corporation posts
-
దీపావళిలోపు కార్పొరేషన్ పదవులు
సాక్షి, హైదరాబాద్: దీపావళిలోపు రెండోదఫా కార్పొరేషన్ పదవులు ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. దసరాలోపు చేద్దామని అనుకున్నా హరియాణా, కశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదని, ఏఐసీసీ నాయకత్వం కూడా బిజీగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ, టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటులోనూ జాప్యం జరిగిందన్నారు. శుక్రవారం గాం«దీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ⇒ ఎంఐఎంతో స్నేహం వేరు. శాంతిభద్రతల సమస్య వేరు. నాంపల్లి నియోజకవర్గంలో మా పార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌పై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకుంటాం. విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. ⇒ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది అవుతోంది. అందుకే చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ వేశాం. కానీ బీఆర్ఎస్కు చెందిన చాలామంది మాతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే మళ్లీ చేరికలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ⇒ సినీనటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కావాలని మాట్లాడలేదు. కేటీఆర్ వ్యవహారశైలి కారణంగానే అలా మాట్లాడారని అనుకుంటున్నా. అయినా అలా మాట్లాడాల్సింది కాదు. నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెబుతుందో చూడాలి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ విషయంలో అధిష్టానం మమ్మల్ని ఎలాంటి వివరణ అడగలేదు. అయినా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. ఆ రోజే ఆ విషయం క్లోజ్ అయ్యింది. ⇒ పేదలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. మూసీ, హైడ్రాలు భావితరాల కోసమే చేపట్టాం. ⇒ బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. మమ్మల్ని ఎదుర్కోవడమే ఆ రెండు పార్టీల టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశముంది. అయినా మాకేం నష్టం లేదు. ⇒ సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీఆర్ఎస్ మా మీద దు్రష్పచారం చేస్తోంది. దుబాయి నుంచి ఖాతాలు తెరిచి మరీ నడిపిస్తున్నారు. రూ. వందల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాను దురి్వనియోగం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ⇒ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పక్షాన మాట్లాడుతున్నారు. బీసీల పక్షాన మాట్లాడితే పార్టీ లైన్ తప్పారని అనలేం. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని మల్లన్నకు విజ్ఞప్తి చేస్తున్నా. ⇒ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ. రెండు పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎంత దు్రష్పచారం చేసినా ప్రజలు నమ్మరు. ⇒ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు ఉన్నాయి. నెలరోజుల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళతా. -
TG: వైఎస్సార్ జయంతి కానుక.. కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ పదవులు
సాక్షి,హైదరాబాద్: మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కానుక అందించారు. తెలంగాణలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ పదవుల పంపిణీ చేపట్టారు. చురుగ్గా పనిచేసిన మొత్తం 35 మంది నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులను కట్టబెట్టారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం(జులై 8) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా జంగారాఘవరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలజగ్గారెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా అలేఖ్యపూజారి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అవినాష్‌రెడ్డి అగ్రి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కాసుల బాలరాజు, స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్‌కు మనాల మోహన్ రెడ్డి, వేర్‌హౌజ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఫిషరీస్ కోపరేటివ్ కార్పొరేషన్‌కు మెట్టు సాయికుమార్ తదితరులను చైర్పర్సన్లుగా నియమించారు.ఏ పదవి ఎవరికి.. ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఎమ్మెల్యేలకు ‘కార్పొరేషన్’ పదవులు!
- వారంలో కనీసం 4 పోస్టుల భర్తీ! - ఆర్టీసీ చైర్మన్ రేసులో పలువురు ఎమ్మెల్యేలు - టీఆర్ఎస్లో రసవత్తర చర్చ సాక్షి, హైదరాబాద్: పలు అధికారిక పదవులను ప్రస్తుత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే అవకాశముందని అధికార టీఆర్ఎస్ నేతల్లో చర్చ మొదలైంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులను కొందరు ఎమ్మెల్యేలతో భర్తీ చేయనున్నారని సమాచారం. వీటిలో కేబినెట్ ర్యాంకు పదవులు కూడా ఉండడంతో ఎమ్మెల్యేల్లో పోటీ తీవ్రమైంది. మంత్రివర్గంలో సంఖ్యా పరిమితి వల్ల అవకాశాలు దక్కని సీనియర్లు వీటికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి పదవుల కోసం తనపై వస్తున్న ఒత్తిడి నుంచి బయట పడేందుకు పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు గతంలో పార్లమెంటరీ సెక్రటరీ పదవులను తెరపైకి తెచ్చి ఏడుగురు ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చినా కోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని రద్దు చేయాల్సి రావడం తెలిసిందే. దాంతో నామినేటెడ్ పదవులకు ఒక్కసారిగా పోటీ పెరిగింది. టీఆర్ఎస్లో మొదటినుంచీ కొనసాగుతున్న సీనియర్ నేతలు, సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, ఓడిపోయి నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్నవారు... ఇలా ఎంతోమంది పదవుల కోసం ఆశగా చూస్తున్నారు. వారంలోగా కనీసం మూడు నాలుగు కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు భర్తీ కానున్నట్టు అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినందున ‘బ్రాహ్మణ కార్పొరేషన్’కు చైర్మన్‌ను వేస్తారంటున్నారు. పార్లమెంటరీ సెక్రటరీగా చే సిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీశ్ పేరు ఇందుకు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌కు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఓ మంత్రి తాలూకు ప్రధాన అనుచరునికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ పదవి ఖరారైందని తెలిసింది. ఇక బాగా డిమాండున్న ఆర్టీసీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో పాటు వరంగల్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరూ తెరపైకి వచ్చినట్టు సమాచారం. వ్యవసాయ మార్కెట్ల పాలక మండళ్లు, దేవాలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు తదితర నామినేటెడ్ పదవులనూ భర్తీ చేయాల్సి ఉంది. -
ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ పదవులను ఎమ్మెల్యేలు చేపట్టేందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టం-1953ని తెలంగాణకు అన్వయించుకునే తీర్మానాన్ని రాష్ర్ట కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోతే ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం సాధ్యం కాదు. ప్రజాప్రతినిధులు లాభదాయక పదవుల్లో కొనసాగితే అనర్హతకు గురయ్యే అవకాశముండటంతో రాష్ర్ట ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి రాష్ర్టంలోని సంబంధిత చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అజ్మీరా చందులాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. దుబాయ్ పర్యటన నుంచి మంగళవారమే తిరిగొచ్చిన మంత్రి కేటీఆర్ మాత్రం దీనికి హాజరుకాలేదు. కాగా, ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన రాష్ర్ట ఎన్నికల సంఘంలో సిబ్బంది నియామకానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కార్యదర్శిని మాత్రమే నియమించారు. ఈసీ కమిషనర్‌గా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డిని నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలకు తెలంగాణ రాష్ట్రం పేరుతో తక్షణమే బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా మంత్రిమండలి తీర్మానించింది. రాష్ర్ట ప్రణాళికా సంఘం ఏర్పాటు, దాని వైస్‌చైర్మన్ నియామక ఉత్తర్వులను, పీడీ చట్టానికి సవరణను కూడా ఆమోదించింది.