
రాజన్న రాజ్యం స్థాపిద్దాం
సూర్యాపేట, న్యూస్‌లైన్, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపిద్దామని సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బీరవోలు సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొడ్రాయి బజార్, అలంకార్‌రోడ్డు, ఈద్గా రోడ్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీరవోలు మాట్లాడుతూ సూర్యాపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీలను నెరవేరుస్తామన్నారు. మీరు కోరుకున్న పాలనను మీకివ్వడమే లక్ష్యంగా ముందుకు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చూపిస్తున్న స్పందనను చూస్తే గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీరవోలు విక్రంరెడ్డి, కడియం సురేందర్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండీ.ఎజాస్, గోరెంట్ల సంజీవ, పొన్నం పాండుగౌడ్, దండ అరవిందరెడ్డి, ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు కట్టా జ్ఞానయ్య, యశోద, ప్రమీల, సతీష్, నాగు, నెహ్రూ, రఘు, రాజేష్, మహేష్, నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు.