TG: వైఎస్సార్‌ జయంతి కానుక.. కాంగ్రెస్‌ నేతలకు కార్పొరేషన్‌ పదవులు | Corporation Chairmans Appointed In Telangana | Sakshi
Sakshi News home page

TG: వైఎస్సార్‌ జయంతి కానుక.. కాంగ్రెస్‌ నేతలకు కార్పొరేషన్‌ పదవులు

Published Mon, Jul 8 2024 11:42 AM | Last Updated on Mon, Jul 8 2024 12:10 PM

Corporation Chairmans Appointed In Telangana

సాక్షి,హైదరాబాద్‌: మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కానుక అందించారు. తెలంగాణలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్‌ పదవుల పంపిణీ చేపట్టారు. చురుగ్గా పనిచేసిన  మొత్తం 35 మంది నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌ పదవులను కట్టబెట్టారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం(జులై 8) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కో ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా జంగారాఘవరెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలజగ్గారెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా అలేఖ్యపూజారి, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అవినాష్‌రెడ్డి 

అగ్రి ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు కాసుల బాలరాజు, స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్‌కు మనాల మోహన్ రెడ్డి, వేర్‌హౌజ్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఫిషరీస్ కోపరేటివ్ కార్పొరేషన్‌కు మెట్టు సాయికుమార్ తదితరులను చైర్‌పర్సన్‌లుగా నియమించారు.


 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement