మాట మార్చని చరిత్ర కమ్యూనిస్టులదే.. | TRS Govt failed to fill even 4% of vacant posts: Uttam | Sakshi
Sakshi News home page

మాట మార్చని చరిత్ర కమ్యూనిస్టులదే..

Published Sat, Feb 25 2017 3:28 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

మాట మార్చని చరిత్ర కమ్యూనిస్టులదే.. - Sakshi

మాట మార్చని చరిత్ర కమ్యూనిస్టులదే..

►  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
►  హుజూర్‌నగర్‌ చేరిన మహాజన పాదయాత్ర

హుజూర్‌నగర్‌: ప్రజలకు మాట ఇచ్చి ఆ మాటను ఏనాటికీ మార్చని చరిత్ర కమ్యూని స్టులదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర శుక్రవారం సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలం గాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంఘీ భావం తెలిపారు.

తమ్మినేని మాట్లాడుతూ,  సామాజిక న్యాయం–సమగ్రాభివృద్ధి ఎజెం డాతో తాను పాదయాత్రను చేపడుతున్నట్లు ప్రకటించగానే.. యాత్రను ప్రజలు అడ్డుకో వాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారన్నారు. అయితే తాము తెలంగాణను సమర్థించని మాట వాస్తవమేనని, అయినా ఒకే మాటపై కట్టుబడి ఉన్నామన్నారు. ఒక్కసారికే తమను ముక్కు నేలకు రాయాలని చెప్పిన కేసీఆర్‌... అనేకసార్లు మాట మార్చి తప్పించుకు న్నందుకు 150 సార్లు ముక్కు నేలకు రాయాల్సి ఉంటుందన్నారు.

దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం: ఉత్తమ్‌
ప్రభుత్వం రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రోత్సహిస్తోందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇతర పార్టీల వారిని ప్రలోభ పెట్టి వారి పార్టీలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. రుణమాఫీ ద్వారా రైతుల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, రైతులకు అండగా నిలబడతామని చెప్పిన ప్రభుత్వం మాట నిలుపుకోలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

లక్ష ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలం: గట్టు
ఎన్నికల సందర్భంలో అధికారమే పరమావధిగా నోటికొచ్చిన హామీలి వ్వడం సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికా రంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగుల ఓట్లు దం డుకున్నారే తప్ప నోటిఫికేషన్లు, ఉద్యో గాల భర్తీ ప్రక్రియ జరగడం లేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement