రాబాద్
-
కడప ఆసెంబ్లీ నియోజకవర్గంలో లక్షా పదివేల ఓట్ల గల్లంతు
-
కర్నూలు నంబర్ వన్
–పారిశ్రామిక, సేవారంగంలో, తలసరి ఆదాయంలో కర్నూలుకు మొదటి ర్యాంకు –14వ స్థానానికి పరిమితమైన మంత్రాలయం – నియోజక వర్గాల వారీగా ర్యాంకులను ప్రకటించిన జిల్లా యంత్రాంగం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ - 1 గా నిలిచింది. 2015–16 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా లభించిన గ్రేడుల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లా విస్తీర్ణం 17658 చదరపు కిలో మీటర్లు ఉంది. అన్నింటిలో కర్నూలు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండగా.. డోన్ అసెంబ్లీ నియోజక వర్గం రెండో స్థానంలో నిలిచింది. వ్యవసాయ ఉత్పాదకతలో మాత్రం కోడుమూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. మొదటి సారిగా నియోజకవర్గాల వారీగా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా ర్యాంకులు ఇచ్చారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, సేవా రంగానికి చెందిన అన్ని కార్యక్రమాలకు కర్నూలు కేంద్ర బిందువుగా ఉండటంతో కర్నూలు అసెంబ్లీకి నంబరు–1 స్థానం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలోనూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లా వెనుకబడి ఉంది. స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో జిల్లాకు 9వ స్థానం, తలసరి ఆదాయంలో 11వ స్థానం లభించింది. 2011–12 ధరల ప్రకారం వ్యవసాయ, పారిశ్రామిక, సేవ రంగం ప్రగతిని అంచనా వేశారు. జిల్లా మొత్తం మీద స్థూల ఉత్పత్తి విలువ రూ.29,887.30 కోట్లు ఉండగా, తలసరి ఆదాయం రూ.72,463 ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. జిల్లా స్థూల ఉత్పత్తిని వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల నుంచి లెక్కిస్తారు. జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యవసాయ ఉత్పాదకత రూ.9631.62 కోట్లు ఉండగా కోడుమారు నియోజక వర్గం మొదటి స్థానంలో, పత్తికొండ నియోజకవర్గం 2వ స్థానంలో ఉంది.ఽ కర్నూలు నియోజకవర్గానికి 14వ స్థానం దక్కింది. పారిశ్రామిక రంగంలో జిల్లా ఉత్పాదకత రూ.6066.75 కోట్లు ఉండగా, కర్నూలు నియోజకవర్గానికి 1వ ర్యాంకు, డోన్‌కు 2వ ర్యాంకు లభించింది. మంత్రాలయం నియోజకవర్గానికి 14వ ర్యాంకు లభించింది. సేవా రంగంలో రూ.14,188 కోట్ల విలువ సేవలు అందగా, ఇందులో కర్నూలు నియోజకవర్గానికి మొదటి ర్యాంకు, నంద్యాలకు రెండవ ర్యాంకు లభించింది. మంత్రాలయం 14వ ర్యాంకుతో సరిపుచ్చుకుంది. జిల్లా మొత్తం మీద తలసరి అదాయం రూ.72,463 ఉండగా, కర్నూలు అసెంబ్లీలో అత్యధికంగా రూ1,18,446 ఉండి మొదటి ర్యాంకును పొందగా, డోన్ అసెంబ్లీ 2వ ర్యాంకును పొందింది. తలసరి ఆదాయంలోను మంత్రాలయం నియోజకవర్గం 14వ ర్యాంకుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గాల వారీగా ర్యాంకుల వివరాలను జిల్లా ప్రణాళిక విభాగం అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. -
కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటరెడ్డి సతీమణి
సుచరిత పేరును ప్రతిపాదించిన టీపీసీసీ సాక్షి, హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి రాంరెడ్డి సుచరితకు టికెట్ ఇవ్వాలని టీపీసీసీ సిఫారసు చేసింది. వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు సుచరిత పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ... ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. పాలేరులో దివంగత ఎమ్మెల్యే వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తున్నందున.. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని పలు పార్టీలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీటీడీపీ, సీపీఐ, సీపీఎంలకు శనివారం లేఖలు రాశారు. పాలేరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించారని... దీంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కుటుంబ సభ్యులకే కాంగ్రెస్ అవకాశం ఇస్తోందని లేఖల్లో పేర్కొన్నారు. అందువల్ల పాలేరులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.. -
లిమ్కా రికార్డ్స్‌లోకి ‘సత్తెనపల్లి’
హైదరాబాద్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం త్వరలోనే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కనుంది. ఇటీవల నియోజకవర్గంలో ‘స్వచ్ఛ సత్తెనపల్లి’ పేరుతో 20 వేల మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని వంద రోజుల్లో పూర్తి చేశారు. కాగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లిమ్కా బుక్ నిర్వాహకులకు ఇప్పటికే అధికారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పంపించారు. త్వరలోనే ‘స్వచ్ఛ సత్తెనపల్లి’ అందులో నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే, ఒక రోజు 60 వేల మందితో చేతులు కడిగించే (హ్యాండ్‌వాష్) కార్యక్రమం ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్‌లోకి సత్తెనపల్లిని నమోదు చేయించే ప్రయత్నాన్ని కూడా కోడెల చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. -
'తిరుపతి నియోజక వర్గంలో మళ్లీ ఉప ఎన్నిక జరిపించాలి'
హైదరాబాద్: తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అధికారులే ఓటర్ స్లిప్పులు పంచి ప్రజల చేత దొంగ ఓట్లు వేయించి రిగ్గింగ్ కు సహకరించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరారు. -
తిరుపతి ఉప ఎన్నిక రేపే
హైదరాబాద్: శుక్రవారం జరగబోయే తిరుపతి ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునే వారు 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. నియోజక వర్గంలోని మొత్తం 256 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
మార్చిలో ఉప ఎన్నిక
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం పెద్ద విషయం కాకున్నా, జయను పదవీచ్యుతురాలిని చేసిన శ్రీరంగం కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు జయకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన కారణంగా 1951 సెక్షన్ 8 ప్రకారం జయ తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటిస్తే గానీ శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లుగా ఈసీ పరిగణించదు. బెంగళూరు కోర్టు నుంచి జయ శిక్షకు సంబంధించిన నకలు పత్రాలు రావడంలో జాప్యం చోటుచేసుకుంది. శ్రీరంగంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు తహతహలాడుతూ ఈసీపై ఒత్తిడి పెంచాయి. జయలలిత జైలు శిక్ష కోర్టు పత్రాల పరిశీలనను అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ పూర్తిచేశారు. సాంకేతికంగా నిర్ధారించుకున్న తరువాత ఈనెల 8వ తేదీన శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. నిర్ధారణ పత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పంపగా, వారి ద్వారా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌కు చేరడం కూడా పూర్తయింది. చర్యలు చేపట్టిన ఈసీ: అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరిపించాలని ఈసీ నిబంధన ఉంది. అయితే రాష్ట్రంలో ఓటర్ల జాబితా పనులు సాగుతున్నాయి. కొత్త ఓటర్ల చేరిక, ఇటీవలే పంపిణీ చేసిన కలర్ గుర్తింపు కార్డుల్లో తప్పుల సవరణ వంటి చర్యల్లో ఈసీ తలమునకలై ఉంది. సవరింపులు పూర్తయి జనవరి 5వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఆరునెలల్లోగా ఉప ఎన్నిక అంటే మార్చి 27వ తేదీకి గడువు పూర్తికానుంది. ఓటర్ల తుది జాబితా సిద్ధమైన తరువాతనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమిళులు ఎక్కువగా సంబరాలు జరుపుకునే జనవరి పొంగల్ పండుగ నాటికి ఉప ఎన్నికల కోలాహలంలో శ్రీరంగం మునిగి తేలే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకం: సెలబ్రెటీలు వాడి వదిలేసిన వస్తువులకు వచ్చే గిరాకీ, మోజు వంటిదే తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పడింది. జయలలితను మాజీ ముఖ్యమంత్రిని చేసిన నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అన్నాడీఎంకే సైతం సహజంగానే శ్రీరంగం చేజారిపోకుండా కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఎన్నికల సమయంలో తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా శ్రీరంగంను ఎగరేసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు విజయం ఆమడదూరంలో ఉండిపోయింది. ఉప ఎన్నిక, పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటా అన్నాడీఎంకేదే విజయకేతనంగా మారిపోయింది. అమ్మధాటికి తట్టుకోలేక నీరసించిపోయిన ప్రతిపక్షాలు వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఉప ఎన్నిక ద్వారా ఊపిరి పోసుకోవాలని ఆశపడుతున్నాయి. -
షోలాపూర్ సెంట్రల్ సిటీ ఎన్నిక రద్దుచేయాలి
సీపీఎం నేత ఆడం డిమాండ్ షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ సెంట్రల్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక రద్దు చేయాలని సీపీఎం అభ్యర్థి, మాజీ శాసన సభ్యుడు నర్సయ్య ఆడం డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నిక రద్దుచేయాలని కోరుతూ తాను త్వరలోనే ముంబై హైకోర్టులో వాజ్యం దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ సిటీ స్థానం పరిధిలో తను శివసేనకు మద్దతు ప్రకటించినట్లు ఓటర్లను నమ్మించి దుష్ర్పచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వాట్సప్‌లో పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆరోపించారు. హిందువుల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పాల్పడ్డారని తెలిపారు. కాగ్రెస్ పార్టీ నుంచి తను రూ.11 కోట్లు తీసుకుని ప్రణతి షిండేకు మద్దతు ఇచ్చినట్లుగా ఎంఐఎం వారు తనపై దుష్ర్పచారం చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు తాను ఎన్నికల అధికారి శాహుజీ పవార్, పోలీసు కమిషనర్లకు 13వ తేదీన అందజేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్లలో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసి ఓట్లు పొందిందని ఆయన ఆరోపించారు.తన ఫిర్యాదులపై అధికారులెవరూ స్పందించనందున కోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో అడ్వకేట్ ఎం.హెచ్.శేఖ్, నసియా శేఖ్, సిద్దప్ప కలుశెట్టి, సురేష్ పలుమారి, అశోక్ బల్లా తదితరులు పాల్గొన్నారు. -
మోగిన ‘ఉప’ నగరా
నందిగామ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల 20 నుంచి 27 వరకు నామినేషన్ల స్వీకరణ 28న పరిశీలన 30 వరకు ఉపసంహరణకు గడువు సెప్టెంబర్ 13న ఎన్నికలు 16న ఫలితాలు విడుదల అమల్లోకి ఎన్నికల కోడ్ నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు శనివారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున 5,212 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయక ముందే గుండెపోటుకు గురై మరణించారు. దీంతో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం నుంచి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఉప ఎన్నికపైనే చర్చ సాగుతోంది. ఇదీ షెడ్యూలు.. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 30వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 13వ తేదీన ఎన్నికలు నిర్వహించి 16న ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడటంతో జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది. టీడీపీలో ఆశావాహుల హడావుడి! ఉప ఎన్నికల్లో టికెట్ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టికెట్ తనకే లభిస్తుందని దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్య భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల ప్రచారం కూడా నిర్వహించారు. మరోవైపు గత ఎన్నికల్లో పామర్రు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన వర్ల రామయ్య కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వర్ల రామయ్యకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారని సీఎంకు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైనప్పటికీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై నోరుమెదపలేదు. సీఎం అభిప్రాయం కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు సమాచారం. పైకి మాత్రం తంగిరాల సౌమ్యకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీపై తీవ్ర వ్యతిరేకత టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. పథకం ప్రకారం వైఎస్సార్ సీపీ నేతలపై వేధింపులు కొనసాగిస్తున్నారు. ఆరు రోజులు కిందట టీడీపీ శ్రేణుల చేతిలో గొట్టుముక్కల ఉప సర్పంచి, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలోకం కృష్ణారావు హత్యకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండతోనే టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వరుస దాడుల నేపథ్యంలో టీడీపీపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయం కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల వారికి అండగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గంలో టీడీపీ ఆగడాలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అండగా నిలుస్తోంది. తమ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అందుబాటులో ఉంటున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మూడు రోజుల కిందట గొట్టుముక్కల వచ్చి హత్యకు గురైన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ ఆగడాలను స్థానిక నాయకులు వైఎస్ జగన్‌కు వివరించగా.. ఆయన అందరినీ ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా అన్ని వర్గాల సమస్యలపైనా వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. -
దళితుల భూములకు.. ‘రెవెన్యూ’ గండం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గూడు లేని బీదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం 20 ఏళ్ల కిందటే 68మంది దళిత రైతులకు నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని 310, 411, 414, 415, 416, 425 సర్వే నంబర్లలో పంపిణీ చేసిన సుమారు 69.10 ఎకరాల ప్రభుత్వ అసైన్డు భూమిని తిరిగి లాగేసుకునే ప్రయత్నం చేసింది. నల్లగొండ పట్టణానికి చెందిన బలహీనవర్గాల ప్రజలకు, ఇందిరమ్మ రెండవ విడత గృహసముదాయంలో భాగంగా రాజీవ్‌గృహకల్ప కింద ఇంటి స్థలాలను ఇచ్చేందుకు అధికారులు ఈ స్థలాన్ని ఎంపిక చేయడం వివాదాస్పదం అవుతోంది. అసలు ఒక నియోజకవర్గం పరిధిలోని ప్రజలను మరో నియోజకవర్గం పరిధిలోకి తరలించాలనుకోవడ ంలోనే కుట్ర దాగుం దని, తమ భూములకు అమాంతం విలువ పెంచేసుకునే వ్యూహం దాగుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే భూమిలో 2008 నవంబర్ 17న అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇదంతా ఇదీ.. అసలు కథ ప్రభుత్వం భూములు పంపిణీ చేసినా, ఎలాంటి సాగు చేయకుండా నిరుపయోగంగా ఉంచారు కాబట్టి, ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి వెనక్కి తీసేసుకుంటున్నామని, దీనికిగాను కొంత నష్టపరిహారం చెల్లిస్తామని నోటీసులు ఇచ్చింది. దీంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఎల్లారెడ్డిగూడెం దళితులు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. కనీసం ఈ కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నామని వారు వ్యాఖ్యానించారు. కాగా, నల్లగొండ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బడుగు బలహీనవర్గాలకు ఇళ్లు కట్టిస్తామనడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరిలో అత్యధికులు నల్లగొండలోనే చిన్నా చితక పనులు, ఇళ్లలో పనిచేసుకునే మహిళలు తదితరులు ఉంటారు. వీరిని నల్లగొండకు 12 కిలోమీటర్ల దూరానికి తరలిస్తే వారి ఉపాధి ఏం కాను అన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి. ఇది ఒక ఎత్తయితే, రెండు దశాబ్దాలుగా హక్కుదారులుగా ఉన్న దళితుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకోవాలని చూడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో శిలాఫలకం ధ్వంసం తమకు నష్టపరిహారం అక్కర్లేదని, బొత్స సత్యనారాయణ వేసిన శిలాఫలకాన్ని దళిత రైతులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు కేసులు కూడా పెట్టారు. సేద్యం చేయడం లేదన్న కారణం చూపెట్టి ఈ భూములను రెవెన్యూ అధికారులు వెనక్కి లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తాము సేద్యం చేయకుండా ఉండి ఉంటే పంట నష్ట పరిహారం ఎలా చెల్లించారంటూ ఈ రైతుల్లో అత్యధికులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. మరోమారు 2009లో ఇదే ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని, భూములు ఇచ్చేయాలని తమపై ఒత్తిళ్లు వచ్చాయని బాధితులు తెలిపారు. ఎకరాకు మొదట రూ.1.28లక్షల నష్ట పరిహారం ఇస్తామని నోటీసులు జారీచేసిన అధికారులు ఆ తర్వాత రూ.2.50లక్షల నుంచి రూ.3.00లక్షల నష్టపరిహారం ఎకరాకు చెల్లిస్తామని నోటీసులు ఇచ్చారు. కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటే రూ.3.50లక్షలు కూడా చెల్లిస్తామని మరో మారు రాయబారం నడిపారు. రెవెన్యూ అధికారులకు.. ఎందుకంత శ్రద్ధ సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం మరో తాయిలం కూడా ఇచ్చింది. ఎకరాకు రూ.4.50లక్షలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ప్లీడర్ దగ్గర లేఖలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. దీని వెనుకున్న బలమైన కారణం ఒక్కటే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దళితుల చేతుల్లో ఉన్న ఈ భూములకు మార్కెట్ విలువ ఎక్కువగా ఉంది. ఎకరా భూమి విలువ కనీసం రూ.30లక్షలు పలుకుతుండగా, రోడ్ వెంట ఉన్న భూమికైతే ఎకరాకు అత్యధికంగా రూ.60లక్షల దాకా ఉంది. కొత్త భూసేకరణ చట్టం మేరకు మారిన నిబంధనల ప్రకారం కూడా ఈ భూములను దళితులకే చెందుతాయని అంటున్నారు. ఉన్న భూమిని కాపాడాలని.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎస్సీలకు 3 ఎకరాల సాగుభూమిని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కనీసం ఈ హామీలో భాగంగానైనా తమకు భూములు పంపిణీ చేయకున్నా, ఉన్న భూములు లాగేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి నల్లగొండలోని బీదలకు గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టించాలంటే.. అది అర్బన్ హౌసింగ్ కిందకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు జవాబు చెప్పే అధికారి లేడు. అంతేకాకుండా, ప్రధానమైన మరో అభ్యంతరం కూడా ఉంది. నల్లగొండ నియోకవర్గ ప్రజలకోసం, నకిరేకల్ నియోజకవర్గ ప్రజ ల అసైన్డు భూములు ఎలా లాక్కుంటారు..? ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రెవెన్యూ అధికారులు తమపై పడిపోకుండా చూడాలని దళిత రైతులు కోరుతున్నారు. -
సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి మృతి
కిర్లంపూడి : కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి సోమవారం మధ్యాహ్నం కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పలుమార్లు టిక్కెట్ ఆశించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు తన మేనల్లుడైన చలమలశెట్టి సునీల్.. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడంతో ఆ పార్టీలో చేరారు. కిర్లంపూడి మండలంలోనే కాకుండా పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో ఆయన కీలక నాయకునిగా వ్యవహరిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. బంధువులు, వివిధ పార్టీల నాయకులు వీరవరంలో రామస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహంతోపాటు చలమలశెట్టి సునీల్, చలమలశెట్టి గోపి, జగ్గంపేట పీఏసీఎస్ అధ్యక్షురాలు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణి, జ్యోతుల కుమార్తె సునీత, సోదరుడు సుబ్బారావులు రామస్వామి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తోట రామస్వామి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, హైదరాబాద్ నుంచి ఫోనులో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. రామస్వామి కుటుంబాన్ని పరామర్శించినవారిలో విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తోట ఈశ్వరరావు, తోట గాంధీ తదితరులున్నారు. -
‘హస్తం’లో లొల్లి
అలజడి సృష్టిస్తున్న జెడ్పీటీసీ సభ్యుల క్యాంపు చర్చనీయూంశంగా మారిన డీసీసీ నోటీసులు ముగ్గురు సభ్యుల స్పందనపై ఆసక్తి అది కాంగ్రెస్ క్యాంప్ కాదంటున్న సదరు సభ్యులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు గానీ... కాంగ్రెస్ క్యాంపులో లొల్లి మొదలైంది. గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు వారం క్రితం కాంగ్రెస్ క్యాంపు నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడగా... ‘హస్తం’ నేతలు హైరానా పడ్డారు. పోలీసుల దాకా వెళ్లిన ఈ వ్యవహారం చివరకు కర్ణాటక కాంగ్రెస్ నేతల సహకారంతో సద్దుమణిగింది. ఇటీవల ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులకు డీసీసీ నోటీసులు జారీ చేయడంతో మళ్లీ వేడి రాజుకుంది. జెడ్పీ పీఠాన్ని అధిరోహించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు గెలిచిన పార్టీగా జెడ్పీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాధారణ ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్.... జెడ్పీ పీఠాన్ని దక్కించుకుని పట్టు సాధించాలని చూస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు దీటుగా క్యాంపు నిర్వహిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు సైతం కాంగ్రెస్ క్యాంపులోనే ఉన్నా... సొంత పార్టీకి చెందిన ముగ్గురు మొదటి నుంచీ క్యాంపునకు దూరంగా ఉండడం హస్తం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్ క్యాంపులో చేరలేదు. వీరు ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో వీరు ఎటువైపు ఓటు వేస్తారో తెలియక జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు గాబరా పడుతున్నారు. ఈ ముగ్గురు సభ్యుల వైఖరిలో స్పష్టత వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి గురువారం తీసుకున్న నిర్ణయం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన మీరు పార్టీ నిర్ణయం ప్రకారం వెంటనే మిగిలిన సభ్యులతో చేరాలని... లేకుంటే తదుపరి తీసుకునే చర్యలకు కట్టుబడాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు శనివారం లోపు సమాధానం చెప్పాలని సూచించారు. ప్రస్తుతం ప్రత్యేక క్యాంపులో ఉన్న ముగ్గురు సభ్యులకు ఈ నోటీసులు చేరాయూ అనేది సందేహంగా మారింది. ఈ ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల ఇంటి చిరునామాలకు నోటీసు లేఖలు అందినా... వారు సమాధానం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. శనివారం రాత్రి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కాంగ్రెస్‌లోని విశ్వసనీయవర్గాల సమాచారం. అరుుతే నోటీసుల విషయంలో ఆ పార్టీలో విభిన్న వాదనలు వినిపిస్తున్నారుు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సభ్యుల్లో ముగ్గురే వేరుగా ఉండడం సరికాదని... నోటీసులు ఇవ్వడం సమంజసమేనని నాయిని రాజేందర్‌రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా... ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాంపు అసలు కాంగ్రెస్ పార్టీదే కాదని ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల వాదనగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాయకుల నేతృత్వంతో నిర్వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యుల క్యాంపునకు తాము రాలేదనే వాదనకు అసలు అర్థమే ఉండదనే అభిప్రాయంలో వారు ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నేత ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలవలేదని... అలాంటప్పుడు క్యాంపు నిర్వహణతో కాంగ్రెస్‌కు సంబంధం ఉంటుందని తాము అనుకోవడం లేదని ఈ ముగ్గురు సభ్యులు చెబుతున్న ట్లు తెలిసింది. నోటీసు లేఖలు అందితే... అం దులో ఉన్న అంశాలను బట్టి స్పందించాలా... వద్దా... అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటామనే యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుం దో తెలియని పరిస్థితుల్లో క్యాంపు నిర్వహించ డం... దానికి రాలేదని నోటీసులు ఇవ్వడం సరికాదని ఈ ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు వా దిస్తున్నట్లు వినికిడి. కాగా, జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రె స్ 24, టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. కాం గ్రెస్ క్యాంపులో 25 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ క్యాంపులో 25మంది ఉన్నారని గు లాబీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జె డ్పీ చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. -
ఎన్నికల లెక్కచెప్పని అభ్యర్థులు
నేటితో ముగియనున్న గడువు వెంకటరమణ నివేదిక తిరస్కృతి నివేదికే ఇవ్వనివారు మరో 28మంది చిత్తూరు(కలెక్టరేట్): జిల్లాలో ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల నివేదికను సమర్పించేం దుకు ఎన్నికల సంఘం విధించిన గడువు ఆదివారంతో ముగియనుంది. జిల్లాలో మొత్తం 203 మంది అభ్యర్థులు వారి ఖర్చుల నివేదికలను సమర్పించాల్సి ఉం డగా, ఇప్పటివరకు 175 మంది వారి ఖర్చుల నివేదికలను సమర్పించి ఎన్నికల నోడల్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందారు. ఇంకా 28 మంది లెక్కల నివేదికలు సమర్పించలేదు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ఎం.వెంకటరమణ ఖర్చుల నివేదికలో తేడాలున్నాయని తిరస్కరించారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడి పాల్గొన్న సభకు అయిన ఖర్చులను వెంకటరమణ ఖాతాలో వేశారు. అరుుతే వెంకటరమణ ఆ సభ ఖర్చులు తనకు సంబంధం లేదని, వేదిక మీద ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారని కలెక్టర్ కే.రాంగోపాల్‌కు విన్నవించినట్లు సమాచారం. దీంతో ఆ సభ ఖర్చులను వేదిక మీద ఉన్న అభ్యర్థుల ఖర్చుల్లో సర్దుబాటు చేయూలని కలెక్టర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు సూచించినట్లు సమాచారం. ఎంతైనా అధికార పార్టీ కదా ఎన్నికల వ్యయ పరిశీలకులు, సంబంధిత ఆర్వోలు నివేదిక సర్దుబాటుకు కృషి చేస్తున్నట్లు తెలిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పోటీచేసిన అభ్యర్థుల్లో ముగ్గురు, నగరి, మదనపల్లెలో ఇద్దరు చొప్పున, పీలేరులో నలుగురు వారి ఖర్చుల నివేదికను ఇంకా ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించలేదని ఎన్నికల యంత్రాంగం తెలిపింది. జీడీ నెల్లూరు,పలమనేరు, సత్యవేడు,చంద్రగిరిల్లో ముగ్గురు చొప్పున,చిత్తూరు,పూతలపట్టులో ఒక్కొక్కరు వంతున, రాజంపేట పార్లమెంటు పరిధిలో ముగ్గురు ఖర్చుల వివరాలను సమర్పించలేదని పేర్కొంది. -
కల నెరవేరింది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : లోక్‌సభలో అడుగు పెట్టాలనుకున్న వరప్రసాదరావు కోరిక రెండో ప్రయత్నంలో నెరవేరింది. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రెండో సారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకంటే అధికంగా ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి జయరాం మీద 37,425 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో తనను ఓడించిన చింతా డిపాజిట్లు గల్లంతు చేశారు. ఆ ఇద్దరికీ డిపాజిట్లు గల్లంతు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్‌కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. రామనారాయణరెడ్డికి ఆత్మకూరులో 8927 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు సార్లు తిరుపతి ఎంపీగా గెలిచిన చింతామోహన్‌కు ఈ ఎన్నికల్లో 33,333 ఓట్లు మాత్రమే లభించి ఘోర పరాజయం చవిచూశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు తిరుపతి లోక్‌సభ అభ్యర్థి విజయం విషయంలో 2009 ఎన్నికల నాటి పరిస్థితే పునరావృతమైంది. ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఒక్క సర్వేపల్లిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల గెలిచారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ఎంపీగా సుమారు 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు విషయంలో ఇదే పునరావృతమైంది. తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే వరప్రసాద్ 10,399 ఓట్లు అధికంగా సంపాదించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 7583 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే వరప్రసాద్‌కు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 9915 ఓట్లు అధికంగా వచ్చి బీజేపీ అభ్యర్థి కంటే 2332 ఓట్లు ఎక్కువ సంపాదించారు. సత్యవేడుపరిధిలో టీడీపీ అభ్యర్థి ఆదిత్య 4273 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ వరప్రసాద్‌కు బీజేపీ అభ్యర్థి కంటే 5183 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం కంటే వరప్రసాద్‌కు 9456 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సర్వేపల్లి నుంచి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధనరెడ్డి 5447 ఓట్ల మెజారిటీతో గెలిస్తే వరప్రసాద్‌కు 23,242 ఓట్ల ఆధిక్యత దక్కింది. అంటే ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 17,795 ఓట్లు అధికంగా వచ్చాయి. గూడూరులో సునీల్‌కుమార్‌కు 9,088 మెజార్టీ వస్తే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 19,786 ఓట్ల మెజార్టీ వచ్చింది. వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి 5,525 మెజార్టీతో గెలిస్తే వరప్రసాద్‌కు ఇక్కడ 2857 ఓట్లు అధికంగా వచ్చాయి. సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సంజీవయ్య 3726 ఓట్లతో గెలిస్తే వరప్రసాద్‌కు మాత్రం ఇక్కడ 13,898 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌కు ఆధిక్యతలు వచ్చి బీజేపీ అభ్యర్థి జయరాంను 37,425 ఓట్ల తేడాతో వరప్రసాద్ ఓడించారు. -
అభ్యర్ధుల్లో క్రాస్ ఓటింగ్ భయం
-
పెద్దాయన కొడుకు చిన్నబోయాడు!
