odarpu yatra
-
తాత దొంగతనం గురించి నిజం చెప్పాల్సింది!
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ఓదార్పు యాత్ర.. పేలవమైన ప్రసంగాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించేలా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలను చదవలేక ఇబ్బంది పడుతున్న ఆమె.. భర్తకు సంఘీభావంగా ఇస్తున్న స్టేట్మెంట్లతో ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీస్తున్నాయి. తాజాగా తిరుపతిలో నిర్వహించిన సభలో తెలుగుదేశం మహిళా నేతలు ఆమెను వెరైటీగా ప్రశ్నలు అడగడం.. ఆ ప్రశ్నలతో అయోమయానికి గురైన ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. అందులో తాతామనవడి సెంటిమెంట్‌ను పండించేందుకు ఆమె పడిన తాపత్రయం నవ్వులపాలు జేస్తోంది. ‘తాత ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడు.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదు. చిన్న వయసు కావడంతో తనకు చెప్పదల్చుకోలేదు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం’ అని తెదేపా నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అధికార మదంతో, పైగా అధికారుల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేశారని ఆధారాలతో సహా బయటపెట్టింది దర్యాప్తు సంస్థ. అలాంటిది ప్రజల సొమ్ము దొంగతనం చేసి జైలుకు వెళ్లిన 73 ఏళ్ల తాత గురించి.. తొమ్మిదేళ్ల వయసున్న మనవడికైనా కనీసం నిజం చెప్పాల్సిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. తిరుపతిలో నారా భువనేశ్వరి నిర్వహించిన నిజం గెలవాలి సభలో పలువురు @JaiTDP నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, నాయకుడు పులివర్తి నానిలను వేదికపైకి పిలవకపోవడంతో వారు సభ నుంచి అలిగి వెళ్ళిపోయారు. అలాగే భువనేశ్వరి ప్రసంగం పేలవంగా… — YSR Congress Party (@YSRCParty) October 26, 2023 -
భువనేశ్వరి యాత్ర ఉద్దేశం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అవినీతి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర నిర్వహిస్తారన్న సమాచారం వచ్చింది. భువనేశ్వరి నిజం గెలవాలి అనే బ్యానర్‌తో తిరుగుతారట. వాస్తవమే.. నిజం గెలవాలి! ఏ నిజం గెలవాలి? అన్నదే ప్రశ్న. మొన్నటి వరకు న్యాయం గెలవాలి అన్నారు. ఇప్పుడు నిజానికి మారారు. ఏది నిజమో? ఏది అబద్దమో? ప్రజలకు తెలియకుండా చేయాలన్న వారి ఆలోచన కనబడుతూనే ఉంది. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుల్లో గట్టిగా వాదించలేకపోతున్న తరుణంలో.. ప్రజల్ని ఏమార్చడానికి భువనేశ్వరి ఈ కార్యక్రమం తీసుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత నిజంగానే ఎవరైనా దానిని తట్టుకోలేక మరణించారా ? అనేది కూడా చూడాలి. అది ఎంతవరకు నిజమనేది కూడా భువనేశ్వరి ఆలోచించుకోవాలి. గతంలో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేసిన సందర్భం వేరు. ఆ పరిస్థితులువేరు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.అది ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ప్రజలందరిని తీవ్రంగా కలచి వేసింది. కొందరు ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుకో, మరో తీవ్ర అస్వస్థతతోనో మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియానే సంబంధిత వివరాలను కవర్ చేసింది కూడా. వాటి ఆధారంగానే జగన్ అలా మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ✍️అప్పట్లో జగన్ కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయా కుటుంబాలవారిని ఒకచోటకు తెచ్చి సాయం చేయాలని సూచించారు. ఓదార్పు యాత్ర మాదిరి వారి ఇళ్లకు వెళ్లవద్దని ఆదేశించారు. కానీ, అందుకు జగన్ ఒప్పుకోలేదు.అలా అందరిని ఒకచోటకు తీసుకు వచ్చి సాయం చేయడం మర్యాద కాదని అభిప్రాయపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ లోని ఒక వర్గం ఇదంతా జగన్ తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి, సీఎం పదవి పొందడానికి అని పితూరీలు చేసేది. వారినెవరిని ఆయన ఖాతరు చేయలేదు.తను అనుకున్న బాటలోనే ఆయన ముందుకు వెళ్లారు. ఏదో రకంగా కేసులుపెడతారని తెలిసినా జగన్ వెనక్కి తగ్గలేదు. అది ఆయన ధైర్యం. కొందరుదానిని మొండి తనం అని అన్నా ఆయన పట్టించుకోలేదు. చివరికి నిజంగానే ఆయన దాని కారణంగా అనేక కష్టాలు పడ్డారు. జైలుకు వెళ్లేలా తప్పుడు కేసులుపెట్టారు. సోనియాగాంధీకి తోడు చంద్రబాబునాయుడు కూడా తోడై జగన్ ను ఇబ్బంది పెట్టడానికి పోటీపడ్డారు. వాటన్నిటిని ఎదుర్కుని 2014 విభజిత శాసనసభ ఎన్నికలలో పోటీచేసినా, ఆయన అధికారంలోకి రాలేకపోయారు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమై తనకంటూ ఒక ఎజెండా తయారు చేసుకుని ప్రజలలోకి వెళ్లి వారి మన్ననలు పొందారు. అది అప్పటి చరిత్ర. మరి ఇప్పుడు.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో మామూలుగా జనంలో తిరిగితే తిరగవచ్చు. కానీ ఆమె ఓదార్పు యాత్ర చేస్తారన్నదే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. ముందుగా చంద్రబాబు అరెస్టు కారణంగానే ఎవరైనా మరణించారా? అనే విషయాన్ని ఆమె నిర్ధారించుకోవాలి. ఎందుకంటే టీడీపీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివే ఏదో పేరుకు అలాంటి వార్తలు ఇస్తున్నారు తప్ప.. వారికి తెలుసు అవన్నీ అవాస్తవాలని!. అందుకే ఆ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మరో వైపు ఈనాడు, ఆంద్రజ్యోతిలలో వచ్చిన విధంగా ఎవరైనా చంద్రబాబు కోసమే మరణించారా? అని సాక్షి మరికొన్ని మీడియా సంస్థలు కూపీ లాగి అసలు విషయాలు బయటపెట్టేస్తున్నారు. ✍️ఏ ఊళ్లో ఎవరు మరణించినా వారిని ఈ ఖాతాలో వేశారని.. పేర్లు,వారికి ఉన్న వ్యాధి,మరణించిన తీరు మొదలైనవాటిని ప్రచురిస్తున్నారు. అలాంటప్పుడుఈ విషయంలోనే నిజం చెప్పలేని టీడీపీ నేతలు.. భువనేశ్వరితో నిజం గెలవాలి అని ఎలా కార్యక్రమం చేపడతారో తెలియదు. ఎవరైనా అవినీతికేసులో అరెస్టు అయితే వారి కోసం కొందరు మరణించే పరిస్థితి ఉంటుందా?. ఒక నాయకుడి మరణానికి, ఒక నాయకుడి అరెస్టుకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించలేరా?. జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పుడు దానిని కాంగ్రెస్‌లోని ఒకవర్గంతో పాటు తెలుగుదేశం కూడా తప్పు పట్టింది. మరి ఇప్పుడు భువనేశ్వరి అలాంటి ఓదార్పు యాత్రను చేయడం ఎంతవరకు నైతికంగా సమంజసం?. ✍️ప్రతిదానిలో డబుల్ గేమ్ ఆడడం టీడీపీకి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచే అలవాటు. ఇప్పుడు భువనేశ్వరి అదే దారిలో వెళ్లబోతున్నారా? జనంలోకి వెళ్లి ఏమని చెబుతారు?. ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని ఆరోపిస్తారు. ఇప్పటికే ఆ పని చేస్తున్నారు. చంద్రబాబు కాని, ఆయన లాయర్లుకాని చెప్పలేని నిజాలు ఏమైనా భువనేశ్వరి చెబుతారా? సెక్షన్17ఏ చంద్రబాబుకు వర్తించదని కోర్టులు అభిప్రాయపడడం తప్పు అని ఆమె చెబుతారా. దానిని నిజం అని నమ్మమని ఆమె చెబుతారా?. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు పారిపోయిన విషయం అవాస్తవమని చెబుతారా?. టీడీపీకి ఖాతాకు నేరుగా రూ.27 కోట్లు వచ్చాయని సీఐడీ అభియోగం మోపింది. ఆ డబ్బు పార్టీ ఖాతాలోకి రాలేదని రుజువుచేసే పరిస్థితి భువనేశ్వరికి ఉంటుందా? చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే చివరికి 17ఏని పక్కనబెట్టి ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని మద్యంతర బెయిల్ ఇవ్వాలని, కావాలంటే మళ్లీ జైలుకు పంపవచ్చని అనడం నిజం కాదని భువనేశ్వరి అనగలరా? తన కుమారుడు లోకేష్ ఈ కేసులో చంద్రబాబు అరెస్టు అయింది మొదలు డిల్లీలోనే ఎక్కువ రోజులు ఎందుకు బస చేస్తున్నారు? అందులో ఉన్న మతలబు ఏమిటో ఆమె వివరిస్తారా? ప్రజల కోట్ల సొమ్ము చంద్రబాబు బృందం స్వాహా చేసిందన్నది సీఐడీ ఆరోపణ. అలా జరగలేదని భువనేశ్వరి అంటారు.ఓకే. మరి నిజం ఏమిటో కూడా ఆమె తెలియచేయాలి కదా? ప్రజలను మభ్య పెట్టి సానుభూతి పొందాలన్న ప్రయత్నం చేయడమే తప్ప ఆమె నిజం చెప్పడానికి ఓదార్పు యాత్ర చేయరన్న సంగతి తెలుస్తూనే ఉంది. చంద్రబాబు బెయిల్ కోసం ఎందుకు భువనేశ్వరి మొదటే యత్నించలేదు? ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు చంద్రబాబును రిమాండ్‌లో పెట్టాయన్న సంగతి భువనేశ్వరికి తెలియదా? చంద్రబాబును విడిచిపెట్టాల్సింది కోర్టులు తప్ప, ఏపీ సీఐడీనో, లేక ప్రభుత్వమో కాదన్న సంగతి భువనేశ్వరికి తెలియదా?. చంద్రబాబు మాజీ పీఎస్. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్ చాలా రోజులు కనిపించకుండా వెళ్లి, ఒకరోజు సీఐడీ విచారణకు హాజరై, రెండో రోజు గాయబ్ అవడంలో ఆంతర్యం ఏమిటోకూడా భువనేశ్వరి తెలుపుతారా? జీఎస్టీ అధికారులు, ఈడీ అధికారులు ఇప్పటికే ఈకేసును చెప్పట్టడం నిజం కాదని ప్రజలకు ఆమె చెప్పగలరా? ✍️ప్రస్తుతానికి ఇది ఒక్కటే కేసు కాదు. ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ నెట్ కేసులు ఎదురు చూస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లింగమనేని రమేష్ ఇంటికి భువనేశ్వరి ఎందుకు రూ. 27 లక్షల అద్దె చెల్లించారు? ఆమెకు ఈ ఇంటికి ఏమి సంబంధం. అది ప్రభుత్వ భవనమని కదా గతంలో ఆమె భర్త ప్రచారం చేసింది?. హెరిటేజ్ సంస్థ పేరుతో కంతేరు వద్దే ఎందుకు భూమి కొనుగోలు చేశారో కూడా ప్రజలకు నిజం చెబుతారా?ఇక లోకేష్ కూడా భవిష్యత్తుకు గ్యారంటీ అనే ప్రచారం చేపడతారట. ఆ హామీలే పెద్ద బోగస్ .వాటిని ప్రజలకు చెప్పడం అంటే వారిని మోసం చేయడమే. అసలు లోకేష్ భవిష్యత్తుకే గ్యారంటీ లేని పరిస్థితిలో ఆయన జనానికి ఏమి గ్యారంటీ ఇస్తారో తెలియదు. ఏది ఏమైనా తల్లి ,కొడుకులు మాత్రమే జనంలో పర్యటనలు చేస్తారా?లేక కోడలు బ్రాహ్మణి కూడా రంగంలో దిగుతారా అన్నది తెలియదు. తమ యాత్రల ద్వారా సానుభూతి సంపాదించాలన్న వారి యత్నం వికటించడానికే ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నారాయణరావు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
-
వైఎస్సార్ అంటే చాలా ఇష్టం అంటున్న ప్రజలు..!
-
ప్రజల్లో ఒకడిగా, ప్రజలతో కలిసి వైఎస్ జగన్..!
