జగన్ ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలి | Y.S jagan mohan reddy Odarpu Yatra starts on 9th in nalgonda district | Sakshi
Sakshi News home page

జగన్ ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలి

Published Sun, Mar 2 2014 4:44 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Y.S jagan mohan reddy  Odarpu Yatra starts on 9th in nalgonda district

 వెఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9 నుంచి జిల్లాలో చేపడుతున్న ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని  జీర్ణించుకోలేక గుండె పగిలి మృతిచెందిన
 కుటుంబాలను పరామర్శించేందుకే ఓదార్పుయాత్రను నిర్వహిస్తున్నారన్నారు.

వైఎస్సార్ అభిమానులు జగన్ రాక కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు.  వైఎస్సార్ హయాంలో  అమలుచేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన బడుగు, బలహీన వర్గాలు, రైతులు ఆయన పాలనను మరువలేకపోతున్నారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి వైఎస్సార్ స్వర్ణయుగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement