కార్పొరేట్‌ల కోసమే అడవుల స్వాధీనం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
దేవరుప్పుల: భూసేకరణకు నూతన చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కార్పొరేట్ సంస్థల కోసం అడవులను స్వాధీనం చేసుకునేందుకు గిరిజనులపై పంజా విసురుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీసీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలో ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు జాటోతు ఠాణూనాయక్ స్మారక స్థూపం వద్దకు చేరుకుంది. స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం వీరభద్రం మాట్లాడుతూ హరితహారం పేరిట అడవిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఆదివాసులైన చెంచులు, గోండులు, లంబాడీలు సాగుచేసుకున్న పోడు భూములను హరించడం శోచనీయమన్నారు.