ప్రజల చైతన్యానికే మహాజన పాదయాత్ర :తమ్మినేని | mahajana march for awareness people tammineni Veerabhadram | Sakshi
Sakshi News home page

ప్రజల చైతన్యానికే మహాజన పాదయాత్ర: తమ్మినేని

Dec 2 2016 3:22 AM | Updated on Sep 4 2017 9:38 PM

ప్రజల చైతన్యానికే మహాజన పాదయాత్ర  :తమ్మినేని

ప్రజల చైతన్యానికే మహాజన పాదయాత్ర :తమ్మినేని

ప్రజలను చైతన్యం చేయడానికే తాను మహాజన పాదయాత్ర చేపట్టినట్లు సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
దోమకొండ: ప్రజలను చైతన్యం చేయడానికే తాను మహాజన పాదయాత్ర చేపట్టినట్లు సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్ నుంచి మొదలైన పాద యాత్ర తుజాల్‌పూర్, బీబీపేట, జనగామ, అంచనూరు, దోమకొండ, లింగుపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. బీబీపేట, దోమకొండల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధినేతగా కేసీఆర్ ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని, సీఎం అయ్యాక వాటిని అమలు చేయడం లేదన్నారు.

ప్రజల సంక్షే మా న్ని విస్మరించి కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్‌రూం పథకం కలగా మారిందన్నారు. దళితులకు మూడె కరాల భూమి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు.  రాష్ట్రంలో ఆరు లక్షల మంది బీడీ కార్మి కులు ఉండగా వారి ఓట్ల కోసం జీవనభృతి అంటూ రాజకీయం చేశారని అన్నా రు. అర్హులైన బీడీ కార్మికులకు నేటికీ జీవనభృతి రావడం లేదన్నారు. వచ్చేసారి ఎన్నికల్లో టీఆర్‌ఏస్ అధికారంలోకి రాకుండా ప్రజలు చైతన్యవంతులు కావా లన్నారు. తెలంగాణ అంటే కేవలం కేసీఆర్, హరీశ్‌రావులుగా మారిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement