నిజాంను తలపిస్తున్న కేసీఆర్‌ పాలన | Tammineni veera badram commented on cm KCR | Sakshi
Sakshi News home page

నిజాంను తలపిస్తున్న కేసీఆర్‌ పాలన

Published Sun, Jan 8 2017 2:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

Tammineni veera badram commented on cm KCR

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
దేవరుప్పుల: అమరుల ఆత్మత్యాగాలతో సిద్ధించిన తెలంగాణను నిజాం సర్కారును తలపించేలా కేసీఆర్‌ కుటుంబం పాలన  సాగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్ర శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం వరకు చేరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక తెలంగాణ న్యాయం కోసం తాము పాదయాత్ర చేస్తుంటుంటే అవహేళన చేసే కేసీఆర్‌ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పై చర్చ జరుగుతుంటే గైర్హాజరయ్యారని విమర్శించారు.  

అమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాలు వద్దు  
సాక్షి, హైదరాబాద్‌: నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. యురేనియం లాంటి ఖనిజ తవ్వకాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. ఎలాంటి చర్చా లేకుండా చుట్టు పక్కల ఉండే గిరిజనులను నిర్వాసితులను చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. ఖనిజ తవ్వకాల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నిలిపివేసిన అభివృద్ధి పనులను తిరిగి చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement