సబ్‌ప్లాన్ చట్టానికి ఎసరు పెడుతున్నారు
మహాజన పాదయాత్రలో తమ్మినేని
పాల్వంచ రూరల్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి ఎసరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఉప ప్రణాళిక చట్టాన్ని సవరించబోమని, ఆ చట్టం నిధులు రూ.10 వేల కోట్లు ఇతర పథకాలకు మళ్లించలేదని స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం పాల్వంచ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 వేలకోట్లలో రూ.9 వేల కోట్లు మిషన్ భగీరథకు, రూ.1,000 కోట్లు రవాణా శాఖకు మళ్లీంచారని విమర్శించారు.