ఉత్తమ్‌పై గట్టు ఫైర్
నల్గొండ జిల్లా:
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగట్టుశ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి నల్గొండ జిల్లాలో 10 సీట్లు వస్తాయి అనడం సిగ్గుచేటన్నారు. ప్రజాసమస్యలపై ఏనాడూ మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు వస్తాయని గట్టు జోస్యం చెప్పారు. గడ్డాలు మీసాలు పెంచుకొని, ప్రజల ఓటర్ల శక్తిని బొచ్చుతో పోల్చడం విచారకరమన్నారు.