-
సీఎం జగన్ ఓదార్పు యాత్ర అరుదైన వీడియో
-
సీఎం జగన్ ఓదార్పు యాత్రలో ఆసక్తికర ఘటన
-
సీఎం జగన్ ఓదార్పు యాత్రకు జనం విశేష స్పందన
-
సీఎం జగన్ ఓదార్పు యాత్రలో జై జగన్ నినాదాలు
-
అభిమాని ఇంట్లో ఆప్యాయంగా భోజనం చేసిన సీఎం జగన్
-
ఓదార్పు యాత్రలో కనీవినీ చూడని ఘటన
-
జనం తో మమేకమైన సీఎం జగన్ ఓదార్పు యాత్ర
-
వైఎస్ఆర్ గారి వార్త విని.. మా ఆయన టీవీ చూస్తూ చనిపోయాడు
-
సీఎం జగన్ మా ఇంటికి వచ్చి చెప్పిన విషయం ఇదే..
-
వైఎస్ఆర్ గురించి సీఎం జగన్ ఎంత గొప్పగా చెప్పారో..!
-
సీఎం జగన్ మా తోబుట్టువే మమ్మల్ని ఆదరించడానికి వచ్చినట్లు ఉంది
-
సీఎం జగన్ గొప్ప మనసుపై ఏపీ ప్రజలు ఎమోషనల్
-
జగన్ అంటే అది మరీ...
-
సీఎం జగన్ ఓదార్పు యాత్రపై ప్రజలు ఎమోషనల్
-
ప్రజలతో కలిసిపోయి వాళ్ళ కష్టాలు తీర్చిన సీఎం జగన్
-
అప్పట్లో సీఎం జగన్ ఓదార్పు యాత్రలో అద్భుతం
-
అప్పట్లో సీఎం జగన్ కాన్వాయ్ లో జన సముద్రం..
-
జగన్ కోసం జన సముద్రం..
-
ఓదార్పు యాత్రను గుర్తుచేసుకున్న సీఎం జగన్
-
ఓదార్పు యాత్రపై చంద్రబాబు కామెంట్స్ కు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
ఓదార్పు యాత్ర చేస్తా అని సోనియా గాంధీ దగ్గరకు వెళితే ఏమన్నారో తెలుసా..!
-
జగనన్నే మా ప్రాణం.. జగనన్నే మా ఊపిరి..
-
జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే... ఓదార్పు యాత్ర సాంగ్
-
YSR ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు..
-
తనవారికోసం అర్ధరాత్రిలో కూడా సీఎం జగన్ ఓదార్పు యాత్ర
-
ఆ మహానుభావుడు మనందరి గుండెల్లో బ్రతికే ఉన్నాడు
-
ఆ మహానుభావుడు మనందరి గుండెల్లో బ్రతికే ఉన్నాడు
-
వైఎస్సార్ చేసిన సంక్షేమం ఎవ్వరూ చేయలేరు ఒకవేళ చేయాలంటే జగనే చేయాలి
-
వైఎస్సార్ పై ఈ పెద్దాయన పాట వింటే కన్నీళ్లు ఆగవు
-
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ..ఒక్కసారిగా దద్దరిల్లిన సభా ప్రాంగణం
-
అప్పుడు ఇప్పుడు అస్సలు తగ్గని సీఎం జగన్ ఫాలోయింగ్
-
నాన్నని తలుచుకొని ఎమోషనల్ అయిన సీఎం జగన్
-
వైఎస్సార్,జగన్ గురించి చెప్తూ..కన్నీళ్ళు పెట్టుకున్న పబ్లిక్
-
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
అమ్మా.. నేనూ నీ బిడ్డనే..!
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అభిమానుల హృదయాల్లో అలజడి రేపింది.. విషాదంలో నిండిపోయారు.. తట్టుకోలేని గుండెలు ఆగిపోయాయి.. మహానేత వారసుడిగా యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఓదార్చే బాధ్యత తీసుకున్నారు. రాష్ట్రంలో నలుమూలల చనిపోయిన అభిమానుల ఇంటికి వెళ్లి వెన్నుతట్టి నేనున్నానంటూ ఓదార్చారు.. కృష్ణాజిల్లాలో 60 మంది మృతి చెందగా వారి కుటుంబాలను కలుసుకుని భరోసా ఇచ్చారు. నాటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడి నేడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తుండడంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విజయవాడ: వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లాలో 2011 ఆగస్టు 16న ఓదార్పు యాత్ర ప్రారంభించారు. జిల్లాలోని సుమారు 1150 కిలోమీటర్లు పర్యటించి 26 మండలాల్లోని 60 కుటుంబాలను ఆయన వ్యక్తిగతంగా కలసి ఓదార్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. అడుగడుగునా ప్రజాభిమానం.. కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను జగ్గయ్యపేటలో ప్రారంభించి సెప్టెంబర్ ఒకటి నాటికి నూజివీడు చేరారు. సెప్టెంబర్ 2వ తేదీ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కావడంతో ఆయన ఇడుపులపాయ వెళ్లి అక్కడ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించి, తిరిగి సెపెంబర్ 6న నూజివీడులో ప్రారంభించారు. మచిలీపట్నం, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో ఓదార్పు యాత్రను ముగించారు. ఈ సందర్భంగా 60 కుటుంబాలను ఆయన వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓదార్పు యాత్ర అర్ధరాత్రి 2 గంటల వరకు సాగేది. నిర్ణీత సమయం కంటే ఐదారు గంటలు ఆలస్యంగా నడిచేది. అయితే అభిమానులు, కార్యకర్తల కోరికను ఏనాడు జగన్ తిరస్కరించలేదు. ఎంతో ఓర్పుగా ఓదార్పును నిర్వహించారు. అర్ధరాత్రి అయినా ఆయన కోసం అభిమానులు వేచి చూసేవారు. జననేత సీఎం కావడంపై సంతోషం గుణదల(విజయవాడ ఈస్ట్): విజయవాడ క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన మట్టా కోటేశ్వరరావు అలియాస్ ఇమ్మానియేలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఆయన మరణంతో తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు. దీంతో భార్య విజయ, పిల్లలు విజయ్, అజయ్ అనాథలయ్యారు. జననేత వైఎస్ జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడకు వచ్చి.. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా ఇచ్చారు. కన్నీరు దిగమింగిన ఆ కుంటుంబం జగనన్న రాకతో ఊరట చెందింది. తమకు భరోసా కల్పించిన జననేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంపై ఆ కుంటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. అమ్మా.. నేనూ నీ బిడ్డనే..! నందిగామ: నందిగామ నియోజకవర్గ పరిధిలో ముగ్గురు కన్నుమూశారు. వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామానికి చెందిన మంగలపూడి నాగభూషణం, అదే గ్రామానికి చెందిన పాపట్ల మరియమ్మ, కంచికచర్లకు చెందిన నాగరాజు మృతిచెందడతో 2011, ఆగస్టు 19న వచ్చిన మృతుల కుటుంబాలను సందర్శించిన జన నేత జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. మహా నేత ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే తన లక్ష్యమని చెప్పి వారిలో ధైర్యం నింపారు. జన హృదయ నేత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనుండటంతో ప్రస్తుతం ఆయా కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఎటువంటి భేషజం లేకుండా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా, తమకు అత్యంత ఆప్తుడిగా మెలిగిన తమ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని, ఆ క్షణాలు తమ జీవిత కాలం గుర్తుండిపోతాయంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెబుతున్నారు. పుష్కరాలలో.. కృష్ణా పుష్కరాల సందర్భంగా 2016, ఆగస్టు 16వ తేదీన నందిగామ పట్టణంలోని ఓ కళాశాలలో చదువుతున్న నందిగామ, చందర్లపాడు, వీరులపాడు మండలాలకు చెందిన విద్యార్థులు పాశం గోపిరెడ్డి(19), కూచి లోకేష్(20), కమ్మవరపు హరిగోపి(20), ములకలపల్లి హరీష్(19), నందిగామ నగేష్ (20), కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. చందర్లపాడు మండలంలోని ఏటూరు, గుంటూరు జిల్లాలోని జిడుగు మధ్య కృష్ణా నదిలో పడి మృతిచెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో అదే ఏడాది 18న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చారు. దాదాపు ఒక రోజుపాటు వారిని పరామర్శించేందుకు సమయం పట్టింది. వారిని ఆప్యాయంగా పలుకరించి, తాను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు జగన్ ఓదార్చారు. -
ఇది ఒక ఆత్మీయ స్పర్శ
-
వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రచారం
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రభంజనం
-
‘బాబు’ అంత నీచుడు దేశంలోనే లేడు
ఈ మాటలన్నది నేనుకాదు ఎన్టీఆర్ ‘ఓదార్పు’తో ప్రజలకు చేరువైన జగన్ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీదే గెలుపు వైఎస్, ఎన్టీఆర్, జగన్ పేర్లతోనే గెలుస్తా ‘సాక్షి’ టీవీతో పార్టీ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ‘‘మా నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వారెన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్, జగన్మోహన్రెడ్డి పేర్లతోనే ప్రజల ముందుకెళ్లి ఓట్లు వేయాలని అడుగుతున్నా. వారు అమలుచేసిన, ప్రకటించిన సంక్షేమ పథకాలను వారికి వివరిస్తున్నా. నా గెలుపు ఖాయం. మరో 16 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహానేత కుమారుడు జగన్మోన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తథ్యం’’ అని వైఎస్సార్ సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. చంద్రబాబు కన్నా నీచుడు దేశంలో ఎవరూ లేరని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. బాబు పరిపాలించిన తొమ్మిదేళ్లూ అన్నివర్గాల ప్రజలను నానా అగచాట్లకు గురిచేశాడని విమర్శించారు. అందుకే ఆయన్ను కాదని 2004 ఎన్నికల్లో ప్రజలు వైఎస్.రాజశేఖరరెడ్డికి పట్టంగట్టార పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడని దుయ్యబట్టారు. అప్పట్లోనే బాబు అంత నీచుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబు ఓ చవటని, అందుకే తన పార్టీలో చవటలందరికీ చోటు ఇచ్చి కార్పొరేట్ వ్యవహారాలకు తెర లేపుతున్నారని ఎద్దేవాచేశారు. తన తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను చిత్రహింసలకు గురిచేసి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తానే గొప్పవాడినని, తానే నీతిమంతుడినని, తన పాల నలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెబుతున్న బాబును వరుసగా 2004, 09 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్మే రోజులు పూర్తిగా పోయాయన్నారు. ఆయన ఇక జీవితంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వలేరని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలు దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై చూపుతున్నారని పేర్కొన్నారు. ఓదార్పు యాత్రతో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువయ్యారని నాని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోని ప్రజల కష్టాల్ని తెలుసుకున్న ఆయన్నే ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా చివరికి గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. మరో 16 రోజుల్లో నూతన రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా మహానేత కుమారుడు జగన్మోన్రెడ్డి బాధ్యతలు చేపడతారని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల రోడ్ షోలు
-
హుజూర్నగర్ నుంచే ఓదార్పు యాత్ర : వైఎస్ జగన్
నల్లగొండ: రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే తన సోదరి షర్మిల ఓదార్పు కార్యక్రమం మొదలుపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్‌లో జరిగిన వైఎస్ఆర్ జనభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ సిపికి మద్దతు ఇవ్వండి, వైఎస్ఆర్ సువర్ణయుగం తెచ్చుకుందాం అని పిలుపు ఇచ్చారు. సిఎం అంటే ఇలాగే ఉండాలని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు వైఎస్ఆర్ చూడలేదన్నారు. ప్రతి పేదవాడి మనసు ఎరిగి ఆయన పాలన చేశారని చెప్పారు. రాష్ట్రాలు విడగొట్టారు కానీ తెలుగు జాతిని, తెలుగు ప్రజలను విడగొట్టలేదన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయం అంటే విశ్వసనీయత ఉండాలన్నారు. రాజకీయం అంటే ప్రతి పేదవాడి మనసు తెలుసుకోవాలని చెప్పారు. కానీ నేటి రాజకీయాలు పూర్తీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఒక చదరంగంలా మారిపోయాయన్నారు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు. విశ్వసనీయత, నిజాయితీ ఒక వైపున ఉన్నాయని, కుళ్లు,కుతంత్రాలు మరో వైపున ఉన్నాయని అన్నారు. -
మనమంతా ఒక్కటవుదాం: వైఎస్ జగన్
* 4 సంక్షేమ సంతకాలతోపాటు ఐదో పనిగా రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం: వైఎస్ జగన్ * తెలుగుజాతి మొత్తం ఒక్కటవుదాం.. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం * ఇటు సమస్య వస్తే అక్కడి తెలుగు బిడ్డలు.. అటు సమస్య వస్తే ఇక్కడి తెలుగు బిడ్డలు అండగా నిలుద్దాం * మనకు అన్యాయం చేసిన వారిని బంగాళాఖాతంలో కలిపేద్దాం * మన రాష్ట్రానికి మంచి చేసేవారిని, డబ్బులిచ్చేవారినే ప్రధానిని చేద్దాం * రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు అబద్ధాల హామీలిస్తున్నారు * అన్నీ ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు * మన బడ్జెట్ రూ. లక్షా 25 వేల కోట్లయితే.. ఆయన మాఫీల లెక్క రూ. లక్షా 60 వేల కోట్లు * నేను ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వలేను.. సాక్షి, గుంటూరు: ‘‘నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర చరిత్రను మార్చే నాలుగు సంతకాలను చేయడంతోపాటు మనమంతా కలిసి ఐదో పనిగా రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. ఇందుకు తెలుగు జాతి మొత్తం ఒక్కటవుదాం. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉన్న తెలుగు బిడ్డలు తోడుగా రావాలి. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు బిడ్డలు వారికి అండగా నిలబడాలి. ఐదో పని కోసం మనమంతా ఒక్కటవ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘తెలుగుజాతి ప్రజలంతా ఒక్కటై 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం.. అప్పుడు మన రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారో..మేలు చేస్తారో.. డబ్బులిస్తారో.. వారినే ప్రధాన మంత్రి సీటులో కూర్చోబెడదాం. చంద్రబాబు చెబుతున్న సింగపూర్ కంటే మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. అందరి గుండెలూ ఒక్కటై అన్యాయం చేసిన వారిని బంగాళాఖాతంలో కలిపేద్దాం’’ అని ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్మోహన్రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర నిర్వహించారు. రాత్రి ఎనిమిది గంటలకు మాచర్ల పట్టణంలోని అంబేద్కర్‌పార్కు సెంటర్లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ఇవాళ్టికీ బాబు భయానక పాలన గుర్తుంది.. ‘‘వైఎస్ సువర్ణ యుగానికి ముందు రాష్ట్రంలో భయానక పరిపాలన సాగుతుండేది. అది చంద్రబాబు నాయుడి పాలన. అవ్వా తాతలకు ముష్టేసినట్లు రూ. 70 పెన్షన్ ఇచ్చే రోజులవి. గ్రామాల్లో అప్పటికే పెన్షన్ పొందుతున్న ఒకరు చనిపోతే తప్ప కొత్తవారికి పెన్షన్ ఇవ్వని రోజులవి. గ్రామాల్లో పిల్లల్ని పెద్ద చదువులు చదివించడానికి తల్లిదండ్రులు ఉన్న అర ఎకరా, ఎకరా భూమి అమ్మేయక తప్పని భయానక రోజులు ఇవాళ్టికీ గుర్తున్నాయి. రూ. 2కే కిలో బియ్యం ఇస్తానని చెప్పి.. ముఖ్యమంత్రి అయ్యాక బియ్యాన్ని రూ. 5.25 పైసలు చేశారు ఇదే చంద్రబాబు. అక్కాచెల్లెళ్ళను మోసం చేసేందుకు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం చేస్తున్నారు కదా అని ప్రతి అక్కా చెల్లెమ్మ ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నికలు అయిపోయాక, మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం అంతా అతలాకుతలమైపోతుందంటూ ‘ఈనాడు’లో పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాయించారు. అలా రాయించిన మూడో రోజుకే గ్రామ గ్రామాన బెల్టుషాపులు వెలిశాయి. చంద్రబాబు సాగించిన భయానక పరిపాలనలో రైతన్నలు ఎంత దారుణంగా బతికేవారంటే కరువు కాటకాలతో అలమటిస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రైతన్నలను ఆదుకోండి... వడ్డీ మాఫీ చేయండి... కరెంటు ఉచితంగా ఇవ్వండి అని అడిగితే వడ్డీ మాఫీ దేవుడెరుగు.. కరెంటు తీగలు చూపించి అవహేళన చేశారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోండని అడిగితే వారిని ఆదుకుంటే ఇంకా ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారని, తిన్నదరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిన పరిస్థితిని చంద్రబాబులోనే చూశాను. బిల్లు అన్యాయంగా ఉంటే ఎందుకు ఓటేశావు? అధికారం పోయినా చంద్రబాబు మనసులో ఎటువంటి మార్పూ లేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఎవరినైనా అమ్మేయగలడు.. వెన్నుపోటు పొడవగలడు. విభజన బిల్లు అన్యాయంగా ఉందని ఒకవైపు మాట్లాడుతూ మరోవైపు తన పార్టీ ఎంపీలచేత అదే బిల్లుకు ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా... బిల్లు ఇంత అన్యాయంగా ఉంటే ఎందుకయ్యా ఓటేసి మద్దతు తెలిపావు? సమాధానం రాదు. చంద్రబాబు ఎంత దిగజారిపోయారంటే ఓట్ల కోసం, సీట్ల కోసం మన రాష్ట్ర ప్రజలను అమ్మేయడానికి కూడా వెనకాడలేదు. బాబు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు: చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆశ్చర్యం కలిగించే మాట ఒకటి చెప్తున్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేస్తానని చెప్తున్నారు. అయ్యా.. చంద్రబాబూ ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తూ మాట్లాడుతున్నావు! ఇవాళ రాష్ట్రంలో రైతన్నలు తీసుకున్న రుణాలు ఎంతో తెలుసా? ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు. వీటితోపాటు డ్వాక్రా మహిళలకు మరో రూ. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నావు. ఉచితంగా ఫీజులు ఇస్తానంటున్నావు. ఉచితంగా కరెంటు ఇస్తానంటున్నావు.. ఎవ్వరు పోయి అడిగినా ఏం కావాలో చెప్పండి అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నావు. 2008లో పూర్తిగా రుణాలు కట్టలేక చేతులెత్తేసిన రైతన్నలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం 28 రాష్ట్రాల్లో రూ. 65 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. అందులో మన రాష్ట్రానికి రూ. 12 వేల కోట్లు వచ్చి ఆ మేరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఒక్క కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 65 వేల కోట్లు మాఫీ చేస్తే చంద్రబాబు మన రాష్ట్రంలోనే రూ. లక్షా 27 వేల కోట్లు మాఫీ చేస్తానని అబద్ధాలు చెబుతున్నారు. బడ్జెట్లో మనకున్న ఆదాయమే రూ. లక్షా 25 వేల కోట్లు. చంద్రబాబు మాఫీ కార్యక్రమాలు ఎంత అంటే రూ. లక్షా 60 వేల కోట్ల వరకు ఉన్నాయి. కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పేలా లీడర్ ఉండాలి.. ఎన్నికలకు పోతున్న ఈ తరుణంలో మీరు కూడా హామీలు చెప్పండంటూ నన్ను చాలా మంది అడిగారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు ఆడే వ్యక్తిని కాను. ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత చంద్రబాబు మళ్లీ కనిపించరు. ఆయన పార్టీ కూడా ఉండదు. అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడే పరిస్థితిలో ఆయన ఉన్నారు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగం మళ్లీ రావాలి. ప్రతి గుండె చప్పుడు వైఎస్సార్‌ను కోరుకుంటోంది.’’ అక్కాచెల్లెమ్మల కోసం రెండు సంతకాలు ‘‘బహుశా ఏ రాజకీయ నాయకుడూ నాలా పూరిగుడిసెల్లోకి వెళ్లి అక్కాచెల్లెమ్మల కష్టాలు తెలుసుకోలేదు. అక్కాచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారని ఏ ఒక్కరికీ అవగాహన లేదు. అక్కాచెల్లెమ్మల కోసమే నేను మొదటి సంతకం పెడతా. పిల్లలను బడికి పంపించినందుకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలోనే నేరుగా డబ్బులు వేస్తాం. రెండో సంతకం అవ్వా, తాతల కోసం పెన్షన్‌ను రూ.700 చేసేందుకు పెడతా. మూడో సంతకం రైతన్నల కోసం రూ.3 వేల కోట్ల స్థిరీకరణ నిధి కోసం చేస్తా. నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెమ్మల కోసమే.. డ్వాక్రా రుణాల మాఫీపై చేస్తా.’’ నాలుగు కుటుంబాలకు జగన్ ఓదార్పు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏడాదిన్నర కిందట ఓదార్పు యాత్రను నిలిపేసిన జగన్మోహన్రెడ్డి శుక్రవారం మళ్ళీ మాచర్ల నియోజకవర్గం కారంపూడి నుంచి యాత్ర పునఃప్రారంభించారు. వైఎస్ మృతిని తట్టుకోలేక తనువు చాలించిన గాదెవారిపల్లెలో చల్లా రామరాజు, మాచర్ల పట్టణంలో కందుకూరి యేసుదానం, మంజుల అర్జునరావు, వంకాయలపాటి మేరమ్మ కుటుంబాల్ని పరామర్శించారు. కారంపూడి మీదుగా పెదకొదమగుండ్ల, చినకొదమగుండ్ల, గాదెవారిపల్లె, భట్టువారిపల్లె, అడిగొప్పుల, దుర్గి, పోలేపల్లి జంక్షన్, రాయవరం జంక్షన్ మీదుగా జగన్ రోడ్ షో సాగింది. రోడ్ షోలో అడుగడుగునా జగన్‌కు జనం నీరాజనం పలికారు. తమ గ్రామాలకు రావాలంటూ ప్రతి చోటా జగన్‌పై ఆప్యాయత కురిపించారు. అడుగడుగునా అభిమానం పోటెత్తడంతో మాచర్లలో ‘వైఎస్సార్ జనభేరి’ సభ ప్రకటించిన సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా మొదలైంది. శనివారం పార్టీ నేతలతో భేటీ నేపథ్యంలో సభ ముగియగానే జగన్ హైదరాబాద్ బయల్దేరారు. పార్టీలో చేరిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్(కాంగ్రెస్) శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయన మెడలో కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనభేరి సభలో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, గుదిబండి చిన వెంకటరెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని, పార్లమెంటు అభ్యర్థి అయోధ్యరామిరెడ్డిని ఆశీర్వదించండి. అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చక్రం తిప్పాలని కోరుతున్నా’’ అని జగన్ సభలో పిలుపునిచ్చారు. -
జగన్ ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలి
వెఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9 నుంచి జిల్లాలో చేపడుతున్న ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలి మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకే ఓదార్పుయాత్రను నిర్వహిస్తున్నారన్నారు. వైఎస్సార్ అభిమానులు జగన్ రాక కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన బడుగు, బలహీన వర్గాలు, రైతులు ఆయన పాలనను మరువలేకపోతున్నారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి వైఎస్సార్ స్వర్ణయుగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. -
ysr మరణవార్త విని తిరుపతిలో ఇద్దరు మృతి
-
7,8 తేదీల్లో ఓదార్పు యాత్ర
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ‘ఓదార్పు యాత్ర’ తిరిగి ప్రారంభం కానుందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మార్చి 7,8 తేదీల్లో పల్నాడు ప్రాంతంలో యాత్ర జరుగుతు ందన్నారు. మహానేత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని తట్టుకోలేక గుండె చెదిరి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మార్చి ఏడవ తేదీన జిల్లాలో ఓదార్పు యాత్ర పునఃప్రారంభమవుతోందని ఎమ్మెల్యే చెప్పారు. రెండు రోజులపాటు సాగే యాత్ర వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్మోహన్రెడ్డి మార్చి ఆరవ తేదీన జిల్లాకు వస్తున్నట్టు తెలిపారు. ఆ రోజు నరసరావు పేటలో భారీ బహిరంగ సభ నిర్వహణ అనంతరం ఏడవ తేదీ ఉదయం మాచర్ల నియోజకవర్గం కారంపూడి నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారన్నారు. గాదెవారిపల్లె, దుర్గి మండలం కంచరగుంట గ్రామాల మీదుగా యాత్ర సాగుతుందన్నారు. అనంతరం యాత్ర మాచర్ల చేరుకొంటుందని, అక్కడ ఏర్పాటు చేసే బహిరంగసభలో జగన్ ప్రసంగించి రాత్రికి అక్కడే బస చేస్తారన్నారు. ఎనిమిదిన మాచర్ల, వెల్దుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో యాత్ర జరుగుతుందన్నారు. రెండు రోజుల పాటు సాగే యాత్రను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. -
త్వరలోనే తెలంగాణలో జగన్ ఓదార్పుయాత్ర: గట్టు
ఖమ్మంలో బహిరంగ సభ, తర్వాత ఇతర జిల్లాల్లో ఓదార్పు యాత్ర తెలంగాణలో మా పార్టీ బలహీనపడిందన్నది అవాస్తవం: గట్టు జగన్‌పై చంద్రబాబు విమర్శలు ఆకాశంపై ఉమ్మేయడమే హరీశ్‌రావు, మధుయాష్కీకి జగన్ ఫోబియా సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి త్వరలో తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన తెలంగాణ పది జిల్లాల శాసనసభా నియోజకవర్గ సమన్వయకర్తల, ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించాలని జగన్ ఓదార్పు యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికి ఓదార్పు యాత్ర పూర్తయింది. మిగతా జిల్లాల్లో కూడా ఓదార్పు యాత్ర చేస్తారని, ఎప్పటినుంచి అనేది త్వరలో తేదీలను ప్రకటిస్తామని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. మరో అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావుతో కలిసి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పది జిల్లాల నేతలతో సమావేశమై పనితీరును విడివిడిగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమీక్షించారని తెలిపారు. తొలుత ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారని, ఆ తరువాత ఇతర జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేస్తారని తెలిపారు. అంతకుముందు గుంటూరు జిల్లాలో ఇంకా మిగిలిపోయి ఉన్న ఓదార్పు యాత్రను పూర్తిచేస్తారన్నారు. తెలంగాణలో తాను పర్యటించబోతున్నానని జగన్ చెప్పగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోందని తెలిపా రు. ఇంకా ఏమన్నారంటే... తెలంగాణలో మా పార్టీ బలహీనపడిందని ఓ వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ర్పచారంలో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణలో 63 శాతం మంది వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అనే అభిప్రాయంతో ఉన్నారని ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ పునర్నిర్మాణం చేసే శక్తి తనకే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం విడ్డూరం. ముఖ్యమంత్రిగా ఇరు ప్రాంతాలను సర్వనాశనం చేసిన ఘనత ఆయనదే. జగన్‌కు అధిష్టానం టెన్ జన్‌పథ్ అని చంద్రబాబు విమర్శించడం సరికాదు. అసలు చంద్రబాబుకు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరికీ సోనియాగాంధీయే అధిష్టానవర్గం. పార్లమెంట్లో ఎఫ్డీఐపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించడమే కాక, కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ ఆదుకున్న దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ఆకాశమ్మీద ఉమ్మేస్తే అది తన మీదే పడుతుందన్న వాస్తవం బాబు గ్రహించాలి. విభజన వ్యవహారంలో తనది ఏ వైఖరి అని చెప్పకుండా తప్పించుకున్న చంద్రబాబువి ద్వంద్వ ప్రమాణాలు. జగన్ అధికారంలోకి వస్తే మరో జైలు నిర్మిస్తాడని చంద్రబాబు చెప్పడమేంటి? హైటెక్ సిటీ టెండర్లు ఇచ్చినందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు (పార్టీ కార్యాలయ భవనం), సొంత ఇల్లు నిర్మించుకున్న ఘనత చంద్రబాబుది. టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మా అధినేత జగన్ అంటే భయపడుతున్నారు. అందుకే ఆయనను తెలంగాణలో పర్యటించరాదని ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకు పర్యటించకూడదు? జగన్ తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నారు. అది తప్పేమీ కాదు. టీఆర్ఎస్ కూడా ఆంధ్రా ప్రాంతంలో శాఖ ప్రారంభించుకుంటే వద్దన్నదెవరు? ఓదార్పు గురించి జగన్‌కు తెలుసా అని అంటున్న హరీశ్ రావు, ఆయన మామ కేసీఆర్ కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు ఎపుడైనా వెళ్లి ఓదార్చారా? జగన్ తెలంగాణకు వస్తే మానుకోట పునరావృతం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ చెప్పడమంటే ఆయనకు జగన్ ఫోబియా పట్టుకుందనేది అర్థమమవుతోంది. -
ఆత్మబంధువులను కలుస్తా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది గుండె పగిలి చనిపోయారని, అలాంటి ఆత్మ బంధువుల కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలోనే మెతుకు సీమలో పర్యటిస్తానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. సోమవారం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఓదార్పు యాత్రతోపాటు జిల్లా రాజకీయాలపై చర్చిం చినట్టు జిల్లా నేతలు వెల్లడించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో దాదాపు 15 మంది మరణించారని, త్వరలోనే వారి కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి ఓదార్చనున్నట్టు, అందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారని వారు చెప్పారు. వైఎస్సార్ సీపీ మొదటి నుంచి సమైక్యాన్ని కోరుకుంటుందని, సమైక్యం అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని, ఈ మూడు ప్రాంతాల్లోనూ తమ పార్టీ ఉంటుందని అన్నట్టు వారు పేర్కొన్నారు. విభజన జరిగినందున ఇక తెలంగాణలోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని సూచించారని వారు వెల్లడించారు. వైఎస్సార్‌ను అభిమానించే వారిపై ఓ సంస్థ సర్వే చేస్తే తెలంగాణలోనే అత్యధికంగా 63 శాతం మంది ఉన్నట్టు తేలిందని ఇదే విషయాన్ని జగన్మోహన్రెడ్డి తమకు వెల్లడించినట్టు చెప్పారు. ప్రజాభిమానాన్ని ఎంత మేరకు ఓట్ల రూపంలోకి మలుచుకోగలమో నాయకుల కృషిపైనే ఆధారపడి ఉంటుందని అన్నట్టు తెలిపారు. సీమాంధ్రలో అధికారంలోకి రావడం ఖాయమని, జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేలా అక్కడి పరిపాలన ఉంటుందని భరోసా ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా పార్టీని పటిష్టమైన స్థితికి తీసుకొచ్చేలా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని జగన్ సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది కానీ సంక్షేమ పథకాలు, జలయజ్ఞం తదితర పథకాలను పూర్తిగా నీరుగార్చిందని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించినట్టు వారు చెప్పారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నట్టు వారు తెలిపారు. ఇన్చార్జిల ఖరారు! జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను త్వరలో నియమించనున్నారని వారు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జిగా అప్పారావు షెట్కార్, సంగారెడ్డి నియోజకవర్గ సింగిల్ ఇన్చార్జిగా గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పేర్లు దాదాపు ఖరారైనట్టు వారు తెలిపారు. పార్టీ అధినేతతో సమావేశమైన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు కొమ్మెర వెంకటరెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ ఉజ్వల్‌రెడ్డి, అప్పారావు షెట్కార్, మాణిక్ రావు, నర్రా భిక్షపతి, సతీష్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, రఘుపతిరావు ఉన్నారు. -
త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర
-
మీలో ఒక్కడిగా ఉంటా
-
మార్మోగిన సమైక్యవాణి
అలుపెరుగని జననేత పర్యటన సమైక్యశంఖారావం యాత్ర విజయవంతం ఆప్యాయపలకరింత... కష్టాలపై భరోసా అన్ని వర్గాలతో మమేకం జిల్లాలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర క్షణం తీరిక లేకుండా సూర్యుడితో పోటీపడుతూ సాగింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం శంఖాన్ని పూరించిన జగన్ ‘ఈ రాష్ట్రాన్ని విభజించేందుకు మీరు ఒప్పుకుంటారా..’ అని జనాన్ని ప్రశ్నిస్తూ.. వారితో ‘నో..’ అన్న సమాధానాన్ని ఓ పదునైన నినాదంగా మలుస్తూ ముందుకు సాగారు. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జిల్లాలో నాలుగు విడతలుగా సాగిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారంతో ముగి సింది. తనకోసం రోడ్డుపైకి వచ్చిన ఏ అవ్వా, తాతా నొచ్చుకోకూడదు.. ఏ అక్కా, చెల్లీ చిన్నబుచ్చుకోకూడదు.. నన్ను పలుకరించకుండా వెళ్లిపోయాడే అని ఏ చిన్నారీ బుంగమూతి పెట్టుకోకూడదన్న పట్టింపు., పట్టుదల జగన్మోహన్రెడ్డిలో కనిపించాయి. అడుగడుగునా అభిమానంతో తరలివచ్చిన జనానికి ఓ ఆప్యాయ పలకరింత, ఓ అనురాగ స్పర్శ, అవ్వా తాతలకు నుదిటిపై ప్రేమానురాగాల చుంబనం., చిన్నారుల సంబరానికి తన సంతకాన్ని కానుకగా ఇస్తూ... ముందుకు సాగారు. చిన్న చిన్న గ్రామాల్లో దివంగత నేత విగ్రహావిష్కరణల సందర్భంగా కూడా ఉపన్యాసాన్ని ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకే పరిమితం చేసి, వేదిక దిగి అక్క చెల్లెళ్లు, అవ్వాతాతల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలడిగి.. మరో నాలుగు నెలలు ఓపిక పట్టండి.. రాజన్న సువర్ణయుగం మళ్లీ వస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చవుతుంది ? ఇందిరమ్మ ఇంటికోసం ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న డబ్బు సరిపోతుందా ? ఇంటి ప్లాను ఎలా ఉండాలి ? ఇత్యాది సూక్ష్మమైన అంశాలన్నిటిపై ఇటీవల స్థానిక నేతలను జగన్ ఆరాతీశారు. రోడ్డుకిరువైపులా తనకోసం వచ్చి నిలుచున్న జనంలోకి వెళ్లి.. వాళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మీ ఇబ్బందులు పోవాలంటే రాబోయే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అని జనాన్ని అడిగారు. క్లుప్తమైన ప్రశ్నలు వేస్తూ.. వారిచ్చే సుదీర్ఘ సమాధానాలను శ్రద్ధగా ఆలకించారు. సన్న చిన్న కారు రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల జీవితానుభవాల లోతుల్లోకి చూసే ప్రయత్నం చేశా రు. పేదల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ సీపీ ఇప్పటికే ప్రకటించిన పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం ఎలా ? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ‘మేథావుల’ చర్చల్లో కాకుండా సామాన్యుని జీవిత అనుభవం నుంచి తెలుసుకోవాలన్న తపన ఆయనలో కనిపించింది. రైతుల గానుగల వద్దకు వెళ్లారు. మరమగ్గాల కార్మికులను పలకరించారు. వలస కూలీల వెతలను ఓపిగ్గా ఆలకించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం పెద్ద ఎత్తున జనాభిప్రాయాన్ని సమీకరిస్తూ, ఇతర జిల్లాల నుంచి తరలి వస్తున్న ‘ఆశావహు’లతో సంభాషిస్తూ.. సమాధానపరుస్తూ.. మరో వైపు పేదల జీవితాల బాగుకు మరింత మెరుగైన పాలన ఎలా అందివ్వగలమన్న సమాచారాన్ని ఆ ప్రజల నుంచే తెలుసుకుంటూ జగన్ యాత్ర సాగింది. -
చంద్రగిరి నియోజకవర్గంలో ఘనస్వాగతం
చంద్రగిరి నియోజకవర్గం లో ఓదార్పు, సమైక్య యాత్రకు విచ్చేసిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించిం ది. వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి రూరల్, చంద్రగిరి, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం మండలాల నుంచి వచ్చిన నాయకులు దామినేడు వద్ద ఘన స్వాగతం పలికారు. వీరిలో నాయకులు ఉపేందర్‌రెడ్డి, చిన్నియాదవ్, బ్రహ్మానందరెడ్డి, చంద్రారెడ్డి, రుద్రగోపి, శివశంకర్, ఎంపీటీసీ మాజీ సభ్యులు సుబ్రమణ్యం, మాధవరెడ్డి, అవిలాల లోక తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. సభ అనంతరం జననేత తిరుచానూరు క్రాస్, అవిలాల క్రాస్, అవి లాల, ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్, వైకుంఠపురం ఆర్చి సెంటర్ మీదుగా తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటికి రాత్రి బసకు చేరుకున్నారు. అవిలాలలో మహానేత వైఎస్ఆర్ విగ్ర హాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా ప్రజలు ప ట్టుదలతో మహానేత విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉం దన్నారు. ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాద్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్, ఆర్టీసీ వైఎస్ఆర్టీయూసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లతారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, నాయకులు వై.సురేష్, విరూపాక్షి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మరథం
-
ప్రజల గుండెల్లో వైఎస్ఆర్
వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏడో రోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగింది. జననేతకు గ్రామగ్రామాన జనం అపూర్వ స్వాగతం పలికారు. నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల్లో, సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు, సత్యవేడు, నాగలాపురం మండలాల్లో జగన్మోహన్రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. పన్నూరు సబ్‌స్టేషన్, నిండ్ర, కొప్పేడు, పిచ్చాటూరు, నాగలాపురంలో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రజల గుండెల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, పేదరికమనే జబ్బును నయం చేయడానికి నిరంతర కృషి చేసిన వైద్యుడు ఆయనని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సాక్షి, సత్యవేడు: విజయపురం మండలంలోని సూరికాపురం నుంచి ఆదివారం ఉద యం 9.30 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యా త్రను ప్రారంభించారు. అదే గ్రామం లో తన కోసం వేచి ఉన్న ప్రజలను కలుసుకున్నారు. మహిళలతో ముచ్చటించారు. సూరికాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. గాంధీ, నెహ్రూ ఫొటోలవద్ద నివాళులర్పించా రు. విద్యార్థులను పలకరించారు. అక్క డ నుంచి జగన్నాథపురం వరకు రోడ్ షో నిర్వహించారు. మాధవరం గ్రామంలోనే మూడుచోట్ల మహిళలు జగన్‌ను ఆపి చూసేందుకు పోటీ పడ్డా రు. ఆయన అందరినీ పలకరించడం తో సంతోషంగా వెనుదిరిగారు. ఈ గ్రామంలో వెంగమ్మ అనే వృద్ధురాలిని జననేత పలకరించారు. తనకు పింఛన్ రావడం లేదని ఆమె జగన్ దృష్టికి తెచ్చింది. ఇక్కడే విద్యార్థులను పలకరించారు. పన్నూరు దళితవాడలో చర్చిలోకి వెళ్లి ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్ ఇక్కడ తమిళంలో ప్రార్థనలు వినిపించారు. తన కోసం వేచి ఉన్న మహిళలను జగన్ కలిశారు. ఈ గ్రా మంలో సర్పంచ్ పి.లక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తోరణాలు, ఫ్లెక్సీలు ఏ ర్పాటుచేసి భారీగా స్వాగతం పలికా రు. పన్నూరు గ్రామంలోనూ మూడు చోట్ల ప్రజలు జగన్మోహన్రెడ్డిని ఆపి మాట్లాడారు. రైతులు జననేతను కలిసి సమస్యలు తెలియజేశారు. యువకులు జననేతను చూసేందుకు మిద్దెలపైకి ఎక్కి నిలబడ్డారు. పులివెందుల పులిబిడ్డ జగన్ నాయకత్వం వర్థిల్లాలి, జగనన్న గుర్తు ఫ్యాను గుర్తు అంటూ యువకులు పదేపదే నినాదాలు చేశారు. ఈ ఊర్లోనే ఇళ్లత్తూరుకు చెందిన చిరంజీవి అనే వికలాంగుడిని ఆయన పలకరించారు. విద్యుత్‌షాక్‌తో చేయి కోల్పోయానని ఆ యువకుడు తెలిపాడు. పింఛన్ వస్తోందా అని ఆరా తీశారు. పన్నూరు సబ్‌స్టేషన్ వెళ్లే దారి లో హైదరాబాద్ నుంచి వచ్చిన 15 మంది ఏపీ ప్రయివేటు బస్సు ఆపరేటర్ల సంఘం నాయకులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మహానేత విగ్రహావిష్కరణ పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు కాన్వాయ్‌ను నిలిపేసి జననేతకు స్వాగతం పలికా రు. తమ అభిమాన నాయకుడి నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. పన్నూరు సబ్‌స్టేషన్ రోడ్డు జంక్షన్లో మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ఒక అభిమాని వీర ఖడ్గం బహూకరించారు. దానిని అభిమానుల కోసం జగన్మోహన్రెడ్డి ఒకసారి గాలిలో తిప్పారు. విగ్రహావిష్కరణకు విచ్చేసిన జనంతో పన్నూరు సబ్‌స్టేషన్ కూడలి కిక్కిరిసింది. స్థలం సరిపోకపోవడంతో జనం ముఖ్యంగా మహిళలు మిద్దెలపైకి, భవంతులపైకి ఎక్కి జగన్‌ను చూడడం కనిపించింది. ప్రజలు జగన్ మాట్లాడాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. మైక్ లేదని తెలుపుతూ సైగలు చేస్తూ ఆయన రోడ్‌షో కొనసాగించారు. అక్కడ నుంచి యల్లసముద్రం వరకు రోడ్ షో జరిగింది. గ్రామస్తులు ఇక్కడ సమైక్య సింహం వై.ఎస్.జగన్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం అందరినీ ఆకర్షించింది. చర్చిలో ప్రార్థనలు నిండ్ర గ్రామం చేరుకుని మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. గ్రామంలోని చర్చికెళ్లి ప్రార్థనలు చేశారు. ఇక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పేదరికానికి వైద్యం చేసిన డాక్టర్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన సువర్ణపాలనలో పేదల కోసం ఎన్నె న్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అంతకుముందు నిండ్ర శివార్ల నుంచి డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి షుగర్ ఫ్యాక్టరీ గేటు, ఉద్యోగుల క్వార్టర్స వద్ద జరిగిన రోడ్‌షోలో జనాన్ని జగన్ పలకరించారు. తర్వాత నిండ్ర మండలంలోని కొప్పేడు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. అనంతరం బయల్దేరి సత్యవేడు నియోజకవర్గం చేరుకున్నారు. -
నేడు జననేత పర్యటన ఇలా..
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏడవరోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి వెల్లడించారు. ఆదివారం ఉదయం విజయపురం మండలం సూరికాపురం నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. నిండ్ర మండలం పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మాధవరంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆళ్లపాకం క్రాస్, కమ్మకండ్రిగ క్రాస్, 9వ మైలు, నిండ్ర, షుగర్ ఫ్యాక్టరీ మీదుగా రోడ్‌షో కొప్పేడుకు చేరుకుంటుంది. కొప్పేడులో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కీర్లపూ డిలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పిచ్చాటూరులో బహిరంగ సభ అప్పంబట్టు, రామగిరి, కృష్ణాపురంల్లో రోడ్‌షో నాగలాపురంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వడలకుప్పం, వెల్లూరులో రోడ్ షో ఎస్ఎస్ పురంలో ఓదార్పు. ఓబులరాజుల కండ్రిగలో పార్టీ జిల్లా కార్మికవర్గ విభాగం కన్వీనర్ బీరేంద్ర ఇంట్లో బస చేస్తారు. -
నగరి అదిరింది
6వ రోజూ సమైక్య, ఓదార్పుయాత్రకు విశేష స్పందన జననేతను చూసేందుకు గ్రామగ్రామాన బారులు తీరిన జనం నగరి నియోజకవర్గంలో కిక్కిరిసిన రోడ్ షోలు ఆగిన ప్రతిచోటా వృద్ధులకు పింఛన్ పంపిణీపై జగన్ ఆరా దేశూరు క్రాస్‌లో మహానేత విగ్రహావిష్కరణ దేశమ్మగుడిలో వై.ఎస్.జగన్ ప్రత్యేక పూజలు ఆరూరులో వడివేలు కుటుంబానికి ఓదార్పు వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి నగరి నియోజకవర్గంలో జనం అపూర్వ స్వాగతం పలికారు. జననేతను చూసేందుకు గ్రామగ్రామాన జనం బారులు తీరారు. ప్రతి ఒక్కరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచి రోజులు త్వరలోనే ఉన్నాయంటూ ధైర్యం చెప్పారు. న్యూస్‌లైన్, నగరి: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య, ఓదార్పుయాత్ర ఆరోరోజు శనివారం నగరి నియోజకవర్గంలో సాగింది. నగరిలో శుక్రవారం రాత్రి బస చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ కె.జె.కుమార్ ఇంటి నుంచి జగన్మోహన్రెడ్డి రోడ్ షోకు శనివారం ఉదయం బయలుదేరారు. మొదట నగరి బైపాస్‌రోడ్డులో ప్రారంభంలో ఉన్న హిమజా విద్యాసంస్థల విద్యార్థులు, మహిళా అధ్యాపకులు అందరూ వై.ఎస్.జగన్ కాన్వాయ్‌ను ఆపి ఘనస్వాగతం పలికారు. ఇక్కడ కొంతసేపు జగన్ జనంతో ముచ్చటిం చారు. అనంతరం పట్టణంలోని నగరి ఎస్సీ కాలనీ చేరుకున్నారు. ఇక్కడ దాదాపు 50 మంది రామ్మూర్తి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో జగన్ సమక్షంలో చేరారు. ఈ కాలనీలోని దళిత యువకులు జగన్‌ను కలిసేందుకు పోటీపడ్డారు. దళిత యువకులు సమైక్యాం ధ్ర మ్యాప్‌తో ఉన్న వైఎస్ఆర్సీపీ జెండాలను రూపొందించారు. అభివాదం చేస్తున్న జగన్మోహన్రెడ్డి బొమ్మలతో కూడిన ఈ జెండాలను కాన్వాయ్ వద్ద పైకి ఎత్తిపట్టుకుని ప్రదర్శించారు. సమైక్య సింహం వై.ఎస్.జగన్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశమ్మగుడిలో పూజలు నగరి ఎస్సీ కాలనీ నుంచి దేశమ్మగుడికి చేరుకున్న జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి నుంచి బయటకు రాగానే యువకులు జగన్‌ను కలిసేందుకు పోటీపడ్డారు. దేశమ్మగుడి నుంచి ముందుకు రాగానే అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చిన వందమంది పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుసుకున్నారు. జగన్ రోడ్‌షో నిర్వహిస్తున్న మార్గంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఏర్పాటు చేసిన స్వాగత ఆర్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. ఎం.కొత్తూరులో వై.ఎస్.జగన్ రోడ్‌షోకు మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. గ్రామం లో నాలుగు చోట్ల మహిళలు బృందాలుగా జగన్ కాన్వాయ్‌ను ఆపి స్వాగతం పలికారు. వీరందరినీ ఆప్యాయంగా పలకరించిన అనంతరం ఆయన ముందుకు కదిలారు. ఎం.కొత్తూరు ఎస్సీకాలనీలో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున జగన్‌ను ఆహ్వానించారు. వేలవాడి గ్రామంలో రోడ్‌షోను చూసేందుకు ముస్లిం మహిళలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. ఈ గ్రామంలో అర్ధ గంటకుపైగా జగన్ ఉన్నారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మైనారిటీ మహిళలను పలకరించారు. వేలవాడిలో పార్టీ నాయకులు ఏర్పా టుచేసిన వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఇక్కడా జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. చిన్నపిల్లలను పలువురు తమ భుజాలపై కూర్చోపెట్టుకుని జగన్‌ను చూపేందు కు ప్రయత్నించారు. బుగ్గ అగ్రహారం లో జగన్ రోడ్‌షోతో గ్రామం జనసంద్రంగా మారింది. డప్పులు వాయి స్తూ, నృత్యాలు చేస్తూ యువకులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. తనను కలుసుకున్న వృద్ధులతో జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. అవ్వా పిం ఛన్ అందుతోందా అని ఆప్యాయంగా వాకబు చేశారు. నాలుగు నెలల్లో ఎన్నికలు అయి ప్రభుత్వం రాగానే మీ సమస్యలు తీరుస్తానని మహిళా రైతు కూలీలకు భరోసా ఇచ్చారు. జననేతను చూడాలని.. నిండ్ర మండలం ఇరవాయి కాలనీ రైతులు, ప్రజలు జగన్‌ను చూసేందుకు కిలోమీటరు దూరం నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చారు. రైతుల కష్టాలు తీరాలన్నా, కరెంట్ చార్జీలు తగ్గాలన్నా వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కావాలని గ్రామస్తులు ఏర్పాటు చేసిన కటౌట్ అందరినీ ఆకర్షించింది. బుగ్గ అగ్రహారం ప్రారంభంలో ఒ.నాగమ్మ, ఒ.దుర్గాబాయమ్మ అనే నడవలేని వృద్ధురాళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టారు. జననేత కాన్వాయ్ దిగి వారి వద్దకు వచ్చి వృద్ధురాళ్లతో మాట్లాడారు. వారి ఆరోగ్యం ఎలా ఉందని, పింఛన్ వస్తోందా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. -
సుగానందం కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
పెదప్పరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
అధైర్య పడకండి అండగా ఉంటా
-
జనం.. జనం
మూడవరోజూ అదే ఉత్సాహం జననేతను చూసేందుకు పరుగులు తీసిన జనం జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పు, సమైక్యయాత్ర జగన్ బొమ్మలతో టీషర్టులు, బెలూన్లతో ప్రచారం సాక్షి, చిత్తూరు: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో బుధవారం జరిగిన సమైక్య శంఖారావం యాత్రలో జననేతకు అఖండ స్వాగతం లభించింది. మూడవరోజు కొత్తపల్లిమిట్టలో జరిగిన నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్రలో ఆయన పాల్గొన్నారు. దారి పొడవునా తమ అభిమాన నాయకుడికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ జీడీ నెల్లూరు నాయకులు ఆహ్వానం పలికారు. ఇందులో సమైక్య సింహానికి స్వాగతం అని రాయడం చూపరులను ఆకర్షించింది. కొత్తపల్లిమిట్టలో జరిగిన బహిరంగసభా వేదిక వద్ద వై.ఎస్.జగన్ ఫొటోలతో గాలిలోకి ఎగురవేసిన బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా పర్యటన జననేత వై.ఎస్.జగన్ బుధవారం నెలవాయి గ్రామం నుంచి బయల్దేరి క్షీరసముద్రం చేరుకుని రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇక్కడ అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ తమ అభిమాన నాయకుడిని ఆహ్వానించారు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే రోడ్డు పక్కన తన కోసం వేచి ఉన్న పులివెందుల వైఎస్సార్ సీపీ నాయకులను జగన్మోహన్రెడ్డి పలకరించా రు. క్షీరసముద్రం ఎస్సీ కాలనీలో వాహనం దిగి ప్రతి ఒక్క మహిళనూ పలకరిస్తూ, ఆశీర్వదిస్తూ సాగారు. చిన్నారులను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని దీవించారు. తమ గ్రామానికి విచ్చేసిన జగన్మోహన్రెడ్డిని చూసేందుకు మ హిళలు కాన్వాయ్ వద్దకు పరుగులు తీశారు. నాయుడుపల్లె వద్ద జగన్ ఫొటో ఉన్న టీషర్టులను ధరించిన యువకులు ట్రాక్టర్లలో ఎదురొచ్చి స్వాగతించారు. ఎస్ఆర్ పురం, ఎస్ఆర్ పురం క్రాస్‌లో రెండువేల మందికి పైగా గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు చంటి బిడ్డలను ఎత్తుకుని ఎండలో ప్రియతమ నేత కోసం రోడ్డుకు ఇరువైపులా వేచి ఉండడం కని పించింది. ఇక్కడ జననేత వాహనం దిగి ప్రతి ఒక్కరినీ పలకరించారు. చిన్నారులకు నామకరణం ఎస్ఆర్ పురం క్రాస్ నుంచి పుల్లూరు క్రాస్ చేరుకుని జగన్మోహన్రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ గ్రా మంలో మహిళలు తమ నాయకుడికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ ఊర్లో ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను జగన్ చేతుల్లో ఉంచి నామకరణం చేయాలని కోరారు. ఆయన వారిద్దరికి విజ యమ్మ అని నామకరణం చేశారు. శూలగిల్లులో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. కార్యకర్తలు, గ్రామస్తులను పలకరించారు. జగన్ బొమ్మలతో రూ పొందించిన టీషర్టులు ధరించిన వైఎస్సార్ సీపీ కా ర్యకర్తలు, యువకులు కాన్వాయ్ వెంట సాగారు. శూలగిల్లులో చెరుకు రైతులతో జననేత మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలు ఓపిగ్గా విన్నారు. అక్కడ నుంచి తెల్లగుండపల్లె చేరుకుని ఓదార్పులో పాల్గొన్నారు. మహానేత వైఎస్ మరణం తట్టుకోలేక మృతి చెందిన పోతగంటి నరసయ్య కుటుంబాన్ని ఓదార్చారు. వారికి అండగా ఉంటానని, అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అక్కడ నుంచి ఎన్ఆర్.పురం, ఎన్.ఆర్‌పురం ఎస్సీ కాలనీల మీ దు గా రోడ్‌షో నిర్వహించారు. దళితులను, గిరిజనులను పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ కదిలారు. ఆగిన ప్రతిచోటా యువకులు జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జననేత అన్నాగారి ఊరు చేరుకుని అక్కడ మహిళలను ఆశీర్వదించారు. ఒక విద్యార్థినికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. రోడ్‌షో కొనసాగిస్తూ వడ్డికండ్రిగ, వేణుగోపాలపురం చేరుకున్నారు. వేణుగోపాలపురంలో పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాను జగన్ ఆవిష్కరించారు. ఎస్‌జె కాలనీ వద్ద షికారీలను పలకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏఎం.పురం, ఆదిఆంధ్రవాడ వద్ద జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారిలో చిన్నపాప అనే గిరిజన మహిళను జగన్మోహన్రెడ్డి పలకరించారు. చిన్నబాపనపల్లె, శెట్వనత్తంలో వాద్యాలతో నాట్యం చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడ్ని స్వాగతించారు. అక్కడ నుంచి నేరుగా కొత్తపల్లిమిట్ట చేరుకుని సమైక్య శంఖారావం సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. మూడవరోజు పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు సమన్వయకర్త కె.నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, రాజం పేట నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు వై.సురేష్, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డప్పరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నరసయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
రాజన్నది సువర్ణపాలన
పేదలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదల చదువులు, ఉపాధి, వైద్యం ఇలా చెప్పుకుంటూపోతే వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నెన్నో ఉన్నాయన్నారు. రామరాజ్యం చూడలేదు కానీ రాజన్నపాలన, సువర్ణ పాలన చూశాం అంటూ కొనియాడారు. ఆయన నారాయణవనం, కార్వేటినగరం సమైక్య శంఖారావం యాత్ర సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత, రెండవ రోజు సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలకు జనం మంగళవారం నీరాజనం పలికారు. సమైక్యాంధ్ర నినాదాలతో జగన్ ఫొటో ముద్రించిన స్టిక్కర్లను చేతబట్టుకుని చాలాచోట్ల మహిళలు జగన్ కాన్వాయ్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. పుత్తూరు ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి బయల్దేరిన జగన్మోహన్రెడ్డిని చూసేందుకు రెండువేల మందికిపైగా ప్రజలు, కొండలచెరువు గ్రామ మహిళలు పోటీపడ్డారు. వారిని ఆయన పలకరించారు. వారు చెప్పింది ఆసాంతం విన్నారు. సందర్శకులు అందరినీ పలకరించి ఆర్అండ్బీ అతిథిగృహం ముందు హైవే దాటేందుకే గంటన్నరకుపైగా సమయం పట్టింది. ఇక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుంచి చెన్నై హైవే జంక్షన్‌కు వచ్చి రోడ్ షో నిర్వహిస్తూ సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం చేరుకున్నారు. నారాయణవనంలో వైఎస్ విగ్రహావిష్కరణ నారాయణవనం వద్దకు జననేత చేరుకోగానే సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, సత్యవేడు జెడ్పీటీసీ మాజీ సభ్యులు బీరేంద్ర ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో చిందులేస్తూ జై జగన్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ యువకులు ఉత్సాహంగా తమ నాయకుడ్ని ఆహ్వానించారు. వై.ఎస్.జగన్ ఫొటో, ఫ్యాను సింబల్‌తో ఉన్న స్టిక్కర్లు పెట్టుకుని కార్యకర్తలు జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. నారాయణవనంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్‌ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర సింహం అంటూ నినాదాలు రాశారు. నారాయణవనం కూడలిలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా యువకులు జై జగన్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సభలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యవేడు సమన్వయకర్త ఆది మూలం, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, ఆర్.కె.రోజా, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎనిమిది కిలోమీటర్లు...నాలుగు గంటలు నగరి నియోజకవర్గంలో మంగళవారం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. చెన్నై బైపాస్ జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణ శివార్లులోని కావమ్మగుడి వరకు జగన్ నిర్వహించిన ఎనిమిది కిలోమీటర్ల రోడ్‌షోకు సుమారు 4 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన రోడ్ షో సాయంత్రం 5.30 గంటల వరకు సాగింది. మధ్యలో గంటసేపు భోజనానికి విరామం ఇచ్చారు. పుత్తూరు పట్టణ వీధుల్లో అడుగడుగునా మహిళలు జగన్‌ను చూడాలని కాన్వాయ్ వద్దకు వచ్చారు. దీంతో జగన్ ప్రతి ఒక్కరి వద్ద ఆగి వారికి అభివాదం చేస్తూ, పలుకరిస్తూ, వారి కష్టసుఖాలు అడుగుతూ సాగారు. ఆలస్యమైనా వై.ఎస్.జగన్ రాక కోసం పట్టణంలో రెండు నుంచి మూడు గంటలు మహిళలు పెద్దసంఖ్యలో నిరీక్షిస్తూ ఉండిపోయారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు జగన్‌ను చూసేందుకు ఎండనూ లెక్క చేయకుండా నిలబడ్డారు. పట్టణ శివార్లులోని చిదా స్పిన్నింగ్ మిల్లు వద్ద కార్మికులు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ వారిని పలకరించారు. అలాగే బైపాస్‌రోడ్ జంక్షన్లో బస్సుల్లో నుంచి కిందదిగి చూస్తున్న ప్రయాణికులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఆర్డీఎం గేటు వద్ద ఎదురుచూస్తూ ఉన్న చిన్నారులను పలకరించి వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. వారు తమ అభిమాన నాయకుడికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాస థియేటర్ వద్ద మహిళలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్వేటినగరం రోడ్డు నుంచి బజారువీధిలోకి ప్రవేశించి రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ కిలోమీటరు దూరం వెళ్లేందుకు గంటకుపైగా సమయం పట్టింది. అడుగడుగునా మహిళలు రోడ్డుపైకి వచ్చి కాన్వాయ్‌ను ఆపారు. ప్రతి ఒక్కరినీ జగన్ పలకరిస్తూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాపువీధి, విష్ణుమహల్ ప్రాంతాల్లో దుకాణదారులూ జగన్‌ను చూసేందుకు ఆసక్తిగా రోడ్డుపైకి వచ్చి నిలబడడం కనిపించింది. కుంటకట్ట వద్దకు వచ్చిన సందర్భంలో వెంకటమ్మ అనే మహిళ పక్షవాతంతో బాధపడుతోందని మహిళా సంఘాల వారు నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే.రోజా దృష్టికి తెచ్చారు. ఆమె విషయం జగన్‌కు తెలిపారు. ఆయన స్పందించి పేదరికంతో, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వెంకటమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు వైద్యపరమైన సాయం అందించాల్సిందిగా రోజాకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని రకాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే వేదవ్యాస స్కూల్ పిల్లలు జై సమైక్యాంధ్ర నినాదాలు, జగన్ బొమ్మలతో ఉన్న స్టిక్కర్లు చేతపట్టి ఘనస్వాగతం పలికారు. మార్కెట్‌యార్డు సమీపంలో హిమజా స్కూల్ విద్యార్థులు వందలాది మంది జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. మధ్యాహ్నం భోజన విరామానికి వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి ఇంటికి వై.ఎస్.జగన్ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఎస్బీఐ కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఆరేటమ్మగుడి మీదుగా పుత్తూరు పట్టణ శివార్ల వరకు రోడ్‌షో నిర్వహించారు. జగన్ వెంట నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కె.రోజా ఉన్నారు. నెత్తం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో జననేతకు చూసేందుకు పోటీపడ్డారు. బస్సుల్లో వెళుతున్న విద్యార్థులు జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. చిన్నరాజకుప్పం వద్ద ఎస్వీ పెరుమా ల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పార్టీ జెండాలు చేతపట్టి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నెత్తం, కళ్యాణం గ్రామాల మీదుగా జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రారంభ గ్రామం సురేంద్రపురం వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు నెత్తం సమీపంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చి వేచివున్న వారిని వై.ఎస్.జగన్ పలకరించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఘనస్వాగతం జీడీ నెల్లూరు నియోజకవర్గం సురేంద్రపురం గ్రామం వద్ద వై.ఎస్.జగన్‌కు నియోజకవర్గ సమన్వయకర్త, కన్వీనర్ కే.నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులందరినీ జగన్ పలకరించారు. పార్టీ బ్యానర్లు తలకు చుట్టుకుని, జెండాలు చేతపట్టి జై జగన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. పద్మాసరస్సు మీదుగా కార్వేటినగరం వరకు రోడ్ షో నిర్వహించారు. రాత్రి 8 గంటలకు కార్వేటినగరం పోలీసుస్టేషన్ మీదుగా బహిరంగ సభా స్థలి అయిన బస్టాండ్ వరకు నిర్వహించిన రోడ్‌షోలో జగన్‌ను చూసేం దుకు వీధుల్లోని అన్ని మిద్దెలపైన జనం వేచి ఉన్నారు. ఇళ్లలోని వారూ రోడ్డుపైకి వచ్చి జగన్‌ను ఆసక్తిగా చూడడం కనిపించింది. బహిరంగసభా స్థలి వరకు అభిమానులు ఏర్పాటు చేసిన బాణసంచా మోతతో కార్వేటినగరం వీధులు మార్మోగాయి. కార్వేటినగరంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఈ సభకు తమ అభిమాన నాయకుడు రావడం మూడు గంటలు ఆలస్యమైనా జనం కదలకుండా వేచి ఉన్నారు. చివరి వరకు ఉండి జగన్ ప్రసంగం విన్నారు. అక్కడ నుంచి బండరేవు కాలనీ, ఆర్‌కేవీపేట, రాజులకండ్రిగ మీదుగా రోడ్‌షో నిర్వహించారు. పాదిరి కుప్పం, ఆల్లాగుంట, తురకమిట్ట, కొల్లగుంటల్లోనూ ప్రజలను పలుకరిస్తూ రోడ్‌షో చేశారు. ఎన్టీఆర్ నగర్, లక్ష్మీపురంక్రాస్, ముద్దుకుప్పంక్రాస్, సనకుప్పం మీదుగా జగన్ రాత్రి 11 గంటల వరకు రోడ్‌షో నిర్వహిస్తూ రాత్రి బస అయిన నెలవాయి చేరుకున్నారు. -
జన హృదయ విజేత వైఎస్
అడుగడుగునా అపూర్వ స్వాగతం రేణిగుంట నుంచి పుత్తూరు వరకు మూడు నియోజకవర్గాల్లో రోడ్‌షో {బాహ్మణపట్టు, పత్తిపుత్తూరుల్లో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ చక్కెర ఫ్యాక్టరీని కాపాడాలని రైతుల వినతి సమైక్యాంధ్ర మీవల్లే సాధ్యమంటూ విద్యార్థుల నినాదాలు సాక్షి, చిత్తూరు: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన కుమారుడు, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పుయాత్ర సోమవారం ప్రారంభమైంది. ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యాత్ర శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో సాగింది. నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణానికి జగన్మోహన్రెడ్డి చేరుకునే సమయానికి రాత్రి 9.30 గంటలు అయింది. చలిగా ఉన్నా జనం లెక్కచేయక తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వేచి ఉన్నారు. పుత్తూరు పట్టణంలో రాత్రి కిక్కిరిసిన జనం మధ్య జగన్ మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పూరిం చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా అసెంబ్లీలో రాష్ట్ర విభజన కోసం చర్చలు జరుగుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ చేసిన ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ఇదిలావుండగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉదయం విమానాశ్రయం నుంచి గురవరాజుపల్లె పంచాయతీ రామక్రిష్ణాపురం చేరుకుని అక్కడ రోడ్‌షో నిర్వహించారు. జనం వాహనాన్ని ఆపి జననేతను కలిశారు. ఆయన వారిని పలకరించి ముందుకు కదిలారు. కేఎల్ఎం ఆస్పత్రి ప్రాంతంలో చిన్నపిల్లలు, మహిళలను చూసి జగన్ వాహనం ఆపి కిందకు దిగి వారితో కరచాలనం చేసి మాట్లాడారు. మహిళలు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. అక్కడ నుంచి గాజులమండ్యం చేరుకున్నారు. ఇక్కడ మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి వై.ఎస్.జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. ఇక్కడ దాదాపు గంట సేపు రోడ్డుకు ఇరువైపులా నిలబడిన మహిళలను, విద్యార్థులను ఒక్కొక్కరిని పలకరించి వారు చెప్పింది విన్నారు. తన కోసం వేచి ఉన్న విద్యార్థులతో ముచ్చటిస్తూ ‘మీరు బాగా చదువుకోవాలమ్మా’ అంటూ వారి భుజం తట్టి ప్రొత్సహించారు. ఈ సందర్భంగా యువకులు, విద్యార్థులు సమైక్యాంధ్ర మీ వల్లే సాధ్యమంటూ జైజగన్ అని నినాదాలు చేశారు. గాజులమండ్యం- షుగర్‌ఫ్యాక్టరీ వరకు నేషనల్‌హైవేలో నిలిచిన బస్సుల్లో నుంచి జనం కిందకు దిగి నిలబడి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఆసక్తి చూపారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చేతులూ ఊపుతూ జగన్ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం యాత్రకు మద్దతు పలికారు. ఎస్వీ షుగర్స్‌ను కాపాడండి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే రేణిగుంట ఎస్వీ షుగర్స్‌ను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఫ్యాక్టరీ షేర్‌హోల్డర్స్‌గా ఉన్న ఈ ప్రాంత రైతులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ ముందు వైఎస్ఆర్సీపీ అధినేతకు స్వాగతం పలికారు. వినతిపత్రం సమర్పించారు. మహానేత వైఎస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణకు చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఫ్యాక్టరీ మూతపడే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము ప్రభుత్వంలోకి రాగానే తగిన న్యాయం చేస్తామని వై.ఎస్.జగన్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి ఆయిల్ ఫ్యాక్టరీ, అల్లికేశం వరకు యువకులు కాన్వాయ్ వెంట బైక్‌ల్లో ర్యాలీగా వచ్చి అభిమానం చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనలో జగన్ వెంట నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. నగరి నియోజకవర్గంలో.. వై.ఎస్.జగన్ తొలి రోజు పర్యటనలో వడమాలపేట మండలం కదిరిమంగళం నుంచి నగరి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. కదిరి మంగళం వద్ద పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు, నగరి ఇన్చార్జ్ ఆర్.కె.రోజా నాయకత్వంలో గ్రామస్తులు, నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి వై.ఎస్.జగన్ పూడి గ్రామం చేరుకున్నారు. ఇక్కడ మహిళలు మంగళహారతులు, పూలమాలలు వేసి స్వాగతించారు. మహిళలు అందరినీ వారి వద్దకు వెళ్లి పలకరించి జగన్మోహన్రెడ్డి అర్ధగంటకుపైగా ఇక్కడ ఉన్నారు. పూడి గ్రామం దాటగానే అప్పలాయిగుంట క్రాస్ వద్ద యువకులు, మహిళలు గుమిగూడి రోడ్డుపై పూలు చల్లుతూ స్వాగతించారు. ఇక్కడ ఒక అభిమాని వైఎస్ కుటుంబసభ్యుల ఫొటోను జగన్‌కు అందజేశారు. పూడి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లోనూ ప్రజలు జగన్‌ను ఆపి మాట్లాడేందుకు, తమ సమస్యలు చెప్పేందుకు ఉత్సాహం చూపారు. ఇక్కడ ఉన్న స్టయిపాక్ థర్మోకోల్ ఫ్యాక్టరీ ఆవరణకు వెళ్లి వైఎస్ఆర్టీయూసీ జెండాను కార్మికుల కోరిక మేరకు ఆవిష్కరించారు. కాయం, కాయంపేట గ్రామాల్లో యువతులు జెండాలు ఊపుతూ వై.ఎస్.జగన్‌కు స్వాగతం పలికారు. నాలుగు అడుగుల స్థలమూ ఇవ్వని ప్రభుత్వం కాయంపేట నుంచి చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణపట్టు వద్దకు వై.ఎస్.జగన్ చేరుకున్నారు. ఇక్కడ మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద్దసంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘బ్రాహ్మణపట్టు గ్రామం చిన్నదైనా ఈ గ్రామస్తుల మనస్సు అందులో మహానేత విగ్రహానికి స్థలం ఇచ్చిన శంకర్‌రెడ్డి తాత మనస్సు ఎంతో పెద్దది, గొప్పది. ఆ మహానేత విగ్రహం ఏర్పాటుకు నేను స్థలం ఇస్తానని ఆ తాత సొంత స్థలం నాలుగు అడుగులు ఇచ్చారు.’ అంటూ వై.ఎస్.జగన్ గ్రామస్తులను అభినందించారు. ‘ఈ ప్రభుత్వం మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నాలుగు అడుగుల స్థలం అడిగితే ఇవ్వలేదు’, అంటూ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ఈ పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ ప్రోగామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, నగరి ఇన్చార్జ్ ఆర్.కె.రోజా, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి, జిల్లా యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, జిల్లా కార్మిక వర్గ కన్వీనర్ బీరేంద్రవర్మ ఉన్నారు. అప్పలాయగుంట వేంకటేశ్వరుని దర్శనం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆలయంలో స్వామిరిని దర్శించుకుని, ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అంతకు ముందు బ్రాహ్మణపట్టు నుంచి చింతకాల్వ మీదుగా పత్తిపుత్తూరు వరకు రోడ్‌షో నిర్వహించారు. పత్తిపుత్తూరులో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి గొల్లపల్లె, తిరుమణ్యం, టి.ఆర్.కండ్రీ, వేమాపురం, వడమాల మీదు గా వడమాలపేట చేరుకున్నారు. సాయంత్రం వడమాలపేట బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడ నుంచి ఎస్యూపురం, లక్ష్మీపురం, తడుకుస్టేషన్ల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ పుత్తూరు మండలం చేరుకున్నారు. మజ్జిగకుంట, తడుకు, గొల్లపల్లె ప్రాంతాల్లో చలిని సైతం లెక్క చేయకుండా జనం వేచి ఉండడం కనిపించింది. వై.ఎస్.జగన్ పుత్తూరు అగ్రహారం, ఈసలాపురంలో రోడ్‌షో నిర్వహించారు. పుత్తూరు పట్టణంలో రోడ్ షో.. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం రాత్రి పుత్తూరు పట్టణానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పుత్తూరు బైపాస్ క్రాస్ నుంచి ఘనస్వాగతం పలుకుతూ బాణసంచా కాలుస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్.కె.రోజా, చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించారు. రైల్వేఓవర్ బ్రిడ్జి మీదుగా, బజారువీధి, కార్వేటినగరం సర్కిల్ వరకు రోడ్‌షో సాగింది. -
నేటి నుంచి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో సోమవారం ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లాలో నాలుగో విడత యాత్రను ప్రారంభిస్తారు. విమానాశ్రయం, ఆర్కేపురం, కేఎల్ఎం హాస్పిటల్ జంక్షన్ మీదుగా అత్తూరు క్రాస్ వరకు రేణిగుంట మండలంలో రోడ్‌షో నిర్వహిస్తారు. నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోకి ప్రవేశిస్తారు. పూడి, కాయం, కాయంపేట గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణపట్టు మీదుగా తిరిగి వడమాలపేట మండలంలోకి వెళతారు. చింతకాల్వ, పత్తిపుత్తూరు, అప్పలాయగుంట, తిరుమణ్యం, టీఆర్‌కండ్రిగ, గొల్లకండ్రిగ, వడమాల మీదుగా వడమాలపేట వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. {బాహ్మణపట్టు, పత్తిపుత్తూరులో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. వడమాలపేట నుంచి లక్ష్మీపురం, తడుకు స్టేషన్ మీదుగా పుత్తూరు మండలంలోని మజ్జిగకుంట, తడుకు, గొల్లపల్లె, పుత్తూరు అగ్రహా రం, ఈసలాపురం మీదుగా పుత్తూరు వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. పుత్తూరులోని కార్వేటినగరం సర్కిల్లో సాయంత్రం నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. రెండవ రోజు 21వ తేదీ కార్వేటినగరంలో సమైక్య శంఖారావం బహిరంగ సభతో పర్యటన ప్రారంభమవుతుంది. ఆర్‌కేవీపేట, చింతమంది క్రాస్, అన్నూరు క్రాస్, అమ్మపల్లె క్రాస్, కొల్లాగుంట, లక్ష్మీపురం మీదుగా ఎస్ఆర్పురం వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. పుల్లూరు క్రాస్, శూలగపల్లె క్రాస్ మీదుగా తెల్లగుండ్లపల్లె చేరుకుంటారు. అక్కడ పోతగంటి నరసయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. వేణుగోపాలపురం, ఆదిమాకులపల్లె, గంగమ్మ గుడి, కొత్తపల్లిమిట్టకు చేరుకుంటారు. కొత్తపల్లిమిట్టలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కొటార్లపల్లెలో మిట్టపల్లె పెద్దబ్బరెడ్డి కుటుంబాన్ని ఓదారుస్తారు. -
జననేతకు నీరాజనం
మంగళహారతులతో స్వాగతం సమస్యలు చెప్పుకున్న చిత్తూరువాసులు ముగిసిన మూడోవిడత జగన్ యాత్ర సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు ఎనిమిదవ రోజు సైతం విశేష స్పందన లభించింది. జననేతకు దారి పొడవునా మహిళలు హారతులు పట్టగా, బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో మేళతాళాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఉదయం చిత్తూరు సమన్యకర్త ఏఎస్.మనోహర్ ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహన్రెడ్డికి బైక్‌ర్యాలీతో ఆహ్వానం పలికారు. పాతకలెక్టరేట్ వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, పలువురు మహిళలతో కలసి హారతులు ఇచ్చారు. ఆయన దుర్గమ్మ గుడికి వెళ్లి అభిషేకం, అర్చనలో పాల్గొన్నారు. సమీపంలోని శివాలయం సిబ్బంది మేళతాళాలతో స్వాగతం పలికారు. ఓటి చెరువు, వల్లియప్పనగర్‌లో మహిళలను జననేత పలకరించారు. విజయ డెయిరీ వద్ద పాడిరైతుల ఉద్యమకారుడు వెంకటాచలం నాయుడు ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. విజయ డెయిరీని ప్రారంభించాలని కోరారు. గతంలో వైఎస్ తమకు దీనిపై మాట ఇచ్చారని అనగానే, ఆ విషయం తన దృష్టిలో ఉందని, తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టరేట్ మీదుగా రెడ్డిగుంట చేరుకోగా మహిళలు స్వాగతం పలికారు. గంగాసాగరంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనుప్పల్లె క్రాస్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. మాపాక్షి క్రాస్ వద్ద రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. సమీపంలోని చీలాపల్లె క్రాస్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొత్తపల్లెలో బాణ సంచా పేల్చి స్వాగతం పలికారు. గుడిపాల వద్ద భారీ ఎత్తున టపాసులు పేల్చారు. జగన్మోహన్రెడ్డి అక్కడ బహిరంగసభలో ప్రసంగించారు. గ్రీమ్స్పేట మీదుగా కణ్ణన్ కాలేజీ చేరుకోగా డాక్యుమెంట్ రైటర్లు ఆయనను కలుసుకున్నారు. ఈ-సేవ వచ్చిన త రువాత తమకు పనులు లేకుండా పోయాయని, తమకు జీవన భృతిలేదని వారు తెలిపారు. ఆర్టీసీ ఒకటవ డిపో ఉద్యోగులు కూడా కలుసుకుని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి దర్గా సర్కిల్‌మీదుగా, ఎమ్మెస్సార్ సర్కిల్ చేరుకుని, తరువాత పీసీఆర్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, సమన్వయకర్తలు ఏఎస్. మనోహర్, ఆర్కే. రోజా, డాక్టర్ సునీల్‌కుమార్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకులు గాంధీ, తలుపులపల్లి బాబు రెడ్డి, పూర్ణం, బాబ్జాన్, వై.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన మూడోవిడత యూత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల ఐదో తేదీన జిల్లాలో చేపట్టిన మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర ఆదివారంతో ముగిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభంకాగా, మదనపల్లె మీదుగా, పీలేరు నియోజకవర్గం చేరుకున్నారు. పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. మూడో విడత యాత్ర ముగించుకుని ఆదివారం సాయంత్రం ఆయన చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. సంక్రాంతి తరువాత జిల్లాలో నాలుగోవిడత యాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. -
అడుగడుగునా ఆదరణ
మహానేతను గుర్తుకు తెచ్చుకున్న జనం జగన్ ప్రసంగానికి జనం జేజేలు సాక్షి, తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో విడత పర్యటనలో భాగంగా ఏడో రోజు సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో చేసిన ప్రసంగం ప్రజ లను విశేషంగా ఆకట్టుకుంది. ఆయనకు అడుగడుగునా ఆదరణ లభించింది. జగన్మోహన్రెడ్డితోనే మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సువర్ణయుగం వస్తుందని ప్రజలు విశ్వా సం వ్యక్తం చేశారు. ఐరాల, తవణంపల్లె మండలాల్లో జరిగిన జగన్మోహన్రెడ్డి పర్యటనకు అడుగడుగునా ఆదరణ లభించింది. అరగొండలో ఆయన మహానేత వైఎస్.రాజ శేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగంతో ఆ ప్రాంతవాసులు ఉత్తేజితులయ్యారు. వైఎస్‌రాజశేఖరరెడ్డి సేవల ను గుర్తుచేసిన ప్రతిసారీ జేజేలు పలికారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేదరికాన్ని అతి దగ్గరగా చూశారని, ఆయన రాష్ట్రంలో 1600 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి పేదవాడి కష్ట సుఖాలను తెలుసుకున్నారని అనగానే, అవును..అవును అంటూ జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎన్నో గొప్ప పథకాలను చేపట్టారని అనగానే వైఎస్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. వైఎస్ ఒక తం డ్రిగా, అన్నగా ప్రజలకు ఎన్నో కార్యక్రమాలను అందించారని తెలిపారు. రాముని రాజ్యం మనం చూడలేదు కానీ, రాజన్న సువర్ణ యుగాన్ని చూశామని అనగానే హర్షధ్వానాలు మిన్నంటాయి. ప్రతి పేద ాడు సరైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లి, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని అన్నారు. తరువాత ఆ ఖర్చుకు పది రూపాయల వడ్డీ కట్టే వారని అన్నారు. ఈ అవసరం లేకుండా పేదవాడి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్రాజశేఖరరెడ్డిదేనని అనడంతో.. వైఎస్సార్ అమర్ రహే అంటూ జేజే లు పలికారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సమన్వయకర్తలు ఆదిమూలం, సునీల్ కుమార్, రాజంపేట పార్లమెంటరీ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, యువజన విభాగం కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, రవిప్రసాద్, బీరేంద్ర, పైమాఘం సుగుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ను చూసినట్లే ఉంది.. జగన్మోహన్రెడ్డి ప్రసంగంపై అరగొండకు చెందిన ప్రజలు స్పందించారు. అరగొండ వెంకటరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని చూసినంత సేపు, వైఎస్‌రాజశేఖరరెడ్డిని చూసినట్లు ఉందని అన్నారు. వైఎస్ తమ కళ్ల ముందు మెదిలారని తెలిపారు. వైఎస్ ఎక్కడికో పోలేదని, తమ గుండెల్లోనే ఉన్నారని తెలిపారు. అదే గ్రా మానికి చెందిన రాఘవయ్య మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిపై తమకు నమ్మకం ఉందని, ఆయన రాజశేఖరరెడ్డి పాలనను మరోసారి తీసుకుని వస్తారని అన్నారు. మంచి పాలనను అందజేయగలిగే శక్తి వైఎస్కుటుంబంలోనే ఉందని అన్నారు. అందుకే ఇంత మంది జనం జగన్మోహన్రెడ్డిని అభిమానిస్తున్నారని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. -
చిన్నపరెడ్డి కుటుంబానికి జగన్ ఓదార్పు
-
చిన్నపరెడ్డి కుటుంబానికి జగన్ ఓదార్పు
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన చిన్నపరెడ్డి కుటుంబాన్ని బుధవారం జగన్ ఓదార్చారు. వైఎస్సార్ అంటే చిన్నపరెడ్డికి ఎంతో అభిమానం ఉండేదని ఆయన హయాంలో వృద్ధాప్య పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, భర్త చనిపోయిన కూతరుకి వితంతు పెన్షన్ పొందామని చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు ఈసందర్భంగా జగన్‌కు తెలిపారు. జగన్ వారికి అన్నివిధాలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. చింతలపల్లెవారి క్రాస్, బురుజుపల్లె, తెట్టుపల్లె, ఈరల్లపల్లె క్రాస్, చిన్నసోమల క్రాస్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. సోమలలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అడుసుపల్లె, సరస్వతీపురం, నింజంపేట, మల్లేశ్వరపురం, రాంపల్లె, కలమండవారిపల్లె మీదగా పట్రపల్లె చేరుకుని అక్కడ పాదం మునస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. కమ్మపల్లె, శీలంవారిపల్లె, తంగేనిపల్లె, సవరంవారిపల్లె, గాంధీనగరం, గురికానివారిపల్లె మీదగా సదుం మండలం చేరకుంటారు. సదుం మండలంలో ఎస్.మతుకువారిపల్లె, నడిగడ్డ, హైస్కూల్ గడ్డలో రోడ్ షో నిర్వహించి యర్రాతివారిపల్లెలో రాత్రి బస చేస్తారు. -
రెడ్డి గౌస్ కుటుంబానికి జగన్ భరోసా
చిత్తూరు : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తను జీర్ణించుకోలేక అసువులు బాసిన రెడ్డి గౌస్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురానికి చెందిన రెడ్డి గౌస్.. వైఎస్ ఇక లేరన్న వార్త విని.. ప్రాణాలు విడిచాడు. గౌస్ మృతితో కుటుంబానికి బాసట కరువైంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న గౌస్ కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. తోడుగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర మంగళవారం పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. గంగాదొడ్డిలో రామచంద్రకుటుంబాన్ని ఓదారుస్తారు. పీలేరులోని గాంధీ సర్కిల్ లో బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. సమైక్య శంఖారావం యాత్రకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. అక్కడ్నుంచి ఓల్డ్ డిగ్రీ కాలేజ్, చింతపర్తి, గండబపోయినపల్లిలో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తూ కలికిరి చేరుకుంటారు. కలికిరి బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం కలికిరిరెడ్డివారిపల్లిలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించి కందూరులో రాత్రిబస చేస్తారు. -
రెడ్డి గౌస్ కుటుంబానికి జగన్ పరామర్శ
-
ప్రాజెక్టులకు పెద్దపీట
=జిల్లాలో నీటి పరిస్థితి దారుణం =చేనేత కార్మికులను ఆదుకుంది వైఎస్ ఒక్కరే =మదనపల్లెలో జగన్ ప్రసంగానికి జేజేలు సాక్షి, తిరుపతి: రాష్ర్టంలో నీటి పరిస్థితి చాలా దారుణం గా ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో మూడో విడత చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా రెండో రోజైన సోమవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి బయలుదేరిన జననేత మదనపల్లెకు చేరుకున్నారు. అక్కడ నీరుగ ట్టువారిపల్లె వద్ద వేచి ఉన్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పరిస్థితి తలచుకుని ప్రతి రైతు ఆందోళనలో ఉన్నాడని అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అదే విధంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేయలేదని అన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు 30 వేల మంది చేనేత కార్మికులకు 320 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. అటువంటి చర్యలు తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి మాటలకు ప్రజలు ‘‘జైజగన్’’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల వంద రోజులు పనిచేసినా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేశారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆయన పథకాలను అమలు చేశారని తెలిపారు. పేదవారి గుండెచప్పుడు వినేవాడే అసలైన రాజకీయ నాయకుడని దివంగత ప్రియతమ నేత అన్నారని తెలిపారు. కానీ నేటి రాజకీయ నాయకులు దిక్కుమాలిన ఆలోచనలతో పాలన సాగిస్తున్నారనగానే, ‘‘అవును’’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. నేటి రాజకీయనాయకులు చేనేత కార్మికుల గురించి కానీ, రైతుల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడం లేదన్నారు. అందుకే అందరూ కలసి ఒక తాటిపైకి వచ్చి, రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని తెలిపారు. సోనియా గీసిన గీత దాటని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి మదనపల్లికి వస్తే ఇక్కడి వారు కాలర్ పట్టుకుని అడగాలని అన్నారు. శాసనసభ జరుగుతోందని అందులో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యమంటూ, తెలంగాణా ఎమ్మెల్యేలతో విభజనకు సానుకూలత తెలుపుతూ నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని అనగానే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానున్న ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగబోతున్నాయని గుర్తు చేశారు. మన నీటికోసం మనం తన్నుకుని చావాలా అని అడిగితే, ప్రజలు ‘నో’ అని సమాధానం చెప్పారు. ఢిల్లీ మనసులు మారేలా గట్టిగా అరిచి రెండు చేతులెత్తి చెప్పాలని ఆయన కోరగానే పెద్దగా నినాదాలు చేశారు. జైసమైక్యాంధ్ర అనమనగానే గట్టిగా అరవడంతో, మీ నినాదాలతో ఢిల్లీకి కనువిప్పు కలగాలని ఆశిస్తున్నానన్నారు. ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఏఎస్.మనోహర్, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, యువజన విభాగం కన్వీనర్ ఉదయకుమార్, నాయకులు రంగారెడ్డి, అక్తర్ అహ్మద్, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగన్ యాత్ర సాగుతుందిలా..
సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడవ విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా సోమవారం నాటి పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సోమవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి ప్రారంభం తట్టివారిపల్లె, గౌనివారిపల్లె, చేనేతనగర్, సర్కార్ తోపు, ఎలకపల్లె, అమ్మచెరువు మిట్ట, నీరుగట్టు వారిపల్లె మీదుగా గొల్లపల్లెల్లో రోడ్ షో గొల్లపల్లెలో కంచికొమ్మల వెంకటరామయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. తట్టివారిపల్లెలో విగ్రహాన్ని ఆవిష్కరించి, తురకపల్లె, ఆరోగ్యవరం, పోతబోలు క్రాస్, కొత్తవారిపల్లె క్రాస్, గుడిసెవారిపల్లె, సీటీఎం క్రాస్ వరకు రోడ్డుషో. సీటీఎం గంగపురంలో శనక్కాయల గుర్రప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి పూలవాండ్లపల్లె, కాశిరావు పేటలో రోడ్‌షోలో పాల్గొని, వాల్మీకిపురంలో బస చేస్తారు. -
సుభాన్ షాహెబ్ ఫ్యామిలీకి పరామర్శ
-
అంజన్న కుంటుంబానికి జగన్ పరామర్శ
-
అడుగడుగునా ఆత్మీయత
-
ఓదార్పు యాత్రకు అనుమతివ్వండి