తెలంగాణ ప్రాంతంలో పర్యటించాలని పార్టీ నాయకులు వైఎస్ జగన్‌ను కోరారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు గట్టు రామచంద్రరావు తెలిపారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను వైఎస్ జగన్ ఎన్నో ఆటంకాల మధ్య కలుసుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణలోని ఖమ్మం మినహా 9 జిల్లాల్లో దాదాపు 250 కుటుంబాలను కలుసుకోవాల్సి ఉందన్నారు. అతిత్వరలోనే ఓదార్పుయాత్రను తెలంగాణలో ప్రారంభించాలని వైఎస్ జగన్ నిర్ణయించారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో త్వరలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. తెలంగాణ అంతటా ఓదార్పుయాత్ర ఉంటుందన్నారు. వైఎస్ జగన్ నిర్ణయంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారని వెల్లడించారు. సోనియా నియంతృత్వాన్ని ఎదిరించినందుకే జగన్ జైలు పాలయ్యారన్నారు. వైఎస్ జగన్‌కు హైకమాండ్ ప్రజలేనని అన్నారు. చంద్రబాబు నాయుడుకు హైకమాండ్ టెన్ జనపథ్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కిరణ్‌లకు పూర్తిగా స్క్రిప్ట్ అంతా టెన్ జనపథ్ నుంచే వస్తోందని ఆరోపించారు. కిరణ్‌పై ఇవాళ విమర్శలు చేస్తున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కాంగ్రెస్ సర్కారును కాపాడారని గుర్తు చేశారు. విప్ జారీచేసి అధికారపక్షాన్ని కాపాడిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఒక్కరేనని అన్నారు. అంత హీనమైన చరిత్ర ఉన్నచంద్రబాబు... జగన్‌పై విమర్శలు చేయడం దారుణమని గట్టు రామచంద్రరావు అన్నారు.
Published Mon, Feb 24 2014 5:52 PM | Last Updated on Wed, Mar 20 2024 1:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement