peddi reddy ram chandra reddy
-
చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి
సాక్షి, కడప: రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలాగే, షర్మిలను ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సూచనలు తీసుకుని జిల్లా కమిటీలు వేస్తాం. పార్టీని ప్రక్షాళన చేసి సమర్ధులైన వ్యక్తులకు పదవులు ఇస్తాం. విద్యుత్ చార్జీలు విషయంలో ఈరోజు పచ్చ పత్రికలు మాట్లాడటం లేదు. రూ.6వేల కోట్ల భారం చంద్రబాబు ప్రజలపై వేస్తున్నారు. ఇప్పుడు జగన్ తప్పిదం వల్ల చార్జీలు పెరుగుతున్నాయి అంటూ రాస్తున్నారు. వరదల నుంచి అన్నీ జగన్ వల్లే అంటూ అభూత కల్పనలు సృష్టిస్తున్నారు.రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేశారు. ప్రజలు ఇప్పటికే ఎవరి పరిపాలన ఏమిటో గమనించారు. క్రాప్ ఇన్స్యూరెన్స్ ఇప్పుడు రైతులే కట్టుకోవాలి అంటున్నారు. వ్యవసాయం దండగ ఆన్న వ్యక్తి రైతులను ఏ విధంగా ఆదుకుంటాడు?. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకూ షేర్లు బదలాయింపు జరగదు. ఆమెకు అన్నీ తెలుసు.. ఆమె పద్ధతి జగన్‌ని దెబ్బతీయాలనే విధంగా ఉంది. మేము ప్రత్యేకంగా ఆమెను పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయం: మంత్రి పెద్దిరెడ్డి
-
కుల మత రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ
-
‘రేపు వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 29,961 మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మంగళవారం (జూన్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1497.62 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశామని, సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేస్తామని అన్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, అలాగే ఆర్బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ మొత్తాలను మూడు రోజుల్లో నూరుశాతం పంపిణీ పూర్తి అయ్యేలా వలంటీర్లను ఆదేశించామని అన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల డిఆర్డిఎ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు. చదవండి: కోవిడ్, బ్లాక్ ఫంగస్, ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్ సమీక్ష -
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా భూగర్భ గనుల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యేగా చాలాకాలం పని చేశారు. 2009లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రివర్గంలో పని చేశారు. అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలోనూ కొనసాగారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు నుంచి విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుడు. ఈయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఐదేళ్లుగా అనంతపురం జిల్లా పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరించారు. -
చంద్రబాబు తెలివి తేటతెల్లం
చిత్తూరు, కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబు అపారమైన అనుభవం, తెలివి తెలంగాణ ఎన్నికల్లో తేటతెల్లమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గురువారం శాంతిపురంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా చంద్రబాబును అనుభవజ్ఞుడని, మంచి తెలివిపరుడని ఇతర రాజకీయ పార్టీలవారు నమ్మేవారని, తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఆయన తెలివి ఎంత మాత్రమో స్పష్టంగా తెలిసిందని చెప్పారు. చదువుకున్న రోజుల్లోనూ ఆయన పెద్ద తెలివిపరుడుకాదని, అప్పట్లో బాబు సామాజికవర్గానికి చెందిన ఓ ప్రొఫెసర్ ద్వారా డిగ్రీ పాస్ సర్టిఫికెట్లు పొందారని విమర్శించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఫలితాలను చూసి పొంగవద్దని, అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉండటంతో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని తెలిపారు. తెలంగాణలో చంద్రబాబు వెళ్ళకుండా ఉంటే కాంగ్రెస్‌కు మరో 20 సీట్లు అధికంగా వచ్చేవని, బాబును నమ్మడం వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. పాలారు నిర్మాణానికీ బాబు ఆటంకం 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి చంద్రబాబు చేసింది శూన్యమని పెద్దిరెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాలారు ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించి శంకుస్థాపన చేస్తే చంద్రబాబు తమిళనాడుతో కుమ్మక్కై కోర్టును ఆశ్రయించి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడ్డారని విమర్శించారు. కుప్పానికి హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరు ఇప్పటివరకు రాకపోవడం దారుణమన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యుల్ ప్రకటించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం రోజున పాడిరైతులకు లీటరు పాలకు రూ.4 ఇన్సెంటివ్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇలాంటివి చంద్రబాబు ఒక్కటైనా అమలు చేశారా ? అంటూ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో గాండ్ల సామాజికవర్గంవారు 30 ఏళ్లుగా చంద్రబాబును నమ్మారని, ఒక్క గౌనివారి శ్రీనివాసులుకు పదవులు ఇచ్చారే తప్ప మిగిలిన గాండ్ల సామాజికవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రమౌళిని గెలిపించండి... ఆయన చంద్రబాబుకంటే అభివృద్ధి చేయగల సమర్థుడని తెలిపారు. మార్పు తీసుకురండి అండగా ఉంటాం– జంగాలపల్లె శ్రీనివాసులు ఏళ్ల తరబడిగా ఒకే వ్యక్తిని నమ్మడం వల్ల కుప్పం అభివృద్ధి చెందలేదని, మార్పు తీసుకొస్తే వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు చెప్పారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఇక్కడి నుంచి మరో శాసనసభ్యుడిని పంపేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
మీ గెలుపు పెద్దిరెడ్డి భిక్షకాదా?
పలమనేరు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పలమనేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా విజయం సాధించడం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు లేవా ? ఆయన భిక్షతో గెలిచి నేడు అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం మంత్రి అమరనాథరెడ్డికి తగదని వైఎస్సార్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ విమర్శించారు. పలమనేరులోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో కలసి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాడు మీరు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తే మన పార్టీని నమ్ముకుని వచ్చారు.. పలమమేరులో మిమ్మల్ని గెలిపిం చాలని పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించిన విషయం అప్పుడే మరిచిపోతే ఎలా ?’ అంటూ ప్రశ్నించారు. ‘మీరు వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన విషయ మై ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. దాన్ని మరిచి పెద్దిరెడ్డిని విమర్శించడం మంచిది కాదు. దీన్నీ ప్రజలు గమనిస్తున్నార’ని తెలిపారు. సీనియర్ నాయకుడు సీవీ కుమార్ మాట్లాడుతూ పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి అమరనాథరెడ్డికి లేదని చెప్పారు. మంత్రి అనే ధైర్యంతో ఎక్కడైనా పోటీచేయండిగానీ అధికారం ఉందని విలువలు లేని రాజకీయాలు చేయడం మంచిదికాదన్నారు. పట్టణ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ అమరనాథరెడ్డి ఒక విమర్శచేస్తే తాము వంద చేస్తామని, గతాన్ని మరిచి మాట్లాడడం బాధాకరమని చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి బీఫామ్ ఇస్తే ఫ్యాను గుర్తుపై గెలిచి నేడు తమరు మంత్రి అయ్యారని, ఓడివుంటే ఆ పదవి దక్కేదా ? అని ప్రశ్నించారు. ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రహ్లాద మాట్లాడుతూ గెలిపించినవారినే విమర్శించడం తగదన్నారు. కౌన్సిలర్లు కమాల్, మూర్తి, మున్నా, గోవిందప్ప, షబ్బీర్, నాయకులు నయాజ్, నాగరాజు, రాజారెడ్డి, శశిధర్, జావీద్, సోమశేఖర్ రెడ్డి,అక్బర్, ముజ్జు, సేటు తదితరులు పాల్గొన్నారు. -
వెంటిలేటర్‌పై టీడీపీ ప్రభుత్వం
పీలేరు: ఆచరణకు సాధ్యకాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఆరు వందల హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన బాబు ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. నూతన రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని నాలుగేళ్లుగా చెప్పిందే చెబుతూ ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప ఇప్పటివరకు శాశ్వత ప్రాతిపదికన ఒక్క నిర్మాణం చేపట్టిన దాఖలాలులేవని దుయ్యబట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యేక హోదా తోనే సాధ్యమన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం ఆ కేసు నుంచి తప్పించుకోవ డం కోసం హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించా రు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకోవడానికే విదేశీ పర్యటన చేశారు తప్ప పరిశ్రమల ఏర్పాటు కోసం కాదని చెప్పారు. నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు యూ టర్న్ తీసుకుని వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా,కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్ గురించి పట్టించుకోకుండా ఇప్పుడు దొంగ దీక్షలతో తానేదో ఉద్ధరిస్తానని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం జాడ కానరావడంలేదని దుయ్యబట్టారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రతో టీడీపీ ప్రభుత్వం పతనం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ వైఫ ల్యాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని సూచిం చారు. -
ఆ ఇద్దరిపై గుబులు
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి భయం పట్టుకుంది. జిల్లా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోవడమే ధ్యేయంగా నాయకులందరూ పనిచేయాలని సీఎం స్వపక్షీయులకు మార్గదర్శకం చేశారు. రాజంపేట పార్లమెంటరీ పరిధిలో మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ముఖ్యనాయకులతో సోమ, మంగళవారం అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆద్యంతం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌ను ఎదుర్కొనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈతండ్రీతనయులను కట్టడి చేయకుంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. జిల్లానుంచి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ రెండు ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే స్థానా లు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ఇద్దరితోపాటు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను నిలువరించకుంటే ఉన్న ఆరు నియోజకవర్గాలలోనూ భంగపాటు తప్పదని హెచ్చరించారు. తండ్రీ కొడుకుల లక్ష్యంగా అమరనాథరెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి కట్టబెట్టిన విషయం, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి కి ఏపీ హౌసింగ్‌బోర్డు చైర్మన్ పదవి, సుభాష్‌చంద్రబోస్‌కు ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్‌గా, చల్లాబాబుకు టీటీడీ బోర్డు మెంబర్, పర్వీన్‌తాజ్‌కి మహిళా కమిషన్ సభ్యురాలి పదవువులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు భోగట్టా. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కనుమరుగవ్వడం ఖాయం.. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్ అందుబాటులో ఉండటం లేదని, ఇలాగైతే ఎన్నికల్లో కనుమరుగవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం వెళ్లిన నాయకులకు చుక్కెదురైంది. నాయకత్వానికి సంబం ధించి ఎలాంటి ప్రకటనా చేయకున్నా నాయకులను మాత్రం గట్టిగానే మందలించినట్లు సమాచారం. సీఎం సహాయనిధి చెక్కులతో లక్షలాది రూపాయలు పంపిణీ చేసి ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయామని చెప్పుకున్న బొమ్మనచెరువు శ్రీరాముల్ని ‘నీ జాతకం మొత్తం నా వద్ద ఉంది. ఆ చెక్కులు దుర్విని యోగం జరిగిందన్న సమాచారం తనవద్ద ఉంది’ అని చెప్పడంతో శ్రీరాములు షాక్‌కు గురైనట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త బాబురెడ్డి తీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశా రు. అధికారులు మాట వినడం లేదనే సాకుతో ఇంట్లో కూర్చుంటే సరిపోదని హెచ్చరించినట్లు టీడీపీ శ్రేణులు వెల్లడిం చాయి. పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టానికి కృషి చేయాలని, సమన్వయంతో పనిచేస్తే తప్ప గెలుపు అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని సూచించారు. కార్పొరేషన్లు సాధ్యం కావు.. కురబ, చేనేత కార్పొరేషన్ల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. చేనేత కార్పొరేషన్‌కు సంబం ధించి ఆప్కో ఉన్నందున మళ్లీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని సీఎం తిరస్కరించినట్లు తెలిసింది. కురబ కార్పొరేషన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. -
నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
రొంపిచెర్ల: ‘మతిస్థిమితం లేని నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి’ అంటూ రొంపిచెర్ల మండలం గానుగచింత గ్రామ పంచాయతీ దాసరిగుడెంకు చెందిన ఓ తల్లి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుధవారం మొరపెట్టుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు.. దాసరి గూడెంకు చెంది న కె.ప్రతాప్, కుమారి దంపతుల కుమారుడు గణేష్(3)కు 45 రోజుల కిందట మెదడువాపు జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు తిరుపతిలోని ప్రయివేటు ఆస్పత్రులలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి చికిత్సలు చేయించారు. అయితే జ్వరం తీవ్ర ప్రభావం చూపడంతో చిన్నారికి పూర్తిగా మతిస్థిమితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. చైన్నైలో ఆపరేషన్ చేయించుకోవాలని, అందుకు లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం చేతిలో డబ్బు లేక బిడ్డను కాపాడుకోలేక చిత్రవధ అనుభవిస్తున్నామని గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి తన కుమారుడికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకొన్నారు. స్పందించిన పెద్దిరెడ్డి చిన్నారి ఆపరేషన్‌కు తన వంతు ఆర్థికసాయం హామీ ఇచ్చారు. చిన్నారిని స్విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని తల్లిదండ్రలకు సూ చించారు. అక్కడ డాక్టర్లతో తాను మాట్లాడి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేసేలా చర్యలు తీసుకోంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చా రు. గణేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పుటికప్పు డు తనకు తెలియజేయాలని సర్పంచ్ జయరామయ్య, ఎంపీటీసీ బాబును ఎమ్మెల్యే ఆదేశించారు. -
బాబు విధానాలను ఎండగట్టండి
5న ధర్నాలను విజయవంతం చేయండి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు పుంగనూరు: సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన చేపట్టనున్న ధర్నాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మండలంలోని ఆరడిగుంటలో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక ఆశలు చూపి ఓట్లు దం డుకున్న చంద్రబాబునాయుడు సీఎం కుర్చీలో కూర్చోగానే వాటిని మరచిపోయారని దుయ్యబట్టారు. రుణమాఫీ పేరుతో రైతులను, మహిళల ను మోసగించారని విమర్శించారు. చంద్రబాబు తీరును వివరిస్తూ అన్ని తహశీల్దార్ కార్యాలయా ల వద్ద ఐదో తేదీన ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, పార్టీ నాయకులు, ప్రజలు భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్, మురుగప్ప, రాజారెడ్డి, సత్య పాల్గొన్నారు. -
మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్ఆర్
చంద్రబాబు మోసకారి ప్రజల నుంచి గుణపాఠం తప్పదు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మాటకు కట్టుబడే వ్యక్తి అని, అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మండల పర్యటన చివరి రోజు బుధవారం ఆయన పూజగానిపల్లె గ్రా మంలో ప్రసంగించారు. వైఎస్ఆర్ను మాటకు కట్టుబడే వ్యక్తిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్‌పై సంతకం చేశారని, రూ.35 వేల కోట్ల కరెంటు బకాయిలు మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో నేటికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పేద ప్రజల కోసం చేపట్టిన పక్కాగృహాలు, పెన్షన్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్లు, పావలావడ్డీ రుణాలు, 108, 104 పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పడమటి మండలాల్లోని రైతుల కోసం హంద్రీ-నీవా కాలువను ప్రారంభించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఆయన ప్రారంభించిన కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10 శాతం పనుల కోసం నిధులు కేటాయించేందు కు చంద్రబాబు సుముఖత చూపకపోవడం బాధాకరమన్నారు. హంద్రీ-నీవా కాలువలో నీరు వస్తే 36 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాంటి పథకాలను వదిలివేసి, చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీపై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పుల్లారావు చేస్తున్న పొంతనలేని ప్రకటనలు ప్రజలను మోసగించడమేనన్నారు. టీడీపీలో కబ్జాదారులకు, మోసగాళ్లకు స్థానం కల్పించి, పేద ప్రజలను పీడిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ పేదల పక్షిపాతిగా ఉంటూ, రెండు రూపాయల బియ్యం, మద్యపానం నిషేధం అమలుపరచి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తికి అల్లుడైన చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి, అక్రమార్గాల్లో సీఎం అయి మూడు నెలల్లోనే మద్యనిషేధాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. రెండు రూపాయల బియ్యాని ఐదు రూపాయ లు చేసి పేదలను నిలువుదోపిడి చేసి చరిత్రహీనుడుగా మిగిలిపోయారని అన్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించి, ఆయన చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి పరిపాలన చేసే అర్హత లేదన్నారు. త్వరలోనే ప్రజలు చంద్రబాబు కళ్లు తెరిపిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు ద్వారకనాథరెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీటీసీ వెం కటరెడ్డియాదవ్, ఎంపీపీ నరసింహులు, ఏ ఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ ఎంపిటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలి
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు: ఎంతో నమ్మకంతో ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి ఒక్కరూ వారివారి ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పుంగనూరు మున్సిపల్ కార్యాలయం లో చైర్మన్ షమీమ్‌షరీఫ్, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాద వ్, ఎంపీపీ నరసింహులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణంతో కలసి ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులంద రూ ప్రతిరోజు తమ తమ ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరి ష్కరించాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే గ్రామాల్లో సిమెంటు రోడ్లు, కాలువల నిర్మాణం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశాల్లో ప్రజాప్రతినిధులంతా అధికారులతో కలసి చర్చలు జరపా లని, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపట్టేందు కు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టింపులకు, భేషజాలకు వెళ్లకుండా ఐకమత్యంతో అభివృద్ధే ఆశయంగా కృషి చేయాలన్నారు. అలాచేస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తామని తెలిపారు. అప్పటికీ అవసరమైతే భాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామ ని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాం తాల్లో అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరా రు. అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని ఈ విషయంలో ప్రజాప్రతినిధులు అపోహలకు గురికావద్దని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జెడ్పీటీసీ వెం కటరెడ్డి యాదవ్ తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆవుల అమరేం ద్ర, కౌన్సిలర్లు ఇబ్రహిం, అమ్ము, రెడ్డిశేఖర్, మనోహర్, రేష్మ, మంజుల, కమలమ్మ, జయలక్ష్మితో పాటు నేతలు రెడ్డెప్ప, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, గంగి రెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీగల నాయకుడు జగన్
ప్రజల బలహీనతలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బాబు రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్రహీనుడిగా మిగిలిన కిరణ్ బాబు, కిరణ్ చిత్తూరు జిల్లాలో పుట్టడం దురదృష్టకరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పులిచెర్ల (కల్లూరు): రాజకీయాల్లో నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పులిచెర్లలో సోమవారం ఎంపీపీ మురళీధర్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అమలుకు సాధ్యంకాని హామీలను గుప్పించి అడ్డదారిలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు. నాడు అధికారం కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన మాదిరిగానే నేడు ప్రజలను వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు దానిపై కమిటీ వేసి కాలయాపన చేస్తున్నాడన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ మేనిఫెస్టోలో రుణమాఫీని చేర్చాలని తనతో పాటు మరికొంత మంది అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోగా అందుకు ఆయన స్పందిస్తూ అది సాధ్యమయ్యే పనికాదని, అధికారంలోకి వచ్చిన తరువాత చేయకపోతే ప్రజల మనసులో మాట నిలుపుకోలేని వ్యక్తులుగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్ర హీనుడుగా మారాడని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తెలుగుదేశానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు అశోక్, ఎంపీపీ మురళీధర్, మండల పార్టీ కన్వీనర్ మురళీమోహన్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షులు రెడ్డీశ్వర్‌రెడ్డి, నాయకులు నాదమునిరెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, ఎన్ఎస్ రెడ్డిప్రకాష్, నాగిరెడ్డి, వెంకటరెడ్డెప్ప, డీఎస్.గోవింద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్వీ రమణ, కోదండయ్య, ముర్వత్బాషా, రాయల్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం కిరణ్‌కు షాక్!
గుర్రంకొండ జేఎస్పీ ఎంపీపీ వైఎస్సార్సీపీలో చేరిక గుర్రంకొండ/ సదుం: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కువూర్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. రెండు రోజుల క్రితం జేఎస్పీ తరఫున గుర్రంకొండ ఎంపీపీగా ఎన్నికైన నక్కా చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం సదుంలో జరిగిన ఓ కార్యక్రవుంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పుం గనూరు, పీలేరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి, చింతల రావుచంద్రారెడ్డి సవుక్షంలో ఆయున వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నక్కా చంద్రశేఖర్ వుండలంలోని సరివుడుగు సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యుడుగా గెలుపొందారు. మూ డు దశాబ్దాలుగా నల్లారి కుటుంబంతో అనుబంధం ఉంది. అతని తండ్రి నక్కా రెడ్డెన్న గతంలో రెండు సార్లు సింగిల్ విండో ఆధ్యక్షుడుగా, సర్పంచ్‌గా పనిచేశారు. నక్కాచంద్రశేఖర్ మాజీ సర్పంచ్. అతని భార్య నక్కా వెంకటలక్ష్మి ప్రస్తుతం సరివుడుగు సర్పంచ్. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలను కలుపుకుపోవాలని, వర్గాలకు, పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఎంపీపీ నక్కా చంద్రశేఖర్ వూట్లాడుతూ వైఎస్సార్సీపీ విధానాలు నచ్చే పార్టీలో చేరానన్నారు. వుండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రవుంలో జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిరాజా, వూజీ ఎంపీపీ మెహర్‌తాజ్ జమీర్ఆలీఖాన్, ప్రవుుఖ పారిశ్రామికవేత్త వరదారెడ్డిగారి నారదరెడ్డి, సర్పంచ్‌లు ప్రదీప్‌చంద్, నాయుకులు శ్రీరావుులు, ఎస్.వెంకటరవుణ, ఆకుల రెడ్డెప్ప, రవుణారెడ్డి, ఎల్వీ రవుణ, సురేష్, ఈశ్వరయ్యు, ప్రసాద్, చంద్రారెడ్డి, రామిరెడ్డి, కృష్ణసింగ్, చంద్ర, రవుణ పాల్గొన్నారు. -
నామినేషన్ వేయకుండా పారిపోయిన కిరణ్
కుట్రలకు ఆద్యుడు కిరణ్ బాబు హామీలను ప్రజలు నమ్మరు సీమాంధ్రలో వైఎస్సార్సీపీ 145 స్థానాల్లో విజయం సాధిస్తుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు, న్యూస్‌లైన్: ఓటమి భయంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ వేయకుండా పారిపోయారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ పీలేరు అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైఎస్సార్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంలో కిరణ్ ఉన్నత పదవులు అనుభవించారన్నారు. మహానేత మరణం తర్వాత ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ప్రజా క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే ధైర్యంలేక సీబీఐతో కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించడంలో కిరణ్ కుట్రదారుడని మండిపడ్డారు. అధికార దాహంతో వెన్నుపోటుదారుడు చంద్రబాబుతో కలసి సీబీఐ ద్వారా అక్రమకేసులు పెట్టించి పదహారు నెలలు జైల్లో పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటి కూడా కట్టించలేదన్నారు. అభివృద్ధి పేరుతో కిరణ్, ఆయన సోదరులు రాష్ర్ట ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు. చిన్నచిన్న ఉద్యోగాలను సైతం అమ్ముకోవడం నల్లారి సోదరుల దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కుట్రలు పన్నడంలో కిరణ్ ఆరితేరిన వ్యక్తని మండిపడ్డారు. సమైక్య ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనకు సహకరించిన చంద్రబాబు, బీజేపీ నేతలు చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు. అన్ని సందర్భాల్లో ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. మూడేళ్ల కిరణ్ పాలనలో ప్రభుత్వ భూములన్నింటినీ ఆక్రమించి పెద్దపెద్ద భవంతులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామన్నారు. ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలని కూల్చివేస్తామని హెచ్చరించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని, తాము ఆరు శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. సీమాంధ్రలో 135 నుంచి 145 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. మాజీ సీఎంల నియోజక వర్గాల్లో సైతం వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికలతో నల్లారి సోదరుల రాజకీయ జీవితం ముగిసిపోతుందన్నారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.9 లక్షల కోట్లు అవసరమని, ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన తర్వాత సీమాంధ్ర ఆదాయం రూ. 50 వేల కోట్లలోపేనని, ఇలాంటి పరిస్థితుల్లో లక్షల కోట్లు ఎక్కడ తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి, కొత్త హామీలతో ప్రజల వద్దకు రావడం చంద్రబాబుకు కొత్తకాదని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జీజేపీ, జేఎస్పీ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కిరణ్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఏ ఇబ్బంది వచ్చినా అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీలు డాక్టర్ వెంకట్రామయ్య, ఎం వెంకటరమణారెడ్డి ,రిటెర్డ్ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ నారే వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులు బీడీ నారాయణరెడ్డి, ఎం. రెడ్డిబాషా, కడప గిరిధర్‌రెడ్డి, డీ జగన్మోహన్రెడ్డి, షామియానా షఫీ, వివేకానందరెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, ఎం భానుప్రకాష్‌రెడ్డి, నాగిరెడ్డి, ఎం కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎస్ హబీబ్ బాషా, నారే అశోక్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, బాబ్జీరెడ్డి కాకులారంపల్లె రమేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, వై సురేష్‌కుమార్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజన్న ఆశయాలే జగన్ మేనిఫెస్టో : పెద్దిరెడ్డి
పుంగనూరు, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలే పార్టీ మేనిఫెస్టోగా వైఎస్.జగన్మోహన్రెడ్డి రూపొం దించారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచా రం చేసిన అనంతరం ఆదివారం ఆయన పుంగనూరులో మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి చిన్న వయస్సులోనే ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అని అభివర్ణించారు. రాష్ట్రంలో వైఎస్.రాజశేఖరరెడ్డి చేయాలనుకున్న పథకాలు ఆయన ఆకస్మిక మరణంతో నెరవేరలేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆయన తనయుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి రాజన్న కలల ఎన్నికల మేనిఫెస్టోను రూపొం దించారన్నారు. గ్రామాల్లో కార్యాల యాలు, వేలాది మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు రూ.20 వేలకోట్ల డ్వాక్రా రుణాల మాఫీ, రెండు జిల్లాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలు, 102, 103లో ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం టీచర్ల నియామకం, జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్లు, సీమాంధ్రలో గార్డెన్సిటీల ఏర్పా టు, తిరుపతి, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, పటిష్టంగా జలయజ్ఞం అమలు ఇలా అన్ని వర్గాలకు మేలు జరిగేలా జగన్మోహన్రెడ్డి ప్రజల మేనిఫెస్టోను రూపొందించారన్నారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ర్టం అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు. మే 7వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించి, వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను బలియమైన శక్తిగా అవతరించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందిచాలని కోరారు. -
కిరణ్.. అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా ?
