Mentions
-
రిజిస్ట్రార్ ముందే కేసుల మెన్షనింగ్
సాక్షి, న్యూఢిల్లీ: అత్యవసర కేసుల మెన్షనింగ్ ఇకపై రిజిస్ట్రార్ వద్దే చేసుకోవచ్చని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. బెంచ్‌ల వద్ద మెన్షనింగ్ స్థానంలో ఈ కొత్త పద్ధతి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.‘సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, జూనియర్లు అవకాశాలు కోల్పోవాలని మేం కోరుకోం. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థ రూపొందించాం. బెంచ్‌ల ముందు ప్రస్తావించే అంశాలన్నీ ఇక ముందు రిజిస్ట్రార్ వద్దే ప్రస్తావించొచ్చు’ అని జస్టిస్ రమణ తెలిపారు. బెంచ్‌ల ముందు మెన్షనింగ్ పద్ధతి స్థానంలో సంబంధిత అధికారి ముందు మెన్షన్ చేసుకొనే పద్ధతి తీసుకొస్తున్నట్లు సీజేఐ జస్టిస్ రమణ తెలిపారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కామన్‌కాజ్ స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన కేసు విచారణ సందర్భంగా బుధవారం సీజేఐ మాట్లాడారు. -
మళ్లీ మొదటికి..
రుణమాఫీకి అర్హత పొందే రైతులను ఎంపిక చేసే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఆధార్, రేషన్, ఓటరు కార్డులు కావాలంటూ రెవెన్యూ అధికారులు గ్రామాల బాట పట్టారు. ఐదునెలలుగా రైతులను రుణ విముక్తులను చేస్తామని చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం మరోసారి వడపోత పనిలో పడింది. ఆ మేరకు జిల్లాలో మంగళవారం పలుగ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి విచారిస్తుండటం ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం కోసం ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయటం మాని విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో రుణమాఫీకి సంబంధించి గతంలో బ్యాంకర్లు 4,86,291 మంది లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. వాటిలోనూ కోత పెట్టేందుకు మరోసారి ప్రభుత్వం విచారణకు తెరతీసింది. అయితే బ్యాంకర్లు పంపిన జాబితాకు ప్రస్తుతం రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న జాబితాకు తేడా ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. తాము పంపిన జాబితా నుంచి 20 శాతం మంది పేర్లు గల్లంతయ్యాయని ఓ బ్యాంక్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవి కాకుండా మరి కొందరి పేర్లు తొలగించేందుకే ప్రభుత్వం మరోసారి పునర్విచారణ పేరుతో రెవెన్యూ అధికారులను గ్రామాల్లోకి పంపుతోందని వెల్లడించారు. అందుకు జన్మభూమి కమిటీ సభ్యులను కూడా పురమాయించడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అంతా అయోమయం గ్రామాల్లో పునర్విచారణ చేపట్టిన అధికారులు రైతులను కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అదేవిధంగా మరోసారి ఆధార్, రేషన్, ఓటరు కార్డుతో పాటు పట్టాదారు పాసుపుస్తకాన్ని అడుగుతున్నారు. ఇవన్నీ గతంలోనే అడిగి తీసుకున్నారు కదా? అని రైతులు ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. ఇంతకీ మేం రుణమాఫీకి అర్హులమా? కాదా? అని రైతులు ప్రశ్నించినా అధికారులు ఎటువంటి సమాధానం చెప్పలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేపట్టిన విచారణలో ఆధార్, రేషన్, ఓటరు కార్డుల్లో ఏ ఒక్కదాంట్లో చిన్న పొరబాటు ఉన్నా.. వారు అనర్హులుగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు పట్టాదారు పాసుపుస్తకం అడుగుతుంటే.. మరికొన్ని గ్రామాల్లో కుటుంబంలోని వారి వివరాలు అడిగి తీసుకుంటున్నట్లు సమాచారం. అధికారులు రకరకాల ప్రశ్నలు వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రైతు రుణమాఫీకి అర్హుడా? అనర్హుడా? అనే విషయాన్ని తేల్చుకునే క్రమంలో వారు వేస్తున్న ప్రశ్నలు పలువురిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పునర్విచారణ ప్రక్రియను పరిశీలిస్తే బ్యాంకర్లు పంపిన జాబితాలో 50 శాతం మంది పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రుణమాఫీకి ఎన్ని కొర్రీలో..
అన్నదాతల పాలిట వరమనుకున్న రుణమాఫీ వారికి అందకుండా పోతోంది. ప్రభుత్వం రైతులను పలుమార్లు విచారణ పేరుతో అవమానిస్తూ.. వారి మనోభావాలకు భంగం కలిగిస్తోంది. పింఛను లబ్ధిదారులను అడ్డదిడ్డంగా ఏరివేసిన కమిటీ తాజాగా రుణమాఫీ జాబితాపై పెత్తనం చెలాయిస్తోంది. అధినేత సూచనల మేరకు ఏరివేతే ప్రధాన లక్ష్యంగా కమిటీని రంగంలోకి దింపినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నట్లు నటిస్తూ.. లబ్ధిదారుల ఏరివేతకు రకరకాల కొర్రీలు పెడుతోంది. రుణమాఫీపై తొలిసంతకం పెడుతానని చెప్పిన చంద్రబాబు గుట్టు రోజు రోజుకీ రట్టవుతోంది. రుణమాఫీ జరుగుతుందా? జరగదా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు/(హరనాథఫురం): టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించారు. హామీలను అమలు చేస్తాం అని చెబుతూనే... రోజుకో జీఓతో అటు అధికారులు.. ఇటు రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. రుణమాఫీ భారం నుంచి బయటపడేందుకు టీడీపీ ప్రభుత్వం అనేక రకాల కుయుక్తులూ పన్నుతోంది. అందుకు తాజా సంఘటనలే నిదర్శనం. రైతుల రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన విధి విధానాలతో కూడిన జీఓను విడుదల చేసి బ్యాంకర్లకు అందజేసింది. బ్యాంకర్లు రెండు నెలలు కుస్తీలు పట్టి జాబితా తయారు చేశారు. ఆ తరువాత బ్యాంకర్లు ఇచ్చిన జాబితాపై పునర్విచారణ చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రకరకాల వడపోతలతో త యారు చేయించిన జాబితాపైనా మరోసారి విచారణకు ఆదేశించడం గమనార్హం. ఈ వడపోతతో మరికొంత మంది లబ్ధిదారుల పేర్లు తొలగించేందుకు ప్రభుత్వం ఎత్తు వేసిందని అధికారులే చర్చించుకుంటున్నారు. మరోసారి పునర్విచారణ రుణమాఫీ జాబితాపై ప్రభుత్వం మరోసారి పునర్విచారణకు ఆదేశించింది. బ్యాం కర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో లేవో విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖకు సూచించింది. వీఆర్వోల ద్వారా గ్రామ గ్రామానికీ వెళ్లి జాబితాలపై పునర్విచారణ చేపట్టి, ఒక్కో లబ్ధిదారుడి నుంచి విడివిడిగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఒక్క రోజులోనే జిల్లాలోని అన్ని మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన జా బితాల పునఃపరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 46 మండలాల్లో తహశీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు జాబితాలు అందించారు. రుణమాఫీ అ య్యే రైతుల వివరాలతో పాటు అతని కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల పూర్తి వివరాలు సేకరించాలని మార్గదర్శకాలు ఇ చ్చారు. వారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ, ఇంటి నంబర్ సేకరించాలని సూచించారు. జిల్లాలో 4,86,291 మంది రైతుల వివరాలను ఒక్క రోజులో విచారణ చేపట్టి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించడం గమనార్హం. జన్మభూమి కమిటీ పెత్తనం పింఛన్ల ఏరివేతలో గ్రామకమిటీల పెత్తనంతో ఆ ప్రక్రియ రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఆజ్యం పోసిన విషయం తెలిసిందే. తమ వర్గానికి అండగా నిలవలేదనే నెపంతో అధికారపార్టీకి చెందిన గ్రామకమిటీల సభ్యులు ప్రత్యర్థి పార్టీలకు మద్దతు పలికిన వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను ఏరివేతకు తెగబడ్డారు. అలా చేయాలనే ఉద్దేశంతో అధినేత చంద్రబాబు రుణమాఫీ లబ్ధిదారులను ఏరివేసే బాధ్యతను తమ్ముళ్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు రెవెన్యూ అధికారులకు అందిన ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేశారు. అధికారులపై నమ్మకం లేకే చంద్రబాబు తమ్ముళ్లను పురమాయించినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో సోమవారం చేపట్టిన పునర్విచారణలో జన్మభూమి కమిటీ పెత్తనం చెలాయించినట్లు రెవిన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా తహశీల్దార్లకు అందిన ఆదేశాల్లో రుణమాఫీ పోందే రైతుతోపాటు కుటుంబసభ్యుల్లో మేజర్లు అయిన ఇద్దరి వివరాలు సేకరించి.. ఆ పత్రాలపై జన్మభూమి కమిటీలతో సంతకాలు సోమవారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు తెల్లముఖం వేశారు. హడావుడిగా పూర్తిచేసి సమాచారంతో సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు వీఆర్వోలు పరుగులు తీయడం కనిపించింది. 25 శాతం మంది పేర్లు గల్లంతు వివిధ బ్యాంకుల ద్వారా పంపిన లబ్ధిదారుల జాబితాల్లో జిల్లా వ్యాప్తంగా 25 శా తం మంది రైతుల పేర్లు గల్లంతైనట్లు అధికార వర్గాల సమాచారం. రెవెన్యూ అధికారుల చేతిలోని జాబితాకు, బ్యాంకర్లు పంపిన బాబితాకు పొంతన లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే కొంత మంది పేర్లు మినహాయించి పంపినట్లు బాబితాను పరిశీలించిన ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. వీటికి సంబంధించి బ్యాంకులకు ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. రుణమాఫీ మొత్తాన్ని కుదించి, జాబితా నుంచి రైతుల సంఖ్య తగ్గిం చేందుకే ఇలాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా వడపోతల క్రమమిదీ.. తాను సీఎం అయితే తొలి సంతకం రైతు రుణమాఫీపై పెట్టి రాష్ర్ట రైతాంగాన్ని రుణవిముక్తులను చేస్తానని చెప్పిన చంద్రబాబు.. సీఎం అయ్యాక రుణమాఫీపై కా కుండా రుణమాఫీ అధ్యయన కమిటీ ఎర్పాటుపై సంతకం పెట్టారు. వారు 45 రోజుల్లో నివేదిక ఇస్తారని చెప్పి దాని ఆధారంగా రుణమాఫీ అని రైతులకు ఝలక్ ఇచ్చారు. 2014 మార్చి 31 వరకూ ఉన్న రుణాలకు మాఫీ వర్తింపజేస్తామని ప్రకటించి ఆ తరువాత నాలుక్కరుచుకుని 2013 డిసెంబర్ 31 లోపు రుణం పొంది 2014 మార్చి 31 వరకూ కొనసాగుతున్న రుణాలకే మాఫీ అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత అన్ని రుణాలు మాఫీ లేదు... కేవలం కుటుంబానికి ఒకరికి మాత్రమేనని, అది కూడా రూ.1.50 లక్షల మాఫీ అని ప్రకటించింది. అందుకు పట్టాదారు పాస్‌పుస్తకం ఉండాలని, ఆ పుస్తం పెట్టి తీసుకుని ఉన్న బ్యాంక్‌కే ప్రాధాన్యం అంటూ మరో కొత్తపల్లవి ఎత్తుకుంది. దీంతో బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు గాలిలో కలిసిపోయాయి. ఆర్బీఐ ఒప్పుకోవడం లేదని.. కేంద్రం సహకరించడం లేదంటూ మరికొంత కాలం సాగదీసింది. రుణాలను ఐదేళ్ల పాటు రీషెడ్యూల్చేస్తే రైతుల ఖాతాలో ఆ మొత్తాలను వేస్తామని వారు బ్యాంకర్లు చెల్లిస్తారనే మరో కొత్తవాదాన్ని తెరపైకి తెచ్చి సాగదీత ధోరణిని అవలంబించింది. మాఫీ ప్రక్రియను మరి కొంతకాలం సాగదీసేందుకు రైతులు వివిధ బ్యాంక్‌ల్లో రుణాలు పోందివున్నారని, వారి ఆధార్ కార్డు, పట్టాదారుపాస్ పుస్తకాల ఆధారంగా అనుసంధానంతో లోపాలు లేకుం డా పక్కాగా రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించి నెలలు కాలంగా ఈ ప్రక్రియను టీడీపీ ప్రభుత్వం కొనసాగించింది. తాజాగా రుణమాఫీ పొందే రైతుల వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై ఆధారపడిన ఇద్దరు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఇవ్వాలి. ఇంటిపేరు, పేరు, రుణమాఫీ పొందే రైతుతో బంధుత్వం, డోర్ నంబర్, ఒటరు ఐడీకార్డు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు వివరాలను వీఆర్వోలు సేకరించాలి. సేకరించిన వివరాలపై జన్మభూమి కమిటీలతో ధ్రువీకరించి తహశీల్దార్‌కు అందిస్తే ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపాలి. బ్యాంకులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు : తొలుత బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతుల జాబితాలను ప్రభుత్వం పంపించమంది. జిల్లాలో 34 బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న 4,86,291 మంది రుణమాఫీకి అర్హులని నివేదికలను ప్రభుత్వానికి పంపాం. వీటిలో ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు సరిలేవని, సరి చేసి పంపాలని ఆ జాబితాను వెనక్కు పంపింది. ఆన్లైన్లో 2,11,803 మంది రైతుల వివరాలను, 2,74,488 మంది వివరాలను ఆఫ్‌లైన్‌లో తప్పులను సవరించిన జాబితాను తిరిగి ప్రభుత్వానికి పంపాం. ఆ జా బితాపై పునర్విచారణ చేపట్టాలని బ్యాంకులకు ఎలాంటి సమాచారం రాలేదు. తహశీల్దార్ కార్యాలయాలకు మాత్రమే విచారణ జాబితాను పంపించారు. - వెంకటేశ్వరరావు, ఎల్డీఎమ్, నెల్లూరు -
రుణమాఫీకి మళ్లీ కొర్రీ!
జాబితాలపై పునర్విచారణకు ఆదేశం లబ్ధిదారుల వడపోతకు సర్కారు ఎత్తులు వీఆర్వోల చేతికి రుణమాఫీ జాబితాలు 11లోగా నివేదిక కోరిన ప్రభుత్వం రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులూ పన్నుతోంది. బ్యాంకర్లు రెండు మాసాలు కుస్తీలు పట్టి తయారుచేసిన జాబితాలపై పునర్విచారణ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే అనేక రకాల వడపోతల అనంతరం తయారుచేయించిన జాబితాలపైనా మరోసారి విచారణకు ఆదేశించడం మరికొంతమంది లబ్ధిదారుల పేర్లు తొలగించేందుకేనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మచిలీపట్నం/విజయవాడ : రుణమాఫీ జాబితాలపై పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో లేవో విచారణ జరపాలని రెవెన్యూ శాఖకు సూచించింది. వీఆర్వోల ద్వారా గ్రామగ్రామానికి వెళ్లి జాబితాలపై పునర్విచారణ జరపి, ఒక్కో లబ్ధిదారుని గురించి విడివిడిగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. దీంతో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ హడావుడిగా జిల్లాలోని సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లను సమావేశపరిచి జాబితాలు అందజేశారు. ఈ నెల 11వ తేదీ లోగా జిల్లాలోని అన్ని మండలాల్లో యుద్ధప్రాతిపదికన జాబితాల పునఃపరిశీలన ప్రక్రియ పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆయన ఆదేశించారు. దీంతో జిల్లాలోని 50 మండలాల్లో తహశీల్దారులు తమ పరిధిలోని వీఆర్వోలకు శనివారం జాబితాలు అందించారు. రుణమాఫీ అయ్యే రైతుల వివరాలతో పాటు అతని కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల పూర్తి వివరాలు సేకరించాలని మార్గదర్శకాలు ఇచ్చారు. ఇద్దరు కుటుంబసభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఇంటి నంబరులను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో 425 సహకార సంఘాల్లో దాదాపు రెండు లక్షల మంది రైతులు లబ్ధిదారుల జాబితాలో ఉండగా, వాణిజ్య బ్యాంకులకు సంబంధించి మరో రెండు లక్షల మంది వివరాలను రెవెన్యూ సిబ్బంది విచారించాల్సి ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో లక్షలాదిమందికి సంబంధించిన వివరాలు విచారణ చేయడం కష్టమని రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకుల జాబితాల్లో 10 శాతం గల్లంతు వివిధ బ్యాంకుల ద్వారా పంపిన లబ్ధిదారుల జాబితాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 శాతం పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల చేతికి అందిన జాబితాలను కొన్ని మండలాల్లో బ్యాంకుల సిబ్బంది పరిశీలించారు. తాము పంపిన జాబితాల్లో కొన్ని పేర్లు మాయమైనట్లు వారు గుర్తించారు. వీటికి సంబంధించి బ్యాంకులకు ఇంతవరకు ఎటువంటి సమాచారమూ రాలేదు. రైతాంగం బ్యాంకుల వద్దకు వెళ్లి జాబితాల కోసం అడుగుతున్నట్లు ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. జాబితాల్లో పేర్లు గల్లంతయ్యాయని, అంతా గందరగోళంగా ఉందని ఆ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకో? రుణమాఫీ మెత్తాన్ని కుదించేందుకు ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలను కూడా రెవెన్యూ సిబ్బంది ద్వారా విచారణ చేయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకర్లు తమ వద్ద అప్పు తీసుకున్న రైతులకు సంబందించిన సమాచారం ఇవ్వగా, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు, ఆస్తుల వివరాలు అడుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ ఎలాంటి మెలిక పెడుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. -
మత్తు వదిలిద్దాం
అనంతపురం అర్బన్ : గద్దెనెక్కడానికి అడ్డగోలుగా హామీలిచ్చి, జనంతో ఓట్లు వేరుుంచుకుని.. తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలను మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు సర్కారుపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. రుణమాఫీ పై పూటకో మాట చెబుతూ రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచిన ప్రభుత్వంపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇచ్చిన హామీలు మరచిపోరుు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపి.. కొరడా ఝుళిపించడానికి ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడి ్డ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టానున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన 200 హామీలలో ఏ ఒక్కటీ ఇంత వరకు అమలు కాలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలిపి, బాబు మోసాన్ని ఎండగట్టడానికి పార్టీ నేతలు ఓ ప్రణాళిక బద్ధంగా నిరసన కార్యక్రమాలను రూపొందించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 10,24,577 మందికి చెందిన రూ.6,817.61 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. పంట రుణాలు మాత్రమే తీసుకుంటే 6,08,874 మందికి రూ.3,093.06 కోట్లు మాఫీ కావాలి. బంగారు రుణాల విషయానికి వస్తే 2,12,057 మందికి చెందిన రూ.1,851.18 కోట్లు మాఫీ అవ్వాల్సి ఉంది. వ్యవసాయానుబంధ టర్మ్ (దీర్ఘకాలిక) రుణాలు తీసుకుంటే 1,78,821 మందికి రూ.1,484.70 కోట్లు ఉన్నాయి. ఇతరత్రా వ్యవసాయ రుణాలు 24,825 మందికి రూ.388.67 కోట్లు ఉన్నాయి. 67 వేల డ్వాక్రా సంఘాలకు సంబంధించి రూ. 1242 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. చేనేతకు సంబంధించి రూ.35 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉంది. తమ రుణాలు మాఫీ అవుతాయని భావించి, వీరంతా టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తే తీరా ఒరిగిందేమీ లేదని భగ్గుమంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ షురూ.. అని ప్రకటించిన బాబు.. ఆనక సవాలక్ష నిబంధనలతో ఆ హామీని తుంగలో తొక్కడానికి సిద్ధమవడంపై రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి.. తీరా ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించడంపై మహిళలు రగిలిపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో అమలు కాక విద్యార్థుల ఉన్నత చదువు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో గత 3 నెలల వరకు ఇస్తున్న 4 లక్షల 10 వేల వివిధ రకాల పింఛన్లలో ఇప్పడు కేవలం 2 లక్షల 86 వేల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు. వీటిలో ఆధార్ అనుసంధానం లేక దాదాపు 89 వేల పింఛన్లు ఆగిపోవ డంతో పింఛన్ లబ్ధిదారుల్లో అందోళన నెలకొంది. వీటిలో 36 వేల వరకు పూర్తిగా తొలగించారు. పింఛన్ జాబితాను టీడీపీ నాయకులే తయారు చేయడంతో అనేక మంది అర్హులైన వారికి అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు అనేక సార్లు జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇతర కుల వృత్తుల వారికి చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో తెలియజేయడానికి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సైనికుల్లా తరలిరండి.. జిల్లా ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను తెలియజేయడానికి వైఎస్సార్సీపీ శ్రేణులంతా ఆయూ మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసన కార్యక్రమానికి తరలిరావాలని జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, రాష్ర్ట కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు బి. గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, అత్తార్చాంద్ బాషాలు పిలుపునిచ్చారు. ప్రజలంతా చైతన్యవంతులై సైనికుల్లా తరలి వచ్చి నేడు జరిగే ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చే యాలని కోరారు. చంద్రబాబు లాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి వుంటే అధికారంలోకి వచ్చి ఉండేవారన్నారు. ప్రతి ఆందోళన కేంద్రం వద్ద చంద్రబాబు ఇచ్చిన హామీలు గుర్తు చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఆందోళన గాంధేయ మార్గంలో చేపట్టాలని శ్రేణులకు సూచించారు. నేటి ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి.. ఇచ్చిన హామీ నెరవేర్చేలా దద్దరిల్లాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, అనంతపురం నగర అధ్యక్షురాలు శ్రీదేవి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. చంద్రబాబును నిలదీద్దాం పెనుకొండ : ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఈనెల 5న (బుధవారం) ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని వైయస్ఆర్ సీపి జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతు, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నేడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అయిదు నెలల్లో యాభై మోసాలు చేశారని, బాబు దగాతో జనం దిగులు చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదల పెన్షన్లపై పగబట్టారని, రేషన్ కార్డులను ఇష్టారాజ్యంగా తీసేస్తున్నారన్నారు. రుణాలను మాఫీ చేయడంలో రోజుకొక పిట్టకథ చెబుతూ మోసపూరితచర్యలకు దిగుతున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకులకు కంతులు కట్టకపోవడంతో వేలకు వేలు వడ్డీ పెరిగిపోరుు.. వెంటనే చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. బంగారు నగలపై వేలం నోటీసులు అందుతున్నాయన్నారు. ప్రతి కుటుంబం భయంతో జీవించే దుస్థితి వచ్చిందని, పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో ఒక కనికట్టని రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయం పండుగ చేస్తానన్న చంద్రబాబు అందుకు వ్యతిరేక ధోరణిలో నడుస్తున్నాడన్నారు. చంద్రబాబు అసలు స్వరూపం నేడు ప్రజలకు తెలుస్తోందని ఆయన విమర్శించారు. అబద్దాల ప్రభుత్వ స్వరూపం, దుర్మార్గ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి మండల కేంద్రంలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు ఇతర ప్రజానీకం భారీగా తరలిరావాలని ఆయన కోరారు. -
బాబు విధానాలను ఎండగట్టండి
5న ధర్నాలను విజయవంతం చేయండి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు పుంగనూరు: సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన చేపట్టనున్న ధర్నాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మండలంలోని ఆరడిగుంటలో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక ఆశలు చూపి ఓట్లు దం డుకున్న చంద్రబాబునాయుడు సీఎం కుర్చీలో కూర్చోగానే వాటిని మరచిపోయారని దుయ్యబట్టారు. రుణమాఫీ పేరుతో రైతులను, మహిళల ను మోసగించారని విమర్శించారు. చంద్రబాబు తీరును వివరిస్తూ అన్ని తహశీల్దార్ కార్యాలయా ల వద్ద ఐదో తేదీన ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, పార్టీ నాయకులు, ప్రజలు భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్, మురుగప్ప, రాజారెడ్డి, సత్య పాల్గొన్నారు. -
రైతుకు ‘సహకారం’ లేనట్లే...
ముక్కుపిండైనా రుణం వసూలు కార్యదర్శులకు సమావేశాలు డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశాలు రికవరీలో జిల్లాది ఆఖరి స్థానం నూజివీడు :రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడు చేస్తుందా అని ఎదురుచూస్తున్న రైతులపై మరో పిడుగు పడనుంది. ఓ వైపు రుణాలను మాఫీ చేయకపోగా, మరోవైపు కొత్త రుణాలివ్వని నేపథ్యంలో ప్రైవేటు వడ్డీవ్యాపారస్తుల వద్ద అప్పులు చేసి పంటలు సాగుచేసుకుంటున్న రైతుల నుంచి ముక్కుపిండయినా సరే సహకార రుణాలను వసూలు చేయడానికి జిల్లాలోని 50కేడీసీసీబీ బ్రాంచిల మేనేజర్లు, సూపర్వైజర్లతో పాటు 425 పీఏసీఎస్‌ల కార్యదర్శులను జిల్లా సహకార ఉన్నతాధికారులు సన్నద్ధం చేస్తున్నారు. దీనికి గానూ ఎన్ని ఒత్తిడిలున్నా రుణమాఫీ జాబితాలను సిద్ధం చేసినందుకు గానూ అభినందన సభ పేరుతో డివిజన్ కేంద్రాల్లో శనివారం సమావేశాలు నిర్వహించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలతో పాటు రుణమాఫీకి అర్హత లేని వారి రుణాలను వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. వసూలుతో పాటు కొత్త రుణాల మంజూరుపై కూడా దృష్టి కేంద్రీకరించనున్నారు. అయితే రుణాలను వసూలు చేసే సమయంలో రైతుల నుంచి నిరసన జ్వాలలు ఎదురుకాకుండా ఉండేందుకు గానూ ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న సహకార వారోత్సవాల్లో రుణాలను చెల్లించేందుకు గానూరైతులను మానసిక సిద్ధం చేసేలా వారిలో చైతన్యం కలిగించాలని డివిజనల్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ తోలిక్యా, ఉన్నతాధికారులు కిరణ్‌కుమార్, వేణుగోపాల్, రమేష్‌కుమార్ నిర్ణయానికి వచ్చారు. రుణాల వసూలును డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని, కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చెల్లించకపోతే జనవరి నెలలో వేలం పాటలు సైతం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాల రికవరీలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కృష్ణాజల్లా ఆఖరి స్థానంలో ఉందని, దీని స్థానాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో నిబంధనలకనుగుణంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు. రూ.600 కోట్ల వరకు బకాయిలు... జిల్లాలో సహకార రుణాలు ఈ ఏడాది మార్చి31 నాటికి రూ.844.11కోట్లు ఇచ్చారు. వీటిపై డిమాండ్ రూ. 1037.29కోట్లు ఉండగా, రూ.436.56కోట్లు మాత్రమే వసూలలు అయ్యాయి. మిగిలిన 600.72కోట్లు వసూలు కావాల్సి ఉంది. అయితే దీనిలో 50శాతం రుణమాఫీ అయినా ఇంకా రూ.300 కోట్లు వసూలు కావాల్సి ఉంటుంది. పీఏసీఎస్ కార్యదర్శుల ఆందోళన... ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో రైతుల వద్దకు వెళ్లి రుణాల రికవరీ చేయాలని ఒత్తిడిచేస్తే వారి నుంచి నిరసన జ్వాలలు ఎదుర్కొనాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేవరకు ఆగడమే మేలనే అభిప్రాయాన్ని అధిక శాతం కార్యదర్శులు వ్యక్తం చేశారు. -
మాఫీ మాయే!
బకాయిల వసూలుకు బ్యాంకర్ల సన్నాహాలు బంగారు రుణాలపై వేలం నోటీసుల జారీ పంట రుణాల వసూలుకు సొసైటీ బృందాలు లబోదిబోమంటున్న అన్నదాతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. బకాయిల వసూలుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తుండటమే దీనికి నిదర్శనం. రైతు సాధికార సంస్థ ద్వారా ఐదేళ్లలో దశలవారీగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, ఐదేళ్ల పాటు వడ్డీ, అసలు బకాయిలు పేరుకుపోయి నష్టపోతారంటూ బ్యాంకర్లు వసూళ్లకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ.9,137 కోట్లు ఉండగా, రెండు వేల కోట్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా కుదించినట్లు సమాచారం. మిగిలినవారికి రుణమాఫీ వర్తించదని అధికారులు రికార్డులు తయారు చేసినట్లు తెలిసింది. బంగారం రుణాలపై వేలం నోటీసులు... సహకార బ్యాంకు సిబ్బంది పంట రుణాలను జబర్దస్తీగా వసూలు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేసుకుంటుండగా, వాణిజ్య బ్యాంకులు బంగారం రుణాలకు సంబంధించి వేలం నోటీసులు జారీ చేస్తున్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు డివిజన్లలో సహకార అధికారులు 425 సహకార సంఘాల వేతన కార్యదర్శులు, సిబ్బందితో రుణ వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రుణ మాఫీ ఆలస్యం అవుతున్నందున బకాయిల వసూలుకు వెంటనే రైతుల వద్దకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో రుణాలు కట్టమంటే రైతులు తిరగబడి కొడతారని పలువురు సహకార సంస్థలలో పని చేసే కార్యదర్శులు అధికారుల వద్ద మొర పెట్టుకోగా.. అయినా తప్పదని, రుణమాఫీ వల్ల రెండు రకాలుగా నష్టపోతారని రెతులకు వివరించాలని సహకార ఉన్నతాధికారులు కార్యదర్శులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఐదేళ్లలోపు దశలవారీగా రుణమాఫీ చేస్తే మొత్తం బాకీ తీరేవరకు బ్యాంకుల్లో ఉన్న బంగారం విడుదల కాదని వివరించాలని చెప్పినట్లు తెలిసింది. పంట రుణాలకు సంబంధించి సహకార సంస్థల్లో 11 శాతం వడ్డీ పడుతుందని రైతులకు వివరించాలని, ఏదో విధంగా వారికి నచ్చచెప్పి ముందుగా బాకీలు వసూలు చేయాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తూ ఇచ్చే డబ్బు బ్యాంకులకు వచ్చింది వచ్చినట్లుగా రైతుల ఖాతాల్లో పడుతుందని చెప్పి.. బకాయిలు వసూలు చేసుకునేందుకు వాణిజ్య, సహకార బ్యాంకులు మందస్తు ప్రణాళిక సిద్ధం చేశాయి. బంగారం వేలానికి ఆర్బీఐ సూచన! 15 నెలలు దాటిన బంగారు రుణాలకు సంబంధించి నగలను వెంటనే వేలం వేసి బకాయికి జమ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లకు సూచించినట్లు సమాచారం. ఒకవైపు బంగారం ధర రోజురోజుకు తగ్గటం బ్యాంకర్లను కలవరానికి గురిచేస్తోంది. తాము రుణం ఇచ్చేటప్పుడు గ్రాము రూ.4 వేలు వరకు ఉందని, అది ప్రస్తుతం రూ.2,600కు పడిపోయిందని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. బంగారం ధర మరింత తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనతో బ్యాంకర్లు జిల్లా వ్యాప్తంగా బంగారు రుణాలు తీసుకున్న రైతులందరికీ వేలం నోటీసులు ఇస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం రుణమాఫీ డబ్బు ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో జమపడుతుందని, ముందు తమ బాకీ చెల్లించి బంగారం విడిపించుకు వెళ్లమని వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు రైతులకు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 15 నెలలు దాటిన బంగారం రుణం వసూలు చేయాల్సి ఉందని లేదా వేలం వేయాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీ జరగాలంటే ఐదేళ్లు పడుతుందని, అప్పటివరకు బంగారం ఎలా బ్యాంకులో ఉంచుకుంటారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. తడిసిమోపెడవుతున్న బకాయిలు రైతు సాధికార సంస్థ ద్వారా రుణమాఫీ జరిగే సమయానికి రైతులపై వడ్డీ భారం పడనుంది. రుణమాఫీ ఆశ లేకుంటే జీరో శాతం వడ్డీపై రుణాలు చెల్లించేవారు. పంట రుణాలు వాయిదా మీరటంతో సహకార బ్యాంకులకు 11 శాతం వడ్డీ భరించాల్సి వస్తుందని బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. ఐదేళ్ల వరకు బకాయి కట్టకపోతే సగానికి సగం వడ్డీ అప్పు పెరుగుతుందని రైతులకు వివరిస్తున్నారు. రైతుల్లో ఆందోళన వాణిజ్య బ్యాంకులు నోటీసులు జారీ చేయటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకపక్క చంద్రబాబు బకాయిలు, వడ్డీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేస్తుంటే.. మరోపక్క బ్యాంకర్లు నోటీసులు ఇస్తుండటం వారిని దిక్కుతోచని స్థితిలోకి నెడుతోంది. -
ఇదేం ప్లాన్ బాబూ !
ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి.. నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక అనేక ఆంక్షలను విధిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంటూ అన్నదాతలు,మహిళలను ఏడిపిస్తున్నారు. అనర్హత వేటుతో పింఛన్‌దారులను నట్టేట ముంచారు. తాజాగా నిరుపేద విద్యార్థుల ఫీజు పథకానికి తూట్లు పొడిచేందుకు కొత్త ‘ప్లాన్’ అంటూ జీఓ నెం. 72ను జారీ చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. కడప రూరల్: నిరుపేద ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈబీసీ మైనార్టీ విద్యార్థుల ‘ఉపకారం’ పథకంపై ఆంక్షల కొరడాను ఝళిపించడానికి రాష్ర్టప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం. 72 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం విద్యార్థులు అనేక పత్రాలతోపాటు పాన్‌కార్డు సమర్పించాలి. ప్రస్తుతానికి పాన్ కార్డు తప్పనిసరి కాదని అధికారులు చెబుతున్నా.. ఒకవేళ భవిష్యత్తులో తప్పనిసరి అయితే అనర్హత వేటు కారణంగా తీవ్రంగా నష్టపోక తప్పదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అసలు 72 జీవోలో ఏముంది.. జీఓ నెం. 72లో అనేక నిబంధనలు విధించారు. జీఓలో ఈబీసీ, ఓసీ, మైనార్టీ, ఓసీ ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ విద్యార్థులు 2014 జూన్ రెండో తేది తర్వాత నుంచి స్థానికత పత్రాన్ని మీ-సేవా కేంద్రం నుంచి పొందాలి. అలాగే ఫ్రెష్ విద్యార్థులందరూ ఆధార్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. గడిచిన ఏడేళ్ల నుంచి ఎక్క డ చదివారో అందుకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ అందించా లి. ముఖ్యంగా జీఓలో పాన్‌కార్డు గురించి వివరించారు. సదరు విద్యార్థి కుటుంబానికి సంబంధించిన పాన్‌కార్డు ఉంటే సమర్పించాలని తెలిపారు. భవిష్యత్తులో పాన్‌కార్డు తప్పనిసరైతే కష్టాలే! ఇన్‌కం ట్యాక్స్, ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన పాన్ కార్డు చాలామంది వద్ద లేదు. ముఖ్యంగా పేదల వద్ద అస్సలు ఉండదు.. వారికి ఆ అవసరమూ రాలేదు. భవిష్యత్తులో పాన్‌కార్డు తప్పనిసరి చేస్తే దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, సన్న చిన్నకారు రైతులు పాన్‌కార్డును పొందాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు ‘ఉపకారం’ పొం దాలంటే ఏడాది ఆదాయం రూ. 2 లక్షలకు, బీసీ, ఈబీసీ, మై నార్టీ విద్యార్థులకు రూ. లక్ష లోపు ఆదాయం కలిగి ఉండాలి. ఆ ప్రకారం పాన్‌కార్డు ద్వారా ఏదైనా తేడా వచ్చినా, ఆదా యం ఎక్కువగా చూపినా సదరు విద్యార్థి స్కాలర్‌షిప్పులను నిలిపేస్తారు. అందులో భాగంగానే సాధ్యమైనంత మేరకు ఎక్కువ మంది విద్యార్థులపై అనర్హత వేటు వేయడానికి పాన్‌కార్డు తీసుకు వచ్చారని అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అప్పుల ఊబిలో టమాట రైతు
మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోయినా కనికరించని ప్రభుత్వం నాలుగేళ్లలో జిల్లాలో 1,55,275 ఎకరాల్లో పంటసాగు రుణమాఫీలో చోటు దక్కక దిగాలు జిల్లాలో రూ.1,500 కోట్ల అప్పుల్లో రైతాంగం బి.కొత్తకోట: టమాట రైతులు గడచిన నాలుగేళ్లలో 1,55,275 ఎకరాల్లో పంట సాగుచేశారు. 2010-11లో 15,320 హెక్టార్లు.. 2011-12లో 17,581 హెక్టార్లు.. 2012-13లో 16,224 హెక్టార్లు.. 2013-14లో 12,985 హెక్టార్లలో సాగుచేశారు. ఇందులో అత్యధికంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో తర్వాత పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగైంది. మిగతా ప్రాంతాల్లో నామమాత్రంగా సాగుచేశారు. ఖరీఫ్, రబీతోపాటు వ్యవసాయ బోర్ల కింద పంట సాగైంది. ఈ సంవత్సరాల్లో రైతులు అత్యధిక ధరలను పొందిందిలేదు. అప్పుడప్పుడు మంచి ధర పలికినా నిలకడగా లేవు. చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో రెండు నెలలు మాత్రమే అత్యధిక ధర పలికింది. రుణాలు వందల కోట్లలో.. చెరుకు రైతులకు మాత్రమే బ్యాంకులు ఎకరాకు రూ.40 నుంచి రూ.50వేల రుణం ఇస్తాయి. ఆ తర్వా త టమాట రైతుకు రూ.25 వేల నుంచి రూ.30వేలు ఇస్తాయి. వేరుశెనగకు తక్కువ రుణం వస్తుంది. దీంతో టమాట సాగుచేసిన రైతులు టమాటపైనే రుణం తీసుకున్నారు. 2009-10లో టమాట సాగుకు ఎకరాకు రూ.20వేలు, 2009-10లో రూ.25వేలు, 2012-13లో రూ.30వేలు, 2013-14లో రూ.30వేల రుణంగా బ్యాంకులు నిర్ణయించి ఆమేరకు పాసుపుస్తకాలు, బంగారం తాకట్టుపై అప్పులిచ్చాయి. ఇలా అప్పులు తీసుకొన్న రైతులు జిల్లాలో వేలసంఖ్యలో ఉన్నారు. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే 2008-09నుంచి 2013 డిసెంబరు నాటికీ 37,251 మంది రైతులు రూ.162.9కోట్ల రుణం తీసుకున్నా రు. వీరుకాక జిల్లాలో మొత్తం రూ.1,500కోట్ల మేర కు అప్పులను టమాట రైతులు చెల్లించాల్సి ఉన్నట్టు అంచనా. బ్యాంకులిచ్చే రూ.30వేల రుణంతో కనీసం సగం మంది రైతులు ఈ నాలుగేళ్లలో రూ.2,500కోట్ల దాకా అప్పులు పొందడం, తిరిగి చెల్లిస్తూ, కొత్త రుణాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అప్పులు చెల్లించలేక నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వం ఊరట కలిగిస్తుందని ఆశించినా ఫలితం లేకుండాపోతోంది. మాఫీకి సాకులు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం కుంటిసాకులు వెదుకుతోంది. టమాట పంట ఉద్యానవనశాఖ పరిధిలో ఉందన్న సాకుతో రైతులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వేరుశెనగకు ప్రయత్యామ్నాయంగా సాగుచేస్తున్న టమాటకు సరైన ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం కనీసం రుణ మాఫీనైనా వర్తింపజేయకపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. కోట్ల పెట్టుబడిని కళ్లముందునే నష్టపోతున్న టమాట రైతులను ఆదుకునేందుకు రుణమాఫీని వర్తింపజేయాలని రైతాంగం కోరుతోంది. రుణం మాఫీ కాదు.. కొత్త అప్పులు పుట్టవు మూడేళ్ల క్రితం సొసైటీ బ్యాంకులో రూ.50 వేల పంట రుణం తీసుకున్నా. రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశా. రూ.90 వేలు ఖర్చు అయింది. బ్యాంకులో తెచ్చిన రుణం చాలక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి పంటపై ధారపోశా. 30 వేల నష్టం వచ్చింది. ఈ ఏడాది బంగారు నగలను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నా. ఇటీవల రెండు ఎకరాల్లో టమాటా సాగు చేశా. పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోయాయి. బ్యాంకులో చూస్తే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి చూస్తే రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మాఫీ చేయక పూటకో మాట మాట్లాడుతావుండాడు. బ్యాంకోళ్ళు కొత్తగా పంట రుణాలు ఇవ్వలేదు. పాసు బుక్కులు, బంగారు నగలు బ్యాంకులో ఉంటే ఏం జూసి మాకు ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పులు ఇస్తారు. -సిద్దారెడ్డి, రైతు, పెద్దతిప్పసముద్రం మండలం ఆవులకు వదిలేశాం రెండెకరాల్లో టమాట సాగు చేశాం. రూ.లక్ష దాకా ఖర్చయ్యింది. ఇప్పటివరకు రూ.20 వేలు మాత్రమే వచ్చింది. తొలి నుంచి రేటు లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించ డం లేదు. దీంతో సగం పంటలో ఆవులను తోలేశాం. రేటు ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేటు లేనప్పుడు మాత్రం చేతులెత్తేసింది. రైతుకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా ఆదుకునే వారు లేరు. -బి.కృష్ణారెడ్డి, సర్కారుతోపు, కురబలకోట మండలం బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామానికి చెందిన రైతు బయ్యారెడ్డి ఏళ్ల తరబడి టమాట పండిస్తున్నాడు. 2011లో బి.కొత్తకోట గ్రామీణ బ్యాంకులో రూ.50వేలు, ఇండియన్ బ్యాంకులో 1.5లక్షల అఫ్పు తీసుకున్నాడు. పంటనష్టం వాటిల్లినా రూ.1.5లక్షల రుణం చెల్లించాడు. మళ్లీ పంటకోసం 2012లో ఇండియన్ బ్యాంకులో తీసుకున్న రూ.2లక్షలు రుణాన్ని 2013లో కట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.లక్ష అప్పుచేశాడు. రుణాలపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న బయ్యారెడ్డి రుణ మాఫీపై ఆశపెట్టుకున్నాడు. మాఫీ ఇస్తే చెల్లించిన సొమ్ము తిరిగి దక్కుతుందనుకున్నాడు. అయితే టమాట రైతుకు మాఫీ అయ్యే పరిస్థితులు లేవని తేలిపోవడంతో నిరాశవ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ గ్రామీణ బ్యాంకులోని రూ.50వేల రుణం చెల్లించలేదు. అదైనా మాఫీ అవుతుందో లేదోనని ఎదురుచూస్తున్నాడు. -
27లోగా రుణమాఫీ రైతుల వివరాలివ్వాలి
గుంటూరు ఈస్ట్ ఈనెల 27వ తేదీకల్లా బ్యాంకు ఖాతాల్లో తప్పులు సరిచేసి రుణమాఫీకి సంబంధించిన రైతుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌హాలులో శుక్రవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో సమావేశానికి జిల్లా కలెక్టర్ కాంతీలాల్‌దండే, సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ ప్రేమ్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ అర్హులై ఉండి, మంజూరుకాని రైతుల విషయంలో సాంకేతిక కారణాలను సెట్లో పెడుతున్నామని, వాటిని బ్యాంకర్లు అప్డేట్ చేసుకుని తిరిగి ప్రభుత్వానికి పంపాలని కోరారు.10లోగా నిర్దేశిత లక్ష్యాలు పూర్తిచేయాలి సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష్యంగా నిర్దేశించిన 16,692 వ్యక్తిగత మరుగుదొడ్లను వచ్చే నెల 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం నియోజక వర్గానికి చెందిన సత్తెనపల్లి,రాజుపాలెం,ముప్పాళ్ల,నకరికల్లు మండలాల అధికారులతో ఆయన మాట్లాడారు. కిరోసిన్ అక్రమ తరలింపును నియంత్రించాలి జిల్లాలో కిరోసిన్ అక్రమ తరలింపును నెల రోజుల్లోగా నియత్రించాలని సంయుక్త కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల అధికారులతో శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన నిత్యవసర సరుకుల సరఫరా విషయంపై సమీక్షించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ రవితేజ నాయక్ ,సహాయ పౌర సరఫరాల అధికారులు, సీఎస్డీటీలు పాల్గొన్నారు. నెలాఖరులోగా ఆధార్‌ను అనుసంధించాలి రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, అడంగళ్లకు ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, ఆర్డీవో, తహశీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జేసీ శుక్రవారం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యువల్‌గా ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేశామని, పట్టాదారు పాస్ పుస్తకాలను మీసేవ ద్వారానే పొందాలన్నారు. -
బ్యాంకుల కొంప ముంచిన బాబు
రుణమాఫీ హామీ అమలుకాక పేరుకుపోయిన అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్లగా మారిన రైతులు అన్ని సహకార బ్యాంకులను డిఫాల్టర్లుగా ప్రకటించిన నాబార్డు గృహ, విద్యా రుణాలు ఇచ్చేందుకు సైతం బ్యాంకుల విముఖత గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ కారణంగా రైతులే కాదు బ్యాంకర్లూ డిఫాల్టర్లు అయ్యారు. ప్రతీ ఏటా సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసు కుంటున్న రైతులు ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణమాఫీ హామీ నమ్మి రుణాలు చెల్లించలేదు. దీంతో రైతుల్ని బ్యాంకులు డిఫాల్టర్లుగా ప్రకటించాయి. అంతే కాకుండా 14 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. సహకార బ్యాంకులు, సంఘాలకు రుణాలు ఇవ్వడానికి నాబార్డు నుంచి ఆప్కాబ్ రుణాలు తీసుకున్నది. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో సహకార సంఘాలు, బ్యాంకులు నాబార్డుకు రుణాలను చెల్లించలేక పోయాయి. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఆప్కాబ్ డిపాల్టరుగా ప్రకటించింది. ఆప్కాబ్ కూడా ఇదే రీతిలో రుణాలు చెల్లించలేకపోవడంతో నాబార్డు దానిని డిఫాల్టరుగా ప్రకటించింది.చంద్రబాబు రుణమాఫీ కారణంగా సహకార రంగం పూర్తిగా నిర్వీర్యమై పోయిందని చెప్పడానికి ఈ ప్రక్రియను ఉదాహరణగా చెబుతున్నారు.ప్రతీ ఏటా (ఖరీఫ్,రబీ సీజనులకు) ఆప్కాబ్ రూ.4 వేల కోట్ల వరకు రుణాలను నాబార్డు నుంచి తీసుకుంటున్నది. అదే విధంగా ఆప్కాబ్ ప్రతీ జిల్లా సహకార బ్యాంకుకు సగటును రూ.300 నుంచి రూ.500 కోట్ల వరకు రుణాలు ఇస్తోంది. ఈ మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ రుణమాఫీ కారణంగా నిలిచిపోవడంతో పాటు అటు రైతులు, ఇటు బ్యాంకులు డిఫాల్టర్లు అయ్యారు. నిండా మునిగిన రైతులు రుణ మాఫీ హామీతో ఆర్థిక వెసులుబాటు కలిగిన రైతులు కూడా సహకార సంఘాలు, బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. అప్పటి వరకు సక్రమంగా చెల్లిస్తూ మంచి ట్రాక్ రికార్డు కలిగిన రైతులు కూడా ఈ రుణమాఫీ కారణంగా డిఫాల్టర్లు అయ్యారు. దీంతో ఇతర రుణాలు తీసుకోలేకపోతున్నారు. గృహ,విద్యా రుణాలు తీసుకోవాలన్నా వాణిజ్య బ్యాంకులు రైతుల ట్రాక్ రికార్డు చూసి కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన చంద్రబాబు రుణమాఫీకి రూ.5 వేలకోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో రైతుల రుణాలు పూర్తిగా తీరే అవకాశాలు లేకపోవడంతో అప్పటి వరకు డిఫాల్టర్లుగానే మిగిలిపోనున్నారు. -
మాఫీపై.. రోజుకో మాట
రుణమాఫీలో గందరగోళం ఆందోళనలో రైతులు మొన్న రూ.1.5 లక్ష..ఇప్పుడు 20 శాతమేనని ప్రకటన కొత్త రుణాల మంజూరులో అయోమయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రుణమాఫీ విషయంలో సీఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు రైతులు, డ్వాక్రా, చేనేత రుణాలన్నింటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకంతోనే రైతులు, డ్వాక్రా మహిళలను రుణవిముక్తుల్ని చేస్తానని పేర్కొన్నారు. ఎవ్వరూ రుణాలు చెల్లించొద్దని ప్రకటించారు. చంద్రబాబు మాయ మాటలను నమ్మి జనం ఓట్లేసి, ముఖ్యమంత్రిని చేశారు. నమ్మిన జనాన్ని తొలి సంతకంతోనే చంద్రబాబు మోసం చేశారు. రుణాల మాఫీకి కాకుండా అధ్యయనకమిటీ నియామకానికి సంతకం పెట్టి తన నైజాన్ని మరోసారి బయటపెట్టారు. ఆ తర్వాత రోజుకో మాట చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. మొన్న ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర మాఫీ అన్నారు. మొదటి విడతగా రూ.50వేలు చెల్లిస్తామన్నారు. తాజాగా రుణం తీసుకున్న వారికి 20శాతం చెల్లించి, మిగిలిన మొత్తాన్ని మరో మూడు పర్యాయాలుగా చెల్లించి రుణవిముక్తిల్ని చేస్తామని ప్రకటించారు. రైతు రుణవిముక్తికే సాధికార సంస్థ అని ఆర్భాటంగా ప్రారంభించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి : జిల్లాలో మొత్తం 5,01,637 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.1,944 కోట్లు రుణాలు పొందారు. అదే విధంగా 2,66,340 మంది రైతులు బంగారాన్ని తాకట్టుపెట్టి రూ.2,597 కోట్లు పొంది ఉన్నారు. ఈ మొత్తానికి ఏడాదికి రూ.545 కోట్లు వడ్డీనే చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు రుణాలు చెల్లిస్తారన్న ఆశతో రైతులెవ్వరూ రుణాలు కట్టలేదు.వడ్డీల జోలికే వెళ్లలేదు. జూలై గడువు పూర్తవ్వటంతో పంట రుణాలపై బ్యాంకర్లు 14శాతం వడ్డీ విధిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవటంతో రైతులకు ఖరీఫ్‌లో రుణాలు పొందలేకపోయారు. కనీసం రీషెడ్యూల్ కూడా చేయలేకపోవటంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఈ ఏడాది రైతు సాధికార సంస్థ ద్వారా రైతుల అప్పుల్లో 20శాతాన్ని మాత్రమే చెల్లిస్తామని, ఆమేరకు రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే ఒక రైతు రూ.లక్ష రుణం పొంది ఉంటే అతనికి మొదటి విడతగా రూ.20వేలు జమచేస్తారు. మిగిలిన రూ.80వేలను నాలుగేళ్లలో చెల్లించి రుణాల నుంచి విముక్తుల్ని చేస్తామని వెల్లడించారు. ఈ లోపు రైతులు తీసుకున్న రుణాలకు రైతులు 14శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఓ బ్యాంక్ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోతే రైతుల ఆస్తులు, బంగారాన్ని వేలానికి పెట్టాల్సి వస్తుందని ఆ అధికారి స్పష్టం చేశారు. రుణ విముక్తి అయ్యేవరకు రుణాలు లేనట్టే? : ప్రభుత్వం ఎంత తొందరగా రైతులను రుణాల నుంచి విముక్తుల్ని చేస్తేనే తిరిగి రుణాలు పొందే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వం ప్రకటించిన కాలం ప్రకారం నాలుగేళ్ల వరకు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం లేదని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే రైతులకు బ్యాంకుల్లో అప్పులు పుట్టక, ఉన్న ఆస్తులను బయట తాకట్టు పెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే వ్యవసాయ రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
