స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేరేడుచర్ల మండలం మహంకాళిగూడానికి చెందిన పలువురు కార్యకర్తలు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల వల్ల అ నేక మంది బడుగు, బలహీనవర్గాల వారికి లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించకుండా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పదవులను అనుభవించి కాలయాపన చేసిందన్నారు.
కాంగ్రెస్ పాలన వైఫల్యం వల్లనే నేడు రాష్ట్రంలో వరుస ఎన్నికలు వచ్చాయన్నారు. జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను, పార్టీ లక్ష్యాలను ప్రతి గడప గడపకూ తెలియజేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పిడమర్తి వినోద్, మురళి, రాము, వెంకట్రావు, దుర్గాప్రసాద్, మహేష్‌రెడ్డి, పవన్,సతీష్, రామాంజి, గోపి, ఉపేందర్, కోట్యా ఉన్నారు. కార్యక్రమంలో వైఎ స్సార్‌సీపీ నేరేడుచర్ల మండల అధ్యక్షుడు పోరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
మండల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుల నియామకం
వైఎస్సాఆర్ సీపీ మునుగోడు నియోజకవర్గంలోని మండలాలకు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
మర్రిగూడెం మండ లానికి కొప్పు విజయ్‌కుమార్, చండూరు మం డలం మోదుగునాగిరెడ్డి, నారాయణపూర్ మండలం గూడూరు వెంకటరెడ్డి, నాంపల్లి మండలం రఘునందన్, మునుగోడు మండలం శ్రీనివాస్‌లను నియమించారు. అలాగే మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎండి.షరీఫ్, మల్లాది పవన్‌కుమార్‌లను వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.