ధైర్యంవుంటే నాపై పోటీ ఎవరో చెప్పండి సవాల్‌విసిరిన పెద్దిరెడ్డి జైసమైక్యాంధ్రకు డిపాజిట్లూ దక్కవు పుంగనూరు, న్యూస్‌లైన్:మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జైసమైక్యాంధ్రపార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డికి ధైర్యం ఉంటే ముందుగా సొంత జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మూడు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కిరణ్‌కు దమ్ముం టే పార్టీకి అభ్యర్థులను నిలబెట్టి డిపాజిట్లు దక్కించుకోవాలని, లేకపోతే... పార్టీని రద్దు చేసి, ఏ పార్టీకైనా మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అభ్యర్థులను ప్రకటించకుండా చవట దద్దమ్మలా....రోడ్‌షోలు నిర్వహించేందుకు సిగ్గులేదా ? అని ప్రశ్నించారు. శనివారం పుంగనూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై వ్యక్తిగత కక్షతో పుంగనూరులో మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌కు దమ్ము,ధైర్యం వుంటే తన మీద పోటీకి అభ్యర్థిని నియమించాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. జిల్లాలో రోడ్‌షోలకు ప్రజలు రాకపోవడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి మీద ఉన్న ప్రేమ తేటతెల్లమైందన్నారు. కిరణ్ సీఎంగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు బిల్లుపెడితే పదవికి రాజీనామా చేస్తానని తొలుత గొప్పలు చెప్పిన కిరణ్, ఆ తరువాత సీఎం కుర్చీకాపాడుకోవడానికి తెలుగుదేశం, కాంగ్రెస్, బీజీపీలతో కలిసి కుట్రలుపన్ని రాష్ర్ట విభజనకు పూనుకున్నారని దుయ్యబట్టా రు. రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోని కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతితో వేలాది కోట్లు సంపాదించి, పార్టీ పెట్టే స్థాయి కి ఎదిగారని ఆరోపించారు. తెలుగు ప్రజలను విడగొట్టిన కిరణ్ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పార్టీ ఏర్పాటు చేసి, డ్రామాలాడుతున్నారని విమర్శించారు. సిగ్గూఎగ్గూలేకుండా పార్టీ గుర్తుగా పాదరక్షలను ఎంపికచేసుకున్నారని ఎద్దేవాచేశారు. జైసమైక్యాంధ్ర అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేని కిరణ్ రోడ్‌షోల్లో సమైక్యం పేరుతో ప్రజలను ఆకట్టుకునేందుకు డ్రామాలాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జగన్మోహన్రెడ్డిని, వైఎస్ఆర్సీపీని విమర్శించే అర్హత కిరణ్‌కు లేదన్నారు. విశేష ప్రజాభిమానం ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమావ్యక్తంచేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు రెడ్డెప్ప, వెంకటరెడ్డి యాదవ్, కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి, జింకా వెంకటాచలపతి, బెరైడ్డిపల్లె కృష్ణమూర్తి, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. మూడేళ్లు రెడ్డెప్పరెడ్డి ఏమైనా పట్టించుకున్నారా ? జిల్లాలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడుగా ఉన్న ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి ఏనాడైనా పుంగనూరు అభివృద్ధి గురించి పట్టించుకున్నారా..? అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలు పుంగనూరు అభివృద్ధిని కిరణ్ అడ్డుకోగా.. ఆయన ఏమి చేశారు..? అప్పుడు అభివృద్ధి గురించే మరిచిపోయూరా...? అంటూ నిలదీశారు. సమైక్యాంధ్ర పేరుతో ఓట్ల కోసం వస్తున్న ఇలాంటి అవకాశవాదులకు తగిన గుణపాఠం నేర్పాలని ప్రజలను కోరారు. -
పీలేరుపై పెద్దిరెడ్డి పట్టు
నామమాత్రపు పోటీలో టీడీపీ పెద్దిరెడ్డి రాకతో భారీగా వలసలు పల్లెల్లో పెద్దిరెడ్డికి అపూర్వ స్వాగతం వైఎస్సార్ కాంగ్రెస్‌లో రెట్టింపు ఉత్సాహం పీలేరు, న్యూస్‌లైన్ : మాజీ సీఎం కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభంజనం వీస్తోంది. మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సమైక్యాంధ్ర మద్దతు అభ్యర్థులతోపాటు టీడీపీ పోటీ నామమాత్రమైంది. సమైక్యాధ్ర మద్దతు అభ్యర్థులు మొదట్లో కొన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనతో ఎన్నికలు ఏకపక్షమయ్యాయని చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి నాయకత్వ లోపంతో ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా మారింది. ఎన్నిల ప్రచార పర్వం ప్రారంభమైనప్పటి నుంచి పీలేరు నియోజకవర్గంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో అటు సమైక్యాంధ్ర, ఇటు టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు పెద్ద సంఖ్యలోవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. మూడు దశాబ్దాలుగా పీలేరు నియోజకవర్గ ప్రజలతో పెద్దిరెడ్డి కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. మరోవైపు ప్రతి గ్రామంలోనూ పార్టీ నాయకులతో పాటు ప్రజలను, అభిమానులను పేరు పెట్టి పిలిచేంతగా పెద్దిరెడ్డికి చనువు ఉంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు మండలంలో బాలంవారిపల్లె, దొడ్డిపల్లె, అగ్రహారం, వేపులబైలు, మేళ్లచెరువు, గూడరేవుపల్లె, ముడుపులవేముల, పీలేరు పట్టణంలోని పలు ఎంపీటీసీల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు తమ అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిచయం ఉన్న నేతలందరూ తమ భవిష్యత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనే ముడిపడి ఉందన్న నమ్మకంతో ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారు. ఇక సమైక్యాంధ్ర, టీడీపీలు గల్లంతుకావడం తథ్యమని ముందుగానే పసిగట్టిన నేతలు పక్కా ప్రణాళికతో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారు. నిన్నటి వరకు సీఎంగా కొనసాగిన కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరులు సైతం పోటాపోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు మిథున్‌రెడ్డి సైతం పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, కేవీ పల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మాజీ సీఎం ఇలాకాలో అన్ని మండలాల్లోనూ వైఎస్సార్సీపీ పతాకాన్ని ఎగురవేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. -
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
పీలేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యమని, అందరూ సమష్టిగా పని చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పీలేరు, కేవీపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్సార్ సీపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. తెలుగు కాంగ్రెస్ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్సీపీకి ఘన విజయం చేకూర్చేందుకు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి మహానేత రుణం తీర్చుకోవాలని కోరారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం కరువు, కాటకాలతో తల్లడిల్లిందని, కిరణ్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరోగమనంలో పయనించాయని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు రాజకీయాలతో తెలుగు జాతిని ముక్కలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, కిరణ్ పార్టీలకు ఓటడిగే నైతిక హక్కు లేదన్నారు. కిరణ్ ఇలాకాలో పర్యటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటనలో రాజంపేట పార్లమెంటరీ ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.వెంకట్రమణారెడ్డి, ఎం.రెడ్డిబాషా, హరీశ్వర్‌రెడ్డి, నారే వెంకట్రమణారెడ్డి, వెంకటసిద్ధులు, భానుప్రకాష్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, ఉదయ్‌కుమార్, షామియానా షఫీ, బీడీ.నారాయణరెడ్డి, ఎం.రవీంద్రనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఆదినారాయణ, పెద్ద సిద్దయ్య, ద్వారకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోనియా తొత్తు కిరణ్: పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమైక్య ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీ తొత్తు అని వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన పీలేరు, కేవీపల్లె మండలాల్లో విస్తృతంగా పర్యటిం చారు. కేవీపల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారకులైన చంద్రబాబు, కిరణ్‌కు ఈ ఎన్నికల్లో ఓటడిగే నైతిక హక్కు లేదన్నారు. సమైక్య ముసుగులో కొత్త పార్టీని తెరపైకి తీసుకురావడం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల్లో భాగమేనని దుయ్యబట్టారు. కొత్త పార్టీకి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. వైఎస్సార్ సీపీని దెబ్బతీయడానికి టీడీపీ, కాంగ్రెస్, కిరణ్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయ ని ఆరోపించారు. ప్రజల అండదండలు, ఆశీర్వాదంతో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
చిత్తూరు కాంగ్రెస్ నాయకులతో పెద్దిరెడ్డి మంతనాలు
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం చిత్తూరు నగరంలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంతనాలు సాగించారు. నగరంలోని పీసీసీ మాజీ సభ్యుడు ఎస్.సుధాకరరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నా యకులు, చిత్తూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఐరాల మాజీ ఎంపీపీ పొలకల ప్రభాస్‌కుమార్‌రెడ్డి(చిట్టిరెడ్డి)తో పెద్దిరెడ్డి దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు. చిత్తూరులో వైఎస్ఆర్ సీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన చర్చించారు. చర్చల అనంతరం పలువురు నాయకులు పెద్దిరెడ్డి సమక్షంలో తమ అనుచరులతో కలిసి పార్టీలోకి చేరేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వీరంతా రెండు, మూడురోజుల్లో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ .జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో వైఎస్ఆర్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ అమర్నాథ్, నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి, నాయకులు క ట్టమంచి ప్రతాప్‌రెడ్డి, బాలసుబ్రమణ్యంరెడ్డి, కట్టమంచి మనోహర్‌రెడ్డి, ఆర్ చంద్ర, త్రిమూర్తి, శ్రీధర్‌రెడ్డి, సయ్యద్, మాజీ కౌన్సిలర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ కుటుంబాన్ని వేధించారు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో సోమవారం నిర్వహించి న ముదిరాజ్ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం పై వేధింపుల్లో భాగంగానే వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని నెలలపాటు జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వేధింపులనూ తట్టుకుని జగన్ అశేష ప్రజాభిమానం చూరగొన్నారన్నారు. వై ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలంటే జగన్‌ను ప్రజలు నిండు మనసుతో ఆశీ ర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కో రారు. అదేవిధంగా తిరుపతి పార్లమెం టు సభ్యులుగా పోటీ చేయనున్న వెలగపల్లి వరప్రసాద్‌ను ముదిరాజులు అఖం డ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజులకు శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాల్లో కమ్యూనిటీ భవనా లు, కల్యాణ మండపాలు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నా రు. అనంతరం వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాకు సింహం లాంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అభివర్ణించారు. వచ్చే ఏడాది ముది రాజ్‌ల సమావేశానికి రాష్ట్ర కీలకమంత్రి హోదాలో ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ పేదల సంక్షే మం వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సా ధ్యమన్నారు. ఆప్కో డెరైక్టర్ మిద్దెలహరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజ లు జగన్‌కు మద్దతు పలకాలన్నారు. రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్‌లు ఐక్యతతో విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని సూచించారు. ముదిరాజ్ సంఘం నాయకులు చిట్టేటి చిన్నా ముదిరాజ్ మాట్లాడుతూ ముది రాజ్‌ల అభ్యున్నతికి తోడ్పాటు అందిం చే రాజకీయపార్టీకే తమ మద్దతు ఉం టుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ము దిరాజ్ల అభ్యున్నతికి సహకరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముది రాజ్ సంఘం నాయకులు దేశీయ ముది రాజ్, కుమార్‌రాజ, కోటేశ్వరరావు, మునిరామయ్య, అంకయ్య ముదిరాజ్, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మడి బాలకృష్ణయ్య, నాయకులు కొ ట్టెడి మధుశేఖర్, లోకేష్‌యాదవ్, ఉ న్నం వాసునాయుడు, పురుషోత్తంగౌడ్, సిరాజ్‌బాషా, జయశ్యాంరాయల్, పం తులు, మదన్మోహన్ పాల్గొన్నారు. -
రాయల తెలంగాణ అంగీకరించం
తిరుపతి, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ డిమాండ్ వెనుక కొందరి స్వార్థప్రయోజనాలు దాగి ఉన్నాయని దీనిని తాము అంగీకరించమని సమైక్యవాదులు అంటున్నారు. ‘రాయల తెలంగాణ’ నాటకాన్ని ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని అనుమానిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ సీపీ ప్రాబల్యాన్ని రాయలసీమలో నిలువరించేందుకు ఈ కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ జిల్లాలో 119 రోజులుగా సాగుతున్న నిరసన కార్యక్రమాలు మంగళవారం కూడా యధాతథంగా కొనసాగాయి. మదనపల్లెలో స్థానిక హోప్ హైస్కూల్లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే కష్ట, నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 119 సంఖ్య ఆకారంలో కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. అనంతరం పురవీధుల్లో భారీ ర్యాలీ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తాము అంగీకరించేది లేదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలో తాతయ్యగుంట ప్రాంతానికి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి దీక్షలో ఉన్నవారికి సంఘీభావం ప్రకటించారు. రాయల తెలంగాణ నాటకాన్ని ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కార్యకర్తలతో దీక్ష విరమింపచేశారు. న్యాయవాదులు కోర్టు విధుల బహిష్కరణను కొనసాగించారు. తిరుపతిలో మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టౌన్‌క్లబ్ సర్కిల్ నుంచి ప్రధాన వీధుల మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. రాయల తెలంగాణ ప్రతిపాదన వె నుక కుట్ర దాగి ఉందని మబ్బు చెంగారెడ్డి ఆరోపించారు. పుంగనూరులో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఎన్టీఆర్ సర్కిల్లో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అలాగే ఇంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కొనసాగాయి. పలమనేరులో వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు రిలే దీక్ష కొనసాగించారు. -
నీళ్లున్నా.. గొంతు తడవదు !
పీలేరు, న్యూస్‌లైన్: పీలేరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ప్రజల తాగునీటి ఎద్దడిని శాశ్వత ప్రాతిపదికన తీర్చేందుకు రూ. 2.17 కోట్లతో పట్టణ శివార్లలోని కొత్తపల్లె మార్గంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించారు. పింఛా ఏటి నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నింపి, ఆ నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు తరలించి, అక్కడి నుంచి ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పింఛా ఏటిపై పీలేరు-సదుం మండలాల సరిహద్దు ప్రాంతంలోని బాలంవారిపల్లె సమీపంలో రూ.2 కోట్లతో గార్గేయ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా పీలేరు సమ్మర్స్టోరేజ్కి నీటిని తరలించి పట్టణ ప్రజలకు తాగునీరు, దాదాపు 5 వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాలనేది ప్రధాన లక్ష్యం. నిర్మాణ పనులు పూర్తైఐదేళ్లు కావస్తున్నా ఆ దిశగా ఎలాంటి పురోగతి కానరాలేదు. మరోవైపు కాలువల నిర్మాణం కోసం భూసేకరణ గతంలోనే పూర్తైది. ఉన్నతమైన ఆశయంతో పెద్దిరెడ్డి పీలేరు తాగునీటి సమస్య తీవ్రతను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి వివరించి సమ్మర్‌స్టోరేజ్, గార్గేయ ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపుగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని అం దరూ సంబరపడ్డారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వెళ్లడంతో ఆశయం కార్యరూపం దాల్చలేదు. మహానేత మరణానంతరం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సమ్మర్ స్టోరేజ్‌కి నీటి తరలింపు కోసం చేస్తున్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నీటి ఎద్దడితో ప్రజలు అలమటించాల్సి వస్తోంది. ఆరునెలల కిందట మంచినీటి సమస్య జఠిలంగా మారడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో బోర్లు డ్రిల్ చేసినా అది ఫలప్రదం కాలేదు. దాహార్తి తీవ్రతను గుర్తించి రాజకీయాలకతీతంగా సమ్మర్ స్టోరేజ్‌కి ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ వేసి నీటిని తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.