
కిరణ్‌ది ఆచరణలో విభజన.. మాటల్లో సమైక్యం: గట్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిది శల్యుడు సారథ్యమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రవిభజన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సీఎం కిరణ్ ఆచరణలో విభజన.. మాటల్లో మాత్రం సమైక్యం అంటున్నారని గట్టు దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చాంఫియన్ గా పోజులకొట్టే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. సోనియాగాంధీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను కిరణ్ సర్కార్ కాలరాస్తోంది అని ఆయన విమర్శించారు.
నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్రానికి మంత్రులా? జిల్లాకు మంత్రులా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి జానారెడ్డి దొంగ తెలంగాణవాది అంటూ గట్టు రామచంద్రరావు విమర్శించారు.