మత్తు వదిలిద్దాం | Intoxication vadiliddam | Sakshi
Sakshi News home page

మత్తు వదిలిద్దాం

Published Wed, Nov 5 2014 2:16 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

మత్తు వదిలిద్దాం - Sakshi

మత్తు వదిలిద్దాం

అనంతపురం అర్బన్ :
 గద్దెనెక్కడానికి అడ్డగోలుగా హామీలిచ్చి, జనంతో ఓట్లు వేరుుంచుకుని.. తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలను మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు సర్కారుపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. రుణమాఫీ పై పూటకో మాట చెబుతూ రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచిన ప్రభుత్వంపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇచ్చిన హామీలు మరచిపోరుు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపి.. కొరడా ఝుళిపించడానికి ప్రజల తరఫున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది.

ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడి ్డ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టానున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన 200 హామీలలో ఏ ఒక్కటీ ఇంత వరకు అమలు కాలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలిపి, బాబు మోసాన్ని ఎండగట్టడానికి పార్టీ నేతలు ఓ ప్రణాళిక బద్ధంగా నిరసన కార్యక్రమాలను రూపొందించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 10,24,577 మందికి చెందిన రూ.6,817.61 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.

పంట రుణాలు మాత్రమే తీసుకుంటే 6,08,874 మందికి రూ.3,093.06 కోట్లు మాఫీ కావాలి. బంగారు రుణాల విషయానికి వస్తే 2,12,057 మందికి చెందిన రూ.1,851.18 కోట్లు మాఫీ అవ్వాల్సి ఉంది. వ్యవసాయానుబంధ టర్మ్ (దీర్ఘకాలిక) రుణాలు తీసుకుంటే 1,78,821 మందికి రూ.1,484.70 కోట్లు ఉన్నాయి. ఇతరత్రా వ్యవసాయ రుణాలు 24,825 మందికి రూ.388.67 కోట్లు ఉన్నాయి. 67 వేల డ్వాక్రా సంఘాలకు సంబంధించి రూ. 1242 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. చేనేతకు సంబంధించి రూ.35 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉంది. తమ రుణాలు మాఫీ అవుతాయని భావించి, వీరంతా టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తే తీరా ఒరిగిందేమీ లేదని భగ్గుమంటున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ షురూ.. అని ప్రకటించిన బాబు.. ఆనక సవాలక్ష నిబంధనలతో ఆ హామీని తుంగలో తొక్కడానికి సిద్ధమవడంపై రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి.. తీరా ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించడంపై మహిళలు రగిలిపోతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి స్థాయిలో అమలు కాక విద్యార్థుల ఉన్నత చదువు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో గత 3 నెలల వరకు ఇస్తున్న 4 లక్షల 10 వేల వివిధ రకాల పింఛన్‌లలో ఇప్పడు కేవలం 2 లక్షల 86 వేల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు.

వీటిలో ఆధార్ అనుసంధానం లేక దాదాపు 89 వేల పింఛన్లు ఆగిపోవ డంతో పింఛన్ లబ్ధిదారుల్లో అందోళన నెలకొంది. వీటిలో 36 వేల వరకు పూర్తిగా తొలగించారు. పింఛన్ జాబితాను టీడీపీ నాయకులే తయారు చేయడంతో అనేక మంది అర్హులైన వారికి అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకులు అనేక సార్లు జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు ఫిర్యాదు చేశారు.

 జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇతర కుల వృత్తుల వారికి చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో తెలియజేయడానికి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

 సైనికుల్లా తరలిరండి..
 జిల్లా ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను తెలియజేయడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ఆయూ మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసన కార్యక్రమానికి తరలిరావాలని జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, రాష్ర్ట కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు బి. గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, అత్తార్‌చాంద్ బాషాలు పిలుపునిచ్చారు.

ప్రజలంతా చైతన్యవంతులై సైనికుల్లా తరలి వచ్చి నేడు జరిగే ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చే యాలని కోరారు. చంద్రబాబు లాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి వుంటే అధికారంలోకి వచ్చి ఉండేవారన్నారు. ప్రతి ఆందోళన కేంద్రం వద్ద చంద్రబాబు ఇచ్చిన హామీలు గుర్తు చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఆందోళన గాంధేయ మార్గంలో చేపట్టాలని శ్రేణులకు సూచించారు.

 నేటి ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి.. ఇచ్చిన హామీ నెరవేర్చేలా దద్దరిల్లాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, అనంతపురం నగర అధ్యక్షురాలు శ్రీదేవి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
 
 చంద్రబాబును నిలదీద్దాం
 పెనుకొండ : ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ  ఈనెల 5న (బుధవారం)  ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని వైయస్‌ఆర్ సీపి జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతు, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నేడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అయిదు నెలల్లో యాభై మోసాలు చేశారని, బాబు దగాతో జనం దిగులు చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదల పెన్షన్లపై పగబట్టారని, రేషన్ కార్డులను ఇష్టారాజ్యంగా తీసేస్తున్నారన్నారు. రుణాలను మాఫీ చేయడంలో రోజుకొక పిట్టకథ చెబుతూ మోసపూరితచర్యలకు దిగుతున్నారన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకులకు కంతులు కట్టకపోవడంతో వేలకు వేలు వడ్డీ పెరిగిపోరుు.. వెంటనే చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. బంగారు నగలపై వేలం నోటీసులు అందుతున్నాయన్నారు. ప్రతి కుటుంబం భయంతో జీవించే దుస్థితి వచ్చిందని, పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

టీడీపీ మ్యానిఫెస్టో ఒక కనికట్టని రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయం పండుగ చేస్తానన్న చంద్రబాబు అందుకు వ్యతిరేక ధోరణిలో నడుస్తున్నాడన్నారు. చంద్రబాబు అసలు స్వరూపం నేడు ప్రజలకు తెలుస్తోందని ఆయన విమర్శించారు. అబద్దాల ప్రభుత్వ స్వరూపం, దుర్మార్గ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి మండల కేంద్రంలో నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు ఇతర ప్రజానీకం భారీగా తరలిరావాలని ఆయన కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement