మాట్లాడుతున్న గున్నం నాగిరెడ్డి, చిత్రంలో గట్టు , సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్,నియోజకవర్గంలో రాజ్యమేలుతున్న అవి నీతి పాలనను అంతమొందించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కా వాలని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి పట్టణంలోని స్వర్ణవేదిక ఫంక్షన్‌హాల్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో సీటు సంపాదించి గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు అందజేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరితేనే పథకాలు వర్తింపజేస్తామంటూ పార్టీ ఫిరాయింపులకు పా ల్పడ్డారని మండిపడ్డారు. పేదవాడి పొట్ట నింపాలనే సదుద్దేశంతో వైఎస్సార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్ నేతలు నియంతల్లా వ్యవహరిస్తూ పేదల పొట్టగొట్టారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కార్యకర్తలే మనుషులని, ప్రతిపక్షాల వారు మనుషులు కాదంటూ ఆటవిక సంస్కృతికి ఆజ్యం పోశాడన్నారు. ఎదురుతిరిగిన వారిపై అక్ర మ కేసులు పెడుతూ చివరకు మహిళలను సైతం బెదిరింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. గ్రామాలో పెంట దిబ్బలు, మరుగుదొడ్లు, ఇం దిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర పథకాలను వ్యాపారాలుగా మార్చి ప్రతిదానికి కమీషన్లు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకులను నిల దీయాలని కోరారు. అకాల వర్షాలకు పంటలు దె బ్బతిని రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారిని పరామర్శించకుం డా సన్మానాలు చేయించుకుంటూ ఊరేగారని విమర్శించారు.
రైతులను పరామర్శించేందుకు ని యోజకవర్గ పర్యటనకు బయలు దేరిన వైఎస్‌విజయమ్మను అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం శోచనీయమన్నారు. శుభకార్యంలో పాల్గొనడానికి సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాగా రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు.
వై ఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తనపైనా అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేసినా ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై చేస్తున్న యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసి పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు.
వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించబడిందే వైఎస్సార్ సీపీ : గున్నం నాగిరెడ్డి
దివంగత ముఖ్యమంత్రి ఆశయ సాధనకోసమే వైఎస్సార్‌సీపీ స్థాపించబడిందని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి అన్నారు. వైఎ స్సార్ కలలుగన్న సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పాటుపడుతామని పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులు నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ మహానేత ఆశయ సాధనకోసం ముం దుకు సాగుతున్నారని తెలిపారు. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిందో ప్రజలంతా గమనించారని అన్నారు.
ప్రాంతాలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. అందుకే తెలంగాణలో కూడా కోట్లాది ప్రజల హృదయాల్లో వైఎస్సార్ దైవంగా నిలిచారని చెప్పారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ కీలకంగా మారడం ఖాయమని..
మన ప్రాంతాభివృద్ధికి కావాల్సినన్ని నిధులు మంజూరు చేయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను గడప గడపకు వివరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్‌సీపీ మొట్టమొదటిగా గెలుచుకునేది హుజూర్‌నగర్ నియోజకవర్గమేనన్నారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్, పెదప్రోలుసైదులుగౌడ్, జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి బుడిగె పిచ్చయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిసాముల ఆదినారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, హుజూర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి మండల అధ్యక్షులు వేముల శేఖర్‌రెడ్డి, బొల్లగాని సైదులుగౌడ్, పోరెడ్డి నర్సిరెడ్డి, జాల కిరణ్‌యాదవ్, నాయకులు కుందూరు సత్యనారాయణరెడ్డి, చింతరెడ్డి కృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి,పులిచింతల వెంకటరెడ్డినాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.