నెట్వర్క్: అప్పుల బాధలు, రుణమాఫీపై అనుమానాలు.. విద్యుత్ కోతలు వెరసి రుణదాతలు ఉసురు తీసుకుంటున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన చాకలి నర్సింహులు(35) తనకున్న రెండెకరాల్లో మూడు బోర్లు తవ్వించాడు. అవి వట్టి పోవడంతో అప్పుల కుప్పగా మారాడు. మరో వైపు మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్‌లో తనకున్న రూ. 45 వేల రుణం మాఫీ అవుతుందో లేదోనన్న బెంగపట్టుకుంది. ఈ క్రమంలో తన చెరుకుతోటలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొమరారం గ్రామానికి చెందిన రైతు గంగావత్ తారు (40) తనకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోవడంతో మరోసారి రెండున్నర ఎకరాల్లో అదే పంట వేశాడు. విద్యుత్ కోతలతో పంటకు నీరందక ఎండిపోయింది. పంట పెట్టుబడికి తోడు పాత రుణం మొత్తం రు. 4 లక్షల వరకు అప్పు అయింది. సోమవారం చేను వద్దకు వెళ్లిన తారు పంట ఎండిపోవడం చూసి, అప్పు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురయ్యాడు. వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకున్నాడు. రాత్రి కరెంట్‌కు రైతు బలి ఆత్మకూరు: రాత్రి కరెంట్‌కు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌళ్లపల్లికి చెందిన రైతు బలయ్యూడు. పోలీసుల కథనం ప్రకారం... రాచర్ల భద్రయ్య (50)తనకున్న ఎకరమున్నర భూమిలో పత్తి సాగుచేశాడు. సోమవారం వేకువజామున 3 గంటలకు చీకట్లో పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేసినా... మోటర్ నడవకపోవడంతో సర్వీస్ వైరు చెక్ చేస్తూ వెళుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఈ పాపం సర్కారుదే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రొద్దం మండలం గోనుమేకలపల్లికి చెందిన యువ రైతు గోపీనాథ్(22) తల్లిదండ్రులు పంట పెట్టుబడుల కోసం అప్పు చేశారు. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడం, సీఎం పీఠంపై చంద్రబాబే కూర్చోవడంతో గోపీనాథ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు సంబరపడిపోయారు. తన తండ్రి జల్లప్ప పేరుతో ఉన్న 1.76,200 లక్షల రూపాయల అప్పుతో పాటు తల్లి పేరుతో ఉన్న డ్వాక్రా రుణం రూ.1.41,900 మాఫీ అవుతుందనుకున్నాడు. పూర్తి స్థాయిలో మాఫీ చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంతలోనే బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఇంకేముంది తల్లి, తండ్రితో పాటు తన పేరుపై ఉన్న 4.85 లక్షల రూపాయలు చెల్లించలేమని గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వమే అతన్ని చంపేసిందని గోనుమాకుపల్లి వాసులు మండిపడుతున్నారు. గుత్తి మండలం తురకపల్లి రైతులు శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డి బంగారు నగలు తాకట్టుపెట్టి 48, 56 వేల రూపాయల చొప్పున రుణం తెచ్చుకున్నారు. రుణమాఫీలో ఈ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని భావించారు. అయితే రుణం తీర్చాలని, లేదంటే నగలు వేలం వేస్తామని సహకర బ్యాంకు నోటీసులు జారీ చేసింది. దీంతో వీరు బోరుమంటున్నారు. రుణ మాఫీ వ్యవహారం కొలిక్కి రాక ఒక వైపు, బ్యాంకర్ల నోటీసులతో మరో వైపు రైతులు సతమతమవుతున్నారు. అప్పు చెల్లించే మార్గం కానిపించక కొందరు రైతులు తనువు చాలించడానికి పూనుకుంటున్నారు. రుణమాఫీ హామీతో మోసపోయిన రైతులు ఏవిధంగా వేదన పడుతున్నారో.. కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో పల్లెల వైపు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. జిల్లాలోని రైతులు 8 లక్షల ఖాతాల ద్వారా 6,102 కోట్ల రూపాయలు పంట సాగు కోసం అప్పు తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. బాబు చెప్పినట్లుగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయనే సీఎం అయ్యారు. జిల్లా వాసులు కూడా అత్యధికంగా 12అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కట్టబెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైనశైలిలో మాట తప్పారు. 1.50 లక్షల రూపాయలలోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని షాక్ ఇచ్చాడు. ఏరుదాటాక తెప్ప తగలేశాడన్న చందంగా చంద్రబాబు వ్యవహరించారని రైతులు మండిపడుతున్నారు. ఆయన చెప్పినట్లు రూ.ఒకటిన్నర లక్ష కూడా మాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేశారు. రుణాలు చెల్లించాల్సిందే అని, లేదంటే వేలం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్యలకు తెగిస్తున్న రైతులు రుణమాఫీ కాదని, తీసుకున్న అప్పులు తప్పక చెల్లించాల్సిందేనని బ్యాంకర్ల నోటీసుల ద్వారా రైతులకు స్పష్టమైంది. దీంతో కొందరు రైతులు అప్పు తీర్చేస్తోమత లేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 17మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతులు ఎంత వేధన పడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. శుక్రవారం ఆత్మహత్యకు పూనుకున్న గోపీనాథ్‌తో ఈ సంఖ్య 18కి చేరింది. మూన్నెళ్లలో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వడం లేదు. రుణమాఫీ అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. రుణమాఫీ చేసి తీరాల్సిందే: ఓబుళకొండారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి. రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పడం పెద్ద తప్పిదం. మాఫీ చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను పెడచెవిన పెడుతోంది. రుణమాఫీ చేసి తీరాల్సిందే. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. -
‘మాఫీ’ కోసం తిరుగుతూ.. మృత్యుఒడిలోకి..
మెదక్ జిల్లాలో ఘటన వెల్దుర్తి: రుణమాఫీ కోసం కార్యాలయాల చుట్టూ నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ ఆరెగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుష్కి రాములు(65) తనకున్న ఎకరంన్నర భూమి లో నీటి సౌకర్యం లేక హల్దీవాగు పరిసరాల్లో ఓ వ్యక్తికి చెందిన రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. తన పొలంపై బ్యాంకులో రూ.65 వేలు రుణం పొందాడు. రుణమాఫీపై గురించి తెలుసుకునేందుకు నాలుగు రోజుల క్రితం బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అధికారులు రుణమాఫీ చేయాలంటే పహాణి సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పడంతో ఈసేవ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ సర ్వర్లు డౌన్ అయ్యాయని నిర్వాహకులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. ఇదిలా ఉండగా.. అధికారులు ఆహార భద్రతా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో బిజీగా ఉండిపోయారు. రెండురోజులుగా తిండీ తిప్పలు లేకుండా అధికారుల చుట్టూ తిరిగాడు. అందులో భాగంగానే గురువారం కూడా రెవెన్యూ కార్యాలయానికి వచ్చి సాయంత్రం ఏడు గంటల సమయంలో గ్రామానికి కాలినడకన బయలుదేరాడు. అయితే ఎలుకపల్లి రోడ్డు వద్దకు రాగానే సొమ్మసిల్లి కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నీరసించి చనిపోయాడని మృతుడి భార్య యశోద విలపించారు. కొత్త రుణాలకు మాత్రమే పహాణీలు అడిగామని, రుణమాఫీకి ఎలాంటి పత్రాలు అడగలేద సెంట్రల్ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్‌రావు అన్నారు.