మాజీ సీఎం కిరణ్‌కు షాక్! | మాజీ సీఎం కిరణ్‌కు షాక్! | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కిరణ్‌కు షాక్!

Published Mon, Jul 7 2014 2:45 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

మాజీ సీఎం కిరణ్‌కు షాక్! - Sakshi

మాజీ సీఎం కిరణ్‌కు షాక్!

  • గుర్రంకొండ జేఎస్పీ ఎంపీపీ వైఎస్సార్‌సీపీలో చేరిక
  • గుర్రంకొండ/ సదుం: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కువూర్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. రెండు రోజుల క్రితం జేఎస్పీ తరఫున గుర్రంకొండ ఎంపీపీగా ఎన్నికైన నక్కా చంద్రశేఖర్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం సదుంలో జరిగిన ఓ కార్యక్రవుంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పుం గనూరు, పీలేరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి, చింతల రావుచంద్రారెడ్డి సవుక్షంలో ఆయున వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నక్కా చంద్రశేఖర్ వుండలంలోని సరివుడుగు సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యుడుగా గెలుపొందారు.

    మూ డు దశాబ్దాలుగా నల్లారి కుటుంబంతో అనుబంధం ఉంది. అతని తండ్రి నక్కా రెడ్డెన్న గతంలో రెండు సార్లు సింగిల్ విండో ఆధ్యక్షుడుగా, సర్పంచ్‌గా పనిచేశారు. నక్కాచంద్రశేఖర్ మాజీ సర్పంచ్. అతని భార్య నక్కా వెంకటలక్ష్మి ప్రస్తుతం సరివుడుగు సర్పంచ్. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలను కలుపుకుపోవాలని, వర్గాలకు, పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఎంపీపీ నక్కా చంద్రశేఖర్ వూట్లాడుతూ వైఎస్సార్‌సీపీ విధానాలు నచ్చే పార్టీలో చేరానన్నారు. వుండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

    ఈ కార్యక్రవుంలో జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిరాజా, వూజీ ఎంపీపీ మెహర్‌తాజ్ జమీర్‌ఆలీఖాన్, ప్రవుుఖ పారిశ్రామికవేత్త వరదారెడ్డిగారి నారదరెడ్డి, సర్పంచ్‌లు ప్రదీప్‌చంద్, నాయుకులు శ్రీరావుులు, ఎస్.వెంకటరవుణ, ఆకుల రెడ్డెప్ప, రవుణారెడ్డి, ఎల్వీ రవుణ, సురేష్, ఈశ్వరయ్యు, ప్రసాద్, చంద్రారెడ్డి, రామిరెడ్డి, కృష్ణసింగ్, చంద్ర, రవుణ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement