వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
దొండపాడు(మేళ్లచెర్వు), న్యూస్‌లైన్ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుని విజయభేరి మోగి స్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని దొండపాడు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు గున్నంనాగిరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బలంగా ఉన్న ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందన్నారు. స్థానికంగా కాంగ్రెస్, టీడీపీ, బీ జేపీ యేతర పార్టీలతో పొత్తులు ఉంటాయన్నారు.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఒకే నెలలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే హుజూర్‌నగర్ నియో జకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మేళ్లచెర్వు మండలం దొండపాడు, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలు, పులిచింతల ముంపు గ్రా మా ల ప్రజలకు పునరావాస ప్యాకేజీ, మం డలంలోని పరిశ్రమలకు పూర్తి స్థాయి సౌ లభ్యాలు, ఇతర అభివృద్ధి పనులు రాజశేఖరరెడ్డి హ యాంలోనే జరిగినట్లు చెప్పారు.
గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే, మం త్రిగా ఉన్న ప్రస్తు త టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలానికి ఒక్క పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను గానీ తీసుకరాలేక పోయారని విమర్శించారు. ఆయన వెంట వేముల శేఖర్‌రెడ్డి, మల్లయ్య యాదవ్, విజయభాస్కర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.