పట్టు నిలుపుకునేందుకు కోట్ల ప్రయత్నాలు కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కె.జి.రాఘవేంద్రారెడ్డి: కర్నూలు జిల్లా పేరు వింటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన కోట్లను జిల్లా ప్రజలు ప్రేమగా ‘పెద్దాయన’ అని పిలుచుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన విజయభాస్కర్ రెడ్డి చివరివరకు జిల్లాపై పట్టు కొనసాగించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను చెప్పిన వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకోవడం.. వారిని గెలిపించుకోవడం ద్వారా తనకు ఎదురు లేదనిపించుకున్నారు. కాలంతో పాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లోనూ పెనుమార్పులు సంభవించాయి. ఈ నేపథ్యంలో పెద్దాయన కొడుకు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్ర విభజన పాపం వుూటగట్టుకున్న కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటం.. మరోవైపు అభివృద్ధి పనుల్లో వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటుండటం ఆయునకు పెనుసవాళ్లుగా వూరారుు. దీంతో హారతులు పట్టిన ఊళ్లలోనే కన్నెత్తి చూసేందుకు కూడా జనం ఇష్టపడటం లేదు. మొత్తం మీద గెలుపు కోసం కాకపోయినా మరిన్ని ఓట్లు సంపాదించి పరువు నిలుపుకునేందుకు పెద్దాయన కొడుకు పాకులాడుతున్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత... రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉవ్ముడి రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశామని.. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించడంతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధ్ది చెబుతామంటున్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను తుడిచేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే ఇప్పుడు కోట్లకు ప్రాణసంకటంగా మారింది. కనిపించని అభివృద్ధి జాడలు! ఎంపీగా, కేంద్ర మంత్రిగా కోట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు న్నాయి. గ్రామాల్లో ప్రజలు నీటి సవుస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే రోడ్లు బురదమయమే. ఎంపీగా తవు సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. కోట్ల మనిషిగా ముద్రపడిన ప్రస్తుత కోడుమూరు తాజా మాజీ ఎమ్మెల్యే వుురళీ కృష్ణ తమ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌కు.. ప్రత్యేకించి దశాబ్దాల తరబడి కోట్ల కుటుంబం వెంట ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదనేది కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈసారి తాము కోట్ల కుటుంబం వెంట ఉండేదే లేదని తేల్చి చెబుతున్నారు. పైసలిస్తేనే పనులు! అభివృద్ధి పనుల్లో కోట్ల జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నారుు. కర్నూలు-కోడుమూరు రహదారి విస్తరణ పనుల్లో రూ.10 కోట్లు ఇస్తేనే పనులు చేయనిస్తానని కాంట్రాక్టర్‌ను కోట్ల బెదిరించినట్లు విమర్శలున్నాయి. దీంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బుట్టాకు అనుకూల పవనాలు! కోట్లపై జనాగ్రహం... మరోవైపు టీడీపీలో ఉన్న అసంతృప్తులు వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు కలిసి వస్తున్నారుు. టీడీపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన కేఈ ప్రభాకర్ చివరకు చల్లబడినా... పోటీలో ఉన్న బీటీ నాయుడుకు సహకరిస్తారన్న నమ్మకం లేదని తెలుగు తమ్ముళ్లే పేర్కొంటున్నారు. వైఎస్ పథకాలు, జగన్‌పై అభిమానం ఆమెకు కలిసివచ్చే అంశాలు. దీనికితోడు బలమైన ఓటు బ్యాంకు కలిగిన చేనేత వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు అదనపు అర్హత అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుట్టా రేణుకకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయుపడుతున్నారు. -
శోభానాగిరెడ్డి పేరును తొలగించండి: టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం ఓ వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తిపేరు బ్యాలెట్ పేపర్లలో ఉండరాదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఓటు చెల్లదంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించడం బాధ్యతా రాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు. -
ముంచుకోటే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచివరుసగా ఆరుసార్లు గెలుపొందిన యనమల రామకృష్ణుడు 2009లో ఓటమి పాలై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆర్థిక మంత్రిగా అనేక అత్యున్నత పదవులు నిర్వర్తించినా నియోజకవర్గానికి ఇది చేశానని గొప్పగా చెప్పుకోవడానికి యనమలకు ఏదీ మిగల్లేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పదవులు నిర్వర్తించింది రామకృష్ణుడే అయినా వరుసకు సోదరుడైన కృష్ణుడు(ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్టు షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించారు. అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో తన వ్యతిరేకులను పోలీసు కేసులతో వేధించిన సంఘటనలు అనేకం. ఏ సందర్భంలో, ఏ పని కావాలన్నా కృష్ణుడు అనుగ్రహించందే జరిగేదే కాదనే ఆరోపణలు ఉన్నాయి.తుని నుంచి రామకృష్ణుడు పోటీలో ఉంటే తెరవెనుక చక్రం తిప్పిన కృష్ణుడే ఇప్పుడు స్వయంగా బరిలోకి దిగారు. 2009లో ఓటమి తరువాత రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై, పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా కృష్ణుడు పోయిన ఒంటెత్తు పోకడలతో విసుగెత్తిన పలు సామాజికవర్గాలకు చెందిన నాయకులు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నారు. చాలా కాలంగా సమయం కోసం కాచుకున్న కొన్ని వర్గాలు కృష్ణుడిని దెబ్బ తీయడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ పరిణామాలతో కృష్ణుడి వర్గం డీలాపడింది. నియోజకవర్గంలో తొండంగి మండలం రామకృష్ణుడికి కంచుకోట. తుని పట్టణం ఏనాడూ టీడీపీకి మద్దతు ఇచ్చిన దాఖలా లేదు. ఇందుకు ఉదాహరణ గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డుల్లో మహానేత వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుపొందడమే. తుని రూరల్, కోటనందూరు మండలాల్లో పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టుండేది. ఎటొచ్చీ తొండంగి మండలంలో వచ్చే ఆధిక్యతతోనే రామకృష్ణుడు సునాయాసంగా గెలుస్తూ వచ్చేవారు. అలాంటి తొండంగి మండలంలో గత ఎన్నికల నుంచీ పరిస్థితి మారి ప్రస్తుతం చేయి దాటిపోవడంతో యనమల కోట కుప్పకూలినట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రామకృష్ణుడు అప్పుడప్పుడు ప్రచారం చేసి పోతున్నారే తప్ప నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. అన్న మాటున అధికార దుర్వినియోగం.. అన్న ఉన్నత హోదాలో ఉన్నప్పుడు కృష్ణుడు చేసిన నిర్వాకాలతో పట్టణంతో పాటు, రూరల్ మండలాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వ్యాపారులు, వివిధ సామాజికవర్గాలకు చెందిన నేతలపై కేసులు పెట్టించిన అధికార దుర్వినియోగం ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయి. రామకృష్ణుడి కంటే సీనియర్ అయిన కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లె అచ్చియ్యనాయుడు వంటి నాయకులు కృష్ణుడి తీరుతో విసిగి, వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. తుని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రుత్తల తమ్మయ్యదొర కృష్ణుడి విధానాల వల్లే టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ వ్యతిరేకత తొండంగి మండలాన్ని కూడా తాకడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. ఆ మండలంలో ఎ.వి.నగరం, పెరుమాళ్లపురం, కోదాడ, సీతారామపురం, ఎ.కొత్తపల్లి, దానవాయిపేట, ఎర్రయ్యపేట, వేమవరం తదితర పంచాయతీలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇందుకు సవాలక్ష కారణాలున్నాయి. రామకృష్ణుడు పాతికేళ్లకు పైగా ఉన్నతస్థాయిలో ఉన్నా.. సొంత సామాజికవర్గంలోనే ఎవరికీ ఉద్యోగాలు కల్పించకపోవడం, అభివృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, మండలంలో కనీసం జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయించ లేకపోవడం వంటివి మచ్చుకు కొన్ని. కోన ప్రాంతంలో కృష్ణుడి వర్గీయుల పెత్తనం, భూదందాలతో విసుగెత్తిన మత్స్యకారులు గత ఎన్నికల్లోనే నిరసన తెలపగా.. ఈసారి టీడీపీకి వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో గత ఎన్నికల ఫలితమే తిరిగి తప్పదన్న నిస్పృహ టీడీపీ శ్రేణులను వెన్నాడుతోంది. -
సీమాంధ్ర అసెంబ్లీ బరిలో 2,922 మంది!
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో చివరకు 2,922 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,177 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో పరిశీలన అనంతరం 1,255 మంది అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇక ఇక్కడి మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు 455 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 59 మంది దరఖాస్తులను తిరస్కరించగా చివరకు 396 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ప్రాంతంలో మే 7వ తేదీన ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. -
రసవత్తర పోరుకు రాప్తాడు సిద్ధం
రాప్తాడు నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రాష్ట్రంలో 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. గతంలో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలలను కలుపుతూ ఆరు మండలాలతో కొత్తగా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ప్రధాన సమస్యలు నియోజకవర్గంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నా రు. సాగునీటి వనరులు లేకపోవడంతో రైతులు వర్షాధార పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ఇక్కడ సాగునీరే ప్రధాన సమస్య. దీనిని అధిగమించేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద సాగునీటి కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఆయన హయాంలో 70 శాతంపైగా పనులు పూర్తి చేశారు. ఆయన మరణం తర్వాత ఆ పనులు ముందుకు సాగడంలేదు. ఇక పీఏబీఆర్ ద్వారా నియోజకవర్గం గుండా వెళ్లే ధర్మవరం కాలువకు ఏటా సక్రమంగా నీటిని విడుదల చేయటం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు సాగునీటితోపాటు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పరిస్థితి 2009 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీడీపీ తరఫున పరిటాల సునీతా, పీఆర్పీ తరఫున కె క్రిష్టమూర్తి, బీజేపీ తరఫున వెన్నపూస రవీంద్రారెడ్డితోపాటు, మరో 16 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికలలో పరిటాల సునీత తన సమీప అభ్యర్థి తోపుదుర్తి ప్ర కాష్రెడ్డిపై 1950 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. పస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి టీడీపీ తరఫున పరిటాల సునీత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి , కాంగ్రెస్ తర ఫున రమణారెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పోటీ నామమాత్రమే అయినా టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య రసవత్తర పోరు తప్పదని రాజకీయ పరిశీలకులు భా విస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రశాంతత, అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన పరిటాల సునీతకు ఈ సారి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి ఓటు వేయొద్దు గుత్తి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయాలేదని, అలాంటి వ్యక్తికి ఓటు వేసి మోసపోవద్దని ఏపి స్టేట్ విద్యుత్ సంస్థ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సయ్యద్ సాహెబ్ ముస్లిమ్‌లకు విజ్ఞప్తి చేశా రు. గురువారం ఆయన బీఎంఎస్ సోదరులు రఫీద్దిన్, నజీర్‌లతో కలిసి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 15 శాతం జనాభా ఉన్నా కనీసం ఒక్క అసెంబ్లీ సీటును కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింకు కేటాయించలేదన్నారు. మతతత్వ మోడీతో జతకట్టి ముస్లింలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబును కలిసి రైతులు కష్టాల్లో ఉన్నారని ఉచిత విద్యుత్ ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరగా అమెరికాలో గాలిని కూడా అమ్ముతున్నారని విద్యుత్ ఎలా ఫ్రీగా ఇస్తామని తమపై మండి పడ్డారని సయ్యద్‌సాహెబ్ గుర్తుచేసుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఆయన తనయుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముస్లింలకు నాలుగు సీట్లు కేటాయించారన్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబుకు ముస్లింలు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. జగన్ సీఎం కాగానే వైఎస్ఆర్ పథకాలు అవులు ఉరవకొండ రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధినేత జగ్మోహన్రెడ్డి సీఎం కాగానే వుహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవులు చేసిన సంక్షేవు పథకాలు తిరిగి కొ నసాగుతాయుని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు వై.వుధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకర్ల సవూవేశంలో మా ట్లాడారు. ఉరవకొండలో హంద్రీనీవా రెండవ దశ పనులు పూర్తి అవుతాయని, నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. జీడిపల్లి రిజర్వాయుర్ నుంచి అన్నీ చెరువులకు నీరు అందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందన్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా విజయుం సాధిస్తావుని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రజలకు చేసింది శూన్యవుని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు సాధ్యం కాని హామీ ఇస్తూ ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. ప్రజలు టీడీపీకి గట్టి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. అనంత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ చౌదరి అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పీవీ అనిల్ చౌదరిని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గురువారం ప్రకటించారు. అనిల్‌కుమార్ చౌదరి అనంతపురం సహకార శాఖ పరిధిలోని సెంట్రల్ స్టోర్స్ అధ్యక్షుడిగా మూడు దఫాలుగా పనిచేశారు. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన ఈయన మాజీ మంత్రి పీవీ చౌదరి మనవడు. ఏడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్‌గా , సెంట్రల్ స్టోర్స్ అధ్యక్షునిగా, నూతిమడుగు పంచాయతీ అధ్యక్షునిగా పనిచేసిన పీవీరామ్మోహన్రెడ్డి కుమారుడు. చౌదరి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. వ్యూహాత్మకంగానే రఘువీరారెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అనిల్ చౌదరిని బరిలోకి దించినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
మాట తప్పినవారికి ఓటుతో బుద్ధి చెప్పండి
ప్రజలకు గౌరు వెంకటరెడ్డి పిలుపు వైఎస్సార్సీపీని ఆదరించాలని విజ్ఞప్తి నందికొట్కూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అన్నదమ్ముల్లా ఉండే తెలుగువారిని నిలువునా విభజించాయని, మాట తప్పి ప్రవ ర్తించిన ఆ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి రాష్ట్రంలో రైతు రాజ్యాన్ని తెస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఐజయ్య వైఎస్సార్సీపీ నందికొట్కూరు అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గౌరు చరితారెడ్డి పాలనలో ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు. ఆ పథకాలను లబ్బి వెంకటస్వామి పూర్తి చేయలేక బురదజల్లే మాట లు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే రకమని లబ్బిని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేగా పదవులను అలంకరించిన లబ్బికి సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఐజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తా : ఐజయ్య వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తానని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఐజయ్య అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పెండింగ్ ప్రాజెక్ట్‌లు, పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఐజయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి పిలుపునిచ్చారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన లబ్బి వెంకటస్వామి ముఖ్య అనుచరుడు మద్దూరు నరహరిరెడ్డి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.కార్యక్రమానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కస్వా శంకర్‌రెడ్డి, శ్రీనాథరెడ్డి, జిల్లా నాయకులు గౌరు మురళీధర్‌రెడ్డి, మాండ్ర ఉమ, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలాల కన్వీనర్లు అబ్దుల్ మునాఫ్, ఓబుల్‌రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, గోవిందగౌడ్, పల్లె శివానందరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి, నాయకులు ఎల్.నరసింహారెడ్డి, శెట్టి వీరన్న, జయసింహారెడ్డి, తిమ్మారెడ్డి, లింగస్వామిగౌడ్, జయరామిరెడ్డి, బుడగజంగాల మధు తదితరులున్నారు. నామినేషన్ వేసిన ఐజయ్య నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఐజయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం మధ్య ఆయన ర్యాలీగా తరలివచ్చి తహశీల్దార్ కార్యాలయంలో 11.40గంటలకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జయకుమార్‌కు అందజేశారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నాయకులు మాండ్ర శివానందరెడ్డి తదితరులు ఉన్నారు. -
సీపీఎం సీమాంధ్ర రెండో జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో పోటీ చేసే మరికొందరు అభ్యర్థులతో సీపీఎం రెండో జాబితా విడుదల చేసింది. 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. అరకు లోక్‌సభ స్థానం నుంచి మిడియం బాబూరావు, విశాఖ నుంచి సీహెచ్ నర్సింగరావు, విజయవాడ నుంచి వి. ఉమామహేశ్వరరావు, తిరుపతి నుంచి కొత్తపల్లి సుబ్రమణ్యం పోటీ చేస్తారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కోలక లక్ష్మణమూర్తి (కురుపాం), పాలిక లక్కు (పాడేరు), కాట్రగడ్డ స్వరూపరాణి (గన్నవరం), ఆవుల బసవయ్య (అవనిగడ్డ), ఎం.ఆశీర్వాదం (కొడుమూరు), మాదాల వెంకటేశ్వర్లు (నెల్లూరు) ఉన్నారు. సీపీఎం తొలి జాబితాలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితా విడుదలతో 44 అసెంబ్లీ, 4 లోక్‌సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. -
అవినీతి పాలనను అంతమొందించాలి
హుజూర్నగర్, న్యూస్‌లైన్,నియోజకవర్గంలో రాజ్యమేలుతున్న అవి నీతి పాలనను అంతమొందించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కా వాలని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి పట్టణంలోని స్వర్ణవేదిక ఫంక్షన్హాల్లో జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో సీటు సంపాదించి గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు అందజేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరితేనే పథకాలు వర్తింపజేస్తామంటూ పార్టీ ఫిరాయింపులకు పా ల్పడ్డారని మండిపడ్డారు. పేదవాడి పొట్ట నింపాలనే సదుద్దేశంతో వైఎస్సార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్ నేతలు నియంతల్లా వ్యవహరిస్తూ పేదల పొట్టగొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలే మనుషులని, ప్రతిపక్షాల వారు మనుషులు కాదంటూ ఆటవిక సంస్కృతికి ఆజ్యం పోశాడన్నారు. ఎదురుతిరిగిన వారిపై అక్ర మ కేసులు పెడుతూ చివరకు మహిళలను సైతం బెదిరింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. గ్రామాలో పెంట దిబ్బలు, మరుగుదొడ్లు, ఇం దిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర పథకాలను వ్యాపారాలుగా మార్చి ప్రతిదానికి కమీషన్లు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకులను నిల దీయాలని కోరారు. అకాల వర్షాలకు పంటలు దె బ్బతిని రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారిని పరామర్శించకుం డా సన్మానాలు చేయించుకుంటూ ఊరేగారని విమర్శించారు. రైతులను పరామర్శించేందుకు ని యోజకవర్గ పర్యటనకు బయలు దేరిన వైఎస్విజయమ్మను అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం శోచనీయమన్నారు. శుభకార్యంలో పాల్గొనడానికి సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాగా రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. వై ఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తనపైనా అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేసినా ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై చేస్తున్న యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసి పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించబడిందే వైఎస్సార్ సీపీ : గున్నం నాగిరెడ్డి దివంగత ముఖ్యమంత్రి ఆశయ సాధనకోసమే వైఎస్సార్సీపీ స్థాపించబడిందని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి అన్నారు. వైఎ స్సార్ కలలుగన్న సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పాటుపడుతామని పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులు నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ మహానేత ఆశయ సాధనకోసం ముం దుకు సాగుతున్నారని తెలిపారు. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిందో ప్రజలంతా గమనించారని అన్నారు. ప్రాంతాలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. అందుకే తెలంగాణలో కూడా కోట్లాది ప్రజల హృదయాల్లో వైఎస్సార్ దైవంగా నిలిచారని చెప్పారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కీలకంగా మారడం ఖాయమని.. మన ప్రాంతాభివృద్ధికి కావాల్సినన్ని నిధులు మంజూరు చేయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను గడప గడపకు వివరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్సీపీ మొట్టమొదటిగా గెలుచుకునేది హుజూర్నగర్ నియోజకవర్గమేనన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్, పెదప్రోలుసైదులుగౌడ్, జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి బుడిగె పిచ్చయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిసాముల ఆదినారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి మండల అధ్యక్షులు వేముల శేఖర్‌రెడ్డి, బొల్లగాని సైదులుగౌడ్, పోరెడ్డి నర్సిరెడ్డి, జాల కిరణ్‌యాదవ్, నాయకులు కుందూరు సత్యనారాయణరెడ్డి, చింతరెడ్డి కృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి,పులిచింతల వెంకటరెడ్డినాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యం స్థాపిద్దాం
సూర్యాపేట, న్యూస్‌లైన్, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపిద్దామని సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి బీరవోలు సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొడ్రాయి బజార్, అలంకార్‌రోడ్డు, ఈద్గా రోడ్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీరవోలు మాట్లాడుతూ సూర్యాపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీలను నెరవేరుస్తామన్నారు. మీరు కోరుకున్న పాలనను మీకివ్వడమే లక్ష్యంగా ముందుకు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చూపిస్తున్న స్పందనను చూస్తే గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీరవోలు విక్రంరెడ్డి, కడియం సురేందర్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఎజాస్, గోరెంట్ల సంజీవ, పొన్నం పాండుగౌడ్, దండ అరవిందరెడ్డి, ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు కట్టా జ్ఞానయ్య, యశోద, ప్రమీల, సతీష్, నాగు, నెహ్రూ, రఘు, రాజేష్, మహేష్, నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు!
కర్నూలు, న్యూస్‌లైన్: ఒక ఇంట్లో 211మంది ఓటర్లు ఉన్నారు. అసలు ఇల్లే లేని నెంబరుతో మరో 59 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చేసిన మామజాలం వెలుగుచూసింది. కర్నూలు నగరం 26వ వార్డులోని అరోర నగర్ (బీక్యాంపు)లోని 73వ బూత్‌లో సీరియల్ నం.613 నుంచి 824 వరకు 49-50ఏ-87 ఇంటి నంబరుపై 211 మంది ఓటర్లు ఉన్నారు. 76వ బూత్ పరిధిలోని వరుస నం. 364 నుంచి 423 వరకు 49-50ఏ-87సీ ఇంట్లో 59 మంది ఓటర్లు ఉన్నట్లుగా జాబితాలో పేర్లు ఉన్నాయి. అసలు ఆ నంబరుతో ఇల్లేలేదు. వీరందరూ బోగస్ ఓటర్లే. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా బోగస్ ఓటర్లు ఉన్నారని గురువారం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అశోక్‌బాబుకు వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. -
పాలకుర్తి బరిలో శ్రీరాంరెడ్డి
పాలకుర్తి, న్యూస్‌లైన్: ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగాల శ్రీరాంరెడ్డి... వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. వరంగల్ జిల్లా లింగాలఘణపురానికి చెందిన శ్రీరాంరెడ్డి 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఆయన సమాజ్‌వాది పార్టీ తరపున నామినేషన్ వేశారు. శ్రీరాంరెడ్డి తండ్రి లింగాల చెన్నకృష్ణారెడ్డి దాతృత్వ కార్యక్రమాల ద్వారా స్థానికంగా సుపరిచితులు. వారసత్వంగా వచ్చిన భూములను రఘునాథపల్లి, జనగామ, లింగాలఘణపురం మండలాల్లో పేదలకు పంచిపెట్టారు. తండ్రిలా శ్రీరాంరెడ్డి కూడా కమ్యూనిటీ, పాఠశాల భవనాలకు, బాలవికాస స్వచ్ఛంద సంస్థలకు, గ్రామ పంచాయతీ భవనాలకు సొంత భూములను విరాళంగా గతంలో అందజేశారు. కాగా, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని లింగాల శ్రీరాంరెడ్డి చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మిజోరంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9నే జరగాల్సిన ఎన్నికలు.. బ్రూ తెగ శరణార్థులకు త్రిపురలో ఓటేసేందుకు అనుమతించడంపై ప్రజాసంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో వాయిదా పడ్డాయి. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ తనయుడు, ఎమ్మెల్యే మానవేంద్ర సింగ్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారు. ఆయన బార్మర్ లోక్‌సభ స్థాన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఆరెస్సెస్‌లో పెద్ద గూండా అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి బేణీప్రసాద్ వర్మకు ఈసీ నోటీసు జారీ చేసింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి హైదరాబాద్ రషీద్ షరీఫ్ మెదక్ కె. చంద్రశేఖరరావు జహీరాబాద్ బి.బి. పాటిల్ పెద్దపల్లి బాల్క సుమన్ నిజామాబాద్ కవిత ఆదిలాబాద్ గోదం నగేష్ మహబూబాబాద్ ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఖమ్మం బదాన్ బేగ్ షేక్ (మల్కాజ్గిరి స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది) అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఉప్పల్ బి. సుభాష్‌రెడ్డి చార్మినార్ ఇనాయత్ ఆలీ బఖారి మలక్‌పేట సతీష్‌కుమార్ యాదవ్ చాంద్రాయణగుట్ట ఎం. సేత రాంరెడ్డి ఖైరతాబాద్ మన్నె గోవర్ధన్‌రెడ్డి అంబర్‌పేట ఎడ్ల సుధాకర్‌రెడ్డి కార్వాన్ ఠాకూర్ జీవన్ సింగ్ ఖమ్మం జి. కృష్ణ పినపాక శంకర్ నాయక్ మధిర బొమ్మెర రాంమూర్తి వైరా చంద్రావతి కుత్బుల్లాపూర్ కొల న్ హనుమంతరెడ్డి సనత్‌నగర్ దండే విఠల్ మంచిర్యాల దివాకర్‌రావు నిజామాబాద్ అర్బన్ గణేష్ గుప్త నారాయణఖేడ్ ఎం. భూపాల్‌రెడ్డి కూకట్పల్లి గొట్టుముక్కల పద్మారావు మహేశ్వరం కొత్త మనోహర్‌రెడ్డి యాకుత్‌పుర ఎండీ శబీర్ అహ్మద్ ఎల్బీ నగర్ ఎన్. రామ్మోహన్‌గౌడ్ కొడంగల్ గురునాథ్‌రెడ్డి గోషామహల్ ప్రేమ్‌కుమార్ దూత్ అశ్వారావు పేట జె. ఆదినారాయణ భువనగిరి పైలా శేఖర్‌రెడ్డి నాగార్జునసాగర్ నోముల నర్సింహయ్య పరకాల ఎం. సహోదర్‌రెడ్డి జహీరాబాద్ కె. మాణిక్‌రావు చొప్పదండి బుడిగె శోభ నర్సాపూర్ సి.హెచ్. మదన్‌రెడ్డి మహబూబాబాద్ బి. శంకర్‌నాయక్ ముషీరాబాద్ ముఠా గోపాల్ కంటోన్మెంట్ గజ్జెల నగేష్ నాంపల్లి కె. హనుమంతరావు గంగపుత్ర బహుదూర్‌పల్లి ఎండీ జియాఉద్దీన్ నారాయణపేట కుంబం శివకుమార్‌రెడ్డి భద్రాచలం ఝాన్సీ రాణి అనంద్‌రావు (ఇంకా ప్రకటించాల్సినవి: ఇబ్రహీంపట్నం, దుబ్బాక, మునుగోడు, తుంగతుర్తి, శేర్లింగపల్లి, జూబ్లీహిల్స్, ఇల్లందు, రాజేంద్రనగర్, పాలేరు, నల్లగొండ) -
విధేయతకు మీరిచ్చే గౌరవం ఇదేనా?: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: అవినీతిని అంతం చేయాలని తాను పోరాటం చేస్తే తననే రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు టికెట్ నిరాకరించడంపై ఆయన మంగళవారం జెమినీ కాలనీలోని తన నివాసంలో కూతురు సుస్మితతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ... నెహ్రూ, గాంధీ కుటుంబాలకు విధేయుడుగా ఉంటున్న తనకిచ్చే బహుమానం ఇదేనా? అని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో విధేయతకు స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కేవీపీ రామచంద్రరావుల కనుసన్నల్లోనే టికెట్ల కేటాయింపు జరిగిందని ఆరోపించారు. జలయజ్ఞంలో జరిగిన అవినీతిపై పోరాటం చేసినందుకే పొన్నాల తనకు టికెట్ నిరాకరించారని విమర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని జైరాం రమేష్ ప్రకటించిన తర్వాత తనకు ఎక్కడ అడ్డమొస్తాడోనని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశాడని ఆరోపించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. -
రెండోసారి గెలిచిన రికార్డు
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ :చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 55 వరకు గురజాల, మాచర్ల ఒకే నియోజకవర్గంలో ఉండేవి. అప్పట్లో కోలా సుబ్బారెడ్డి ఉమ్మడి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1955లో మాచర్ల నియోజకవర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి మందపాటి నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 1962లో కాంగ్రెస్ అభ్యర్థి కేశవనాయక్ సీపీఐ అభ్యర్థి రంగమ్మరెడ్డిపై విజయం సాధించారు. 1967లో వెన్నా లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డిపై 76 ఓట్లతో గెలుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెన్నా లింగారెడ్డిపై 12,400 ఓట్లతో గెలుపొందారు. 1978లో చల్లా నారపరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి కర్పూరపు కోటయ్యపై 6 వేల ఓట్లతో గెలుపొందారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కొర్రపాటి సుబ్బారావు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా నారపరెడ్డిపై 22,400 ఓట్లతో గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నట్టువ కృష్ణమూర్తి టీడీపీ అభ్యర్థి ఒట్టికొండ జయరామయ్యపై 1700 ఓట్లతో గెలుపొందారు. 1989లో టీడీపీ అభ్యర్థి నిమ్మగడ్డ శివరామకృష్ణప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమూర్తిపై 4,400 ఓట్లతో గెలుపొందారు. 1994లో టీడీపీ అభ్యర్థి కుర్రి పున్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి సుందరరామిరెడ్డిపై 6,575 ఓట్లతో గెలుపొందారు. 1999లో టీడీపీ తరపున పోటీచేసిన జూలకంటి దుర్గాంబ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై 1500 ఓట్లతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి లక్ష్మారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై 32,200 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇదే అత్యధిక మెజార్టీ. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పై 9,640 ఓట్లతో విజయం సాధించారు. 2012లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 15,400 ఓట్లతో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు.ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీచేసిన గుంటూరుకు చెందిన మాగంటి సుధాకర్‌యాదవ్ కేవలం 16 వేల ఓట్లను పొంది డిపాజిట్‌ను కోల్పోయారు. టీడీపీలో తెరపైకి రోజుకో పేరు మరో తొమ్మిది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలవుతున్నా టీడీపీ ఇంతవరకు తన అభ్యర్థిని నిర్ణయించుకోలేకపోతోంది. ఆ పార్టీ తరఫున రోజుకో పేరు తెరపైకి వస్తోంది. టీడీపీ టిక్కెట్ కోసం 2009 ఎన్నికల్లో టిక్కెట్ పొంది చివరి నిముషంలో చేజార్చుకున్న కొమ్మారెడ్డి చలమారెడ్డి ఈసారి టిక్కెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. 2012 ఉప ఎన్నికల్లో ఓడిపోయిన చిరుమామిళ్ళ మధుబాబు ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తుండడంతో టిక్కెట్ తనకే దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన జూలకంటి బ్రహ్మారెడ్డి తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన సోదరుడు, ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు నిన్నమొన్నటి వరకు గురజాలలో వైఎస్సార్సీపీలో పనిచేసి, ఇటీవలే పార్టీలో చేరిన యెనుముల మురళీధరరెడ్డి మాచర్ల టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో చేరకుండానే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి రాయపాటి సాంబశివరావు ద్వారా టిక్కెట్ కోసం యత్నిస్తున్నారు. ఇదిలావుండగా ఎస్పీఎఫ్ డీఐజీగా పనిచేస్తున్న చంద్రగిరి ఏసురత్నం కుటుంబం కూడా గత రెండురోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి బీసీ నాయకులతో కలసి టిక్కెట్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు గెలిచిన శాసనసభ్యులు 1952 - కోలా సుబ్బారెడ్డి 1955 - మందపాటి నాగిరెడ్డి 1962 - కేశవనాయక్ 1967 - వెన్నా లింగారెడ్డి 1972 - జూలకంటి నాగిరెడ్డి 1978 - చల్లా నారపరెడ్డి 1983 - కొర్రపాటి సుబ్బారావు 1985 - నట్టువ కృష్ణ 1989 - నిమ్మగడ్డ శివరామకృష్ణప్రసాద్ 1994 - కుర్రి పున్నారెడ్డి 1999 - జూలకంటి దుర్గాంబ 2004 - పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2009 - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2012 - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఉప ఎన్నిక) -
‘కొండ’ంత ఆశకు ‘కృష్ణ’పక్షం..!
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీలో నాయకుల నడుమ టిక్కెట్ల సిగపట్లు కార్యకర్తలను, ద్వితీయశ్రేణి నాయకులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. శత్రువుతో యుద్ధానికి శక్తియుక్తులన్నీ వినియోగించాల్సిన వేళ.. తలెత్తుతున్న ‘అంతర్యుద్ధాలు’ పార్టీని మరింత బలహీనపరుస్తాయని వారు దిగాలు పడుతున్నారు. సాక్షి, కాకినాడ :‘కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు పార్టీ అధినేత ఝలక్ ఇవ్వనున్నారా?’ అంటే ‘అవుననే’ ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లుగా టిక్కెట్ తనకే ఖాయమైందంటూ ప్రచారం చేసుకున్న కొండబాబుకు ఈసారి ఆ చాన్స్ దక్కే ఆశలు అడుగంటినట్టేనని చెపుతున్నాయి. వరుసగా రెండుసార్లు ఓటమి చెందడంతో పాటు ప్రజల్లోనూ, పార్టీలోనూ వనమాడి పట్ల ఉన్న వ్యతిరేకతను సాకుగా చూపి ఆ పార్టీ అధినాయకత్వం ఆయన్ని ఈసారి పక్కన పట్టేందుకు సిద్ధపడినట్టు తెలియవచ్చింది. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో.. ఇప్పటి వరకూ కొండబాబు పెంచుకున్న ఆశలు ‘కృష్ణపక్ష చంద్రుని’లా నానాటికీ క్షీణిస్తున్నట్టేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. ముత్తాకు టీడీపీ టికెట్ ఖరారైందంటూ ఆయన వర్గీయులు ఇప్పటికే చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. ఇన్నాళ్లూ తన కుమారుడు శశిధర్‌కు టికెట్ కోసం పట్టుబట్టిన గోపాలకృష్ణ తానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల మీడియా ముందుకొచ్చిన ముత్తా తాను లేదా తన కుమారుల్లో ఎవరో ఒకరు ఈసారి ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన అభ్యర్థించినట్టు శశిధర్‌కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినచంద్రబాబు.. ఆయన అభ్యర్థిత్వంపై మాత్రం సుముఖత ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ముత్తాకున్న అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకోవాలన్న తలంపుతోనే చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇన్నాళ్లూ ధీమాతో ఉన్న వనమాడికి ఈసారి టిక్కెట్ హుళక్కేనన్న ప్రచారం జోరందుకుంది. తిరుగుబాటు తప్పదంటున్న ‘వనమాడి’ వర్గం టిక్కెట్ ఖాయమన్న ధీమాతో ముత్తా ప్రచారానికి సైతం ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. శుక్రవారం చంద్రబాబును కలిసిన ముత్తా అధినేత ఇచ్చిన హామీతోనే ఈ నెల 12వ తేదీన ఉదయం 10.50 గంటలకు తన ఇంటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంటున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ తాజా పరిణామం కొండబాబుకు శరాఘాతంగా మారింది. అధినేత వైఖరిపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. గత పదేళ్లుగా పార్టీ జెండా మోసిన కొండబాబును కాదని అసలు పార్టీలో ఉన్నారో, లేరో కూడా తెలియని ముత్తాకు ఏ విధంగా టిక్కెట్ ఇస్తారంటూ రుసరుస లాడుతున్నారు. పదేళ్ల క్రితమే పార్టీని వీడిన ముత్తా గత ఐదేళ్లుగా రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారని, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కనీస ప్రభావం కూడా చూపని ఆయనకు ఏ విధంగా టిక్కెట్ కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. ముత్తాకు టికెట్ ఖాయమైతే తామంతా తిరుగుబాటు జెండా ఎగురవేస్తామని హెచ్చరిస్తున్నారు. మరొక పక్క వరుసగా మూడుసార్లు అవకాశమిచ్చినప్పటికీ పార్టీని పటిష్టపర్చాల్సిన వనమాడి పార్టీని భ్రష్టు పట్టించారని ముత్తా అనుచరులంటున్నారు. అడుగడుగునా భూ కబ్జాలను ప్రోత్సహించడంతో పాటు తోడు కొండబాబు తీరుతో విసుగు చెందడం వలనే తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నేతలు, క్యాడర్లో అత్యధికులు వైఎస్సార్ కాంగ్రెస్ సిటీ కోఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెంట నిలిచారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న పార్టీ అధిష్టానం కొండబాబు అభ్యర్థిత్వంపై పునరాలోచన లో పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ తనకు అనుకూలంగా మలచుకొన్న ముత్తా సీటు కోసం అధినేత వద్ద చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు చెబుతున్నారు. కొండబాబు తన ఒంటెత్తు పోకడలతో చివరకు తన సీటుకే ఎసరు పెట్టుకున్నారని ఆ పార్టీ క్యాడరే వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. కాకినాడ సిటీ సీటు కోసం జరుగుతున్న అంతర్యుద్ధం.. అసలే దుర్బలంగా ఉన్న పార్టీని మరింత కుదేలు చేస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
మళ్లీ తెరపైకి ‘కోనసీమ జిల్లా’
అమలాపురం, న్యూస్‌లైన్ :మూడువైపులా నదీపాయలు.. మరోవైపు బంగాళాఖాతం.. వీటి మధ్యన కొలువుదీరిన దీవి కోనసీమ. వరి, కొబ్బరి, ఆక్వా సాగులో జిల్లాలో తనకంటూ గుర్తింపు పొందింది. చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. జిల్లాను రాజకీయంగా, ఆర్థికంగా శాసించే స్థాయిలో ఉన్న కోనసీమను ప్రత్యేక జిల్లాగా చేయాలని దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు డిమాండ్ చర్చనీయాంశమైంది. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో కోనసీమను జిల్లా చేయాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు, ఇసుక రీచ్‌లు ఇలా జిల్లాలో వస్తున్న ఆదాయంలో కోనసీమది 40 శాతం వరకు ఉంటుందని అంచనా. జిల్లాలో సుమారు 51 లక్షల జనాభా ఉండగా, కోనసీమ జనాభా సుమారు 17 లక్షలు. గతంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, నియోజకవర్గ పునర్విభజనలో ఇవి ఐదుకు పరిమితయ్యాయి. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో మండలమైన తాళ్లరేవు, కొత్తపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆలమూరు కోనసీమ ఆవలివైపున్నాయి. ప్రత్యేక దీవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే పూర్తిగా ఒక లోక్‌సభ నియోజకవర్గం కూడా కాని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయలేమని జిల్లాకు చెందిన ఇతర ప్రాంత నేతలు ఈ డిమాండ్‌ను కొట్టిపారేస్తున్నారు. అయితే కోనసీమ నుంచి ఏడాదికి రూ.1200 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. 12 ఇసుక రీచ్‌ల ద్వారా ఏటా రూ. ఏడెనిమిది కోట్ల ఆదాయం వస్తోంది. ఇక తాటిపాక జీసీఎస్, ఉప్పలగుప్తం రవ్వ, ఓడలరేవు ఓఎన్జీసీ చమురు క్షేత్రాలున్నాయి. ఒకప్పుడు కోనసీమ మారుమూల ప్రాంతమైనా జాతీయ రహదారులు 16, 216లు కోనసీమ మీదుగా వెళుతున్న నాటి నుంచి ప్రజారవాణా సంబంధాలు విస్తృతంగా పెరిగి జాతీయ జీవన స్రవంతిలో అనుసంధానం కావడంతో బాగా అభివృద్ధి చెందింది. విద్యారంగ పరంగా కూడా ఒక వైద్యకళాశాల, ఐదు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కొత్తపేట వద్ద గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంట్ ఉంది. ప్రత్యేక జిల్లా అనివార్యమైతే పారిశ్రామిక ప్రగతి శరవేగంగా జరిగే అవకాశం ఉంది. డిమాండ్ ఏనాటిదో.. గతంలో ఇదే డిమాండ్‌పై మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘ఆవు పొదుగు మీకు.. తల మాకా’ అంటూ జిల్లా ఏర్పాటుకు సహకరించలేమని తేల్చి చెప్పి ఎద్దేవా చేశారు. అనంతరం మెట్ల ఆందోళనకు సిద్ధమైనా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి విరమించారు. నాయకులు వదిలేసినా కోనసీమను జిల్లాగా ఏర్పాటు చేయాలని అప్పుడప్పుడూ కొన్ని స్థానిక ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. విభజనతో ఊపు రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలను పెంచే అవకాశముందనే ప్రచారం జరుగుతున్నందున కోనసీమను జిల్లా చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఊపందుకుంటోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో నర్సారావుపేట రెవెన్యూ డివిజన్‌తోపాటు మరో రెండు డివిజన్లను కలిపి పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎక్కువైంది. ఇదే విషయాన్ని రాష్ట్ర సహకార మంత్రి కాసు కృష్ణారెడ్డి బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ కోనసీమకు కూడా వర్తిస్తుంది. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయని, జిల్లాకు 25 వరకు స్థానాలు పెరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అంటే జిల్లాలో ఇప్పుడున్నదానికన్నా అదనంగా ఆరు పెరుగుతాయని, ఈ విధంగా చూస్తే కోనసీమలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు అదనంగా రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా ప్రతిపాదనకు ఇదొక కారణమవుతుందంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ప్రతిపాదన చేసింది. ఈ విధంగా చూస్తే కోనసీమలో ఉన్న నియోజకవర్గాలకు అదనంగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి జిల్లా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఉంది. -
ఆ నలుగురు...
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎస్. కోటలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అక్కడి శాసనసభా స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలు చూసుకునే పనిలో ఆయా పార్టీలు మునిగి తేలుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు అయిన సత్తిబాబు ఎస్. కోట బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం జరగడం, అందుకు అనుగుణంగానే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, నిధుల వరద పారించడం వంటి పరిణామాలతో కాంగ్రెస్‌లో ఆశావహులు చల్లబడిపోయారు. కాగా రచ్చబండ సమావేశాల్లో జన స్పందన కొరవడటం, పంచాయతీ ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఐదు మండలాల్లో కాంగ్రెస్‌కు పడే ఓట్ల శాతం గణ నీయంగా దిగజారిందని తేలడం వంటి పరిణామా లతో బొత్స యూటర్న్ తీసుకుని చీపురుపల్లి వైపు మొగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఎస్. కోట నియోజకవర్గం తన చేతుల నుంచి జారిపోకుండా తనకు వీరవిధేయులుగా ఉన్న వారిని బరిలోకి దించే పనిలో బొత్స ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆ నలుగురు .... ఎస్. కోట నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. ఎస్.కోట మండలానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు, జామి మండలానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, కొత్తవలస మండలానికి చెందిన డీసీసీ కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, వేపాడ మండలానికి చెందిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మూకల కస్తూరిలలో ఒకరికి ఈ దఫా టికెట్ దక్కుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారంతా మంత్రి బొత్సకు వీరవిధేయులే. సత్తెన్న చీపురుపల్లి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే వీరిలో ఒక్కరికి ఎస్. కోట బెర్త్ ఖాయమని రాజకీయ విళ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు ఎవరికి వారు టికెట్ తమదేనని చెబుతున్నట్టు సమాచారం. ముగ్గురికి శృంగభంగం అరుుతే ఆ నలుగురిలో ముగ్గురు గతంలో సత్తెన్న రాజకీయ వ్యూహాన్ని, కాంగ్రెస్ మాయాజాలాన్ని నమ్మి భంగపడిన వారే. 2009 ఎన్నికల్లో ఇం దుకూరి రఘురాజుకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. చివరి నిమిషంలో సామాజిక వర్గం పేరుతో అల్లు జోగినాయుడును రంగంలోకి దింపడంతో రఘురాజుకు భంగపాటు తప్పలేదు. ఈ పరిణామంతో రఘురాజు రెబల్‌గా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు.. మంత్రి బొత్స అండతో 2004లో ఉత్తరావల్లి నియోజకవర్గం నుంచి, తర్వాత 2009లో ఎస్. కోట నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. రెండు ధపాలు అభయం ఇచ్చిన బొత్స చివరి నిమిషంలో మనసు మార్చుకోవడంతో రాజేశ్వరరావుకు దెబ్బ పడింది. డీసీసీ కార్య దర్శి నెక్కల నాయుడుబాబుకు 1999లో ఉత్తరావల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బి-ఫారం ఇచ్చినా చివరి నిమిషంలో మంగపతికి కట్టబెట్టారు. 2004లో మ రోమారు టికెట్ ఆశించినా నాయుడుబాబుకు భంగపాటు తప్పలేదు. అభయం ఎవరికి ? రఘురాజుకు సత్తెన్న పూర్తి మద్దతు పలికినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గాన్ని కాదని ర ఘురాజుకు టికెట్ ఇప్పిస్తారా...? వెలమ సామాజిక వర్గా నికి చెందిన నాయుడుబాబు, రాజే శ్వరరావుల్లో ఎవరికైనా చాన్స్ ఇస్తారా...బీసీ మహిళ అన్న నినాదంతో సత్తెన్న వర్గానికి వీర విధేయురాలిగా ఉన్న మూకల కస్తూరిని అభ్యర్థిగా నిలుపుతారా అన్న చర్చ ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, మిగిలిన వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దల సభలో ఆశించిన బెర్త్ సత్తిబాబుకు దక్కలేదు. ఈ పరిణామంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో నిలచి గెలవాల్సి ఉన్నందున ఎస్. కోట వచ్చేది...రానిది తేలిపోనుంది. సత్తెన్న నిర్ణయంపైనే ఎస్. కోట టికెట్ ఆశిస్తున్న వారి భవిష్యత్ ఆధారపడి ఉంది. -
‘గూడెం’ టీడీపీలో కుర్చీలాట
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ఆట మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీటు ఎవరికి దక్కుతుందనే విషయమై విసృ్తత చర్చ సాగుతోంది. పాత కాపులకే మ్యాండెట్ ఇస్తారా.. లేక కొత్తవారికి, వలస వాదులకు రెడ్ కార్పెట్ పరుస్తారా అనేది తేలకపోవడంతో ఆ పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న వర్గ రాజకీయూలు రసకందాయంలో పడ్డాయి. టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు, మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి తనకు లేదా తన కుమారుడు నవీన్‌కు టికెట్ సాధించుకుంటారా అనే కోణంలో విశ్లేషణ చేస్తున్నారు. యర్రా చాణక్యం తెలిసిన వారు ఇలా జరగడానికి ఆస్కారం లేకపోలేదంటున్నారు. దీనికి ఊతమిచ్చే విధంగా ఆయన కుమారుడు నవీన్ తాడేపల్లిగూడెంలో మకాం పెట్టడం ఈ ఊహాగానాలకు అవకాశం కల్పిస్తోంది. గతంలో యర్రా నారాయణస్వామి టికెట్ పొందిన ప్రతి సందర్భంలోనూ ఎన్నికలకు ముందు ఇక్కడ మకాం పెట్టేవారు. మొదటిసారి టికెట్ దక్కించుకున్న రోజుల్లో కొబ్బరి తోటలో నివాసం ఉన్నారు. రెండోసారి సత్యవతినగర్కు మకాం వచ్చారు. ఈసారి టికెట్ ఆశిస్తున్న నవీన్ తండ్రి బాటలోనే సత్యవతి నగర్ ప్రాంతంలో మకాం వేశారు. నారాయణస్వామి ఇప్పటికే తనను వెన్నంటి ఉన్న పార్టీ శ్రేణులను, తన అనుయాయులను పిలిపించుకుని మంత్రాంగం నడిపారు. ఎన్టీఆర్ హయూంలో ఓ వెలుగు వెలిగిన యర్రా నారాయణస్వామికి చంద్రబాబు హయూంలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అనంతర పరిణామాల నేపథ్యంలో సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే పనిలోపడిన చంద్రబాబు నాయుడు తాజాగా నారాయణస్వామికి పెద్దపీట వేయ డం ప్రారంభించారు. ప్రస్తుతం అధినేతకు దగ్గరగా ఉంటున్న నారాయణస్వామి తాడేపల్లిగూడెం టికెట్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీలో చేరాలనుకుంటున్నవారి సమాచారాన్ని అధినేతకు సలహాల రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్టు సమాచారం. కీలెరిగి వాతపెట్టే నేర్పుగల నేతగా వినుతికెక్కిన నారాయణస్వామి టికెట్ విషయంలో అధినేతకు శిరోభారం తగ్గించే క్రమంలో చివరి అవకాశంగా ఈ సీటును తనకు ఇవ్వాలని కోరే అవకాశం లేకపోలేదు. పార్టీని వీడకుండా సుదీర్ఘకాలంపాటు చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని తన కుమారుడికైనా టికెట్ అడుగుతారని అంటున్నారు. ఇదే జరిగితే కుర్చీలాట రసవత్తరంగా మారడం ఖాయం. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు రెండోసారి టికెట్ దక్కించుకునే క్రమంలో ముందుకు సాగుతున్నారు. సామాజిక వర్గాల సర్ధుబాటు కోణంలో బాపిరాజుకు ఈసారి సీటు దక్కకపోవచ్చేనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ కోణంలో బాపిరాజు మాటతీరు మారడం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి సేవచేసి గెలవగలిగిన వ్యక్తులను కాదని కొత్త వారికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, అధిష్టానంపై పోరు సల్పడానికి సిద్ధమని ఇటీవల గూడెంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రకటించారు. ఇదిలావుండగా, బీసీలకు లేదా పార్టీకి సేవచేసిన పాతకాపులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ఈ సమావేశంలో తెరపైకి తెచ్చారు. అలాంటివారిని ఆర్థికపరంగా ఆదకునేందుకు అవసరమైతే ఆస్తులను కుదువపెడతామని, చందాలు వేసుకుని అయినా గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా, వేరే పార్టీల నుంచి వచ్చేవారికి సీటిస్తే సహించేది లేదనే హెచ్చరికలు ఇప్పటికే అధిష్టానానికి వెళ్లారుు. అరుునా, వేరే పార్టీనుంచి టీడీపీలోకి వచ్చే వారిలో ఎవరో ఒకరికి గూడెం సీటును కట్టబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇదిలావుంటే బీసీలకు జిల్లాలో నాలుగు టీడీపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఊపందుకుంది. ఆ జాబితాలో తాడేపల్లిగూడెంను కూడా చేర్చారు. ఇటీవల బీసీ నాయకులు చంద్రబాబును కలసి ఈ విషయాన్ని నివేదించారు కూడా. బీసీ కోటాలో కిల్లాడి ప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చంద్రబాబుకు లేఖ సైతం ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కిల్లాడికి అధినేతకు దగ్గరగా ఉండే యనమల రామకృష్ణునితో సాన్నిహిత్యం ఉంది. ఆయనకు టీడీపీ బెర్తు దక్కే అవకాశాలను పార్టీ వర్గాలు కొట్టి పారేయడం లేదు. ఏదేమైనా.. సీటు ఎవరికి ఇచ్చినా టీడీపీలో వర్గపోరు తప్పదనే విషయాన్ని విశ్లేషకులు నొక్కిచెబుతున్నారు.