సాక్షి, కడప: రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలాగే, షర్మిలను ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సూచనలు తీసుకుని జిల్లా కమిటీలు వేస్తాం. పార్టీని ప్రక్షాళన చేసి సమర్ధులైన వ్యక్తులకు పదవులు ఇస్తాం. విద్యుత్ చార్జీలు విషయంలో ఈరోజు పచ్చ పత్రికలు మాట్లాడటం లేదు. రూ.6వేల కోట్ల భారం చంద్రబాబు ప్రజలపై వేస్తున్నారు. ఇప్పుడు జగన్ తప్పిదం వల్ల చార్జీలు పెరుగుతున్నాయి అంటూ రాస్తున్నారు. వరదల నుంచి అన్నీ జగన్ వల్లే అంటూ అభూత కల్పనలు సృష్టిస్తున్నారు.
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేశారు. ప్రజలు ఇప్పటికే ఎవరి పరిపాలన ఏమిటో గమనించారు. క్రాప్ ఇన్స్యూరెన్స్ ఇప్పుడు రైతులే కట్టుకోవాలి అంటున్నారు. వ్యవసాయం దండగ ఆన్న వ్యక్తి రైతులను ఏ విధంగా ఆదుకుంటాడు?. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకూ షేర్లు బదలాయింపు జరగదు. ఆమెకు అన్నీ తెలుసు.. ఆమె పద్ధతి జగన్‌ని దెబ్బతీయాలనే విధంగా ఉంది. మేము ప్రత్యేకంగా ఆమెను పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment