శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో సోమవారం నిర్వహించి న ముదిరాజ్ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం పై వేధింపుల్లో భాగంగానే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని నెలలపాటు జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వేధింపులనూ తట్టుకుని జగన్ అశేష ప్రజాభిమానం చూరగొన్నారన్నారు.
వై ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావాలంటే జగన్‌ను ప్రజలు నిండు మనసుతో ఆశీ ర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కో రారు. అదేవిధంగా తిరుపతి పార్లమెం టు సభ్యులుగా పోటీ చేయనున్న వెలగపల్లి వరప్రసాద్‌ను ముదిరాజులు అఖం డ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజులకు శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాల్లో కమ్యూనిటీ భవనా లు, కల్యాణ మండపాలు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నా రు.
అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాకు సింహం లాంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అభివర్ణించారు. వచ్చే ఏడాది ముది రాజ్‌ల సమావేశానికి రాష్ట్ర కీలకమంత్రి హోదాలో ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ పేదల సంక్షే మం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సా ధ్యమన్నారు. ఆప్కో డెరైక్టర్ మిద్దెలహరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజ లు జగన్‌కు మద్దతు పలకాలన్నారు.
రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్‌లు ఐక్యతతో విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని సూచించారు. ముదిరాజ్ సంఘం నాయకులు చిట్టేటి చిన్నా ముదిరాజ్ మాట్లాడుతూ ముది రాజ్‌ల అభ్యున్నతికి తోడ్పాటు అందిం చే రాజకీయపార్టీకే తమ మద్దతు ఉం టుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ము దిరాజ్‌ల అభ్యున్నతికి సహకరించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ముది రాజ్ సంఘం నాయకులు దేశీయ ముది రాజ్, కుమార్‌రాజ, కోటేశ్వరరావు, మునిరామయ్య, అంకయ్య ముదిరాజ్, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మడి బాలకృష్ణయ్య, నాయకులు కొ ట్టెడి మధుశేఖర్, లోకేష్‌యాదవ్, ఉ న్నం వాసునాయుడు, పురుషోత్తంగౌడ్, సిరాజ్‌బాషా, జయశ్యాంరాయల్, పం తులు, మదన్‌మోహన్ పాల్గొన్నారు.
వైఎస్ కుటుంబాన్ని వేధించారు
Published Tue, Jan 14 2014 3:09 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement