
చెరగని చిరునవ్వు.. ఆత్మీయ పలకరింపు
తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చి మనసున్న నేతగా రుజువు చేసుకున్నారు వైఎస్ జగన్.
'నాన్న నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. కొడుకులా దీవిస్తున్నారు. తమ్ముడిలా ఆదిస్తున్నారు. ఇంత మంది తోడుగా ఉంటే నేను ఒంటరినెలా అవుతాను. నేను ఒంటరినని ఎవరైనా అనగలుగుతారా' ఓదార్పుయాత్రలో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఎక్కువగా వినపడిన పలుకులివి. జనం తనమై చూపుతున్న ప్రేమాభిమానాలకు మహానేత తనయుడి మాటలు అద్దం పడుతున్నాయి.
'పెద్దాయన' అకాల మరణంతో తీవ్ర మనోవేదన అనుభవించిన వైఎస్ కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారు. వారికి జగన్ భరోసా కల్పించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చి మనసున్న నేతగా రుజువు చేసుకున్నారు. ఆయన ప్రతి మాటలో తనను నమ్ముకున్న ప్రజలపై ఆత్మీయత, అనురాగాలు కురిపిస్తారు. కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ప్రతివారిని ప్రేమగా పలకరిస్తారు. మిగతా నాయకులకు జగన్కే ఇదే తేడా.
జగన్ పలకరింపు ప్రేమపూర్వక ఆత్మీయత కనబడుతుంది. ఆ ఆదరణలో పేద, గొప్ప తేడాలుండవు. తన ఎదుటనున్నది కఠిక దరిద్రుడైనా సంశయించకుండా అతడిని అక్కున చేర్చుకుంటారు. అందుకే జగన్- జనహృదయ నేత అయ్యారు. పేదలైనా ప్రేమతో తనకు పెట్టింది వద్దనకుండా, ఏ సంకోచం లేకుండా తిన్నారు. 'మీకు నేనున్నాను. మీకు ఏ అవసరమొచ్చినా నన్ను కలవండి' అంటూ జగన్ ఇచ్చే భరోసా కొండంత ధైర్యాన్నిస్తుంది.
కష్టాల్లో వారిని చూస్తే ఆయన కదిలిపోతారు. వెంటనే రంగంలోకి పోరాటానికి సిద్ధమవుతారు. ఆయన చేసిన నిరాహార దీక్షలే ఇందుకు నిదర్శనం. తనవారికి అన్యాయం జరిగితే జగన్ ఎంత పోరాటమైనా చేసేందుకు జగన్ వెనుకాడరు. అంతేకాదు మాట ఇస్తే దాని కోసం ఎందాకైనా వెళతారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చిరునవ్వుతో భరిస్తారు. దటీజ్ జగన్!