బాబు విధానాలను ఎండగట్టండి | Babu policies sunny gattandi | Sakshi
Sakshi News home page

బాబు విధానాలను ఎండగట్టండి

Published Mon, Nov 3 2014 3:43 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

Babu policies sunny gattandi

  • 5న ధర్నాలను విజయవంతం చేయండి
  •  ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు
  • పుంగనూరు: సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన చేపట్టనున్న ధర్నాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మండలంలోని ఆరడిగుంటలో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక ఆశలు చూపి ఓట్లు దం డుకున్న చంద్రబాబునాయుడు సీఎం కుర్చీలో కూర్చోగానే వాటిని మరచిపోయారని దుయ్యబట్టారు.

    రుణమాఫీ పేరుతో రైతులను, మహిళల ను మోసగించారని విమర్శించారు. చంద్రబాబు తీరును వివరిస్తూ అన్ని తహశీల్దార్ కార్యాలయా ల వద్ద ఐదో తేదీన ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, పార్టీ నాయకులు, ప్రజలు భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

    ఈ సమావేశంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్, మురుగప్ప, రాజారెడ్డి, సత్య పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement