చంద్రగిరి నియోజకవర్గంలో ఘనస్వాగతం
చంద్రగిరి నియోజకవర్గం లో ఓదార్పు, సమైక్య యాత్రకు విచ్చేసిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించిం ది. వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి రూరల్, చంద్రగిరి, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం మండలాల నుంచి వచ్చిన నాయకులు దామినేడు వద్ద ఘన స్వాగతం పలికారు. వీరిలో నాయకులు ఉపేందర్‌రెడ్డి, చిన్నియాదవ్, బ్రహ్మానందరెడ్డి, చంద్రారెడ్డి, రుద్రగోపి, శివశంకర్, ఎంపీటీసీ మాజీ సభ్యులు సుబ్రమణ్యం, మాధవరెడ్డి, అవిలాల లోక తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. సభ అనంతరం జననేత తిరుచానూరు క్రాస్, అవిలాల క్రాస్, అవి లాల, ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్, వైకుంఠపురం ఆర్చి సెంటర్ మీదుగా తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటికి రాత్రి బసకు చేరుకున్నారు. అవిలాలలో మహానేత వైఎస్‌ఆర్ విగ్ర హాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా ప్రజలు ప ట్టుదలతో మహానేత విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉం దన్నారు. ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాద్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్, ఆర్‌టీసీ వైఎస్‌ఆర్‌టీయూసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లతారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, నాయకులు వై.సురేష్, విరూపాక్షి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.