ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, దీపాదాస్‌మున్షీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, షబ్బీర్ అలీ తదితరులు
అన్ని పార్టీలు, నేతలు ఆయన చేసిన సంక్షేమాన్నే అమలు చేస్తున్నారు
వై.ఎస్. రాజశేఖరరెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గాంధీ భవన్‌లో ఘనంగా వైఎస్ 75వ జయంతి వేడుకలు
రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న వై.ఎస్. కల నెరవేర్చాలని కార్యకర్తలకు పిలుపు
సాక్షి,హైదరాబాద్: దేశంలో సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే పేరు వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వై.ఎస్. చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని గాంధీ భవన్‌లో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమంపై వై.ఎస్. చెరగని ముద్ర వేశారన్నారు.
ఆయన హయాంలో జరిగిన అభివద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపయోగపడుతోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల హామీలకు స్ఫూర్తి రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, గోదావరి, కష్ణా జలాల వినియోగం, హైదరాబాద్‌లో పెట్టుబడులకు కూడా ఆయనే స్ఫూర్తి అని రేవంత్ కొనియాడారు. వై.ఎస్. స్ఫూర్తి ని తమ ప్రభుత్వం, పార్టీ కొనసాగిస్తుందన్నారు.
ఆయన చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తినిచి్చందన్నారు. 2009లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాం«దీని ప్రధానిని చేయాలని వై.ఎస్. చెప్పారని.. కానీ రాహుల్ ప్రధాని కాకుండానే ఆయన దూరమయ్యారని విచారం వ్యక్తం చేశారు. వై.ఎస్. స్ఫూర్తి తో దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కొట్లాడి రాహుల్‌ను ప్రధాని చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఆయన అభిమానులంతా కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు.
వైఎస్ స్థానం సుస్థిరం: డిప్యూటీ సీఎం భట్టి
అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల హదయాల్లో వై.ఎస్. స్థానం సుస్థిరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే నేడు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రజానీకానికి మేలు జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలను వై.ఎస్. ఆదుకున్నారని చెప్పారు. తెలంగాణ వడివడిగా అభివద్ధివైపు అడుగులు వేయడానికి వై.ఎస్. వేసిన పునాదులే కారణమన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నేడుహైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. గాం«దీభవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజాభవన్‌లో వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం
లక్డీకాపూల్/పంజగుట్ట/బంజారాహిల్స్: మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వై.ఎస్. భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వై.ఎస్. 75వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ సోమవారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రేవంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వై.ఎస్. ఫొటోలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం పంజగుట్ట కూడలిలోని వై.ఎస్. విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులరి్పంచారు. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1/10లోని సిటీ సెంటర్ వద్ద ఉన్న వై.ఎస్. విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, వై.ఎస్. ఆప్తమిత్రుడు కేవీపీ, మేయర్ విజయలక్షి్మ, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment