ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్
వైఎస్‌ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏడో రోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగింది. జననేతకు గ్రామగ్రామాన జనం అపూర్వ స్వాగతం పలికారు. నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల్లో, సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు, సత్యవేడు, నాగలాపురం మండలాల్లో జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. పన్నూరు సబ్‌స్టేషన్, నిండ్ర, కొప్పేడు, పిచ్చాటూరు, నాగలాపురంలో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రజల గుండెల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, పేదరికమనే జబ్బును నయం చేయడానికి నిరంతర కృషి చేసిన వైద్యుడు ఆయనని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
సాక్షి, సత్యవేడు: విజయపురం మండలంలోని సూరికాపురం నుంచి ఆదివారం ఉద యం 9.30 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యా త్రను ప్రారంభించారు. అదే గ్రామం లో తన కోసం వేచి ఉన్న ప్రజలను కలుసుకున్నారు. మహిళలతో ముచ్చటించారు. సూరికాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. గాంధీ, నెహ్రూ ఫొటోలవద్ద నివాళులర్పించా రు. విద్యార్థులను పలకరించారు. అక్క డ నుంచి జగన్నాథపురం వరకు రోడ్ షో నిర్వహించారు. మాధవరం గ్రామంలోనే మూడుచోట్ల మహిళలు జగన్‌ను ఆపి చూసేందుకు పోటీ పడ్డా రు. ఆయన అందరినీ పలకరించడం తో సంతోషంగా వెనుదిరిగారు.
ఈ గ్రామంలో వెంగమ్మ అనే వృద్ధురాలిని జననేత పలకరించారు. తనకు పింఛన్ రావడం లేదని ఆమె జగన్ దృష్టికి తెచ్చింది. ఇక్కడే విద్యార్థులను పలకరించారు. పన్నూరు దళితవాడలో చర్చిలోకి వెళ్లి ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్ ఇక్కడ తమిళంలో ప్రార్థనలు వినిపించారు. తన కోసం వేచి ఉన్న మహిళలను జగన్ కలిశారు. ఈ గ్రా మంలో సర్పంచ్ పి.లక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ తోరణాలు, ఫ్లెక్సీలు ఏ ర్పాటుచేసి భారీగా స్వాగతం పలికా రు. పన్నూరు గ్రామంలోనూ మూడు చోట్ల ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని ఆపి మాట్లాడారు. రైతులు జననేతను కలిసి సమస్యలు తెలియజేశారు. యువకులు జననేతను చూసేందుకు మిద్దెలపైకి ఎక్కి నిలబడ్డారు.
పులివెందుల పులిబిడ్డ జగన్ నాయకత్వం వర్థిల్లాలి, జగనన్న గుర్తు ఫ్యాను గుర్తు అంటూ యువకులు పదేపదే నినాదాలు చేశారు. ఈ ఊర్లోనే ఇళ్లత్తూరుకు చెందిన చిరంజీవి అనే వికలాంగుడిని ఆయన పలకరించారు. విద్యుత్‌షాక్‌తో చేయి కోల్పోయానని ఆ యువకుడు తెలిపాడు. పింఛన్ వస్తోందా అని ఆరా తీశారు. పన్నూరు సబ్‌స్టేషన్ వెళ్లే దారి లో హైదరాబాద్ నుంచి వచ్చిన 15 మంది ఏపీ ప్రయివేటు బస్సు ఆపరేటర్ల సంఘం నాయకులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మహానేత విగ్రహావిష్కరణ
పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు కాన్వాయ్‌ను నిలిపేసి జననేతకు స్వాగతం పలికా రు. తమ అభిమాన నాయకుడి నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. పన్నూరు సబ్‌స్టేషన్ రోడ్డు జంక్షన్‌లో మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ఒక అభిమాని వీర ఖడ్గం బహూకరించారు. దానిని అభిమానుల కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఒకసారి గాలిలో తిప్పారు.
విగ్రహావిష్కరణకు విచ్చేసిన జనంతో పన్నూరు సబ్‌స్టేషన్ కూడలి కిక్కిరిసింది. స్థలం సరిపోకపోవడంతో జనం ముఖ్యంగా మహిళలు మిద్దెలపైకి, భవంతులపైకి ఎక్కి జగన్‌ను చూడడం కనిపించింది. ప్రజలు జగన్ మాట్లాడాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. మైక్ లేదని తెలుపుతూ సైగలు చేస్తూ ఆయన రోడ్‌షో కొనసాగించారు. అక్కడ నుంచి యల్లసముద్రం వరకు రోడ్ షో జరిగింది. గ్రామస్తులు ఇక్కడ సమైక్య సింహం వై.ఎస్.జగన్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం అందరినీ ఆకర్షించింది.
చర్చిలో ప్రార్థనలు
నిండ్ర గ్రామం చేరుకుని మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. గ్రామంలోని చర్చికెళ్లి ప్రార్థనలు చేశారు. ఇక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పేదరికానికి వైద్యం చేసిన డాక్టర్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన సువర్ణపాలనలో పేదల కోసం ఎన్నె న్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అంతకుముందు నిండ్ర శివార్ల నుంచి డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి షుగర్ ఫ్యాక్టరీ గేటు, ఉద్యోగుల క్వార్టర్‌స వద్ద జరిగిన రోడ్‌షోలో జనాన్ని జగన్ పలకరించారు. తర్వాత నిండ్ర మండలంలోని కొప్పేడు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. అనంతరం బయల్దేరి సత్యవేడు నియోజకవర్గం చేరుకున్నారు.