Gattu Ramachandra Rao
-
జనంలో ఎదిగిన నాయకుడు జగన్: గట్టు
సాక్షి, హైదరాబాద్: ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందినప్పటికీ ఆయన ప్రజల మధ్యలోనే ఎదిగారని, ప్రజలలోనే పెరిగారని ఆయన అభిప్రాయడ్డారు. ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడు కూడా నష్టపోడని, ప్రజలు లేకపోతే తానులేనుకునే నాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు. వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ‘సాక్షి టీవీ’తో రామచంద్రరావు మాట్లాడారు. సొంత పార్టీ పెట్టుకుని ప్రజల అభిమానాలు, ఆదరణను జగన్ పొందారని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే కేవలం 5 లక్షల 40వేల ఓట్లు మాత్రమే వైఎస్సార్సీపీ కంటే ఎక్కువగా వచ్చాయని, బీజేపీ లేకపోతే అన్ని ఓట్లు కూడా రావని వెల్లడించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సొంత పార్టీని స్థాపించి నేడు 67 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎంపీలు సాధించి ఏపీలో బలమైన నేతగా జగన్ ఎదిగారని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో తనకు బలం సరిపోదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పొత్తుల కోసం ప్రయత్తిస్తున్నారని, ఏపీలో కూడా టీడీపీకి బలం సరిపోదని చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ ముందు చంద్రబాబు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు జగన్, ఆయన వ్యతిరేకుల మధ్యనే జరుగుతాయని, భవిష్యత్తులో ఆయనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. -
కూటమికి టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తాలేదు: గట్టు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా మహాకూటమికి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2 నెలల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఓటేయాలని అడిగే స్థాయి కూడా లేని కూటమి నేతలు ప్రజల్లో అభాసుపాలవుతారన్నా రు. తెలంగాణను విచ్ఛిన్నం కాకుండా చూసి అభివృద్ధి ఫలాలను అన్నివర్గాలకు పంచిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆరేనని అన్నారు. -
కాంగ్రెస్ ది కుంభకోణాల చరిత్ర: గట్టు
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, కుతంత్రాల చరిత్ర వున్న టీడీపీలకు టీఆర్ఎస్, ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రజలంతా రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటుంటే కాంగ్రెస్, టీడీపీలకు మింగుడుపడటం లేదని శుక్రవారం విమర్శించారు. కేసీఆర్ దీక్షను విమర్శించడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చూస్తు న్న చంద్రబాబు కుట్రలకు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రతిరూపమన్నారు. ప్రజల మద్దతు లేక, కార్యకర్తలు వెంట రాక నిరాశతో, మతిభ్రమించి కాంగ్రెస్, టీడీపీ తిక్కతిక్కగా మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. -
'తెలంగాణలో టీడీపీ చచ్చిపోయింది'
హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఆ విషయం వెల్లడైందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బుధవారం హైదరాబాద్‌లో గట్టు రామచంద్రరావు స్పందించారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. టీడీపీతో జట్టు కట్టడం వల్లే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. డిసెంబర్ 27వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 10 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. -
'చంద్రబాబు అరాచకవాది'
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఒక అరాచక వాదిగా మారాడాని టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు మండిపడ్డారు. బాబు వంటి అరాచక వాదులు రాజకీయాల్లో ఉండొద్దని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి రామారావు ఆశించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం గట్టు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఎపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా బాబుకు లేదని అన్నారు. ప్రజలు హామీల మీద నిలదీస్తారన్న భయంతోనే ఏపీలో కాకుండా హైదరాబాద్‌లో మహానాడు నిర్వహించారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించేంత సీన్ బాబుకు లేదన్నారు. ఎన్టీఆర్‌కు ఉన్న లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు. -
'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి'
-
'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి'
హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావుపై దాడి చేసిన ఏలూరు ఎంపీ మాగంటి బాబును వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణలోని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గట్టు రామచంద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మాగంటి బాబు ఆయన గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు నీకేమైనా ఓటు వేశారా అని మాగంటి బాబును గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే దాడిపై తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్రా సీఎం, గవర్నర్‌ను కలవనున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని గట్టు ఆరోపించారు. అయితే తాటి వెంకటేశ్వరరావుపై దాడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు ఖండించారు. శుక్రవారం తాటి వెంకటేశ్వరరావుకు హరీష్ రావు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి గల కారణాలను హరీష్ రావు ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. -
రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు?
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. చంద్రబాబు ఒక విషసర్పం లాంటివాడని విమర్శించారు. ఈ రోజు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గట్టు మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది మీరు కాదా?అంటూ బాబును నిలదీశారు. ఆయన రక్తచరిత్ర ఉన్న వ్యక్తి అని గట్టు ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్టీఆర్ చివరి ప్రసంగాన్ని మరోసారి మహానాడు వేదికపై ప్రసారం చేయగలవా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ మహానాడు అనేది 'సొంతడబ్బా-పరనిందలా' కనిపిస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చంపుతున్నది వాస్తవం కాదా?అని గట్టు నిలదీశారు. ఎన్నికల హామీలను నెరవేర్చేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. -
రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు?
-
బాబు వ్యాఖ్యల మర్మమేంటి?: గట్టు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనపై సుమారు 11 ఏళ్ల క్రితం అలిపిరిలో జరిగిన దాడి కేసును దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పక్కదారి పట్టించారని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో కానీ, ఆయన మరణించిన తర్వాత ఇద్దరు సీఎంలు మారినప్పుడు కాని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు.. 11 ఏళ్ల తర్వాత అలిపిరి కేసును వైఎస్ పక్కదారి పట్టించారని చెప్పడం వెనక ఏదో కుట్ర దాగున్నట్లు తెలుస్తోందని గట్టు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘2003లో సీఎంగా ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లా అలిపిరి వద్ద నక్సల్స్ దాడిలో గాయపడినప్పుడు స్వంత కేబినెట్ సభ్యులు కూడా పరామర్శకు వెళ్లలేదు. వారంతా వేరే దగ్గర సమావేశమై ఎవరు సీఎం కావాలంటూ చర్చించుకుంటున్న దశలో... రాజశేఖరరెడ్డి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అంతేకాదు దాడి జరిగిన ప్రదేశంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. దేవుడే చంద్రబాబును రక్షించారని చెప్పి ఆయన కంటనీరు పెట్టుకున్న విషయం గుర్తులేదా’’ అని గట్టు ప్రశ్నించారు. అలాంటి వైఎస్ మీద అభాండాలు వేయడం చంద్రబాబు నైజాన్ని తెలియజేస్తోందన్నారు. ‘వైఎస్ సీఎం అయ్యాక గంగిరెడ్డి విషయంలో కాని, కాల్పుల ఘటనలో బాలకృష్ణ విషయంలో గానీ ఎక్కడా ఉపేక్షించారని మేము నమ్మడంలేదు. రాజశేఖరరెడ్డి చట్టాన్ని ఎప్పుడూ గౌరవించేవారు. చట్టం ముందు అందరూ సమానమేనని నమ్మిన వ్యక్తి వైఎస్. ఎవరి మీద పగతీర్చుకోవాలనో, అధికారాన్ని ఉపయోగించో, కుట్రలు పన్నో ఎదుటి వారిని ఎదుర్కోవాలనే లక్షణం వైఎస్‌ది కాదు’ అని అన్నారు. దరిద్రపు అవలక్షణాలన్నీ చంద్రబాబుకు ఉండబట్టే 11 ఏళ్ల తర్వాత అలిపిరి ఘటనను చర్చకు తీసుకొస్తున్నారని, రాబోయే కాలంలో జరగబోయే కుట్రకు చంద్రబాబు సంకేతమిచ్చినట్లుగా అర్థమవుతోందని గట్టు అన్నారు. -
బాబూ.. 11 ఏళ్ల తర్వాత అలిపిరి ఘటన గుర్తుకొచ్చిందా?
హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం జరిగిన అలిపిరి ఘటనలో ముద్దాయి గంగిరెడ్డి గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడటం వెనుక అసలు కుట్ర ఏంటని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. అలిపిరిలో దాడి జరిగిన తర్వాత ఏడెనిమిది నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో ఆయన ఏం చేశారని నిలదీశారు. ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ, వైఎస్ మరణాంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న సమయంలో కానీ చంద్రబాబు ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అలిపిరి ఘటన తర్వాత అందరికంటే ముందు చంద్రబాబును పరామర్శించింది వైఎస్ఆరేనని గుర్తు చేశారు. చట్టం ముందు అందరూ సమానమని వైఎస్ భావించారని, వైఎస్‌పై అభాండాలు వేయడం చంద్రబాబుకు తగదని గట్టు రామచంద్రరావు హితవు పలికారు. -
'ఆనాడు మీ మంచి కోరింది వైఎస్సార్ కాదా..?'
-
లగడపాటి సర్వే సన్నాసి సర్వే....
హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ లగడపాటి సర్వే సన్నాసి సర్వే అని వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వే బెట్టింగ్‌ల కోసమేనని అన్నారు. ఆయన రాజకీయాలు మానేసి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని గట్టు రామచంద్రారావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని లగడపాటికి తెలుసునని, అయితే బెట్టింగ్‌ల ద్వారా సంపాదనే లక్ష్యంగా లగడపాటి సర్వే ఉందన్నారు. 16వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత లగడపాటి కమండలం పట్టుకుని హిమాలయాలకు వెళతారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని గట్టు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఇటువంటి సర్వేలన్ని రివర్స్ అవ్వడం ఖాయమన్నారు. -
టీడీపీ ఉపశమనానికే పనికొస్తాయి : గట్టు
మున్సిపోల్స్ 20శాతం ఓటర్లకు సంబంధించినవే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం:గట్టు సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఎటూ ఓడిపోతామని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నాలుగురోజుల పాటు ఉపశమనం పొందడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పనికి వస్తారుు తప్ప అంతకుమిం చిన ప్రభావం ఏమీ ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ నెల 16వ తేదీన వెల్లడయ్యే శాసనసభ, లోక్‌సభ ఫలితాల్లో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవని గట్టు సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఇవి తాము ఊహించని ఫలితాలేమీ కాదని, ఐదారు మున్సిపాలిటీలు అదనంగా వస్తాయనుకున్నాము కానీ రాలేదని అన్నారు. టీడీపీ మున్సిపల్ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుని డబ్బు విపరీతంగా కుమ్మరించిందని అందుకే ఎక్కువ సీట్లు పొందగలిగిందని చెప్పారు. పైగా ఈ ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రి కావాలా...వద్దా? అనే అంశంపై జరిగినవి కావని, అలాగే టీడీపీ వాళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓట్లడిగిన ఎన్నికలు కావన్నారు. తాము గెల్చుకున్న మున్సిపాలిటీలన్నీ కొత్తగా టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి గెల్చుకున్నవిగా మీడియా గుర్తించాలని కోరారు. ఇవి కేవలం 90 నియోజకవర్గాల పరిధిలోని 20శాతం ఓటర్లకు సంబంధించిన ఫలితాలేనని.. పేద, బడుగు, బలహీన, మైనారిటీవర్గాల వారు 80 శాతం మంది గ్రామీణ ఓటర్లలో ఉన్నారని వివరించారు. 2006లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి ఎంపీటీసీల్లో 38 శాతం ఓట్లు వస్తే జెడ్పీటీసీలకు వచ్చేసరికి 31 శాతానికి పడిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీల్లో 51 శాతం ఓట్లు వస్తే జెడ్పీటీసీలకు వచ్చేటప్పటికి 61 శాతానికి పెరిగాయని తెలిపారు. ఒకే ఎన్నికల్లో రెండు పదవులకు పోలైన ఓట్ల వ్యత్యాసం 10 శాతం ఉండటం గమనించాల్సిన విషయమన్నారు. అసలివి అంత పరిగణనలోకి తీసుకోవాల్సిన ఎన్నికలే కావని, మున్సిపల్ ఎన్నికల తరువాత మోడీ, పవన్‌కళ్యాణ్ విషయంలో సీమాంధ్రలో వచ్చిన వ్యతిరేకత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి బాగా లాభం చేకూరుస్తుందని తెలిపారు. సీమాం ధ్రను విభజించిందే బీజేపీ అన్న భావన ప్రజల్లో ఉందన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు వైఎస్సార్సీపీకి ఎందుకు దూరమయ్యారనేది తాము విశ్లేషించుకుంటామని గట్టు చెప్పారు. సంస్థాగతంగా వైఎస్సార్సీపీ ఇంకా బలపడాల్సి ఉందన్న వాస్తవాన్ని కూడా గ్రహించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యతపై సంబరాలు జరుపుకుంటున్న వారికి కూడా శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందనే విషయం తెలుసునని చెప్పారు. -
ఇక చంద్రబాబుకు సింగపూరే గతి!: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు బిచాణా ఎత్తేసి సింగపూర్‌కు వెళ్లిపోవడం ఖాయమని, ఆయన తిరిగి ఎప్పటికీ కోలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మే 16న వెలువడే ఫలితాల్లో తమ పార్టీ సీమాంధ్రలో కింగ్, తెలంగాణలో కింగ్ మేకర్ అవుతుందని.. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, పవన్‌కల్యాణ్, ఎల్లో మీడియా కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పనిచేయలేదని విమర్శించారు. ఇప్పటికే ఓటమికి గల మార్గాలను వెతుక్కునే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు నరేంద్ర మోడీ, పవన్‌ను మెచ్చుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల తర్వాత వారిని కచ్చితంగా విమర్శిస్తారని.. వారి వల్లే ఓడిపోయానని బాబు చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. తాను చేసే తప్పులన్నీ ఇతరులపై నెట్టడం బాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. దాడులకు పాల్పడుతూ, దొంగ నోట్లు, మద్యం పంచుతూ టీడీపీ నేతలే పట్టుబడితే.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న బాబు మాత్రం తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఎల్లో మీడియా రాసిన కథనాలను ప్రతీ ఒక్కరూ నమ్మాలని, వారు చేసే ప్రతి పనికి మీడియా సంఘాలు మద్దతివ్వాలని అంటూ బాబు అడ్డగోలు వాదన చేస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఈ సందర్భంగా సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. టీడీపీ నేతల వద్ద కోట్ల రూపాయలు పట్టుబడినా సమాధానం ఉండదన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా మే 16 తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక పక్కవాడికోసం పార్టీ పెట్టిన ఘనత పవన్ కల్యాణ్‌దేనని, ఆయన కూడా మే 16 తర్వాత కనుమరుగవడం ఖాయమని గట్టు పేర్కొన్నారు. -
'సింగపూర్‌కు బిషాణ ఎత్తేయడానికి బాబు రెడీ'
హైదరాబాద్: సీమాంధ్రలో తమ భారీ మెజారిటీ ఖాయమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలోనూ వైఎస్ఆర్ సీపీ కింగ్ మేకర్‌గా అవతరిస్తుందని చెప్పారు. టీడీపీ-బీజేపీ మాయాకూటమి కుతంత్రాలు ఎన్నికల్లో పనిచేయలేదన్నారు. సీమాంధ్రలో 80 శాతం అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాలను YSRCP కైవసం చేసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఎన్నికలు ఏకపక్షంగా సాగాయన్నారు. దుష్టచతుష్టయం చంద్రబాబు, వెంకయ్య, పవన్, ఎల్లో మీడియా కుట్రలు ఏమాత్రం పనిచేదన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు కొలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయన్నారు. జేఎస్పీ.. టీడీపీకి బినామి సంస్థ అని ఆరోపించారు. పక్కవారి కోసమే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే బాటలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత వల్ల మోడీ హవా రాష్ట్రంలో ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా చంద్రబాబు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. చంద్రబాబు ఈ ఓటమితో హ్యట్రిక్ కొట్టబొతున్నారని పేర్కొన్నారు. సింగపూర్‌కు బిషాణ ఎత్తేయడానికి బాబు రెడీ అయ్యారన్నారు. బెట్టింగ్ బిజినెస్ కోసమే లగడపాటి సర్వేలు చేస్తున్నారని ఆరోపించారు. మే 16 తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించరని చెప్పారు. పథకం ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు. -
'ఫలితాల తర్వాత టీడీపీ కనుమరుగు'
-
ఓటమిని అంగీకరించలేకనే...
-
'పవన్‌ను దసరా మేకపోతులా దండేసి తిప్పుతున్నారు'
సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు దసరా పండుగకు మేకపోతులా దండేసి ఊరూరు తిప్పుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన బాబు, త్వరలోనే పవన్‌కు కూడా వెన్నుపోటు పొడుస్తాడని ఆయన జోస్యం చెప్పారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సైన్యమని రామచంద్రరావు అన్నారు. రామోజీరావు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మూటాముల్లె సర్దుకుంటున్నారని, వాళ్లు ఏ దేశం వెళ్లినా తిరిగి ఇద్దరినీ తీసుకొచ్చి, నడిరోడ్డుపై విచారణ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. చిత్తూరు జిల్లా అలిపిరిలో జరిగిన దాడి సంఘటన తర్వాత ముఖ్యమంత్రి పదవి పొందడం కోసం ఎవరు పాకులాడారో చంద్రబాబు నాయుడకు తెలియదా అని గట్టు రామచంద్రరావు నిలదీశారు. కేవలం అధికారం పొందడం కోసం నానా పార్టీలతో కూటమి కట్టి, అందరి మద్దతున్నా ఓడిపోయిన ఘనత కూడా ఆయనదేనని ఎద్దేవా చేశారు. -
వైఎస్సార్సీపీని చూసి బాబు బెంబేలు
పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్య హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో కింగ్ అవుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోనూ కీలక భూమిక పోషించనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. సీమాంధ్రలో అధికారంలోకి రాబోతున్న వైఎస్సార్సీపీని చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ పరిస్థితి అంతంతేనని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు డిప్రెషన్లో పడ్డారని, దీంతో టీడీపీని పిచ్చోడి చేతిలో రాయిలా ఉపయోగిస్తున్నాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబుకి ఓటు వేసే చోట సీటు లేదని, సీటున్న చోట ఓటు లేదని.. ఆయన తనకు, తన పార్టీ గుర్తుకు ఓటేసుకోలేని దుస్థితిలో పడ్డారన్నారు. రాజ్యాంగంపై బాబుకు గౌరవం లేదు.. చంద్రబాబునాయుడికి రాజ్యాంగం, చట్టాలపై గౌరవం లేదని గట్టు రామచంద్రరావు అన్నారు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిర్గతం చేయకూడదన్న ఇంగిత జ్ఞానం సైతం ఆయనకు లేదన్నారు. ఓటు వేసి బయటకు వచ్చి రెండు ఓట్లు బీజేపీకే వేశానని చెప్పుకుంటున్నారంటే.. వారు అనుమానపడతారనా? లేక తమ లవ్వాటను నిరూపించుకునే ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. జైరాంకు ఈ స్థాయి రావడం వైఎస్ చలువే.. సీమాంధ్రలో మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా వస్తాయన్నారు. ఈ పరిస్థితులతో బెంబేలెత్తిపోతున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, జైరాంరమేష్ వైఎస్సార్సీపీపై దాడులకు సిద్ధపడుతోందన్నారు. జైరాం రమేష్‌కు జుట్టు పెరిగింది కాని, బుర్ర పెరగలేదన్నారు. జైరాం రమేష్‌కు ఎంపీ స్థాయి, మంత్రి పదవి అన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలుగు జాతి పెట్టిన బిక్ష అని పేర్కొన్నారు. ‘‘అలాంటి తెలుగుజాతిని ముక్కలు చేసిన నీవు.. జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయంటున్నావే.. మరి 13 ఏళ్లు రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కేసు ఉంది కదా? మరి రాజీవ్‌గాంధీ రాజకీయాలకు పనికిరాడ ని మాట్లాడు..’’అని పేర్కొన్నారు. ‘‘జగన్ ఎందుకు జైలుకు వెళ్లారో నీకు తెలియదా? అది నీవు, టీడీపీ పన్నిన కుట్ర కాదా? జగన్‌పై ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన శంకర్రావుకు, ఆరోపణలు చేసిన డీఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చింది మీరు కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి, వారి కుటుంబాన్ని వేధించినప్పుడు ఏం చేశావు? ఇప్పుడు ఆయన ఆత్మ క్షోభిస్తుందని అంటున్నావా? వైఎస్సార్సీపీ కుబేరుల పార్టీ అని విమర్శలు చేస్తున్నారే.. కాంగ్రెస్ పార్టీ గోచిగుడ్డ పార్టీనా? చొక్కా లాగు లేకుం డా కాంగ్రెస్ నాయకులు గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నారా? కాంగ్రెస్ వారిపై ఆరోపణలు లేవా? కోట్ల ఆస్తులు లేవా? కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తులను ఒక్కసారి చూసుకో.. వైఎస్సార్సీపీలోకి వ్యాపారం కోసం పోతున్నారా? మరి టీడీపీలోకి ఎందుకు పోతున్నారు? కాంగ్రెస్‌ను పాడెపై పడుకొబెట్టి.. దానిని పట్టుకొని లెమ్మంటే లేవకుంటే.. పక్కవారిపై ఏడిస్తే ఏం వస్తది’ అన్నారు. వైఎస్సార్‌కు ప్రజాభిమానం ఉందని, ప్రజాదరణ నుంచి జగన్ వస్తున్నారని, 30 వేల కిలోమీటర్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఆయన అధికారంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. -
'సీమాంధ్రలో కింగ్స్, తెలంగాణలో కింగ్ మేకర్స్'
హైదరాబాద్: తెలంగాణలో తాము కింగ్ మేకర్లుగా అవతరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను గెల్చుకునే అవకాశముందని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోందన్నారు. తెలంగాణలో తమకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వస్తాయని దీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి వస్తే వైఎస్ఆర్ సీపీ కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. తెలంగాణలో తాము కింగ్ మేకర్ పాత్ర పోషించబోతున్నామని అన్నారు. 'సీమాంధ్రలో మేం కింగ్స్, తెలంగాణలో కింగ్ మేకర్స్' అని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. -
'జైరాంకు జుట్టు పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదు'
హైదరాబాద్: జైరాం రమేష్‌కు జుట్టు పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. కోళ్ల ఫాం నుంచి వచ్చిన కోడిపిల్ల లాంటి వాడని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడికే విషయాలు తెలుస్తాయన్నారు. జైరాం రమేష్‌కు పదవి వైఎస్ఆర్ తోడ్పాటుతో తెలుగుజాతి పెట్టిన భిక్ష అని అన్నారు. రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కేసు ఉన్న విషయం జైరాం రమేష్ మరిచాడా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఎందుకు జైలుకు వెళ్లారో జైరాంకు తెలియదా అని అడిగారు. జైరాం రమేష్, చంద్రబాబు కలిసి పన్నిన కుట్రలో భాగంగానే వైఎస్ జగన్ జైలుకు వెళ్లారని ఆరోపించారు. వైఎస్ఆర్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు జైరాం రమేష్ ఎక్కడున్నాడని గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. -
తెలంగాణాలో కింగ్ మేకర్‌గా వైసీపీ: గట్టు
-
సుజనా చౌదరిని అరెస్టు చేయాలి: గట్టు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బినామీ అయిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అవినీతి బాగోతాలు స్పష్టంగా బయటపడినందున ఆయనను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. సుజనా చౌదరిని ఇంటరాగేషన్ చేస్తే చంద్రబాబు అవినీతికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెల్లడవుతాయన్నారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... సుజనా చౌదరి మారిషస్‌లోని కమర్షియల్ బ్యాంక్‌కు రూ.120 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన వైనాన్ని వివరించారు. సుజనా చౌదరి అక్రమాల నేపథ్యంలో ఆయన బ్యాంక్ ఖాతాలతోపాటు, ఆఫీసు ఫర్నీచర్‌ను సైతం జప్తు చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు. ‘‘సుజనా చౌదరిపై కేసు వేసింది మన దేశంలోని వ్యక్తులు కాదు. మారిషస్ వ్యక్తి వచ్చి హైదరాబాద్‌లో కేసు వేస్తే... న్యాయస్థానం ఏకంగా ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. అంటే మారిషస్‌లోని కోర్టులు ఈ పాటికి ఉత్తర్వులు జారీ చేసుంటాయి. కాబట్టే ఇక్కడి న్యాయస్థానాలు కూడా సీరియస్‌గా తీసుకున్నాయి’’ అని చెప్పారు. చంద్రబాబు అనే అవినీతి విషవృక్షం ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుందని దుయ్యబట్టారు. బ్యాంక్‌లను మోసం చేయడం, నల్లడబ్బును విదేశాలకు తరలించడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన బినామీలైన సీఎం రమేష్, సుజనాచౌదరి నిత్యం ఇవే పనులపై నిమగ్నమై ఉంటారని ఆరోపించారు. బాబు హయాంలో 65 ప్రభుత్వ సంస్థలను తెగనమ్మడంతోపాటు రహేజా, ఐఎంజీ భారత్ వంటి సంస్థలకు వందలాది ఎకరాల భూములు కేటాయించి, కమిషన్ల రూపంలో వేలాది కోట్లు విదేశాలకు తరలించారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడగానే వాటిని హవాలా రూపంలో దేశంలోకి తీసుకొచ్చి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారన్నారు. హసన్ఆలీ అనే హవాలా వ్యాపారి స్వయంగా చంద్రబాబు పేరును చెప్పకనే చెప్పారని గుర్తుచేశారు. సుజనాచౌదరి తోక పట్టి లాగితే చంద్రబాబు అవినీతి విషవృక్షం బయటపడుతుందన్నారు. ఓట్లు, సీట్లతో పాటు పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకున్న చిరంజీవి కూడా నీతులు వల్లిస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని గట్టు ఎద్దేవా చేశారు. -
'చంద్రబాబు జిరాక్స్ సుజనాచౌదరి'
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు మనీల్యాండరీంగ్ ద్వారా విదేశాల నుంచి వేల కోట్లు రూపాయిలు రాష్ట్రానికి తరలిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో గట్టు రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ.... సుజనా చౌదరిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిరాక్స్ సుజనా చౌదరి అని ఆయన ఆరోపించారు. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. సుజనాచౌదరి మనీ ల్యాండరింగ్ కుంభకోణంపై విచారణ జరపాలని గట్టు రామచంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు. -
జేపీ.. టీడీపీ భజనపరుడు
గట్టు రామచంద్రరావు ధ్వజం హైదరాబాద్ : ఏసీ రూముల్లో పడుకునే లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు పేదల కష్టాలు ఏం తెలుస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. కడుపు నిండిన జేపీకి కడుపు ఎండినవారి గురించి ఆలోచించే సమయం ఉండదని, అందుకే వైఎస్సార్సీపీ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ అర్థం కాలేనట్లుందని విమర్శించారు. ఆయన మంగళవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ తల్లికి అయినా తన బిడ్డను చదివించుకోవాలనే తపన కచ్చితంగా ఉంటుంది. కానీ బిడ్డ తనతోపాటు పనిచేస్తే ఒక పూట గడుస్తుందనే ఆశతో పిల్లల్ని పనిలో పెడుతున్నారే తప్ప బడికి పంపకూడదని కాదు. అందుకే అలాంటి తల్లులకు భరోసానిస్తూ పిల్లల్ని పెద్ద చదువులు చదించేందుకు అమ్మ ఒడి పథకానికి జగన్ రూపకల్పన చేశారు’’ అని వివరించారు. పేదవారి గుండె చప్పుడు నుంచి రూపొందించిన మేనిఫెస్టో కూడా జేపీకి అర్థం కాలేదంటే పేదవాళ్లకు ఆయన ఎంత దూరంగా ఉంటున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. తనకు తాను గొప్ప మేధావినంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తెలుగుదేశం పార్టీకి భజనపరుడిగా మారారని ధ్వజమెత్తారు. -
ప్రజల మేనిఫెస్టో అర్థం కాలేదా?
-
ప్రజల మేనిఫెస్టో అర్థం కాలేదా?
హైదరాబాద్: తమ పార్టీ మేనిఫెస్టో అర్ధం కావడంలేదని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. ప్రజల మేనిఫెస్టో మీకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టుగా మీ పార్టీని టీడీపీలో విలీనం చేయాలని జేపీకి సూచించారు. చంద్రబాబు చేతిలో పావులా జేపీ మారారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలని ఒక్కసారైనా డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. జేపీ వ్యాఖ్యలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని గట్టు రామచంద్రరావు అన్నారు. -
'కావాలనే జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు'
-
'పరుగెత్తేవారి కాళ్లలో కాళ్లుపెడుతున్నారు'
హైదరాబాద్: చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట్లాడిందే ఈనాడు రాసిందని ఆరోపించారు. ఎన్నికల్లో పరుగెత్తలేక పరుగెత్తేవారి కాళ్లలో చంద్రబాబు, రామోజీరావు కాళ్లుపెడుతున్నారని ధ్వజమెత్తారు. టైటానియం ప్రాజెక్టు కుంభకోణంలో వైఎస్ఆర్ సమీప బంధువు పాత్ర ఉందని 'ఈనాడు'లో వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు. రామోజీరావు, చంద్రబాబు చుట్టూ బిగిసిన ఉచ్చులపై విచారణ జరిగి ఉంటే అదివేరేలా ఉండేదన్నారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని విచారణ నుంచి తప్పించుకోకుంటే వీళ్ల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకునేదన్నారు. చంద్రబాబు జనామోదాన్ని పొందలేక ఇలాంటి రాతలు రాస్తున్నారని ఆరోపించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తాను ముడుపులేవీ ఇవ్వలేదని చెప్తున్నారని తెలిపారు. దేశ నాయకుల మీద అమెరికా చట్టాలు అభియోగాలు మోపిన విషయం మరిచిపోరాదన్నారు. సిక్కుల అల్లర్లకేసులో సోనియా, గోద్రా అల్లర్ల కేసులో మోడీకి వీసా రానీయకుండా అడ్డుకున్నది అమెరికా చట్టాలేనని గుర్తు చేశారు. అభియోగాలు నిరూపించాల్సింది దేశంలోని కోర్టులు తప్ప ఇతరత్రాకావని గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. -
''ఈనాడు రాసిందే.. చంద్రబాబు వాగాడు''
-
'పవన్‌తో పొత్తుకు బాబు తహతహ'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తహతహలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో అన్న చిరంజీవి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన పవన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారన్నారు. అలాంటి చంద్రబాబు ప్రస్తుతం పవన్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు అనుసరిస్తున్నవైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో గట్టు రామచందరావు విలేకర్లతో మాట్లాడారు. అలాగే గత ఎన్నికలలో ప్రచారానికి తీసుకువచ్చిన జూ.ఎన్టీఆర్‌ను ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంచుతున్నావని బాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ప్రజాధరణ చూసి బాబు భయపడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఫలితాలు వెంటనే ప్రకటించాలని తాము ఎలక్షన్ కమిషన్‌ను కోరుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఫలితాలకు తాము భయపడటం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో వివిధ పార్టీలలో మహాకూటమీ ఏర్పాటు చేశారని, ఇప్పుడు మాయాకూటమీ ఏర్పాటు చేస్తున్నారని గట్టు రామచందరావు ఎద్దేవా చేశారు. -
ప్రజలు ఎందుకు టీడీపీకి ఓట్లు వేస్తారు?గట్టు
-
చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: గట్టు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద సైకో అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. ఇక ఎన్నటికీ అధికారం దక్కదనే నిరాశా నిస్పృహలతోనే చంద్రబాబు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకు ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనమని చెప్పారు. బాబుకు బాగా పిచ్చి ముదరడంవల్లే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ తమ అధినేత జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించడంలేదనే అక్కసుతో ప్రజలపై కోపం పెంచుకొని తెలుగుజాతిని నిట్టనిలువునా చీల్చేందుకు సహాయపడ్డారని మండిపడ్డారు. -
అంతరించే పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ మండిపడింది. చంద్రబాబుకి అధికారం పిచ్చి పట్టిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన గట్టు.. వైఎస్సార్ సీపీపై బురదచల్లే యత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. .'నీ యొక్క పేరును నీ కుటుంబమే అసహ్యించుకుంటుంది. నీ కుటుంబలో ఏ ఒక్కరూ కూడా నీ పేరు పలకాడానికే ఇష్టపడరు. ఇటువంటి తరుణంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి బాబుకు ఎక్కడదని' గట్టు ప్రశ్నించారు. ఆయన మతిస్థిమితం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలున్నాయని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలని కుటుంబ సభ్యులను కోరుతున్నానన్నారు. చంద్రబాబు ఎన్ని కుయక్తులు చేసినా అంతరించే పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఆయన మిగిలిపోతారని గట్టు ఎద్దేవా చేశారు. తెలుగు జాతిని ముక్కలు చేసిన ఘనత బాబుకే దక్కుంతుదున్నారు.కుట్రల్లో కుమ్మక్కుల్లో ఆరితేరిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని అన్నారు.చంద్రబాబుకి రాజకీయాల్లో ఇక కాలం చెల్లిందని గట్టు తెలిపారు. ఇకనైనా పార్టీ కార్యకర్తలు మేల్కొని పార్టీని బ్రతికించుకోవాలన్నారు. -
జగన్‌కు బెదిరింపులపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తే అడ్డుకుంటామని బెదిరిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, న్యూడెమొక్రసీ పార్టీల నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న ఖమ్మంలో వైఎస్ జగన్ తలపెట్టిన బహిరంగ సభను అడ్డుకుంటామని కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టువంటివని, అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలు, నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రారావు, బి.జనక్‌ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సోమవారం భన్వర్‌లాల్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీలు వి.హనుమంతరావు, మధుయాష్కీ, ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతరులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని, మానుకోట వంటి సంఘటనలు పునరావృతమవుతాయని భయోత్పాతాలు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టే నేతలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన భన్వర్‌లాల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటుందని, పోలీసు అధికారులను కలవాలని సూచించారు. -
'వైఎస్సాఆర్ సీపీ జనభేరిని అడ్డుకోవద్దు'
-
సింగపూర్, మలేషియా, దుబాయ్.. బాబుకు మూడు కళ్లు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. సీమాంధ్రను సింగపూర్ మాదిరి తయారు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, సింగపూర్‌కు మీకు ఏమిటీ సంబంధమేంటని రామచంద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబుకు సింగపూర్, మలేషియా, దుబాయ్ మూడు కళ్లులాంటివని వ్యాఖ్యానించారు. సింగపూర్‌లో ఉన్న మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు గట్టు సవాల్ విసిరారు. 'ఎన్నికల సర్వేలను మేనేజ్ చేయడంలో మీకు మీరే సాటి. 2004, 2009 ఎన్నికల సందర్బంగా మళ్లీ మీకే పగ్గాలంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించుకున్నది వాస్తవం కాదా? సర్వేలను మేనేజ్ చేయగలరేమో గాని, ప్రజలను మేనేజ్ చేయడం అసాధ్యం' అంటూ చంద్రబాబును ఉద్దేశించి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యలు చేశారు. -
త్వరలోనే తెలంగాణలో జగన్ ఓదార్పుయాత్ర: గట్టు
ఖమ్మంలో బహిరంగ సభ, తర్వాత ఇతర జిల్లాల్లో ఓదార్పు యాత్ర తెలంగాణలో మా పార్టీ బలహీనపడిందన్నది అవాస్తవం: గట్టు జగన్‌పై చంద్రబాబు విమర్శలు ఆకాశంపై ఉమ్మేయడమే హరీశ్‌రావు, మధుయాష్కీకి జగన్ ఫోబియా సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి త్వరలో తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన తెలంగాణ పది జిల్లాల శాసనసభా నియోజకవర్గ సమన్వయకర్తల, ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించాలని జగన్ ఓదార్పు యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికి ఓదార్పు యాత్ర పూర్తయింది. మిగతా జిల్లాల్లో కూడా ఓదార్పు యాత్ర చేస్తారని, ఎప్పటినుంచి అనేది త్వరలో తేదీలను ప్రకటిస్తామని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. మరో అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావుతో కలిసి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పది జిల్లాల నేతలతో సమావేశమై పనితీరును విడివిడిగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమీక్షించారని తెలిపారు. తొలుత ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారని, ఆ తరువాత ఇతర జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేస్తారని తెలిపారు. అంతకుముందు గుంటూరు జిల్లాలో ఇంకా మిగిలిపోయి ఉన్న ఓదార్పు యాత్రను పూర్తిచేస్తారన్నారు. తెలంగాణలో తాను పర్యటించబోతున్నానని జగన్ చెప్పగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోందని తెలిపా రు. ఇంకా ఏమన్నారంటే... తెలంగాణలో మా పార్టీ బలహీనపడిందని ఓ వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ర్పచారంలో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణలో 63 శాతం మంది వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అనే అభిప్రాయంతో ఉన్నారని ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ పునర్నిర్మాణం చేసే శక్తి తనకే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం విడ్డూరం. ముఖ్యమంత్రిగా ఇరు ప్రాంతాలను సర్వనాశనం చేసిన ఘనత ఆయనదే. జగన్‌కు అధిష్టానం టెన్ జన్‌పథ్ అని చంద్రబాబు విమర్శించడం సరికాదు. అసలు చంద్రబాబుకు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరికీ సోనియాగాంధీయే అధిష్టానవర్గం. పార్లమెంట్లో ఎఫ్డీఐపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించడమే కాక, కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ ఆదుకున్న దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ఆకాశమ్మీద ఉమ్మేస్తే అది తన మీదే పడుతుందన్న వాస్తవం బాబు గ్రహించాలి. విభజన వ్యవహారంలో తనది ఏ వైఖరి అని చెప్పకుండా తప్పించుకున్న చంద్రబాబువి ద్వంద్వ ప్రమాణాలు. జగన్ అధికారంలోకి వస్తే మరో జైలు నిర్మిస్తాడని చంద్రబాబు చెప్పడమేంటి? హైటెక్ సిటీ టెండర్లు ఇచ్చినందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు (పార్టీ కార్యాలయ భవనం), సొంత ఇల్లు నిర్మించుకున్న ఘనత చంద్రబాబుది. టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మా అధినేత జగన్ అంటే భయపడుతున్నారు. అందుకే ఆయనను తెలంగాణలో పర్యటించరాదని ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకు పర్యటించకూడదు? జగన్ తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నారు. అది తప్పేమీ కాదు. టీఆర్ఎస్ కూడా ఆంధ్రా ప్రాంతంలో శాఖ ప్రారంభించుకుంటే వద్దన్నదెవరు? ఓదార్పు గురించి జగన్‌కు తెలుసా అని అంటున్న హరీశ్ రావు, ఆయన మామ కేసీఆర్ కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు ఎపుడైనా వెళ్లి ఓదార్చారా? జగన్ తెలంగాణకు వస్తే మానుకోట పునరావృతం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ చెప్పడమంటే ఆయనకు జగన్ ఫోబియా పట్టుకుందనేది అర్థమమవుతోంది. -
త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర
-
మోదుగులపై నామా, రాథోడ్ దాడిచేస్తే చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్‌లు దాడి చేస్తే పార్టీ అధినేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. దాడులకు దిగిన నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గట్టు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో తమపై దాడి జరుగుతుంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డుకోలేదంటూ మోదుగుల అసంబద్ధంగా మాట్లాడటం తగదన్నారు. జగన్‌ను కొందరు మహబూబాబాద్‌లోకి రానివ్వకుండా పెద్ద ఎత్తున అల్లర్లు చేసి దాడులకు దిగినప్పుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఎప్పుడైనా ఖండించారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటీవల కోదాడలో వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటనను అడ్డుకోవాలని మంత్రి జానారెడ్డి పిలుపు ఇచ్చినప్పుడు ఇది తప్పని ఎందుకు ఖండించలేదని నిలదీశారు. వైఎస్సార్సీపీలో అధ్యక్షుడు మొదలుకొని ప్రతీ కార్యకర్త ఒకే మాట మీద నిలబడ్డారని చెప్పారు. టీడీపీలో ఎవరు ఏం మాట్లాడతారో వారికే అర్థంకాకుండా ఉందని ఎద్దేవా చేశారు. ‘పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలో మొదటి ముద్దాయి సోనియాగాంధీ అయితే రెండో ముద్దాయి స్పీకర్, మూడో ముద్దాయి టీడీపీ’ అని అన్నారు. -
మీ ఎంపీలే...మిమ్మల్ని కొడుతుంటే బాబు ఏం చేస్తున్నారు?
నరసరావు పేట ఎంపీ, టీడీపీ నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్‌లే దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు తెలిపారు. అంతేకాని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి హితవు పలికారు. అయిన మీ పార్టీ ఎంపీలే మిమ్మల్ని కొడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబుతో ఇప్పటికేనా జై సమైక్యాంధ్ర అనిపించగలరా అంటు మోదుగులకు ఆయన సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ బ్రోకర్ పార్టీగా మారిందని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. -
ఎంపీల బహిష్కరణ డ్రామా: గట్టు
సోనియా డెరైక్షన్లోనే ఎంపీల డ్రామాలు సీఎం, బొత్స, ఎమ్మెల్యేలను బహిష్కరించరేం? సాక్షి, హైదరాబాద్: పార్టీ నుంచి సస్పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో సరికొత్త డ్రామాకు తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. బిల్లును వ్యతిరేకిస్తున్నందున ఆరుగురు ఎంపీలను బహిష్కరిస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ... అసెంబ్లీలో అదే బిల్లును వ్యతిరేకించిన ఎమ్మెల్యేలను, ఢిల్లీలో ధర్నా చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలు కూడా సోనియాగాంధీ ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే ఇన్నాళ్లూ అవిశ్వాసం, ధర్నాలు అంటూ రకరకాల ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిల్లును వ్యతిరేకిస్తున్నందువల్లే ఆరుగురిపై వేటు వేశారంటే... మిగతా సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలంగాణకు అనుకూలమా? అని ప్రశ్నించారు. మైనారిటీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ నిర్ణయాలు తీసుకునే అర్హత ఎక్కడిదని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే... పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలకు విందులు ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన మహిళాబిల్లు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన తదితర బిల్లులెన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ఆమోదం కోసం ఏనాడూ విపక్షాల మద్దతు కూడగట్టని కాంగ్రెస్ తెలుగుజాతిని చీల్చడం కోసం విందులు ఏర్పాటు చేస్తోంది. తెలుగుజాతిపై ఎందుకింత కక్షగట్టారు? ఏం పాపం చేసిందని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు? విభజన బిల్లుకు పార్లమెంటులో ఎలాంటి లీగల్ సమస్యలు ఎదురు కాకూడదనే పక్కా ప్రణాళికతో సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబుల చేత అసెంబ్లీలో చర్చ జరిగేలా చేసి నాటకీయంగా పంపించారు. రాష్ట్రాన్ని విభజించడం కోసం కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న డ్రామాలన్నింటికీ టీడీపీ వంత పాడుతోంది. కాంగ్రెస్ మాదిరిగానే చంద్రబాబు కూడా ఇరు ప్రాంత నేతల చేత డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. ఓట్లు, సీట్ల కోసం సిగ్గుమాలిన పనికి ఒడిగడుతున్నారు. జాతీయనేతలను చంద్రబాబు ఎందుకు కలుస్తున్నారో చెప్పడంలేదు. విహారయాత్ర మాదిరిగా బాబు పర్యటిస్తున్నారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా విభజించడానికి సోనియాగాంధీ, చంద్రబాబు, కేసీఆర్‌ల అబ్బ జాగీరు కాదు. ఆ ఎంపీలకు అభినందనలు: మోదుగుల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమైక్యత కోసం పార్లమెంటులో ఆందోళన జరిపి, బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎంపీలను అభినందిస్తున్నానని టీడీపీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి చెప్పారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే సభ్యులను బహిష్కరించడమే కాంగ్రెస్‌లోని అంతర్గత ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. -
'రాష్ట్రం అభివృద్ది ఫ్యాన్ గుర్తుతోనే సాధ్యం'
-
అసెంబ్లీ సాక్షిగా అసలు సిసలు డ్రామా
-
బాబు అబద్ధాలకు నిదర్శనాలివే: గట్టు
ఆయన హయాంలోనే దారిద్య్రం పెరిగింది సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల హయాంలో రాష్ట్రంలో దారిద్య్రం తొలగిపోయిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. బాబు హయాంలోనే దారిద్య్రం విజృంభించిందని పేర్కొన్న ఎకనమిక్ సర్వే రిపోర్ట్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం గట్టు మీడియాతో మాట్లాడారు. బాబు పాలన పగ్గాలు చేపట్టిన నాటికి రాష్ట్రంలో కోటి 53 లక్షల 96వేల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండేవారని, అలాంటిది ఆయన తొమ్మిదేళ్ల పాలన ముగిసిన 2003-04 నాటికి ఆ సంఖ్య 2 కోట్ల 35 లక్షల 10 వేలకు పెరిగిందని, పట్టణాల్లో సైతం ఇదేమాదిరిగా బాబు అధికారంలోకి వచ్చేనాటికి 79 లక్షల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే 2004 నాటికి ఈ సంఖ్య కోటి 80 లక్షలకు పెరిగిందని గణాంక సహితంగా వివరించారు. అయితే, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత 2009 నాటికి ఈ సంఖ్యను కోటి 27 లక్షలకు కుదించగలిగారని వివరించారు. -
చంద్రబాబు తుపాకి రాముడు: గట్టు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తుపాకి రాముడు'' అని గట్టు ఎద్దెవా చేశారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన గురించి ఏనాడు చెప్పుకోడని గట్టు అన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి ఎలా పెరిగిందో ఎకనమీ సర్వే చూస్తే తెలుస్తుందని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని గట్టు తెలిపారు. టీడీపీ ఒక డ్రామా కంపెనీగా గట్టు అభివర్ణించారు. ప్రపంచంలో ఎవరు గెలిచిన సంబరాలు చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైందని గట్టు రామచంద్రరావు విమర్శించారు. -
మోత్కుపల్లీ.. నోరు జాగ్రత్త
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విభజన వాదా? లేక సమైక్యవాదా? అనే విషయాన్ని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పగలరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. నోరుంది కదా అని వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. గట్టు శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ, మోత్కుపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమాజంలో దేనికీ పనికిరాని చంద్రబాబు గురించి మోత్కుపల్లి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు అవినీతిపరుడు కావటంవల్లే ప్రతి ఎన్నికల్లోనూ ఆయనను ప్రజలు ఓడిస్తున్నారని చెప్పారు. జగన్‌ను ప్రజలు విశ్వసిస్తున్నందునే 5.45 లక్షల మెజారిటీతో లోక్‌సభకు గెలిపించారని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. తప్పుడు కూతలు కూయడంలో తర్ఫీదు పొందిన మోత్కుపల్లి గతంలో చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. -
మోత్కుపల్లి నోరు అదుపులో పెట్టుకో:గట్టు
హైదరాబాద్:టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులుపై వైఎస్సార్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. మోత్కుపల్లి నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తప్పుడు కూతలు కూయడంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతేక శిక్షణ పొందావా?అని గట్టు ప్రశ్నించారు. ఆకాశంపైకి ఉమ్మెస్తే ఏం జరుగుతుందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు విభజన వాదా?సమైక్యవాదా?చెప్పగలవా అని గట్టు నిలదీశారు. గతంలో బాబును తిట్టిన తిట్లు నీకు గుర్తులేవా?అని ప్రశ్నించారు. -
ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారాన్ని ఖండించిన వైఎస్సాఆర్ సీపీ
-
`జగన్‌పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం`
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఓ ఛానెల్ వక్రీకరించి దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.వైఎస్ జగన్‌పై ఓ ఛానెల్ పనిగట్టుకుని విషప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల గురించి వైఎస్ జగన్ ఆయన అనని వ్యాఖ్యలను, అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు. -
'సమైక్యాంధ్ర పోరాటమే జగన్‌కు ఇచ్చే కానుక'
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం పోరాడటమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజుకు ఇచ్చే కానుక అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తే తెలుగుజాతి బలహీనపడిపోతుందని తెలిపారు. తెలుగుజాతి బలహీనపడకూడదని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రతిమాట కూడా భారత దేశంలో చర్చనీయాంశం అవుతోందన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకోబోమని గట్టు అన్నారు. జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు మాట్లాడారు. రాష్ట్రం నుంచి నీచ రాజకీయాలను పారద్రోలడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతపురంజిల్లా కదిరిలో జగన్ జన్మదిన వేడుకలు పూలవ్యాపారస్తులు ఘనంగా నిర్వహించారు. వేమారెడ్డి సర్కిల్లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జక్కల ఆదిశేషు పాల్గొని కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పేదలకు, వృద్దులకు బట్టలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం యువతకు ఆదర్శమని చెప్పారు. -
'సోనియా హెడ్ ఆఫీస్ అయితే.. చంద్రబాబు బ్రాంచ్ ఆఫీస్'
విజయవాడ:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై వైఎస్సార్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సోనియా గాంధీ హెడ్ ఆఫీస్ అయితే.. చంద్రబాబు బ్రాంచ్ ఆఫీస్ అని ఆయన విమర్శించారు. విభజనకు సోనియా గాంధీ చంద్రబాబును బ్రాంచ్ ఆఫీస్ గా చేసుకుందని గట్టు ఎద్దేవా చేశారు. చంద్రబాబు డస్ట్‌బిన్‌గా తప్ప రాజకీయాలకు పనికి రాడని ఆయన తెలిపారు. భారత దేశం ఆత్మగౌరవం నుంచి పుట్టిందే వైఎస్సార్ సీపీ అని గట్టు తెలిపారు. మహిళా బిల్లు, బీసీ బిల్లుల గురించి మాట్లాడని నాయకులు రాష్ట్రాన్ని మక్కలు చేయడానికి మాత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రావడాన్ని తప్పుబట్టారు. దీని వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనబడుతుందన్నారు. -
'సొంతపార్టీ పెట్టే దమ్ము మీకు ఉందా లోకేష్'
-
రాజకీయ అజ్ఞాని నారా లోకేష్ : గట్టు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి, సత్తా కానీ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. లోకేష్ రాజకీయ అజ్ఞానివి అంటూ దుయ్యబట్టారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కేసుల నుంచి తప్పుంచుకున్న చరిత్ర మీ నాన్న చంద్రబాబుదంటూ గట్టు రామచంద్రరావు ఘాటుగా విమర్శించారు. మీనాన్న అవినీతి డబ్బుతో నిన్ను చదివించింది నిజం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో నీవు, మీ నాన్న ఉన్నారు కానీ... మీకు సొంతంగా పార్టీ పెట్టే సత్తా ఉందా? అని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. -
ఎంత పనిచేశారు ‘బాబూ..’!
సాక్షి, హైదరాబాద్: ‘కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఈ ఏడాది మార్చిలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడే మీరూ మద్దతిచ్చి ఉంటే పరిస్థితి రాష్ట్ర విభజన వరకు వచ్చేది కాదు కదా.. ఎంతపని చేశారు బాబూ’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అప్పుడు నిస్సిగ్గుగా విప్ జారీ చేసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడారని గట్టు గుర్తుచేశారు. అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత సంఖ్యాబలం లేదని అప్పుడు చెప్పిన బాబు.. ఇప్పుడు కేంద్రంలో కనీస సంఖ్యా బలం లేకపోయినా అవిశ్వాసం పెడతామని చెప్పడంలోని మతలబేంటో చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ వైఖరేంటో చెప్పకుండా నలుగురు కోస్తా, రాయలసీమ ఎంపీలతో అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇప్పించడం, తెలంగాణ ఎంపీలతో తెలంగాణ కావాల్సిందేనని చెప్పించడంలోని ఆంతర్యమేంటని సోమవారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ‘నాలుగు రాష్ట్రాల ఎన్నిక ల్లో అవినీతిపరులను ఓడించారని బాబు చెబుతున్నారు. మన రాష్ట్రంలో 2001 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీని ఓడిస్తూ వస్తున్నారు. అంటే బాబు తాను అవినీతిపరుడినని అంగీకరించినట్లే’ అని గట్టు వ్యాఖ్యానించారు. -
పరాకాష్టకు చేరిన కాంగ్రెస్, టిడిపి డ్రామాలు:గట్టు
హైదరాబాద్: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఒక పక్క రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే మరో పక్క కాంగ్రెస్, టీడీపీ నేతల డ్రామాలు పరాకాష్ఠకు చేరాయని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విభజనవాదా? సమైక్యవాదా? ఏవాదో ఆయన ఎందుకు స్పష్టం చేయడంలేదు? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు టీడీపీ మద్దతిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడింది మీరు కాదా? అని అడిగారు. చంద్రబాబు,కిరణ్‌లు సోనియాకు రెండు చేతుల్లా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. సోనియా కనుసన్నల్లోనే సీమాంధ్ర ఎంపీలు నడుస్తున్నారని చెప్పారు. టిడిపి సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో మిగతా ఎంపీలు ఎందుకు సంతకం చేయలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామాకు బదులు చంద్రబాబు ఇంటిముందు ధర్నా ఎందుకు చేయడం లేదు అని గట్టు అడిగారు. -
క్యాబినెట్ మినిష్టర్లు సోనియాను ఎదిరించలేరు
-
2014 తర్వాత కాంగ్రెస్, టీడీపీ కనుమరుగు
గట్టు రామచంద్రరావు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: దేశంలో సీబీఐ, చంద్రబాబు నాయుడు లాంటి కుట్రదారులపై ఆధారపడి ఎన్నికలకు పోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. సీబీఐ, చంద్రబాబు లాంటి కుట్రదారుల మీద ఆధారపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక దేశంలో నూకలు చెల్లాయన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే సోనియాగాంధీ ఇటలీ పోవడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో చంద్రబాబు కనుమరుగవుతారని జోస్యం చెప్పారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. పజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం కుట్రదారులను నమ్ముకోవడం వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషించారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేయడం వల్లే ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రజలు మద్దతు తెలిపారన్నారు. మన రాష్ట్రంలో కూడా నిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేసిన వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు. అధికార పార్టీకి బ్రాంచీ ఆఫీసులుగా మారిన చంద్రబాబు లాంటి వ్యక్తులను ప్రజలు దూరం పెట్టనున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేల్లో కూడా స్పష్టమైందని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఎంతసేపు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆడిపోసుకోవడం తప్పితే, ఆయన తొమ్మిదేళ్ల చీకటిపాలనను ప్రస్తావించే ధైర్యం లేదన్నారు. చనిపోయిన వైఎస్ పేరుతో పోరాడటానికి చంద్రబాబుకు జీవితకాలం సరిపోయేట్లులేదన్నారు. అవినీతికి బాబు చిరునామాగా మారినందువల్లే ప్రజలు లాగి కొడితే ఇప్పటికీ కోలుకోవడంలేదన్నారు. 2009 తర్వాత కూడా జరిగిన అన్ని ఉపఎన్నికల్లో ఏ ఒక్కటీ గెలుచుకోకపోగా, డిపాజిట్లు కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. -
సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?: గట్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన రెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలను గట్టుతోపాటు వైఎస్ఆర్ సిపి నాయకురాళ్లు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఇప్పుడొచ్చిన ఈ ఆవేశం నాలుగు నెలల క్రితం ఏమైందని అడిగారు. సమైక్యం కోసం మీరు చేసిందేమిటి? అని సీఎంను ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ సమైక్య చీడపురుగులని వారు విమర్శించారు. -
'బాబు పాలనలో ఎన్టీఆర్ పథకాలు, ఆశయాలు తుంగలో తొక్కారు'
-
'దమ్ముంటే తుమ్మల తన ఆస్తులపై విచారణ జరపాలి'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు పాలనలో చేసిన పాపం వల్లే ముమ్మాటికీ కృష్ణా జలాలు కోల్పోయామని ఆయన సోమవారమిక్కడ విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇటువంటి తీర్పు వచ్చేది కాదని గట్టు అన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులను ఎందుకు ఆపలేదని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టిన ప్రాజెక్టులను తప్పుబడుతున్న చంద్రబాబు ఆనాడు ఎందుకు శంకుస్థాపనలు చేశారని గట్టు అన్నారు. టీడీపీ సమాధానం చెప్పలేక తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావుకు దమ్ముంటే తన ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని గట్టు ఈ సందర్భంగా సవాల్ విసిరారు. -
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది: గట్టు
* వ్యవసాయం గురించి బాబు మాట్లాడటంపై ఎద్దేవా * ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదని ధ్వజం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. తన తొమ్మిదేళ్ల హయాంలో వ్యవసాయం, ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ అనే మాటలను ఉచ్ఛరించడమే ఆయన అవమానంగా భావించేవారన్నారు. పంటకు చీడపురుగులా వ్యవసాయరంగాన్ని సర్వనాశనం చేసిన బాబు.. నీళ్లు, వ్యవసాయం, రైతులు అంటూ మాట్లాడటం చూసి తెలుగు ప్రజానీకం నవ్వుకుంటోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు బాబు పాపాల వల్లే అని ప్రజలు భావిస్తుంటే, గోబెల్స్ ప్రచారానికి అలవాటుపడిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందే రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టి ఉంటే మిగులు జలాల విషయంలో అన్యాయం జరిగేది కాదన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదనే ఆలోచనతో వైఎస్ జలయజ్ఞం ప్రారంభించారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తర్వాత వచ్చే ట్రిబ్యున ళ్లు నీటి కేటాయింపులు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే వైఎస్ వాటిని చేపట్టారన్నారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రలు మన ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. మిగులు జలాలపై కింది రాష్ట్రాలకు ఉండే స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నామే తప్ప హక్కుగా కోరడంలేదని వైఎస్ ట్రిబ్యునల్‌కు వివరించినట్లు గట్టు తెలిపారు. ఇదంతా తెలిసి కూడా టీడీపీ నేతలు కావాలనే ఆయనపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిత్యం ఆకాశానికెత్తే ఆ రెండు దిన పత్రికలు కూడా కృష్ణాజలాల విషయంలో బాబు వైఫల్యంపై అప్పట్లో పలు కథనాలు వెలువరించాయని ‘ఈనాడు’లో వచ్చిన వార్తా కథనాలను చూపించారు. -
'కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం'
-
చంద్రబాబు నిర్వాకం వల్లే జలాల సమస్య : గట్టు
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే మిగులు జలాలను మనం దక్కించుకోలేకపోయామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్ర రావు, వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో వేసిన అఫిడవిట్లో ప్రాజెక్ట్‌కు ఆటంకం కలగకూడదనే చట్టం చేయాలని కోరినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని చెప్పారు. అవే నిర్మించి ఉంటే ఇవాళ రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకు కళ్లు మూసుకున్నారని వారు ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాలను తమ పార్టీపై రుద్దాలని చూస్తున్నారన్నారు. -
వామపక్షాలతో కలిసి ఉద్యమాలు: వైఎస్ఆర్ సిపి
హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారానికి వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. ఇందిరా పార్క్ వద్ద చేనేత కార్మికులు తలపెట్టిన దీక్షకు తమ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు నుంచి 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. చేనేత వస్త్రాలపై రిబేటును కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
'టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు పిచ్చిపట్టినట్లు మాట్లడుతున్నారని, వారి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన, సమైక్యత ఏదీ చెప్పలేక టిడిపి వారు పిచ్చిపట్టినవారిలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏదీ స్పష్టంగా చెప్పలేని చంద్రబాబు ప్రజామద్దతు పొందలేకపోతున్నారని, జాతీయస్థాయిలో ఆయనను పట్టించుకునేవారు లేరని చెప్పారు. చంద్రబాబు ప్రజలతో పోరాడలేక, అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైటెక్ సిటీ ముందు ఫొటో దిగే హక్కు తనకే ఉందని చెబుతున్న చంద్రబాబు ఆ ఫొటోను పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. హైటెక్ సిటీ కట్టించిన ఎల్ అండ్ టి కంపెనీయే టిడిపి కార్యాలయం కట్టించిన విషయం మాత్రం చంద్రబాబు చెప్పరన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను చంద్రబాబు ఐఎన్జికి అతి తక్కువ రేటుకు కట్టబెట్టారని చెప్పారు. హైదరాబాద్‌లో 14 ఫ్లైఓవర్లు కట్టించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 26, 27 తేదీలలో తుపాను బాధిత ప్రాంతాలలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. తుపాను ప్రాంతాలలో పర్యటన కారణంగా సమైక్యశంఖారావం వాయిదావేసినట్లు తెలిపారు. ఈ నెల 30 నుంచి సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
'టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది'
-
తారస్థాయికి కాంగ్రెస్ కుట్రలు: గట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామాలు, కుట్రలు తారస్థాయికి చేరుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే వేయి తలల విష సర్పం వంటిదని అభివర్ణించారు. వెయ్యి తలల్లో ఒకటైన సీఎం కిరణ్ లోపల అమ్మ జపం చేస్తూ, బయటకి సమైక్య ముసుగు వేసుకొని డ్రామాను రక్తి కట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం తాజాగా కొత్త డ్రామా మొదలెట్టారన్నారు. ‘సమైక్యం వినిపిస్తున్నందుకే తనను తప్పిస్తున్నారంటూ మీడియాకు లీకులిస్తారు. ఇదంతా కూడా కేంద్రం ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా లీకులిస్తూ నటనను రక్తికట్టిస్తున్నారు. ఇంతటి ఘోరమైన రాజకీయ డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయం’ అని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన తర్వాత కూడా జీవోఎం ఎదుట ఇరు ప్రాంత నేతలు భిన్నమైన వాదనలు వినిపించారు. అధిష్టానం ఆదేశాల మేరకే నివేదిక ఇచ్చానంటూ మంత్రి వసంతకుమార్ చెప్పడం చూస్తే వారి డ్రామా ఏ స్థాయిలో ఉందో? అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతల చేత ఉత్సవాలు, కృతజ్ఞత సభలు పెట్టిస్తోందని ధ్వజమెత్తారు. వెయ్యి తలల విష సర్పమైన కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలకు మరో బుల్లి విష సర్పంలా టీడీపీ వంతపాడుతోందని గట్టు దుయ్యబట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు రక్తి కట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతుంటే.. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సమైక్యమో, విభజనో ఏ ఒక్కటి స్పష్టం చేయకుండా మరింత గందరగోళానికి గురిచేస్తూ, కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష మేరకు చాలా స్పష్టంగా వైఎస్సార్సీపీ సమైక్య వాణి వినిపిస్తుంటే, తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు మాదిరి కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు తాము చీకట్లో సోనియా కాళ్లు పట్టుకోలేదని మండిపడ్డారు. ఇప్పటి దాకా చంద్రబాబు ఏ ఒక్క రోజైనా సోనియాను విమర్శించారా? అని గట్టు ప్రశ్నించారు. -
'కాంగ్రెస్ రెండు నివేదికలతో డ్రామాలాడుతోంది'
హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక రాష్ట్ర విభజనపై అధికార కాంగ్రెస్ పార్టీ రెండు నివేదికలు ఎలా ఇస్తోందని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ కుట్ర తారా స్థాయికి చేరిందన్న విషయం బహిర్గతం అయ్యిందన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఆడుతున్న నాటకాన్ని ఎండగడుతూ గట్టు గురువారం మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లోపల విభజనకు సహకరిస్తూ బయట సమైక్య డ్రామాను ఆసక్తికరంగా రక్తికట్టిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ అధిష్టానాన్ని ధిక్కరించినట్లు లీకులు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నరన్నారు. అధిష్టానమే సమైక్య నివేదిక ఇమ్మందని మంత్రి వట్టి వసంతకుమార్ చెబుతుండటంలో మరోసారి కాంగ్రెస్ నాటకం బయటపడిందన్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్ ని నాలుగు రాష్ట్రాలుగా చేయమని చెబితే తీర్మానం ఎందుకు చేయలేదని గట్టు అధిష్టానాన్ని నిలదీశారు.ఒక్క తెలుగు జాతిపైనే కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలను ప్రదర్శిస్తోందన్నారు.తెలుగు ప్రజలపై అధిష్టానానికి కాంగ్రెస్ కు ఎందుకంత కక్షని గట్టు ప్రశ్నించారు. -
'కాంగ్రెస్ రెండు నివేదికలతో డ్రామాలాడుతోంది'
-
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి:గట్టు
-
'తెలుగు జాతిని కాంగ్రెస్, బాబు అవమానిస్తున్నారు'
ఢిల్లీ: తెలుగుజాతిని కాంగ్రెస్... తెలుగుదేశం పార్టీ అవమానిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకటే విధానమని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లాగా రెండు వైఖరులు ఉండవని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయని గట్టు ఆరోపించారు. విభజన వల్ల అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం 10.30 గంటలకు భేటీ కానుంది. -
కిరణ్ పక్కా విభజన వాది: గట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన జాలి మాటలన్నీ బూటకమని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఆయన నటిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. సమైక్యం ముసుగులో ఉన్న విభజనవాది కిరణ్ అని తూర్పారబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమాన్ని సీఎం కిరణ్ నీరుగారుస్తూ, విభజనకు తీవ్రంగా కృషి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య రాష్ట్రంలో దోబూచులాట జరుగుతోందని, ఆ రెండు పార్టీలు తమ వైఖరితో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వరదల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ప్రజల నుంచి ఆదరణ లభించే సరికి పోలీసుల చేత అడ్డుకున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం 300 మంది పోలీసులతో ప్రత్యేకమైన భద్రత మధ్య రెడ్‌కార్పెట్ వేసి తీసుకెళ్లారని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబు మీద కాంగ్రెస్‌కు ఎందుకింత ప్రేమో ప్రజలందరికీ తెలుసన్నారు. సమైక్య రాష్ట్రంలో జీతాలు తీసుకుంటున్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరుపట్ల తాను వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పౌరహక్కులను కాలరాసిన ఇద్దరు మంత్రులను సీఎం ఎందుకు భర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. దీన్ని చూస్తే కిరణ్ ఎంత విభజన వాదో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. -
కిరణ్ది ఆచరణలో విభజన.. మాటల్లో సమైక్యం: గట్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిది శల్యుడు సారథ్యమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రవిభజన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సీఎం కిరణ్ ఆచరణలో విభజన.. మాటల్లో మాత్రం సమైక్యం అంటున్నారని గట్టు దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చాంఫియన్ గా పోజులకొట్టే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. సోనియాగాంధీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను కిరణ్ సర్కార్ కాలరాస్తోంది అని ఆయన విమర్శించారు. నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్రానికి మంత్రులా? జిల్లాకు మంత్రులా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి జానారెడ్డి దొంగ తెలంగాణవాది అంటూ గట్టు రామచంద్రరావు విమర్శించారు. -
'జానా, ఉత్తమ్‌కుమార్‌లది దొరల అహంకారం'
హైదరాబాద్ : జాతీయ జెండా ఎగురవేయని తెలంగాణ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు డిమాండ్ చేశారు. కొంతమంది తెలంగాణ మంత్రులు తెలుగు జాతిని అవమానపరుస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలది దొరల అహంకారమని గట్టు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిద్దరూ మంత్రులుగా ఉండే అర్హత కోల్పోయారన్నారు. తెలంగాణ ఏర్పడితే దొరల రాజ్యం వస్తుందే కానీ మరొకరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేసే ఇతర ప్రాంతాల కలెక్టర్లను కూడా అరెస్ట్ చేయిస్తారా అని గట్టు ప్రశ్నించారు. 102 సంవత్సరాల తెలుగువారి ఆకాంక్షే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ ఉన్న మంత్రులు తమ పదవులు చేపట్టినప్పుడు రాజ్యాంగానికి బద్ధులమై ఉంటామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి......వారు జాతీయ జెండాను ఆవిష్కరించకపోవటం తెలుగుజాతిని, భారతదేశాన్ని అవమానించటం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అంటూ కోతలు కోస్తున్న నేతలు గతంలో ఏవిధంగా ప్రవర్తించారో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి, గట్టు ధ్వజం జానా, ఉత్తమ్‌లు కిరణ్ కింద ఎందుకు పనిచేస్తున్నారు? సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ.. దానిని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంత్రులుగా రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాపాడాల్సిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలే స్వయంగా వాటిని కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారైతే తాను సమైక్యవాద చాంపియన్ అని చెప్పుకుంటున్న సీఎం కిరణ్ కింద పనిచేయడానికి సిగ్గేయడం లేదా? అని అన్నారు. భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకోవడం చూస్తుంటే వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు వేరువేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఫైళ్లపై సంతకాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. చీకట్లో అన్ని వ్యవహారాలు నెరుపుతూ, పైకి మాత్రం తెలంగాణవాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. -
తెలంగాణ మీ అబ్బ సొత్తా? జాగీరా?: గట్టు
తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై వైఎస్ఆర్సీపీ నేత గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ నీ అబ్బ సొత్తా.. నీ అబ్బ జాగీరా అంటూ గట్టు నిలదీశారు. తెలంగాణ సాయుధపోరాటంలో బీసీ, ఎస్సీ, మైనారిటీలపై భూస్వామ్య, పెట్టుబడిదారుల చేసిన అరాచకాలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యంగపరమైన హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువలను కిరణ్ సర్కార్ కాలరాస్తోంది అని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చాంఫియన్ గా పోజులకొట్టే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. సోనియాగాంధీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను కిరణ్ సర్కార్ కాలరాస్తోంది అని విమర్శించారు. -
అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
-
'తెలుగువారికి ఒకే రాష్ట్రం మహాత్ముడు ఇచ్చిన మాట'
హైదరాబాద్: స్వతంత్ర ఉద్యమం కాలంలోనే తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని మహాత్మాగాంధీ మాట ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి 102 సంవత్సరాల పోరాటం చరిత్ర ఉందన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమైక్య రాష్ట్రాన్నే కోరుకున్నారని తెలిపారు. వారి కంటే సోనియా గాంధీ గొప్పేవారమీ కాదన్నారు. సమైక్య శంఖారావం 23 జిల్లాలదని చెప్పారు. సమైక్యమనేది 2 ప్రాంతాల మధ్య ఘర్షణ కాదని, రెండు వాదనల మధ్య ఘర్షణ అని వివరించారు. విభజన వల్ల తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ మళ్లీ తలెత్తుతుందని హెచ్చరించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 40 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన తెలంగాణ ప్రాజెక్ట్‌లన్నీ నష్టపోతాయని చెప్పారు.