Gattu srikanthreddy
-
ప్రభుత్వం మెడలు వంచుతం!
కరీంనగర్/టవర్‌సర్కిల్: నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరు చేపట్టి కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకునేందుకు నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం అంటూ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై, ప్రభుత్వం వైఖరిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగడట్టాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ గర్జన సభకు ఆయ న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయకుండా పూటకో మాట మాట్లాడుతూ కాలం వెల్లదీసి, ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే సంకేతాలి వ్వడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లక్ష ఉద్యోగాలతోపాటు నాలుగేళ్లలో పదవీ విరమణ పొందిన మరో 50 వేల ఉద్యోగాలతో కలిపి మొత్తం లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతకాని వ్యవస్థలా తయారైందని పేరుకే పబ్లిక్ కమిషన్‌గా ఉందని, నియామకాల ఊసేలేదని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, 19 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు ద్వారా రద్దయ్యాయని తెలిపారు. టీపీఎస్సీ కేవలం లక్షల వేతనాలు పొందే వ్యవస్థగా మారిందని ఆరోపించారు. లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు లక్ష ఉద్యోగాలు భర్తీచేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఏమిచ్చారని ప్రశ్నించారు. రూ.3 లక్షల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులకే రీ డిజైనింగ్ చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టి ప్రాజెక్టులు ఏమీ లేవని అన్నారు. ముందస్తు ఎన్నికల పేరిట ప్రజలను మరోమారు మోసం చేయడానికే సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సొంత ఎజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు ఒంటి చెత్తో అధికారంలోకి తెచ్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో పెట్టుకోవడానికి జంకుతున్న కాంగ్రెస్ నేతలు.. సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకుని.. చంద్రబాబు బొమ్మ పెట్టుకొని ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన టీఆర్ఎస్ నేతలు.. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అద్యక్షుడు సంతోష్ ఆద్వర్యంలో పలువురు యువకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ విగ్రహంతో ర్యాలీ.. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంతో వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి స్వాగతం పలికి ప్రతిమ క్రాసింగ్ నుంచి కలెక్టరేట్ వరకు డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభాస్థలి స్టేజీపై ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందు నుంచే సాంస్కృతిక బృందం కళాకారులతో దివంగత వైఎస్సార్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాడిన పాటలు సభికులను అలరించాయి. నిరుద్యోగ గర్జనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లకుమార్‌రెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు కట్ట శివ, పి.రాము, పి.గోవర్ధన్‌శాస్త్రి, సుధీర్, శ్రీనివాస్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల గణేష్, మహిళా విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, మహిళా విభా గం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు మోకెనపెల్లి రాజమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుంటక సంప త్, కరీంనగర్ నగర అధ్యక్షుడు ఇంజినీర్ సాన రాజన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఎండీ షాహెన్షా, కరీంనగర్ జిల్లా కార్యదర్శులు దీటి సుధాకర్, కేతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సోషల్ మీడి యా ఇన్చార్జి ఎండీ వలీయోద్దీన్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని గద్దె దించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి చెప్పేదొకటి, చేసేదొకటిలా ఉంది. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేదు. దళిత గిరిజనులకు వాగ్దానాలే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదు. –సంజీవరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరుద్యోగులకు బాసటగా నిలుద్దాం నామమాత్రపు నోటిఫికేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు బాసటగా నిలుద్దాం. నాలుగేళ్లుగా నెరవేర్చని హామీలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. – బెజ్జంకి అనిల్‌కుమార్,వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి -
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: గట్టు
సాక్షి, జడ్చర్ల : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప పాదయాత్ర కోసం ఆదివారం హైదరాబాద్ నుంచి కడప వెళ్తూ మార్గమధ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో 44వ నెంబర్ జాతీయరహదారిపై కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ ఆధ్వర్యంలో గట్టు శ్రీకాంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా జడ్చర్ల అసెంబ్లీలో పార్టీని పటిష్టం చేసేందుకు తీవ్రంగా కృషిచేయాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. -
ఉత్తమ్‌పై గట్టు ఫైర్
నల్గొండ జిల్లా: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగట్టుశ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి నల్గొండ జిల్లాలో 10 సీట్లు వస్తాయి అనడం సిగ్గుచేటన్నారు. ప్రజాసమస్యలపై ఏనాడూ మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు వస్తాయని గట్టు జోస్యం చెప్పారు. గడ్డాలు మీసాలు పెంచుకొని, ప్రజల ఓటర్ల శక్తిని బొచ్చుతో పోల్చడం విచారకరమన్నారు. -
పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి
⇒ వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ⇒ వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి ⇒ స్పందించకుంటే త్వరలో ప్రాజెక్టుల యాత్ర చేపడతాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లాల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు చేసే సీఎం కేసీఆర్.. రైతుల విషయంలో మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి వారికి రుణాలు వచ్చేలా రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు సకాలంలో పడనందున రైతులు విత్తిన విత్తనాలు మొలకెత్తలేదని, కొన్ని చోట్ల అరకొరగా మొలకెత్తినా అకాల వర్షాలకు నీట మునిగిపోయాయని తెలిపారు. అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు లబోదిబోమంటున్నారని, ఇలా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరాకి రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2004 తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులనూ ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే త్వరలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల యాత్ర చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలవారీగా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలి.. జిల్లాల అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, ప్రధాన కార్యదర్శులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇకపై అందరూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. సకాలంలో గ్రామ స్థాయి కమిటీలు, పార్టీ అన్ని అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, జి.మహేందర్‌రెడ్డి, మతిన్, కె.రాంభూపాల్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి(మహబూబ్‌నగర్), గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి(మెదక్), బెంబడి శ్రీనివాస రెడ్డి(రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్‌రెడ్డి(గ్రేటర్ హైదరాబాద్), ఎం.శాంతకుమార్(వరంగల్), అక్కెనపల్లి కుమార్(కరీంనగర్), నాయుడ్ ప్రకాశ్(నిజామాబాద్), తుమ్మలపల్లి భాస్కర్ (నల్లగొండ), మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృత సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం..
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ప్రారంభమైంది. టీ-వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు భేటీయ్యారు. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశంలో నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. -
షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేయాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి హుజూర్నగర్ : ఈ నెల 9 నుంచి 12 వరకు జిల్లాలోని 6 నియోజకవర్గాలలో వైఎస్.జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వైఎస్ అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన సోదరి షర్మిల ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాలలో చేపట్టనున్న ఈ పరామర్శ యాత్ర ద్వారా 17 కుటుంబాలను ఆమె కలుసుకుంటారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు నేటికీ ఆయన పాలనను మరువలేకపోతున్నారన్నారు. ప్రాంతాలకతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి స్వర్ణయుగాన్ని అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందని కొనియాడారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు వైఎస్.జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పరామర్శ యాత్ర నిర్వహించేందుకు జిల్లాకు వస్తున్న షర్మిలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అనుబంధ సంఘాలు, వైఎస్సార్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి అపూర్వ స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, జిల్లా కార్యదర్శి కోడి మల్లయ్యయాదవ్, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాసు, పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, నాయకులు పి.సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి పాలనను అంతమొందించాలి
హుజూర్నగర్, న్యూస్‌లైన్,నియోజకవర్గంలో రాజ్యమేలుతున్న అవి నీతి పాలనను అంతమొందించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కా వాలని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి పట్టణంలోని స్వర్ణవేదిక ఫంక్షన్హాల్లో జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో సీటు సంపాదించి గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు అందజేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరితేనే పథకాలు వర్తింపజేస్తామంటూ పార్టీ ఫిరాయింపులకు పా ల్పడ్డారని మండిపడ్డారు. పేదవాడి పొట్ట నింపాలనే సదుద్దేశంతో వైఎస్సార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్ నేతలు నియంతల్లా వ్యవహరిస్తూ పేదల పొట్టగొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలే మనుషులని, ప్రతిపక్షాల వారు మనుషులు కాదంటూ ఆటవిక సంస్కృతికి ఆజ్యం పోశాడన్నారు. ఎదురుతిరిగిన వారిపై అక్ర మ కేసులు పెడుతూ చివరకు మహిళలను సైతం బెదిరింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. గ్రామాలో పెంట దిబ్బలు, మరుగుదొడ్లు, ఇం దిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర పథకాలను వ్యాపారాలుగా మార్చి ప్రతిదానికి కమీషన్లు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకులను నిల దీయాలని కోరారు. అకాల వర్షాలకు పంటలు దె బ్బతిని రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారిని పరామర్శించకుం డా సన్మానాలు చేయించుకుంటూ ఊరేగారని విమర్శించారు. రైతులను పరామర్శించేందుకు ని యోజకవర్గ పర్యటనకు బయలు దేరిన వైఎస్విజయమ్మను అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం శోచనీయమన్నారు. శుభకార్యంలో పాల్గొనడానికి సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాగా రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. వై ఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తనపైనా అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేసినా ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై చేస్తున్న యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసి పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించబడిందే వైఎస్సార్ సీపీ : గున్నం నాగిరెడ్డి దివంగత ముఖ్యమంత్రి ఆశయ సాధనకోసమే వైఎస్సార్సీపీ స్థాపించబడిందని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి అన్నారు. వైఎ స్సార్ కలలుగన్న సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పాటుపడుతామని పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులు నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ మహానేత ఆశయ సాధనకోసం ముం దుకు సాగుతున్నారని తెలిపారు. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిందో ప్రజలంతా గమనించారని అన్నారు. ప్రాంతాలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. అందుకే తెలంగాణలో కూడా కోట్లాది ప్రజల హృదయాల్లో వైఎస్సార్ దైవంగా నిలిచారని చెప్పారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కీలకంగా మారడం ఖాయమని.. మన ప్రాంతాభివృద్ధికి కావాల్సినన్ని నిధులు మంజూరు చేయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను గడప గడపకు వివరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్సీపీ మొట్టమొదటిగా గెలుచుకునేది హుజూర్నగర్ నియోజకవర్గమేనన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్, పెదప్రోలుసైదులుగౌడ్, జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి బుడిగె పిచ్చయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిసాముల ఆదినారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి మండల అధ్యక్షులు వేముల శేఖర్‌రెడ్డి, బొల్లగాని సైదులుగౌడ్, పోరెడ్డి నర్సిరెడ్డి, జాల కిరణ్‌యాదవ్, నాయకులు కుందూరు సత్యనారాయణరెడ్డి, చింతరెడ్డి కృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి,పులిచింతల వెంకటరెడ్డినాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో విజయభేరి మోగిస్తాం
దొండపాడు(మేళ్లచెర్వు), న్యూస్‌లైన్ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుని విజయభేరి మోగి స్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని దొండపాడు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు గున్నంనాగిరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బలంగా ఉన్న ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందన్నారు. స్థానికంగా కాంగ్రెస్, టీడీపీ, బీ జేపీ యేతర పార్టీలతో పొత్తులు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఒకే నెలలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే హుజూర్నగర్ నియో జకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మేళ్లచెర్వు మండలం దొండపాడు, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలు, పులిచింతల ముంపు గ్రా మా ల ప్రజలకు పునరావాస ప్యాకేజీ, మం డలంలోని పరిశ్రమలకు పూర్తి స్థాయి సౌ లభ్యాలు, ఇతర అభివృద్ధి పనులు రాజశేఖరరెడ్డి హ యాంలోనే జరిగినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే, మం త్రిగా ఉన్న ప్రస్తు త టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలానికి ఒక్క పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను గానీ తీసుకరాలేక పోయారని విమర్శించారు. ఆయన వెంట వేముల శేఖర్‌రెడ్డి, మల్లయ్య యాదవ్, విజయభాస్కర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హుజూర్నగర్, న్యూస్‌లైన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేరేడుచర్ల మండలం మహంకాళిగూడానికి చెందిన పలువురు కార్యకర్తలు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల వల్ల అ నేక మంది బడుగు, బలహీనవర్గాల వారికి లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించకుండా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పదవులను అనుభవించి కాలయాపన చేసిందన్నారు. కాంగ్రెస్ పాలన వైఫల్యం వల్లనే నేడు రాష్ట్రంలో వరుస ఎన్నికలు వచ్చాయన్నారు. జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను, పార్టీ లక్ష్యాలను ప్రతి గడప గడపకూ తెలియజేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పిడమర్తి వినోద్, మురళి, రాము, వెంకట్రావు, దుర్గాప్రసాద్, మహేష్‌రెడ్డి, పవన్,సతీష్, రామాంజి, గోపి, ఉపేందర్, కోట్యా ఉన్నారు. కార్యక్రమంలో వైఎ స్సార్సీపీ నేరేడుచర్ల మండల అధ్యక్షుడు పోరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు. మండల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుల నియామకం వైఎస్సాఆర్ సీపీ మునుగోడు నియోజకవర్గంలోని మండలాలకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మర్రిగూడెం మండ లానికి కొప్పు విజయ్‌కుమార్, చండూరు మం డలం మోదుగునాగిరెడ్డి, నారాయణపూర్ మండలం గూడూరు వెంకటరెడ్డి, నాంపల్లి మండలం రఘునందన్, మునుగోడు మండలం శ్రీనివాస్‌లను నియమించారు. అలాగే మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎండి.షరీఫ్, మల్లాది పవన్‌కుమార్‌లను వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జగన్ ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలి
వెఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9 నుంచి జిల్లాలో చేపడుతున్న ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలి మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకే ఓదార్పుయాత్రను నిర్వహిస్తున్నారన్నారు. వైఎస్సార్ అభిమానులు జగన్ రాక కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన బడుగు, బలహీన వర్గాలు, రైతులు ఆయన పాలనను మరువలేకపోతున్నారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి వైఎస్సార్ స్వర్ణయుగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. -
రేపు విజయమ్మ రాక
హుజూర్నగర్, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం మేళ్లచెరువు మండలంలో పర్యటించనున్నారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను తాకిడికి నష్టపోయిన పంటలను పరిశీలించడంతో పాటు బాధిత రైతులను ఓదార్చేందుకు విజయమ్మ మేళ్లచెరువులో పర్యటిస్తున్నట్టు చెప్పారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి రైతులపై ప్రకృతి కన్నెర్రజేయడంతో కోలుకోలేని దెబ్బతిన్నారన్నారు. మేళ్లచెరువు మండలంలో అత్యధికంగా సాగు చేసిన పత్తి పంట వర్షాలకు దెబ్బతిని పోయిందన్నారు. ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ విజయమ్మ మేళ్లచెరువు మండలానికి చేరుకొని అక్కడ బాధిత రైతులతో మాట్లాడతారన్నారు. అనంతరం వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలిస్తారని చెప్పారు. తర్వాత రైతులను ఉద్దేశించి ప్రసంగించి హైదరాబాద్‌కు చేరుకుంటారన్నారు. నియోజకవర్గానికి మొదటిసారిగా వస్తున్న వైఎస్ విజయమ్మకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, పోరెడ్డి నర్సిరెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, సాముల ఆదినారాయణరెడ్డి, పులిచర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.