యూపీ ఎన్నికల కోసమే నోట్ల రద్దు
తమ్మినేని వీరభద్రం డిమాండ్
సాక్షి, ఝరాసంగం/హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం సం గారెడ్డి జిల్లా రారుుకోడ్, వట్‌పల్లి మండలాల్లో మ హాజన పాదయాత్ర సా గింది. సిరూర్‌లో జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు, చిరుద్యోగులు, కార్మికులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
దొంగనోట్లు, నల్లధనం ఉన్న బడాబాబులను వదిలేసి సామాన్యులపై పడడం సరికాదన్నారు. కొత్త నోట్లను ముద్రించేం దుకు 3 నెలల సమయం పడుతుందని, అప్పటివరకు పాత నోట్లు చలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన ఎందుకు పోరాడటం లేదని తమ్మినేని ప్రశ్నించారు.