mahajana March
-
తెలంగాణలో దద్దమ్మ పాలన
సర్కార్‌పై తమ్మినేని ధ్వజం మిర్యాలగూడ/వేములపల్లి: తెలంగాణలో దద్దమ్మ పాల న కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్ర శనివారం నల్లగొండ జిల్లా వేములపల్లి, మిర్యాలగూడలో సాగింది. ఆ సభల్లో ఆయన మాట్లాడుతూ సర్కార్ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లో ‘పొలికేక’ పేరిట బహిరంగసభ నిర్వహి స్తున్నట్టు తమ్మినేని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాలకు కేసీఆర్ వత్తాసు పలుకుతూ చిన్నమోదీల వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు. కేరళ సీఎం తలకే వెల కట్టిన ఆర్ ఎస్ఎస్ ప్రముఖున్ని అరెస్టు చేయకపోవడం దారుణమ న్నారు. కాగా, రైస్ మిల్లులను ఆదుకునేందుకు, లక్షలాది మంది ఉపాధిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. -
మాట మార్చని చరిత్ర కమ్యూనిస్టులదే..
► సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ► హుజూర్నగర్ చేరిన మహాజన పాదయాత్ర హుజూర్నగర్: ప్రజలకు మాట ఇచ్చి ఆ మాటను ఏనాటికీ మార్చని చరిత్ర కమ్యూని స్టులదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర శుక్రవారం సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలం గాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంఘీ భావం తెలిపారు. తమ్మినేని మాట్లాడుతూ, సామాజిక న్యాయం–సమగ్రాభివృద్ధి ఎజెం డాతో తాను పాదయాత్రను చేపడుతున్నట్లు ప్రకటించగానే.. యాత్రను ప్రజలు అడ్డుకో వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారన్నారు. అయితే తాము తెలంగాణను సమర్థించని మాట వాస్తవమేనని, అయినా ఒకే మాటపై కట్టుబడి ఉన్నామన్నారు. ఒక్కసారికే తమను ముక్కు నేలకు రాయాలని చెప్పిన కేసీఆర్... అనేకసార్లు మాట మార్చి తప్పించుకు న్నందుకు 150 సార్లు ముక్కు నేలకు రాయాల్సి ఉంటుందన్నారు. దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం: ఉత్తమ్ ప్రభుత్వం రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రోత్సహిస్తోందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇతర పార్టీల వారిని ప్రలోభ పెట్టి వారి పార్టీలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. రుణమాఫీ ద్వారా రైతుల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, రైతులకు అండగా నిలబడతామని చెప్పిన ప్రభుత్వం మాట నిలుపుకోలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలం: గట్టు ఎన్నికల సందర్భంలో అధికారమే పరమావధిగా నోటికొచ్చిన హామీలి వ్వడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికా రంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగుల ఓట్లు దం డుకున్నారే తప్ప నోటిఫికేషన్లు, ఉద్యో గాల భర్తీ ప్రక్రియ జరగడం లేదన్నారు. -
సబ్‌ప్లాన్ చట్టానికి ఎసరు పెడుతున్నారు
మహాజన పాదయాత్రలో తమ్మినేని పాల్వంచ రూరల్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి ఎసరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఉప ప్రణాళిక చట్టాన్ని సవరించబోమని, ఆ చట్టం నిధులు రూ.10 వేల కోట్లు ఇతర పథకాలకు మళ్లించలేదని స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం పాల్వంచ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 వేలకోట్లలో రూ.9 వేల కోట్లు మిషన్ భగీరథకు, రూ.1,000 కోట్లు రవాణా శాఖకు మళ్లీంచారని విమర్శించారు. -
సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరిపెడ: సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఆనేపురం స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ పేదల పక్షం అని చెబుతున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి నామమాత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నాడని ఆరోపించారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. డబుల్బెడ్రూం ఇస్తానన్న మాటే గాని ఎక్కడా అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు విషయంలో కేంద్రానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా నాయకులు, తదితరులున్నారు. -
కార్పొరేట్ల కోసమే అడవుల స్వాధీనం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దేవరుప్పుల: భూసేకరణకు నూతన చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కార్పొరేట్ సంస్థల కోసం అడవులను స్వాధీనం చేసుకునేందుకు గిరిజనులపై పంజా విసురుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీసీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలో ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు జాటోతు ఠాణూనాయక్ స్మారక స్థూపం వద్దకు చేరుకుంది. స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం వీరభద్రం మాట్లాడుతూ హరితహారం పేరిట అడవిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఆదివాసులైన చెంచులు, గోండులు, లంబాడీలు సాగుచేసుకున్న పోడు భూములను హరించడం శోచనీయమన్నారు. -
నిజాంను తలపిస్తున్న కేసీఆర్ పాలన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దేవరుప్పుల: అమరుల ఆత్మత్యాగాలతో సిద్ధించిన తెలంగాణను నిజాం సర్కారును తలపించేలా కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్ర శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం వరకు చేరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక తెలంగాణ న్యాయం కోసం తాము పాదయాత్ర చేస్తుంటుంటే అవహేళన చేసే కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పై చర్చ జరుగుతుంటే గైర్హాజరయ్యారని విమర్శించారు. అమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాలు వద్దు సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. యురేనియం లాంటి ఖనిజ తవ్వకాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. ఎలాంటి చర్చా లేకుండా చుట్టు పక్కల ఉండే గిరిజనులను నిర్వాసితులను చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. ఖనిజ తవ్వకాల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నిలిపివేసిన అభివృద్ధి పనులను తిరిగి చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ప్రజల చైతన్యానికే మహాజన పాదయాత్ర :తమ్మినేని
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని దోమకొండ: ప్రజలను చైతన్యం చేయడానికే తాను మహాజన పాదయాత్ర చేపట్టినట్లు సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్ నుంచి మొదలైన పాద యాత్ర తుజాల్పూర్, బీబీపేట, జనగామ, అంచనూరు, దోమకొండ, లింగుపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. బీబీపేట, దోమకొండల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని, సీఎం అయ్యాక వాటిని అమలు చేయడం లేదన్నారు. ప్రజల సంక్షే మా న్ని విస్మరించి కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూం పథకం కలగా మారిందన్నారు. దళితులకు మూడె కరాల భూమి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది బీడీ కార్మి కులు ఉండగా వారి ఓట్ల కోసం జీవనభృతి అంటూ రాజకీయం చేశారని అన్నా రు. అర్హులైన బీడీ కార్మికులకు నేటికీ జీవనభృతి రావడం లేదన్నారు. వచ్చేసారి ఎన్నికల్లో టీఆర్ఏస్ అధికారంలోకి రాకుండా ప్రజలు చైతన్యవంతులు కావా లన్నారు. తెలంగాణ అంటే కేవలం కేసీఆర్, హరీశ్‌రావులుగా మారిందన్నారు. -
యూపీ ఎన్నికల కోసమే నోట్ల రద్దు
తమ్మినేని వీరభద్రం డిమాండ్ సాక్షి, ఝరాసంగం/హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం సం గారెడ్డి జిల్లా రారుుకోడ్, వట్పల్లి మండలాల్లో మ హాజన పాదయాత్ర సా గింది. సిరూర్లో జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు, చిరుద్యోగులు, కార్మికులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దొంగనోట్లు, నల్లధనం ఉన్న బడాబాబులను వదిలేసి సామాన్యులపై పడడం సరికాదన్నారు. కొత్త నోట్లను ముద్రించేం దుకు 3 నెలల సమయం పడుతుందని, అప్పటివరకు పాత నోట్లు చలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన ఎందుకు పోరాడటం లేదని తమ్మినేని ప్రశ్నించారు. -
కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే
తమ్మినేని వీరభద్రం హైదరాబాద్: కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే సాగుతోందని, ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ కాకుండా బతుకు తెలంగాణ కోసం కృషి చేయాలని సూచించా రు. మహాజన పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్రలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలు చెబుతుంటే కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కావడంలేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ సామాజిక న్యాయం అందడం లేదన్నారు. వెనుకంజలో ఉన్న అన్ని కులాలవారికి విద్య, వైద్యం, ఉపాధి, ఇతర సౌకర్యాలు కల్పించి, అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. వాస్తు పేరుతో కొత్తగా ఉన్న భవనాలు కూల్చి ప్రజాధనాన్ని వృథా చేయొద్దని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. తమ్మినేనికి రేవంత్ ఫోన్ పాదయాత్రలో ఉన్న తమ్మినేనికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి శుక్రవారం ఫోన్ చేశారు. పాదయాత్ర జరుగుతున్న తీరును, ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 1న టీటీడీపీ అగ్రనేతలతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట వద్ద నుంచి పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నామన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సీపీఎం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. వేధింపులు ఆపండి: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న హోంగార్డులపై వేధింపులు ఆపాలని, నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీలతో చితకబాదడం గర్హనీయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, 2004కు ముందు విధుల్లో చేరిన వారికి అప్పటి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని శుక్రవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. -
పాదయూత్రతో కేసీఆర్ కు బెదురు: తమ్మినేని
కందుకూరు: ‘మహాజన పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు బెదురు పుట్టింది. అందుకే పాదయాత్ర మొదలైన ఈ 8 రోజుల్లో 8 వరాలు ప్రకటించారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాదయాత్ర కొనసాగితే ఐదు నెలలు ప్రభుత్వం అల్లాడి పోవాల్సిందేనన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, గూడూరు, కందుకూరు చౌరస్తా, దెబ్బగూడ, నేదునూరు గ్రామాలలో ఆయన పాదయాత్ర చేశారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటివాటిని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తల జేబులు నింపడానికే పథకాలను వాడుకుంటున్నారన్నారు. అగ్రకులాల ఆధిపత్యం తొలగి సామాజిక న్యాయం జరగాలనే అజెండాతో వెళ్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మంత్రి కేటీఆర్ ఆర్భాటంగా మొదలుపెట్టిన మైక్రోమ్యాక్స్ కంపెనీలో స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 1,000 మందికి ఉపాధి లభిస్తుందన్న నాటి మాటలు నీటి మూటలయ్యాయన్నారు. ఇప్పటికైనా స్థానిక యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
బతుకుదెరువు తెలంగాణ కావాలి
తమ్మినేని వీరభద్రం ఇబ్రహీంపట్నంరూరల్/మహేశ్వరం: బంగారు తెలంగాణ కాదు.. బతుకుదెరువు ఉన్న తెలంగాణ కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్, ఎంపీ పటేల్‌గూడ, కొంగర కలాన్ గ్రామాల్లో పూర్తి చేసుకొని, మహేశ్వరం మండలం రావిర్యాల, తుక్కుగూడ గ్రామాల్లో ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సామాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు. 92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీలు బాగుపడకుండా రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఏమాత్రం అందడం లేదని, గ్రామీణ ప్రజలు టీఆర్ఎస్ పాలన, కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు విద్య, ఉపాధి వస్తుందని కలలు కంటే అవి కలలుగానే మిగిలిపోయాయన్నారు. కొంగర కలాన్, అదిభట్ల గ్రామాల్లో ప్రజల వద్ద నుంచి ప్రభుత్వం వందలాది ఎకరాల భూములను కారుచౌకగా తీసుకుందని, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు. కొంగరకలాన్‌లో రైస్‌హబ్‌కు బదులు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట కాలువలు, కట్టలను కబ్జా చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడన్నారు. మహేశ్వరం మండలంలోకి ప్రవేశించిన పాదయాత్రకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో ప్రజావేదిక కన్వీనర్ చంద్రకుమార్, లంబడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వాగ్దానాల అమలేది?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రత్యామ్నాయం లేక ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారన్నారు. ఈ నెల 17న తలపెట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌కు చేరింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజా స్పందన బాగుందన్నారు. ప్రజలు తనకు తెలియ చెబుతున్న సమస్యలపై ప్రతిరోజు సీఎంకు లేఖ రాస్తున్నానన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో ముఖ్యమైన దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం.. ఇవన్నీ ఎక్కడా అమలైన దాఖలాలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం భూములు పంచకుంటే తామే ఆక్రమించి ప్రజలకు పంచుతామన్నారు. సీఎంకు తమ్మినేని లేఖ: కొత్త జిల్లాల ఏర్పాటుకు రాని అడ్డంకి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఏమొచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని, గిరిజనులకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్‌ను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని సీఎంకు రాసిన లేఖలో తమ్మినేని పేర్కొన్నారు. -
పాదయాత్రను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
సీఎం స్పష్టం చేయాలి: తమ్మినేని సాక్షి, హైదరాబాద్: తాము చేపడుతున్న మహాజన పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారా లేక తాము ప్రస్తావిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలపై ఎజెండాను వ్యతిరేకిస్తున్నారా అన్న విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. 2004 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో, మళ్లీ 2009 ఎన్నికల్లో మహాకూటమిలో టీడీపీ,సీపీఐ, సీపీఎంలతో టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకున్నపుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయంలో సీపీఎం తీసుకున్న నిర్ణయం గుర్తుకు రాలేదా అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిలదీశారు. తాము ఏనాడూ తెలంగాణను వ్యతిరేకించలేదని, పార్టీ విధానానికి అనుగుణంగా వ్యవహరించామన్నారు. శుక్రవారం ఎంబీ భవన్లో పార్టీనాయకులు బి.వెంకట్, డీజీ నరసింహారావు, టి.సాగర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎం పాదయాత్రను అడ్డుకోవాలంటూ అధికారపక్షం పిలుపునివ్వడం అప్రజాస్వామికమన్నారు. కొత్త జిల్లాలను రాజకీయ అవసరాల కోసమే చేశారన్నారు. సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 17 నుంచి చేపడుతున్న పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమస్యలు తెరపైకి వస్తాయి కనుకనే అధికారపక్షం తమ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లింలకు రంజాన్ సందర్భంగా బిర్యానీ ప్యాకెట్, జత దుస్తులిచ్చి చేతులు దులుపుకోవడంవల్ల వారి సమస్యలు పరిష్కారం కావన్నారు. బీసీలకు కూడా ఏవో ఎంగిలి మెతుకులు వేయడం కాకుండా జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలన్నారు.